హైందవ స్వరాజ్యము/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఎనిమిదవ ప్రకరణము.


భారతభూమి స్థితి.


చదువరి : ఆంగ్లేయు లేల హైందవ భూమిలో నిలచియున్నా రో యిప్పుడు నాకర్థమయినది. మన దేశ స్థితిని గురించి మీ యభిప్రాయము లేమియో నేను వినవలతును.


సంపా: అస్థితి మిగుల విచారకరమైనది. దానిని గురించి ఆలోచించిననే నాకంట నీరు నిండుచున్నది. గొంతు ఎండ బారి పోవుచున్నది. నిజముగా నాహృదయమున కలరూపు కలయ టులు వివరింపగలనా యను సందేహము పుట్టు చున్నది. ఇంగ్లీషు వారి కాలి క్రింద కాదు మనము పడిమడయుచుండుట. గరికముయొక్క తొక్కుడున మనము నశించుచున్నామనుట నా పూర్ణ విశ్వాసము. ఆ రాక్షసుని భరింపలేక దేశమాత సంకటపడి మూల్గుచున్నది. తప్పించుకొనుట కికను అవ కాశ మున్నది. కాని దినములు గడచిన ట్లెల్ల నాయావకాశము తగ్గిపో పుచున్నది. మతమునందు నాకభిమానము. నాకు మొదట కాన్పించు గొప్పులోపము భారతభూమి దుర్మతము పాలగుచుండు టయే. నేనుహిందూ, ముహమ్మదీ పారసీ మతములను గురించి ఆలోచించుచున్నా ననుకొసవలదు. అన్ని మతము లకు మూలాధారమైన ఆధ్యాత్మిక మతముసంగతియే నాయ

లోచన. మనము దైవమునే దూరము చేసికొనుచున్నాము
42

హైందవ స్వరాజ్యము.


చదువరి: ఆదియెట్లు?

సంపా : మనముసోమరిపోతుల మని యురోపియనులు కష్టిం చువారిని సాహసులని ఒక్క ప్రతీతి యేర్పడినది. అప్రతీతిని మన మంగీకరించి మని స్థితిని మార్చుకొననిచ్చగించుచున్నాము. హిం దూ మహమ్మదీయ పారసీ క్రైస్తవమతములు బోధచేయున దేమన, భౌతిక సౌఖ్యముల యెడల లోలత్వమువలదు. ఆధ్యాత్మిక లోకమునకై సతత పరిశ్రమచేయవలసినది. లోకములో విషయ సంగ్రహమొనర్చుదు సనునాశను త్రుంచవలసినది. ముక్తి మార్గమును తదేక దీక్షతో సరయవలసినది. మనసర్వ ప్రయ త్నముదీనికి వినియోగించవలసినది.


చదువరి: మీ రేమి! మతముపిచ్చి పట్టించు ప్రయత్నము చేయు నట్లున్నారు. ఎందరో దొంగలు ఇ దే రీతిని బోధించి లోకులను "పెడమార్గముల బట్టించినారు.


సంపా: మతమును గురించి మీరక్రమదూషణ చేయుచున్నా రు' సుమా! దొంగతనము మతము పేరిట జరుగకపోలేదు. వెలుతు రెక్కడక లదో చీకటియు నుండకపోదు. ఆధిభౌతిక విషయములలోని దొంగలకంటే ఆధ్యాత్మిక విషయములలోని దొంగలు ఎక్కువ దుర్మార్గులు కారని నేను ఋజువు చేయ గలను. నాగరకము పేరట జరుగునట్టి దుర్మార్గము మతము

పేరట నెప్పుడును జరుగదనుట ఇదె మీరు కనగలరు.

43

భారతభూమి స్థితి.


చదువరి: అదెట్లనగలరు? మతము పేరు పెట్టుకొనియే హింవులు మహమ్మదీయులు యుద్ధములాడుకొనినారు.మతము పేరు పెట్టుకొని యే క్రైస్తవులలో క్రైస్తవులు ఒకరినొకరు సంహారము చేసికొనినారు. వేలకొలది నిరపరాధులు మతము పేరట నే కత్తివాతికి అగ్ని జ్వాలలకు చెప్ప రానిహింసలకు పాలయి నారు. ఏనాగరకముకంటెనుకూడ ఇది అసహ్యకరముకాదా.


సంపా: నాగరకము యొక్క కష్టములకంటె పైకష్టములు భరించుట సులభతరమని నాహృదయపూర్వక విజ్ఞాపనము.మత ము పేరు పెట్టి క్రౌర్యములు జరిపి యుండుట నిజమేయైనను ఎవ్వ రును ఈ క్రౌర్యములు మతమున కంగములని యెప్పుడును చెప్పి యుండ లేదు. కాబట్టి ఈ క్రౌర్యములు మనతో సంపూర్తియగు చున్న వేకాని వెనుకటికి బీజములను చల్లిపోవుట లేదు. మూఢ విశ్వాసులును నజ్ఞానులు నైన ప్రజలున్నంత కాలము ఇట్టి క్రౌర్య ములు జరుగవచ్చును. కాని నాగరక జ్వాలల క్రింద లీనమగు నట్టి దురదృష్టుల సంఖ్యకు మితియను మాటయే లేదు. నాగరక మున నుండునట్టి పరమనీచగుణ మేమందురా? మాసపులు దాని నే మోమహా ప్రసాదమనుకొని ఆ కార్చిచ్చు నురుకు చుండు టయే. అందుపడిన వారు దుర్మతము పాలయి లోక ఫల మేనూ త్ర మును అనుభవింపజాలని వారగుచున్నారు. నాగరకము తేనె

పూసినక త్తిషంటిది. దానిపూర్ణఫలముబయల్పడినప్పుడు నవ
44

హైందవ స్వరాజ్యము.


నాగరకమున కంటే మూఢభక్తితో కూడిన మతనిశ్వాసమే వేయిమడుంగులు శ్రేయస్కరమని మనకు నర్థము కాగలదు. ఇట్లనుట చేత నేను మూఢవిశ్వాసముల విజృంభణమునకు తోడ్ప డుచున్నానని యనుకొనవలదు. వానిని మనము సర్వవిధముల నెదిర్చి తుదముట్టింపవలసిన దే. మతము నే ఉల్లంఘించి ఆపని చేయగలుగుదురనుట కల్ల. మతములోని సారమును గ్రహించి "దానిని నిలిపిన నే తక్కుంగల కార్యము సాధ్యమగును.


చదువరి . అయిన బ్రిటిషు శాంతి నిరుపయోగకరనునియా తమ యభిప్రాయము.


సంపా: శాంతి మీకు కానవచ్చుచున్న దేమో, నాకుమా త్రము కాన రాలేదు.


చదువరి: థగ్గులు, పిండారీలు, ఖలులు దేశమునకు కలిగిం చు చుండిన యుపద్రవము మీకు లక్ష్యములో నున్నట్లు లేదు.


సంపా: కొంచెము మీరాలోచించు నెడల అభయమం తయు నెంతో యెక్కువలోనిది కాదని మీ రెరుంగగలరు. నిజ ముగా ఆ అల్లరులంత గొప్ప వేయైనచో బ్రిటిషువారు రాకముందే ప్రజలందరు నశించి యుందురు.అంతే కాక ప్రస్తుతముండు శాంతి నామకార్థ మే. దీనివలన మనము దైన్య స్థిర్యవిహీనులమై నాము. వ్యర్థులమైనాము. బ్రిటిషువారు పిండారీల భీలుల స్వభా

వమును మార్చినారను కొనుటకు రాదు. పిండారీల భయము

45

భారత భూస్థితి.


నుండి మనల సంరక్షిం చి మగతనము లేనివారిని చేసిన ఈ స్థితులకంటె పిండారీలతో .. పోరాడుచుండుటయే 'మెరుగుగా " నుండియుండును.పౌరుష విహీనమగు సంరక్షణ కంటే భీలుల బాణము వేటున చచ్చుటయే నామట్టుకు నాకు అనుకరణీయము. అట్టి సంరక్షణ లేనికాలమున భారతభూమి శౌర్య సంపన్న మయి యుండినది. హైందవులు పిరికి వారని వ్రాసిన మెకాలే అజ్ఞాన మును ప్రకటించెనుకాని మరియొకటి కాదు. అట్టిదూషణకు హైందువులు పాత్రులు కారు. మొరటు అడవిజాతులును వ్యాఘ్ర ములు తో డేళ్లును నిండినయరణ్యములను కలభూమిలోని మానవులు పిరికివా రైనచో ఎన్నడో కలికమున కైన కాన రాకపోవుదురు. మీరెప్పుడైనను చేలదగ్గరకు పోయినారా? నేడు కూడ మన రైతులు యిగా చేలలో సిర్భయముగా పండు కొందరు. ఇంగ్లీషువారు, మీరు, నేనేమైన వారు నిద్రించు చోట నిద్రింపజాలము.. శక్తి భయము లేమి ననుకరించును. దేహ ములోనుండు మాంసము రక్తముల ననుకరింపదు, స్వరాజ్యము కోరునట్టి - మీకంది. " ను నేనొక్క విషయము స్మరింప జేయ వలసి యున్నాను. నా లు, ఈపిండారీలు, ఈ ధగ్గులు, ఈఆసా మీలు, అందుకు ,దేశస్థు లే వారిని జయించుట మీపని నాపని.. మనసోదరలకే మనము భయపడుచుండు నెడల మన యాదర్శము చేసుటకు మనమర్హులమే కాము.