Jump to content

సకలనీతిసమ్మతము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

1. పరిచయము

ప్రాచీనాంధ్రకవి మడికి సింగన రచించిన 'సకలనీతిసమ్మతము' అను నీగ్రంథము క్రీ. శ. 1923లో శ్రీమానవల్లి రామకృష్ణకవి మహోదయులచే విస్మృతకవుల కృతులలో పదవదిగా ప్రకటితమైనది. కవిగా రాసంవత్సరముననే దీనిని ముద్రించినను, వా రిప్పటి కరువదేండ్లక్రిందటనే ఈ గ్రంథము నెఱుగుదురు. క్రీ. శ. 1910లో వారు ప్రకటించిన 'ప్రబంధమణిభూషణము' పీఠికలో నీ గ్రంథమునుగూర్చి యిట్లు వ్రాసియున్నారు.[1]

"ఇట్టి సంచితకృతులు సంస్కృతమున విస్తారముగా గలవు. ఆంధ్రభాషలో నాకు లభించినంతవట్టు పరికింప నట్టికృతికర్తల మడికి సింగనయే ప్రథముఁడు, అతఁడు ప్రాచీనపంచతంత్రి, ప్రాచీనకామందకము, ముద్రామాత్యము, నీతిభూషణము, బదైననీతి, కుమారసంభవము, భారతము, మనుమంచిభట్టు నశ్వశాస్త్రము మొదలగు గ్రంథములలోని రాజనీతిపద్యముల నన్నియు నేఱి సకలనీతిసమ్మతమను గ్రంథమును గూర్చెను” (పుట 1).

కవిగా రీసకలనీతిసమ్మతమును ప్రకటించుటయేగాక, యెనిమిది పుటలలో విశేషవిషయవిలసితమగు నొకయుపోద్ఘాతము వ్రాసియున్నారు. దాని మూలమున మన ప్రాచీనాంధ్రవాఙ్ఞ్మయచరిత్రలో నెన్నికావ్యములు నష్టమైనవో తెలియుటయేగాక, తెలుగుసాహిత్యమున నీనాటికి పరిశీలనలేని, శాస్త్రవాఙ్ఞ్మయమును గూర్చిన నూతనవిశేషములు తెలియుచున్నవి. ఇది చాల విలువగల గ్రంథమైనను, నీ నలభై ఏడేండ్లనుండి దీనిని కూలంకషముగా గాకపోయిన - అథవా అలవోకగానైన - విమర్శకులు పరిశీలింపలేదు.

ఈ గ్రంథప్రశస్తిని గూర్చి- పునర్ముద్రణావశ్యకతను గూర్చి నేను మూడుపరియాయములు హెచ్చరించితిని.[2] నేటి కిది ద్వితీయముగానేగాక , అద్వితీయముగా కూడ ముద్రణమైనందులకు ఎంతో సంతోషింపవలసియున్నది.

ఈ గ్రంథమింతవఱకు అజ్ఞాతవాసము చేయుచున్నందున ప్రథమముగా గ్రంథమునుగూర్చి, గ్రంథస్థవిషయములనుగూర్చి తెలిసికొనుట యావశ్యకము గాన వానితో ప్రారంభించుచున్నాను.

2. గ్రంథరచనావిధానము

శ్రీ కవిగారివ్రాతను బట్టి యిది సంకలనగ్రంథ మగుట స్పష్టము.

సింగన తాను రచియించినది సంకలనగ్రంథమే యైనను, దీనిని “ప్రబంధ'మనియే వ్యవహరించియున్నాడు. ప్రబంధమువలె నిందు, కృత్యవతరణిక , షష్ఠ్యంతములు , ఆశ్వాసాద్యంతపద్యములు, గద్య గలవు. “నారద వసిష్ట పరాశరబాదరాయణ భృంగ్వాంగిరసగురు శుక్రమతానుసారంబై దేవ మానవ రాక్షసంబులగు నయశాస్త్రంబులు పరీక్షించి యంధ్రభాషాకోవిదులగు సుకవీంద్రరచితంబైన ముద్రామాత్య- పంచతంత్రీ- బద్దె భూపాల- చాణక్య- ధౌమ్య- విదుర- ధృతరాష్ట్ర- బలభద్ర- కామందక- గజాంకుశ- నీతిసార- నీతిభూషణ- క్షేమేంద్ర- భోజరాజవిభూషణ- పురుషార్థసార- భారత- రామాయణాది మహాకావ్యంబులు, పురాణేతిహాసంబులు, కందనామాత్యునీతితారావళి, లోకోక్తి - చాటుప్రబంధంబులయందును గల నీతివిశేషంబు లూహించి తత్తత్సారాంశంబు లయ్యైవిధంబుల వర్గసంగతంబుగా సకలనీతిసమ్మతం బనుపేర నొక్క

ప్రబంధంబు

రచియింపుదునని ప్రబంధసారంబునకు ననుగుణంబుగా నేపురుషునిం బ్రార్థింతునో యని విత్కరించి" అని సింగన వ్రాయుటయే గాక గద్యయందు

“ఇది శ్రీ నరసింహప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజసగోత్రాయ్యలార్యపుత్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతంబైన సకలనీతిసమ్మతంబను 'ప్రబంధంబు' నందు...... ప్రథమాశ్వాసము” అని వ్రాయుట వలన సింగనదృష్టిలో నిది ప్రబంధమే.

3. సంకలనగ్రంథములు

సింగన యిట్లు స్పష్టముగా ప్రబంధమని నిర్దేశించినను, ఇది సంకలనగ్రంథమే. సంకలనగ్రంథ మనగా కవి, తనకు పూర్వమందున్న కవుల కావ్యములనుండి వర్ణనాంశములుగాని శాస్త్రవిషయములుగాని సేకరించి, వానిని వర్గీకరించి, ఏకాకారమైన యొకకృతిగా సమకూర్చు సాహిత్యప్రక్రియ. సింగన తనకుముం దిట్టిగ్రంథరచన లేకపోవుటచేత, తాను సమకూర్పబోవు కృతి నిట్లు, బహుమనోహరముగా సమర్థించియున్నాడు—

సీ.

“ఆలోలకల్లోలమగు దుగ్ధనిధిఁ ద్రచ్చి
             దేవామృతము తేటఁ దేర్చుపగిది
గంధకారుడు మున్ను గల వస్తువులు జోకఁ
             గూర్చి సుగంధంబు గూడినట్లు
అడవిపువ్వులతేనె లన్నియు మధుపాళి
             యిట్టలంబుగ జున్ను వెట్టుభంగిఁ
దననేర్పు మెఱసి వర్తకుఁడు ముత్తెములీడు
             గూర్చి హారంబు తా గ్రుచ్చుకరణి


గీ.

గృతులు మును సెప్పినట్టి సత్కృతులు ద్రవ్వి
కాంచుకంటెను నొకచోట గానఁబడఁగ
సకలనయశాస్త్రమతములు సంగ్రహించి
గ్రంథ మొనరింతు లోకోపకారముగను."

14
ఇ ట్లొకప్రణాళిక నిర్ణయించుకొని సింగన, తనకు పూర్వపుకృతుల నుండి పద్యములను సేకరించినాడు. కాని పద్యములన్నియు నితరకవులవే గదా. అందువలన వానిని వర్గీకరణము చేసి, వాని నొకదానితో నొకటి యనుసంధించునట్లు, తిరిగి యీ రీతిని చెప్పినాడు. పుట:Sakalaneetisammatamu.pdf/6 పుట:Sakalaneetisammatamu.pdf/7 పుట:Sakalaneetisammatamu.pdf/8 పుట:Sakalaneetisammatamu.pdf/9 పుట:Sakalaneetisammatamu.pdf/10 పుట:Sakalaneetisammatamu.pdf/11 పుట:Sakalaneetisammatamu.pdf/12 పుట:Sakalaneetisammatamu.pdf/13 పుట:Sakalaneetisammatamu.pdf/14 పుట:Sakalaneetisammatamu.pdf/15 పుట:Sakalaneetisammatamu.pdf/16 పుట:Sakalaneetisammatamu.pdf/17 పుట:Sakalaneetisammatamu.pdf/18 పుట:Sakalaneetisammatamu.pdf/19 పుట:Sakalaneetisammatamu.pdf/20 పుట:Sakalaneetisammatamu.pdf/21 పుట:Sakalaneetisammatamu.pdf/22 పుట:Sakalaneetisammatamu.pdf/23 పుట:Sakalaneetisammatamu.pdf/24 పుట:Sakalaneetisammatamu.pdf/25 పుట:Sakalaneetisammatamu.pdf/26 పుట:Sakalaneetisammatamu.pdf/27 పుట:Sakalaneetisammatamu.pdf/28 పుట:Sakalaneetisammatamu.pdf/29 పుట:Sakalaneetisammatamu.pdf/30 పుట:Sakalaneetisammatamu.pdf/31 పుట:Sakalaneetisammatamu.pdf/32 పుట:Sakalaneetisammatamu.pdf/33 పుట:Sakalaneetisammatamu.pdf/34 పుట:Sakalaneetisammatamu.pdf/35 పుట:Sakalaneetisammatamu.pdf/36 పుట:Sakalaneetisammatamu.pdf/37 పుట:Sakalaneetisammatamu.pdf/38 పుట:Sakalaneetisammatamu.pdf/39 పుట:Sakalaneetisammatamu.pdf/40 పుట:Sakalaneetisammatamu.pdf/41 పుట:Sakalaneetisammatamu.pdf/42 పుట:Sakalaneetisammatamu.pdf/43 పుట:Sakalaneetisammatamu.pdf/44 పుట:Sakalaneetisammatamu.pdf/45 పుట:Sakalaneetisammatamu.pdf/46 పుట:Sakalaneetisammatamu.pdf/47 పుట:Sakalaneetisammatamu.pdf/48 పుట:Sakalaneetisammatamu.pdf/49 పుట:Sakalaneetisammatamu.pdf/50 పుట:Sakalaneetisammatamu.pdf/51 పుట:Sakalaneetisammatamu.pdf/52 పుట:Sakalaneetisammatamu.pdf/53 పుట:Sakalaneetisammatamu.pdf/54 పుట:Sakalaneetisammatamu.pdf/55 పుట:Sakalaneetisammatamu.pdf/56 పుట:Sakalaneetisammatamu.pdf/57 పుట:Sakalaneetisammatamu.pdf/58 పుట:Sakalaneetisammatamu.pdf/59 పుట:Sakalaneetisammatamu.pdf/60 పుట:Sakalaneetisammatamu.pdf/61 పుట:Sakalaneetisammatamu.pdf/62 పుట:Sakalaneetisammatamu.pdf/63 పుట:Sakalaneetisammatamu.pdf/64 పుట:Sakalaneetisammatamu.pdf/65 పుట:Sakalaneetisammatamu.pdf/66 పుట:Sakalaneetisammatamu.pdf/67 పుట:Sakalaneetisammatamu.pdf/68 పుట:Sakalaneetisammatamu.pdf/69 పుట:Sakalaneetisammatamu.pdf/70 పుట:Sakalaneetisammatamu.pdf/71 పుట:Sakalaneetisammatamu.pdf/72 పుట:Sakalaneetisammatamu.pdf/73 పుట:Sakalaneetisammatamu.pdf/74 పుట:Sakalaneetisammatamu.pdf/75 పుట:Sakalaneetisammatamu.pdf/76 పుట:Sakalaneetisammatamu.pdf/77 పుట:Sakalaneetisammatamu.pdf/78 పుట:Sakalaneetisammatamu.pdf/79

ప్రథమముద్రణము - ముఖపత్రము



ప్రథమముద్రణము

ఉపోద్ఘాతము

—:౦:—

రాజ్యాంగములలో సకలవర్గంబుల వారును బరస్పరము ప్రవర్తింప వలసిన నీతిమార్గమును సకలగ్రంథసమ్మత మగునట్టిదిగా నేర్చి దీని సకలనీతిసమ్మత మనుపేర మడికి సింగన కూర్చె. ఇంచుఁ జేర్పనుద్దేశించిన నీతివర్గముల గ్రంథారంభముననే (17వ సంఖ్య గద్యమున) కవి వివరించె నందు "అధికాధమవిరోధభేదంబుసు" అనునంతకుఁ గల మూఁడాశ్వాసముల గ్రంథమె మనకు లభింపఁగా నిందు ముద్రింపఁగడంగితిమి. పైభాగము సహితము లభించునేని వాాఙ్మయమునకు నిక్కముగాఁ బెంపుగలుగును. ప్రతిజ్ఞాతవిషయములో రాజనీతిభాగము మూఁడాశ్వాసములనె ముగియుచుండుటవలనను దక్కినభాగములో లోకోక్తిసంగీతనాట్యవిషయమును బూజాప్రతిష్ఠాధ ప్రశంసలుసు గలవగుటచే నీగ్రంథమును మొదట వ్రాసికొనిన వారు దాని ససంబద్ధమని వదలి యుందురేమో.

మడికి సింగన గోదావరిప్రాంతమున నుండు పెద్దమడికి నివాసియయ్యును నోరుగల్లున కుత్తరమున నుండు రామగిరి పట్టణమున కవీశ్వరుండగు కందనమంత్రి కాశ్రితుఁడై బహుగ్రంథముల రచించె. వానిలోఁ బద్మపురాణము, భాగవత దశమస్కంధము (ద్విపదకావ్యము), వాసిష్ఠరామాయణము మనకు లభించుచున్నవి. దశమస్కంధభాగము తంజాపురి పుస్తకభండారమున నాద్యంతములు లేక యొకమాతృక గలదు. తక్కినవి ముద్రితములైనవి. కందనమంత్రిపేర నీతితారావళియని యొకగ్రంథము సింగన రచియించినది నేటికిఁ గానరాదు. సింగన సకలనీతిసమ్మతమున దానిలోనుండి పెక్కుపద్యము లుదాహరించుకొనెను. మడికి సింగన యుండినకాలము పద్మపురాణరచనాకాలము తెలిసినందునఁ జిక్కులు లేక విస్పష్ట సుగుచున్నది.

"ఆకరయుగాసలమృగాంకశకవత్సరయులై పరఁగు శాశ్వరిని బుణ్య
ప్రాకటితమార్గశిరపంచమిని బొల్చు నుడుపాలసుతవాసరమునందున్
శ్రీకరముగామణికి (మడికి) సింగన దెనుంగున రచించెఁ దగఁ బద్మపురాణం
బాకమలమిత్రశిశిరాంశువుగఁ గంద సచివాగ్రణికి మంగళమహాశ్రీ."

అనఁగా శాలివాహన వర్షములు 1342 లకు సరియైన క్రీ.శ. 1420 సంవత్సరమునఁ బడ్మపురాణము రచింపబడియె. కవి తనగ్రంథరచనాకాలము చెప్పకున్నను గందనమంత్రియు నతని కాశ్రయులగు ముప్పడియుఁ డెలుంగురాయఁడును బ్రభుత్వము చేసిన కాలములు సులభముగా లభించుచున్నందున మడికి సింగన కాలము దుస్సాధ్యము గానేరదు. సకలనీతిసమ్మతమునఁ బద్మపురాణమునుండి పద్యములు (204 మొ) గ్రహింపఁబడినందున ఇది 1430 క్రీ. శ. ప్రాంతముల రచింపఁబడియుండును. ఈకాలముననే శ్రీనాథుఁడును, నిశ్శంక కొమ్మనయు (శివలీలావిలాసకర్త), గౌరన, అనంతుఁడు. జక్కన, మల్లన మొదలగు కవులు తమతమకృతులచేఁ బ్రఖ్యాతివడయుచుండిరి. సకలనీతిసమ్మతము దేవాంకిత మైనను గందనామాత్యుని భ్రాతయగు కేసనమంత్రి సబహుమానముగా నిందుఁ బేర్కొనబడియె. కంచన బ్రాహ్మణుఁడు, కాశ్యపగోత్రజుఁడు. కందుకూరి వీరేశలింగం పంతులవారు కందనమంత్రి పూర్వజులలో నొక్కఁడగు గన్నమంత్రిని మార్కండేయపురాణకృతిపతియగు గన్నమంత్రిగా గ్రహించి ప్రమాదపరంపరతో భావనాసోపానములు గట్టెను. కందమంత్రిని,

“ధరణీదేవకులాబ్ధిచంద్రవిలసద్దానాంబుధారార్ద్రవి
స్తరహస్తాంబుజ మంత్రిరక్షణకళాచాతుర్యసాహిత్యగీ
తరసాస్వాదనలోకమానససదాధర్మజ్ఞ శ్రీముప్పడీ
శ్వరకారుణ్యకబాక్షవర్ధిత మహాసౌభాగ్యభాగ్యోదయా."

అని పద్మపురాణమున నష్టమాశ్వాసాంతమునఁ గవి సంబోధించెను. మారన మార్కండేయపురాణమున గన్నమంత్రి వంశావతారక్రమము వర్ణించుచు,

“ఆచతుర్థకులసుధాంబుధి నుదయించె నమితకాంతిచంద్రుఁ డవనిభరణ
దిగ్గజేంద్రమును వితీర్ణమందారంబు మల్లసైన్యవిభుఁడు మహితకీర్తి".

అని గన్నమంత్రిఁ జతుర్థవంశజునిగాఁ బేర్కొనియె. కావున నీరెండువంశములవారును భిన్ను లగుట నిశ్చయము. కందనమంత్రి తాతలు కాకతీయగణపతియొద్ద సామంతులై యుండి గణపేశ్వరాదిస్థలముల దేవాలయప్రతిష్ఠలు సేసి ప్రఖ్యాతి గాంచిరి. మడికి సింగన తిక్కనసోమయాజి కుమారుఁడగు కొమ్మనమంత్రికి దౌహిత్రుని కుమారుఁడు. ఆదౌహిత్రుఁడగు నయ్యలమంత్రియు ననపోతిరెడ్డికి మంత్రియై ప్రసిద్ధి కెక్కె. కావుననే మడికి సింగనకు రాజనీతిశాస్త్రముల దౌరంధర్యము గలిగెఁ గాబోలు. మడికి సింగన కాలము కనుసరించి చూచినయెడలఁ దిక్కన కాలము 1260 కంటెఁ బ్రాఁతపడదు.

సకలనీతిసమ్మతమున సుద్దృతములగు పద్యముల కాకరగ్రంధనామము గవియే పేర్కొనియె. ఆంచు ముద్రామాత్యము. నీతిసారము, పంచతంత్రి, పురుషార్థసారము, నీతిభూషణము, కామందకము, నీతితారావళి, కుమారసంభవము, చారుచర్య, బదైననీతి, పద్మపురాణము, శాలిహోత్రము, భావతము మొదలగునవి గలవు. వీనిలో మొదటియేడుగ్రంథములు నష్టము లయ్యె. కుమారసంభవము నన్నెచోడకృతము, బద్దెననీతియు మేము ముద్రింపించి యుంటిమి. చారుచర్య శ్రీముక్త్యాల ప్రభువులచేఁ బ్రకటింపబడిది. శాలిహోత్రము పీఠికాపద్యములు గానరాక కొంతభాగము పెక్కుచోటుల ముద్రితమయ్యె. తక్కినవి సుప్రసిద్ధములు. ఈగ్రంథములన్నియు సింగనకంటెఁ (1420 క్రీ.శ.) బూర్వరచితములని స్పష్టము.

శాలిహోత్ర మనునశ్వశాస్త్రమును మనుమంచిభటారకుఁ డనుకవి హయలక్షణవిలాస మనుపేరఁ దెనిగించెను. ఇయ్యది యెంతప్రాచీనమో యెఱుగుట కానుకూల్యము లేక పీఠికాపద్యము లెచ్చటను లభించినవి కావు. ఆది చాళుక్యకంపభూపతి కంకిత మీయఁబడియె. విద్యానగరపుఁ గంపభూపతి మడికి సింగన కాలమువాఁడు కావున మనుమంచిభట్టును నతని ప్రభువగు కంపరాజును తప్పక ప్రాచీనులే.

ముద్రామాత్యము క్షేమేంద్రుఁ డను బిరుదము వహించిన లక్కాభ ట్టనుకవి రచించినట్లు తోచుచున్నది. క్షేమేంద్రకని క్రీ. శ. 1050 ప్రాంతముల నుండెఁ గావునం దద్బిరుదవహనముచే నితఁడు తత్పూర్వుఁ డగుటకు సాధ్యుఁడు కాఁడు. అతఁడు శూద్రకరాజచరిత్రమును శతపక్షిసంవాదమును రచించినట్లు లక్షణగ్రంథోదాహృతవద్యములవలనఁ దెలియుచున్నది. బాలబోధ మనియుఁ గవిసంజీవని యనియు సందిగ్ధనామములు గల యొక్కఛందోగ్రంథమున ముద్రామాత్య నీతిభూషణ పురుషార్ధసారములనుండి పద్యము లుదాహృతము లయ్యె. అందు ముద్రామాత్యములోని దని క్రిందిపద్యము గానఁబడుచున్నది.

మ.

మనుజాధీశ్వరుకంటె మంత్రి బలసామర్థ్యంబు నర్థంబు రా
జ్యనియోగంబును నగ్గలం బగుచు నాజ్ఞాలంఘనోద్యుక్తుఁడై
మను దుష్టవ్యవసాయుఁ డే మఱి మదోన్మత్తాత్ముఁడై కూలు గ్ర
క్కున ము న్నాతనిచేఁ దదీశుఁడు నదీకూలావనీజాకృతిన్.

ముద్రామాత్యము కేవలము నీతిగ్రంథము కాక ముద్రారాక్షసమువలె నొకరాజు ప్రాభవమును సంపాదించు మంత్రిశిఖామణి నీతిదౌరంధర్యమును వర్ణించుకావ్యమో యనుసందియము గలిగించుచున్నది. ఇందు రాజరాజవంశజు లగుచోళభూపతుల జయించిన చాళుక్యరాజులయో లేక చాళుక్యుల జయించిన కాకతీయులయో పరాక్రమము ప్రశంసింపఁబడిన ట్టుదాహృతపద్యములవలన నూహింపదగియున్నది.

ఆ.

రాజరాజవంశభూజనపతు లీల్గి, రకట మంత్రి దొలఁగి యలికినాఁడు
ఏది పనుపు సేయ నిటు నిల్వఁబోలదు, రాజు లేనికయ్య మోజపడునె.

927


ఉ.

కొన్నిదినంబు లిక్కడ నకుంఠితలీలఁ బథశ్రమార్తియై
యున్నబలంబు గెల్చుకొను టొప్పగు నంతియ కాదు శత్రుభూ
మి న్నిజమార్గ మారయక మిన్నక యేఁగుట యేది బుద్ధి యా
యున్నెడఁ జూచి వెళ్లుజను లున్నర (?) చెప్పుఁడు గూఢచారతన్.

852

ఇవి కథాభాగములో పద్యములట్లు గాన్పించును గాని కేవలము నీతివిచారములు గావు.

నీతిసారమును మొదటికాకతీయరుద్రదేవుఁడు రచించినట్లు ప్రాచీనపద్యోదాహరణములు గలవు. ఉషాపరిణయ మనుసంస్కృతనాటకము రుద్రదేవకృత మని యొకటి గలదు కాని యక్కవి కాకతీయుఁడా యనుట విశదము కాదయ్యె. సంస్కృతభాషలోఁ గామందకనీతిసారము, శుక్రనీతిసారము అని ప్రసిద్ధములుగా రెండు నిబంధనములు గలవు. సింగన యుదాహరించిన నీతిసారపద్యములకు మూల మారెంటను గానరాదు. బార్హస్పత్యనీతిసార మని మూఁడువేలశ్లోకములలో నొకటి యుండినట్లు వైశంపాయనకృతివ్యాఖ్యాతయు యామళాష్టకతంత్రకారుఁడుసు బేర్కొనుచున్నందునను వీరమిత్రోదయాదిగ్రంథములలోని బృహస్పతిమతనీతియె మననీతిసారపద్యములఁ గానవచ్చుచున్నందున రుద్రదేవుఁడు బార్హస్పత్యనీతిసారమునె తెనిఁగించె నని సందేహము గలుగుచున్నది.

సకలనీతిసమ్మతమునఁ బంచతంత్రిపేర నుడివిన గ్రంథము లభింపదయ్యె. కర్తపేరు నెఱుంగ సాధ్యము గాదు. ఈ కవి లభించుచున్నపంచతంత్రములకర్తలకంటెఁ బ్రౌఢుఁడని వెంకటనాథాదులపద్యముల బోల్చి చూచిన నెఱుంగవచ్చును.

నీతిభూషణమును నాంధ్రభోజుఁ డనుకవి రచించిన ట్లొకలక్షణగ్రంథమునఁ గలదు కాని యతఁ డెవ్వఁ డని గుర్తింప వీలుకాదు. బాలబోధలక్షణమున దీనిలోనుండి పెక్కుపద్యము లుదాహృతము లయ్యె. అందు.

మ.

సకలస్థాణుశిరఃప్రవర్తి నురుపక్షద్వంద్వశుక్లాభిరం
జకుఁడన్ సర్వదిగంతగామి నసకృత్సంసేవ్యమానుండ నై
ష్ఠికుఁడం గావున మత్సమానుఁ డగునే శీతాంశుఁ డం చెప్పుదుం
బక మిందుం బ్రహసించునట్లు సుజనుం బల్కుం దురాత్ముం డిలన్.


చ.

వలసినవంకలం గురియు వర్ష సమాగమమేఘ మేఁగి త
న్మలినత దాతయం దవగుణంబును సహ్యమె దృష్టి లేక ని
ర్మల మగుచోఁ దలంపఁగ శరద్ఘన మేటికి నట్ల యీగిమై
నెలయనివానివెల్లఁదన మేమి ప్రయోజన మర్థికోటికిన్.

అని మొదలగు పద్యములు గలవు. నీతిభూషణమునకు సంసృతమున మూల మేదో యిప్పటికి తెలియరాదు.

పురుషార్థసారము గణపతికి రుద్రదేవికిని మంత్రి యగు శివదేవయ్యచే రచిత మని “శివదేవయ్య పురుషార్థసారములో” నము నుదాహరణమువలన నూహింపఁదగియున్నది. అతఁడు పురుషార్థసారము గాక "శివదేవధీమణీ” యని మకుటము గలయొకశతకమును గూడ రచించినట్లు తోచుచున్నది. బాలబోధమునను లక్షణశిరోమణిలోను బురుషార్ధసారశివదేవశతకపద్యములు పెక్కు లుదాహృతము లయ్యె. శతకములో నుండి—

ఉ.

ప్రాణు నపానుఁ గూల్చి యలపాముఁ గదల్చి తదూర్ధ్వకీలితో
ద్యాణము నొత్తి మేను దృఢమై నిగుడం బిగియించి దృష్టులం
ఘోణము చేర్చి యాప్రణవఘోషణమున్ విని యందు మానస
క్షీణము సేసినం బవనసిద్ధుఁ డనా శివదేవధీమణీ.

చ.

అరయఁగఁ బిన్ననాఁట సిరియాళుఁడనై యెలఁబ్రాయమందు సుం
దరుఁడును నంబినై పదను దప్పిన గుండయగారిచందమై
ధరఁ జరియింపఁ గల్గినఁ దథాస్తు వృథాపరిపాకరూపదు
ష్కరజననం బిదేమిటికిఁ గాలుపనే శివదేవధీమణీ.

అనుపద్యములును, సకలనీతిసమ్మతమున నుదాహృతము లగు 144, 179, సంఖ్య గల పద్యములు పురుషార్థసారమునుండియు బాలబోధమునఁ దత్కర్త యుదాహరించె.

కామందకము సంస్కృతముననుండి కొండ్రాజు వేంకటాద్రి నరేంద్రున కంకితముగా నెనిమిదాశ్వాసములు 1584 క్రీ. శ. వేంకటరామకృష్ణకవులు తెనిఁగించినది గలదు. మడికి సింగన తత్పూర్వుఁ డగుటచే నందు మనపద్యములు గానరాకుండుట యచ్చెరువు కాదు. కామందకము కౌటిల్యునియర్థశాస్త్రములోని సారము గలది. దానికి సంస్కృతభాషలో మూఁడువ్యాఖ్యలు గలిగియు నందుఁ గొన్నిస్థలములు క్లిష్టముగా నుండును. అది శాస్త్రగ్రంథమువలెఁ గాక మనోహరకావ్యమువలెఁ బ్రసన్నగంభీరమై యున్నది. సింగన యుదాహరించినకామందక మెవ్వరియనువాదమో కాని యడి ప్రౌఢమై సందిగ్ధస్థలములఁ జక్కఁగా వివరించునదియై యున్నది. తరువాతి కామందకము పెక్కుచోట్ల నీరసమై శాస్త్రవిరుద్ధ మగుటయుఁ గాక కవితయు శిథిలబంధయై వృత్తజాతిసమాహరణమున గవికిఁ బ్రజ్ఞాదారిద్ర్యము దోపించును. సకలనీతిసమ్మతములోని 286 వ పద్యమునకు రెండవకామందకమున—

మ.

తొలుతం దా జలకంబు దీర్చి చలువల్ తోడ్తో విరుల్ సొమ్ములుం
గలపం బందుచు దేవియుం జలకముల్ గావించి రాఁ జల్వలుం
గలవంబుల్ మణిభూషలున్ విరులు జోకం దానె యిప్పించి నే
ర్పులఁ గూడందగు రాజు పెంపెసఁగ నింపున్ సొంపు గల్పించుచున్.

ఈవర్ణనము రాజు లాత్మరక్షణార్థము తమదేవులయిండ్లకుఁ బోక వారినే తమవాసగృహములకుఁ దెప్పించుటయె నీతి యను నుపదేశసందర్భమున నున్నది. ప్రధానాంశము మఱచి కవి రాజభోగము వర్ణించె. 257 వ పద్యమునకు రెండవకామందకమున—

సి.

విషముఁ జూచిన వేళ విషయుక్త మైన
             పదార్థంబు చూచినయట్టివేళఁ
దలఁకఁబాఱుచును గ్రోతులును రాచిలుకలు
             గొరవంకలుసు సారెఁ గూఁత లిడును
గన్ను లెఱఁగఁబాఱుఁ గలహంసలకునెల్ల
             మఱి మదంబునఁ జెంది మరియుఁ గొంచ
మదకోకిలంబులు మరణంబు సెందును
             వెన్నెలపులుఁగులు వేగ బడలు


గీ.

నిందు నొక్కటిచేనైన నెందు లెస్స
తాఁ బరీక్షించి ధారుణీధవున కెపుడు
భోజనము సేయఁదగు నిట్లు భోజనంబు
చేయుచుండినఁ బతి హాని చెందకుండు.

ప్రాఁతకామందకమున "లలిఁ జకోరములకన్నులు విరాగము లగు" ననుచోట “చకోరస్య విరజ్యేతే నయనే" యనుటకు రెండవకవి మరాళస్య యని పఠించుకొనియె.

287వ పద్యమునకు సరిగా రెండవకామందకమున—

సీ.

భార్యయింటికిఁ జని భద్రసేనుఁడు తొల్లి యామెతోఁబుట్టుచే హతుఁ డగుటయు
నాలిగృహంబున కరిగి కారూశుండు తనతనూభవునిచేతనె పొలియుటఁ
బ్రియురాలు విషముతోఁ బేలా లొసఁగిన వేగంబ కాశికావిభుఁడు పడుట
జడలోన దాఁచుకుండెడుకత్తి తెలియక రమణిచేతన విదూరథుఁడు చెడుట


గీ.

యటు కరాళాంజనము పూసి యద్ద మందె
మేఖలయు నీయ జారూప్య మేదినీశు
లవని వైరూప్యసౌవీరు లడఁగు టెఱిఁగి
యధిపుఁ డతివలయిండ్లకు నరుగరాదు.

అని చెప్పుటలో భద్రసేనుఁడు తనబావమఱఁదిచేఁ జంపఁబడె ననియు, కరాళాంజనము పూసిన యద్దమును, అందెయు, మొలనూలును బ్రయోగించి క్రమముగా జారూప్య వైరూప్య సౌవీరరాజులఁ దమతమభార్యలు చంపిరని రాజులకు దేవీగృహగమనము కవి నిషేధించుచున్నాడు. ప్రాచీనకామందకమున భద్రసేనుఁడు తనతోఁబుట్టుచేఁ జచ్చినట్టును వైరూప్యునకు మాఱు వైరంత్యుఁ డనియు నున్నది. మూలమున—

దేవీగృహం గతో భ్రాతా భద్రసేన మమారయత్
మాతుః శయ్యాంతరాలీనః కారూశం చౌరసః సుతః
లాజాన్ విషేణ సంయోజ్య మధునేతి విలోభ్య తమ్
దేవీ కు కాశిరాజేంద్రం నిజఘావ రహోగతమ్
విషదిగ్ధేన సౌవీరం మేఖలామణినా నృపమ్
నూపురేణ చ వైరూప్యం జారూష్యం దర్పణేన చ.

అని వైరూప్యమునకు మాఱు వైరంత్యమనియు కొన్ని ప్రతులఁ బాఠము గలదు. కౌటిలీయమున "దేవీగృహే లీనో హి భ్రాతా భద్రసేనం జఘాన। మాతు శయ్యాంతర్గతశ్చ పుత్రః కారూశమ్। లాజా న్మధునేతి విషేణ పర్యస్య దేవీ కాశిరాజమ్। విషదిగ్ధేన నూపురేణ వైరంత్యం। మేఖలామణినా సౌవీరం, జాలూధమాదర్శేన వేణ్యాగూఢం శస్త్రం కృత్వాదేవీ విదూరథం జఘాన॥” అని యున్నది. బాణుని హర్షచరితమున స్త్రీలయందు నమ్మిక దోషజనకం బని "స్త్రీ విశ్వాసిన శ్చ మహాదేవీగృహగూఢభిత్తిభాగ్భ్రాతా భద్రసేనస్యాభవన్మృత్యవే కాళింగస్య వీరసేనః మాతృశయనీయతూలికాతలనిషణ్ణశ్చ తనయో౽ న్యం తనయమభిషేక్తుకామస్య దధ్రస్య కరూశాధిపతే రభవన్మృత్యవే। మధుమోదితం మధురక సంలిప్తైర్లాజైః సుప్రభా పుత్రరాజ్యార్థం మహాసేనం కాశిరాజం జఘాన। వ్యాజజనితకందర్పదర్పా చ దర్పణేన క్షురధారాపర్యంతే నాయోధ్యాధిపతిం పరంతపం రత్నవతీ జారూథమ్। యోగపరాగవిషవర్షిణా చ మణినూపురేణ వల్లభా సపత్నీరుషా వైరంత్యం రంతిదేవమ్। వేణీనిగూఢే స శస్త్రేణ బిందుమతీ వృష్ణిం విదూరథమ్। రసదిగ్ధ మధ్యేన చ మేఖలామణినా హంసవతీ సౌవీరం వీరసేనమ్॥" అని పలుకారణంబుల మగలఁ జంపిన వీరస్త్రీలప్రశంస చేయఁబడియె. ఇంకను శోధింపఁ గళింగరా జగు భద్రసేనుఁడు మహాదేవీగృహమున లోగోడలో దాఁచుకొని యున్న తనయన్నచేతనే చచ్చెనఁట. కాశిరాజగు మహాసేనునిభార్య సుప్రభ తనకొడుకునకు రాజ్య మిప్పించఁగోరి మగనిఁ జంపించెనఁట. సుప్రభకంటెఁ గైకేయి ఋజుహృదయగదా! రత్నవతి మదవిభ్రమవిషంబున నయోధ్యాపతి యగు పరంతపు (నన్యస్త్రీసక్తు) మదనలీలావిలాసముతో నద్దము విసరివైచి చంపెనఁట! సవతిసౌభాగ్యము నోర్వజాలక సునందన వైరంత్యనగ రాధీశుఁ డగురంతిదేవునిపై విషముక్రక్కునందియ విసరివైచి సవతిపై బగదీర్చుకొనియెనఁట. విదూరథరా జగు వృష్టిభార్య బిందుమతి మగని వాక్పారుష్యము సహింపఁజాలక జడలో శస్త్రిక దాఁచి యుంచి సురతాంతపరివశుఁడై విస్రంభముతో తనయురంబున వారిలియున్నతనిఁ జంపివైచెనఁట! ప్రాఁతకామందకమున "కెరలి శత్రులపయిఁ బ్రయోగింపవలయు" నని శత్రురాజులలో భేదము పుట్టింప దుష్టస్త్రీ విషకన్యాప్రయోగమును సమర్థించెను.

ఇట్లు సకలనీతిసమ్మతమునఁ గామందకపద్యముల నెల్ల మూలముతోఁ బరీక్షింపఁ దత్కవి వస్తువిచారము చక్కఁగాఁ జేసి వివరణప్రాయముగాఁ దెనిఁగించె నని తేలుచున్నది.

కవితారచనలో నీతిసార పురుషార్థసారములు చాలఁబ్రౌఢములైనవి. తరువాతఁ బంచతంత్రీ ముద్రామాత్య కామందకములను గ్రమముగాఁ జెప్పవచ్చును. పురుషార్థసారములో భావములు వక్రోక్తిచతురములై హృదయంగమము లగుచున్నవి. తుల్యప్రదేశములఁ బోల్చిచూడ నీప్రాచీనపద్యములకుఁ దరువాతికవుల పద్యరచన తీసిపోయి వస్తునిష్కృష్టియు, రసభావసమగ్రతము, నిమిడికయు ననుటలో న్యూనత్వము చెందుచున్నది.

అర్థశాస్త్రప్రశంస

నాలుగుపవేదములలో నొక్కటి యగునర్థవేదము మానవునియర్థసంపాదసరక్షణక్రమముల నుపదేశించును. అది యర్థసంపాదనమున సకలరసవాదధాతువాదక్రియలును, వార్త యనుపేరఁ బరఁగు కృషి, పాశుపాల్య, వాణిజ్యధర్మములును; అర్థరక్షణక్రమమున ధర్మన్యాయపరిపాలనంబును దండనీతియుఁ గలసి యర్థశాస్త్రం బనఁ బ్రఖ్యాతి గాంచె ఇట్టి శాస్త్రము లోకవ్యవహారవిద్యాసర్వస్వమును గ్రహించుటచే నం దేకదేశముగా రాజనీతి యనుపేర రాజ్యరక్షణక్రమము మాత్రము విశదీకరించునది యర్థశాస్త్ర మని బుధులు వ్యవహరింతురు. ఇందుఁ జాణక్యుని షట్సహస్రి యను కౌటిలీయార్థశాస్త్రము ప్రమాణగ్రంథముగాఁ బరిగణింపఁబడుచున్నది. దీనిలో ధర్మస్థీయ మను వ్యవహారకాండమును మను నారద పరాశర యాజ్ఞవల్క్యాదులు విస్తరించియున్నందున నదియు "రాజనీతినుండి తొలఁగింపఁబడి కేవలము రాజరక్షణము, దుర్గాదిస్థానవిధానము, మంత్రి పరివారలక్షణము. మంత్రాంగప్రకరణము, శత్రురాజులయెడ నుపాయపరికల్పము. యుద్ధాంగసమాహరణము, యుద్ధక్రమము కలసి యర్థశాస్త్రంబు సంక్షేపరూపంబు సెందె. నేఁటికాలమున నిందును గొన్నిభాగములు — ఆత్మరక్షణక్రమము, యుద్దాంగహరణము, యుద్ధక్రమము, మొదలగునవి పరిత్యజించి ప్రజాసంఘవిధానమును, ప్రజాధికారనిర్ణయమును, వార్తావర్ధకసంధివిగ్రహస్వరూపంబును, విజితరాష్ట్రపరిపాలనక్రమమును సర్వాధికారిబలనిర్ణయవిధానము నాదిగా విస్తరింపవలసియున్నది.

ఇప్పుడు లభించు నర్థశాస్త్రగ్రంథములలోఁ గౌటిలీయము శ్రేష్ఠ మైనది. దానిపై బౌద్ధభిక్షవు ప్రభావతియు, మానవమిశ్రయజ్వయు, శంకరాచార్యులును, భట్టస్వామియు రచించిన వ్యాఖ్యలు కొన్ని కొన్ని భాగములకే లభించుచున్నవి. భట్టస్వామివ్యాఖ్యకుఁ గేరళభాషానువాదము చాలభాగమునకుఁ గలదు. వీని నన్నిటిఁ గ్రోడీకరించి వ్యాఖ్యాసారముతోఁ గౌటిలీయమును దెనిఁగించుచున్నారము. అందుఁ దచ్ఛాస్త్ర సంబంధముగాఁ జాల లిఖింపఁదలఁచియున్నందున నిం దర్థశాస్త్రవిషయము విస్తరింప నలవి కాదు.

గ్రంథపరిశోధనము

మేము కొన్ని సంవత్సరములకుఁ బూర్వము నైజాము రాజ్యమున వనపర్తిసంస్థానమున నున్నకాలమున సమీపమున నుండు నమరచింత యను రాజాస్థానమునకుఁ గార్యాంతరమునఁ బోయియున్న కాలమునఁ దత్సంస్థానాధీశ్వరులగు శ్రీమంతు రాజాముక్కర సీతారామ భూపాల బహద్దరువారు మాయందు దయచేసి బద్దెన నీతిశాస్త్రముక్తావళియు సకలనీతిసమ్మతమును లిఖింపఁబడియుండు కాగితపుసంపుటమును ముద్రణార్థ మొసంగిరి. అప్పటికి నీతిశాస్త్రముక్తావళి మూలభాగము ముద్రింపఁబడియుండుటచేఁ బీఠికలో శ్రీమంతులవారి సహాయము నభినందించుచుఁ బాఠభేదములమాత్రము సూచించితిమి. సకలనీతిసమ్మతము లేఖకదోషసహస్రపరిపూరిత మగుటచే నాదర్శాంతరముకొఱకుఁ జిరకాలము ప్రతీక్షించియు లభింపమింజేసి తుద కున్నదాని సవరించి ప్రచురించుటయె మే లని తలంచియు మనోరథసహస్రమాత్రవిజృంభితుల మగు మాకుఁ గార్యసాఫల్యము గానరాక కొంతకాలము చెల్లిన నాంధ్రపత్రికాధీశ్వరులు బ్రహ్మశ్రీ శ్రీయుత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులవారు దేశమాతృసేవయు భాషాసేవయునే జన్మజీవితఫలముగాఁ బని సేయువారు గావున నీగ్రంథప్రాచుర్యమునకు మమ్ముఁ ప్రేరేపించి తగినసహాయసంపత్తిని గలిగించినందున దీని నిప్పటికిఁ బ్రకటింపఁగలిగితిమి. ఇందు యథాశక్తి సవరించియు నింకను దోషసహస్రములు గలవు. ప్రాచీనగ్రంథపరిశోధనసంస్కారగ్రంథ మించుక పడసియు ననేకప్రఘట్టముల లేఖకదోషములఁ దృప్తిగా సవరింపఁజాలక యున్నదియున్నట్టుగా ముద్రించితిమి. ఎట్లో నూతనకవిత చెప్పుట సులభము కాని వరకవిహృదయము గుర్తించి శాస్త్రవిషయమున నతనిపలుకుల నూహించి తెచ్చుట దుర్ఘట మనుట విజ్ఞు లెఱింగిన విషయమేకదా! ఆదర్శాంతరము లఖించునేని భాషకుఁ బరమోపకార మగు నని యెల్లరును యథాశక్తి గ్రంథాన్వేషణము సేయుదురని ప్రార్థనముతో విరమించుచున్నారము.

చెన్నపురి,

మా - రామకృష్ణకవి

1923

  1. వనపర్తి బ్రహ్మవిద్యావిలాసముద్రాక్షరశాలలో ముద్రితమైనది.
  2. పూర్వగ్రంథములు పునర్ముద్రణావశ్యకత భారతి సం. 28.నం. 6, 488-441. పుటలు ఆకరగ్రంథములు. భారతి - జూలై 1963, భారతి - జూలై 1967