స్త్రీ పునర్వివాహ సభా నాటకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్త్రీ పునర్వివాహ సభా నాటకము

ప్రథమాంకము

ప్రధమరంగము: రాజమహేంద్రవరము; వీరభద్రుడుగారి గృహము.

(వీరభద్రుడుగారు చావడిలోఁ గూర్చుండి దైవప్రార్ధనము చేయుచుండగా మిత్రుఁ డయినజన్నాధముగారు ప్రవేశించి కూరుచున్నారు,)

వీర: (చేతులుజోడించి అర్ధవిమోలిత నేత్రుఁడై)

ద్విపద.

స్త్రీపునర్వివాహ సభా నాటకము

మంచివాడుక పోయినమహిమచేత ,
నకట యాచారమె ప్రధాన మనెడువారు

ఉ . బాలవితంతు సంతతి వివాహములేక యధేష్టలీలలన్
జాలఁగ సంచరించుటను సంభవ మయ్యెడుకీడు లైనఁ దా
మేల యెరుంగలేరు ? పతిహీనలబాధలఁ జూడ వారికిన్
జాలి యొకింత పుట్టదే ? నిజంబుగ వారిని రాతిగుండెలే ?

 జగː–– గీ . భ ర్తృహీనలక యికుందఫలముగలదే  ? ,
దై వమీరితిఁ బతి లేనితరుణిమనుల
దుఃఖపడుఁడనిమూడుబంతులనువ్రాయ
దానిఁదప్పింపనెవ్వరితరము చెపుము.

వీరː–– గీ . అయ్యయో ! సర్వకారుణ్యఁ డయినయట్టి
యీశ్వరుఁడు స్త్రీల దు:ఖంబు నెనయుకొఱకె
యవనిమీఁదను సృజియించె నందుమేని
దై వదూషణమగుఁ గాదె తప్పకుండ ?.

క . కరుణానిధి యగుదైవము ,
ధరణీస్థలి దేనినై నఁ దఱుగనివెతలన్
బొరసెడుకొఱత సృజించునె ? ,
దురితం బగు నతనిమీఁద దోషము మోపన్ .

 జగː–– ఆ. సతుల కట్టిగతులు సంప్రాప్తిమగుటకుఁ,
గారణంబతండుగాకయున్న
వేఱు హేతు వేది వివరింతువో నీవు ,
వినెదఁ జెప్పవయ్య విశదమగను

వీరː–– ఆ . నిఖలసృష్టియందు సుఖపడఁగోరుట ,
సర్వజంతువులకుసహజగుణము;

                 ప్ర ధ మా ం క ము
      వరున  నీశ్వరుండు  ప్రతిజీవికిని  నిచ్చె,
      సౌఖ్యమునకు  వలయుసాధనముల.

సీ. జంతువులకు నెల్ల సకలావములు

             పటుసౌఖ్య మిడుట కె  వనికివచ్చు
    విశ్వంబు వేగంబ  తొలఁగుటకు  సృష్టి లొన
            జంతుసౌఖ్యమున  కె  సాపడును
    దుఖంబు వేగంబ తొలఁగుటకు  సుఖంబు
            చిరకాల ముంటకు సృష్టిలొన
    నెక్కడఁజూచిన నెన్నికకును  మించి
           ధునసాదనమ్ములు  గానఁబడెడుఁ 
స్త్రీవునర్వివాహ సభా నాటకము

సంతయునుజుడనందఱుననవరము, దరనుసుఖూలయియుండుట దై వమతము.

జగ;-క. జనులేల్లవారు నుఖూలయి మనవలయు నటంచు దైవమతమగు నేనిన్ మనవారిలొన నిందఱు వనితలు వెత నొందనేల వైదవ్యముచేక్.

విర;-గీ. ఉర్వజనులకుస్వాతంత్ర్యముండుకతన మనసువచ్చినగతిమంచిపనినిగాని చెడ్డపనిగ్రాని వారలు చేయగ్రలరు దానిచే వచ్చె నిక్కట్టు తరుణులకును.

క.వేదాంతు లేమిచేప్పిన మేదిని స్వాతంత్ర్య ముండు మిగులగ్ర మనకం చేదేశజనుల నడిగిన నదటఁ జెప్పదురు వార లనుబగరిమక్.

జగ;-గీ. నరులకే స్వతంత్రతయున్న దరణిలొన గొప్పయుద్యొగమును జేయగొరువారి కేల యాపని కారాదు తేలికగను మంత్రిపద మొంద నాకును మనసుగలదు.

విర;-సీ. నీకొక్కనికె గాక నఖలమానవులకు స్వాతంత్ర్యమెప్పడుఁజాలగలదు నీకు మంత్రిపదంబు నీకుండుటకుఁగూడఁ బరమస్వతంత్రుండుదరణిపతియు నదిగాక నివలె యత్నంబు చేయువా రెందఱో యాపని కుందురరయు వారలకును నుండు స్వాతంత్ర్య మిటనీదు యత్నంబు చెడునట్టులడ్డుపడగ

ప్రధమాంకము

కావున జనుండు తల పెట్టుకార్య మెల్ల గాకపొవచ్చునందు చే గట్టిగాను మనకు స్వాతంత్ర్య మొందు లే దనఁగఁదగున్ మనసె మనము స్వతంత్రుల ననుచుఁజాట.

జగ;-గీ. భువిని జనులు యుక్తాయు క్తములను దెలిసి తగవు నడపంగను స్వతంత్రు లగుచునుండ నాది నుండీ పునర్వివాహ మతివలకు లొకమందెల్ల నేటికి లేకపొయె.

విర;-సీ.కూపకూర్మముమాడ్కి ఁగుర్చుండియెకచొట జగమెల్ల హిందు దేశంబె యముచు దలఁచియుందువునివుకలనంనై దూఖుడములుగ బాగింఁబడియండుఁ బ్రస్తుతమున నట్టిఖండంబులయందు నొక్కటియ్తేన యాసియాఖండంబునందు నున్న దేశ ములఁబదియాఱింటఁదెలిసిచూడ హిందు దేశంబునొక్కటౌనింతెనుమ్ము స్త్రిలకుఁబునర్వివివాహంబుచేయనట్టి యిట్టియచారమిటఁదక్కనెందు లేదు

సీ.ఈదేశమున స్తెత మితరమతస్దూలౌ హూణ మహమ్మది యులప్రశంప యటు లుంచినను గొల్ల లాదిగాఁగలహిందు జనులలొ పలఁగూడ వనితలకును

               స్త్రి వునర్వివహా సబా నాటకము
    మాఱు పెండిలి చేయుమంచియాచారబు
              పెంపొంది యున్నది తెంపులేక
   పెద్దపట్టణముల ద్విజు లెక్కువగ నున్న
               సంఖ్యయందును  హినజాతివారె
   మిగుల హెచ్చుగ  నుందు దేశ మందు
   ద్విజులలొ ఁగూడ మనహిందు దేశ మందు
   యువతులకును  బూర్వము పుణ్యయుగములందుఁ
  బరిణయము గ్రమ్మఱను జేయబడుచునుండె.
ఒయి ఈయుక్క
పథమాంకము
చరణములు

    ౧. దురహంకృతి నెవ్వరు బొంకులకున్
          జొరకుండఁగ నీవరచాతురిచే ౼౼ కరుణింపుము
    ౨.జనసంఘపుమేలునకై నరులె
          ల్లను దిన్ననిత్రోవను బూనఁగ వే ౼౼ కరుణింపుము
    ౩. ఇదిసత్పథ మియ్యదిదుష్పధమం
          చెదనెల్లరు నొప్పిదముగొనఁగా ౼౼ కరణింపుము
    ౪. అనుమానము నల్లను మాని సతం
          బును సత్యము నోర్పునఁగై కొనగా ౼౼ కరణింపుము
    ౫. గతిగానక దుస్ధ్సితిఁ గుందెడియా
          పతిహీనల సంతత వత్సలత౯ ౼౼ కరుణింపుము

    జగ: ౼౼ భోజనమునకు ప్రొద్దెక్కుచున్నది. నేనిప్పుడు సెలవు
పుచ్చుకొందునా?

    వీర ౼౼ మంచిది. గౌరీనాధముగారు మిత్రులతోఁగూడ నేటిమ
ధ్యాహ్నము మాయింటికి వచ్చెద మన్నారు. వారియిల్లు మీయింటికి
వెళ్ళెడిత్రోవలోనేగనుక, సాధ్యమయినంతశీఘ్రముగా రమ్మని మనవిచేసి
మఱివెళ్లుము.

   జగ: ౼౼ మంచిది ముందుగా వెళ్ళువప్పుడే ఆయనతోఁ జెప్పి
ముఖ్యముగాఁ బంపెదను. (అని యిద్దఱువెళ్ళుచున్నారు.)