Jump to content

హలో...డాక్టర్/పాండు రోగము (Anemia)

వికీసోర్స్ నుండి

27. పాండురోగము ( Anemia ) జంతుజాలములోను, పక్షులలోను, జలచరములలోను జీవన వ్యాపారమునకు రక్తప్రసరణము మూలాధారము. రక్తప్రసరణము వలన వివిధ కణజాలమునకు ప్రాణవాయువు ( Oxygen ), పోషకపదార్థములు చేర్చబడుతాయి. కణజాలము నుంచి బొగ్గుపులుసువాయువు (cabon dioxide), తదితర వ్యర్థపదార్థములు గ్రహింపబడి ఊపిరితిత్తులకు (Lungs), కాలేయమునకు (Liver), మూత్రాంగములకు (Kidneys) విసర్జన కొఱకై చేర్చబడుతాయి. హృదయము వివిధ అరల సంకోచ వ్యాకోచముల వలన రక్తమును గ్రహించి, మరల ఆ రక్తమును వివిధ అవయవములకు సరఫరా చేస్తుంది. హృదయము ఒక తోడుయంత్రము. రక్తనాళముల ద్వారా రక్తప్రసరణము జరుగుతుంది. రక్తములో ఎఱ్ఱకణాలు (Red Blood Corpuscles), తెల్లకణాలు (White Blood Cells), రక్తఫలకములు (Platelets), రక్తద్రవములో (Plasma)  కలిసి ఉంటాయి. ఇతర పోషకపదార్థములు, మాంసకృత్తులు, చక్కెర, క్రొవ్వుపదార్థములు, వినాళగ్రంథుల స్రావములు (Hormones) యితర రసాయనములు రక్తద్రవములో కరిగి ఉంటాయి. ఎఱ్ఱకణములు ప్రాణవాయువును  కణజాలమునకు చేర్చుటకు, కణజాలమునుంచి బొగ్గుపులుసువాయువును ఊపిరితిత్తులకు విసర్జనకు కొనిపోవుటకు, ఊపిరితిత్తులలో ప్రాణవాయువును గ్రహించుటకు ఉపయోగపడుతాయి. ఎఱ్ఱకణములు ( Red blood corpuscles )

ప్రాణవాయువు వాహక సమర్థత (Oxygen carrying capacity) ఎఱ్ఱకణాలు, ఆ కణాలలో ఇమిడిఉన్న హీమోగ్లోబిన్ అనే వర్ణకము (Pigment) యొక్క పరిమాణములపై ఆధారపడి ఉంటుంది. సాధారణముగా ఒక క్యూబిక్ మిల్లీమీటరు రక్తములో స్త్రీలలో 4-5 మిల్లియన్లు, పురుషులలో 5-6 మిల్లియన్ల ఎఱ్ఱకణాలు ఉంటాయి. ఎఱ్ఱకణాలు కోలగా ద్విపుటాకారపు

295 :: పళ్ళెములవలె ఉంటాయి. ఒక్క ఎఱ్ఱకణపు పరిమాణము సుమారు 90

ఫెంటొ లీటర్లు (fl)g ( ఒక ఫెంటో femto అంటే 0.000 000 000 000 001) కలిగి ఉంటుంది. రక్తకణాలు ఎముకల మజ్జలో (Bone marrow) ఉత్పత్తి అవుతాయి. ప్రారంభదశలో ఎఱ్ఱకణాలలో న్యూక్లియస్లు ఉన్నా, పరిణామము చెందుతూ అవి న్యూక్లియస్ లను కోల్పోతాయి. అందువలన వాటిలో ఎక్కువగా హీమోగ్లోబిన్ నిక్షిప్తము అయే అవకాశము ఉంటుంది. పరిణామము చెందుతున్న దశలో న్యూక్లియస్ తొలగినా ఎఱ్ఱకణాలలో రైబోసోమల్ ఆర్. ఎన్. ఎ జల్లెడ కలిగి (Ribosomal RNA reticulum), ఆ జాలికకణాలు (Reticulocytes) క్రమేణా ఆ జాలికను కూడా కోల్పోతాయి. ప్రసరణలో ఉన్న ఎఱ్ఱకణాలలో న్యూక్లియస్లు ఉండవు. కాని ప్రసరణలో సుమారు ఒక శాతపు జాలికకణాలు ఉంటాయి. రక్తనష్టము జరిగినప్పుడు ఎఱ్ఱకణాల ఉత్పత్తి అధికము, త్వరితము అయి పరిణతి చెందని కణాలు ప్రసరణములోనికి విడుదల అయి జాలికకణాల శాతము పెరుగుతుంది . పరిణతి చెందిన కణాలు పరిణతి చెందని కణాల కంటె చిన్నవిగా ఉంటాయి. ఎక్కువ పరిమాణము గల కణాలు ప్రసరణలో ఉంటే పృథుకణత్వము అని (Macrocytosis), తక్కువ పరిమాణము కల కణాలు ప్రసరణలో ఉంటే  లఘుకణత్వము (Microcytosis) అని అంటారు. సామాన్య పరిమాణ కణాలు ప్రసరణలో ఉంటే సామాన్య కణత్వము (Normocytosis) అని అంటారు.

ఎఱ్ఱరక్తకణాలలో ఉండే రక్తవర్ణకము (hemoglobin) వలన వాటికి ఎఱుపు రంగు వస్తుంది. రక్తవర్ణకము వలన ఎఱ్ఱకణాలు ప్రాణవాయువును వహించగలుగుతాయి. రక్తవర్ణకము (hemoglobin) సాధారణముగా డెసి లీటరు రక్తములో పురుషులలో 13- 14 గ్రాములు, స్త్రీలలో 12- 13 గ్రాములు ఉంటుంది. హీమోగ్లోబిన్ సాధారణ పరిమితి కంటె తక్కువయితే దానిని రక్తహీనముగా (Anemia; పాండురోగము) పరిగణిస్తారు. రక్తమును ఒక పరీక్షనాళికలో ఉంచి వికేంద్రీకరణ యంత్రములో (Centrifuge) వడిగా తిప్పుతే కణాలన్నీ క్రిందకు పేరుకొని రక్తద్రవము (Plas:: 296 :: ma) పైకి చేరుకుంటుంది. పేరుకొన్న కణ ఘనపరిమాణమును రక్త (కణ) సాంద్రతగా (Hematocrit) పరిగణిస్తారు. రక్తసాంద్రత సాధారణముగా పురుషులలో 46 శాతము, స్త్రీలలో 42 శాతము ఉంటుంది. రక్తహీనము ఉన్న వారిలో రక్తసాంద్రత తక్కువగా ఉంటుంది. రక్తకణములు ఎముకల మజ్జలో ఉత్పత్తి అవుతాయి. పిల్లలలో అన్ని ఎముకల మజ్జలలోను రక్తకణముల ఉత్పత్తి జరుగుతుంది. పెద్దలలో కపాల అస్థికలు, రొమ్ముటెముకలు, ప్రక్కటెముకలు, కటియెముకలు, దీర్ఘాస్థుల చివరి భాగముల మజ్జలలోను రక్తకణముల ఉత్పత్తి జరుగుతుంది. మూత్రాంగములలో (kidneys) ఉత్పత్తి అయే రక్తోత్పాదిని (Erythropoietin) అనే రసాయనము ఎఱ్ఱకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మూత్రాంగముల వ్యాధి, వైఫల్యము ఉన్న వారిలో రక్తోత్పాదిని (Erythropoietin) ఉత్పత్తి తక్కువగుటచే వారిలో రక్తహీనత కలుగుతుంది.

ఎఱ్ఱరక్తకణాలలో ఉండే హీమోగ్లోబిన్ లో- హీం (Heme) అనే వర్ణకము (Pigment) గ్లోబిన్ అనే మాంసకృత్తితో సంయోగమయి ఉంటుంది. హీం ఉత్పత్తికి ఇనుము (Iron) అవసరము. ఎఱ్ఱకణాల ఉత్పత్తికి ఇనుము, ఫోలికామ్లము, విటమిన్ బి -12 లు అవసరము. పాండురోగ కారణములు

రక్తహీనము ఎఱ్ఱకణాల ఉత్పత్తి లోపము వలన, రక్తనష్టము (Blood loss) వలన, రక్తకణ విచ్ఛేదనము (Hemolysis) వలన కలుగుతుంది. రక ్తనష్ట ము :

తరుణస్త్రీలలో ఋతుస్రావము అధిక మయితే రక్తహీనము కలుగుతుంది. జీర్ణమండలము (Alimentary tract) ద్వారా రక్తనష్టము కలుగవచ్చును. జీర్ణాశయము (Stomach), ప్రథమాంత్రములలో (Duodenum) జీర్ణవ్రణములు (Peptic ulcers), జీర్ణమండలములో వివిధ కర్కటవ్రణములు (Cancers), అన్ననాళములో ఉబ్బుసిరలు  [Esophageal varices - ఇవి నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో (Cirrhosis of Liver) కలుగుతాయి], జఠరతాపము (Gastritis) [మద్యపానము,

297 :: కీళ్ళనొప్పులకు వాడే మందులు, ఏస్పిరిన్, యితర ఔషధములు, హెలికోబాక్టర్

పైలొరై (Helocobacter Pylori) అనే సూక్షజీవుల వలన జఠరతాపములు కలుగుతాయి], పెద్దప్రేవులలో కలిగే ఆంత్ర బుద్బుదాలు (Diverticulosis), కంతులు (Polyps), మూలవ్యాధి (Haemerrhoids), ఆంత్రములలో చేరిన కొంకిపురుగులు (Hookworms) వంటి పరాన్నభుక్తుల (Parasites) వలన దీర్ఘకాలములోను, త్వరితగతిలోను రక్తనష్టము కలుగ వచ్చును. ప్రమాదాల వలన కలిగే తీవ్రగాయాల వలన, శస్త్రచికిత్సలలోను రక్తనష్టము కలుగవచ్చును. అయస్సు లోప రక ్తహీనత ( Iron deficiency anaemia ) :

పైన పేర్కొన్న కారణాల వలన శరీరములో ఇనుము నిల్వలు తగ్గుటచే రక్తహీనత కలుగుతుంది. గర్భిణీస్త్రీలలో రక్తపు అవసరము ఎక్కువయి రక్తపు ఉత్పత్తి పెరుగుతుంది. వారికి దైనందిక ఇనుము అవసరాలు పెరుగుతాయి. వారికి ఇనుము లవణరూపములో అదనముగా అందించకపోతే ఇనుము లోపించి  పాండురోగము కలుగుతుంది. శిశువులలో కూడా ఇనుము లోపము కలుగవచ్చును. ఆంత్రవ్యాధులు, క్లోమవ్యాధులు (Pancreatic disorders), జఠరఛేదన (Gastric resection), ఆంత్రఛేదన (Gut resection) చికిత్సల వలన అజీర్తి (Malabsorption) కలిగి ఇనుము (iron) గ్రహించబడకపోయినా అయస్సు లోపము కలుగుతుంది. లక్షణములు :

ఇనుము లోపించి రక్తహీనత కలిగితే వారికి రక్తహీనత తీవ్రత బట్టి నీరసము, అలసట, ఆయాసము, ఒంట్లో నలతభావము, పొడచూపుతాయి. రక్తలోపము తీవ్రమయితే ఒంటిపొంగులు కలుగవచ్చును. వీరికి వింత రుచులు కలిగి మట్టి, పిళ్ళు, మంచుగడ్డలపై రుచి కలుగుతుంది. రక్తహీనత వలన వీరు వర్ణము కోల్పోయి తెల్లబడుతారు. అందువలనే రక్తహీనతకు పాండురోగము అనే పేరు ప్రశస్తి చెందింది. రక్తపరీక్షలలో వీరి ఎఱ్ఱకణముల సంఖ్య తగ్గి ఉంటుంది. రక్తములో

298 :: రక్తవర్ణకము (hemoglobin), రక్తసాంద్రత (Hematocrit)  తగ్గి

ఉంటాయి. ఎఱ్ఱరక్తకణాల పరిమాణము తగ్గుతుంది. వీరిలో లఘుకణత్వము (Microcytosis) ప్రస్ఫుటము అవుతుంది. ఎఱ్ఱకణములలో రక్తవర్ఱక ప్రమాణము తగ్గి వర్ణహీనత (hypochromia) కలుగుతుంది. రక్తములో ఇనుము విలువలు, ఫెరిటిన్ విలువలు తగ్గి ఉంటాయి. రోగుల చరిత్ర, భౌతికపరీక్షలతో బాటు మలమును అగోచర రక్తమునకు (Occult blood), పరాన్నభుక్తులకు, వాటి అండములకు (Ova and Parasites) పరీక్షించాలి. జఠరాంత్రదర్శన, (Gastroduodenoscopy) బృహదాంత్ర దర్శన (Colonoscopy) పరీక్షల వలన అన్నవాహికలోను, జఠరములోను, ఆంత్రములలోను జీర్ణవ్రణములు (peptic ulcers), కంతులు (polyps), కర్కటవ్రణములు (cancers), ఆంత్రబుద్బుదములు (diverticuli)  కనుగొనబడుతాయి. మూలకారణముల చికిత్స వీరికి అవసరము. రక్తలోపము అతి తీవ్రమైనవారికి పరరక్తదానము (Blood transfusion) అవసరము. ఇతరులకు ఇనుము లవణరూపములలో (iron salts) సరఫరా చెయ్యాలి.  ఫెఱ్ఱస్ సల్ఫేట్ ను సాధారణముగా వాడుతారు.  వాంతిభావన, కడుపులో వికారము, వాంతులు వచ్చి ఫెఱ్ఱస్ సల్ఫేట్ ను సహించలేనివారు ఫెఱ్ఱస్ గ్లుకొనేట్,  కాని ఫెఱ్ఱస్ ఫ్యుమరేట్ గాని వాడుకోవచ్చును. ఇనుముతో బాటు అధిక రక్తోత్పత్తికి అవసరమయిన ఫోలికామ్లమును కూడా వైద్యులు సరఫరా చేస్తారు. పృథుకణ రక్తహీనతలు (Macrocytic anaemias) ఫోలికామ్లము లోపము లేక విటమిన్  బి - 12 లోపముల వలన కలుగుతాయి ఫోలికామ్లపు లోపము :

గర్భిణీస్త్రీలకు,  పిల్లలకు పాలిచ్చే తల్లులకు ఫోలికామ్లపు అవసరాలు మూడింతలు పెరుగుతాయి. అందువలన వారికి ఇనుముతో బాటు ఫోలికామ్లము కూడా సరఫరా చెయ్యాలి. మద్యపానము హెచ్చయిన వారిలోను, వృద్ధులలోను, మానసిక వ్యాధిగ్రస్థులలోను, బరువు తగ్గుటకై విపరీతపు మితాహారములలో ఉన్నవారిలోను, అజీర్తి వ్యాధిగ్రస్థులలోను, ఫోలికామ్లపు లోపములు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఔషధముల (Meth:: 299 :: otrexate, Triamterene, Sulphasalazine, Barbiturates, Carbamazepine, Pyrimethamine, Metformin,) వలన ఫోలికామ్లపు లోపము కలుగవచ్చును. రక్తశుద్ధి (Hemodialysis) చికిత్స పొందే వారికి ఫోలికామ్లమును సరఫరా చెయ్యాలి. రక్తవిచ్ఛేదన రక్తహీన వ్యాధిగ్రస్థులకు ఫోలికామ్లమును అందజేయాలి.

లక్షణములు :

ఫోలికామ్లము లోపించిన వారి రక్తకణాల పరిమాణము ఎక్కువగా (పృథుకణత్వము; macrocytosis) ఉంటుంది. అలసట, నీరసము, ఎక్కువ చిరాకు, నిద్రలేమి, మానసిక కుంగుదల, మతిమఱపు కొన్ని ఫోలికామ్లలోపపు వ్యాధి లక్షణాలు. వీరి రక్తపరీక్షలలో ఫోలికామ్లపు విలువలు తక్కువగా ఉంటాయి. ఫోలికామ్లము సరఫరా చేసి లోపమును సరిదిద్దవచ్చును. ఫోలికామ్లమును కనుగొన్న శాస్త్రజ్ఞులు శ్రీ యెల్లాప్రగడ సుబ్బారావు గారు తెలుగువారే అగుట మనకు గర్వకారణము.

విటమిన్ బి -12 లోపము :

విటమిన్ బి -12 లోపించిన వారిలో కూడా   పృథుకణ రక్తహీనత కలుగుతుంది. ఇది ప్రమాదకర రక్తహీనతగా (Pernicious anaemia) పేరు గడించింది. విటమిన్ బి-12 ని బాహ్యాంశముగా (Extrinsic factor) పరిగణిస్తారు. విటమిన్ బి -12 గ్రహించుటకు అవసరమయే అంతరాంశము (Intrinsic factor) జఠరములో ఉత్పత్తి అవుతుంది. బాహ్యాంశమైన బి - 12. అంతరాంశముతో కలిసి, చిన్నప్రేవుల చివరి భాగములో (Ileum) గ్రహించబడుతుంది.

ఆహారములో బి-12 విటమిన్ లోపించిన వారిలోను, జఠరఛేదన (gastrectomy), ఆంత్రఛేదన (resection of small intestines) చికిత్సలు జరిగిన వారిలోను బి-12 లోపము కలుగుతుంది. వృద్ధులలో జఠర క్షయము (Gastric atrophy) వలన అంతరాంశము ఉత్పత్తి జరుగక బి-12 గ్రహణమునకు అవరోధము కలుగవచ్చును. స్వయంప్రహరణ రక్షణ వ్యాధి (Autoimmune disorder) వలన కూడా అంతరాంశము

300 :: ఉత్పత్తిలో లోపము కలుగవచ్చును. Diphillobothrium latum వంటి

పరాన్నభుక్తుల వలన కూడా బి- 12 లోపము వస్తుంది.

లక్షణములు :

విటమిన్ బి - 12 లోపించిన వారిలో నాడీమండల వ్యాధులు సాధారణముగా రక్తహీనత కంటె ముందుగా కనిపిస్తాయి. చేతులు, పాదములలో తిమ్మిరులు, ప్రకంపన స్పర్శ లోపము (loss of vibratory sense), స్పర్శ లోపము (loss of touch sensation), దూరనాడుల తాపములు (Peripheral neuritis), అస్థిరత్వము (Instability) బి -12 లోపము వలన రక్తహీనతకు ముందుగానే కనిపించవచ్చును.

రక్త పరీక్షతో బి -12 విలువలు తెలుసుకొని, లోపము ఉంటే విటమిన్ బి -12 ని అధికమోతాదులలో బిళ్ళలుగా గాని, సూదిమందుగా గాని యిచ్చి లోపమును నివారించవచ్చును. మౌలిక పదార్థములు ఇనుము, ఫోలికామ్లము, విటమిన్ బి-12 లోపముల వలన, మూత్రాంగ వ్యాధిగ్రస్థులలో రక్తోత్పాదిని (Erythropoietin) లోపము వలన, ఎముకలమజ్జ వ్యాధుల వలన రక్తపు ఉత్పత్తి తగ్గగలదు. కర్కట వ్రణముల వలన, శరీర రక్షణ వ్యవస్థ లోపములు (Immune deficiency)  కలవారిలోను, దీర్ఘకాల వ్యాధులు గలవారిలోను రక్తపు ఉత్పత్తి తగ్గవచ్చును. థలసీమియా (Thalassemia) జన్యుపరముగా సంక్రమించే వ్యాధి. ఈ వ్యాధిగ్రస్థులలో గ్లోబిన్ గొలుసుల ఉత్పత్తి లోపము వలన రక్తహీనత కలుగుతుంది.

రక ్తవిచ్ఛేదన రక ్తహీన వ్యాధులు ( Hemolytic anaemias ) :

జన్యుపరముగా వచ్చే విరూప రక్తకణ వ్యాధులు అయిన లవిత్రకణ రక్తహీన వ్యాధిలోను (Sickle cell anemia), వంశపారంపర్య గోళకణవ్యాధి లోను (Hereditary Spherocytosis), అసాధారణపు హీమోగ్లోబినుల (Hemoglobinopathies) వలన, రక్తకణముల ఆయువు తగ్గి అవి త్వరితముగా విచ్ఛేదించబడతాయి. శరీర రక్షణ వ్యవస్థ (Immu:: 301 :: nological system) కు స్వ (Self) పర (External) విచక్షణా లోపము కలుగుతే స్వయంప్రహరణ వ్యాధులు (Autoimmune diseases) వలన రక్తకణముల విచ్ఛేదనము విశేషముగా జరుగవచ్చును. ఆ వ్యాధులలో రక్తహీనత కలుగుతుంది. కృత్రిమ హృదయ కవాటములు ఉన్న వారిలో రక్తకణ విచ్ఛేదనము కలుగవచ్చును. గ్లూకోజ్-6 ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ లోపము ఉన్న వారిలో కొన్ని మందుల వలన,  ఫావా చిక్కుళ్ళ వలన ఎఱ్ఱకణముల ఛేదనము కలిగి రక్తహీనత కలుగవచ్చును. రక్తవిచ్ఛేదనము విశేషముగా జరిగినపుడు రక్తహీనముతో (anemia) బాటు బిలిరుబిన్ విలువలు పెరిగి పచ్చకామెరులు (jaundice) కూడా కలిగే అవకాశము ఉన్నది.

ఇచ్చట పేర్కొన్న కారణాలే గాక అనేక యితర వ్యాధుల వలన కూడా రక్తహీనత కలుగవచ్చును. ఇనుము లోపము వలన కలిగే రక్తహీనతను తఱచు చూస్తాము. వివిధ శోధన పరీక్షలు, ఎముక మజ్జ కణపరీక్షలు (Bone marrow biopsy) రక్తహీనత కలిగిన వారికి అవసరము కావచ్చును. కారణము కనుగొన్న పిదప వైద్యులు తగిన చికిత్సలు చేస్తారు.

ఆహార పదార్థా లు :

సాధారణముగా మనకు వివిధ ఆహార పదార్థాల ద్వారా మన అవసరములకు కావలసిన ఇనుము, ఫోలికామ్లము, బి 12 విటమినులు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు అవసరాలు పెరుగుట వలన, ఇనుము, ఫోలికామ్లములను మందుల రూపములో యివ్వవలసి ఉంటుంది. ఇనుము తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుళ్ళు, పప్పులు, వేరుసెనగ, గుమ్మడి విత్తులు, ఫలములు, మాంసము, చేపలు, గ్రుడ్లు ద్వారా లభ్యమవుతుంది. ఫోలికామ్లము ఆకుకూరలు, కాబేజీ, బ్రాకెలీ, చిక్కుళ్ళు, పప్పులు, నారింజ, అరటి, మిగిలిన ఫలముల ద్వారా లభ్యమవుతుంది.

302 :: విటమిన్ బి -12 పాలు, పెరుగు, వెన్న, గ్రుడ్లు, మాంసము, చేపల

ద్వారా  లభ్యమవుతుంది. పాలు వంటి పాడిపదార్థములు కూడా భుజించని సంపూర్ణ శాకాహారులు విటమిన్ బి -12 మాత్రలు వినియోగించాలి.

303 ::