పుట:1857 ముస్లింలు.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఈ సందర్భంగా రోహిల్‌ ఖండ్‌ ప్రజలను ఉద్దేశించి ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. ప్రజలనుద్దేశిస్తూ ఆయన మాట్లాడు తూ భారతదేశ ప్రజల్లారా ! (' The people of India ') అని సంబోధించి చరిత్ర సృషించారు. రోహిల్‌ఖండ్‌ రాజ్యాధినేత తన ప్రాంతపు ప్రజలను సంబోధిస్తూ భారత దేశ ప్రజల్లారా అని సంబోధించటం విశేషాంశం. మొగలు చక్రవర్తి ప్రతినిధిగా రోహిల్‌ ఖండ్‌ను పాలిస్తున్న ఆయన చక్రవర్తి జఫర్‌ పాలనలో ఉన్నప్రజలందర్ని ఉద్దేశించి ఈ విధంగా పిలుపు నివ్వడం భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ప్రాధాన్యతను సంతంరించుకుంది. రాజరిక వ్యవవస్థకు ప్రతినిథి అయిన ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ ఈ విధంగా విశాల దృక్పధతో యావత్తు ప్రజానీకాన్ని సంబోధించటం విశేషం.

ఇండియాలోని ప్రదాన సాంఘీక సముదాయాలైన హిందూ-ముస్లిం ప్రజానీకాన్ని ఉద్దేశించి ఖాన్‌ బహద్దాూర్‌ ఖాన్‌ మాట్లాడుతూ, మన పవిత్ర స్వాతంత్య్ర దినోత్సవం ఉదయించింది. ఇంగ్లీషు వారు మోసాలకు పాల్పడవచ్చు. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులనూ, హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలనూ రెచ్చగొడతారు. ముస్లింలారా ! మీరు పవిత్ర ఖురానును గౌరవిస్తున్నట్టయితే, హిందువుల్లారా ! మీరు గోమాతను ఆరాధిస్తున్నట్టయితే, మీలోని స్వల్ప విభేదాలను మరచి ధర్మ యుద్ధంలో చేతులు కలపండి. ఒకే పతాకం కింద పోరాడండి. మన హిందూస్థాన్‌ మీద ఆంగ్లేయుల పెత్తనం సృష్టించిన మరకలను మీ రక్తంతో శుభ్రం చేయండి' అని ఉద్భోదించారు. ఆంగ్లేయుల కుశ్చితాలను, కుయుక్తులను అర్థం చేసుకున్న ఆయన ఈ ప్రసంగంలో హిందూ-ముస్లిం ప్రజానీకం మధ్య ఏర్పడిన ఐక్యతా బంధాన్ని ఏవిధగానైనా చెడగొట్టడానికి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల ప్రయత్నించగలరని అందువలన ప్రజలను జాగురూకులై ఉండమని ముందుగానే హెచ్చరించారు.

(‘...The auspicious day of our freedom has dawned. The English will again resort to deceit. They will try their hardest to incite the Hindus against the Mussalmans and vice-versa...Mussalmans, if you revere the holy Quran, and Hindus, if you venerate the cow-mother, sink your petty differences and join hands in this holy war. Fight under one flag and with the free flow of your blood, wash away the stigma of the English domination over Hindustan...‘- Quoted from ‘ How India lost her Freedom‘ (Popular Prakashan) authored by Pundit Sunder lal, quoted in the essay titled ‘

182