స్వామీ! చంచలమైన (పద్యం)

వికీసోర్స్ నుండి

చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)

రచన: తోలేటి

గానం: ఘంటసాల

సంగీతం: ఆర్.గోవర్ధనం, ఆర్. సుదర్శనం


స్వామీ! చంచలమైన చిత్తమిదె నీ జ్ఞానాంజనా రేఖచే

నీమంబున్ గొనె నిశ్చలత్వ మొదవెన్ నిండారు నీ భక్తిచే

కామ క్రోధ విరోధ వర్గములు చీకాకై నశించెన్, భవ

ద్ధామంబౌ రజితాద్రిచేర్చ దయరాదా కాళహస్తీశ్వరా

కాళహస్తీశ్వరా... శ్రీకాళహస్తీశ్వరా...

ఆ..ఆ...ఆ..ఆ..ఆ


ఛండహుతాసు కీలికలు చయ్యన గ్రక్కుచు దండధారి మా

ర్కండునిపై మహోగ్రగతి గ్రక్కునవైచిన కాలపాశమే..

గ్రక్కునవైచిన కాలపాశమే

తుండెములై, పఠాలుమని తూలిపడెన్, నిను నమ్మువారికీ

దండనలేమి లెక్క, రజితాచలవాస మహేశా! ఈశ్వరా!...ఆ..ఆ

ధన్యుడనైతిని దేవదేవా (2)

ఎన్నడైన మరువనయ్య పాద సేవా

ఎన్నడైన మరువనయ్య నీ పాద సేవా

పాహీ శంకరా! మాం పాహీ శంకరా

మాం పాహీ శంకరా

పాహిమాం పాహీ శంకరా!