సంస్మరామి సర్వదా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రాగమాలిక - తిశ్రగతి ఆది

బేహాగ్:
సంస్మరామి సర్వదా ముదా ప్రసన్న రాఘవం
సర్వలోక బాంధవం భజామి నౌమి కేశవం ||

కాపి :
చింతయామి మైధిలీ మనోధనాప హారకం
సేవకార్తి వారకం భజే భవాబ్ధి తారకం ||

మాయామాళవగౌళ :
భావయామి లోకపాల పాలనైక సాయకం
భానువంశ నాయకం నమామి భద్ర దాయకం ||

మధ్యమావతి:
పూజయామి దాసు రామదాస చిత్త వాసినం
భూతజాత శాసినం ప్రభూత చిద్విలాసినం ||