Jump to content

సరి సరి

వికీసోర్స్ నుండి

కాపి రాగం - ఆది తాళం

[మార్చు]

పల్లవి:

సరి సరిలే మంచిది సరి సరిలే మంచిది
మరు శరములకు బెదరి చేరినది
అరమరిక లేమిరా అరమరలిక లేమిరా ||

చరణం 1:

పలుమారు నేనిను బ్రతిమాలితినని
పాటింపవురా వేణుగోపాల
కలకాలంబును ఘనమా నీకిది ||

చరణం 2:

మ్రొక్కగ వచ్చిన మోడి సేతువురా
మోహన రూపా వేణుగోపాలా
దక్కితిరా దాసు శ్రీ రామ పాల ||

"https://te.wikisource.org/w/index.php?title=సరి_సరి&oldid=410589" నుండి వెలికితీశారు