Jump to content

హైందవ స్వరాజ్యము/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఏడవ ప్రకరణము.


భారతభూమి ఏల నష్టమైనది?


చదువరి : నాగరకమునుగురించి మీరు పుష్కలముగా వివరించినారు. నేను విమర్శించుకొనుటకు చాలినంత చెప్పినారు. యూరపుజాతులనుండి మన మేమిగ్రహింపన లెనో యేమిత్య జింపవ లెనో నేను నిశ్చయముగా తెలిసికొన లేకున్నాను. ఒక్క- ప్రశ్నమాత్రము నా పెదవుల నానియున్నది. నాగరిక మే రోగ మైన, ఇంగ్లండు ఆరోగమునకు లోబడియున్న, భారతభూమి ఇంగ్లండుపక్ష మెట్లెయున్నది. ఇంకను నావశమున నెట్టు నిలచినది?


సంసా : మీప్రశ్నకు ఉత్తరము చెప్పుట మిక్కిలికష్టము "కాదు. త్వరలోనే నిజమైన స్వరాజ్యత త్త్వముకూడ విమర్శింప నగును. ఇది యేల మధ్యమున చొప్పించితిరందురా నే నింకను ఆప్రశ్నకు జనాబియ్యవలసియున్నందున నేయగును. ముందు 'మీ వెనుకటి ప్రశ్నకు ప్రత్యుత్తరమి చ్చెద. ఇంగ్లీషు వారు భారత భూమిని తీసికొన లేదు; మనము వారికిచ్చి నాము. బలము ఉండబట్టి వారిక్కడ లేరు. వారిని మనము పెట్టుకు

న్నాము. కాబట్టి వారిక్కడనున్నారు. ఈవిషయములు
36

హైందవ స్వరాజ్యము.


నిజమేమో విచారింతము. మొదట వారు మనదేశమునకు వచ్చినది వ్యాపారము చేసికొనుటకు. తరువాత కంపెనీ బహ దూ రేర్పడెను. కంపెనిని బహదూరు చేసినవా రెవరు.? వారు వచ్చినప్పుడు రాజ్యము స్థాపింపవలెనని వారికి కొంచమైనను ఆశ లేనే లేదు. కంపెనీవారి యధి కారులకు సాయముచేసిన దెవరు? వారు తెచ్చిన అద్దాలసొబగుచూచి మోహించిన దెవరు? వారివస్తువులను కొనిన దెవరు? చరిత్ర చూచిన యెడల ఇవన్ని యు మన మేచేసినట్లేర్పడుచున్నది. ఒక్కనాటిలో శ్రీమంతు లము కావ లెనని కుంపిణీ వారియధి కారులకు ముకుళిత కరకమల ములతో స్వాగతమిచ్చితిమి. వానికి సహాయము చేసితిమి. భంగీ త్రాగునలవాటు నాకు ఉన్నదనుకొందము దాని నమ్ము వాడు నాకమ్ముచున్నాడు. దోషము అతనిదో? నాదో? అతనిని దూరినమాత్రాన నాయభ్యాసము వదలగలనా? ఈవ్యాపారిని తరుమ గొట్టినట్లైన ఇతని స్థానమున ఇంకొక వ్యాపారి రావలసి సదే గదా ! భారతభూమికి నిజ సేపకుడైనవాడు బునాదులతో విషయము పరిశీలింపవలెను. అపరిమితముగా అన్న ముదిని యజీ ర్తి చేసికొని నీటి పైబడి నెత్తి మోది కొనిన నేమిలాభము ? మూల కారణము కని పెట్టిన నాడే ముస్తాబు వైద్యుడు. భారత భూమి నుద్ధరించు ముస్తాబు వైద్యుడను నేను అనువాడు

మూలకారణమరయక తప్పదు.

37

భారతభూమి ఏల నష్ట మైనది.


చదువరి : మీరు చెప్పినది సరే. ఇకముందు మీసిద్ధాంత ములు నాకు నచ్చ జెప్పుటకు ఎక్కువవాద మవసరముండదు. మీయభి ప్రాయము లెక్కువగా వినవలెనని కుతూహలము కలు గుచున్నది. ప్రస్తుత మాలోచించు చుండు విషయము మిక్కిలి చిత్తా కర్షకము. మీరు చెప్పునదంతయు సావధానముగా నిందును. అనుమానమంకురించిన చోటమాత్రము ప్రశ్నింతును.


సంపా : మీరు ఉత్సాహము పలుకుటదప్ప మున్ముందు ఎక్కువ భేదాభిప్రాయములు కలుగునని నాకుదోచుచున్నది. మీరు ప్రశ్నించునప్పుడు నావాదము చెప్పుకొందును గాగ . మనము ప్రోత్సాహ పరచినందు వలన నే బ్రిటిషువర్తకులు భారత భూమిలో కాలూన గలిగిరని ఇదివరలో చెప్పితిని. మన రాజులు వారిలో వారు పోట్లాడి కొనినప్పుడు తమతమబలమును వృద్ధి చేసికొనుటకు వారు వారు కుంపుణీ బహదూరుసహాయము కోరిరి. ఆకుంపిణీ వ్యాపారము నందును యుద్ధము నందును సమర్థమయి యుండినది. ధర్మసందేహములు దానికి కలిగినవి గావు. తన వ్యాపార మభివృద్ధి చేసికొనుట, ద్రవ్యము గడించుట, ఇవి రెండే దాని యాలోచనలు.. కాబట్టి అదిమనసహాయమును అంగీక రించి తనకు చెందిన వ్యాపార స్థానముల నెక్కువ చేసి కొనెను. ఈవ్యాపార స్థానముల సంరక్షణార్థమై కుంపిణీవారు సైన్యమును

పెట్టుకొనిరి. ఆ సైన్యమును మనము కూడ వినియోగ పరచు
38

హైందవ స్వరాజ్యము.


కొంటిమి. అప్పుడు మనము చేసినపనికి ఇంగ్లీషు వారిని దూషిం చుట వ్యర్థముకాదా? హిందువులు ముహమ్మదీయులు ఒకరి మీదికొకరు కత్తిదూసి యుండిరి. ఇదియు కుంపిణీ వారికి అను కూలమయ్యెను. ఈరీతిగా కుంపిణీకి భారతభూమిలో అధికారము దొరకు గలసందర్భములను మన మేర్పరచితిమి.. అందువలన భారతభూమి నష్టమైనదనుటకంటే మనము భారతభూమిని ఇంగ్లీషువారికి ఇచ్చినామనుట సమంజసము.


చదువరి: వారు భారతభూమిని నిలుపుకొనగలిగన ట్లో చెప్పగలరా?


సంపా: ఏకారణములు వారికి భారతభూమిని దానము చేసెనో ఆకారణములే వారు దానిని నిలుపుకొనుటకును తోడ్పడుచున్నవి. కొందరు ఇంగ్లీషువారు కత్తిబట్టి భారతభూ మిని జయించినట్లును ఆకత్తిబలముచేతనే ఇప్పుడు నిలుపు కొనుచున్నట్లును చెప్పుదురు. ఈ రెండుమాటలును తప్పే, భారత భూమిని నిలుపుకొనుటకు కత్తి మాత్రమును పనికి రాదు. మనమే ఇంగ్లీషువారిని నిలుపు వారము. ఇంగ్లీషువారు దుకాణదారుల జాతీయని 'నెపోలియను వర్ణించినాడట. అది ఉచిత వర్ణనయే. వారికిగల సామ్రాజ్యమంతయు వారు వ్యాపారము కొరకే నిలు పుకొనుచున్నారు. వారి నౌకా సైన్యము భూ సైన్యము అంతయు ఆవ్యాపారమును రక్షించుట కేర్పడినవియే. ట్రాన్సువాలులో

భారతభూమి ఏల నష్టమైనది.

39


వ్యాపార పాశము పనికి రానందున కీర్తి శేషుడు గ్లాడుస్టను ఇంగ్లీ షువారాప్రాంతమును తమవశమున నుంచుకొనుట సరి కాదని నిశ్చయించెను. అయిన అదే ప్రాంతము లాభకారి యయిన ప్పుడు సంఘర్షణ కలిగి యుద్ధము పొసగెను.వెంటనే ట్రాన్సు వాలు పై ఇంగ్లండుకు సార్వభౌమత్వాధికారము కలదని ఛేంబ ర్లేనుగారు కని పెట్టిరి. ఒక చిన్న కథ చెప్పుదురు.. అధ్యక్షుడు క్రూజరు బ్రతికియుండగా నెవరో అతనిని ' చంద్రునిలో బంగా కమున్నదా ' యని అడిగిరట. ' చాలమట్టుకు లేదు. ఉన్న యెడల ఇంగ్లీషువా రెన్నడో దానిని స్వాధీనపరచుకొనియుం దురు ' అని అతడు బదులు చెప్పెనట ! వారికి ధనము దైవమ నుట జ్ఞాపక ముంచు కొను నెడల ఎన్ని చిక్కులనో అర్థము చేసి కొనవచ్చును. అంతయు చూడగా ఇంగ్లీషు వారిని మన స్వోప యోగార్థము మనమిక్కడ ఉంచుకొనుచున్నా మనుట తేలుచు న్నది. వారివ్యాపారము మనకు కావలెను. వారి చాక చక్య పద్ధతులచేత వారు మనలను తృప్తిపరచుచున్నారు. వారికి కావలసినది అందుమూలకముగా సంపాదించుకొనుచున్నారు. వాని ఇందుకుగాను దూషించుట వారిశక్తిని ఇనుమడింప జే యుటతప్ప వేరుకాదు.మనలో మనము పోట్లాడుకొని వారి శక్తిని బలవత్తరము చేయుచున్నాము. పై చెప్పిన సంగతులన్ని యు అంగీక రించు నెడల ఇంగ్లీషువారు వ్యాపారమున కై యిక్క

.
40

హైందవ స్వరాజ్యము.


డికి వచ్చి నారనుట సిద్ధము. అదే పనికే వారు నిలిచియున్నారు. అందులో మనము వారికి సహాయము చేయుచున్నాము, వారి మందుగుండ్లు నిజముగా ఏమి పనికి రావు. ఈసందర్భ ములో మీకు నేనింకొక్కటి చెప్పవలెను.జపానులో జపా నీయుల జండా యెగురుట లేదు.ఇంగ్లీషు వారిజండాయే యె గురు చున్నది. జపానులో వ్యాపారముకొరకు ఇంగ్లీషు వారు సంధి చేసికొని యున్నారు. సాధ్యమయిన యెడల వారివ్యాపా రము జపానులో కూడవ్యాపింపగలదు. వారులోకమునంతటిని తమవస్తువుల విక్రయమునకుగాను గొప్పవిక్రయాంగణముగా నేర్పరుచుకొననున్నారు. వారి కిది సాధ్యము కాదనుట నిజమే. 'కొనిలోపము వారిది కాబోదు. వారు తమయుద్దేశము నెర నేర్చు కొనుటకు - సర్వప్రయత్నములు చేసి వదులుదురు.