Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోలకొండ పట్టణము

వికీసోర్స్ నుండి

గోలకొండ పట్టణము : దక్షిణాపథ చరిత్రమునందు గోలకొండ సామ్రాజ్య చరిత్రమున కొక ప్రత్యేకస్థానము కలదు. ఆంధ్రుల చరిత్రలో ఇది యొక భాగము. దాదాపు మూడు శతాబ్దముల వరకు ఈ సామ్రాజ్యము అఖండైశ్వర్యము ననుభ వించి భోగభాగ్యముల నోలలాడినది. గోలకొండ నేలిన సుల్తానులు కుతుబుషాహీ వంశస్థులు. వీరికి రాజధానియగు గోలకొండ సామ్రాజ్య రక్షక దుర్గముగ కీర్తిగాంచినది.

గోలకొండ దుర్గమునందు నగరము క్రమాభివృద్ధి నొందినది. గోలకొండ దుర్గము, నగరము అవినాభావ సంబంధము కలవియై విలసిల్లినవి. 'ఇది దుర్గము' 'ఇది నగరము' అని గీతగీసి నిర్దేశించుటకు అలవిగానట్లుగ అవి వర్ధిల్లినవి. ప్రాథమికదశయందు దుర్గప్రాంతము, నగర ప్రాంతము విడివిడిగ నుండెను. కాలక్రమమున గోలకొండ సుల్తానులు దేశరక్షణమును, ప్రజా సౌక ర్యములను దృష్టియందిడుకొని దుర్గాభివృద్ధి - నగరాభివృద్ధులకొరకు తమ శక్తి నెల్ల ధారపోసిరి. దుర్గ ప్రాంతమున గూడ నగరము విస్తృతమైనది. ఇంతేకాదు. హర్మ్యములు, ప్రాసాదములు, వేసవి కనుకూలమగు విశ్రాంతి గృహ ములు, విలాసమందిరములు, నగరమునకు కొన్ని మైళ్ళ దూరమున నిర్మితములై నవి. ఇవన్నియు గోలకొండ నగర పరిధిలో జేరినవై యుండెను.

తెలంగాణ ప్రాంతమునకు గవర్నరుగ నియమింపబడిన

చిత్రము - 122

పటము - 1

"బాలాహిస్సార్"

470

చిత్రము - 123

పటము - 2

బాలాహిస్సార్ మరియు ఇబ్రహీం కుతుబ్‌షా నిర్మించిన మశీదు

సుల్తాను కులీ మొదట గోలకొండ పరిసరములందుగల ఒకానొక ప్రాంతమును ప్రధాన కేంద్రముగ గ్రహించినట్లు తెలియుచున్నది. కాని సుల్తాన్కులీ, గోలకొండ దుర్గము, నగరము నిర్మింపబడిన తరువాతనే స్వాతంత్య్రమును ప్రక టించు కొన్నట్లు చరిత్ర కారులు అభిప్రాయపడుచున్నారు.. ఇతడు క్రీ. శ. 1518 లో స్వతంత్రుడయ్యెను. కావున గోలకొండ దుర్గముతో పాటు గోలకొండ నగరస్థాపనము కూడ 1518 వ సంవత్సరమునకు ముందే జరగెనని నిర్ణ యించుటయే సమంజస మగుచున్నది. కులీసుల్తానునకు వళము కాక పూర్వము గోలకొండ, చాళుక్యులయొక్త్రయు, కాక తీయులయొక్కయు అధీనమున నుండెను. ఈదుర్గము తెలంగాణమునకు కేంద్రస్థానమున లేకుండినను, శత్రువుల దండయాత్రలను కని పెట్టుటకు రక్షణ దృష్టిచే ప్రాధాన్య మును వహించి యుండెనని మాత్రము చెప్పవచ్చును.

సుల్తాను కులీ గోలకొండ దుర్గమును, నగరమును విస్తృతపరచుటకు తగిన ప్రయత్నము లొనర్చెను. ఆతని అనంతరము గోలకొండ సామ్రాజ్య పాలన భారమును వహించిన సుల్తానులు నగరాభివృద్ధికై కృషి సల్పిరి. సుల్తాన్ కులీ కాలమునను, తదనంతరము కొంత కాలము వరకును, గొలకొండ ప్రభువులు తమ రాజ్యమును సుస్థిర పరచుకొనుటయందు అధిక మైన శ్రద్ధను వహించిరి. కొంత కాలమైన తరువాత సుల్తానుల దృష్టి నగరాభివృద్ధి పై కేంద్రీకృత మయ్యెను. కులీ కుతుబుషా, ఇబ్రహీం కుతుబుషా, మహ్మద్ కులీ కుతుబుషా, అబ్దుల్లా కుతుబుషా మొదలగు సుల్తానులు గోలకొండ నగరమును సుందర ముగ తీర్చిదిద్దుట యందు శ్రద్ధ వహించిరి.

గోలకొండనగర వైశాల్యమును, నగరమునందు నివ సించు ప్రజల సంఖ్య మున్నగు వివరములను తెలుపుటకు ఆధారములు స్వల్పముగ నున్నవి. శతాబ్దములు పై బడిన కొలది గోలకొండ నగరము ఎంతయు అభివృద్ధి నొంది నది. అది కులీకుతుబుషా నాటికే జనసంకీర్ణమై వేరొక దారితీసినది. గోలకొండ నగర నగర నిర్మాణమునకు దారితీసినది. వైశాల్యము దినదినము మారుచుండెను. ఈ కారణము వలననే, నగరము హైదరాబాదు వరకు విస్తృత మైనది. గోలకొండనగరము సుల్తానులకు గాని, అచ్చట నివసించు ప్రజలకు గాని చాలని కాలము కూడ వచ్చినది. కొందరు సుల్తానులు గోలకొండను విస్తృతపరచుటయే గాక, క్రొత్త నగరములను, కోటలను నిర్మించుటకు పూను పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/521

విజ్ఞానకోశము - 3[మార్చు]

వ్యక్తుల పేర ప్రసిద్ధినొందినవి. ఉదా: మీరుజుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా. కొన్ని వీథులు, ప్రాంతములు 'కమా'ను లనబడు చుండెను. హర్షికమాన్ మున్నగు నవిట్టివే. ఈ సంప్రదాయము నేటికిని హైదరాబాదులో నిలచియున్నది. చార్ కమాన్, మళ్లీ కమాన్, అను వాటి పేర చార్ మినారు వద్దగల ప్రాంతమును వ్యవహరించు చున్నారు. మరి కొన్ని ప్రాంతములందు హవుజులుండుట వలన అవి హవుజుల పేర ప్రసిద్ధినొందినవి. ఉదా: కటోరా హవుజు.

గోలకొండలోగల రాజసౌధములు మహలులని వ్యవహారమును గాంచినవి. మంత్రులనివాస గృహములు, రాజాధికారులు సౌధములు, రాయబారులకు, విదేశాగం తకులకు తగిన విశ్రాంతి మందిరములు, సైనికులకు తగిన వసతి సౌకర్యములు అన్నియు — ఇందుకలవు. రాజ సైనికులు ప్రాసాదములకు సమీపమున నే కల్పింపబడినవి. తుపాకిగుండ్లు, యుద్ధ పరికరములు కల భవనము లీ ప్రాంతమునగలవు.

చిత్రము - 125 పటము - 4 ఇబ్రహీం కుతుబ్షా సమాధి

వసతులు[మార్చు]

గోలకొండ దుర్గమునకు దాదాపు 87 బురుజులును, 8 ప్రధాన ద్వారములును కలవు. ఇట్టి ప్రధాన ద్వార ములను దర్వాజాలు అనుచుండిరి. బంజా రాద ర్వాజా, ఫత్తేదర్వాజా వాటిలో ముఖ్యమైనవి. మొన్నటి వరకును హైదరాబాదు నగరమును ఆవరించిన కోటలకు ప్రధాన ద్వారములు నాలుగు దిక్కులం దుండినవి. ప్రయాణ సౌకర్యముల దృష్టితో నగరమును విస్తృత పరచుటకై ప్రభుత్వమువారు ఇటీవల ఢిల్లీ దర్వాజా, లాల్ దర్వాజా, గౌలిపురము దర్వాజ అను వాటిని పడగొట్టించిరి. పురా త త్త్వశాఖవారు చరిత్ర ప్రసిద్ధ మయిన ఫత్తే ద ర్వాజాను చారిత్రక ప్రాధాన్యముగల కట్టడమని గుర్తించి భద్ర ముగ కాపాడినారు..

సామాన్య గృహము లన్నియు, ప్రాద్దక్షిణో త్తర దిశలందుండ, రాజసౌధములు పడమటి దిశయందు నిర్మి తము లైనవి. సామాన్య గృహముల విషయము తెలి యదు కాని, రాజసౌధముల శిథిలముల వలనను, చెక్కు చెదరని కోటగోడల వలనను, నాటి సౌధనిర్మాణ పద్ద తియు, ఇంజనీర్లు సమకూర్చిన సౌకర్యములును తేటపడు చున్నవి. కోటలోని సౌధములు మూడేసి, నాలుగేసి, A ఐదేసి అంతస్తులు కలవిగా నున్నవి. గోలకొండ పట్టణము కలవిగా నున్నవి. ఈ మందిరముల పై భాగమున నేటి రూఫ్ గార్డెన్సు (Roof Gardens) వంటి చిన్న తోటలు కలవు. భవనములందు విశాలమైన గదులు కలవు. స్నానము చేయుటకు, భోజనము చేయు టకు, విశ్రాంతినొందుటకు ప్రత్యేకముగ గదులు నిర్మింప బడినవి. ఎంత ఎత్తైన ప్రదేశమునకైనను, మట్టి గొట్ట ములద్వారా, నీటి నందించుటకు సౌకర్యములు కల్పింప బడినవి.

సౌధ ప్రాంతములందు చక్కని ఉద్యానవనములు, ద్రాక్షవనములు, జలాశయములు, దుర్గ తటాకములు కలవు. కటోరాహవుజునుండి భూగర్భమున మందిరము లకు మట్టిగొట్టములు అమ ర్పబడి యున్నవి. వేడినీళ్ల సప్లయి కొరకు ప్రత్యేక మయిన గొట్టము లమర్ప బడినవి. నదీతీరమున నగర నిర్మాణ మొనర్చుట శ్రేయ స్కరమను ప్రాచీనుల ఆశ యమును సవాలు చేయు టకో యనునట్లు గోల కొండయందలి ఇంజనీర్లు జలాశయములను, హవు జులను, బావులను, దుర్గ తటాకములను, నిర్మించి. ప్రజలకు, రాజులకు నీటి సౌకర్యములు కలిగించు టయే కాక, ఉపరితలో ద్యానములకు, ద్రాక్షవన ములకు, సుందరోద్యానములకు, నీటినందించుటకు పెక్కు ప్రయత్నములు కావించిరి.

సైనిక ప్రాధాన్యముగల దుర్గమునందు కళాదృష్టితో, సుందర నగర నిర్మాణమునకు సంకల్పించుట కుతుబు షాహీ సుల్తానులకును, నాటి ఇంజనీర్లకును గౌరవకారణ మైనది. బాలాహిస్సారు ప్రాంతమున రెండు కమానులు గల భవనములు కలవు. దీని సమీపమున విశాలమైన అవరణమున్నది. ఇచ్చట గోలకొండ సుల్తానులు సైనిక వందనమును స్వీకరించెడివారు. ఈ ఆవరణమును "జల్వే ఖానా అలీ" అందురు. దీనికి కొలనిదూరమున మూస బురుజు కలదు. ఈ బురుజునకును ఫతేదర్వాజాకును మధ్య ఎన్నియో శిథిలములు కలవు. కోటపైని రాజసౌధము లలో తొమ్మిది సౌధములు సముదాయముగగల సౌధ రాజము, 'మోతీమహలు' అనునది.

చిత్రము - 128

పటము - 5

మహమ్మదు కులీకుతుబ్‌షా సమాధి

రాజప్రాసాదముల సమీపమున రాయబారులు, విదే శీయులు నివసించుటకు సౌధములు నిర్మింపబడినవి. ఈరాన్ దేశపు రాయబారి వచ్చినపు డీ భవనమునందే అతనికి సమస్త సౌకర్యములు కలిగించబడినవి. ప్రభువులు దర్భారుచేయుటకు తగిన భవనములు కలవు. రాజ సింహాసనము 'దీవాన్ ఖాన్' అను భవనమున గలదు. న్యాయ సభలందు ప్రజలువచ్చి తమ కష్టనిష్ఠురములను విన్నవించు కొనుటకును, వారు కూర్చుండుటకును తగిన వసతులు కలవు. 'దౌలత్ ఖానా' అనునది దర్భారుహాలుగ సుప్రసిద్ధ మైనది. బాలాహిస్సారు ప్రాంతముననే 'తానాషాగద్ది' అని ప్రసిద్ధివహించిన రెండంతస్తుల భవనము గలదు. 'నగీనా బాగు' అను ఉద్యానవనమొకటి కలదు. జింకల రక్షణము కొరకు గోలకొండ సుల్తానులు ప్రత్యేకోద్యానమును నిర్మించిరి. ఈ వనమునగల జింకలను బాధించుటగాని చంపుటగాని తగదని రాజాజ్ఞ యుండెను. గోలకొండ ప్రాంతమున కొన్ని రాజప్రాసాదములు నిర్మింపబడినవి. ఇవి కోటకు కొన్ని మైళ్ల దూరమున గలవు. మహమ్మదు కులీ హుస్సేన్ సాగరము సమీపమున 'Black Hills' ప్రాంతమున వేసవి విశ్రాంతిగృహమును కట్టించుకొనెను. వర్షర్తువులందు కొన్ని దినములు సుఖముగ కాలక్షేపము చేయుటకు 'మహల్ కోహినూర్ * అను భవనమును కట్టించెను. ఈ భవనము ప్రస్తుతము 'ఫలక్ నుమా' సౌధ ముగల ప్రాంతమున నిర్మితమై యుండెను.

గోలకొండ నగరమున రాజసౌధములకు సమీపమున అంతఃపుర స్త్రీలకొరకు నిర్మింపబడిన జనానామహల్ ఉండెను. స్త్రీలకొరకు ప్రత్యేక ముగ నిర్మింపబడిన ఇట్టి భవనములు మరికొన్ని ఉండెను. అంతఃపురమునం దే చక్కనితోట లుండెను. అంతఃపురరక్షణకై ప్రత్యేక ముగ హర్షీలు నియమితులగుచుండిరి. ఔరంగ జేబు గోలకొండ కోటపై దాడిచేసిన సందర్భమునందు సైన్యము కోట లోనికి ప్రవేశించినపుడు అంతఃపుర స్త్రీలను రక్షించుటకు హర్షీలు తమ ప్రాణములను సైతము ధారపోసిరి. అంతః పురస్త్రీలు ఆత్మాభిమానము కలవారుగుటచే శత్రువుల చేజిక్కుటకు ఇచ్చగింపక, సమీపమునగల బావులందు దూకి, ప్రాణములను కోలుపోయిరి. ఆ బావులు శిథిల ములు నేటికిని కలవు.

ఉమ్రావులు, రాజాధి కారులు, మంత్రులు మున్న గువారి కొరకు ప్రత్యేకమందిరములు నిర్మింపబడెను. ధనికులు, రాజాధి కారులు, కోట వెలుపల, పరిసర ప్రాంతములందు కూడ ఎ త్తైన భవనములను, విశాలమైన ఉద్యానవనము లను, నిర్మించుకొనిరి. అట్టి నిర్మాణ విషయమున గోల కొండ సుల్తానులు ప్రోత్సాహము నొసగిరి. తత్ఫలితముగ కోటయందు, దాని సమీపమునందు నగరము విస్తృత మగుటకు ఏమాత్రము అవకాశము లేని పరిస్థితు లేర్ప డెను. అట్టి సందర్భముననే మహమ్మద్ కులీకి హైదరా బాదు నగర నిర్మాణ విషయమున సంకల్పము కలిగినది.

సైనికుల నివాసముకొరకు ప్రత్యేకము అయిన మంది రములు నిర్మింపబడినవి. ఆయుధ సామగ్రిని నిక్షిప్తము చేయుట కొరకును ప్రత్యేక మందిరము లుం డెను. ధనాగారములు సై నికాధికారులచే రక్షింపబడుచుండెను. రాజ ధనాగారము లందలి ధనమును దొంగిలించుటగాని, దుర్వినియోగ పరచుటగాని గొప్ప నేరముగ పరిగణింప బడుచుండెను. రాజ ధనాగారమును 'అంబరఖానా' అని వ్యవహరించుచుండిరి. రాజధనమును దుర్విని యోగము కావించినందులకు, అబుల్ హసన్ కాలమున 'మూసా' అను అధికారి కఠినముగ శిక్షింపబడెను. 'మూసా ఇంటిని సోదాచేసి, 5 లక్షల విలువగల రొక్కమును ప్రభుత్వము వారు తిరిగి పొందగలిగిరి.


సామాన్య ప్రజలు నివసించు వీధులందును. రాజ ప్రాసాదము లందును మసీదులు, ధర్మశాలలు, భిక్షా గృహములు, యాత్రిక భవనములు, పాఠశాలలు, వైద్య శాలలు, ' పెక్కులు నిర్మింపబడెను. మసీదు గోడలపై, గుంబదుల గోడల పై చిలుకలను, గబ్బిలములను, ఉడుతల రూపములను వివిధములయిన రంగులతో చిత్రించు చుండిరి. కోట ద్వారములపై సింహములను చిత్రించిరి.

గోలకొండ నగరమున సామాన్య ప్రజలు సుఖముగ జీవించిరి. వారి ఆస్తిపాస్తులను రక్షించుటయందును, నగరమున శాంతిభద్రతలను నెలకొల్పుటయందును, సిటీ పోలీసు కమీషనరు క్రొత్వాలు) శ్రద్ధ వహించుచుండెడి వాడు. మూడుకాళ్ళ ముసలమ్మ కూడ నిర్భయముగ ఆభరణములతో వెడలుటకు ఎట్టి ఆటంకము లేకుండెను. కాసిం బేగ్ వంటి ప్రముఖులు పోలీసు కమీషనరు పదవియం దుండి అత్యంత సమర్థులుగా స్థిరకీర్తి నార్జించిరి. మహ మ్మద్ కులీ కాలమున ఎవరికిని మరణశిక్ష విధింపబడలేదు. నగరమునవచ్చు విదేశీయులపై పోలీసు వారు గూఢచారు లను నియోగించి, వారిచర్యలను అనుక్షణము గమనించు చుండిరి. గూఢచారులు, రక్షకభటులు, విదేశీయులు ఎట్టి విద్రోహచర్యలకు పూనుకొనకుండ జాగ్రత్తవహించిరి.

గోలకొండ ప్రజలలో వివిధ వృత్తులు స్వీకరించిన వారుండిరి. వారి ప్రధానవృత్తి వ్యవసాయము. ప్రభు త్వోద్యోగములలో చేరినవారు కొలదిమంది మాత్రమే ఉండిరి. ప్రభుత్వమునందలి ఉన్నతోద్యోగములు బ్రాహ్మ ణుల ఆధీనమునం దుండెను. సైన్యములో ఈరాక్, పర్షియా దేశ ములనుండివచ్చి గోలకొండలో స్థిరపడినవారే కాక, పాశ్చాత్యులుకూడ నుండిరి. నేతపనివారు, కుటీర పరిశ్రమలవారు, కత్తులు మొదలగు ఆయుధములు చేయు వారు, నగారా మ్రోగించువారు, నాట్యము చేయువారు, శిల్పులు, చిత్రకారులు, భవననిర్మాతలు, ఉద్యాన కృషిలో నిపుణులయినవారు, పల్లకీలు మోయువారు, బోయలు, చక్కని దస్తూరి వ్రాయువారు, ఇట్లు వివిధవృత్తులను స్వీకరించినవారు, ఎందరో ఉండిరి. జ్యోతిష్కులు, పండి తులు, మతగురువులు పూజనీయులై యుండిరి.

గోలకొండ, ప్రధానముగ వర్తక కేంద్రము. ఇక్కడి వజ్రములు ఈ నగరమునకు ప్రపంచఖ్యాతి నార్జించినవి. యాత్రికులవలన, వ ర్తక వ్యాపారము లొనర్చుట కై వచ్చు వారివలన, వింతవింతలయిన విశేషములు తెలియు పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/525 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/526 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/527 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/528 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/529 చేరిన ఇతర స్వామిద్రోహులవలె అబ్దుల్లాఖాన్ కూడ మొగలు సైన్యమున చేరియున్న బాగుగ నుండెడిది. కాని అతడు గోలకొండ సైన్యమున నుండి 1686 వ సం. రము 21 సెప్టెంబరునాడు అర్ధరాత్రమందు కోటద్వారములు తెరచి మొగలు సేనలకు స్వాగత మొసగెను. ఈ దాడి ఫలిత ముగ 14 శ తాబ్దికి పై గా వైభవదళ ననుభవించిన గోల కొండనగరము ఔరంగ జేబు చేజిక్కి తన సౌభాగ్యమును కోల్పోయినది.

గోలకొండ వైభవమును తెలుగుకవులు, ఉర్దూ కవులు ఎందరో కీర్తించియున్నారు. మహమ్మద్ కులీ వ్రాతల వలన, ప్రణయగీతిక లవలన, చరిత్రకారుల అనుభవముల వలన, విదేశీయులు, రాయబారులు వ్రాసిన గ్రంథముల వలన, గోలకొండ వైభవము నేటికిని కన్నుల గట్టినట్లు న్నది. పొన్నగంటి తెలగన్న తన యయాతి చరిత్ర కావ్య పీఠికయందు గోలకొండను ఈ విధముగ వర్ణించెను :

"తెఱగంటి దొరణాల తెగలఁదీఱినకోట
నిగనిగల్ నలుగడల్ నిండియుండఁ
దమ్ముల పాదు రాకొమ్మల దగదగల్
వేలుపుఁ బ్రోలిర్లు విరియఁ జేయఁ
డంబులంపు క్రొత్తడంబుల రంగు
నింగికిఁ దోపు వన్నియలు నింపఁ
గడలి యోనని చిల్వపడతి చాల గడిత
తెలనీటి నే ప్రొద్దు గలసియుండ
మిసిమి బంగారు మేడలమీఁది యెదల
నిడిన ముత్యాలుఁ జుక్కలుఁ దడవడంగఁ
దెలియ కెల్లరు వెఱగంద నలరునెపుడు
మేలు వజీరగమికొండ గోలకొండ.

కో. గో.