సూచిక చర్చ:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/పిడిఎఫ్ పేజీ 50 గూగుల్ OCR ఫలితం 2016-04-18న

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

________________

ప్రదర్శన ఆనాటి స్థితిగతులను కళ్ళకు కట్టించి చూపించింది.
o ప్రదర్శనతో పాటు మారిషస్ ఆంధ్ర పడుచుల తెలుగు వంటకారిపై ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి తెలుగు వంటకాలైన గారెలు"బూరెలు మొదలైనవి ప్రదర్శనలో ఉంచారు. తెలుగు వంటకాలు తయారు చేయు విధానం వివరించే ఇంగ్లీషులో చక్కటి పుస్తకాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు, తెలుగు విశ్వ విద్యాలయం వారు తరతరాల తెలుగు జాతి ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.
మారిషస్లోని తెలుగు ఉపాధ్యాయులు తెలుగు భోధనపై ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. విజయవాడకు చెందిన అశోకా బుక్ సెంటర్ యజమాని శ్రీ అశోక్ కుమార్ పుస్తక, విక్రయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మారిషస్ ఆంద్రులు ఈ ప్రదర్శనలోని పుస్తకాలూ, బొమ్మలూ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. సదసు్సలు
ప్రారంభసభ ముగిసిన పిమ్మలు మధ్యాహ్నం 2 గంటఎరికు సదస్సులు ప్రారంభమైనాయి. సంస్కృతి-సమాజంపై జరిగిన సదస్సుకు శ్రీమతి ఎనృసింహులు ఆనందన్ అధ్యక్షత వహించారు.
సంస్కృతి-సమాజ సంబంధాలు " గురించి తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్తారు డా శివరామమూర్తి, "మారిషస్కు తెలుగువారి వలస-స్థిరపడటం" గురించి శ్రీమతి ఎస్.ఎన్గయిన్ కుమారిపి.గోపాలు( మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్) దక్షిణాఫ్రికాలో తెలుగువారి సేవలు'అనే అంశం గురించి శ్రీ వి.కె.నాయుప్రసంగించారు.
మారిషస్కు తరలి వచ్చిన తెలుగువారు తమ మాతృభాష, సంప్రదాయ పరిరక్షణకు చేసిన కృషి, సముద్రతీరాన ఇసుక తిన్నెలో తెలుగు అక్షరాలు వ్రాసి తమ పిల్లలకు నేర్పిన విధానం, పూజా పునస్కారాల విధులు తెలియనప్పటికీ ఆచార వ్యవహారాలను కాపాడుకున్నరీతులు, రామభజనం, సింహాద్రి అప్పన్న పూజ, అమ్మోరు పండుగల ద్వారా తమ పూర్వీకుల సంస్కృతీ సంప్రదాయాలు కాపాడిన విధానం సదస్సులో పలువురు వక్తలు తమ ప్రసంగాలలో ప్రస్తావించారు.
సదస్సులో దక్షిణాఫ్రికా ప్రతినిధులు ఉత్సాహంతో పాల్గొన్నారు. వారంతా ఒక మిలటరీ డిసిప్లిన్ పాటిస్తున్నట్టు కన్పించేవారు. హెబాటల్లో కూడా వారెంతో క్రమశిక్షణతో కలసికట్టుగా తమ బృందపు నాయకుడి ఆదేశానుసారం నడుచుకునేవారు. అందరూ సూట్లు ధరించి "ఓం' అని వ్రాసిన దక్షిణాఫ్రికా ఆంధ్రమహాసభ ఎంబైమ్ ముద్రించిన ఫైలు కట్టుకుని తిరిగేవారు. మా కెవరికైనా వారు ఎదురైతే రెండు
41