శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల/పింగళి సూరనార్యుడు
୫
పింగళి సూరనార్యుడు
ఈతడు 18.వ శతాబ్దము వాఁడు. తండ్రి యమరన్న, తల్లియబ్బమ్ల ఇతని నివాసస్థానము కర్నూలు మండలములోని యాకు వీడు, నంద్యాల మొదలగునవిగా తోచుచున్నది. నంద్యాల పరిపాలకు డగు కృష్ణరాజు ఆస్థానములో నుండెను. గరుడపురాణము, గిరిజాకల్యాణము, రాఘవ పాండవీయము, ప్రభావతీప్రద్యుమ్నము, కళాపూర్ణోదయము లీతని కృతులు. మొదటి రెండు నామమాత్రా వశిష్టములు, ఈ స్తుతిపద్యములు కళాపూర్ణోదయములోనివి.
కళాపూర్ణోదయము
సీ|| మణిమయ ప్రాకారమండపగోపురో
దీర్ఘకాంతులచేతఁ దేజమునకుఁ
జారునదీహస్త చామరవీజన
వ్యాపారములచేత వాయువునకు
నారాధనార్థయాతాయాతజనవిభూ
షారజోవృష్టిచే ధారుణికిని
హృద్యచతుర్విధవాద్యస్వనోపయో
గ ప్రవర్తనముచే గగనమునకు
గీ|| నిజనవాగరు ధూపజనీరవాహ
జననసంబంధమహిమచే సలిలమునకుఁ
బావనత్వంబు గలుగంగ బరగు వేంక
టేశునగరు దాఁ జేరి యింపెసగ మెసఁగ.
క|| మునుపు పరివారదేవత
లను దగ సేవించి నిర్మలపేమ భరం
బున మేను గగురు పొడువఁగ
ననఘుఁ డతఁడు లోని కరిగి యగ్రమునందున్.
సీ|| మృదుపదాంబుజములు మెఱుగుటం దెలుఁ బైడి
దుప్పటియును మొల ముప్పిడియును
మణిమేఖలయు బొడ్డుమానికంబును వైజ
యంతియు నురమున నలరు సిరియు
వరదహస్తముఁ గటి వర్తిల్లుకేలుశం
ఖముఁ జక్రమునుదాల్చు కరయుగంబుఁ
దారహారంబులుఁ జారుకంథంబు ని
ద్దపుఁ జెక్కులును నవ్వుదళుకు పసలు
గీ|| మకరకుండలములును దామరలఁ దెగడు
కన్నులు మానోజ్ఞనాసయుఁ గలిగి బొవులు
ముత్తియపునామమును రత్నమకుటవరము
నెసఁగ గనుపట్టు శ్రీవేంక పేళుఁ జూచె.
వ|| ಇట్లు జూచి,
శా|| ప్రత్యంగంబును మిక్కిలిం దడవుగా భావించి భావించి యా
దైత్యారాతితనూవిలాసము సమస్తంబుకా విలోకించెఁ దా
నత్యంతంబును వేడ్డఁ బొంగుచు నితాంతాశ్చర్యముంబొందుచున్
గృత్యంబేమియుఁ గొంత ప్రొద్దెఱుఁగ కక్షీణప్రమోదంబుతోన్.
వ|| పదంపడి నిజానుభవం బిట్లని యుగ్గడింపం దొడంగి,
సీ||పదపద్మములఁ జిక్కి పాయదు నాదృష్టి
కనకాంబరమున కేకరణిఁ దెత్తుఁ
గనకాంబరమునఁ గీల్కొనినఁ జలింప దే
నుదరబంధమున నె బ్లోనరఁ గూర్తు
నుదరబంధమున నింపొంది భేదిల్లదు
శ్రీవత్సమున కెట్లు చేరఁ దిగుతు
శ్రీవత్సమునఁ దారసిలిన రానేరదు
కేలుదామరల కేక్రియ మరల్తు
గీ||గేలు(దామరలను గళశ్రీల మోవి
మకరకుండలముల గండమండలముల
నాసఁ గనుఁగవ బొమలఁ గుంతలము లందు
నెందుఁ బర్విన విడఁజాల దేమి చెప్ప.
సీ|| ఒసపరిపసమించు పసిఁడిదుప్పటివాని
శుభమైస యురము కౌస్తుభమువాని
దెలిదమ్మి రేకులఁ దెగడుకన్నుల వానిఁ
గమ్మకస్తరితిలకమ్మ వాని
తొలుఁబల్కుగిల్కు పావలఁజరించెడు వాని
జలవతావుల సెజ్జ నలరు వాని
నింద్రనీలపుడాలు నేలువర్ణము వాని
సిరి మరుల్లోలుపుమై చెలువు వాని
గీ|| మకరకుండలదీప్తి డంబరము వాని
డంబు నేల పెడు మణికిరీటంబు వాని
రంగనాయకుఁ గాంచి సాష్టాంగనతులు
సలీపి తన్మూర్తియంతయుఁ గలయఁ జూచె.
వ!! ఇత్తెఱంగునం జూచి,
చ|| తమ యమరంగ నొక్కొకటి దక్కఁగ నేలేడు నౌర మద్విలో
కముల మణికిరీటమును గస్తురినామము నవ్వు మోము హా
రములును వై జయంతియు నురస్థలరత్నము శంఖచక్రము
ఖ్యములును బొడ్డుఁదామరయుఁ గంకణకాంచీపదాంగదాదులన్.
సీ! దివ్యసంయమీమనస్థితిఁ బొల్చు మత్కుల
దైవంబుపదములఁ దలఁపుఁ జేరు
నఖిలలోకసస్ట యగు బ్రహ్మఁ గన్న మ
తాణబంధువునాభి నాత్మఁ జేర్తు
దై తేయకంఠ నిర్దళనంబు లైన నా
స్వామిహస్తముల భావంబుఁ జేర్తు
లక్ష్మిచన్దవకు నలంకారమైన నా
తండ్రివక్షమునఁ జిత్తంబుఁ డేర్తు
నుల్లమునకును జూడికి వెల్లి గొలుపు,
నా వరదు మోమునందు మనంబుఁ జేర్తు
ననుచు గీతరూపములుగా నాకుకవిత
నుతుల రచియించి పాడుచు నతఁడు గోలిచే.