Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొలంబియా

వికీసోర్స్ నుండి

కొలంబియా :

కొలంబియా ఒక ప్రజాస్వామిక రాజ్యము (Republic). ఇది దక్షిణ అమెరికాలో వాయవ్య భాగమున నున్నది. దీనికి ఉత్తరమున కరిబ్బియన్ సముద్రము, తూర్పున బ్రెజిల్, వెనిజులా దేశములు, దక్షిణమున ఈక్వెడార్, పెరూ దేశములు, పశ్చిమమున పనామా, పసిఫిక్ మహాసముద్రములు ఎల్లలుగా నున్నవి. ఉత్తర దక్షిణములుగా దీని పొడవు 1050 మైళ్ళు. తూర్పు పడమరలుగా దీని వెడల్పు 860 మైళ్ళు. 4,39,829 చ. మై. దీని విస్తీర్ణము. ఇందు 1,21,08,000 మంది జనులు కలరు. (1953 జనాభా లెక్కలు) బొగోటా దీనికి ముఖ్యపట్టణము. ఇందు 6,45,000 మంది జనులు నివ సించు చున్నారు.

కొలంబియా యొక్క పశ్చిమ, మధ్యమ భాగములందు వ్యాపించిన పర్వతశ్రేణియొక్క నైసర్గిక లక్షణములు జాతిజీవిత నిర్మాణమందు అత్యంత ప్రాముఖ్యము వహించి యున్నవి. కొలంబియాకు పశ్చిమమునందును, వాయవ్య మునందును “ఆండీసు" మహా పర్వత పంక్త్యగ్రములు వ్యాపిం చియున్నవి. ఈక్వెడారు సరిహద్దు ప్రాంతమున ఆండీసు పర్వతములు ప్రాక్పశ్చిమ మధ్య పంక్తులుగా సమానాంతరముగా చీలియున్నవి. తూర్పు శ్రేణి ఈశాన్య దిశయందు దేశమునకు అడ్డముగా వ్యాపించియున్నది. దాని ప్రాక్సీమ పర్వతమయమగు కొలంబియా యొక్క వాయవ్య మండలములను, దాదాపు సగముకన్న హెచ్చు ప్రాంతము నాక్రమించుచున్న లోపలి మైదాన ప్రాంత మును విడదీయు నొక నిశిత రేఖవలె నేర్పడుచున్నది. ఇందలి విశాలమైన మైదానములందు అమెజాన్ ఉప నదులు పారుచున్నవి. మధ్యమ పర్వత శ్రేణియందు ఉన్నతమైన అగ్నిపర్వతముల వరుస యొకటి కలదు. ఆ అగ్నిపర్వతములలో కొన్ని అనవరతము మంచుతో కప్పబడియుండును. తూర్పుశ్రేణి అత్యధిక మైన జనాభా కల ప్రాంతము. సమశీతోష్ణ కటిబంధపు సరిహద్దులలో నున్న విశాలమైన పీఠభూమి మూలమునను, ఎత్తయిన కనుమల మూలమునను ఇది విలక్షణమై యున్నది. కరిబ్బియన్, పసిఫిక్ సముద్రములకు ఎదురుగా సుమారు 2000 మైళ్ల పొడవున వ్యాపించియున్న తీర రేఖ యొకటి కలదు. కాని అందు స్వాభావిక నౌకా కేంద్రములు చాలతక్కువ. కార్టగెనా; బర్రాక్విలా; శాంతమార్టా; రియోహచా అనునవి కరిబ్బియన్ రేవు పట్టణములు. పశ్చిమతీరము అనారోగ్యకరమైనది. ఆతీర భాగమువకును, జనాకీర్ణమయిన ప్రజాస్వామిక [రాజ్య] ప్రజాస్వామిక [రాజ్య] భాగమునకును మధ్య పర్వతశ్రేణుల ఆటంకము కలదు. అందుచే ఆ పశ్చిమతీర భాగము దేశాభివృద్ధికి ఉపయోగ పడుట లేదు. ఈదేశమందు తూర్పు భాగమునను, లోపలనుగల లోయలు వేడిమికలిగి మలేరియాకు ఆవాసము లై యుండును. పసిఫిక్ సముద్రతీరమునందలి అడవులలో సాలునకు 182 అం. వర్షము పడును. ఇది అమెరికా ఖండమునం దెల్ల గరిష్ఠమైన వర్షపాతము. కరిబ్బియన్ తీరమునందలి శీతోష్ణస్థితి నిలకడలేనిది. అచ్చటి అరణ్య భూములు నడుమనడుమ ఎండి కా కాలినట్టులు. కనిపించు

చుండును. సముద్ర మట్టముపై 8,000 అడుగుల ఎత్తు వరకు సాయం కాలమున చల్లగా నుండును. మొత్తము మీద శీతోష్ణస్థితి (climate) వేడిగానుండును. లోయల యందును పోపయను, కలి, మెడెలిన్, మొదలగు పట్టణ ములయందును శీతోష్ణస్థితి climate) సౌమ్యముగను, మందోష్ణముగను, ఆహ్లాదకరముగను ఉండును. ముఖ్య పట్టణమగు బగోటాలో సాలునకు కనిష్టోష్ణోగ్రత సుమారు పాతము 40 అంగుళములు. ఉన్నత 57. సాలుకు భూభాగములందు సామాన్యముగా మూడు నెలల కొక సారి శీతోష్ణఋతువులు మారుచు ఒకటి తరువాత మరొకటి వచ్చుచుండును. ఈసంఘటన నిత్యము నియమబద్దము వర్ష కాదు. ఈ దేశమునందలి వృక్షవర్గము సమృద్ధముగాను మిక్కిలి ముచ్చటగాను ఉండును. కారణమేమన, ఇందు ఉష్ణమండల వృక్షజాతి మొదలుకొని ఆల్పైను వృక్షజాతి వరకు గల అన్ని వృక్షజాతులును ఉండును. ఇచటి ఉష్ణ ప్రాంతపు పంటలలో అనంత భేదములు కాననగును. రబ్బరు, సింకోనా, మైకము, తాటిచెట్లు, రంగు కట్టెలు (Dye wood), దేవదారు వృక్షములు మొదలయిన వన్నియు లభించును. ఉష్ణమండల జంతువర్గ మచట ఎక్కువగా కనిపించును. ఉదా: నక్క, దుప్పి, చిరుత పులి, ఎలుగుబంటి, స్కంకు మున్నగునవి. ఖనిజ సమృద్ధి మూలమున కొలంబియాకు గొప్ప ఆదాయము లభించును. దీనికి ముఖ్యాధారము బంగా రము, తరువాత చెప్పదగినది పెట్రోలియము. మధ్యమ పర్వతపంక్తులతో ముఖ్యముగా ఆంటిక్వా, కాంకా మొదలగు ప్రాంతములందు బంగారు నిక్షేపములు (గనులు) కలవు. క్రీ. శ. 1930 తరువాత ఎగుదల మగ్దలీనా రాష్ట్రమునందు, నీవా ప్రాంతమున క్రొత్తగా బంగారపు గనులు కల మండలములు కనుగొనబడుటతో ఆ ఖనిజోత్పత్తి అధిక మైనది. కొలంబియా, ప్రపంచములో ప్లాటినము విశేషముగా లభ్యమగు దేశములలో నొకటి. దానిని ప్రధానముగా అమెరికా సంయుక్త రాష్ట్రములు స్వలాభమునకై ఉపయోగించుకొనుచున్నది. బొగ్గు, వెండి, ఉప్పు ఈ దేశమున ఇతర ప్రధాన ఖనిజోత్పత్తు లలో పేర్కొన దగినవి. కలి, బగోటా, మాడలిన్ లకు 88 చేరువలో బొగ్గుగనులు త్రవ్వబడును. రాగి, గంధకము . మాంగనీసు, అభ్రకము, భాస్వరము, చలువరాయి, సీసము, తుత్తునాగము, పాదరసము లభించు గనులుకూడ కలవు. కొలంబియా జాతీయ ఆర్థిక ఉపపత్తికి ఖనిజ సమృ ద్ధియు, వ్యవసాయమును తోడ్పడుచున్నవి. వ్యవసాయ మునకు ఇచ్చటి భూమి, వాతావరణము అను కూలముగా నున్నవి. చెరకు, మొక్కజొన్న, వారి ఇచ్చటి ముఖ్యము లగు పంటలు. మొ త్తము మీద కాఫీగింజల ఉత్పత్తి విషయమున బ్రెజిల్ నకు ఈ దేశము రెండవదిగా గణింపబడు చున్నది. ఇందు చాల భాగము అమెరికా సంయుక్త

రాష్ట్రములకు అమ్మ బడును. శాంతమార్టాలో అరటిపండ్లు పండును.

ప్రత్తికూడ కొంతవరకు పండును.

చిత్రము - 18

కొలంబియా దేశ ముకో నూలు, రబ్బరు వస్తువులు టైర్లు, సిగ రెట్లు, గ్లాసుసామానులు తయారుచేయు పరిశ్ర మలు మిక్కిలి ప్రధాన ము లైనవి. నూలు పరిశ్రమ ముఖ్యముగా మెడెలిన్, బరంక్విలా, సామా, మనిజేల్స్ మొదలగు వానియందు స్థాపింపబడియున్నది. తివాచీలు, రగ్గులు, బ్లాంకెట్లు, చేతితో తయారుచేయుదురు. పంది క్రొవ్వును, పండ్లను, చేపలను డబ్బాలలో భద్రముచేసి ఎగుమతి చేయుటకును, కృత్రిమసిల్కును తయారుచేయుటకును నిర్మింపబడిన కర్మాగారములు కొన్ని గలవు.

ఉత్పత్తిచేసిన వస్తువులను రవాణాచేయుట అనునది కొలంబియాకు ఒక గొప్ప సమస్య, 800 మైళ్ళ దూరము వరకు నావ ప్రయాణమునకై మగ్దలేనానది విశేషముగా ఉపయోగించుచున్నది. ఫ్యూయర్టో విల్ చెస్ (Puerto- Wilches) కును ఈనదికిని ఒక రైలుమార్గముచే సంబంధ మేర్పడియున్నది. ప్యూర్ టో బెరియోనుండి కాకాలోయ (cauca Valley) వరకు మరికొన్ని రైలుమార్గ ములు ఏర్పడియున్నవి. కా కా(680 మై), సినిల్ (210. మై), ఆట్రాటో (416 మై) అను నదులు నాలు నడచు టకు యోగ్యములై యున్నవి. క్రీ. శ. 1,900 నుండినిర్మింపబడిన రహ కుకుట టుసా' బొగోటా పెరు 89 29 70° ద్ర ము BB యా దేర్.న. కాలామార్ వాపీస్ మే జూల 70° an! 5% బ్రాజిల్ O• కొలంబియా యొక్క క్క భౌతికస్థితి వ్యాపారో దేశములకు అనుకూల ముగానున్నది. అట్లాం టిక్, పసిఫిక్ రేవుల ఉప యోగమును పొందు చున్న దక్షిణ అమెరికా లోని ప్రదేశమిది యొక్కటే. పెట్రోలియము, బంగా రము, వెండి, రాగి, సీసము, పాదరసము, మాంగనీసు, కాఫీ, తోళ్ళు, అరటిపండ్లు, ఇచటి ప్రధానమైన ఎగు మతులు. యంత్రములు, యానసాధనములు, లోహసామగ్రి, రసాయనిక ద్రవ్యములు ప్రధానమగు దిగుమతులు. చరిత్ర : ఈ దేశము 1861 వరకు 'గ్రనడా' అని పిలువ బడు చుండెడిది. స్పానిష్ వలస యుగమందు ఇది ఇంచు దారుల మూలమున రవాణా విషయకమైన చిక్కు తొలగిపోయినది. విమాన మార్గములు చాల అభివృద్ధి కూడ పొందినవి. మించుగా అప్రసిద్ధముగనే యుండెను. ఇది 14 సంవత్సర ములు స్వాతంత్ర్య సమరము సలిపి 1824 లో స్పెయిన్ ఆధిపత్యమునుండి విముక్తి నొందెను. 1881 లో వెనా మాతోకలిసి ఈ దేశము ప్రజాస్వామిక రాజ్య (Republic) మై వెలసెను. కాని 1906 లో పెనామా, కొలంబియా నుండి విడిపోయెను.

1934-38 సంవత్సరములలో ఆల్ఫన్సోలో పెజ్ అను నాడు ఉదారవాదులకు (Liberals) అధ్యక్షుడుగా నుండెను. ఆ సమయమందు కొన్ని కార్మిక సంస్కరణ ములు ప్రవేశ పెట్టబడుటయేగాక రోమన్ కాథలిక్ మతమునకు ఇదివరలోగల ప్రత్యేకమగు ప్రభుత్వ రక్ష ణము తొలగింపబడెను. ఈతడే మరల రెండు తడవలు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడి 1945 వరకు అధికార మందుండెను. 1946 లో ప్రభుత్వము రూఢ మార్గవాదుల (conservatives) చేతులలోనికి వచ్చెను.

కొలంబియా రాజ్యాంగ చట్టము ననుసరించి ప్రతి నాలుగు సంవత్సరములకు ఒక 'అధ్యక్షుడు ఎన్ను కొనబడుచుండును. అతడే తన మంత్రివర్గము నేర్పాటు చేసికొనును. ఒ కేవ్యక్తి వరుసగా రెండు పర్యాయములు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడకూడదు. 63 మంది సభ్యులు గల సెనేటు అనబడు ఎగువసభ యొకటి నాలుగు సంవ త్సరముల కొకసారి జరుగు ఎన్నికల ఫలితముగా ఏర్పడు చుండును. ఇదికాక 123 మంది సభ్యులుగల ప్రతినిధులు సభయొకటి రెండు సంవత్సరముల కొకతూరి ఎన్నికల ద్వారమున ఏర్పాటు కావింపబడును. 21 సంవత్సర ములు దాటిన పురుషులందరు వోటింగు హక్కును కలిగి యుందురు. 21-30 సంవత్సరముల మధ్యనుండు పురుషు లెల్లరు సైనికవృత్తియం దుండవలెను.

1570 లో బోగోటాలో జాతీయ విద్యాలయమొకటి స్థాపింపబ డెను. అదికాక, మరికొన్ని స్థానిక విశ్వవిద్యాలయ ములు కూడ కలవు.

ఆర్థికముగను, సాంఘికముగను శ్వేత జాతివారి ప్రాబల్యము నీగ్రోలమీదను, ఇండియనుల మీదును కాన నగును. దేశమందు స్పానిష్ భాషయే ప్రధానముగా మాట్లాడబడును.

కె. వి. రె.