Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గౌతమబుద్ధుడు

వికీసోర్స్ నుండి

గౌతమబుద్ధుడు :

భారత దేశ మునకు ఉత్తరమున నేపాళమునందు శాక్య నామక క్షత్రియవంశమున శుద్దోదనుడను రాజు ఉండెను. అతని రాజధాని కపిలవస్తునగరము. అతనిభార్య మాయా దేవి. ఆమె గర్భవతియై కపిలవస్తు పట్టణమునుండి పురిటికై పుట్టింటికి ప్రయాణము చేయుచుండెను. మార్గ మధ్యమున లుంబిని యను ఆరామమునందు ఆమెకు ఒక మగశిశువు జనించెను. ఆ శిశువు నకు సిద్ధార్థుడని నామక రణము చేయబడెను. ఈ శిశువే అనంత రము గౌతమ బుద్ధుడుగా ప్రసి దు డయ్యెను. గౌతమబుద్ధుని జన్మసంవత్స రమును గూర్చి చారిత్రకులలో అభిప్రాయ భేదము కలదు. కాని క్రీ. పూ. 563 సం. ప్రాంతమున అతడు జన్మించినట్లు పెక్కురు అంగీకరించిరి. అతడుపుట్టినపుడు వచ్చిన జ్యోతిష్కులు పరిపా లింప దలచినచో అతడు చక్ర వర్తి కాగలడనియు, సన్యసించి జ్ఞానసిద్ధిని పొందగల డనియు తెలిపిరి. సిద్ధార్థుడు నచో జన్మించిన వారమురోజుల కే అతని జనని మాయాదేవి మర ణించెను. అందుచేత శుద్దోదనుని రెండవ భార్యయగు మహా ప్రజా పతి గౌతమి ఈ శిశువును వాత్స ల్యముతో పెంచెను. సిద్ధార్థుడు యౌవనమునందు 62 52 గౌతమబుద్ధుడు యశోధర యను కన్యను వివాహమాడి, ఆ మెయందు రాహులుడను పుత్రుని బడసెను. సిద్ధార్థుడు చిన్న నాటి నుండియు ఇతర క్షత్రియ బాలురవలె క్రీడాసక్తుడుగాక నిరంతరము దీర్ఘాలోచనా నిమగ్నుడై యుండెడి వాడు. అతని అట్టి విచిత్ర ప్రవర్తనమును గాంచి, అతడు విరాగి యగునేమో యని భీతిల్లి తండ్రియగు శుద్దోదనుడు అతని మనస్సును ప్రాపంచిక విషయములపై మరల్చుటకయి అనేకవిధముల యత్నించెను. అయినను, కారణజన్ముడైన సిద్ధార్థుని విషయ సుఖములు ఆకర్షింపజాలకుండెను. సిద్ధార్థు డొక నాటి సాయంకాలము వాహ్యాళి కై పుర బాహ్య ప్రదేశమునకు వెడలెను. అచ్చటచ్చట త్రోవలో మున్ముందు కనిపించిన వృద్ధ, రోగి, శవ దృశ్యములవలన అతని హృదయము దుఃఖావిష్టమయ్యెను. పిదప నొక చిత్రము - 131 సన్యాసి కనిపించెను. సిద్ధార్థుడు సన్యాసిని పిలిచి పటము - 1 గౌతమబుద్దుడు 489 ఆ యడుగగా సన్యాసి తాను మోక్షము కొరకు సన్యసించితి ననియు, ఆసన్యాసమే తన నిత్యతృప్తికి, నిత్య సంతోషమునకు కారణ మైన దనియు చెప్పెను. సన్యాసి వృత్తాంతమును వినిన తోడ నే సిద్ధార్థుడు దీర్ఘాలోచనా నిమగ్నుడై రథమును మరలించి స్వీయనగరము చేరెను. ఆ సిద్ధార్థునకు ప్రపంచమున సర్వత్ర దుఃఖమే కనిపించెను. ప్రజల దుఃఖమును నివారించి వారు శాశ్వత మైన ఆనందమును పొందుటకై మార్గమును అన్వే షించుటకు అతడు నిశ్చయించు కొ నెను. తోడ నేఅతనికి ఇంద్రియ భోగముల పై ఏవగింపును, ప్రాణి వర్గముపై అపారమైన దయ యు, సంసారమును పరిత్యజింప తలంపును కలిగెను. ఆ పరిత్యా గము స్వీయ మోక్షమున కై కాదు. దుఃఖభూయిష్ఠమైన జీవితమును గడపు చున్న మానవులకు దుఃఖములేని శాశ్వతానంద పదవికి మార్గమును చూపించుట కొరకు సిద్ధార్థు నకు కాంక కలిగెను. అట్టి నిశ్చయముతో అతడు ఒకనాటి అర్ధరాత్రమున నిద్రామగ్నులయిన దార సుతాదులను విడచి, రథారూఢుడై వెడలిపోయెను. పురమునకు కొంత దూరముననున్న అరణ్యములో రథము దిగి తన దుకూలములను, భూషణములను రథసారథియగు ఛన్నున కిచ్చియతనిని పంపి వేసెను. దీనిని మహాభి నిష్క్రమణ మందురు. పిదప భిక్షు వస్త్రములను ధరించి అతడు ఏకాకియై తిరుగ జొచ్చెను. అప్పుడు సిద్ధార్థుని వయసు 29 సంవత్సరములు.

సిద్ధార్థుడు ప్ర థ మమున ముడు, ఉద్దక రామపుత్రుడు అను నిరువురు యోగులవద్ద ఉపదేశమును పొందెను. కాని అతనికి తృప్తి కలుగలేదు. అంతట వారిని విడచి మగధరాజ్యమును

చిత్రము - 132 పటము - 2 గౌతమబుద్ధుడు దాటి ఉరువేల యను పట్టణము చేరెను. అచ్చట ఒక తోట యందు ఆహారము మాని అనేక కాయ క్లేశములను సహించి తపస్సుచే సెను. కాని జ్ఞానోదయము కాలేదు. అంతట అతడు భయమును, భోగవాంఛను జయించి మనస్సును నిగ్రహించెను. కాని సమాధి సిద్ధింపలేదు ఈ సమాధి ప్రాప్త్యభావమునకు కారణము తాను ఆహా రమును మాని కాయక్లేశము సహించుటయని తలంచెను. అతడు మరల ఆహారమును భుజించుటకు ఉద్యమించెను.. అంతటితో శిష్యులయిన సన్యాసులు అతనిని విడిచి పోయిరి. క్షుధార్తుడయిన అతడు సుజాతయను నొక వణిక్పంగవుని కుమా రె యిచ్చిన పాయసాన్నము తిని స్వస్థపడెను. పిదప సమాధి స్థితిని పొందనిదే అచటి నుండి పద చలనము చేయ రాదను దృఢనిశ్చయముతో అతడు ఒక వృక్షముక్రింద పద్మాసన స్థితుడయ్యెను. అది వైశాఖ పూర్ణిమానిశి. అప్పు డాతని వయస్సు 35 సంవత్సరములు.

సిద్ధార్థుడు క్రమముగా నాలుగు విధములైన ధ్యానా వస్థలను దాటి ప్రశాంతమైన ధ్యానమునందు నిమగ్ను డాయెను. ఇట్లు ధ్యానస్థితుడయిన అతనికి తన పూర్వ జన్మములు, తత్కారణములు అన్నియు గోచరించెను. ధ్యానము క్రమముగా గాఢతరముకాగా, సమాధి ప్రాప్తి క ల్గెను. సమాధిప్రాప్తిచే ఆజ్ఞానము నశించి జ్ఞానోదయము అయ్యెను. అతడు బుద్ధు డాయెను. బుద్ధత్వమునకు కారణ మయిన ఆ ఆశ్వత్థ వృక్షము క్రిందనే ఆతడు వారము దినము లుండెను. ఆ అశ్వత్థ వృక్షము బోధివృక్షముగా

బుద్ధుడు తాను కనుగొనిన ధర్మములను మానవులందరి కినిబోధించుటకు నిశ్చయించుకొనెను. అతడు కాశీ పురము నకు పోయెను. అచ్చట ఇశిపట్టణము అనుచోట (సార నాథము) ఒక తోటయందు పూర్వశిష్యులగు ఐదుగురను జూచెను. వారును అతనితో మైత్రిగావించిరి అంత బుద్ధుడు తనకు కలిగిన జ్ఞానోదయమును గూర్చి వారికి తెలిపెను. వారును మిక్కిలి సంతసించిరి.

ఆషాఢశుద్ధ పౌర్ణమినాటి రాత్రి అతడు ఆతోటయందు తన మిత్రులకు ప్రథమబోధ గావించెను “మోక్షమార్గము ఇంద్రియార్థ సేవనమందుగాని, శరీర శోషణమందుగాని లేదు, ఈ రెండింటికిని మధ్యమార్గమే ఉత్తమము. అదియే మధ్యేమార్గము" ఇది ప్రథమబోధన సారాంశము. పిదప అతడు నాల్గు దివ్యసత్యములను ప్రతిపాదించెను. అవి (1) ప్రపంచము దుఃఖభూయిష్ఠము. (2) ఈ దుఃఖమునకు కారణము కలదు. (3) ఈ దుఃఖమును నివారింపవలెను. (4) ఈ దుఃఖమును నివారించుటకు ఉపాయము అష్టాంగ సాధనావిధానము అనునది. ఆ సన్యాసులకు నాయకు డైన కొండవ ఈ యుపదేశములు అంతరార్థము గ్రహించి బుద్ధుని ప్రథమశిష్యుడాయెను. తరువాత మిగిలిన నలువురు గూడ బుద్ధునిచే ఉపదిష్టమయినట్టి ధర్మమును గ్రహించి ఆతనికి శిష్యులైరి. పిదప బుద్ధుడు తన ద్వితీయోపదేశ మును చేసెను. ఆ

కాలక్రమమున బుద్ధుని శిష్యసంఖ్య పెరిగెను. మానవ జాతికి ఈ ధర్మమును బోధించుటకై బుద్ధుడు తన శిష్యు లను నలుమూలలకు పంపెను. తాను తిరిగి ఉరు వేలకు వచ్చుచు మార్గమధ్యమున ముప్పదిమంది యువకులను జూచెను. వారచట తమ భార్యలతో సరససల్లాపములు చేయుచుండిరి. వారిలో ఒకనికి భార్య లేకుండుటచే అతడు ఒక స్త్రీని తనవెంట గొనివచ్చెను. ఆమె అచటి వస్తువులను అపహరించి పారిపోయెను. ఆమెకై వెదకుచు ఆ యువకుడు బుద్ధునిజూచి ఆమె జాడను గూర్చి ప్రశ్నిం చెను. అందులకు బుద్ధుడు "ఓయీ ! ఆ స్త్రీకొరకు వెద కుట నీకు శ్రేయస్కరమో, ఆత్మకొరకు వెదకుట నీకు శ్రేయస్కరమో నీవే నిశ్చయించుకొనుము" అనెను. అందుల కాతడు సిగ్గుపడి వెడలిపోయెను. బుద్ధుడు ప్రప్రథమమున ఆత్మనుగూర్చి ప్రసంగించినది ఇచ్చటనే.

ఉరువేలయందు బుద్ధుడు కశ్యపుడను అగ్ని దేవ తారాధకుని గలిసెను. అతనికి అగ్నినిగూర్చి ఇట్లు ఉపదేశించెను. "అన్నియు అగ్నిచే మండుచున్నవి. కామ క్రోధము లనెడు అగ్నిచే సర్వమును అగ్నిమయమగు చున్నవి. వీనిచే ఇంద్రియములును అగ్నిమయములగు చున్నవి. కావున బుద్ధిమంతుడయినవాడు ఇంద్రియ సుఖములందు వై రాగ్యమును, కోరికల విషయమున ఏవగింపును అలవరచుకొనినచో, హృదయమునందలి బాధకు గల కారణములను తీసివేసినవా డగును." అంతట కశ్యపుడుకూడ తన శిష్యులతో బుద్ధునికి శిష్యుడాయెను.

పిమ్మట అటనుండి బుద్దుడు రాజగృహమను పట్టణ మునకు పోయెను. అచ్చట బింబిసారుడను రాజు బౌద్ధ ధర్మమును స్వీకరించుటయేగాక బౌద్ధ సంఘమునకు ఒక ఆరామముకూడ దానముచేసెను. అచ్చట నే శారీపుత్రుఁడు, మౌద్గలాయనుడు అను ఇరువురు బుద్ధునిచే ఉపదిష్టులై అతనికి ప్రముఖశిష్యులై వరలిరి.

ఇట్లుండ బుద్ధుడుగా సుప్రసిద్ధుడైన తన కుమారుని చూడగోరి శుద్దోదనుడు సందేశములు పంపదొడగెను. తుదకు బుద్ధుడు ఇష్టపడి ఒక వసంతకాలమున తన శిష్య వర్గముతో కపిలవస్తుపురమున కేగెను. ఇల్లు విడచిపోయిన పిదప మొదటి పర్యాయముగా అతడు తన తండ్రిని, భార్యాపుత్రులను చూచుట తటస్థించెను. అతడు నగరము యొక్క వాకిట నిలుచుండెను. యశోధర తనకుమారుడగు రాహులుని తండ్రియగు బుద్ధునికడకు పంపెను. రాహు లుడు బుద్ధుని కడకు వచ్చి తన వారసత్వము తన కిమ్మని యాచించెను. బుద్ధుడు శారీపుత్రుని వై పు తిరిగి రాహు లుని సంఘమునందు చేర్చుకొమ్మని ఉత్తరు విచ్చెను. ఇట్లు బుద్ధుడు తన కుమారునకు భౌతిక రాజ్య వారసత్వము కంటె శ్రేష్ఠమగు ఆధ్యాత్మిక వారసత్వ మొసగెను.

అటనుండి బుద్ధుడు రాజగృహమునకు తిరిగి వచ్చెను. శ్రావ స్త్రీ నగరమందు అనాథపిండికుడను వర్తకుడు ఆతని శిష్యు డయ్యెను. ఆ వర్తకుడు రాజగృహము నుండి శ్రావస్తి వరకు గల మార్గమున ప్రతి క్రోసు దూరము నను బౌద్ధసంఘమునకై విశ్రాంతి గృహములు కట్టిం చెను. శ్రావ స్త్రీ నగరమున జేతుడను నొక రాజకుమారుని ఆరామమును కొని బౌద్ధసంఘమున కొక సంఘారామ మును కట్టించెను. దీనికి జేతవనమని పేరు. ఇది నాటి నుండి బుద్ధునకు తన ధర్మప్రచారమునకు కేంద్రస్థాన మాయెను. శ్రావస్తియందు మరియొక వణిక్పుంగవుని కుమార్తె విశాఖయను నామె బౌద్ధమతము స్వీకరించి తన అమూల్యాభరణములను సంఘమునకు దానమిచ్చెను. దీనిపై వచ్చు నాదాయముతో మరియొక సంఘారా మము కట్టింపబడెను. బుద్ధుడు ఈ సమయముననే ఇరు పురురాజుల మధ్య జరుగనున్న యుద్ధమును వారించెను. వారు బుద్ధుని ఉపదేశములను విని వాటి ననుసరించి వర్తించిరి.

పురుషులే సంఘమునందు చేరుటకు సంగ్రహ ఆంధ్ర అర్హులై యుండిరి. అర్హులై యుండిరి. స్త్రీలకు ప్రవేశము లేకుండెను. శుద్ధోదనుని మరణానంతరము, మహాప్రజాపతి గౌతమి కాషాయాంబరములను ధరించి బుద్ధునికడకు వచ్చి సంఘ మునందు చేర్చుకొమ్మని ఆతని నర్థించెను. బుద్ధుడు మొదట అంగీకరింపలేదు. కాని అతని శిష్యులలో ప్రముఖుడైన ఆనందుడు ఆమె పక్షము వహించి అనేక విధముల ప్రార్థించెను. బుద్ధు డామెకు ప్రవేశ మొసగెను. బుద్ధుడు స్త్రీలను సంఘమునందు చేర్చుకొనుటకు చాల విముఖుడై యున్నట్లు అత డేర్పరచిన కఠిన నియమముల వలన తెలియవచ్చుచున్నది.

అప్పటినుండి బుద్ధుడు నలుబదియైదు సంవత్సరములు ఈశాన్య భారత దేశమున పర్యటించుచు ధర్మచక్ర ప్రవ ర్తనము కావింపదొడగెను. తనకడకు వచ్చినవా రంద రకును ధర్మమును బోధించుచుండెను. రాజాధి రాజుల నుండి అధమజాతివారి వరకు అందరును అతనికి శిష్యులై సేవ చేయుచుండిరి. బింబిసారుడు, అతని కుమారుడు, కోసల దేశాధీశుడైన ప్రసేనజిత్తు అతనికి శిష్యులైరి. ఆమ్రపాలియను వేశ్యగూడ బుద్ధుని ఆదరాభిమానము లను పొం దెను. ఆమె బౌద్ధసంఘమునకు సంఘారామము లను, విహారములను దానము చేసెను.

ధర్మప్రచారార్థము పర్యటించుచు బుద్దుడు 'పావా' యను పట్టణమునకు బోయెను. అచ్చట కుందుడను కమ్మర వాని యింట భోజనము గావించెను. ఆహారపదార్ధములు జీర్ణము కాక పోవుటచే బుద్ధుడు మరణించె నని చెప్పుదురు. కాని ఇది సత్యదూరముగా కాన్పించుచున్నది. భోజనా నంతరము బుద్ధుడు సాలవనమునకు పోయి తాను బడలిక చెందితి ననియు, తనకు శయ్య సిద్ధము చేయుమనియు ఆనందునితో చెప్పెను. భిక్షువులు బుద్ధుని అవసానము సమీపించె నని తెలిసికొని చుట్టును చేరిరి. అత్యల్ప కాల 492. ములో బుద్ధుని అవసానదశను గూర్చిన సమాచారము పరిసర గ్రామవాసులకు తెలిసెను. ఆ గ్రామ వాసులందరు వచ్చిరి. బుద్ధుడు అందరకును ధర్మము నుపదేశించెను. అతడు దుఃఖాక్రాంతుడైన తన ముఖ్య శిష్యుడగు ఆనం దుని పిలిచి అతనిని ఓదార్చెను. అందరకును “మీ ఆత్మ యందే శరణుపొందుడు. ధర్మమునే ఆశ్రయింపుడు. భిక్షుకులారా ! మీరందరును కష్టించి ముక్తిని సాధించు పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/546 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/547 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/548 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/549