పుట:1857 ముస్లింలు.pdf/183

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

మంతనాలు జరిపి తక్షణమే తిరిగి హంసి చేరుకున్నారు.

హంసి పట్టణంలోని మరో ప్రముఖులు, ఆయన సహచరులు మునీర్‌ బేగ్ ను వెంటనే కలుకున్నారు. ఆ ఇరువురు ప్రముఖులు ఢిల్లీ పరిణామాల గురించి చర్చలు జరిపి ఆంగ్లేయుల మీద యుద్ధానికి తమ ప్రాంతపు ప్రజలను సన్నద్ధులను చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు ఆంగ్లేయుల నుండి హర్యానా ప్రాంతాన్ని విముక్తం చేయడానికి పధాకాన్ని రూపొందించారు. ఆ దిశగా హుకుం చంద్‌, మునీర్‌ బేగ్ లు ఏకమై ముందుకు సాగారు.

ఈ వ్రమాదకర ప్రయాణంలో ఢిల్లీ నుండి తగిన సహాయం అందుతుందని ఆ నేతలు ఆశించారు. ఆ యోధులకు కీలక సమయంలో ఆశించిన విధంగా ఢిల్లీ నుండి ఎటువంటి సహాయం అందకుండా పోయింది. ఆ కారణంగా ఆంగ్ల సైన్యాలతో సాగిన పోరాటంలో ఆ స్వదేశీ యోధులు పరాజయం పాలయ్యారు. ఈ లోగా ఢిల్లీ మళ్ళీ ఆంగ్లేయుల వశమైంది. ఆ క్షణం నుండి మునీర్‌ బేగ్, హుకుం చంద్‌ల కోసం ఆంగ్లేయ సైనికాధికారుల వేట ఆరంభమైంది.

చివరకు ఆ యోధులిద్దారూ అరెస్టయ్యారు. విచారణ అనంతరం ఇరువురికి ఉరిశిక్ష ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు 1858 జనవరి 19న వారిరువురికి ఒకేసారి ఉరిశిక్ష అమలు చేశారు. ఐక్యంగా పోరుబాట నడిచి, హిందూ-ముస్లిం యోధుల మధ్య పటిష్టమైన బంధానికి ప్రతీకలుగా నిలచి ఆంగ్లేయులలో భయోత్పాతాన్ని కలిగించిన ఈ యోధుల పట్ల ఆంగ్లేయులు చాలా క్రూరంగా వ్యవహరించారు. ఈ యోధు మత విస్వాసాలకు భిన్నంగా హుకుంచంద్‌ మృతదేహాన్ని ఖననం చేయగా, మునీర్‌ బేగ్ బౌతికకాయాన్ని దహనం చేసిన ఆంగ్లేయులు తమ కసిని తీర్చుకున్నారు.

ప్రజల మత విస్వాసాలకు విఘాతం కలించటమే కాకుండా పదమూడు సంవత్స రాల వయస్సు నిండని హుకుంచంద్‌ మేనల్లుడు ఫకర్‌ చంద్‌ జైనను కూడ ఉరికంబానికి వేలాడదీసి ఆంగ్ల సైనికులు తమ క్రౌర్యాన్ని అత్యంత రాక్షసంగా చాటుకున్నారు. (Bharath ke Pradhama Swathantrya Sangram me Aaam logom ki Hissedaari, Prof.Shamshul Islam, Nehru Yuva Kendra Sangh -atana, New Delhi, 2007)

ఈ విధగా ఉతర పదశ్‌ రాష్ట్రంలోని పెజాబాద్‌కు చెందిన శంభుప్రసాద్‌ శుక్లా,

180