Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోలారు

వికీసోర్స్ నుండి

కోలారు :

కోలారుజిల్లా బంగారుగనులకు ప్రసిద్ధి. మైసూరు రాష్ట్రములో తెలుగువారు ఎక్కువగానుండు జిల్లా కోలారు. ఇది రాయలసీమ జిల్లాలమాదిరి వర్షచ్ఛాయా ప్రాంతమగు మైదానములో నున్నది. ఇందు వేసవిలో ఎండయు, చలికాలములో చలియు ఎక్కువగానుండును. ఈ జిల్లాలోని చిక్కబళ్ళాపురము దగ్గర నందికొండ ఉన్నది. ఇది సముద్రమట్టముకంటే 4850 అడుగులు ఎత్తున నున్నది. వేసవిలో విశ్రాంతి కేంద్రముగా ఉండు టకు కావలసిన సౌకర్యములు ఇందు మైసూరు ప్రభు త్వము వారు కల్పించినారు. కొండమీదికి చక్కనిబాట నిర్మింపబడినది. విద్యుద్దీపములు, నీటిగొట్టములు కూడ అమర్పబడినవి. ఇచ్చటి వనరామణీయకము ఆకర్షకము. ఇచ్చటి వాతావరణము మిక్కిలి వాసయోగ్యము. హైదరాలీ, టిప్పుసుల్తానుల కాలమునాటి కొన్ని చారి త్రక స్మారక చిహ్నములుకూడ ఇచట కలవు. రాయల సీమలో ప్రవహించుచున్న ఉత్తర పెన్నా, దక్షిణ పెన్నా, పాపఘ్ని, చిత్రావతి అనునదులు ఈ కొండలోనే పుట్టి నవి. పాలారునదికూడ ఇక్కడనే జన్మించినది.

ఇక్కడి ప్రజలు రాయలసీమ ప్రజలవలె వర్షము పైననే ఆధారపడుచున్నారు. జీవనదులు లేవు. ప్రతిగ్రామము నందును చెరువులున్నవి. చెరువులు, బావులు ఇచ్చటి సేద్యమునకు ఆధారములు. రాగులు ఇచటి ప్రధాన మైన మెట్టపంట. సామాన్య ప్రజలకు ఇదేముఖ్యాహారము . చిక్కబళ్ళాపురము, శిడ్లఘట్ట - ఇత్యాది ప్రాంతములలో బంగాళదుంపలను విరివిగా పండించి ఎగుమతి చేయుదురు. జనులు పట్టుపురుగులను పెంచి, పట్టుపరిశ్రమకు తోడ్పడు ఆ పరిశ్రమకు వలసిన మల్బరీ తోటలను పెంచు దురు. గౌరీబిదనూరు తాలూకా బెల్లము ఎగుమతికిని, చింతామణి తాలూకా చింతపండు ఎగుమతికిని ప్రసిద్ధ మైనవి.

కోలారుజిల్లాకు ముఖ్యపట్టణము కోలారు. కంబళ్ళ నేత ఇక్కడి ముఖ్యపరిశ్రమ. ఈ పట్టణమునకు సమీప ములో రామాయణ కాలమునాడు ప్రసిద్ధికెక్కిన వాల్మీకి ఆశ్రమమైన అవంతికా క్షేత్రమొకటి కలదు. ముళ బాగిలు తాలూకాలోని ఇప్పటి “అవణి” అను ప్రాంతమే అప్పటి అవంతికా క్షేత్రమని స్థల పురాణమువలన తెలియు చున్నది. శ్రీరాముడు సీతాదేవిని అరణ్యమునకు పంపించి నప్పుడు ఆమె ఇక్కడనే వనవాసకాలము గడిపినదనియు లవకుశులు - రామలక్ష్మణులను ఓడించి యజ్ఞాశ్వమును బంధించిన తావుకూడ ఇదియేననియు తెలియుచున్నది.

చిత్రము - 22

పటము - 1

కోలారు బంగారుగనిలో గని అంతర్భాగమున చలన శకటము

—Courtesy: Director of Publicity and Information Govt. of Mysore.

కోలారు పట్టణములో చోళుల కాలమునాడు ప్రతిష్ఠితమైన దేవాలయ ములు కలవు. ఇందుకు నిదర్శనముగా ఆనాటి శాసనములు ఆ దేవాల యాలలో కనిపించు చున్నవి. వాటిలో ప్రసిద్ధ మైనది కోలారమ్మ దేవస్థా నము. దీనిని రాజేంద్ర చోళుడు ప్రతిష్ఠించినాడు. కోలారమ్మ విగ్రహము నకు సమీపములో ఒక రంధ్రం కనిపించుచున్నది. అందులో నుండి ప్రతి సంవ త్సరము వైశాఖ శుద్ధ పంచమినాడు ఒక తేలు బయటికి వచ్చుచుండునట!

చిత్రము - 23

పటము - 2 కోలారు బంగారుగనిలోని కూపకము —Courtesy: Director of Publicity and Information Govt. of Mysore.

తేలు కుట్టినచో, ఈ దేవతను ఆరా ధించిన తోడనే బాధ నివారణము కాగలదను ప్రతీతి ఇప్పటికిని కలదు. కోలారుదగ్గర నున్న పర్వతము పురాణ ప్రసిద్ధమైన శతశృంగపర్వ తము అను వదంతి కలదు. దీనిలో ఒక అంతరగంగ ప్రవహించుచున్నది. గౌరీబిదనూరువద్ద పినాకినీనదీ తీర మున “విదురాశ్వత్థం" అను పుణ్య క్షేత్ర మున్నది. ఇచ్చట పూర్వకాల మున విదురుడు నాటిన అశ్వత్థ వృక్షమే ఇంకను సజీవముగా నున్న దని చెప్పుదురు. అసంఖ్యాకు లగు భక్తులను ఈ క్షేత్రము ఆకర్షించు చున్నది. ఇక్కడ కూడ ఆధునిక సౌకర్యములు మైసూరు ప్రభుత్వం

వారు కల్పించిరి. కోలారునకు సమీపములోనున్న ఉరిగాం, రాబర్ట్సన్

చిత్రము - 24

పటము-3

కోలారు బంగారుగనిలో బంగారమును కరగించుట

-Courtesy : Director of Publicity and Information Govt. of Mysore.

చిత్రము-25

పటము - 4

కోలారు బంగారుగనిలో క్రియాకలాపము

-Courtesy : Director of Publicity and Information Govt. of Mysore.

పేట, ఛాంపియన్ రీఫ్ ప్రాంతములలో బంగారు గను లున్నవి. భారత దేశ ములో దొరకు బంగార ములో అత్యధిక భాగము ఇక్కడిదే. ఇటీవల కేంద్ర ప్రభుత్వము వారు చేసిన భూగర్భశాస్త్ర పరిశోధన మునుబట్టి ఇంకా ఎక్కువ బంగారము లభిం చుగనులు ఈ పరిసరములలో ఏర్పడ గల వని అంచనా వేయ బడినది.

ఇక్కడ ఒక కళాశాలయు, రెండు పురోన్నత పాఠశాలలును, ఒక పాలీటెక్నిక్ కళాశాలయు గలవు.

కె. సు. రా.