స్వాగతం స్వాగతం ఓ స్వభానూ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు


స్వాగతం స్వాగతం ఒ స్వభానూ
రావయా చల్లగా శాంతిగానూ

వేడి కాంతి కలసి ఉన్న అద్ది భానువు
వేడి లేని కాంతియన్న అది స్వభానువు
చల్లనైన తెల్లనైన కాంతి శక్తివి
నీవు చెతికంది వచ్చు శాంతి యుక్తివి

నదులు గిరులు గీతలుగా భూమియన్నది
ఆ దేవుడు చెక్కియున్న బొమ్మ యున్నది
దాని రూపు చెదరకుండ ఒ స్వభానువా
పన్తాలకు యుద్ధాలకు దారి మూయవా

అణు బాంబుల పెనుమోతల సందులందునా
చిరు కోకిల శాన్తి గీతి నీకు అందున
వేప పూవులోని తేనె జగతికందునా
ఇంటింటను మావి చిగురు నగవు చిందునా

ఇక రాజులు కాదు ప్రజలు శాంతి కోసమై
ఉద్యమించి సాగవలెను తాము ఏకమై
శాంతి కొరకె విజ్ఞానపు ఊతయంచునూ
నినదించిన సచిదనంద కరుణ మించును