సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఛాయాగ్రహణ శాస్త్రము (Photography)
ఛాయాగ్రహణ శాస్త్రము (Photography) :
కాంతిచేత గాని, మరి యేవిధమైన వికీర్ణ (Radiant) శక్తి చేత గాని, రసాయనిక మార్పులు కలిగి బింబము (image) ఏర్పడుట ఛాయాచిత్రణ మనబడును. ఛాయా చిత్రగ్రహణ విధానము : కాంతి చొరుటకు వీలులేని పెట్టెకు అమర్చిన కటకము (Lens) ద్వారా ఒక వస్తువునుండి వచ్చు కాంతి ఆ పెట్టెలో గల కాంతి ప్రేరిత (Light sensitive) పదార్థము పూయబడిన కాగితము మీద గాని, గాజు పలకమీద గాని పడును. కాంతి ప్రేరిత పదార్థములు సాధారణముగా రజత హేలైడ్లు (Silver halides) అయి యుండును. కటక మునకు ఒక మూత (Shutter) అమర్పబడి యుండును. దీనిని పూర్తిగా మూసియుంచుటకు గాని, పూర్తిగా తెరచి యుంచుటకు గాని, ఒక నిర్ణీత కాలము తెరచియుంచు గాని, అవకాశ ముండును. దీని వెనుక కనుపాప వంటి పటలము (Diapharagm) ఉండును. దీనిలో మధ్య గల రంధ్రముయొక్క వైశాల్యము మార్చుట వలన కాంతి ప్రసరణము హెచ్చించుటకు, తగ్గించుటకు వీలుండును.
రజత హేలైడ్ (Silver halides) మీద కాంతి పడినప్పుడు కాంతి ప్రేరిత పదార్థమును వికాసకము (Developer) నం దుంచవలెను. అందు రజత హే లై డ్లు లోహ రజతమై (Metallic silver) చిన్న కణములుగా మారుటవలన కాంతి ప్రసరించిన ప్రదేశములు నల్లగా మారును. పిదప నా పదార్థమును స్థిర కారకము (Fixer) లో నుంచవలెను. దానివలన కాంతి ప్రసరించని ప్రదేశ ములలోగల కాంతి ప్రేరిత పదార్థములను అది జీర్ణించు కొనును (Dissolves) పిదప ఆ కాంతి ప్రేరిత పదార్థ మును కడిగి ఆర పెట్టవలెను. ఆ పరిస్థితిలో కాంతి ప్రేరిత పదార్థముమీద కాంతి పడిన ప్రదేశములు నల్లగాను, వస్తువులో కాంతి ప్రసరింపని ప్రదేశములు తెల్లగాను కాన్పించుటచే దీనిని 'నెగటివు' (Negative) అందురు.
నెగటివును మరొక కాంతి ప్రేరిత పదార్థము పూయ బడిన పలక పై గాని కాగితము పైగాని ఉంచి కాంతి ప్రసరింప చేసినచో నెగటివ్ లో గల నల్లని అపారదర్శక (Opaque) ప్రదేశముల గుండా కాంతి ప్రసరింపక, పార దర్శక (Transparent) ప్రదేశములగుండా కాంతి ప్రస రించును. ఆపై వికాసము (Developing), స్థిరీక రణము (Fixing) జరుపవలెను. అప్పుడు కాంతి ప్రసరించిన ప్రదేశములు తెల్లగాను, కాంతి ప్రసరింపని ప్రదేశ ములు నల్లగాను కనిపించి, వాస్తవ చిత్రము సిద్ధమగును. దానిపై గోచరించు నల్లదనము యొక్క సాంద్రతా సాంద్రతలు నెగటివులో ఆయా ప్రదేశముల గుండ ప్రస రించిన కాంతి మీదనే ఆధారపడి యుండును.
చరిత్ర : క్రీ. శ. 1727 లో జె. హెచ్. సూల్జ్ (J. H. Schultze) సుద్దను (chalk), రజతనత్రితమును (Silver nitrate) కలిపిన మిశ్రమము మీద అపారదర్శక పదార్థ ముల నుండి కాంతిని ప్రసరింపజేయగా మిశ్రమము మీద బింబములు కలుగునని మొదటిసారిగా కనుగొ నెను. క్రీ. శ. 1777 లో సి. డబ్ల్యు. స్కీల్ (C. W. Scheele) రజతమిశ్రమముల (silver compounds) మీద వివిధ వర్ణ ములగు కాంతుల వలన ఏర్పడు ప్రభావమును పరిశో ధించెను. 1802 లో టి. వెడ్డివుడ్ అను నాతడు రజత నత్రితములో ముంచిన కాగితముల మీద బింబములు కలి గించు శక్తి కాంతికి గలదని నిరూపించెను. తరువాత హెచ్. డారి (H. Darry) రజతనత్రికము కంటె రజత హరితము (silver chloride) శ్రేష్ఠమైనదని క నుగొ నెను. 1814 లో జె. ఎన్. నీపీ (J. N. Niepie) మట్టి తైలము (Bitumen) రసాయనిక సంయోగానంతరము రజత లోహములవలె కరుగకపోవుట మూలమున కాంతి ప్రేరిత పదార్థములకు దీనిని పీఠము (Base) గా ఉపయో గింప వచ్చునని గ్రహించెను. 1839 లో ఎన్. జె. ఎం. డా గెరి (L. J. M. Daguerre) మెరుగు పెట్టిన వెండి పలక మీద రజత అయొడయిడు (silver iodide) పొరను 780 సంగ్రహ ఆంధ్ర అయొడిన్ ఆవిరులకు తెరిచి (expose) కెమెరాలో నుంచి ప్రసరింప జేసెను. దానిని పాదరసపు ఆవిరులకు కాంతి తెరిచి యుంచినచో బింబము వికసించునని నిరూపించెను. దీనిని డాగుర్సు (Dagurrs) రకపు ఛాయాగ్రహణ మందురు.
1841 లో డబ్ల్యు. ఎచ్. ఫాక్సు టాల్బటో (ఇంగ్లండు) రజతహరితము (silver chloride) పూసిన కాగితముల ఉపయోగములనుగూర్చి పరిశోధించి, కాలో టైపు(calo- type) పద్ధతి ప్రవేశ పెట్టెను. దీనిలో నాతడు స్థిరీక రణము ప్రవేశ పెట్టెను, 1889 లో సర్ జె. హెర్షెల్ (Sir J. Herschel) మొదటిసారిగా ఛాయా చిత్రమును తీసి విజయమును సాధించెను. షెవలియర్ (Chevalier) ఒకే కటకముతో అతిసామాన్య మైన కెమెరాను 1840 లో పెప్టైవల్ (Petzval), పోర్ ట్రైట్ లెన్సును (portrait lens), 1890 లో బిందుక టక ము (Anastigmatic lenses) లను రడోల్ఫు, అబ్బె అనువారలు తయారు చేసిరి. 1882 లో ఎడ్వర్డ్సు (Edwards) సమతల సంగమ కవాటము (Focal plane shutter) ను, 1887 లో బాన్సచ్ (Bansch) కటకమధ తారామండల పటలము (iris diaphragm) ను ప్రవేశ పెట్టిరి. 1848 లో గాజు పలకమీద నెగటివులు తయారు చేయుట, 1845 లో హెర్షెల్ (Herschel), సి నీపి డి సెయింట్, (C. Niepce de St.), విక్టరు (Victor) అనువారలు రజత లవణములను ఆల్బుమెన్ మిశ్రితముగా గాజు పలక మీద పూయుట కనుగొనిరి. 1871 లో ఆర్ . ఎల్, మాడాక్సు (R. L. Maddox) రజత బ్రోమైడ్ జెలటినన్ను కాంతి ప్రేరితముగా ఉపయోగించెను. 1874లో మొదటి అవార్ద్ర ములగు నెగటివులు తయారు చేయబడెను. 1904 నాటికి వర్ణ ఛాయా చిత్రములు కనుగొన బడినవి. 1889 లో ఈస్టుమాన్ (Eastman) రజత బ్రోమైడ్ పూసిన ఫిల్మును తయారుచేసెను. ఇట్లే ఈ కళ క్రమవికాసమును చెంది, నేడు మనము గాంచు పరిణత స్థితి నందు కొనినది.
కెమేరాలు : సాధారణపు పెట్టె కెమేరాలలో ఒక చివర ఫిల్ము, మరియొక చివర F/10 కటకము ఉండును. కవాటము సెకండు కాలము తెరచుకొని యుండగలదు. మడత కేమేరాలలో కటకము తిత్తుల చివర ఉండును. దీని వలన అవసరము లేనప్పుడు దగ్గరకు నొక్కి వేయ వచ్చును. రిఫ్లెక్స్ కెమేరాలలో 45° కాంతి అక్షమునకు అద్ద ముండుట వలన బింబమెట్లుండునో చూడవచ్చును. దృశ్య దర్శిని (View finder) మూలముగా బింబమెంత పడునో తెలియును. దూర మానిని (Range finder) మూలముగా వస్తువునకు కెమేరాకును గల దూరము తెలియును. కెమేరాలకు కృత్రిమ కాంతి సాధనములు, కలరు ఫిల్టరులు కూడ సహాయ కారులుగ నుండును. చిత్రము - 225 ట్రై సేక్ విధానము కాంతి Panchromatic Emulsion ఫలకము పటము - 1
కాంతి ప్రేరిత పదార్థములు: విలోయ (Soluble) రజత లవణములలో (సాధారణముగా రజత నత్రితము) విలోయ హేలైడ్ లవణములను మిశ్రమము చేసినచో నీటిలో కరుగని మిశ్రమ మొకటి ఏర్పడును. దీనిలో జలటిన్ కలిపిన యెడల అది హే లైడ్ లవణ కణములు ఒకదాని కొకటి అతుకుకొని పోకుండ విడివిడిగా నుంచి భద్రపరచును. ఈ విక్షి ప్తలేపనము (Dispersed paint) యొక్క గుణములు దానిలో నుండు మిశ్రమముల యొక్క పరిణామములమీదను, తయారుచేయు విధము మీదను ఆధారపడి యుండును. బ్రొమైడ్, ఆ యొడ యిడ్ లవణముల మిశ్రమమున్న పూత అన్నిటి కన్న ఎక్కువగా కాంతి ప్రేరితమగును. ఇంకను ఎక్కువ సూక్ష్మగ్రాహ లేపనములను తయారు చేయవ లె ననినచో జెలటినును కొద్దిగా వేడి చేసిన చాలును. అది రసాయ నిక మార్పులు చెంది సూక్ష్మగ్రాహ శక్తిని పొందును.
ప్రతి మిశ్రమము (Emulsion) కూడ నిర్ణీత మైన (fixed) కాంతి తరంగములకు మాత్రమే ప్రేరణ (Response) పొందును. రజత క్లోరైడ్, బ్రోమైడ్, అయొడైడ్ (హే లైడ్ ) మిశ్రమములను పెక్కు పాళ్ళలో (Proportions) కలిపిన దృశ్య వర్ణమాల, ఎక్స్ రేలు అతినీలలోహిత (ulter violet) వర్ణములు మొదలగువానికి ప్రేరణ చెందు ప్రేరితములను తయారు చేయవచ్చును. ఇంతేకాక నీలమునుండి ఆకుపచ్చ వరకు ఎరుపు, ఆకుపచ్చ.
- నీలం ఏమలను
-పాన్ మాటిక్ ఎమల్షను 781 (800 m /) పనికివచ్చు ఆర్థోక్రో మెటిక్ (orthochromatic) రకము గాని, పూర్తి వర్ణమాలను గ్రహించు పాన్ క్రోమెటిక్ (panchromatic) పేరి తముగాని తయారు చేయవచ్చును.
కాంతిచే | పేరితములగు ఎమల్షన్లు గాజుపలకల పారదర్శక ప్లేస్టిక్ ఫిల్ముల మీదగాని కాగితములమీదగాని పూయ 32 బడును. ఈ ఎమల్షన్ క్రింద అపరి వేషకము (anti-halation layer) గా రంగు పూత ఉండును. దీని వలన ఎక్కువగా కాంతి ప్రసరించిన భాగ ములందు పరి వేషములు ( halos) కలుగవు. ఫిల్ములపై జెలటిన్ పూత పూసినచో కాంతి | పేరిత పదార్థము ముడతలు పడదు. ఆర్థోక్రోమెటిక్ (arthochromatic) ఫిల్ములు నీలము నుండి ఆకుపచ్చ కాంతి వరకు ప్రేరితముగా నుండుటచే ఎక్కువ రసాయని కపు మార్పులు అవసరము లేకయే బింబము స్పష్టముగా నుండును. పాన్-క్రో మెటిక్ (Panchromatic) ఫిల్ము దృశ్య వర్ణమాల కంతకును ప్రేరితముగా నుండుటచే ఏక వర్ణ చిత్రములు బాగుగా వచ్చును. వీనికి సన్నని కణ ములు గల ఎమల్షను పూయబడి యుండును. ఎక్సురే ఫిల్ములకు సాధారణముగా పలకకు రెండు ప్రక్కల ఎమల్ష నుండును.
ఏక వర్ణమగు ఫొటోగ్రఫిక్ కాగితములు సాధారణ ముగా నాల్గు రకములు. పి. ఓ. పి. కు (Printing out paper) వికాసము అక్కరలేకనే బింబము వచ్చును. గాస్ లైట్ (Gas light) కాగితమునకు రజత క్లోర యిడ్ పూయబడి యుండుటచే ప్రతిక్రియ (reaction) మెల్లగా జరుగును. కావున సన్నిహిత ముద్రణమున (contact printing) కు పనికివచ్చును. బ్రోమైడ్ ఎమల్షను గల కాగితము ఎన్లార్జిమెంటు (Enlargement) లకు ఉపయోగించును. ఛాయాగ్రహణమునకు ఉప యోగపడు కాగితములలో బ్రోమైడ్ కాగితము ఉత్త మము. క్లోరోబ్రోమైడ్ కాగితము మధ్యమము. గాస్ లైట్ కాగితము అధమము.
వికాస విధానము (Processing) : వికాసము కాంతి ప్రేరిత మయిన రజత హేలైడ్ను నల్లని లోహరజత ముగా మార్చును. క్షార (alkaline) ద్రావకములగు వికాసములు గాలిలో నుండి ఆమ్లజనిని (oxygen) గ్రహించి తారువంటి అను త్తేజిత (inactive) పదార్థము లను అవ క్షేపించును (precipitate). కాని సోడియం సల్ఫేటు వంటి పదార్థములతో జతకూడినప్పుడు విఛూ షణము (absorption) తగ్గిపోవును. ఈ క్షార పదార్థ ములు కాంతి ప్రేరితములు కాని రజత యౌగికములను (Silver compounds) కూడ రజతముగా మార్చి వికాస ధూమిక (Development fog) తయారు చేయును. దీనివలన బింబము యొక్క స్పష్టత తగ్గును. పొటాసియం బ్రొమైడ్ను వికాసములో చేర్చిన, వికాస ధూమిక తయారగుటకు 'నిర్బంధకము' (restrianer) గా పని చేయును.
అత్యుత్తమ క్రియాశ క్తిగల నెగటివులకు హైడ్రో క్వినై ను (Hydroquinine), కాస్టిక్ సోడా (costic soda) లను, మధ్యతరగతికి ఎలన్ (Elon), పి- మెతిలా మినోఫీనల్ సల్ఫేటు (p-Methylaminophenol Sul- phate), హైడ్రో-క్వినైను (Hydroquinone) లను, మరీ తక్కువ క్రియాశక్తి (low activity) గల వాటికి (అనగా ఎన్ లార్జి మెంటుకు పనికివచ్చునవి, సినీ ఫిల్ములు) ఎలన్ (Elon) హైడ్రో-క్వినైను (Hydroquinine), అనార్ద్రమగు సోడియం సల్ఫేట్, బొరాక్సు గల ద్రావ కమును, వికాసముగా నుపయోగింతురు. తక్కువ వారము గల వికాసము నుపయోగించిన, నెగటివులలో మచ్చలు ఉండక తేడాలను (unevenness) తగ్గించును.
ఫిల్మును వికాసములో నుంచిన ప్రేరణ సమయము (induction period)లో బింబము (image) తయారయి క్రమముగా ఒక స్థాయికి వికసించును. ఉష్ణోగ్రతతో (temperature) ఈ వికాసగతి (rate) వృద్ధి చెందును. కాని సాధారణముగా 18° – 20°C (65° - 70F) ఉష్ణము దీనికి మంచిది. వికాసము, కదలుచున్న అదే కాలములో బింబము యొక్క భేదదర్శనము (contrast) బాగుగా నుండును.
స్థిరీకరణ ప్రక్రియ (fixing) లో కాంతి తగులని రజిత. హే లైడులు సోడియం సల్ఫయిడు (హైపో) లో కరుగును. హైపోలో ఆమ్లములు ఏమియు లేకపోయినచో ఈ కరిగిన లోహరజతము అవక్షేపము (precipitate) చెందును. స్థిర కారకములలో పదను (tanning) చేసి జలటినును గట్టిపరచు పదార్థము లుండుటవలన నీటిలో జెలటిను ఉబ్బుట, తగ్గుట, ద్రవీభవనాంశము (melting point) వృద్ధిచెందుటయు జరుగును. దీనివలన త్వరగా ఆరి రాపిడి వలన ప్రేరిత పదార్థము తుడుచుకొని
స్థిరీకరించిన పిదప బింబములు చాల తేలికగా గాని, బండగా గాని (light on heavy) వచ్చినచో కొంత మార్పు చేయవలసి యుండును. వృద్ది కారకము' (in- tensifiers) అదనముగా కాంతి విచూషణ పదార్థము (light absorbing material) ను పరుచుట కాని, కాంతిని విచూషించు శక్తిని నెగటివుకు వృద్ధిపరచుట గాని చేయును. పాదరస వృద్ధికారకము లోహరజమును రజిత బ్రోమైడ్ గా మార్చి, తానే గా మార్చి, తానే అద్రావ పాదరస వృద్ధికారకము (Insoluble Mercurous Bromide) గా తయారగును. రజత వృద్ధికారకము (silver intensi- fier)లో స్థిరీకరించిన పిదప నెగటివును రజత వృద్ధికారక ములో ముంచినచో, రజత లోహపు పూతదాని పై నేర్పడును. దాని వలన భేద దర్శన మధిక మగును.
ఛాయాచిత్రణ సంగ్రహీకరణములు (photogra- phic reducers) సాధారణముగా ఆమ్లకారకములై (oxidising agents), రజతద్రావము (silver solvent) లు కలిగియుండును. దీనివలన బింబములో అదనపు లోహరజతము కలిగి యుండును.
వాస్తవ చిత్రములకు (positives) కావలసిన రంగు (tone) కలుగుటకు స్థిర కారకమగు సోడియం ధయో సల్ఫేటు (హైపో)లో పొటాస్ పట్టికల (potash alum)ను కలపిన వేడి ద్రావకములో పాజిటివు (positive) లను ముంచినచో లోహరజతము రజత సల్ఫైడుగా మారి గోధుమఛాయ (Brown) వచ్చును. పొటాసియం ఫెర్రి సయనైడు, పొటాసియం బ్రొయనైడుగా మారును. దీనిని సోడియం సల్ఫయిడు ద్రావకములో గాని, ఇతర అకర్బన (inorganic) రసాయనికములలో గాని ముంచిన, నీలముగాగాని, ఎర్రసుద్ద (Red chalk) గా గాని మార్చ వచ్చును.
వర్ణ ఛాయాచిత్రము (Colour Photography) : ప్రకృతిలో కనిపించు రంగు లన్నియు ఎరుపు, ఆకుపచ్చ, నీలము (Blue) రంగుల కలగలుపులే. ఏదైన వస్తువు నుండి వచ్చు కాంతి విడిగా యీ మూడు రంగుల కలర్ ఫిల్టరుల (Colour Filters) గుండా పోనిచ్చి వికాసము చేసినచో వర్ణచిత్రములు వచ్చును. ఈ క్రియ రెండు విధములు.
వర్ణ మిశ్రమ అనుసంధాన విధానము (Additive colour synthesis): దీనిలో ఫలకముపై కాంతి ప్రేరిత ఎమల్షనుమీద సూక్ష్మమైన రంగు ఫిల్టరులు సమముగా పరచబడి యుండును. కెమేరాముందు వరుసగా విడి విడిగా ఎరుపు, ఆకుపచ్చ, నీలపు ఫిల్టరులు ఉంచి కాంతిని పోనిచ్చి వికాసములో నుంచవలెను. ఎరుపు ఫిల్టరును ఉంచి కాంతిని పోనిచ్చినప్పుడు, ఎర్రని కిరణములక్రింద గల ఎమ ల్షనుకు మాత్రమే కాంతి తగులును. ఈ విధముగా వస్తువు నుండివచ్చు రంగునుబట్టి ఈ కణములక్రింది ప్రేరితముమీద కాంతి పడును. పిదప తెల్లని కాంతికి ఎదురుపరచి నెగ టివును తిరిగి వికాసకములో నుంచి స్థిరీకరింపవలెను. అప్పుడు పారదర్శక మగు ఈ ఫలకముగుండా నచో సరళ మగు వర్ణచిత్ర మగపడును. డూఫే (Dufay) వర్ణ పద్ధతిలో రంగులు కల పీఠము మీదను, ఆగ్ ఫా (Agfa) పద్ధతిలో రంగుల రెజిన్ కణములు అతికించుట వలనను ఈ వర్ణచిత్రము లేర్పడును. చూచి రంగుల పాజిటివులు: రంగుల పాజిటివులలోని ఎమ ల్షనులో తకువ ద్రవీభవనాంశము గల (low melting point) జెలటిను, రజత హే లైడు ఉండును. ఎమల్షను నకు కాంతి ప్రసరింప జేసి, వికాస మొనర్చి, స్థిరీకరింప జేసి వేడినీటిలో కడిగినచో అందు కాంతి తగిలిన చోట్ల జెలటిన్ మిగిలి, ఇతర ప్రదేశములలో అది కరగిపోవును. తరువాత కావలసిన రంగులో ముంచినచో కాంతి తగిలిన ప్రదేశ ములలో గల ఆ రంగు ప్రవేశించును. పైన చెప్పిన మూడు రంగులలో అట్లే రంగుల ఎమల్షను లను తయారుచేసి, వాని నొకదానిపై నొకటి పేర్చి అంటించినచో ఒక సంపూర్ణ వర్ణచిత్ర మేర్పడును. దీనిని డై ట్రాన్సుఫరు (Dye tranfser) అని కాని, టెక్ని కలర్ (Techni Colour process) అనిగాని అందురు. కెమెరా ఫోటో ప్లేటు కాంతి ఫలకము చిత్రము - 228 తిత్తులు పటము - 2 డయాఫ్రమ్ | కటకము T మూత
ట్రైపాక్ విధానము (Tripack Method): దీనిలో ఒకే పీఠముపై వరుసగా ఎరుపు, ఆకుపచ్చ, నీలము అను రంగులచే ప్రేరితములగు ఎమల్షను లుండును. కోడా క్రోము పద్ధతిలో 'వర్ణబంధములు' (Colour couplers) అను రసాయనము వలన కాంతి ప్రసరించిన ప్రదేశము లలో రజత హేలైడ్ యొక్క ఆమ్లీ కరణము మూల ముగా కరుగని రంగు పదార్థ మేర్పడును. కాని కోడా కలరు (Koda colour, Anscoclor, Agfa colour) పద్దతులలో వికాసములో నుంచిన పిదప ఈ వర్ణ బంధ ముల నుపయోగింతురు. దీనివలన వర్ణ సంకరము కొంత తగ్గును.
ఉపయోగములు : ఉత్సాహవంతులగు ఛాయా చిత్ర కారులు ఈ విశ్వమందలి ప్రతి వస్తువును, తచ్చర్యలను, ఛాయా చిత్రములుగా తీయ ప్రయత్నించుట ప్రపంచ మంతట కాంచు చున్నాము. చలన చిత్ర పరిశ్రమలు, వార్తా పత్రికలు, వ్యాపార సంస్థలు ఛాయా చిత్ర కళను వినోద, విజ్ఞాన ప్రదానములకే గాక, ఆర్థిక లాభాదులకు గూడ నేడు ఉపయోగించుకొను చున్నవి. సినీ కెమేరా ద్వారా నేటి మానవుడు అచర జగత్తుతో పాటు జంగమ జగత్తును సహితము చిత్ర రూపమున తీసి వాని గమన విశేషముల ప్రదర్శింప గల్గియున్నాడు. ఫొటో మైక్రాగ్రఫీ వలన సూక్ష్మాతి సూక్ష్మపదార్థములను సైతము ఛాయా చిత్రమున దర్శింప జేయుటకు వీలగు చున్నది. పరిణామాధిక్యము గల ఉద్గ్రంథములను నెగటివుల రూపములలో అల్ప పరిమాణ రూపములుగా రూపొందజేసి వహన యోగ్యములుగను, అనల్పకాల జీవన యోగ్యములుగను చేసి మైక్రో ఫొటోగ్రఫీ గ్రంథాలయ పఠితల కెంతయో సౌకర్యము కలుగజేయు చున్నది. ఇట్లు గ్రంథములను ఫిల్ముల రూపముగా తయారు చేయుటకు ఎక్కువ విభాజకశక్తి (resolving power) గల ఎమలను కావలెను.
అంతరిక్ష ఛాయా చిత్రగ్రహణము నేటి విజ్ఞాన పరిశోధనల కెంతయో యువకరించుచున్నది. దీనికి పనికివచ్చు కెమేరాలో రెండు కటకము లుండును. వస్తుకాచము (objective glass) వెనుక, పుటక కటక ముంచుటవలన బింబము వికసించును. దీనివలన శత్రు స్థావరములను విమానములనుండి ఫొటోలు తీయుటకును, పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలకును, వన్యమృగములు మున్నగు వానిని ఫొటో తీయుటకును వీలుపడును. పరమాణు విదళనము (Nuclear fission) చెందునపుడు వచ్చు శకలములు ఎమల్షన్ గుండా పోయినవాని వేగమును బట్టి, బరువును బట్టి ఎమల్షను మీద జాడ లేర్పడును. వీనివలన విజ్ఞానశాస్త్రమున కెంతయో ఉపయోగము కలదు. అంత రిక్షములోనికి బెలూన్ల ద్వారమునను, రాకెట్ల ద్వారము నను ఫొటో ప్లేట్లను పంపి విశ్వకిరణముల (Cosmic Rays) లో జరుగు ప్రక్రియలను తెలిసికొన వీలగును. ఖగోళమును ప్రతిరోజును ఫొటోలు తీయుట వలన విశ్వము యొక్క పుట్టుపూర్వోత్తరముల గురించి వివర ములు సేకరింప వీలగును.
ఎక్సురే ఫొటోల మూలముగా శరీరములోని భాగము లను, వాని స్థితిగతులను చూడవచ్చును. ఈనాటి వైద్య శాస్త్రమున కిది ముఖ్యాంగమని చెప్పవచ్చును. ఇట్లే పరశ్శోణ (infra-red) చిత్రముల మూలమున మబ్బు, మంచు, పొగ మున్నగువాని గుండ దూరపు వస్తువుల చిత్రములను స్పష్టముగా తీయవచ్చును.
ఒక మాటలో చెప్పవలెనన్న, ఛాయా చిత్ర గ్రహణ కళ చరాచర విశ్వ భౌతిక స్వరూప సందర్శనావకాశ మును కల్పించు విలక్షణమైన విమల దర్పణము.
అ. స. మూ.