పుట:1857 ముస్లింలు.pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

రెసిడెన్సీ లోనికి వెళ్ళేందుకు ఆ సాహసికులు ప్రయత్నించగా రెసిడెన్సీ బలగాలు విరామం ఎరుగక చేస్తున్న కాల్పుల వలన ఆ ప్రయత్నాలు ఫలించలేదు. బ్రిటిష్‌ రెసిడెన్సీ నుండి ఆంగ్లేయ అనుకూల సైన్యాలు ఫిరంగులు, తుపాకులతో కాల్పులు జరుపుతుండగా తుపాకులు, తల్వార్లు రాళ్ళురప్పలు, కట్టెలతో తిరుగుబాటు యోధు లు, ప్రజలు శత్రువును ఎదుర్కొన్నారు.

ఈ కాల్పులు తెలవారు ఝామున నాలుగు గంటల వరకు సాగినా రెసిడెన్సీలోకి వెళ్లగల అవకాశం ఏ మాత్రం లేకపోవటంతో తిరుగుబాటు యోధులు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఆయుధ సామగ్రి, అంగబలం ఎక్కువగా గల Major Briggs బలగాలు సాగిస్తున్న విరామమెరుగని కాల్పుల వలన తిరుగుబాటు యోధులు ఆత్మరకణలో పడ్డారు. ఆ సంక్లిష్ట సమయంలో రెసిడెన్సీ బలగాలకు అండగా సికిందరాబాద్‌ సైనిక స్థావరం నుండి రెండు యూరోపియన్‌ దాళాలు మూడు భారీ ఫిరంగులతో వచ్చి చేరాయి. అదనపు బలగాలు వచ్చి చేరడంతో రెసిడెన్సీ బలగాలు రెట్టించిన ఉత్సాహంతో తమ తుపాకులు, ఫిరంగులకు పనిపెట్టాయి.

ఆ కార ణంగా వర్షంలా దూసుకువస్తున్నతుపాకి గుండ్ల నుండి తప్పంచుకునేందుకు పోరాటయోధులు తాముఆక్రమించుకున్భవంతులను, గృహాలను ఖాళీ చేశారు. ఆ గృహాల వద్ద కాపలా కాస్తున్నఅరబ్బు దళాల సహకారంతో తిరుగుబాటు యోధులు రణస్థలం నుండి క్రమంగా నిష్క్రమించటం ఆరంభించారు. ఈ విధంగా రెసిడెన్సీ మీద దాడిని విరమించుకుని తిరిగి వెళ్ళిపోతున్న యోధులు గాయపడిన తమ సహచరులను తీసుకుని పోయారు. ఈ పోరాటంలో మొత్తం మీద 32 మంది తిరుగుబాటు యోధులు ప్రాణాలు కొల్పోగా పలువురు గాయపడ్డారు . చివరకు జూలై 18 ఉదయానికల్లా తిరుగుబాటు యోధులు అ ప్రాంతం ఖాళీ చేసి శత్రువు చేతికి చిక్క కుండా తప్పంచుకుని వెళ్ళిపోయారు. (The Freedom Struggle In Hyderabad, Volume II : P. 52)

నగరం నడిబొడ్డున వేలాడిన తుర్రేబాజ్‌ ఖాన్‌

ఆ విధంగా తప్పించుకు పోయిన తిరుగుబాటు యోధుల నాయకులు మౌల్వీ అల్లాఉద్దీన్‌, పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌లను బంధించేందుకు కంపెనీ పాలకులు తమ సైన్యాలనూ, గూఢచారి దాళాలనూ రంగంలోకి దించారు. బలసంపన్నమైన నిజాం

155