పుట:1857 ముస్లింలు.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రప్రదేశ్‌ ముస్లిలు


బౌతికకాయాన్ని సంకెళ్లతో బంధించి నగరం నడిబొడ్డున ప్రస్తుతం సుల్తాన్‌ బజార్‌ పోలీసు స్టేషన్‌ ఉన్న ప్రాంతంలో బహిరంగంగా వ్రేలాడదీశారు. ( Who's Who of Freedom Struggle in Andhra Pradesh, Volume I, P. 535). ఈ విధగా తుర్రేబాజ్‌ ఖాన్‌ వెంట ఉండి ఆయనతోపాటుగా ఆంగ్ల-నిజాం సైనికులతో పోరాటం చేసన ఆయన అనుచరుడు జాన్‌ అహ్మద్‌ కూడ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మరణంచారు.

1957లో జరిగిన 1857 శతజయంతి ఉత్సవాల సందర్భంగా హైదారాబాదు నగరంలోని కోఠి నుండి జాంబాగ్ వైపు గా వెళ్ళు రోడ్డుకు తుర్రేబాజ్‌ ఖాన్‌ పేరుపెట్టారు. ఆ రోడ్డు వెంట వెళ్ళేవారికి రోడ్డు పేరు లిఖించబడిన చిన్న బోర్దు కన్పిస్తుంది గాని ఆయనెవ్వరో తెలియని దుస్థితి. ఆ సందర్బంగా 1857నాటి అమరవీరులను స్మారకరం ప్రస్తుత కోఠి సిటీ బస్టాండులో ఓ స్మారక స్థూపాన్ని కూడ ప్రభుత్వం నిర్మించింది. ఈ స్మారక స్థూపం ఎటువంటిఆలనా పాలనా లేక, చిల్లర వ్యాపారుల తోపుడు బండ్ల చక్రబంధంలో ఎవ్వరూ ప్రవేశించ వీలులేకుండా, ఎవ్వరికీ కన్పించని వాతావరణంలో ఉండిపోయింది.

1857 జూలై 18న ఆంగ్లేయుల చేత చిక్కకుండా మౌల్వీ అల్లాఉద్దీన్‌ చాకచక్యంగా తప్పించుకున్నారు. నగరం నుండి వెళ్ళిపోయిన ఆయన బెంగళారు చేరుకున్నారు. అక్కడ ఒకటిన్నర సంవత్సరం రహస్య జీవితం గడిపారు. ఆయనను సజీవంగా గానీ నిర్జీవంగా గానీ పట్టి ఇచ్చిన వారికి గానీ, ఆయన ఆచూకి తెలిపిన వారికి గానీ నాలుగు వేల రూపాయల బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత కొంత కాలానికి మంగలపల్లి (Mangalapalli) వద్ద నిజాం-బ్రిటిషుసైన్యాలు అల్లాఉద్దీన్‌ను నిర్బంధించాయి. ఆయనను నగరానికి తీసుకొచ్చి రాజద్రోహం, రెసిడెన్సీ మీద దాడి లాంటి పలు నేరారోపణలు మోపి విచారణ తంతు జరిపారు. ఆ విచారణ పర్యవసానంగా మొఎల్వీ అల్లాఉద్దీన్‌కు ఆజన్మాతం ద్వీపాంతరవాస శిక్ష విధించారు. ఆ శిక్ష మేరకు 1859 న్‌ 28న ఆయనను అండమాన్‌ తరలించారు. చివరివరకు అండమాన్‌ దీవుల్లోని సెల్యూలర్‌ జైలులో గడిపిన మౌల్వీ అల్లాఉద్దీన్‌ 1884 లో కన్నుమూశారు.

బ్రిటిష్‌ రెసిడెన్సీ మీద దాడి చర్యకు ఆగ్రహోగ్రుడైన బ్రిటిష్‌ రెసిడెంట్ కల్నల్‌

157