పుట:1857 ముస్లింలు.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు

(“...Fathe Ali Tipu Sulthan of Mysore is represented by foreign historians as a fanatic, who opposed his Hindu subjects and converted them to Islam by force... But he was nothing of the kind. On the other hand his relations with Hindu subjects were perfectly cordial.” Young India, January 23, 1930 P. 31)

డాక్టర్‌ పాండే లాగా సత్యాంవేషణలో విరామమెరుగక వెంటబడి వాస్తవాన్ని నిగ్గుతేల్చగల చరిత్రకారులు, పరిశోధకుల సంఖ్య తక్కువకావటంతో అసత్య ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాడు డాక్టర్‌ పాండే పరిశోధనల ఫలితంగా పాఠ్యగ్రంథాల నుండి తొలిగించబడిన డాకర్‌ శాస్త్రి అసత్య పాఠ్యాంశం 1972లో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని జూనియర్‌ పాఠశాలల చరిత్ర గ్రంథంలో పాఠ్యాంశంగా మళ్ళీ ప్రత్యక్షం కావడంతో అది చూసిన డాక్టర్‌ పాండే మరోమారు ఆశ్ఛర్యపోవాల్సి వచ్చింది !

డాక్టర్‌ బి.యన్‌.పాండే లాంటి చరిత్ర పరిశోధకులు తక్కువ కావటం మూలంగా ముస్లిం వ్యతిరేక భావజాలం జాతీయోద్యమ సమయంలో కూడా బ్రతికిబట్టకటగలిగింది. 1906 నాటి బెంగాల్‌ విభజన తరువాత ఆరంభమైన జాతీయోద్యమంలో భాగంగా సాగిన స్వదేశీ ఉద్యమం, ఆ తరువాత ఖిలాఫత్‌ ఉద్యమ సమయంలో హిందూ-ముస్లింల మధ్య 1857 నాటి బౌతికంగా-మానసికంగా చాలా గాఢమైన ఐక్యత వ్యక్తమైనప్పిటికీ ముస్లిం వ్యతిరేకత యొక్క తీవ్రత మాత్రం తగ్గుముఖం పట్టలేదు.

ఆ కారణంగానే భారతదేశాన్ని ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి చేసే బాధ్యత హిందువులదే తప్ప మరెవ్వరిదీ కాదు; ఎందుకంటే హిందువులు మాత్రమే ఈ గడ్డ యొక్క సహజ బిడ్డలు. ముస్లింలు పరాయివాళ్ళు అన్న భావన జాతీయోద్యమ సమయంలో చాలా మంది బుద్ధిజీవుల రచనలలో వ్యక్తమయ్యింది.

ఈ విషయాన్ని శరత్‌చంద్ర చటోపాధ్యాయ మరింత విస్పష్టం చేస్తూ భారత దేశం హిందువుల మాతృభూమి. అందువలన హిందువులు మాత్రమే ఈ జాతిని బానిసత్వ సంకెళ్ళ నుండి విముక్తం చేయాలి. ముస్లింలు టర్కీ, అరేబియాల వైపు చూస్తారు. వారి హృదయాలు ఇండియాలో ఉండవు.ఈ వాసవాన్ని దాచిపెట్టటం వలన ఏం ప్రయాజనం? భూమి పుత్రులుగా వారిని అభ్యర్థించటం ఇటుక గోడకు మొరపెట్టుకున్నట్టే. ప్రస్తుతం మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రధానం. ఈ పని ప్రధానంగా హిందువులది; మరెవ్వరిదీ కాదు. ముస్లింల సంఖ్య ఎంతన్న విషయం గురించి లెక్కలు గట్టడం అనవసరం. ప్రపంచంలో సంఖ్యాబలం పరిపూర్ణ సత్యం కాదు. ప్రపంచంలో

273