Jump to content

సులక్షణసారము/లక్షణసారసంగ్రహము అను సులక్షణసారము

వికీసోర్స్ నుండి

లక్షణసారసంగ్రహము

అను

(సులక్షణసారము)

క.

శ్రీ వనితాసమ భూతన
యా వక్షోజార్ద్రకుంకుమాంకిత వక్షున్‌
బావనతర చారిత్రుని
సేవించెదఁ జదలువాడ శ్రీరఘురామున్‌.

1


సీ.

శ్రీ వైష్ణవహితుండఁ, జిక్కయభట్టరు
                       శిష్యుఁడఁ, గవితావిశేష శేష
తులితసర్వార్యుపౌత్రుఁడ, లక్ష్మణయకుఁ ది
                       మ్మాంబకు సుతుఁడ, వీరనకు మార
నకు రామకవివర్యునకు ననుజన్ముఁడ,
                       నా రామకవి చెప్పినట్టి మహిత
మత్స్యపురాణ వామనపురాణాది స
                       త్కవితలకెల్ల లేఖకుఁడ వృద్ధ


గీ.

కుంఠికాతీరలింగమగుంటనామ
పట్టణస్థితికుండ సౌభాగ్యయుతుఁడ
నాదిశాఖాప్రవర్తన నమరువాఁడఁ
గాశ్యపసగోత్రుఁడను దిమ్మకవిని నేను.

2


క.

లక్షణశాస్త్రములెల్లఁ బ
రీక్షించుటఁ గొంతకొంత యెఱిఁగినవాఁడన్‌
లాక్షణికానుగ్రహత సు
లక్షణసారం బొనర్తు లక్ష్యము లమరన్‌.

3


తే.

కొంద ఱెంచు లక్షణములు కొంద ఱెంచ
రందఱును నెంచినవి కొన్ని యవియు నవియు
దొరయఁగాఁ గూర్చి కవిసమ్మతులను వ్రాయు
దొకటికొక్కటి సంస్కృతాంధ్రోక్తు లెనయ.

4

తే.

“గ్రంథసామగ్రి గలుగుటఁ బ్రతిపదమున
కన్ని లక్షణములు వ్రాయుఁ” డనిన నందు
గ్రంథవిస్తార మగుఁ గానఁ గవిత సూక్ష్మ
మెన్నిటను బొందుపడు నన్నియే రచింతు.

5

1. అవతారిక

సాహిత్యరత్నాకరే—


శ్లో.

ఛందోజ్ఞానమిదం పురాత్రిణయనాల్లేభే శుభం నందిరాట్
తస్మాత్ప్రాప సనత్కుమారక? స్తతోఽగస్త్యస్తతో వాక్పతి
తస్మాద్దేవపతిస్తతః ఫణిపతి స్తస్యానుజః పింగళ
స్తచ్ఛిష్యైర్మునిభిర్మహాత్మభిరిదం భూమౌ ప్రతిష్ఠాపితమ్.

6[1]


ఆంధ్రభాషాయామ్ అథర్వణఛందసే—


ఆ.

ఇందుమౌళివలన నందిగాంచిన ఛంద
మెలమిఁ జదివి రొకరివలన నొకరు
లలి సనత్కుమార కలశజ జీవ వృ
త్రారి శేష పింగళాఖ్యు లోలి.

7[2]


అథాధావసే (?)—


క.

గంగాధర విపులకృపా
పాంగ సుధాహరుని నిద్ధపావనదేహున్
పింగళనాగేంద్రుని ముని
పుంగవసన్నుతుని సుకవిపూజ్యునిఁ దలఁతున్.

8

2. గణసంఖ్యా

కవికంఠపాశే—


శ్లో.

తతోమ్యారస్తభ జ్నాభ్యాగణాస్సు(స్తేసు)ప్రకీర్తితాః

9

కవిరాజగజాంకుశే—


క.

ఒనరఁగ మ,య,ర,స,త, భ,జ,న
లన నివి యెనిమిది గణంబులని సత్కృపతో
నెనసిన మతిఁ బింగళునకు
మనసిజ(తను)మథనుఁ డాగమంబులఁ దెలిపెన్‌.

10[3]

3.గణోత్పత్తి

చమత్కారచంద్రికాయామ్—


శ్లో.

మయరసతభజన సంజ్ఞాః ప్రసూతాః

11


ఆంధ్రభాషాయామ్—ఉత్తమగండ ఛందసి—


ఆ.

చంద్రసూర్యవహ్ని చక్షుఁడౌ రుద్రుని
మూఁడుకన్నులందు మూఁడుగురువు
లుదయమయ్యె దాన నొప్పారె మగణంబు
అందు సప్తగణము లవతరించె.

12[4]


కావ్యచింతామణి—తాతంభట్టు—


క.

మగణమువలనన్‌ యగణము
యగణమువలనన్‌ జనించె నా రగణమ్మా
రగణమువలనన్‌ సగణము
సగణంబునను తగణంబు జననంబయ్యెన్‌.

13[5]


క.

తావలన జగణ మయ్యెన్‌
జావలనన్ భగణమయ్యె ఛందోగతి నా
భావలన నగణ మయ్యెను
భావింపఁగ జనకజన్యభావము గాఁగన్‌.

14[6]

క.

అది గాన తల్లిదండ్రుల
కొదువదు వైరమ్మటంచు నొనరఁగ సుకవుల్‌
కొదుకక బంధుగణంబుల
గదియంతురు రసలుదక్కఁ గావ్యముఖములన్‌.

15[7]


కవిసర్పగారుడే—


సీ.

జయవిజయంబులు శంఖమహా
                       శంఖము లనంగఁ బగటిజా ల్వెలయుచుండు
రాత్రి జిత్రామయై రామసుప్తప్రసు
                       ప్తంబులు ననియునుం బరగుచుండు
నీ యెనిమిది జాలఁ బాయక మగణాది
                       గా జనించె గణాష్టకంబు వరుస
నేజామునను గావ్యుఁ డెలమి గబ్బంబును
                       విదళింపఁబూను నవ్వేళయందు


తే.

నుద్భవంబైనగణము ప్రయోగమునకు
శుద్ధిగాఁ గూర్ప కురక విజ్జోడుపడఁగ
గణము లూహించి కూర్చు వికారికుకవి
పద్య మొల్లఁడు బ్రతుకాశపడఁడు వాఁడు.

16[8]

4. గణానాం గురులఘుసంజ్ఞా

వృత్తరత్నాకరే—


ఆదిమధ్యావసానేషు యరతా యాంతి లాఘవమ్
భజసాం గౌరవంయాంతి మనౌతు గురులాఘవమ్.

17[9]


ఆంధ్రభాషాయాం-గోకర్ణచ్ఛందసి—

క.

మొదల నడుమఁ దుదిఁ లఘువులు
వదలవు యరతలకు, వానివరుసనె భజసల్
విదితంబులు గురువులు తా
మొదలనడుమ మసలకెసఁగు మొగి గురులఘువుల్.

18


విన్నకోట పెద్దిరాజు—


క.

గురులఘువులు గలమగు; లఘు
గురులు, గురులఘువులు నెన్నికొన నహములగున్
గురులఘువులు త్రితయములై
మురువునవి మగణ నగణము లనగఁ బరగున్.

19[10]


ఆ.

మగణరచన నాది మధ్యాంతలఘువులు
గలిగెనేని యరత గణములయ్యె
నగణరచన మొదల నడుమను మఱి గుర్వు
లుండెనేని భ జ స లొప్పుమిగులు.

20[11]

5. ఫలితార్థము

క.

గల గురులఘువులవియె మ
నలకు తటభయల కాది నడుమచేర బకా
వలన తలకు కడముఖముల
నిల హపలకు నిల్పు గణములన్నియు రామా!

21[12]


గణాలు కల్పించే విధము—
గ ఇది గురువు. ఇవి రెండైతే గా గణం.
ల ఇవి రెండైతే లలం.
వగణం ।U. ఇది లగ మనిపించికొనును. హగణం U। ఇదె గల మనిపించికొనును.

ఇంక ప్రధానగణాలకు—
మగణం UUU
యగణం ।UU
రగణం U।U
తగణం UU।
జగణం ।U।
భగణం U।।
సగణం ।।U
నగణం ।।।

6. ఇంక అక్కరజాతులకు వచ్చేగణాలకు ప్రస్తారము

అనంత ఛందస్సు—


క.

చాలుగను స్వరగురులిడి
లాలితముగ గురువుక్రింద లఘువు వెలుపలన్
ఓలి సమంబును దాపలి
వ్రాలునకు గురువుల నిలుపఁ బ్రస్తారమగున్.

22[13]


క.

ద్విత్రి చతుర్గురు భవముల
ధాత్రీధవ! రెండుదక్క తక్కినగణముల్
మిత్రేంద్రచంద్రు లనఁదగు
మాత్రాదిగణంబు మొదలమాత్ర నిలుపగన్.

23[14]


ఇందుకు టీక[15] (—)
ఇందుకు పద్యము——


క.

గల, నగణము లినుఁడింద్రుఁడు
నల,నగ,సల,భర,త; లింక నగగ,సవ,సలా
భల,భగురు,మలఘు,సవ,సహ
తల,రల,నవ,నలల,రగురు, తగ నిందుఁ డజా!

24[16]

సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు.[17]


వీనికి నుదాహరణములు——


సీ.

కమలనాభానగఁ గంబు; కమరరూప
                       ననా, మనురాంతకనాఁగసలల
మద్రిధరభలంబు, భద్రయశాయన్న
                       భగురు, వంభోజాక్ష మగణలఘువు
భువనేశ్వరాయన్నసవ, మఘవిద్వంస
                       సహము, పీతాంబరసంజ్ఞ తలము,
కైటభారి రలంబు; గజవరదా యన్న
                       నవ, మహిశయననా నలలమయ్యె


ఆ.

రగణగురువు దేవరాజాయనంగఁ బ
ద్మాపతీ యనంగ దగణగురువు,
నరహరీ యనంగ నరహరి నరసింహ
నాఁగ నొప్పు నగము నలము సలము.

25[18]

7. మగణాది గణలక్షణాలు

మగణస్య

వాదాంగచూడామణి—


చ.

పరగ ధరాధిదైవతము, పచ్చనికాంతియు శూద్రజాతియున్
నరయ బుధుండు తద్గ్రహము, హాటకవర్ణ మతండు, తత్ఫలం
బురుశుభ, మెన్నగా హరిణయోనియు, వృశ్చికరాశి, నిర్జరే
శ్వర వరతారదైత్యగణ సంగతమున్ మగణంబు శంకరా!

26[19]

కవిసర్పగారుడే—


మ.

ధర దైవంబు గ్రహంబు సౌమ్యుఁడు హరిద్వర్గంబు దత్కాంతియా
సుర మూహింప గణంబు జాతి దలపించున్ శౌద్రియా యోనిదా
హరిణం బుజ్జ్వలతార జ్యేష్ఠరస ముద్యద్రౌద్రమారాశి తే
లు భద్రంబు ఫలంబు నామగణ మింపొందున్ బుధస్తుత్యమై.

27[20]


ఉత్తమగంఢ ఛందసి—


క.

దరణిజ శశిరవి బుధగురు
సురరిపు గురుమందఫణులు సొరిది గ్రహంబుల్
పొరి మ భ జ స న య ర త గణ
సరణికి ఛందోమతంబు చర్చింపంగన్.

28[21]


గోకర్ణఛందసి—


గీ.

కాశ్యపాత్రిపైశ్యకౌశికగౌతమ
యల వసిష్ఠభార్గవాంగిరసులు
మహితగోత్రఋషులు మ య ర స త భ జ న
తిట్లు నెనిమిదిగణముల కెన్నఁబడును.

29[22]


టీక.

ఫలం భద్రం, రాశి వృశ్చికం, హరిణ యోని, హరి ద్వర్ణం,
జ్యేష్ఠా నక్షత్రం, గ్రహం బుధుం డితఁడు సువర్ణఛాయ,
శూద్ర జాతి, రౌద్ర రసం, దైత్య గణం, అధిదేవత భూమి,

కాశ్యపస గోత్రం, జననం జయనామ యామలో మొదటిజామున. భీమన మతం గ్రహం కుజుఁ డన్నాఁడు. అంటే నేమి? ‘బహునా మనుగ్రహార్యాయ’ ప్రమాణమని యెరింగితి.


ప్రయోగసరణికి గణయోగఫలాలు


చమత్కారచంద్రికాయాం—


శ్లో.

క్షేమంసర్వగురుర్దత్తే మగణోభూమి దైవతః

30[23]


సాహిత్యచంద్రోదయే—


శ్లో.

సౌమ్యోపి మగణః క్రూరః క్రూరమ్ గణ ముపాశ్రితః
క్రూరగ్రహ సమాయుక్త శ్శత్రుదేశే బుధోయథా
నరపతిః బుధః పాపయుతః పాపీక్షీణచంద్రోఽన్యధామతః.

31[24]


శ్రీధరఛందసి—


క.

మగణం బెప్పుడు శుభకర
మగు, నైనను గ్రూరగణము నది డాసినచో
దెగి చంపు, బుధుఁడు క్రూరుం
డగుగ్రహమును గదిసి క్రూరుఁడై చనుమాడ్కిన్.

32[25]


అలంకారచూడామణి—


శ్లో.

కర్తుః కారయితుశ్చైన మగణోబుధకర్తృకః
సగణేన సమాయుక్త సర్వకాలఫలప్రదః.

33[26]

కవిరాజగజాంకుశే—


క.

మగణంబు పద్యముఖమున
సగణముతోఁ గూర్చి చెప్పజనుఁ గృతి యెందున్
దగఁ బద్యమందుఁ గర్తకు
నగణితముగ నర్థసిద్ధులగు సత్యముగన్.

34[27]


కావ్యచింతామణి-తాతంబట్లు—


క.

జగతిన్ గణములకెల్లను
మగణము కారణముగాన మగణము గదియ
న్నిగురించు గణము లెల్లను
దగ శుభ మొనరించు సెడు తగులదు దానన్.

35[28]


ఉత్తమగండఛందసి—


క.

రసలం జెప్పిన శుభమగు
జసలం జెప్పినను జయము సయ్యన వచ్చున్
నసలం జెప్పిన మేలగు
మసలం జెప్పిననుఁ గర్పమండల మేలున్.

36[29]


మగణ, సగణ ప్రయోగస్య లక్షణం—


రఘువంశే కాళిదాసోక్తం—


‘వాగర్థావివసం పృక్తౌ’ ఇతి

37[30]

ఆదిపర్వాణ్యాదౌ శబ్దశాసనేనోక్తం—


‘శ్రీవాణీగిరిజాశ్చిరాయదధత’ ఇతి

38[31]


ఏవం మగణ లక్షణం

2. అధ యగణస్య

వాదాంగచూడామణి—


చ.

జల మధిదైవమున్ రజితసన్నిభకాంతి కులంబు విప్రుఁడున్
ఫలము ధనంబు తద్గ్రహము భార్గవుఁ డాతనివర్ణ మెన్నఁగా
దెలుపు జలంబు ధారకము తెల్లముగా ధనురాశి యోనియున్
బలుముఖ మగ్గణంబునునౌ యగణంబు కీశ్వరా!

39[32]


కవిసర్పగారుడే—


మ.

అలరన్ దైవము వారి బ్రాహ్మ్యము కులంబా వన్నె తె ల్పర్థమా
ఫలమా, యోని ప్లవంగ మాగణము చెప్పన్ వానరం బాగ్రహం
బలశుక్రుండు రసంబు దాఁ గరుణ పూర్వాషాఢ నక్షత్ర మి
మ్ములఁ గోదండము రాశినా యగణ మొప్పున్ గోవిదస్తుత్యమై.

40[33]


టీక.

ఉదక మధిదేవత, వర్ణం తెలుపు, కులం బ్రాహ్మం, ఫలం
ధనం, గ్రహం శుక్రుడు, నక్షత్రం పూర్వాషాఢ, ధనూ రాశి,
వానర యోని, మనుష్య యోని, కరుణ రసం, అగ్ని వైశ్య
గోత్రం, జననం విజయనామయామం రెండో జామున.


ఆదిప్రయోగసరణి—


చమత్కారచంద్రికాయాం—


కరోత్యర్థానాదిలఘు ర్యగణోవారి దైవతమ్.

41[34]

సాహిత్యరత్నాకరే—


ప్రకృత్యాయగణోనిత్యం శ్రీకరః కధ్యతే బుధైః
సఏవ వికృతిం యాతి సగణోనుగతో యది.

42[35]


ఆంధ్రభాషాయాం-
గోకర్ణఛందసి—


క.

సయలం జెప్పిన శుభ మగు
జయలం జెప్పినను బతికి జయకీర్తులగున్
రయలం జెప్పిన నెంతయుఁ
బ్రియ మగు మఱి మయలఁ జెప్ప బెంపొనరించున్.

43[36]


ఉత్తమగండ ఛందసి—


క.

సభఁ జెప్పిన విభవంబగు
రభసంబునఁ జెప్ప చేటు రయలం జెప్పన్
శుభమగు నయలం జెప్పిన
నుభయము వర్ధిల్లునందు రుత్తమగండా!

44[37]

3. శ్రీరగణస్య

వాదాంగచూడామణి—


చ.

జ్వలనుఁ డధీనుఁ డాకులము క్షత్రియ మప్పవడంబుకాంతి పెం
పలర గ్రహంబు భూతనయుఁ డాతఁడ రక్తపువన్నె పానకా
ఖ్యలలితతార దైత్యగణ మయ్యజయోనియు మేషరాశి యా
ఫలము భయప్రదంబు రగణంబునకున్ ద్రిదశేంద్రవందితా!

45[38]

కవిసర్పగారుడే—


మ.

అనలుం డీశుఁడు రాశి మేషము గ్రహం బా భౌముఁ డాతారర సం
ప్రణతిన్‌ గృత్తిక దైత్యమాగణము వై రాజ్యంబు వశంబు మేఁ
కనెఱి న్యోని ఫలము భీరసము శృంగారంబు తత్కాంతికో
కనదచ్ఛ చ్ఛవి మించు నా రగణ మేకాలంబు నొప్పున్‌ భువిన్‌.

46[39]


టీక.

అగ్ని అధిదేవత, క్షత్రియకులం, కాంతి యెఱుపు, గ్రహ మంగారకుఁడు, అతనివన్నె యెఱుపు, నక్షత్రం కృత్తిక, రాక్షసగణం, మేషరాశి, ఫలం భీతి, శృంగారరసం, కౌశికసగోత్రం, జననం డంఖరామయామం మూఁడవది.


భీమన్న మతాలు – శనిగ్రహ మన్నారు. అందుకు పరిహారం ముందే వ్రాసినది.


ఆదిప్రయోగసరణి
సాహిత్యరత్నాకరే—


రోగ్నిమధ్యలఘు వృత్తి (?) భేతి.

47


చమత్కారచంద్రికాయాం—


భీతిదాయీ మధ్యలఘూ రగణోవహ్ని దైవత ఇతి. ఇదం సత్యం. గణ
యోగవిశాషాని చాది పరిగ్రహస్య శ్రీకరమిత శాస్త్రం

48[40]


టీక.

గ్రహాలున్ను, అధిదేవతలున్ను మిత్రత్వం, గణాలుం గూడి
నపుడు రగణం మంచిది. ఎటువలెనంటె -


సాహిత్యచంద్రోదయే—


రగణ శ్శ్రీకరః పుంసాంయగణానుగతోయది
గద్యపద్యప్రబంధాదౌతత్రోదాహరణం కృతిః

49[41]

ఆంధ్రభాషాయామ్-
శ్రీధర ఛందసి—


క.

పొగడందు పద్యముఖమున
రగణము యగణంబు గూడి రాగిల్లిన నీ
జగమంతయు నేలెడివాఁ
డగుఁ గృతిపతి విభవయుక్తుఁ డగుఁ గవివరుఁడున్.

50[42]


రగణ సగణ యోగఫలవిశేషం


సాహిత్యచంద్రోదయే—


అనలానిలసంయోగం కరోతి విభుమందిరే
మహానలభయం తత్రభీమ జ్వాలా సమాకులమ్.

51[43]


కవికంఠపాశే—


మారుత పూర్వే వహ్నౌవహ్ని
భయం శుభోయుతోన్యేషామ్.

52[44]


ఆంధ్రభాషాయామ్-
అసిధర్వణఛంద—


క.

అనలానిలసంయోగం
బనుపమకీలాకరాళ మగు వహ్నిభయం
బొనరించుఁ గర్తృగృహమున
ననుమానము లేదు దీన నండ్రు గవీంద్రుల్.

53[45]

4. శ్రీసగణస్య

వాదాంగచూడామణి—


చ.

అనిలుఁ డధీశుఁడున్‌ గువలయం బది కాంతి కులంబు హీనమున్‌
జను గ్రహమా శనైశ్చరుఁడు చాలఁగ నల్పగు నెన్న తౌల యౌఁ
దనరఁగ రాశి స్వాతి యగుఁ దార ఫలంబు క్షయంబు దానవం
బొనర గణంబు నామహిషయోని యగున్‌ సగణాన కీశ్వరా!

54[46]


కవిసర్పగారుడే—


మ.

అనిలుం డీశుఁడు స్వాతి తార రుచిశ్వేతాభావ మెన్నన్ గ్రహం
బినజుండౌ తులరాశి హైన్యముకులం బేసారక్షీణంబు దా
మును లబ్ధంబు భయంబు తద్రసము, కార్పోతెమ్మయిన్ యోని యొం
దును దైన్యంబు గణంబు నాసగణ మెందున్ గీర్తిప్రాచుర్యమై.

55[47]


టీక.

అధిపతి వాయువు, స్వాతినక్షత్రం, ఛాయ నల్పు, గ్రహం శని, హీనకులం, క్షీణఫలం, భయరసం, మహిషయోని, రాక్షసగణం, గౌతమసగోత్రం, జననం హశంఖనామయామం నాల్గవది.


భీమనమతం – బుధుఁ డన్నాఁడు. అందుకు పరిహారం మునుపె వ్రాసినది.


ఆదిప్రయోగ ఫలవిశేషమ్—


సాహిత్యరత్నాకరమ్—


‘వాయుగణే శ్రమ’ ఇతి.

56[48]

సాహిత్యచంద్రోదయే—


దేశభ్రమం సోప్యగురితి ఏవమస్తు (?)

57


అయితే నేమిగణకూటవిశేషం అరయదగును.


లక్షణాదినికాయమ్—


సర్వదా నిత్యస్సగణస్సుయోగినాది (?)
కధమ్ శ్రేయఃకరిష్యతీతి.

58


సాహిత్యచంద్రోదయే—


సగణస్సర్వసౌభాగ్యదాయక స్సర్వతధా

59


కవిరాక్షసే—


అనంతపదవిన్యాస చాతుర్యసరసం కవేః
బుధోయది సమీపస్థోన దుర్జన(స్స)పురోయతి.

60[49]


కవిసర్పగారుడే—


గీ.

సగణమగణములు పొసంగిన విభవంబు
రసగణంబు లెనయ ప్రబలు గీడు
రగణయగణయుతము రాజ్యప్రదంబగు
భయము లిరువురకును భయమువిడును.

61[50]


సాహిత్యచంద్రోదయమున—


సౌమ్యగ్రహాధిష్ఠితత్యాత్సగణ శ్శుభదాయకః
మిత్రామిత్రగణైస్సార్థం సౌరిశ్శుభఫలప్రదః
శుభగ్రహౌసితేందెజ్యౌ పాపామందార భాస్కరాః
బుధౌవాసంయుతే పాపిక్షీణ చంద్రస్సదా శుభః ఇతి.

62[51]

ఛప్పన్నే—


సగణం కానిదయితేనేమి గురశుక్రగ్రహవృద్ధగణాలు సమీపాన నున్నను వెనుక గుజగ్రహాధిష్ఠితగణం లేకున్నా మంచిదని ఎరిగేది.

63[52]


ఆంధ్రభాషాయాం-


అథర్వణఛందసి—


క.

మునుకొని పద్యముఖంబున
ననిలగణం బిడ్డనాయురారోగ్యంబుల్
గొనసాగు దాని ముందట
ననలగణంబడినఁబతికి నలజడి సేయున్.

64[53]


ఇందుకు చెల్లుబడియున్నది.


సాహిత్యచంద్రోదయే—


సగణచ్ఛందసి జ్ఞేయోరగణస్య పురస్థితోయదితి

65[54]


అత్రోదాహరణమ్ – సార్వభౌమకవి—


అనలంబస్యహేరంబమితోత్సాహ.

66[55]


వృత్తరత్నాకరే-కేదారకవిః—


సుఖసంతాన సిద్ధ్యర్థమిత్యాహ.

67[56]

5. తగణస్య

వాదాంగచూడామణౌ—


చ.

నెఱయ నభంబు దైవ మతినీలము కాంతియు విప్రజాతి గీ
ర్వరుఁడు గ్రహంబుఁ గాంచనము వర్ణ మతండు ఫలంబు చెప్ప నై
శ్వర్యము తార పుష్యమియు వాలిన కర్కటరాశి మేషమౌ
నిరవగుయోని దేవగణ మీతగణంబున కిందుశేఖరా!

68[57]

కవిసర్పగారుడే—


మ.

అమరన్ మిన్నధిదైవ మక్కులము బ్రాహ్మం బాగణం బెన్న దై
వము జీవుండు గ్రహంబు నల్పురుచి యైశ్వర్యంబు లబ్ధంబు మే
షము దాయోని రసంబు శాంత మల నక్షత్రంబు పుష్యంబు రా
శి మహిన్ గర్కటకంబు నాఁ దగణ ముత్సేకంబగున్ జెల్వమై.

69[58]


భీమన—


క.

మగణంబు శూద్రకులజుఁడు
భగణం బైశ్వర్యరాశి, బ్రాహ్మణజాతుల్
నగణము, తగణము, యగణము
జగణము నృపజాతి యంత్యజులు రసగణముల్.

70[59]


వ.

అధిదేవత ఆకాశం, నీలవర్ణం, బ్రాహ్మణజాతి, గ్రహం బృహస్పతి, అతండు కాంచనవర్ణం, ఫలమైశ్వర్యం, పుష్యమీనక్షత్రం, కర్కటరాశి, మేషయోని, దేవగణం, శాంతరసం, వసిష్ఠగోత్రం, జననం రామనాడు ఏడవజాము.
భీమన గ్రహం రాహుఁ డన్నాడు. పరిహరంబు మునుపె వ్రాసినది.

71


ప్రయోగసరణి—


సాహిత్యరత్నాకరే—


తో హృ (?) రంత్యలఘు సుఖముఖమితి (?)

72


అలంకారచూడామణి—


గగనేశూన్యమితి.

73


కవికంఠపాశే—


వ్యోమశూన్యం హి (?) తనుత యితి

74

ఆంధ్రభాషవలన విశేషం గలదు.

75[60]


సాహిత్యరత్నాకరే—


నిత్యం భగణ సాన్నిధ్యాత్యర్వాభీష్టఫలవ్రతః
కర్తుః కారయితాశ్చైవ తగణోవ్యోమదేవతః

76[61]


ఇత్యత్రోదాహరణం


అమరుక కావ్యే—


జ్యాకృష్ణబద్ధ కటకాముఖపాణి పద్మమితి

77[62]


ఆంధ్రభాషాయామ్


ఉత్తమగండఛందసి—


క.

తగణము తొల్తఁ బిమ్మట
భగణము గదియంగ నిల్పి పద్యము హృద్యం
బుగ రచియించినఁ గర్తకు
నగణితముగ నొదవు నాయురైశ్వర్యంబుల్.

78[63]


వ.

ఇటువలె శుభగ్రహం కూడినను తనగుణం విడువనేరదని కొందరన్నారు.

79


కవితనయకర్తృకత్వాత్ ప్రకృత్యా (?) హాని దస్తగణః
యధాపలాండుః శ్రీగంధయోగేనకిం సుగంధోభవతి ఇతి.
శ్రీగంధంతోగూడినా వుల్లి కూడినా తన మునుపటిగుణం విడువనేరదు అనుట.

80


అంటేనేమి – తగణానికి అధిదేవత గగనం ఆగగనం నిత్యవిభువు; గాన తగణం మంచిది.

81

గీ.

లలితముగ మంచిదని భువి వెలసినట్లు
గణములకు లక్ష్యముల వెల్లగాని వనిన
తగణజగణంబులకు వ్రాసెదను మహాక
వీంద్రయోగలక్ష్యంబులు వెతకినేను.

82


చమత్కారచంద్రికా—


ఈశత్వమంత్యమ లఘుస్తగణోవ్యోమదైతః

83[64]


సాహిత్యచంద్రోదయే—


తగణస్సర్వసౌభాగ్యదోయక స్సర్వదాభవేత్.

84[65]


తాతంభట్లు—


క.

తగణంబున కధిదేవత
గగనం బది శూన్య మనుచు గాదని పల్కన్
జదగ దది, మిక్కిలి మంచిది
గగనం బిది నిత్యవిభువు గావున, దెలియన్.

85[66]


ద్వితీయస్కంధే—


ఉ.

సర్వఫలప్రవాతయును, సర్వశరణ్యుఁడు, సర్వశక్తియున్
సర్వజగత్ప్రసిద్ధుఁడును, సర్వగుణాఢ్యుఁడునైన చక్రి యీ
సర్వశరీరు లుర్విగతసంజ్ఞలఁ జెంది విశీర్ణమానులై
పర్వడుచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడు.

86


వ.

మరిన్నీ


నానాలంకారేషు—

87


పదవాక్యప్రమాణజ్ఞైర్మహాకవిభిస్తద్గ్రంథాదౌ.

88

తగణశ్శుభమత ఇత్యంగీ కృతోభవేత్. ఇం
శబ్దశాస్త్రవాక్యం, మీమాంసప్రమాణం, తర్కశాస్త్రం
ఈమూడుతెరగుల వారిచేత – సమర్థులైనవారిచేత ననుట.

89


ఉదాహరణాని వక్ష్యామి


కుమారసంభవే—


అస్త్యుత్తరస్యాం దిశీతి – కాళిదాసవచనం

90[67]


తర్కభాషాయామ్—


బాలోఽపియో న్యాయనయే ప్రవేశమితి.

91[68]


కృష్ణభట్ట కృష్ణజయే—


పాయాదపాయా త్పరమస్య పుంస ఇతి.

92[69]


కుసుమాయుధ వ్యాకరణే—


యేనాక్షర సమాన్నాయ మితి.

93[70]


మంత్రమహార్గవే—


ఓంకారపంజరశుకీ మితి.

94[71]


శంకరాచార్య మంత్రదర్పణే—


ఆధార పద్మవనఖేలన రాజహంస మితి.

95[72]


పృథ్వీధరాచార్య సాహసాంకకావ్యే—


అన్యాత్సవో యస్య నిసర్గవక్రి, యితి పరిమేళ (?)

96

6. జగణస్య

వాదాంగచూడామణి—


చ.

రవి యధిదైవ మాదివసరాట్కులమున్, గురువిందకాంతియున్
రవిగ్రహ మెన్నఁగా నతఁడు రక్తపువర్ణము సింహరాశి ను
ద్భవమగు, రోగమాఫలము, తారకయుత్తర, ధేనుయోని, మా
నవగణమున్ దలంప జగణంబునకున్ ద్రిదశేంద్రవందితా!

97[73]


కవిసర్పగారుడే—


మ.

అరుణుం డేలిక చాయ రక్తిమ రసంబా వీర మాయన్వయం
బురువై రాజ్యము రాశి సింహము గ్రహం బుష్ణాంశు వత్తార యు
త్తర రోగంబు ఫలంబు యోనియిరవొందం ధేను వమ్మానవం
బరుదారంగ గణంబునా జగణ మింపారున్ జగత్సిద్ధమై.

98[74]


వ.

అధిదైవత సూర్యుఁడు, క్షత్రియకులం, రక్తవర్ణం, గ్రహాది సూర్య ఏవ, సోపి రక్తవర్ణః, సింహరాశి, ఫలంరోగం, ఉత్తరానక్షత్రం, ధేనుయోని, మనుష్యగణం, వీరరసం, భార్గవగోత్రం జననం శ్రీరామనామ యానం, షట్సంజ్ఞా.

99


ఆదిప్రయోగసరణి:


చమత్కారచంద్రికాయాం—


రుజాకరో మధ్యగురర్జగణో భానుదైవతః.

100[75]


సాహిత్యరత్నాకరే—


మధ్యే గురుర్జోరుజః

101[76]

కవికంఠపాశే—


భానుర్దుఃఖకర ఇతి.

102[77]


కుమారసంభవే—


చతుర్ముఖముఖా ఇత్యాదైవర్ణా జగణేఽపిచ
బ్రహ్మనామాంకితత్వేన కావ్యాదావతి శోభనమితిచ.

103[78]


వర్ణోపిగణశ్చైవ బ్రహ్మనామాంకనే వేదా
బ్రహ్మనామ చకారాక్షరసంయుక్తం
చన్ జగణా వ్యోదాప్రయౌగ శుభకరమ్.

104[79]


ఇందుకు లక్ష్యం-వామననామశకునగ్రంథే—


విరించి నారాయణ శంకరేభ్య ఇతి
ననుగణ సామర్థ్య మజాత్వా
ఏవం చోద్యమా కృతా, ఉచ్యతే ఖలు.

105


ఓయి! జగణసామర్థ్యం యెరుగఁబలికె ననుట.

106


సాహిత్యరత్నాలయే—


జగణస్సూర్య దైవత్యో రుజం హంతి నదోషకృత్
గణానాముత్తమాజ్ఞేయో గ్రహాణం భాస్కరోయదా.

107[80]


తధామను: ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్.

108


కావ్యచింతామణి – తాతంభట్లు—


క.

అవివేకులు జగణంబును
భువి రోగము సేయుననుచుఁ బోనాడుదు రా
కవివరులున్ శబ్దార్థము
వివరింపరు తమరుయుక్తి విదితముగాఁగన్.

109[81]

మరిన్ని – మహాకవి ప్రబంధోదారహణాన్ వక్ష్యామి.

110


మాఘకావ్యే—


శ్రియఃపతి శ్రీమతీతి

111[82]


భారవే—


శ్రియః కురుణా మధివస్యితి.

112[83]


ఉత్తరరామాయణే—


అలం కవిభ్యః ఇతి.

113[84]


కాలనిధానే—


శ్రియః కరారోపితరత్నముద్రికేతి.

114[85]


మణిదర్పణే—


దివాకరం నమస్కృత్య ఇతి.

115[86]


ఛప్పన్నే—


ప్రణమ్య లోకకర్తార మితి.

116[87]


భోజరాజీయే—


సునీతిశాస్త్రం, నం (?) వైద్యం ఇతి.

117


గణితశాస్త్రే—


త్రిలోకరాజేంద్రకిరీటకోటి ఇతి.

118[88]

వీరార్య లక్షణాదినికాయమ్—


ప్రణమ్య విద్వజ్జనపారిజాతమ్.

119[89]


సూర్యసిద్ధాంతే—


అచింత్యా వ్యక్తరూపమితి

120

7. భగణస్య

వాదాంగచూడామణౌ—


ఉ.

చంద్రుఁ డధీశ్వరుం డమృతసారము కాంతియు, విట్కులంబు, త
చ్చంద్రుఁడె తద్గ్రహం బతని చాయయుఁ దెల్పు, వృషంబు రాశి, భో
గీంద్రసుయోని, దేవగణ, మీప్సితసౌఖ్యము తత్ఫలంబునున్
జంద్రునితార యెన్నఁగను జంద్రధరా భగణాన కెన్నఁగన్.

121[90]


కవిసర్పగారుడే—


మ.

పతి చంద్రుం, డహి యోని, రాశి వృష, మా వంశంబు దై
వత మెన్నం గణమా ఫలంబు సుఖమా, వర్ణంబు శ్వేతంబు, సం
యుతనక్షత్రము చెప్పఁగా మృగశిరం బుద్యద్గ్రహం బా నిశా
పతి, హాస్యంబు రసంబు నా భగణ మొప్ప న్మించె సన్మూర్తియై.

122[91]


టీక.

చంద్రుఁ డధిదేవత, వర్ణం తెల్పు, ఉచ్ఛకులం, గ్రహం చంద్రుఁడు, అతనివర్ణం తెల్పు, వృషభరాశి, సర్పయోని, దైవగణం, ఫలం సుఖం, నక్షత్రం మృగశిర, హాస్యరసం, అంగీరసగోత్రం జననం సుప్రనామం ఒకపరి.

123

ఆదిప్రయోగసరణి


సాహిత్యరత్నాకరే—


దినకరముఖగ్రహణామ్
ఇనశశివర్తతస్యరజని గుణం.

124[92]


ఆంధ్రభాషాయామ్-


కవిసర్పగారుడే—


ఆ.

చంద్రుఁ డేగ్రహంబుసరస నిల్చిన వాని
వర్ణమై శుభాశుభంబు లిచ్చు
భగణము మగణంబు నొగి నిలం దత్భలం
బిచ్చు దనకు చంద్రుఁ డధీశుఁ డగుట.

125[93]


అథర్వణఛందసి—


క.

యగణంబు గదిసి చంపును
రగణముతో గూడి ఘోరరణ మొనరించున్
భగణ మిక నొక్కచిత్రము
మగణముతో గూడ కాలమానము పతికిన్.

126


వ.

భగణం ప్రత్యేకం కాని సకలశుభముల నీయజాలినందుకు లక్ష్యం.

127


శ్రీమద్రామాయణ యుద్ధకాండశేషే లంకాదహనము పట్టుకథ – అవక్రమిస్తున్న శుభ మపేక్షించి భగణానకు చంద్రుఁడే అధిపతిన్ని, గ్రహముం గన్న అయ్యలభట్టు భగణప్రయోగం చేసినాఁడు.

128

ఉ.

శ్రీనుతమూర్తియైన రఘుశేఖరు తేజముఁ బోలె పర్వుచున్
భానుసహస్రమండలవిభాసి సమగ్రతరప్రకాశుఁడై
మానుగ మింటితో నొరయు మంటలు దిక్కుల గ్రమ్మ నుగ్రవై
శ్వానరుఁ డేపుతో నెసగె వానరరోషసముద్రుఁడో యనన్.

129

8. నగణస్య

వాదాంగచూడామణౌ—


చ.

గుణముల కెల్ల నాకరము కోరి కృతీంద్రుని డాసియున్న దు
ర్గుణగణదోషమున్ జెరుచు కోరినవస్తువినూత్నరత్నభూ
షణముల నిచ్చుఁ గావున లసత్కవిశేఖరుఁ బెంచు సర్వల
క్షణములఁ గల్గి యొప్పుబుధ సన్నుతమైన గణంబు శంకరా!

130[94]


కవిసర్పగారుడే—


మ.

పరమాత్ముం డధినాయకుండు జయసౌభాగ్యైకసామ్రాజ్యపూ
జ్యరమాసంతతు లీగి లబ్ధి మునిజోపాంతస్థదుష్టాక్షరో
త్కరదోషాఢ్యగుణౌఘధూర్తగుణముల్ ఖండించుటల్ చాల యె
వ్వరికిన్ గాదనరాదు నానగణ మవ్యాజస్థితిన్ బొల్పగున్.

131[95]


ఉత్తమగండచ్ఛందసి—


క.

శుభసుఖ మక్షయ ధనకన
కభయైశ్వర్యములం జేయుం గ్రమమునన్ గార్య
ప్రభులకు, కవులకు గృతులను
మభజసనయరత గణాలి మల్లియరేచా[96]!

132


టీక.

పరమాత్మ అధిదేవత అన్నారు, గాని నగణం సర్వశుభదం. కనుక మిగిలిన కవీశ్వరులు యెన్ని వ్రాసినవారు కారు.

భీమనమతం – ఫలం ధనం. గ్రహం జీవుఁడు. కులం బ్రాహ్మ్యం. ధవళవర్ణం,
కవిసర్పగారుడము – బసవనమతము – జననం ప్రసుప్తయామం ఎనిమిదవది.

133


ఆదిప్రయోగసరణి


చమత్కారచంద్రికాయామ్—


ధనాకరస్సర్వలఘుర్నగణో బ్రాహ్మదైవతః

134[97]


సాహిత్యచంద్రోదయే—


సమీపస్థో దుర్గుణశ్శుభదోభవేత్,
అయఃకాంచనతామేతి స్వర్ణార్థిస్పర్శవేదినమ్.

135[98]


ఆంధ్రభాషాయాం


(భీమ)న్నచ్ఛందసి—


క.

ఏగణము గదియు నగణం
బాగణము సమస్తమంగళావ్యాప్తంబై
రాగిల్లు నినుము పరసము
యోగంబై పసిండివన్నె నూనినభంగిన్.

136[99]


ఉత్తమగండచ్ఛందసి—


క.

చందనతరు సంగతిఁ బిచు
మందంబులు పరిమళించు మాడ్కిన మందా
నందకరమైన నగణము
పొందున దుష్టగణవర్ణములు ప్రియమొసంగున్.

137[100]

కవికంఠపాశే—


పర్వతానాం యథామేరుః, సురానాం శంకరో యథా
మృగానాంచ యథాసింహే, గణానాం నగణస్తథా.

138[101]


ఆంధ్రభాషాయాం-అథర్వణచ్ఛందసి—


గీ.

పర్వతములందు మేరువుభాతి యగుచు
సర్వసురలందు శంకరచంద మగుచు
నరయ మృగములయంద సింహంబుకరణి
గణములందెల్ల నగణంబు గరిమ నెగడు.

139[102]


నగణప్రయోగలక్ష్యాలు
నలోదయంబున – ‘హృదయ సదసీ’ యనుటను
శివభద్రంబున – ‘ప్రణమ సదసీ’ యనుటకును జెల్లుచుండును.

140


ప్రబంధపరమేశ్వరుఁడు అరణ్యపర్వశేషప్రారంభకాలంబున శుభ మపేక్షించి నగణప్రయోగం చేసినాఁడు.


చ.

స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోవ నిరస్తనీరదా
వరణములై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధతరహంససారసమధువ్రతనిస్వనముల్ చెలంగఁగాఁ
గరము వెలింగె వాపరముఖంబులు శారదవేళఁ జూడఁగన్.

141

8. అక్షరఫలములు

కవిసర్పగారుడే—


క.

శివుసద్యోజాతాది
ప్రవిమలముఖపంచకమునఁ గ్రమమునను సము
ద్భవమై అ ఇ ఉ ఎ ఒ
లావిష్కృతి నవియు నేఁబదై వర్తిల్లున్.

142[103]

క.

ఆదులు పదియాఱనంగ
కాదులు తానిరువదియును నైదు ననంగా
యాదులు తొమ్మిది యనఁగా
నీదెస నక్షరము లమరు నేఁబదియనఁ జమన్.

143


ఇందుకు వివరం— ఆదులు 16. అం అ అనువీనికి రుద్రుండె అధిదేవత – కాన అం అను అక్షరం విడువగా నిల్చినవి పదిహేను. కాదులు 25. యాదులు ళతో గూడి దొమ్మిదిన్ని. క్షకారము – కకార షకార సంయుక్తంబై భిన్నదైవతంబును, ప్రత్యేకఫలంబు నగుట, క్షతో గూడి యాదులు 10. వెరసి అక్షరాలు 50.

144


ఈ అక్షరాలకు—


క.

ఫలములు, గ్రహములు, వర్ణం
బులు, నధిపాలకులును, బలములు నన్వయమున్
దెలిపి యిడవలయు గవితలు
పలికెడు వర్ణంబు లైదుపదులకు మొదలన్.

145


క.

వేవిధము ఫలంబు, రక్తిమ
వర్ణంబు, బీజ మనిలంబు, గ్రహం
బాతనికి కులము బ్రాహ్మ్యము
ఖ్యాతిగ విష్ణుండు పతి అకారంబునకున్. (1)

146


క.

పవనము బీజము దేవత
లవని గ్రహం బినుఁడు బ్రాహ్మ్య మన్వయము రుచి
ప్రణవము గౌరవము హర్ష
మవిరళఫలజాల మొసఁగు ఆ అక్షరమునకున్. (2)

147

క.

ఇనుఁ డగ్రహ మవని బీజము
తనురుచి శ్యామంబు తుష్టిదంబు ఫలంబా
జననము బ్రాహ్మ్యము కాముఁడు
గనుగొన నధినాయకుండు ఇ కారంబునకున్. (3)

148


క.

అనలము బీజము రవి గ్రహ
మనుపమరుచి పీత మన్వయము బ్రాహ్మ్యము తు
ష్టినయంబు ఫలము దేవత
యెనయఁగ శ్రీ యెంచిచూడ ఈ మాతృకకున్. (4)

149


క.

ఇల బీజము నీలము రుచి
ఫలంబు కామదము గ్రహము భానుండు బ్రాహ్మ్యం
బల రెడ్డికుల మధిదేవత
కలితస్థితి కాళి తా ఉ కారంబునకున్. (5)

150


క.

ధర బీజము శ్యామరుచి
తరణి గ్రహము ఫలము కామదము బ్రాహ్మ్యం దా
వరవంశం బధిదేవత
యురుతరముగ దేవమాత ఊ మాతృకకున్. (6)

151


క.

నీరము బీజము వర్ణము
గౌరము బ్రాహ్మ్యంబు కులము గ్రహ మర్కుండు కౌ
మారి తలంప నధిదేవత
యారయ సుతహాని ఋ నకు నార్యజనోక్తిన్. (7)

152


క.

సలిలము బీజము బ్రాహ్మ్యము
కుల మినుఁడు గ్రహంబు పుత్రకుల నాశము దా
ఫలము రుచి యంజనము స
ట్టిలఁదా వారాహిదేవి ౠ మాతృకకున్. (8)

153

క.

గాలియు బీజము ఛాయా
పాలుఁడు గ్రహ మన్వయంబు బ్రాహ్మ్యము ఫలమున్
బొలతి సుఖము వసంతుం
డేలిక సితంబు ఛాయ ఎ మాతృకకున్. (9)

154


క.

ఇనుఁడు గ్రహ మగ్ని బీజము
జననము బ్రాహ్మ్యంబు రుచిల సద్గౌర మలం
సునవాక్కది ఫలంబగు
నెనయ దర్పకుఁడు భర్త ఏ మాతృకకున్. (10)

155


క.

ఘనవిధి బీజ మరయగ
నినుఁడు గ్రహం బమర వైద్యువినులు బ్రాహ్మ్యం
బనఘకులము రుచి రక్తిమ
తనయ వినాశకము ఫలము తప్పదు ఐ కున్. (11)

156


క.

గగనమణి గ్రహము బీజము
గగనము బ్రాహ్మ్యంబు కులము గౌరము వర్ణం
బగు ఫలము పుత్రనాశక
మగు తలపోయగను వసువు లధిపులు ఒ కున్.[104] (12)

157


క.

ధరణియు బీజము దుర్గయు
పరిపాలిని యినుఁడు గ్రహము బ్రాహ్మ్యము వంశం
బరయగ గౌరము వర్ణం
బురుతరమోక్షదము ఫలము ఓ మాతృకకున్. (13)

158


క.

సలిలము బీజము బ్రాహ్మ్యము
కులము విభూతిదము ఫలము కుముదారి గ్రహం
బలఘు తనుకాంతి గౌరం
బలరెడి చాముండదేవి ఔ మాతృకకున్. (14)

159

క.

అంబుజమిత్రుఁడు గ్రహము కు
లంబది బ్రాహ్మ్యంబు మునుఫలము ధైర్యము రా
గంబు వర్ణము బీజం
బంబర మాహరుఁడు కర్త అమ్ మాతృకకున్. (15)

160


క.

అనలము బీజము బ్రాహ్మ్యము
జననము భౌముండు గ్రహము శతధృతి నాధుం
డనుపమరుచి కాళిమ
ఘనలక్ష్మియ ఫలమగున్ గకారంబునకున్. (16)

161


క.

తెలుపు రుచి కులము బ్రాహ్మ్యము
నిలిపుండగు భానుఁ డొండె నృపుఁడు గ్రహము మం
గళుఁ డగ్ని బీజ మగు శ్రీ
కలిమియు తత్ఫలమగున్ ఖ కారంబునకున్. (17)

162


క.

ధర బీజము కుల మగ్రజ
మరయగ శోణంబు వర్ణ మగ్నిజుండు గడుగ్రహం
బురు నిత్యఫలము శ్రీదము
కరివరదుఁ డధీశ్వరుండు గ కారంబునకున్. (18)

163


క.

బీజం బుదకము గణపతి
రాజు ఫలము కలిమి కులము బ్రాహ్మ్యము తెలుపై
రాజిల్లు వన్నె గ్రహము
భూజన్ముండగు ఘ కారమున కెందరయన్. (19)

164


క.

నలువుఱవు[105] గ్రహము భౌముఁడు
ఫలంబు శ్రీదంబు కులము బ్రాహ్మ్యము వ్యోమం
బలరంగ బీజము పతి వేం
కటరంగ నృసింహుఁ డాజ్ఞ కారంబునకున్. (20)

క.

ఆశుగ బీజము గ్రహ మా
శశిజుఁడు కులము.........................యశో
నాశము పతి వామనుఁడు ప్ర
కాశితరుచి మేచకము చ కారంబునకున్. (21)

166


క.

నారోగము ఫల మధిపతి
యారయ సేనాని బీజ మగ్ని నలుపు కా
వీర రుచి కులము బ్రాహ్మ్యం
బారుచిరగ్రహము బుధుఁడు ఛ అక్షరమునకున్. (22)

167


క.

గాము బుధుఁడు రక్తిమ రుచి
యామయ నాశకము ఫలద మగ్రజకులం
బామహి బీజము దేవత
హైమవతి జ కారమునకు నాగమ ఫణితిన్. (23)

168


క.

మృతి ఫల ముదకము బీజము
సితేతరము వన్నె గ్రహము శీతకరజుఁ డా
పతి భైరవుఁ డగ్రజ ము
న్నతకులము ఝ కారమునకు నా శోభిల్లన్. (24)

169


క.

జినుఁ డధినాథుఁడు బీజము
ఘనపదమ సితంబు వన్నె గ్రహ మిందుజుఁడౌ
జననము బ్రాహ్మ్యము మరణము
మును ఫల మగునా ఞ కారమునకుఁ దలంపన్. (25)

170


క.

కరువలి బీజము దానవ
గురుండు గ్రహం బగ్రజంబు కులమగు బాధా
కరము ఫలస్థితి యగు యం
గరుచి యెఱుపు యముఁడు పతి ట కారంబునకున్. (26)

171

క.

కుల మగ్రజంబు ఖేదము
ఫలము తెలుపు ఛాయ గ్రహము భార్గవుం డీశుం
డల నిర్గతి తనురుచి పిం
గళమగు తలపింపగా ఠ కారంబునకునన్. (27)

172


క.

శుభదంబు ఫలము బ్రాహ్మ్యం
బభిజన్మము గ్రహము శుక్రుఁ డగు పీతము పై
ప్రభబీజము నుర్వీశుఁడు
ప్రభుండు డ కారమునకు విపశ్చిదనుజ్ఞన్. (28)

173


క.

బీజంబు ధనము ఫలదము
తేజోనాశకము నల్పుదృఢరుచి బ్రాహ్మ్యం
బాజననము గ్రహము శని
రాజీవాసనుఁడు పతి ఢా క్షరంబునకైనన్. (29)

174


క.

గగనము బీజము వర్ణం
బగురక్తిమ కులము బ్రాహ్మ్య మధిదేవత దా
నగు వాణి గ్రహము శుక్రుఁడు
నగణితలాభంబు ఫలము ణా క్షరమునకున్. (30)

175


క.

కరువలి బీజము భుజగే
శ్వరుఁ డధిపతి గ్రహము గురువు క్షాత్రము కుల మం
గ రుచియు గౌర మవిఘ్నో
త్కహర్షము ఫలము దా త కారంబునకున్. (31)

176


క.

త్రైరాజ్యము కుల మధిపతి
మారుతభుగ్భుజుఁడు గ్రహ మమరగురుఁడు ఫలం
బారణము కాంతి శుక్లా
కారము బీజంబు శుచి థ కారంబునకున్. (32)

177

క.

ఇల బీజము రుచి శ్యామము
ఫలంబు ధృతి గ్రహము గురుఁడు బాహుజ మరయన్
గులమగు నధినాథుఁడు దా
నలరఁగ నందీశ్వరుండు దా క్షరమునకున్. (33)

178


క.

తెలుపైనట్టి గ్రహం బధి
పాలుఁడు భాస్కరుఁడు కులము బాహుజ ఫలం
బోలి ధృతి జలము బీజము
క్రాలెడు రుచి పీఠమగు ధ కారంబునకున్. (34)

179


క.

గౌరము వర్ణము వంశము
వైరాజ్యము గురుఁడు గ్రహము వరుఁ డీశుఁ డగున్
భూరి పరితాపము ఫలము
నారయ బీజంబు ..........నా క్షరమునకున్. (35)

180


క.

[106](36)

181


క.

అనిలము బీజము గ్రహమగు
శని విఘ్నేశ్వరుఁడు భర్త క్షాత్రము కులమా
తనురుచి గౌరము ఫలముగ
ననుపడి రక్షాప్రదంబు ఫా క్షరమునకున్. (37)

182


క.

ఆరోగ్యదంబు ఫలమా
గౌరము రుచి బీజ మవని గ్రహ మరయంగా
సౌరి పతు లమరవైద్యులు
నారాజాన్వయము బా క్షరమునకున్. (38)

183


క.

ఆతోయము బీజంబగు
ఖ్యాతిగ దైవంబు భద్రకాళి కులము దో
ర్జాతము శని గ్రహము శుభం
బాతతఫల మెఱుపువన్నె భా క్షరమునకున్. (39)

184

క.

ఆభర్త కాలరుద్రుఁడు
క్షోభ ఫలము గ్రహ మర్కజుఁడు శ్యామం బా
శోభయు జననము క్షాత్రం
బాభపదము బీజ మరయ మా క్షరమునకున్. (40)

185


క.

వెన్నెలరాయండు గ్రహము
వన్నె తెలుపు ఫలము లక్ష్మి వైశ్యంబు కులం
బెన్నఁగ కరువలి యేలిక
యన్నయ బీజంబు గాలి యా క్షరమునకున్. (41)

186


క.

సిరిసైదోడు గ్రహం బం
గరుచి యెఱుపు బీజ మగ్ని క్షాత్రము కులమా
వరుఁడు కృశానుఁడు దారా
కరణంబు ఫలం బగున్ ర కారంబునకున్. (42)

187


క.

అంగరుచి నల్పుఁ చితమా
తంగుఁడ (?) పతి ఫలము జాడ్యము శని గ్రహమౌ
రంగు బీజము ధర నే
కాంగకులము వైశ్య మా ల కారంబునకున్. (43)

188


క.

వైరాగ్యం బన్వయ మగు
నారోగ్యాయుష్కముల్ ఫలావళి శ్వేతం
బౌ రుచి పతి వరుణుఁడు కమ
ఠారి గ్రహము బీజ మొప్పు వా క్షరమునకున్. (44)

189


క.

పరిపాలిని కమల నభం
(బరయఁగ) బీజము శశి గ్రహము వన్నియ బం
గరురుచి విభూతి ఫలవై
ఖరి వైశ్యం బన్వయము శ కారంబునకున్. (45)

190

క.

కమఠారి గ్రహము దైవము
ఖమణి ఫలము ఖేద మాశుగము బీజము ర
క్తిమ ఛాయ కులము వైశ్యము
క్రమముగ నూహింప ష కారంబునకున్. (46)

191


క.

పవనాప్తుఁడు దాబీజము
దేవియు వాణి రుచి యెఱుపు గ్రహము విధుఁడు మూఁ[107]
డవకులము కులము సంపద
కవఁగూడుట ఫలము దా స కారంబునకున్. (47)

192


క.

వరుఁ డీశానుఁడు రజినీ
వరుఁడు గ్రహము ముక్తి ఫలము వసుమతి సుశ్రీ
కరవిజయము రుచి గౌరము
గరిమ కులము వైశ్య మగు హ కారంబునకున్. (48)

193


క.

నలినారి గ్రహము జాడ్యము
ఫలమగు భూతములు పతులు ప్రభ గౌరవము స
త్కులమును శౌద్రము బీజం
బలరంగా జీవనంబు ళా క్షరమునకున్. (49)

194


క.

నరసింహుఁ డధినాథుం
డరయ గ్రహము రుద్రుఁ డన్వయము శౌద్రము తె
ల్పురు తనురుచి ఫలము శుభం
బరుదుగ బీజంబు మిన్ను క్ష కారంబునకున్. (50)

195

9. సంయుక్తాక్షరప్రయోగము

తే.

మొదల సంయుక్తవర్ణంబు గదిసెనేని
మఱువ కా రెంటికిని గృహమైత్రి వలయు
నిది విచారింపరేనిఁ గృతీశ్వరుండు
పిడుగు మొత్తినగతిఁ గూలు బిట్టబిఱ్ఱు.

196[108]

క.

పొందెఱిఁగి యానుకూల్యము
బొందగం గూర్చి తగం బ్రయోగింప కృతిన్
సందర్భింప గణాక్షర
బృందం బిర్వురకుఁ జాలఁబ్రీతి యొనర్చున్.

197


క.

తలపోసి గద్యపద్యా
దుల గణముల్ గ్రహములకు నుందొరయుడు మైత్రుల్
గలుగఁగఁ జెప్పిన హస్తా
మలకముగాదె ఫలంబు మహి నిర్వురకున్.

198[109]


ఉ.

లక్కణ మెంచి కైత మొదలన్ సుగణాక్షరముల్ ఘటింప రెం
డక్కరనేలు నేలగలయంతయు సూరెల రాచచేసి కాం
బ్లొ(?)క్కట కొల్వగా మెఱసి యోజయ నిచ్చులుఁ బిచ్చలించు దా
పెక్కిడి గబ్బముల్ వెలయు నెల్లరు మెచ్చు(చునుందు) రెప్పుడున్.

199


కవికంఠపాశే—


అక్షరే పరిశుద్ధేతునాయకో భూప ఉచ్యతే

200[110]


చమత్కారచంద్రికాయామ్—


న్యస్తా: కావ్య
కర్తు: కారయితు, శ్శ్రోతుః కల్పయంతి శుభాశుభమ్.

201[111]

10. అక్షరగ్రహాలకు ఫలితార్థము

తే.

ఆదులకు రవి కాదుల కవనిజుండు
చాదులకు బుధుఁడు, కవి టాదులకును
తాదులకును గురుండు, శని పాదులకును
యాదులకు నెల్ల శశియు గ్రహములు రామ!

202

11. అక్షరాణాం వర్ణవివేకః

అలంకారసంగ్రహే—


ద్విజాయితః పంచదశ పూజ్యాః కచటవర్గజాః
నృపాన్వయాస్తపరవాపర్ణా ద్వాదశ సంస్కృతాః
యలహాశ్శషసా వైశ్కులజాః పూజుతాశ్చషట్
ళక్షరా శ్శూద్రకులజా స్త్రయోవర్ణాః ప్రకీర్తితాః

203[112]


ఆంధ్రభాషాయామ్-


అథర్వణచ్ఛందసి—


క.

వసుధామరులకుఁ గచటలు
వసుధాపతులకునుఁ దపరవలు వైశ్యులకున్‌
యసహలశషలును శూద్రుల
కసమున ళక్షరలుం జెప్ప నగుఁ బద్యాలిన్‌.

204[113]


కవిసర్పగారుడే—


సీ.

కాది త్రివర్గవర్ణాదికి మౌక్తిక
                       వజ్రభూషలుఁ దెల్పు వస్త్రచయము
తపవర్గ రవవర్ణతతి కబ్జరాగంబు
                       తొడవులు వలువలు తొగరుచాయ
యలశషసహ బీజముల కగు పుష్యరా
                       గాభరణములు పీతాంబరములు
ళక్షఱమ్ములకు నీలాలసొమ్ములు కారు
                       కొను నీలివన్నెల కోకలెల్ల


తే.

వరుస నీనాల్గు తెఱఁగుల వర్ణములకు
ననుభవంబగు ద్రవ్యంబు నానబాలు
నాజ్యమును గమ్మదేనియ యాసవంబు
దీనిఁ దెలియ కేగతిఁ గవి యౌను జగతి.

205[114]

అనంతచ్ఛందసి—


క.

ఆదులు వర్గత్రయమును
భూదేవతలు, తపవర్గములు రవలున్ ధా
త్రీయుతుల యలశషసహ
లాదట నూరుజులు ళక్షరాఖ్యలు శూద్రుల్‌.

206[115]

12. తత్త్వాక్షరః

వాదాంగచూడామణి—


క.

పరఁగఁగ అ ఆ ఏ లును
వరుసఁ గ చ ట త ప య ష లు ధ్రువంబుగఁ బడయున్‌
ధరఁ బవన బీజములు గో
వరవాహన! సకలలోకవందితచరణా!

207[116]


క.

క్రమమున ఇ ఈ ఐలును
రమణ ఖ ఛ ఠ థ ఫ రసలును రాజిలఁ బడయున్‌
విమలముగ నగ్నిబీజము
లమరఁగఁ దలపింప శంబరాంతకహరణా!

208[117]


క.

మున్నుగ ఉ ఊ ఓలును నా
యెన్నగ గజడదబలహలు నీ ధరఁ బపదియును నౌ
బన్నుగ భూబీజంబులు
పన్నగవరశయన బాణ! పన్నగభరణా!

209[118]


క.

అరయ ఋ ౠ ఔలును
సారపు ఘ ఝ ఢ ధ భ వళలు సరవిన్‌ బదియున్‌
దోరపు జలబీజంబులు
ఘోరాసురపురవిదార! గోధ్వజకలితా!

210[119]

క.

ఌ ౡ అం ఙ ఞ న వలు
పలువితములై వెలుంగు శక్షలు పదియున్
గలుగ గగనబీజముల నాఁ
దెల్లముగా మాద్రవాది దివిజస్తుత్యా!

211[120]


ఇది ప్రస్తరించు లక్షణములు
అ ఇ ఉ ఋ ఌ యీ అయిదువర్గాలకిందను అ విడిచి ఆదులు పదిన్ని కాదులు యాదులు వ్రాస్తే యేర్పఇందులో అనలానిలవర్ణసంయోగం పద్యాదిని రాకుండ బరిహరింపవలెను.

212


ఇందుకు ఫలాలు


ఆంధ్రభాషాయాం-


అథర్వణచ్ఛందసి—


గీ.

గగనబీజంబు పేదఱికంబు; వగపు
వాయుబీజంబు; మృతిఁజేయు వహ్నిబీజ;
మంబుబీజంబు సంతోష; మవనిబీజ
మఖిలసంపత్కరంబు పద్యాదియందు.

213

13. అమృతాక్షరవివేకః

కవికంఠపాశే—


అకచటతపయశ వర్గాదమృతం ప్రోక్తం విషాణి దీర్ఘాణి.

214[121]


ఆంధ్రభాషాయాం-

215


అథర్వణచ్ఛందసి—


క.

అమృతాక్షరములు హ్రస్వము
లమరంగ దీర్ఘములు విఫలు లనబడు వీనిన్
గ్రమమున అకచటతపయశ
సముదయమునఁ దెలిసి నిల్పఁజను పద్యాదిన్.

216[122]

దీర్ఘాలు విషాలైనందుకు లక్ష్యం


వేములవాడ భీమన్న—


క.

కూరడుగము కాయడుగము
ఆరంగా నుల్లి పచ్చడని యడుగము మా
పేరామీద పో కడిగినన్[123]
బారమ్మున (?) వేసె నట్టి బ్రాహ్మఁడు ద్రెళ్ళెన్.

217


క.

వినబడు దీర్ఘము విషమగు
ననియ నిజమ్మగును సంయుతాక్షర మైనన్
మునుపటి గుణములు విడివడి
తనరన్, వేరొక్కగుణము దాల్చును రామా[124]!

218


విశ్వేశ్వరచ్ఛందః—


క.

శ్రీకారము ప్రథమంబున
ప్రాకటముగ నున్నఁ జాలు బహుదోషములన్
వేకుంచి శుభము లొసగును
ప్రాకృతము నినుము సోకు పరుసము బోలెన్.[125]

219


టీక.

శ్రీకారం బెటువలె నంటె—శవర్ణ, రేఫ, ఈకారములు కూడగా శ్రీకారమాయెను. అందు శవర్ణరేఫలకు గ్రహం చంద్రుఁడు. కనుక ఈకారానకు గ్రహం సూర్యుఁడు. వారిద్దరి కన్యోన్యమైత్రి. కనుక శవర్ణ ఈకారముల కధిదేవత లక్ష్మి. రేఫకు అగ్ని దేవత. అయితేనేమి అగ్ని లక్ష్మీప్రదుండు. ఇందుకు సమ్మతి.[126]

220


చమత్కారచంద్రికాయాం—


221

కవికంఠపాశే—


క.

పంచమవర్గాక్షరముల
నెంచింపక నేత్వ మిత్వ మిడి కృతిమొదలన్
నుంచిన కృతిపతి మిక్కిలి
సంచలితైశ్వర్యుఁ డగుచు జడుగతిఁ దిరుగున్.[128]

222


క.

చొక్కపు పయి శాక్షరములు
తక్కినవర్ణములయందు తలకట్టేత్వం
బక్కజముగఁ గొమ్ము దీర్ఘము
మక్కువతో నియ్యఁబతికి మంగళమమరున్.

223


గోకర్ణచ్ఛందసి-ఋషిప్రోక్తే—


లక్ష్మీప్రదో.............చ్చేద్దుతాశనాత్[129]

224


వ.

అనుట అగ్నియు లక్ష్మీప్రదుఁడైన దేవర అనిన్ని శ్రీకారం లక్ష్మీస్వరూపమనిన్ని ఎరుగవలెను.

225[130]

14. అక్షరాణాం గతయః

కవికంఠపాశే—


దైవన్యతిర్యగ్రౌరవదదావర్ణః (?) తత్క్రమమ్. లఘువోదేహ (?) కచటతపాఅధనరాదిఘా ఇతి.

226


ఆంధ్రభాషాయామ్-


అథర్వణే—


క.

సురవర తిర్యగ్రీరవ
వరగతులగు భూసురాది వర్గాక్షరముల్
గురులఘువులు నరసురగతు
లరిరాయ విఫాల సోమయవనీపాలా[131]!

227

కవిసర్పగారుడే—


సీ.

నణమఙఞ విహీనంబగు వర్గపం
                       చకములఁ గల్గు నక్షరము లెల్ల
నెరయంగఁ గుఱుచలై నిర్జరగతులగు
                       నిడుదలై యుండిన నృగతు లగును
న ఋౠ ఌౡ ఙ ఞ ణ మలు రేఫవిహీన
                       యాద్యష్టకమును దిర్యక్క్రమంబు
లగుగాని రేఫ యధోగతి యగు నిందు
                       (ప్రత్యేకదళము లేర్పడఁగ వరుస


తే.

సురనృగత్యక్షరంబులు శుభము లొసగు)[132]
మధ్యఫలద తిర్యగ్గత మాతృకాళి
నిరయగత వర్ణమొక్కటి నెరయఁగాదు
ప్రౌఢకవులు రచించు కబ్బములమొదల.

228

అల్పప్రాణవర్గాః

అల్పప్రాణవర్గాణాం ప్రథమతృతీయా అంతస్థాశ్చాల్పప్రాణాః
యథా తృతీయా స్తథాపంచమా ఐతరే సర్వే మహాప్రాణాః

229[133]


అథర్వణచ్ఛందసి—


క.

అల్పప్రాణము లతిమృదు
జల్పోచితవచనపంక్తి ఝ ఛ ఘ ధ ఠ ములౌ
నల్పకఠోరాక్షరము బ
వల్పాటగునవి మహాయుతప్రాణంబుల్.

230[134]


అక్షరాణాంగద్యపద్యేన తత్తస్థానప్రయోగ నిషిద్ధా.

231


సాహిత్యరత్నాకరే—


షల్సప్తరుద్రసంస్థాశ్శుక నరహచటే (?)
కలహదాయకా॥ చతుర్థరీతి॥

232

15. విషమాక్షరవిచారము

ఆంధ్రోత్తమగండచ్ఛందసి—


క.

అకచట హలనఁగ నేనును
బ్రకటితముగ ఋతుల గిరులఁ బదునొక్కింటన్
నికటముఁగ గూర్చి పద్యము
సుకవులు సత్ప్రభుల కీర శుభదము లగుటన్.

234[135]


అనంతచ్ఛందసి—


క.

పురశర రసగిరి రుద్రుల
నరయ న కచటతప లిడుట యనుచిత మయ్య
క్షరములు నరచఛ జంబులు
బరిహరణీయంబు లాదిఁ బంకజనాభా!

235[136]


కవిసర్పగారుడే—


క.

సంగతిగఁ గృతుల స్త్రీపుం
లింగంబు శబ్దములు మొదల లెస్సగు నిల్పన్
వెంగలి బుద్ధి నపుంసక
లింగంబగు శబ్ద మిడిన లేవు సుఖంబుల్.

236[137]


చ.

రసగిరి రుద్రసంఖ్యలను రాదొన గూర్ప స్వరాదివర్ణముల్
వసుధ హకారమున్ క్షరటవర్ణ చవర్ణములున్ దలంపగా
నస జగడంబు వాగు లిడనై దగుచోట్లు హలాదివర్ణముల్
బొసగదు చెప్ప నాదిరసముల్ చజముల్ గదియింప వర్ణముల్.

237[138]


అథర్వణే—


క.

ఌౡ ఋౠ ఙ ఛఝఞ టఠఢణ
ధలు, నపబభమలు, సరణలతతి, హక్షసులున్

నెలకొనఁ బద్యముఖంబున
నిలుపరు సత్కవులు శాస్త్రవింద్యము లగుటన్.

238[139]


ఇందుకు ఆదికవిలక్ష్యములు


భీమన్న—


చ.

హయ మది సీత పోతవసుధాధిపుఁ డారయ రావణుండు ని
శ్చయముగ నేను రాఘవుఁడ జాహ్నవి వారధి మారు డంజనీ
ప్రియతనయుండు సింగన విభీషణుఁ డాగుడిమెట్ట లంక నా
జయమును బోతరక్కసుని చావును నేడవనాఁడు సూడుడే.

239[140]


టీక.

1 హకారం 5 సకారం 11 ధకారం


శరభాంకుఁడు—


ఉ.

చాపముగా నహార్యమును చక్రిని బాణము గాఁగ నారిగాఁ
బాపవరేణ్యు జేసి తలపన్ త్రిపురంబులఁ గాల్పవే మహా
దీపితతీవ్రకోపమున దేవత లెల్ల నుతింప నాఁటి విల్
పాపపు డిల్లిమీఁద దెగఁ జాపగదే శరభాంకలింగమా!

240[141]


టీక.

1 చకారం 6 హకారం 11 కకారం. ఇట్లని ఎరుంగవలెను.

16. దేవతావాచక భద్రవాచకాలు

కవికంఠపాశే—


దేవతావాచకాశ్శబ్దాయేచ భద్రాదివాచకాః
తేసర్వేనైవ నింద్యాస్యుర్గణతో లిపితోఽపి వా

241[142]


సాహిత్యచూడామణౌ—


అధసిద్ధి ప్రణవాది శ్రీచంద్రసూర్యదీర్ఘాయుః
ఆరోగ్యకుశలవాణీసాగరమేఘాది మంగళశ్శబ్దాః

242[143]


ఆంధ్రకవిసర్పగారుడే—


క.

తరణీందుభద్రసాగర
గిరికుశలారోగ్మమేఘగీస్తుత్యాయు

స్ఫురదముల కీర్తి సుమనో
త్కరాదివాచకము లిడఁగఁదగుఁ బద్యాదిన్.

243[144]


గీ.

దేవతావాచకముల వర్తిల్లెనేని
భద్రవాచకములఁ గూడి పరగెనేని
నగణ సంపర్కలబ్ధితోఁ దగియెనేనిఁ
గ్రూరసంయుక్తలిపులైనఁ గూడు మొదల.

244[145]


కావ్యచింతామణి-తాతంభట్లు—


క.

నిరుపమ కావ్యాదిని సుర
వర భద్రాద్రి ప్రశస్తవాచకపదముల్
బెరసిన దదుష్టగణా
క్షరదోషములన్ జయించిన సంపద నిచ్చున్.

245[146]


అనంతచ్ఛందసి—


క.

తనరఁగ శుభవాచకములు
ఘన మలరగ దేవవాచకంబులునై పే
ర్చిన గణములు వర్ణంబులు
ననింద్యములు గృతులమొదల నహిపతిశయనా!

246[147]


దేవతావాచకంబులకు లక్ష్యములు—


ఏకావళియందు ‘ప్రాలేయాచల కన్యకా’ యనుట; కల్పవల్లరియందు ‘హేరులు’ (?) మవలంజేయును; మరియు ఉభయకవిమిత్ర విరాటపర్వస్యాదౌ శ్రీయన’ గౌరీనాబర‘గుచెల్వకు’ ననుట గల్గియుండును.

247


భద్రతావాచకలక్ష్యములు—


కాళిదాసస్య శ్యామలాదండకా దావ్యక్తం ‘జయమాతంగతనయే జయ’ ఇతి; నంది తిమ్మయ త్రిస్థలి దండకం ‘విజయనగరిన్ హేమకూటంబునన్ నిల్చి పంపావిరూపాక్షునిం గొల్చి’ యనుట గల్గియుండు, నిటున............

248

  1. ఆనందరంగరాచ్ఛందములో 22వ పద్యమునకు పిమ్మట నున్నది.
  2. ఆ.రం.ఛం.లో అ 1 ప 23
  3. సులక్షణసారములో 246వ పద్యము.
  4. సు.సా.లో 245వ పద్యము. - ఇది భీమకవికృత మని ఇతరపుస్తకములలోఁ జెప్పబడినది పొరపా టనవచ్చును.
  5. సు.సా.లో 247వది.
  6. సు.సా.లో 248వది.
  7. సు.సా.లో 249వది.
  8. సు.సా.లో 261వది. ఆ.రం.ఛం.లో అ 1 ప 15. 'లిగారి' అనిగాక 'లిగాడి' (= వెనుకఁబడినవాఁడు) అను నర్థము తూర్పుగోదావరిజిల్లాలో వాడుకలో గలదు.
  9. ఆ.రం.ఛం.లో అ 1 శ్లో. 30
  10. విన్నకోట పెద్దిరాజు కావ్యాలంకారచూడామణి ఉ 7 ప19
  11. కా.చూ. ఉ 7 ప 20
  12. ఇది తప్పులపద్యము. కాని రామసంబుద్ధిచేత లింగమకుంట తిమ్మకవికృత మని రుజువగుచున్నది.
  13. ఇది అచ్చుపడ్డ సులక్షణసారములో లేదు. ఆ.రం.ఛం. అ 1 ప 55.
  14. అనంతుని ఛందోదర్పణము అ 1 ప 18. సు.సా.లో ప 30
  15. కొన్ని యక్షరములు బొత్తిగాఁ దెలియుటలేదు. కాన కాపీ చేయబడలేదు.
  16. ఇది కూడ అనంతుని ఛందములోనిదె. సు.సా.లో ప 21
  17. ఈ మూడురకముల గణములు వరుసగాఁ జెప్పఁబడినవి. అనవసరమని కాపీచేయఁబడలేదు.
  18. అనంతుని ఛందము అ1 ప 17
  19. ఆ.రం.ఛం. అ 2 ప 8. సు.సా.లో 250 ప
  20. ఆ.రం.ఛం. అ 2 ప 9
  21. ఇది భీమనకృతమని కవిజనాశ్రయములోఁ జేర్చబడినది. ఆంధ్రసాహిత్యపరిెషత్తువారి కవిజనాశ్రయము. సంజ్ఞా ప 27
  22. తాటాకుప్రతిలో మహితగోత్ర ఋషులు మయరసతబ్రభలు కిట్లన గణమునకు నెన్నబడదు అని తప్పుగా నుండగా బైనఁజెప్పిన విధముగా సవరించితిని. కొంత పోలికతో నీపద్యము అం.సా.ప.వారు కవిజ సంజ్ఞా 29 ప గా నున్నది.
  23. ఆ.రం.ఛం. అ 2 సం 10
  24. ఆ.రం.ఛం. అ 2 , సం 11 తాళపత్రప్రతిలో నరపతి యను పదసంపుటి యధికముగాఁ గలదు.
  25. ఆ.రం.ఛం. అ 2 ప 12 సు.సా.లో 296 పద్యము. ఇది భీమనఛందములోనిది యని జెప్పఁబడినది.
  26. ఆ.రం.ఛం. అ 2 సం 13
  27. ఆ.రం.ఛం అ 2 ప 14; కాని ఇది శ్రీధరుని ఛందస్సులోనిదని జెప్పఁబడినది.
  28. ఆ.రం.ఛం అ 2 ప 15. సు.సా.లో 291 ప
  29. సు.సా. 316వ పద్యమునకును, దీనికినిఁ జాల భేదము గలదు. అచ్చట భీమన కర్తగాఁ జెప్పబడినాఁడు.
  30. ఆ.రం.ఛం అ 2 సం 17
  31. ఆ.రం.ఛం. అ 2 సం 17
  32. ఆ.రం.ఛం. అ 2 సం 22. తాళపత్రప్రతిలో భేదముగా నుండుటయే గాక, ఆఖరుచరణములో గణములుకూడ తగ్గినవి. కాన సంస్కరించితిని.
  33. ఆ.రం.ఛం. అ 2 సం 13. సు.సా.లో 251వది
  34. ఆ.రం.ఛం. అ 2 సం 24
  35. ఆ.రం.ఛం. అ 2 ప 25
  36. ఆ.రం.ఛం. అ 2 ప 26. సు.సా. 317 ప. తాళపత్రప్రతిలో నయలం అని ప్రారంభించుచుండగా పైపుస్తకముల ననుసరించి సయలం అని మార్చితిని.
  37. సు.సా. 318 ప. ఇది భిన్నముగా నున్నది.
  38. ఆ.రం.ఛం. అ 2 ప 30
  39. ఆ.రం.ఛం. అ 2. ప 31. సు.సా.లో 252 టీ.
  40. ఆ.రం.ఛం. ఆ 2. సం 32
  41. ఆ.రం.ఛం. అ 2 సం 33
  42. ఇది అధర్వణునిదని ఆ.రం.ఛం. అ 2. ప 34లో చెప్పనుంజి సు.సా.లో 298 ప.
  43. ఆ.రం.ఛం. అ 2. సం 36
  44. ఆ.రం.ఛం. అ 2. సం 38
  45. ఆ.రం.ఛం. అ 2. ప 40. సు.సా.లో 300 ప.
  46. ఆ.రం.ఛం. అ 2. ప 2 ప 42. సు.సా.లో 253.
  47. ఆ.రం.ఛం. అ 2. ప 43
  48. కొంత చెడిపోయినది. కాని అ ర2 చం అ2 పం44లో పూర్తిగా నున్నది.
  49. ఆ.రం.ఛం. అ 2. ప 45. సు.సా.లో 319 ప.
  50. ఆ.రం.ఛం. అ 2. ప 46. సు.సా. ప 319
  51. ఆ.రం.ఛం. అ 2. సం 47
  52. కర్త పేరున్నది. కాని తెలుగులో నుండుటచే ననుమానింపదగియున్నది.
  53. ఆ.రం.ఛం. అ 2. సం 50. సు.సా.లో 303 ప
  54. ఆ.రం.ఛం. అ 2. సం49
  55. ఆ.రం.ఛం. అ 2. సం 51
  56. ఆ.రం.ఛం. అ 2. సం 52
  57. ఆ.రం.ఛం. అ 2. ప 55. మూడవచరణములోని మొదటిగణము తప్పుగా నున్నది.
  58. ఆ.రం.ఛం. అ 2 ప 56. సు.సా. 254 ప
  59. ఆ.సా.ప.వారి కవిజనాశ్రయము సంజ్ఞా. ప 28
  60. ఈవచనము స్థలము మారినట్లుగాఁ తోచుచున్నది.
  61. ఆ.రం.ఛం. అ 2. సం 57
  62. ఆ.రం.ఛం. అ 2. సం 62
  63. ఆ.రం.ఛం. అ 2. ప 58
  64. ఆ.రం.ఛం. అ 2. సం 59
  65. ఆ.రం.ఛం. అ 2. సం 60
  66. ఆ.రం.ఛం. అ 2. సం 61. సు.సా. 307 ప
  67. ఆ.రం.ఛం. అ 2. సం 63
  68. ఆ.రం.ఛం. అ 2. సం 64
  69. ఆ.రం.ఛం. అ 2. సం 65
  70. ఆ.రం.ఛం. అ 2. సం 66
  71. ఆ.రం.ఛం. అ 2. సం 67
  72. ఆ.రం.ఛం. అ 2. సం 68
  73. ఆ.రం.ఛం. అ 2 సం 71
  74. ఆ.రం.ఛం. అ 2 ప 72. సు.సా. ప 225
  75. ఆ.రం.ఛం. అ 2 ప 73
  76. ఆ.రం.ఛం. అ 1 ప 74
  77. ఆ.రం.ఛం. అ 2 ప 75
  78. ఆ.రం.ఛం. అ 2 ప 76
  79. ఆ.రం.ఛం. అ 2 ప 77
  80. ఆ.రం.ఛం. అ 2 ప 78
  81. ఆ.రం.ఛం. అ 2 ప 79
  82. ఆ.రం.ఛం. అ 2 ప 81
  83. ఆ.రం.ఛం. అ 2 ప 82
  84. ఆ.రం.ఛం. అ 2 ప 83
  85. ఆ.రం.ఛం. అ 2 ప 84
  86. ఆ.రం.ఛం. అ 2 ప 85
  87. ఆ.రం.ఛం. అ 2 ప 86
  88. ఆ.రం.ఛం. అ 2 ప 87
  89. ఆ.రం.ఛం. అ 2 ప 88
  90. ఆ.రం.ఛం. అ 2 ప 92. సు.సా.లో 256 ప
  91. ఆ.రం.ఛం. అ 2 ప 93
  92. ఆ.రం.ఛం. అ 2 ప 94
  93. ఆ.రం.ఛం. అ 2 ప 95
  94. ఆ.రం.ఛం. అ 2 ప 98
  95. ఆ.రం.ఛం. అ 2 ప 99. సు.సా. ప 257
  96. మల్లియరేచన కవిజనాశ్రయములోనిది గాని ఉత్తమగండ ఛందస్సులోనిది కాదని సంబోధన విశదపరుచుచున్నది.
  97. ఆ.రం.ఛం. అ 2 సం 101
  98. ఆ.రం.ఛం. అ 2 సం 102
  99. ఆ.రం.ఛం. అ 2 సం 104 సు.సా.315 ప
  100. ఆ.రం.ఛం. అ 2 ప 105 సు.సా.415 ప
  101. ఆ.రం.ఛం. అ 2 ప 103
  102. ఆ.రం.ఛం. అ 2 ప 106 సు.సా. 314
  103. ఆ.రం.ఛం. అ 2 ప 117
  104. నాల్గవచరణం యతిస్థానం సరిగాలేదు.
  105. నలువు+ఉఱవు సౌందర్యము అధికము
  106. ‘ప’కు సంబంధించిన పద్యము మూలములోనే లేదు.
  107. రెండవచరణములో యతిస్థానము సరిగా లేదు.
  108. సు.సా.లో 242 ప
  109. సు.సా.లో 244 ప
  110. ఆ.రం.ఛం. ప 129
  111. ఆ.రం.ఛం. సం 120 సు.సా.లో 238 ప
  112. ఆ.రం.ఛం. సం 128
  113. ఆ.రం.ఛం. సం 126 సు.సా.లో 239 ప
  114. ఆ.రం.ఛం. సం 133 సు.సా.లో 133 ప
  115. ఆ.రం.ఛం. అ 2 ప 127
  116. సు.సా.లో 209 ప
  117. సు.సా.లో 210 ప
  118. సు.సా.లో 211 ప
  119. సు.సా.లో 212 ప కాని ప్రారంభపదము భిన్నముగా నున్నది.
  120. సు.సా.లో 213
  121. ఆ.రం.ఛం. అ 2 ప 137
  122. సు.సా.లో 215 ప
  123. మూలములో 'పా కడిగిన' అని యున్నది.
  124. ఆ.రం.ఛం. అ 2 ప 140లో సంభోధన మాత్రము లేదు.
  125. అ ఇది లక్షణసారములోనిది యని ఆ.రం.ఛం. అ 2 ప 145 గా నుదహరింపబడినది. అది పొరపాటని రుజువగుచున్నది. ఇట్లే ఈపద్యము సులక్షణసారములోఁగూడ నుదహరింపబడినది.
  126. ఆ.రం.ఛం.లో 142క్రింది వచనము.
  127. ఉదాహరణ నీయ మరచినాడు. కాని ఆనందరంగరాట్ఛందము 2.143 గా నున్నది.
  128. కవికంఠపాశము సంస్కృతరచన. ఈపద్యం దేనిలోనిదో?
  129. ఆ.రం.ఛం. అ 2 సం 148, 149 లలో వేరువేరుగా చెప్పఁబడిన భాగమంతయు నిచ్చట ఒకటిగాఁ జెప్పబడినది. కాబట్టి యిదియె సరయైనదిగా భావించవచ్చును.
  130. ఆ.రం.ఛం. ఆ 2 సం 144
  131. ఇది అథర్వణకృతము కాదు. ఈసంబోధనలు శ్రీధరచ్ఛందస్సు (క్రీ.శ.1350)లోనివి యని తెలియుచున్నది.
  132. ఆ.రం.ఛం. అ 3 ప 149 మూలములో పోయిన కొంతభాగమును ఆ.రం.ఛం. లోని పద్యమునుం డెత్తి కుండలీకరణములోఁ జూపించితిని.
  133. ఆ.రం.ఛం. అ 2 సం 152
  134. ఆ.రం.ఛం. అ 2 సం 153
  135. ఆ.రం.ఛం. అ 2 ప 155 సు.సా. 217
  136. ఆ.రం.ఛం. అ 2 ప 157 సు.సా. 218
  137. ఆ.రం.ఛం. అ 2 ప 160 సు.సా.లో 265
  138. సు.సా.లో 219 ప
  139. సు.సా.లో 220 ప
  140. సు.సా.లో 239 ప
  141. సు.సా.లో 224 ప
  142. ఆ.రం.ఛం. అ 2 ప 164
  143. ఆ.రం.ఛం. అ 2 ప 165
  144. ఆ.రం.ఛం. ఆ 2 ప 166
  145. ఆ.రం.ఛం. ఆ 2 ప 167
  146. ఆ.రం.ఛం. ఆ 2 ప 168
  147. ఆ.రం.ఛం. ఆ 2 ప 169