Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)

వికీసోర్స్ నుండి

ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున):

మానవుడుతనకుపకరించుపదార్థముల కొరకు ప్రకృతిని శోధించుచునే యున్నాడు. ఈ ఆవశ్యక పదార్థాన్వేషణమునకు మనము వసించు భూమియే ప్రధానస్థలము. భూమ్యుపరితలమునను, అంత ర్భాగముననుఅనేక పదార్థములను కాలక్రమమున కనుగొని, వెలికితీసి,రూపాంతరీకరించి,మానవోపయోగ్య మొనరించి,సుఖించుటకు నిర్విరామముగ కృషి జరుగుచున్నది వీటిలో ఖనిజములకొక ముఖ్యస్థానముగలదు.ఖనిజములుతరతరములనుండి ఉపయోగమందుండినను, రానురానువీనిని దైనందినావసరములకేకాక వీటి ఉపయోగముచే జీవితమునే సుఖవంతమొనరింప జేసికొనుటకై పెక్కు ప్రయత్నములు జరుగుచున్నవి. అందుచే వీటి ఆవశ్యకత అనేక ఇతర పరిణామములకు త్రోవతీసినది. వీటి అన్వే షణ యందు అనేక క్రొత్త దేశములు, క్రొత్తజాతులు కల్గొనబడినవి. ఈ ఖనిజములయందు ఆధిక్యతగల దేశము లకు క్రమేణ రాజకీయ, ఆర్థిక, వ్యాపారపలుకుబడి పెంపొందినది. ఆ కారణమున వివిధ దేశముల మధ్య స్పర్థలు, యుద్ధములు, సామ్రాజ్యవిస్తరణ కాంక్షలు కలుగుటకు ఆస్కార మేర్పడెను.

ప్రతిదేశములో కొన్ని ఖనిజములు అధికముగా నుండి, మరికొన్ని ఖనిజములకొరకు ఇతర దేశములపై ఆధారపడవలసి యుండును. ఏ ఒక్క దేశము కూడ ఖనిజ సంపదయందు సర్వసమృద్ధముగ నుండజాలదు. ఖనిజము లందు ఇంతవరకు చాలవరకు సర్వసమృద్ధి సాధించినది ఒక్క రష్యాదేశము మాత్రమే. ఆ దేశము అంత త్వరిత ముగా పారిశ్రామిక ఆధిక్యత సంపాదించుటకు గల ముఖ్యకారణములలో ఇదియొకటి. ఒక దేశమున లేని ఖనిజములను అది సమృద్ధిగాగల ఇతర దేశములనుండి సంపాదించు కొని అన్యోన్య సహకారమును వృద్ధి చేసు కొనుటమీదనే ప్రపంచ పారిశ్రామికాభ్యున్నతి ఆధార పడి యున్నది.

అంధయుగమునందు (Dark Ages) వ్యాప్తిలోనున్న ఖనిజములు పది మాత్రమే. (ఇనుము, రాగి, సీసము, టిన్, 'బంగారము, వెండి, పాదరసము, వజ్రములు, కొన్ని రకముల బంకమన్ను (clay), భవన నిర్మాణముల కుపయోగపడు రాళ్లు). కాని ఇప్పుడు 75 రకములకు పైగా ఖనిజములు ప్రపంచములో వ్యాప్తియందున్నవి. మానవునకు ఖనిజావశ్యకత పొడసూపినది మొదలు నేటి వరకు వాటి వినియోగమున అనేక నూతన విధా నములు కనుగొనబడినవి. అందుచే వాటి గిరాకి (demand) అత్యధికముగా పెరిగినది. పోత ఇనుము యొక్క ఉత్పత్తి గత శతాబ్దమునుండి ఇప్పటివరకు 100 రెట్లు వృద్ధి చెందుటయే దీనికి సరియైన ప్రామాణి కోదాహరణము. ప్రపంచమందలి ఖనిజ సంపద అంతయు రెండు ముఖ్య వర్గములక్రింద విభజింపబడినది. (1) లోహ ఖనిజములు (2) లో హేతర ఖనిజములు. ప్రతి ఖనిజమందును లోహము, వాయు పదార్థము, ఇతర ద్రవ్య ములును కొన్ని భాగములలో కలిసియుండును. ఏయే ఖనిజములనుండి లోహమును ఆర్థికముగ వేరుచేయుటకు వీలగునో అట్టివి మొదటి వర్గమున చేర్పబడినవి. రెండవ వర్గమునకు చెందిన ఖనిజములయం దిమిడి యున్న లోహపు విలువచేకాక, వాటికి గల ఇతర భౌతిక లక్షణ ముల ఔన్నత్యముచే అవి ఆర్థిక ఖనిజము లగుటవలన, అట్టివి లో హేతర ఖనిజములక్రింద వర్గీకరింపబడినవి. వీటికి రెండు జనసామాన్యమగు ఉదాహరణము లియవలె నన్న (1) తెల్ల సుద్ద (clay) యను పదార్థమందు అల్యూమినియము అను లోహమును, (2) రాతి నార (asbestos) యందు మెగ్నీషియము అను లోహమును కలవు. కాని మొదటిది పింగాణి పాత్రల తయారీయం దును, రెండవది ఉష్ణనిరోధ కావసరములకును ఉపయోగ పడుచున్నవి.

గ్రాఫైటు (graphite), వజ్రము- ఈ రెండును రాసాయనిక ముగ బొగ్గు పదార్థము మాత్రమే కలిగి యుండును. కాని మొదటిది ఉష్ణరాసాయన నిరోధక పదార్థముగను, రెండవది ఆభరణముగను, కోతపదార్థము గను ఉపయోగపడుచున్నవి.

మానవోపయోగ ఆర్థిక ఖనిజములను గూర్చిన అనేక ఇతర విషయములను తెలిసికొనుటకు పూర్వము వీటికి సంబంధించిన శాస్త్రములను, వీటి అన్వేషణకై జరిగిన కృషినిగూర్చి తెలిసికొనుట అవసరము. రాతియుగ మం దలి మానవుడు వేట కొరకును, నిప్పును సృష్టించుటకును ఉపయోగించిన రాతిసాధనములు ఒక రక మైన ఖనిజము లే. అందుచే ఖనిజములు రాతియుగము నుండియే మాన వోపయోగములుగ నున్నవని చెప్పనగును, కాని అప్పటి మానవుడు, ఈ ఖనిజములు తాదాత్మ్యకముగ కనిపించి నపుడు, వాటిని ఆ సమయమున తనకు తోచినరీతిగా ఉపయోగించెడివాడు; లేకున్న పార వై చెడివాడు. కావున ప్రధానావసరములగు పనిముట్లు తయారైన పిదప వాని దృష్టి రంగు రంగులుగా నుండి మెరయు చుండెడి వజ్ర సంబంధిక పదార్థములచే ఆకర్షింపబడెను. ఆనాటి మానవుడు వజ్రములను ఆభరణములుగను, ఆట వస్తువులుగను ఉపయోగించుకొనుటకు కృషి సల్పెను. కావుననే మొట్టమొదటగా వజ్రములు క్రీ.పూ. 3500 సం. పూర్వము నుండియే ఉత్తర ఈజిప్టుదేశమున ఆర్థిక ముగ ఉన్నతస్థాన మలంకరించినవి. కాని వీనికి సంబంధించిన విషయములను తెలివిగా, తార్కికముగా ఆలోచించి ఎవ్విధముగా వాటిని ఉపయోగించిన సార్థకమగునో కనుగొనుటకు ప్రప్రథమమున యత్నించినది గ్రీకు దేశీయులు. ఖనిజములు ఒక పరిశ్రమగా రూపొందుట క్రీ. పూ. 2500 సం. కే ప్రారంభమైనది. అప్పుడే తెల్ల సుద్ధతో పింగాణీ పాత్రలు, ఇటుకలు, బొమ్మలు చేయుట మొదలైనది. ఈ ఖనిజ విషయముల నొకచో క్రోడీకరించి గ్రంథరూప మొసగిన ("Book of stones") ఘనత గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ శిష్యుడగు థియోప్రటన్ (క్రీ. పూ. 372-287, నకు దక్కినది. క్రీ.పూ. 1925 సం.న ఈజిప్టు దేశస్థులు ఎఱ్ఱసముద్ర ప్రాంతమున 'మరకతము ' (emerald) అను వజ్రము కొరకు 800 అడుగుల లోతున 400 మంది మనుష్యులు పనిచేయుటకు వీలైన సొరంగ మును త్రవ్వినట్లు ఆధారములు కన్పట్టినవి. ఆనాటి భారత దేశమున ఇ ను ప ఖనిజమును కొలుములలో కరిగించి, దాని నుండి ముడి ఇనుమును తయారుచేసి, పని ముట్లుగా నిర్మించుకొనెడివారు మనదేశమున కన్పడు ఇనుప స్తంభములను పరికించినచో, ఆ రోజులలో భారతీ యులు ఎంతటి మేలురకమైన ఇనుమును, ఉక్కును తయారుచేయగలిగిరో స్పష్టమగును.

అనంతరము చాలకాలము వరకు ప్రయత్నపూర్వక ముగనో, తాదాత్మ్యక ముగనో కనుగొనబడిన ఖనిజము లను శ క్తికొలది వినియోగించుకొనుట యందును, ఖనిజ సంబంధ విషయ సేకరణము నందును పెక్కు ప్రయత్న ములు జరిగినవి. కాని వాటి నొకచో క్రోడీకరించి, విభ జించి, వివిధ శాస్త్రములుగ రూపొందించుట జరుగ లేదు. ఖనిజము లె ట్లేర్పడినవను విషయముపై కృషి సల్పి సవ్యమైన సిద్ధాంతమును ప్రథమముగా ప్రతిపాదించిన వాడు జార్జియస్ అగ్రికోలా (1494-1555). అతని సిద్ధాం తమునకు ప్రస్తుతము విలువ లేకున్నను, ఆ శాస్త్రమునకు నాందీ ప్రస్తావన జరపిన ఘనత అతనికే దక్కినది. 18 వ శతాబ్దిలో ఈశాస్త్రమున కొక విశిష్టస్థానమును కల్పించు టకు అనేకులు విస్తారమైన కృషి సల్పిరి. 19, 20 వ శతాబ్దులయందు శాస్త్రజ్ఞుల కొక తార్కిక విమర్శనా దృష్టి ఏర్పడి, అనేక విశిష్ట సిద్ధాంతరచనకు అవకాశ మేర్పడెను. వీటిలో అనేక సిద్ధాంతము లిప్పటికిని చలా మణిలో నున్నవి.

వివిధ ఖనిజములను ఉపయోగించు విధానములు జన రంజక మగుటయేగాక, అనేక నూతన విధానములు నిర్విరామముగ కనుగొనబడు చుండుటచే, వాటి గిరాకి దినదిన ప్రవర్థమాన మగుచున్నది. అడియుగాక, ఖనిజ ములను వెలికి తీసి, తరిగించుటయే మనకు తెలియును గాని, వానిని భూగర్భమందు పెంపొందించుట, తయారు చేయుట తెలియదు; తెలియు అవకాశము కూడ శూన్యము. కావున నే వీనిని "తరుగుసంపద" (wasting assets) అందురు. ఇవి పూర్తిగా తరిగిపోయినచో, మానవుడు అత్యుత్తమ జీవితావసరవస్తువును కోల్పోయె ననియే చెప్పవచ్చును అందుచే ఇప్పుడు శాస్త్రజ్ఞుల కృషి యంతయు మూడు అంశములపై కేంద్రీకరింపబడి యున్నది. (1) ఖనిజములు దొరకు క్రొత్త ప్రదేశములను కనుగొనుట; (2) వాటిని సులభసాధనముల ఎక్కువ లోతునుండి వెలికితీయుట; (3) వెలికితీసిన వాటిలో ఏ మాత్రమును వృథాకాకుండుటకై ప్రయ త్నించుట; ఉన్న వానిని పొదుపుగా వాడుకొనుటగూడ దీనికి సంబంధించిన విధానమే. ఈ విషయములపై నిర్వి రామముగా కృషి సాగుచునేయున్నది. క్రొత్తక్రొత్త ప్రత్యేక శాస్త్రములు ఉద్భవించుచున్నవి. ప్రధానశాఖల కెన్నో ఉపశాఖలు బయలు దేరుచున్నవి. వీటిని గూర్చి కొంతవరకు తెలిసికొనవలెనన్నచో, ఆర్థిక భూగర్భశాస్త్ర నాలుగు ముఖ్య శాఖలు మందు (Economic Geology) కలవని గమనింపవలెను. (1) ఖనిజములు భూగర్భమం దేర్పడు విధానము; ఏర్పడుట కనువైన ప్రదేశముల గూర్చి తెలిసికొను శాస్త్రము (genesis and occurence of ore-deposits) 2. అది దొరకు టకు అనువైన ప్రదేశములను గుర్తించుట కుపక రించు భూగర్భ భూ(గర్భ) భౌతిక శాస్త్రములు (Geolo- gical and geophysical prospecting), 8 ఖనిజ ములను ఎక్కువ లోతులనుండి సులభముగను, చవుక గను వెలికి తీయుట కుపకరించు శాస్త్రము (Mining), 4. వెలికితీసిన ఖనిజములలో అవసరమగు ఖనిజములను ఇతర పదార్థములనుండి కేంద్రీకరించి వేరు పరచు శాస్త్రము (Mineral dressing and Metallurgy).

ఈ వివిధ శాఖ లందలి శాస్త్రజ్ఞానాభివృద్ధిపై ఖనిజ ములు మానవునకు ఎంత ఎక్కువగా ఉపయోగ పడునో, ఎట్లు వృధాకాకుండునో, ఖనిజసంపద పూర్తిగా ఎట్లు క్షీణింపకుండునో … మున్నగు అంశములు యున్నవి. నవీన పారిశ్రామిక యుగమందు మానవజాతి ఆధారపడి

ఖనిజసంపదపై పూర్తిగా ఆధారపడి యున్నది. గృహ నిర్మాణము, గృహోపయోగ సామగ్రి, విద్యుచ్ఛక్తి. బొగ్గు, మనము నడచు వీథులు, ప్రయాణమున కుపక రించు వాహనములు (బస్సులు, రైళ్ళు, ఓడలు, విమాన ములు మొ.) యుద్ధ మునం దీవసరమగు సామగ్రి, అన్ని రకముల యంత్రములు మున్నగునవి తయారగుటకు ఖనిజసంపదయే మూలము. పరిశ్రమల కత్యవసరమగు ఇనుము, బొగ్గు వంటి ఖనిజములు సమృద్ధియే దేశము యొక్క పారిశ్రామికాభివృద్ధిని నిర్ణయించును. పరిశ్రమల కత్యవసరమగు ఖనిజములును, విలాసజీవిత మున కవసరమగు వజ్రములు మున్నగునవియు, శాంతి సమయమున కవసరమగు మరికొన్ని ఖనిజములును, యుద్ధావసరములగు ఇతర ఖనిజములును వాటి సంఖ్య కంటె ఎన్నో రెట్లు అధికముగా ప్రాముఖ్యమును సంపా దించుకొని యున్నవి.

భారత దేశమున అత్యధిక సంపద గలిగి, ఎగుమతుల ద్వారా ధనమార్జించుటకు వీలైన ఖనిజములు ముఖ్యముగా మూడు, అవి 1. ఇనుము, 2. మాంగనీసు, 8. అభ్రకము. మన దేశము పారిశ్రామికముగ ఉన్నతస్థితియందు లేకుం డుటచే, కొన్ని ఖనిజములు, అనేకములైన ఇతర వస్తు వులు పరదేశములనుండి దిగుమతి చేసికొనవలసివచ్చు చున్నది. ఈ దిగుమతుల ఖరీదు ఎగుమతులకంటె చాల ఎక్కువగా నున్నదని ఈ క్రింది పట్టిక నుబట్టి గమనింప వచ్చును.

మూస:Missing table

కనుక ఈ లోటును పూడ్చుటకై ఈ దేశమును అన్ని వస్తువులందు స్వయంసమృద్ద మొందించుకొనుట, ఎగు మతులను వృద్ధిచేయుట చాల అవసరము. ఈ దేశము ఎగుమతులద్వారా ధనమార్జించుటకు ఖనిజములు ముఖ్య సాధనములు. ఖనిజములలో ఒక్క లోహసంబంధ మైన ఎగుమతులద్వారా 1959వ సంవత్సరమందు ఆర్జించిన ధనములో ఎంతవృద్ధి కన్పట్టుచున్నదో ఈ క్రింద గమనింప నగును.

మూస:Missing table

ఈ నవీనయుగమందు దేశపురోభివృద్ధికి ఉక్కు వెన్నె ముక వంటిది. ఉక్కు తయారునందు కావలసిన పదార్థ ములు ముఖ్యముగ ఇనుము, బొగ్గు, సున్నపురాయి. ఇనుము భారత దేశమందు విస్తారముగ గలదు. ఇనుప ఖనిజమునుండి ఇనుమును వేరుచేయుట, ఒక విధ మైన తక్కువరకపు ఉక్కును తయారుచేయుట ఈ దేశమందు 3500 సం. ల నుండి జరుగుచున్నది. మన దేశమందలి ఇనుము అధికలోహశాతము గలది. అమెరికాదేశమందు 50 లో హశాతమువరకును, బ్రిటన్ యందు 40 లోహ శాతమువరకును ఉపయోగింపబడుచున్నది. కాని ఈదేశ మున 60-65 లోహశాతము గల ఇనుప ఖనిజము ఎక్కు వగా వాడబడుచున్నది. ఒక్క బీహారు రాష్ట్ర మందలి సింగభూమి ప్రాంతమునందే 60-65 లోహశాతము గల ఖనిజము 21,000 మిలియను టన్నులు కలదని అంచనా. కావున ఈ దేశమున ఎనలేని ఇనుపఖనిజ సంపద కలదని చెప్పవచ్చును.

బొగ్గుసంపద యందు కూడ ప్రస్తుతము ఈ దేశమున కొదువలేదు. రానిగంజ్, ఝరియా ప్రాంతములలో బొగ్గు 1950 నాటి లెక్కల కంటె రెట్టింపు గలదని రుజువు చేయబడినది. 1961 నాటికి బొగ్గు ఉత్పత్తి 39 మిలియను టన్ను లుండునని అంచనా. ఉక్కు కర్మాగారములు, రైళ్ల వసతులు దినదినము వృద్ధినొందుచుండుటచే రానున్న పంచవర్ష ప్రణాళికలో దీని ఉత్పత్తిని రెట్టింపు చేయవలసి యుండును. బొగ్గు సంపద యందు ఈ దేశము స్వయం సమృద్ధమే అయినను, దానిని వెలికితీయు విధానములలో కొంత జాప్యము కాననగును.

సున్నపురాయి యందును ఈ దేశమునకు ఎనలేని సంపద కలదు. ఒక మిలియను టన్నుల ఉక్కు ఉత్పత్తికి 540,000 టన్నుల సున్నపురాయి కావలెను. ప్రస్తుతము పనిచేయుచున్న 5 ఉక్కు కర్మాగారములలో నాలుగింటికి ఈ ఖనిజము ఒరిస్సా రాష్ట్రములోని సుందరగార్ జిల్లా నుండియే వచ్చుచున్నది. ఖిలాయ్ కర్మాగారమునకు 12

మైళ్ల దూరములో ఇది దొరకును. సున్నపురాయి ఉక్కు తయారీ యం దే కాక ప్రాజెక్టులు, భవనములు మున్నగు వాటి నిర్మాణమందు ఉక్కుతో సమ ప్రాతినిధ్యము గల సిమెంటు తయారునకు ముఖ్య పదార్థము సిమెంటునకు ఉపకరించు రాయి భారతదేశమందలి ప్రతి రాష్ట్రమునను దొరకును (ఒక్క పశ్చిమ బెంగాల్ తప్ప). 1950-51 నందు సిమెంటు ఉత్పత్తి 2.7 మిలియను టన్నులు. 1959-60 నందు 7 మిలియను టన్నులు తరువాత ఉక్కు తయారునకు కావలసిన మేంగనీసు ఎన్నో రెట్లెక్కువగా ఈ దేశమందు ఉత్పత్తియగుచున్నది. కావున ఈ ఖనిజ మునకు భారతదేశమందు కొరత ఉండదు.

తరువాత దేశాభివృద్ధికి ముఖ్యమైనది పెట్రోలియము నూనె. ఈ నూనె యందు భారత దేశమునకు స్వయం సమృద్ధిలేదు. దగ్గరలో లభించు సూచనలుకూడ తక్కువ. మొట్టమొదటగా ఈ దేశమున అస్సాములోని దిగ్బాయి, పశ్చిమ పంజాబులోని అట్టక్ ప్రాంతములనుండి నూనె తీయబడుచున్నది. ఈ ప్రాంతములను వృద్ధికి తీసుకురా గల్గిన యెడల, మూడవ ప్రణాళికాంతమునకు దేశావసర ములలో మూడవవంతు నూనె ఉత్పత్తి చేయవచ్చును. (అనగా 12 మిలియను టన్నులు). దిగ్బాయినుండి సంవత్సరమునకు 270,000 టన్నులు ఉత్పత్తియగును. కాని ఈమధ్య రష్యా, రుమేనియా దేశముల సహాయ ముతో పెక్కు క్రొత్త నూనెగనులు కల్గొనబడినవి. అందు నహ-ర్ కాతియా, మేరాన్. జ్వాలాముఖి, కాం బే, హోషియార్ ప్పూరు, శిబ్సాగర్ ప్రాంతములు చెప్పు కొన దగినవి. మొదటి రెండు ప్రాంతములనుండి 10,000 లేక 13,000 అడుగుల లోతునుండి నూనెను సాలుకు 2.75 మిలియను టన్నులు తీయ పిలగునని అంచనా వేయబడినది. ఈ పరిస్థితుల కారణముగా నూనె విషయ ములో ఈ దేశముయొక్క పరిస్థితి కొంత ఆశాజనక ముగ నున్నది. పారిశ్రామికాభివృద్ధితోపాటు, విద్యు చ్ఛక్తి ఉత్పత్తికూడ పెరుగవలెను. ప్రస్తుతము అమె రికా, ఇంగ్లండు దేశములలో సగటున ఒక మనిషి 1 కిలో వాటు విద్యుచ్ఛక్తిని వినియోగించు చున్నాడు. కాని భారత దేశము 25 సంవత్సరముల నాటికి సగటున ఒక మనిషి 0.1 కిలో వాటు ఉపయోగింపవలెనన్నచో, 50 మిలియను కిలో వాట్లు ఉత్పత్తి కావలెను. కాని ప్రాజెక్టులనుండి 30 మిలియను కిలో వాట్లకంటే ఎక్కువ తీయుటకు వీలు పడదని అంచనా. కావున కనీసము 10 మిలియను కిలో వాట్ల కంటే ఎక్కువగా అణుశక్తి నుండి ఉత్పత్తి చేయ వలెనని పథకములను రూపొందించిరి. ఈ రీతిగా విద్యు చ్ఛక్తిని తయారుచేయుటకు కావలసినవి ఖనిజములే. అవి 1. యురేనియం, 2. థోరియం. యురేనియం సంపద యందు ఈ దేశము వెనుక బడియున్నది (30,000 టన్నులు మాత్రమే గలదు). అయినను థోరియం మాత్రము సమృద్ధిగా గలదు. ఒక్క బీహారు రాష్ట్రమందే ఈ ఖని జము 3 లక్షల టన్నులు కలదని కల్గొనబడినది. ఈ ఖనిజ సంపద సనుృద్ధిగా నుండుటచే ఈ దేశమున అణువిచ్ఛేద నము నుండి విద్యుచ్ఛక్తి ఇతర పద్ధతులకంటే చవుకగా ఉత్పత్తిచేయుటకు వీలగునని భావింపబడుచున్నది.

ఇనుము, మాంగనీసు కాక మిగిలిన లోహముల విష యములో భారత దేశమున స్వయం సమృద్ధి లేదని చెప్ప వచ్చును. తుత్తునాగ ఖనిజము ఉదయపూరులోని జావర్ గనులనుండి లభించును. దీనినుండి లోహమును వేరు చేయుటకై దీనిని జపానుకు పంపుచుండెడివారు. కాని ఇప్పుడు ఆపనిని ఇక్క డే చేయుటకు ఇటీవల పునాది వేయు బడినది. ఇది సాలుకు 15000 టన్నుల లోహమును తీయ గలదు. సీసమును వేరుచేయు కర్మాగారము బీహారులోని 'టున్ డూ' లో కలదు. దీనిశ క్తి 8500 టన్నులకు ఇటీ వలనే పెంచబడినది. ఈ రెండింటికంటే ముఖ్యమగు రాగి ఈ దేశమున కావలసిన దానికంటే చాల తక్కువ లభ్యమగు చున్నది. 'ఘట్ శిల' యందలి కర్మాగారము నకు సాలుకు 85000 టన్నుల రాగిని వేరుపరచుటకు అను మతి ఈయబడినది. భారత ప్రభుత్వము యొక్క వివిధ భూగర్భశాస్త్ర శాఖలు, ముఖ్యముగ జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యూరో ఆఫ్ మినరల్స్, ఈ ఖనిజములందు క్రొత్త ప్రదేశములను కల్గొనుటకు విస్తారముగ కృషి చేయుచున్నవి. రాజస్థాన్ యందలి డారిబో (Daribo), ఖేత్రి (Khetri), ఆంధ్రప్రదేశ్ లోని 'గని' లేక గరిమెనపెంట ప్రాంతములనుండి రాగి లాభదాయక ముగ తీయనగురుని కనబడినది. పని ప్రారంభించుటకు ప్రయత్నములు విరివిగా సాగుచున్నవి.

సిక్కింలోని ఛోటాంగ్ గనులందు ఈ మూడు లోహ ములు దొరకునని కల్గొనబడినది. 1966లో భారత దేశ ము నకు సీసము 65,000 టన్నులు, తుత్తునాగము 1,87,500 టన్నులు, రాగి 1,70,000 టన్నులు అవసరమగునని అంచనా వేయబడినది. అల్యూమినియం ఖనిజము (బాక్సైట్) ఇచ్చట విస్తారముగా కలదు. కాని ఈ లోహ మును వేరుచేయు కర్మాగారములను ఈమధ్యనే విరివిగా స్థాపింప `మొదలిడిరి. ఈ లోహము, 25 శాతము రాగి, 15 శాతము సీసమునకు బదులుగా వినియోగింప వీలగు టచే, ఈ కర్మాగారముల ఆవశ్యకత ఇనుమడించినది. ప్రణాళి ళి కాంతమునకు సీసము 43,000 టన్నులు, రాగి 1,00,000 టన్నులు దిగుమతి చేసికొనవలసి వచ్చు నని అంచనా వేయబడినది. మూడవ వివిధ క ర్మాగారములందు అత్యావశ్యక ముగ వినియో గింపబడు గంధకి కామ్లజనిదము (sulphuric acid) తయారునకు కావలసిన గంధకము ఈ దేశమందు దాదాపు శూన్యము. ఇదియంతయు విదేశములనుండి దిగుమతి చేసి కొనబడుచున్నది ఈమధ్య బీహారు రాష్ట్రములోని ఆజ్ మార్ (Ajmor) ప్రాంతములోని 'పై రైటు' (ఇనుము, గంధకము కలిసియున్న ఖనిజము) నుండి గంధక మును తీయుటకు నిశ్చయింపబడినది. మాత్రమే లభించును. చాల కొ

  • ఉక్కు మొ. కర్మాగారములందు అత్యావశ్యకమగు

పదార్థములు ఉష్ణనిరోధక పదార్థములు. ఇవి కెయెలిన్, సిలిమనైట్, బాక్సైట్, మేగ్నసైట్, క్రోమైట్, గ్రాఫైట్ లు. చివరి మూడును ముఖ్యముగ ఉక్కు కర్మా గారములందు ఉపయోగ పడును. పరిశ్రమలంది ఖనిజములు లోహములను కరగించు కుండీలుగను, ఉష్ణమును పరిమిత ముగ అందించుటకు వీలగు సాధనములుగను ఉపయోగింప బడుచున్నవి. భారతదేశమందు ఇవి సమృద్ధిగా నున్నను, ఉక్కుకర్మాగారము లొక్కసారిగ స్థాపింపబడుటవలన, అనేకకోట్లు వెచ్చించి పై లోహములు విదేశములనుండి దిగుమతి చేసికొనబడుచున్నవి. ఈ సంబంధ ఖనిజములందు ఈ దేశమునకు ఉక్కు ఉత్పత్తి 10 మిలియలు టన్నులు దాటినను ఏమాత్రమును కొరతఉండబోదు. ఇవి వివిధ ప్రాంతములందు వేర్వేరుగ, కొలది కొలది దొరకును. కాని మేగ్నెసైటు (1800° సెంటిగ్రేడు ఉష్ణమును నిరోధించగలది) సేలమిల్లాలోని కొండలలో (chalk hills) విస్తారముగ దొరకును.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో బంగారము ఎంత ఎక్కువ కలిగియున్న, ఆ దేశము అంత భాగ్యవంతము, శ క్తి మంతము అగును. కావున దీనికి స్వయంసమృద్ధి యను నది లేదు. ఎంత దొరకిన అంత మంచిది. కాని భారత దేశ మున ఇది మైసూరులోని కోలారు గనులనుండియు, బొంబాయిలోని 'హట్టి' గనుల నుండి మాత్రమే తీయబడు చున్నది. ఇంకను కొన్ని ప్రదేశములలో ఇది దొరకు చున్నను, వదలి దానిని తీయుటలాభదాయకము కాకుండు టచే, వేయబడినది. 1959-60 సం. లో భారత దేశమున ఈ లోహపు ఉత్పత్తి 47,72,597 గ్రాములు. దీని విలువ 511.36 లక్షల రూపాయలు. 66

ఇనుము : ఇది క్రీ. పూ. 4000 సం. క్రిందటనే కల్గొన బడినను, పరిశ్రమగా రూపొందినది క్రీ. పూ. 800 సం. నుండి మాత్రమే. అప్పటినుండియే ఇనుప యుగము ప్రారంభమైన దందురు ఈ ఖనిజము అన్నిటికంటె అత్యవ సరమైనది. దైనందిన వ్యవహారములో ప్రతిచోట మన కిది సాక్షాత్కరించును. దీని ఉత్పత్తియందు అమెరికాకు ప్రథమస్థానము కలదు. ప్రపంచఉత్పత్తిలో సగము ఇచ్చట నుండియే వచ్చుచున్నది. అమెరికాలో “ లేక్ సుపీరియర్” (Lake Superior) అను ప్రాంతమందలి గనులు ప్రపంచ మం దెల్ల అత్యుత్తమమైనవి. ఇచ్చట నుండి 24 వేల కోట్ల టన్నుల ఇనుము తీయబడినది. రష్యాదేశము సం. నకు దాదాపులి కోట్ల టన్నులు ఉత్పత్తి చేయుచున్నది (రెండవ ప్రపంచయుద్ధమునకు పూర్వము) ఇందు ఎక్కువ భాగము ఉక్రెయిన్ రాష్ట్రము నుండి ఉత్పత్తియగుచున్నది. జర్మనీ, ఫ్రాన్సు దేశముల నడుమ గల లారెయిన్ (Lorraine) ప్రాంతమందు ముఖ్యమైన ఇనుప గనులు గలవు. కాని ఈ ఖనిజము అంత నాణ్యమైనది కాదు. ఇందు లోహ భాగము 30 శాతము మాత్రమే. భారత దేశమందు ముఖ్య మైన ఇనుపగనులు దేశ వ్యాప్తముగా గలవు. ఇందులోహ 30 అత్యధిక ములు. మైళ్ళ భాగము 70 శాతము గలవి పొడవుక లిగి, 1000 అడుగుల లోతువరకు ఉండి, అంత టను లోహ భాగము 60 శాతము కలిగియుండిన ఇనుప గని సింగ్ భూమ్ ప్రాంతమందు (కలకత్తాకు పశ్చిమముగా 150 మైళ్లు) కలదు. ఇచ్చటి ఖనిజము అమెరికాయందలి 'లేక్ సుపీరియర్ ' ప్రాంతపు ఖనిజమును పోలియుండును. సింగ్ భూమ్ గని ప్రపంచమునకెల్ల పెద్దదని రూఢిగా చెప్పనగును. 60 లోహ శాతముగల ఖనిజము అచ్చట కనీసము 3000 మిలియను టన్నులుండునని అంచనా. చాందాజిల్లా యందుగల పది ప్రదేశములలోను, దుర్గ్ జిల్లాయందు చిన్న కొండలుగాను ఈ ఖనిజము దొరకు చున్నది. మైసూరు రాష్ట్ర మందలి 'బాబా బుడన్' కొండల నుండి అధిక లోహ శాతముగల ఖనిజము విస్తారముగ లభించుచున్నది. ఇవి కాక, అనేక చోట్ల చిన్న చిన్న రాళ్లుగా మట్టిలో ఇమిడియున్న ఖనిజముగూడ తీయబడుచున్నది. ఉదా. ఆంధ్రప్రదేశ్ లోని జగ్గయ్యపేట ప్రాంతము.

చైనా దేశమందును చెప్పదగు ఖనిజసంపద కలదు. ఇది 'యాంగ్జి' లోయయందు గలదు. లోహభాగము 56 శాతము. ఇది మంచూరియాయం దెక్కువగా విస్త రించి యున్నది. ఆ దేశ

బొగ్గు : ప్రపంచమునందు ఇది లక్షల సంవత్సరముల వరకు చాలినంత కలదు. దీని ప్రపంచ ఉత్పత్తిలో 22 శాతము ఇనుము ఉక్కు తయారీయందును, 29 శాతము ఆవిరి తయారీయందును, 23 శాతము రైళ్ళు నడపుట కును, 17 శాతము గృహోపయోగమందును, 6 శాతము విద్యుచ్ఛక్తి ఉత్పత్తి యందును వినియోగ పడుచున్నది. బొగ్గు అమెరికాయందు విస్తారముగా కలదు . మందలి 33 రాష్ట్రములు బొగ్గును ఉత్పత్తి చేయుచున్నవి. ఆమెరికా సం. నకు 65 కోట్లటన్నుల బొగ్గును ఉత్పత్తి చేయుచున్నది. కెనడా దేశమున నోవస్కోషియా ప్రాంత మునను, పసిఫిక్ సముద్రతీర ప్రాంతమునను బొగ్గు విస్తారముగ దొరకును. ఆ దేశ మున 1234 బిలియను టన్నుల బొగ్గు దొరకగలదని చ వేయబడినది. బ్రిటిష్ దీవులలో (ఇంగ్లండు, స్కాట్లండు, వేల్సు రాష్ట్రములు) ఈ ఖనిజము సమృద్ధిగా దొరకును. ఆ దేశ మున కొన్ని ప్రదేశములలో 3000 అడుగులలోతునుండి కూడ బొగ్గు తీయబడుచున్నది. ఈ దేశపు బొగ్గుసంపద దాదాపు 200 బిలియను టన్నులని అంచనా కలదు. రష్యాదేశమందు మొత్తము 185 ప్రదేశములలో బొగ్గు ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)
దొరకును. ఇందు మాస్కో బేసిన్, సైబీరియా, కాకసస్ ప్రాంతములు పేర్కొనదగినవి. ఆ దేశపు సంపద 233 బిలియనుల టన్నులని అంచనా. జర్మనీ దేశమున మేలురకమైనబొగ్గు లభ్యమగును. 'రూర్' (Ruhr) ప్రాంతములోవిస్తారముగా బొగ్గు తీయబడుచున్నది. ఆ దేశపు బొగ్గుసంపద మొత్తము 477 బిలియనులు టన్నులు. చైనా దేశమందుగూడ బొగ్గు విస్తారముగ దొరకును. ఒక్కొకచోట 50 అడుగులమందము గల అచ్చులు (blocks)గూడ గలవు. మంచూరియా ప్రాంతమున చాల మేలురకపు బొగ్గు లభ్యమగును. భారత దేశమందు అనేకప్రాంతములలో బొగ్గు దొరకును. అందు రాణిగంజ్,ఝరియా, బొకారో, గిరిధి, పెన్స్ లోయ, సష్టి (Sasti),సింగ రేణి ప్రాంతములు ముఖ్యములైనవి. మనదేశమునసంవత్సరమునకు 380 లక్షల టన్నుల బొగ్గు ఉత్ప త్తియగుచున్నది. మొత్తము 79 బిలియను టన్నుల బొగ్గు ఈదేశమున కలదని అంచనా.
నూనె : ప్రపంచములో కెల్ల అత్యధికముగా నూనె కలిగియున్నది మధ్యధరా సముద్ర ప్రాంతము (ఇరాన్,ఇరాక్, కువైట్, అరేబియా). ఇచ్చట బావులందు నూనెఊట సమృద్ధిగా గలదు. ఇచ్చటనున్న నూనెబావులు225 మాత్రమే అయినను, అవి సగటున రోజుకు 5000పీపాల నూనె నిచ్చుచున్నవి. కాని అమెరికాయందు28.000 నూ నెబావు లున్నను, వాటినుండి సగటున రోజుకు 13 పీపాల నూనెకంటె ఎక్కువ తీయుటకు సాధ్యపడుట లేదు.ఇరాన్ దేశ మున 1000-9000అడుగులలోతునుండియు. అరేబియాలో1900-2500అ.లోతునుండియు,కువైట్లో3670-4750 అ.లోతునుండియునూనెతీయబడుచున్నది. ఈ ప్రాంతమందు మొత్తము సుమారు 155 బిలియనుల పీపాలనూనె కలదని అంచనా వేయబడినది. రష్యా దేశమందు 2500 సం.ల క్రితమే నూనెకల్గొనబడినది.ఆదేశమందునూనెగలప్రాంతములుముఖ్యముగా అయిదు. అందు బాకు, యూరల్-వోల్గాప్రాంతములు ముఖ్యతరమైనవి.ప్రస్తుతము నూనె2500అ.నుండితీయబడుచున్నది; ఆ దేశపు మొత్తము నూనెసంపద 150బిలియనుల పీపాలుండునని అంచనా వేయబడినది. 194 సంగ్రహ ఆంధ్ర
అమెరికాలో మొత్తము 22 రాష్ట్రములలో నూనె దొరకును. ఇందు మధ్య అమెరికా ప్రాంతము (ఓక హామా, కాన్సాస్, టెక్సాస్, న్యూమెక్సికో, ఆర్క న్సాస్, లూసియానా రాష్ట్రములు) నుండితీయబడునంతటినూనెప్రపంచమందలిమరేఒక్క ప్రాంతము నుండి తీయబడుట లేదు. తరువాత కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ రాష్ట్రములు ముఖ్యములు. ప్రపంచమందుతీయబడు నూనెలో 611 శాతము ఈ దేశమునుండియేవచ్చుచున్నది. ఇచ్చట మొత్తము 110 మిలియను పీపాలనూనె కలదని అంచనా. తరువాత వెనిజులా, కొలంబియా, ట్రినిడాడ్ ప్రాంతములు ప్రసిద్ధము లై నవి.ఇచ్చట మొత్తము 80 బిలియనులు పీపాల నూ నెగలదు.కెనడా దేశమందు 8 ప్రాంతములలోను,మెక్సికోయందు4th ప్రాంతములలోను నూనె తీయబడుచున్నది. బర్మాదేశమందు ఆరకాన్, యోమా పర్వతశ్రేణికి ఇరువైపులునూనె దొరకు ప్రాంతము. భారతదేశమున నూనెదొరకుముఖ్యప్రదేశములు అస్సాము, పంజాబు రాష్ట్రములు.బొంబాయి రాష్ట్రమందును, కావేరీనదీ ప్రాంతమున,ఇతర ప్రదేశములందు నూనెను కల్గొనుటకు విశేషప్రయత్నములు జరుపబడుచున్నవి. ప్రస్తుతము నూనెకనుగొనబడినప్రాంతములలోదిగ్బాయి, నహర్కాతియా, జ్వాలాముఖి ప్రదేశములు ముఖ్యము లై నవి.
రాగి : ఆధునిక పరిశ్రమలకిది ముఖ్యావసరము. విద్యుచ్ఛక్తి విస్తరణము, టెలిఫోను, రేడియో, యుద్ధ సామగ్రి మొదలగు వాటికిది అత్యవసరము. ప్రపంచ మందలి అన్ని ప్రాంతములనుండి 2.8 మిలియను టన్నులరాగి ఖనిజము తీయబడుచున్నది. ఈ లోహమును 16రకముల ఖనిజములనుండి తీయవచ్చును. ఇది నూటికి80 పాళ్లు ఆమెరికా, చిలీ, పెరూ ప్రాంతములు, కెనడా,దక్షిణాఫ్రికా దేశములందును దొరుకుచున్నది. అమెరికెల్ల ఎక్కువగా రాగి ఖనిజము దొరకు చోటు ఆరిజోనా ప్రాంతము. తర్వాత అప్లాషియన్, లేక్ సుపీ రియర్ మొదలుగా గల ప్రాంతములు ఎన్నదగినవి. ప్రపంచ రాగి సంపదలో 20 శాతము అమెరికా యందు గలదు, కెనడా దేశమందుహడ్సన్బే,సడ్బరీ(sudbury) నోరాండా యందలి రాగి గనులు చాల ముఖ్యము లైనవి. లో ఈ దేశమందు ప్రపంచ సంపదలో 5 శాతము మాత్రమే కలదు. దక్షిణఅ మెరికాలో ఎండెస్ పర్వతశ్రేణి యందు (చిలీ దేశము నుండి పెరూ దేశము వరకు గల ప్రాంతము) ప్రపంచ సంపదలో 40 శాతము పైగా రాగి ఖనిజము భూగర్భిత మైయున్నది. ప్రపంచమొ త్తపు అవసరములలో 20శాతము పై గా ఈప్రదేశము నుండి తీయబడుచున్నది. ఆఫ్రికా ఖండములో రొడీసియా దేశమందు ఈ ఖనిజము విస్తారముగా (ప్రపంచ సంపదలో 30 వ శాతము) దొరకును. రష్యాదేశ మందు 7 శాతమును, మెక్సికో యందు 3 శాతమును కలదు. తక్కిన దేశములలో ఈ ఖనిజము చెప్పదగినంతగా లభించదు.

సీసము (Lead); తుత్తునాగము (Zinc): ఈ రెండు లోహములకును రాసాయనికముగ ఎట్టి సంబంధము లేదు. అయినను ఇవి సర్వ సాధారణముగ ఒకే స్థలమునందు దొరకును. వేర్వేరుగా దొరకుట చాల అరుదు. సీసము చాల పురాతన కాలమునుండి మానవోపయోగమం దున్నది. చైనా దేశీయులు దీనిని క్రీ.పూ. 2000 సం.నం దే నాణెములు తయారుచేయుట కుపయోగించిరి. ప్రపం చము మొ త్తములో ఈ ఖనిజములు ఒక్కొక్కటి సంకు 1.6 నుండి 2 మిలియను టన్నుల వరకు తీయబడుచున్నవి. కాని సీసము కనుకొనబడిన తరువాత 1500 సం.కు కాని తుత్తునాగము కనుగొనబడ లేదు. ఇది పెక్కు దేశము లందున్నను, సమృద్ధిగా దొరకు దేశములు కొలది మాత్రమే. అందు అందు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, బెల్జియం, మెక్సికో దేశములు ముఖ్యములు. ప్రపంచములోని 27 శాతము సీసము, 47 శాతము తుత్తు నాగము అమెరికా నుండి వచ్చుచున్నది. ఈ దేశములోని మిస్సోరి, ఓక్లహామ, కాన్సాస్ రాష్ట్రములలోని మిస్సి స్సిపి నదీలోయ ప్రాంతము ఈ లోహములకు ప్రశస్త ప్రశస్త మైనది ; మెక్సికో దేశ మధ్యప్రాంత మందును ఇవి విస్తార ముగ దొరకును. మొ త్తము ప్రపంచ సంపదలో సగము పైగా ఉత్తర అమెరికా ఖండమందే గలవు.

దక్షిణ అమెరికా ఖండములోని పెరూ, అర్జెంటినా, బొలివియా దేశములలోను, యూరపు ఖండములోని (ప్రపంచ సంపదలో 15 వ శాతము) స్పెయిన్, రుమే నియా, టర్కీ, జర్మనీ, పోలెండ్ మొదలగు దేశములలో

ఈ ఖనిజము కొంతవరకు లభ్యమగును. ఆస్ట్రేలియా ఖండ మున ఈఖనిజములు విస్తారముగా దొరకును. ముఖ్యముగా సీసము ఇక్కడ ప్రపంచ సంపదలో 18వ శాతము కలదు. రష్యాదేశమందలి యూరల్ పర్వత ప్రాంతమున ఈ ఖనిజ ములు ప్రపంచ సంపదలో సగటున 74 శాతము దొరకును. తరువాత ఈ ఖనిజములకు పేర్కొనదగినవి బర్మాదేశము లోని బాడ్విన్ గనులు. ఇచ్చట మొత్తము 4 మిలియను టన్నుల ఖనిజము దొరకు గని కలదని అంచనా. అందులో సీసము 25 శాతము ; తుత్తునాగము 15 శాతము ; రాగి 0.7 శాతము ; వెండి 20 శాతము గలవు.

కాకి బంగారము (Tin) : ఇది ఇత్తడి, కంచు మొద లగు పరిశ్రమ లోహములను తయారుచేయుటకు, దీని ఉనికి తెలిసియో, తెలియకో, క్రీ. పూ. 8700 సం. నుండి ఈజిప్టు దేశములో ఉపయోగింపబడుచున్నది. ప్రపంచ ములో మొ త్తముమీద ఇది సంవత్సరమునకు 14 నుండి 24 లక్షల టన్నులవరకు ఉత్పత్తి యగుచున్నది. ఇందులో 40 శాతము అమెరికా దేశమందే వినియుక్తమగుచున్నది. బ్రిటన్ 18 శాతము, రష్యా 12 శాతము ఉపయోగించు చున్నవి. మలే రాష్ట్రములు దీని ఉత్పత్తియందు అగ్ర స్థానము వహించి యున్నవి (80 శాతము). ఇందు ఎక్కువ భాగము కిన్ (Kinta) లోయ ప్రాంతమునందు దొర కును. ఇచ్చట ఈ లోహము పెద్ద రాళ్ళలో భాగముగా గాక, వాటినుండి తయారైన మట్టియందు కేంద్రీకరింప బడి యున్నది. ఈ రాష్ట్రములకు దక్షిణమునగల నెద గ్లాండ్సునందు ఈ ఖనిజము ఇదే విధముగా దొరకును. (ప్రపంచ సంపదలో 24 శాతము). తర్వాత ఈ ఖనిజము నకు బొలీవియా దేశము ప్రసిద్ధమైనది. అచ్చట మొత్తము 10 కేంద్రములలో ఇది విస్తారముగ దొరుకును. అందు నల్లాల్ల గువ-ఉన్సియ గ్రూపునందు 60 శాతము లభిం చును. ఆ దేశమున ప్రపంచ సంపదలో 23 శాతము దొరకుచున్నది. చైనా దేశమున యూనన్ ప్రాంతములో ఈ ఖనిజము 3000 అ. లోతునుండి తీయబడు చున్నది. తర్వాత ఈ ఖనిజమునకు నై గీరియా, బెల్జియన్ కాంగో, సయాములు చెప్పుకొనదగినవి. ఇంగ్లండులోని కార్న్ వాల్ లో క్రీ. పూ. 500 సం. వరకు 33 లక్షల టన్నులు తీయబడినది. కాని ఇప్పుడచట ఏమియు దొరకుటలేదు. అల్యూమినియం (Alluminium): భూమండలమందీ ఖనిజము చాల విస్తారముగా నున్నను, దాని అవసరము ఎంతో ఆలస్యముగ కనుగొనబడినది. ముఖ్యముగా ఇదిచాల తేలికగా నుండియు, మంచి దార్డ్యము (strong & flexible) గలది యగుటచే, ఇది విమానముల తయారీ మున్నగు వాటిలో ఎక్కువగా వినియోగపడుచున్నది. విద్యుచ్ఛక్తి పరిశ్రమయందు ఇది రాగికి పోటీగా ఉపయోగింపబడుచున్నది. ఇది మొత్తము 30 పరిశ్రమలలో 4000 విధముల ఉపకారియగుచున్నది. ఈ లోహము బాక్సైటు అను ఖనిజమునుండి తీయబడును. ఈ లోహమును వేరుచేయుటకు విద్యుచ్ఛక్తి అత్యధికముగా అవసరమగుటచే, ఈ ఖనిజము దొరకు ప్రాంతమునకాక, విద్యుచ్ఛక్తి చవుకగా లభ్యమగుచోట ఈ పరిశ్రమ నెలకొల్పబడుచున్నది. ప్రపంచము మొత్తమున సాలుకు 10 లక్షల టన్నుల లోహము వినియుక్తమగుచున్నది. అమెరికాలో ఆర్కన్సాస్ ప్రాంతము ఈ ఖనిజమునకు ప్రసిద్ధమైనది. అచ్చట 80 అడుగుల లోతున 35 అ. మేర ఈ ఖనిజము దొరకును. దీనికి గట్టిదనము (hard) లేకుండుటచే త్రవ్వి వెలికితీయుట చాలసులభము. ఇచ్చట సాలుకు 4 లక్షల టన్నుల ఖనిజము ఉత్పత్తియగుచున్నది. తర్వాత దక్షిణ అమెరికాలోని గయానాదేశమున ఈ ఖనిజము 60 అ. లోతున 40 అ. మేర దొరకును. యూరపు ఖండమందు మధ్యధరా ప్రాంతము ఈ ఖనిజమునకు ప్రసిద్ధి. అందులో ఫ్రాన్సు దేశమున కెక్కువ ప్రాధాన్యముగలదు. ఇచ్చట మొత్తము 16 మిలియను టన్నుల ఖనిజము కలదని అంచనా వేయబడినది. జర్మనీ, స్పెయిన్, ఐర్లాండు దేశములందును, ఆసియా (భారతదేశము, సెలెబిస్), ఆఫ్రికా (గోల్డ్ కోస్టు) ఖండములం దీ ఖనిజము స్వల్పముగా దొరకును. కాని రష్యాదేశమున సైబీరియా, యూరల్ పర్వతములం దిది విస్తారముగ లభించుచున్నది. భారతదేశమున ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రమున (బాలిఘాట్, కట్ని ప్రాంతములలో) ఎక్కువగను, ఒరిస్సా, బీహార్ మొదలగు రాష్ట్రములలో స్వల్పముగను లభ్యమగును.

మాంగనీస్: ఈ లోహము ఉక్కు ఉత్పత్తికి ముఖ్యావసరము - ఒకటన్ను ఉక్కు తయారుచేయుటకు 13 పౌనుల మాంగనీసు కావలెను. ఇత్తడిచేయుటకును, రంగులు, ఎరువులు తయారుచేయుటకును, గాజు పరిశ్రమయందును ఈ లోహము ఉపయోగింపబడు చున్నది. ఈ లోహము కలిగియుండు ఖనిజములకు రష్యాదేశమునకే అగ్రస్థానము కలదు. ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు సగము ఈ దేశమందే తీయబడుచున్నది. సంవత్సరమునకు 2 లేక 3 మిలియను టన్నులు ఈ దేశమున ఉత్పత్తియగుచున్నది. ఇందు 93 శాతము జార్జియా, ఉక్రెయిన్ రాష్ట్రముల నుండి వచ్చుచున్నది. రష్యాయందు మొత్తము 560 మిలియను టన్నుల సంపద కలదని అంచనా. భారతదేశమున మధ్యప్రదేశ్ లో ఈ ఖనిజము విస్తారముగ దొరకును. మద్రాసు, ఆంధ్రప్రదేశ్, బీహారు, మైసూరు, బొంబాయి రాష్ట్రములందు కూడ ఈ ఖనిజము తీయబడుచున్నది. మధ్యప్రదేశ్ లోని బాల్ ఘాట్, చింద్వారా, భండార, నాగపూరు ప్రాంతములు ఈ ఖనిజమునకు అత్యుత్తమములు. ఇచ్చట కొన్ని ప్రదేశములలో 1500 అ. వెడల్పు, 1/2 మైలు పొడవుగల గనికూడ కన్గొన బడినది. విశాఖపట్టణము జిల్లాయందలి సాందూరు, లోండా ప్రాంతములు ఈ ఖనిజమునకు సమాన ప్రాతినిధ్యము కల్గియున్నవి. విశాఖపట్టణమందలి గరివిడి గనులలోని కోడూరు గని చాల పురాతనమైనది. ఇచ్చట 1891 నుండి పని జరుగుచున్నది. ఈ ఖనిజములను ఇంత సమృద్ధిగా కల్గియుండుటలో భారతదేశమునకు ప్రత్యామ్నాయముగ నిలువగల్గినవి రష్యా, గోల్డ్ కోస్టు దేశములు మాత్రమే.

ఆఫ్రికా ఖండమందలి గోల్డ్ కోస్టు దేశమున ఈ ఖనిజము భూమ్యుపరితలమున 2 1/2 మైళ్ల మేర విస్తరించి యున్నది. ఇచ్చటి 'న్యూట' గని ప్రపంచమందలి మాంగనీసు గనులలోకెల్ల పెద్దది. ఇచ్చటి ఖనిజములో లోహశాతము గూడ హెచ్చుగనే యున్నది (50-53%). ఇచ్చట కనుచూపుమేరలో మొత్తము 10 మిలియను టన్నులకు పైగా ఈ ఖనిజము తీయబడుచున్నది. బ్రేజిల్ దేశమందు 6 మిలియను టన్నుల ఖనిజము కలదని కనుగొనబడినది. ఈజిప్టుదేశమందు సూయజ్ నకు 7 మైళ్లు దక్షిణముగా గల ప్రాంతమునుండి సాలుకు 2 లక్షల టన్నులు ఉత్పత్తి జరుగుచున్నది. అమెరికా, క్యూబా దేశములం దీ ఖనిజము కొలదిగ లభించును. కాని రష్యా, భారతదేశము,

గోల్డ్ కోస్టు మినహా మిగిలిన దేశములలో దొరకు ఖనిజము

అంత మేలురక మైనది కాదు.

నికెల్ : ఈలోహము సంయు క్తలోహముల (ఇత్తడి, కంచు, ఉక్కు మొ.) తయారీయం దెక్కువగా వినియో గింపబడుచున్నది. ప్రపంచ సంపదలో చాల భాగము సడ్బరీ, ఓన్ టారి యో ప్రాంతములందే విస్తరించియున్నది. ఇచ్చట 240 మిలియనుటన్నుల ఖనిజము కలదని అంచనా. సాలుకు 180,000 టన్నుల నికెల్ ఇచ్చట ఉత్పత్తి యగు చున్నది. ఈ లోహము న్యూకేలెడోనియా, ఫిన్ లెండు, రష్యా దేశములందు స్వల్పముగా దొరకును. భారత దేశమున ఈ ఖనిజము దాదాపు లేదనియే చెప్పవచ్చును. (తిరువాన్కూరు, కోలారు ప్రాంతములలో అతి స్వల్ప ముగ దొరకునని కనొనబడినది.)

క్రోమియం : ఇది గూడ మిశ్రమలోహము తయారీ యందే ఎక్కువగా వినియోగింపబడుచున్నది స్టెయిన్ లెస్ స్టీల్ యందు క్రోమియం 18 శాతము, నికెల్ 8 శాతము ఉండుటచే, దానికి ఉత్తమ లక్షణము లేర్పడినవి. ఇది సాలుకు దాదాపు 2 మిలియను టన్నుల వరకు ఉత్పత్తి యగుచున్నది. ఉత్పత్తి అయ్యెడి ముఖ్య దేశములు : రష్యా, రొడీషియా, దక్షిణాఫ్రికా, టర్కీ. భారత దేశ మున ఈ ఖనిజమునకు మైసూరులోని అర్సిక రై, బీహారు లోని సింగ్ భూమ్ ప్రాంతములు ప్రధానములు. క్యూబా, ఫిలిప్పైన్స్, ఇండియా, గ్రీసు, జపాను, న్యూ కెలెడో నియా,రొడీసియా, దక్షిణాఫ్రికా దేశములు ఒక్కొక్కటి సాలుకు 11 - 37 లక్షల టన్నులు ఉత్పత్తిచేయుచున్నవి. రష్యాదేశమందలి ఖనిజము చాల ఉత్తమమైనది ; లోహ శాతము అధికము (40-56%). ఇచ్చట 18 మిలియను టన్నుల సంపద కలదని అంచనా. అమెరికాయం దీ ఖనిజము దాదాపు లేదనియే చెప్పవచ్చును.

రాతినార (Asbestos) : ఖనిజము లన్నిటిలోను దీని కొక విశిష్టత గలదు. ఇది సన్నని, మెత్తని, చిన్న చిన్న దారములుగా దొరకును. దీనిని గుడ్డలుగా నేయవచ్చును. ఇవి రెండు రకములు : (1) దారముగా వడుకుటకు వీలైనవి ; (2) అందుకు వీలు కానివి. నిప్పులో వేసినను, ద్రావకములో వేసినను దీనికి చలనములేదు. ఇది బ్రేక్ లైనింగ్స్ (break linings) ఉష్ణ నిరోధకావసరము లకు ఎక్కువగా వినియోగింపబడుచున్నది. ప్రపంచము మొత్తమున సాలుకు 5 లేక 6 లక్షల టన్నుల దారము ఉత్పత్తియగుచున్నది అందులో 60 శాతము కెనడా దేశ మందలి క్విబెక్ ప్రాంతము నుండి వచ్చుచున్నది. ఇచ్చటి నార చాల మెత్తగా నుండి 5 అం. వరకు పొడవు గలిగి యుండును. రష్యా దేశమందుగూడ ఈఖనిజము సమృద్ధిగా దొరకును. అచ్చట మొ త్తము 20 గనులనుండి ఈ ఖనిజము తీయబడుచున్నది. దక్షిణ రొడీషియాదేశమందలి నారలో 30 శాతము దారము వడుకుటకు వీలైనది. ఇచ్చట మొత్తము 7 మిలియను టన్నుల సంపద గలదని అంచనా. దక్షిణాఫ్రికాయందలి నార దాదాపు 11 అం. పొడవుగల్గి యుండుట అచ్చటి విశిష్టత. అచ్చటి నార మొ త్తము పొడవు సగటున 6 అం. ఈ సంపద అధిక ముగా కలదని అంచనా. భారత దేశమున ఈ ఖనిజము బీహారు, ఒరిస్సా, బొంబాయి, మైసూరు రాష్ట్రములందును, ఆంధ్రప్రదేశ్ లో కడపజిల్లా యందును స్వల్పముగ దొర . వరకు కును. కాని ఈ దేశమందు దొరకు నార రెండవ తరగతికి చెందినది. అమెరికా, సైప్రస్, జపాన్, ఇటలీ, కొరియా, చెక స్లో వేకియా, ఫిన్లాండు దేశములందు కూడ ఈ ఖనిజము స్వల్పముగా దొరకును.

గ్రాఫైట్ : రాసాయనికముగా ఈ ఖనిజము ఒక్క బొగ్గును మాత్రమే కలిగియుండును. ఇది కృత్రిమముగ కూడ తయారగుచున్నది. ఇది ఏ ద్రావక మునందు కూడ కరగకుండుట, 3000° సెంటిగ్రేడు ఉష్ణోగ్రతవరకు ఘన పదార్థముగ నే ఉండుట దీని విశిష్టలక్షణము. లోహములు కరగించుటకు వీలగు పాత్రలను తయారు చేయుటకును, పెన్సిళ్ళు, రంగులు, లూబ్రికెంట్సు తయారీయందును ఈ ఖనిజము వినియోగింప బడుచున్నది. ప్రపంచము మొత్తముమీద ఈ ఖనిజము సాలుకు 1 నుండి 3 లక్షల టన్నులవరకు ఉత్పత్తి యగుచున్నది. ఈఖనిజము దొరకు దేశములలో రష్యా, బ వేరియా, ఆస్ట్రియా, సిలోన్, మెడ గాస్కర్, మెక్సికో దేశములు ప్రధానములు. రష్యా దేశమందలి సై బీరియా ప్రాంతమున ప్రపంచములో కెల్ల ప్రధానమగు గనులు కలవు. ఇచ్చట పెన్సిళ్లు తయారు చేయుటకు వీలుగా గ్రాఫైటు ముద్దలు ముద్దలుగా దొర కును. బవేరియా, ఆస్ట్రియా, చెకొస్లోవేకియా దేశములు ఈ ఖనిజమునకు ప్రధానములు. సిలోన్ దేశమందలి ఖని జము చాల నాణ్యమైనది. ఇచ్చట ఈ ఖనిజము 9 అం. వెడల్పున రేకులుగను, తీగలుగను దొరకును. ఇది 1600 అం. లోతువరకు త్రవ్వి తీయబడుచున్నది. ఇటలీ, అమె రికా, చెకొస్లోవేకియా, నార్వే దేశములందు ఈ ఖనిజము స్వల్పముగా దొరకును. భారతదేశమందు తిరువానూరు నందలి గ్రాఫైటు సిలోను ఖనిజమును పోలియున్నది. అచ్చట ఇది చాల తక్కువగ దొరకుటచే ఎక్కువ లోతుల నుండి తీయుట ఏమియు లాభకరముగా లేదు. ఒరిస్సా, బీహారు రాష్ట్రములందలి భోండలైట్స్ అను రాళ్ళలో ఈ ఖనిజము అన్ని చోట్ల కన్పించును. కాని వీటియందీ ఖనిజము విస్తృతముగ కేంద్రీకరింపబడి యుండక పోవు టచే ఇవి అంతగా ప్రాముఖ్యత నొందలేదు.

అభ్రకము : ఈ ఖనిజము అతి సన్ననిపొరలుగా (1000 అం. వరకు) విడదీయుటకు వీలై యుండును. ఇది విద్యు చ్ఛక్తి నిరోధ కారియగుటచే, వివిధములైన విద్యుచ్ఛక్తి పరిశ్రమలకు (రాడారు. రేడియో మొ.) అత్యావశ్యక మైనది. ఇది ఎంత ఎక్కువ వెడల్పుగా దొరకిన అంత శ్రేష్ఠము. 1 చ. అం. మొదలు 70 చ. అం. వరకును విస్తీర్ణము గల అభ్రకపుపలకలు ప్రపంచ వ్యాపారమందు చెలామణిలో నున్నవి. ప్రపంచము మొత్తమున ఈ ఖని జము సం. నకు 50 నుండి 65 వేల టన్నులవరకు వినియో గింపబడుచున్నది. ప్రపంచములో ఈ ఖనిజసంపదకు భారతదేశము అగ్రస్థానము. బీహారు రాష్ట్రములోని మాన్ ఘీర్, హజారిబాగ్, గయ జిల్లాలును, ఆంధ్ర ప్రదేశ్ లో నెల్లూరుజిల్లా ఈ ఖనిజోత్పత్తియందు అత్యు త్తమమైనవి. బీహారురాష్ట్రమందు ఇది లభించు ప్రాంతము 70 మై. పొడవు, 12 మైళ్ళ వెడల్పు కలిగియున్నది. నెల్లూరుజిల్లాలోని వెలిగొండ కొండలు మొదలు సముద్ర తీరమువరకును గల గూడూరు, రాపూరు, ఆత్మకూరు, కావలి ప్రాంతములలో ఇది విస్తారముగ లభించును. అందులో గూడూరు ప్రాంతపు గనులు (ముఖ్యముగా 'షా' గని) ప్రపంచఖ్యాతిగలవి. ఇంకను ఈ దేశ మున మద్రాసు రాష్ట్రములోని సేలంజిల్లా యందును, తిరువా నూరు, మలబారు, అజ్మీర్-మేవార్ ప్రాంతములందును ఈ ఖనిజము స్వల్పముగ లభించును. తరువాత ఈ ఖనిజ సంపదకు పేర్కొనదగు దేశములు: రష్యా, కెనడా, బ్రెజిల్, అమెరికా, దక్షిణాఫ్రికా, కొరియా, సిలోన్ మున్నగు దేశములలో గూడ ఈ ఖనిజము స్వల్పముగ దొరకును.

వజ్రములు : ఆభరణములకును, వివిధ అలంకరణ ములకును ఉపకరించు ఖనిజములకు 'జెమ్ స్టోన్స్ ' లేక 'ప్రెషస్ స్టోన్స్' అందురు. వీటి నాణ్యము, ముఖ్యముగా ఆకర్షణీయత, నైర్మల్యము, మన్నిక, అరుదుగ లభించుట అనునాల్గులక్షణముల పై ఆధారపడియుండును. ఇవి వివిధ వర్ణములు కలిగి, వేర్వేరు రాసాయనిక పదార్థసం యోగ ములతో కూడియుండును. 9000 సం. ల క్రిత మే 15 రక ముల రాళ్లు గుర్తింపబడియున్నవి. ప్రస్తుతము దాదాపు 100 రకముల రాళ్లు వాడుకలో నున్నవి. పైన పేర్కొనిన నాల్గు లక్షణములు కలిగియున్న వానిని వివిధ నిర్ణీత కోణములలో కోసినయెడల వాటి అందము విశిష్టముగ రాణించును. ఈ సంబంధమైన విలువగల రాళ్ళలో కెల్ల వజ్రములు అత్యుత్తమమైనవి. ఇవి అందముగను, ఆకర్ష ణీయముగను ఉండుట యేగాక, ప్రపంచములోని పదార్థ ములలో కెల్ల దార్థ్యము గల్గినది. వజ్రమును వజ్రముతప్ప మరే ఇతర పదార్థమును కోయలేదు. కాని వజ్రము ప్రపంచములోని అన్ని పదార్థములను కోయగల్గి యుండును. ఇదియే దీని విశిష్టత, అత్యుత్తమ భౌతిక లక్షణము. ఇది వివిధ ప్రకాశవంతమగు కాంతులను, దాని వివిధముఖములనుండి వెదజిమ్ము చుండును. ఇందు వల్లను, అది చాల అరుదుగను, కొలదిగను దొరకుట వల్లను, అది అత్యధిక విలువ కలిగి యున్నది. ఇది ప్రపం చము మొత్తమున సంవత్సరమునకు 10 లేక 15 మిలి యను వన్నెలు (carats) లేక 24 టన్నులు ఉత్పత్తి యగుచున్నది. దీని మొత్తమువిలువ దాదాపు 20 నుండి 40 కోట్ల రూపాయల వరకు ఉండును. దీని ఉత్పత్తికి బెల్జియన్ కాంగో చాల ముఖ్యమైనది. అచ్చట 'కసాయ్' నదీలోయలో (Kasai River Basin) దాదాపు 15,000 చ. మైళ్ళ మేర ఈ ఖనిజము వ్యాపించి యున్నది. ప్రపంచోత్పత్తిలో ఇచ్చట 65 శాతము లభించుచున్నది. ఆ నదీ ప్రాంతమందును, దాని ఉపశాఖల ప్రాంతమందును ఇసుక పర్రలలో ఇది ఎక్కువగా దొర కును. ఈ వజ్రములు ఎక్కడనుండి ఆ ప్రాంతమునకు కొట్టుకొని వచ్చినదియు ఇంతవరకు కనుగొనబడ లేదు. దక్షిణాఫ్రికా దేశమున 1867 నుండి వజ్రములు తీయ బడుచున్నవి. ఇచ్చట భూమిలోని వందలకొలది గొట్టముల నుండి గనులుగాత్రవ్వి తీయబడుచుండుట గమనార్హము. అందులో కింబర్లీ ప్రాంతమునందలి గనులు ప్రశస్త ములు. ఆ దేశపు ఉత్పత్తి ప్రపంచపు ఉత్పత్తిలో 12 శాతము. గోల్డ్ కోస్టు దేశమునుండి 3-34 లక్షల వన్నెల వజ్రములు ఉత్పత్తియగు చున్నవి. అచ్చట బిర్రిమన్నదీ ప్రాంతము వీటి మనుగడకు ముఖ్యమైనది. తరువాత వీటి ఉత్పత్తికి పేర్కొనదగిన దేశములు : టాంగనీకా, బ్రెజిల్, బ్రిటిష్ గయానా, రష్యా, బోర్నియో, వెనీజులా, దక్షిణరొడీషియా, అమెరికా దేశములలో కూడ ఇవి స్వల్పముగా దొరకును, భారతదేశము 18 వ శతా బ్దము వరకును వజ్రములకు పుట్టినిల్లుగా భావింపబడెడిది. ప్రప్రథమమున వజ్రములు ఉత్పత్తి అయినది భారత దేశముననే. ఆ రోజులలో ఈ దేశమున సం. నకు ఎన్నో లక్షల వన్నెల వజ్రములు ఉత్పత్తి అయ్యెడివి. కాని ఇప్పుడు 2 వేల వన్నెలు మాత్రము ఉత్పత్తి యగు చున్నవి. కోహినూరు మొదలగు పెద్ద పెద్ద ప్రపంచఖ్యాతి గాంచిన వజ్రములకు ఈ దేశము పుట్టినిల్లు - దక్షిణదేశ మందలి అనంతపురం, బళ్ళారి, కర్నూలు, కృష్ణా, గోదా వరి జిల్లాలును, ఉత్తర దేశమందలి పన్నా ప్రాంతము, మహానందిలోయ, సంబల్ పూరు, చాందా జిల్లాలయందు వీటి ఉత్పత్తి అధికముగా జరుగుచుండెడిదని 17 వ శతా బ్దిలో వ్రాయబడిన గ్రంథములనుండి తెలియుచున్నది. కానీ ప్రస్తుతపు ఉత్ప త్తిలో చాలభాగము పన్నా ప్రాంతపు గనులనుండియే వచ్చుచున్నది. బంగారము : ఈ లోహము ప్రాచీన కాలము నుండియు మానవోపయోగమున నున్నది. దీని ప్రధాన ఉపయోగ ములు ఆభరణములు, ద్రవ్యమారకము. ఇది మానవునకు ముఖ్యావసరము కానేకాదు. దీని లేమి మానవున కెవ్వి ధముగను నష్టదాయకము కాదు. కాని ఇది భూమియందు చాల స్వల్పముగా లభించుటచే, దీనికి ఎక్కువ విలువ వచ్చినది. ఈ కారణముచే ఇది అనేక మానవ స క్షోభము లకు కారణభూత మైనది. ఈ ఖనిజముయొక్క ప్రపంచపు

సగటు ఉత్పత్తి 8 కోట్ల ఔన్సులు. దీనిని ప్రప్రథమముగ కనొనినది మొదలు ఇప్పటివరకు దాదాపు 50,000 టన్నుల బంగారము భూమినుండి వెలికి తీయబడినది.

ఉత్తర అమెరికా ఖండమందలి కెనడా దేశము, కాలి ఫోర్నియా, అలాస్కా ప్రాంతములు, రాకీ పర్వత ప్రాంతము, ఆరిజోన– నెవాడ. మెక్సికో ప్రాంతములందు ఈ ఖనిజము లభ్యమగును. కెనడాలో 13 శాతము, అమెరి కాలో 15 శాతము, దక్షిణ అమెరికాలో 4 శాతము ఈ ఖనిజము ఉత్పత్తి యగుచున్నది. దక్షిణాఫ్రికా దేశము నుండి ప్రపంచ ఉత్పత్తిలో 35 శాతము తీయబడుచున్నది. ఇచ్చట 'విట్ వాటర్ షాండ్' ప్రాంతము ఈ లోహము నకు ముఖ్యమైనది. రష్యాదేశమున ప్రపంచ సంపదలో 13 శాతము కలదు. ఇచ్చట బంగారము ఇసుక పర్రలలోని చిన్న అణువులయందు కేంద్రీకృతమైయున్నది. దీనికి యూరల్ , యెనిసై నది, యాకుత్ ప్రాంతములు ముఖ్య ములు. ఆ దేశములోని ఒక్క ట్రాన్స్పై కాల్ ప్రాంత మున మాత్రము బంగారము గనుల నుండి తీయబడు చున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలెండ్ దేశములనుండి 5 శాతము, జపాను ప్రాంతము నుండి 4 శాతము ఉత్పత్తి జరుగుచున్నది. పశ్చిమాఫ్రికా, కాంగో, రొడీషియా, ఇండియా మున్నగు దేశములలో కూడ ఈ ఖనిజము స్వల్పముగ లభ్యమగుచున్నది.

భారతదేశమునుండి ప్రపంచ ఉత్పత్తిలో 0.7 శాతము మాత్రమే వచ్చుచున్నది. ఇందులో చాల భాగము మైసూరు రాష్ట్రములోని కోలారు గనుల నుండియే వచ్చు చున్నది. ఇచ్చట ప్రాచీనులు ప్రప్రథమముగా బంగారము తీసిన సూచనలు కన్పట్టుటచే, ఆనాటి నుండియే గని త్రవ్వక ముప్రారంభ మైనట్లు తెలియుచున్నది. అది ఇప్పుడు ప్రపంచములోని అత్యుత్తమగనులలో నొకటిగ పరిగణింప బడుచున్నది. అచ్చట మొత్తము అయిదు గనులు కలవు. బంగారము దొరకు భాగము 4 అ. మందము కలిగి, భూగర్భమున 4 మైళ్లు వరకును లభ్యమగును. ఇప్పటి వరకు ఈ గని 10,000 అ. పైగా త్రవ్వబడినది ఈ దీని తర్వాత రాయచూరు ప్రాంతమందలి 'హట్టి' గనులనుండి బంగారము తీయబడుచున్నది. మైసూరు రాష్ట్ర మందలి ధార్వారుజిల్లాలోను, అనంతపురములో కూడ ఈ ఖనిజము లభ్యమగును. కాని ఈ రెండు ప్రదేశములనుండి పూర్వము ఉత్పత్తిజరగినది. కాని అది నష్టదాయకముగ పరిణమిం చుటచే, ఆ ప్రాంతములలో ప్రస్తుతము పని నిలిపివేయ బడినది. ఇంకను ఈ దేశములోని వివిధ ప్రాంతపు ఇసుక లలో ఈ ఖనిజమున్నట్లు కనుగొనబడినను, అది చాల స్వల్పమగుటచే అచ్చట కూడ పని జరుగుట లేదు.

వెండి : దీని ఉపయోగములు, అవసరములు బంగార మును పోలి యేయుండును. ప్రపంచమున దీని ఉత్పత్తి సాలుకు 275 మిలియను ఔన్సులు. ఇందులో 80 శాతము ఉత్తర, దక్షిణ అమెరికా ఖండముల నుండి వచ్చుచున్నది. ఉ త్తర ఖండమందలి కార్టిలెరా ప్రాంతము, దక్షిణఖండ మందలి ఏన్డియస్ ప్రాంతము ఈ ఖనిజము దొరకు ముఖ్య ప్రదేశములు. ప్రపంచపు ఉత్పత్తిలో 33 శాతము మెక్సికో నుండియు, 16 శాతము అమెరి కానుండియు, 10 శాతము కెనడా నుండియు, 9 శాతము పెరూ నుండియు, 5 శాతము బొలివియా నుండియు, 5 శాతము బెల్జియన్ కాంగో నుండియు, 2 శాతము హొండు రాస్ నుండియు, ఉత్పత్తి యగుచున్నది. తరువాత ఈ ఖనిజము నకు ఆస్ట్రేలియా ఖండము ఎన్నికకన్నది. ఈ దేశ మునకు ప్రపంచమున 5 వ స్థానము కలదు. ఇందులో 98 శాతము మూడు ప్రాంతములనుండి వచ్చుచున్నది. (న్యూసౌత్ వేల్స్ (65%), క్వీన్స్ లాండ్ (25%) టాస్మేనియా (8%)). ఈప్రాంతములలో సీసము, తుత్తునాగము, అత్యధిక ముగా వెండితో కలిసియున్నవి. కాబట్టి వెండికి ఇచ్చట ద్వితీయ స్థానము మాత్రమే కలదు. భారతదేశమున వెండిగనులు లేవనియే చెప్పవచ్చును. కాని బంగారము తీయునప్పుడు, మిగిలిపోయిన పదార్థమునుండి వెండి తీయబడును. ఇట్లు కోలారు గనులనుండి 40,000 ఔన్సులు, అనంతపురము గనులనుండి 500 ఔన్సులు తీయబడుచుం డెడిది. ప్రాంతములలోని వెండి శాతము హెచ్చగు సూచన లేమాత్రమును లేవు.

ఈ. వెం. ఎం. రా.