పుట:1857 ముస్లింలు.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ-ముస్లింల ఐక్యత


అచ్చా ఖాన్‌లు, రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన కోట్ సంస్థానం ప్రముఖులు మహారావు, మోహర్‌ ఖాన్‌లు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌ సంస్థానం పరగణాలోని రిసాల్‌దార్‌ వలీ షా, కోటా హవల్దార్‌ మహావీర్‌లు తమ తమ ప్రాంతాలలో తమ బలగాలు, అనుచరు లతో కలసి ఏకమనస్కులై ఆంగ్లేయుల మీద తిరగబడ్డారు. తిరగబడిన హిందూ - ముస్లిం యోధులంతా తమ ప్రాంతాలలోని సంస్థానాధీశులు తమతో కలసి రాకపోయినప్పటికి తమ బలగాలు అరకొరగా ఉన్నఫ్ఫటికి ఎంతో సాహసంతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ముందుకురికారు.

మాతృభూమి విముక్తిని కాంక్షించిన ఈ యోధులకు ఆంగ్లేయుల అపార సైన్యం గాని, వారి అడుగులకుమడుగులొతుతున్న సంస్థానాధీశుల మహా సెన్యంగాని తొలిదశలో అడ్డుకోలేకపోయింది. ఆ సమయంలో సంస్థానాధీశులను తమతో కలసి రమ్మని ఎంతగా కోరినా ప్రయాజనం లేకపోవటంతో ఉత్సాహంతో ముందుకురికిన ఆ యోధుల సాహసం నీరుకారిపోయింది. సంస్థానాధీశుల తొడ్పాటు ఏమాత్రం లభించనందున చివరకు స్వదేశీ యోధుల పరాక్రమం మీద పరాయిపాలకుల బలగాలది పైచేయి అయ్యింది.

ఆ కారణంగా ఆ తరువాత అరెస్టయిన ఆ సాహసికులను జతలు జతలుగా కాల్చివేయడం, ఉమ్మడిగా ఉరితీయడం జరిగింది. ఈ యోధులు తమ కంఠంలో ప్రాణం పోయేంతవరకు ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు ఐక్యంగా ఆంగ్లేయులను వ్యతిరేకిస్తూ హిందూ-ముస్లింల మధ్య వ్యకమైన ఐక్యతకు ప్రబల సాక్ష్యంగా నిలిచి భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు

ఈ విధంగా ఇటు సామాన్య ప్రజలలోనూ అటు ప్రముఖులలోను బలమైన ఐక్యత వ్యక్తంకావడంతో ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యూహకర్తలు ఖంగుతిన్నారు. ఐక్యతా వాతావరణం మరింతగా రోహిల్‌ఖండ్‌ రాజధాని బరేలిలో ప్రస్పుటించింది. రోహిల్‌ ఖండ్‌ పాలకులు ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ ఆంగ్లేయ ప్రభుత్వ పెత్తనం మీద 1857 మే 31న తిరుగబాటు బావుటాను ఎగురవేశారు. ఈ తిరుగుబాటులో రొహిల్‌ఖండ్‌లోని ప్రజానీకమంతా మతాలకు అతీతంగా ఏకమై ఖాన్‌ నాయకత్వంలో స్వతంత్ర పాలనకు ప్రాణప్రతిష్ట చేసి తెల్లదొరలను మట్టి కరిపించారు.

181