పుట:1857 ముస్లింలు.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

సంస్థానంలోని బ్రిటిష్‌ రెసిడెన్సీ మీద జరిగిన అత్యంత సాహసోపేతమైన దాడికి ప్రదాన ప్రేరణ అయినటువింటి అల్లాఉద్దీన్ ను, ఈ దాడికి సాయుధంగా నాయకత్వం వహించిన తుర్రేబాజ్‌ ఖాన్‌ను అరెస్టు చేయడం తమ ప్రదాన లక్ష్యంగా కంపెనీ గూఢచారి వర్గాలు, సైనిక బలగాలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ఆరంభించాయి.

ఆ ప్రయత్నాలలో భాగంగా తిరుగుబాటు యోధుల నాయకుడు తుత్రేబాజ్‌ ఖాన్‌ను మొగల్‌గూడ ప్రాంతంలో1857 జూలై 22న బంధించారు. ఆయన ఆస్తిపాసులను జప్తు చేశారు. ఆయన మీద రాజద్రోహం నేరారోపణ, విచారణ సాగించారు. ఆ విచారణలో దాడికి పూర్తి బాధ్యాతను తుర్రేబాజ్‌ ఖాన్‌ స్వయంగా స్వీకరించారు. ఆనాడు ఆయనిచ్చిన వాగ్మూలం ఎంతో గొప్పగా, స్పూర్తిదాయకంగా ఉంది. ఆంగ్లేయులను భారత దేశం నుండి వెళ్ళగొట్టే ఉద్దేశ్యంతో తాను ఈ దాడికి పూనుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ దాడిలో పాల్గొన్న తోి రొహిల్లాలను, మౌల్వీ అల్లాఉద్దీన్‌లను, ఇతర నాయకులను రక్షించే నిమిత్తం పోరులో పాల్గొన్న రొహిల్లాలు, ప్రజలు కేవలం తనను అనుసరించారనీ, అల్లావుద్దీన్‌ ఎవరో తను ఏమాత్రం తెలియదని, ఆయనతో కలసి తాను రెసిడెన్సీ మీద దాడి జరుపలేదని తుర్రేబాజ్‌ ఖాన్‌ విచారణలో చెప్పారు.

ఈ విచారణ తరువాత ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ అండమాన్‌ దీవులకు పంపాలన్న నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం అమలు జరిగేలోపుగా తుర్రేబాజ్‌ ఖాన్‌ 1859 జనవరి 18న తనకు కాపలాగా పెట్టిన ఇరువురు సెంట్రీలతో సహా చెరసాల నుండి తప్పించుకున్నారు. ఆయనను బంధించి తెచ్చిన వారికి ఐదువేల రూపాయల బహుమతిని 1858 జనవరి 19న నిజాం ప్రభుత్వంప్రకటించింది. ఆవిధంగా తప్పించుకున్నతుర్రేబాజ్‌ ఖాన్‌ ఆచూకిని కుర్‌బాన్‌ అలీ (Kurban Ali) అను విద్రోహి ఇచ్చిన సమాచారంతో ఆంగ్లేయ గూఢచారులు కనుగొన్నారు.

ఆ సమాచారం అందగానే 1858 జనవరి 24న నిజాం బలగాలు మెదక్‌ సమీపాన గల తూప్రాన్‌ (Toopran) అను గ్రామంలో ఉన్నతుర్రేబాజ్‌ ఖాన్‌ రహాస్య స్థావరం మీద దాడి చేశాయి. అరెస్టును నివారించేందుకు తుర్రేబాజ్‌ ఖాన్‌ శత్రువుతో సాయుధంగా తలపడ్డారు. బ్రిటిష్‌ సైనికులతో సాగిన పోరాటంలో తుర్రేబాజ్‌ ఖాన్‌ కాల్పులకు గురై కన్నుమూశారు. ఆయన బౌతికకాయాన్ని నగరంలోకి తీసుకొచ్చారు. తిరుగుబాటు వీరులను, ప్రజలను మరింత భయభ్రాంతుల్నిచేసేందుకు తుర్రేబాజ్‌ ఖాన్‌

156