సరసమైన మాటలంత

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ప|| సరసమైన మాటలంత చాలుచాలురా సామి

అ|| సారసాక్ష మీకెంతో సంతోషము మేలు మేలు

చ1|| సోము డుదయమాయెనే మీ సుదతికి
మహాభయమాయెనే
కామకోటిసుందరా మా
భాగ్యమిటులాయెనే

చ2|| మరునాథుని శరభంగము గావోదూ
నీకు మాయందు దయ కానరాద
విరహమైన వారిధిలో
మునికాయుందా నన్నతో

చ3|| మనవి వినర సామి నిన్ను
నమ్మియున్నాను మరేమి
ఘనుడైన శేషునిపై
వెలయు శ్రీపద్మనాభ