Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్లార్కు జాన్ బేట్సు

వికీసోర్స్ నుండి

క్లార్కు జాన్ బేట్సు (Clark J. B. ):

కారు జాన్ బేటు అను నతడు అమెరికన్ అర్థశాస్త్రవేత్తలలో అగ్రేసరుడు. ఇతడు 1847 సం. జూన్, 26 వ తేదీయందు న్యూయార్కు నందలి ప్రావిడెన్సు ప్రాంతములో జన్మించెను. అంహర్ట్స్ కళాశాలయందును, హెడెల్ బెర్గు. జూరిచ్ విద్యాలయము లందును ఇతడు విద్య నభ్యసించెను. 1872 లో అంహర్ట్స్ కళాశాల లో నుండియే ఇతడు పట్టభద్రుడయ్యెను. ఇతడు జర్మనీలో నుండగా జర్మన్ చారిత్రక ఆర్థిక వేత్తల (Historical school) చేతను ప్రభావితుడ య్యెను.

జాన్ బేట్సు అమెరికాకు తిరిగివచ్చిన తర్వాత 1877 సం. లో కార్లటన్ కళాశాలలోను, 1882 సం. లో స్మిత్ కళాశాలలోను, 1892 లో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యా లయములోను, 1893 లో అంహర్ట్స్ కళాశాలలోను అధ్యాపకుడుగా నుండెను. పిదప 1893 - 1995 సం. ల మధ్య అమెరికన్ ఆర్థిక మండలికి అధ్యక్షుడుగను, 1895- 1923 సం.ల మధ్య కొలంబియా విశ్వవిద్యాలయము నందు ఆచార్యుడుగను ఇతడు పనిచేసెను. 1911 లో కార్లీజ్ ధర్మకర్తృత్వ నిధి యొక్క ఆర్థిక శాఖకు ప్రధా నాధి కారిగా నియమింపబడెను. అనంతరము స్వీడిష్ శాస్త్రకళాపరిషత్తు (Swedish Royal Academy of Arts and Sciences) లో ఇతడు సభ్యుడ య్యెను. అంహర్ట్స్, ప్రిన్స్టన్ మొదలగు విశ్వవిద్యాలయములు ఇతనిని గౌరవ డాక్టర్ పట్టములతో సన్మానించెను.

1. ఇతడు సంపద, దాని తత్వము (Philosophy of wealth, 1895), 2. పెట్టుబడి, దానిపై లాభములు (Capital and its earnings 1888), 3. వేతనములు (Wages 1889), 4. సంపద, దాని పంపకము (The distribution of wealth 1901). 5. ట్రస్టులు - వాటిపై కట్టుబాటు (The Control of Trusts 1901) 6. గుత్తవ్యాపార సమస్య (The Problem of mono- poly 1904), 7. ఆర్థిక సిద్ధాంతములలోని ప్రధానాంశ ములు (Essentials of Economic Theory) అను గ్రంథములను రచించెను.

క్లారు జాన్ బేటు తొలి రచనలలో జర్మన్ చారిత్ర కుల యొక్కయు, అర్థశాస్త్రవేత్తల యొక్కయు ప్రాబ ల్యము గోచరించును. 'పంపకములో న్యాయమునకు పోటీ అవసరము' అను సూత్రమును ఇతడు ఖండించెను. ఉత్పత్తికి కారణములుగ పూర్వ రచయితలచే పేర్కొన బడిన వర్గములుకూడ ఇతని ఖండనమునకు గురియయ్యెను. అందుచే ఇతడు ఇతర అర్థశాస్త్రవేత్తల విమర్శనమునకు గురికావలసి వచ్చెను. ఎట్లైనను అమెరికను ఆర్థిక సిద్ధాంత రంగములో ఇతని సూత్రములు ఒక తరముపాటు మిక్కిలి పలుకుబడితో విలసిల్లెను. ఆర్థికరంగములో సచేతనములును, అచేతనములును అగు శక్తుల మధ్యగల వ్యత్యాసములను ఇతడు తెలిపెను. గుత్తవ్యాపారములో 18 137 గల అనర్థమును నివారించుటకు స్వతంత్రయోచనతో కూడి ఆచరణీయములైన ప్రతిపాదనలు ఇతడు చేసెను. ఇవి ఆర్థిక శాస్త్రవేత్తగా ఇతడు సాధించిన ప్రధాన విషయములు. ఇతడు 1999 సం. మార్చి. 21 వ తేదీన మరణించెను.

ఆర్. ఎన్. ఎస్.

క్ష-కిరణములు (X - Rays) :

విద్యుదయస్కాంత సిద్ధాంతము (Electromagnetic Theory) ప్రకారము క్ష (X ఎక్సు) కిరణములు లేక 'రాంట్ జెన్' కిరణములు (Rontgen Rays) సాధా రణ కాంతికిరణముల జాతికి చెందినవే అని చెప్పుచున్నారు. కాని వాటి తరంగముల పరిమాణము చాల తక్కువగా నుండుటచే, అవి భిన్నస్వభావము కలిగియున్నవి. గత శతాబ్దాంతములో పెక్కు శాస్త్రజ్ఞులు వాయువులలో గల విద్యుత్ప్రసరణము (Discharge of electricity through gases) ను పరిశీలింపదొడగిరి. వారిలో జర్మనీ దేశస్థుడయిన ప్రొఫెసర్ విల్ హెల్మ్ కోనార్డు రాంట్ జెన్ (Professor Welhelm Konard Rontgen) అను నతడు ఒకడు. 1895 సంవత్సరములో ఒక నాడు అతడు అట్టి ప్రయోగములు చేయుచున్నప్పుడు ఆ గదిలో నున్న బేరియం ప్లాటినో సయనైడు (barium platino cya- nide) పూతగల ఒక అట్ట కాంతితో మెరయుట చూచెను. దానికి కారణము ఆతడు ఉపయోగించుచున్న క్రూక్సు నాళము (Crookes tube) నుండి వచ్చు కిరణములే అని అతడు వెంటనే కనుగొనెను. ఆ కిరణముల స్వభావము అతనికి తెలియకపోవుటచే వాటికి అతడు X (ఎక్సు) కిర ణములని పేరిడెను. అలాగే ఈ కిరణములను హిందూ - దేశ భాషలలో క్ష - కిరణము లనుచున్నారు. రాంట్ జెన్ చేత కని పెట్టబడుటచే వాటిని 'రాంట్ కెన్' కిరణములని కూడ అనుచున్నారు. రాంట్ జెన్ 'X కిరణములను కని పెట్టుటయేగాక వాటి ముఖ్యధర్మములను (properties) కూడ కనుగొనెను. ఈ కిరణములకు అపార దర్శక (opaque) పదార్థములనుగూడ చొచ్చుకొని పోగలశ శక్తి కలదని అతడు కనుగొనెను. అంతేకాక, అవి ఆ కారణము చేత, వైద్య శాస్త్రములోను, పరిశ్రమలలోను చాల ఉపయోగపడగలవని కూడ అతడు సూచించెను. ఈ కిర ణములకును సాధారణ కాంతి కిరణములకును కొన్ని పోలికలున్నట్లు అతడు గ్రహించెను. కాని ఏ పదార్థము లోను X-(క్ష) కిరణములు వక్రీభవనము చెందక పోవు టచే, ఈ కిరణములు కాంతికిరణములవలె తరంగములే అని అతడు నమ్మలేక పోయెను. కాని తరువాత లావె (Lave), బాగ్ (Bragg మొదలగు శాస్త్రజ్ఞుల కృషి వలన ఇవి పరావర్తనము, వక్రీభవనము చెందగలవనియు, ఇవి కాంతికిరణముల జాతికి చెందియున్నవనియు స్పష్ట ముగా తెలిసినది.

X (క్ష) - కిరణములను ఉత్పత్తిచేయు విధము (Generation of X-rays) : అతి వేగముతో ప్రయాణముచేయు ఎలక్ట్రానులు (electrons) ఏ పదార్థమునైనను ఢీకొనినచో X - కిరణ ములు ఉద్భవించును. ఎలక్ట్రానులు పదార్థములను డీకొనునపుడు వాటి గతిశక్తి (kinetic energy) క్షీణించును. ఈ క్షీణించిన శక్తియే X - కిరణములుగా మారును. క్రూక్సు నాళములోని 'కాతోడు' కిరణములు (cathode rays) గాజుతో చేయబడిన నాళమును ఢీకొనుటవలన మొదటి X - కిరణములు ఉద్భవించినవి. ఈ పద్ధతినే శాస్త్రజ్ఞులు కొంత కాలమువరకు X - కిరణ ములను ఉత్పత్తిచేయుటకు అవలంబించిరి. కాని ఇట్లు ఉద్భవించిన కిరణముల తీవ్రత (intensity) చాల తక్కువగా నుండెను. తీవ్రతను హెచ్చించుటకు ఎల క్రానులను నాళముయొక్క ఒక బిందువువద్దకు కేంద్రీక

1. X (ఎక్సు) అనునది ఇంగ్లీషు భాషలో 24వ అక్షరము. పేరు తెలియనప్పుడో, పేరు చెప్పదలచుకొననప్పుడో ఈ అక్షరమును ఇంగ్లీషువారు పేర్కొందురు.