శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల/సుంకసాల నరసింహకవి

వికీసోర్స్ నుండి

౩

సుంకసాల నరసింహకవి

ఈతడు 16-వ శతాబ్దము వాఁడు తలిదండ్రుల పేరు, నివాసస్థానము యెఱుఁ గరాదు. భట్టరుచిక్కా-చార్యుల శిష్యుఁడ నని చెప్పకొన్నాఁడు. తన గ్రంథమును శ్రీరంగనాథున కంకితమిచ్చినాడు. మాంధాతృచరిత్ర మిందలి యితివృత్తము. కవిత్వము సంస్తృతపదభూయిష్టముగా నున్నది.

కవికర్ణరసాయనము

వ|| ఇట్లు గరుడవాహనరూఢుండై యారూఢ దివ్యముని నేవ్య మా నుండై యఖిలభువనా వనదశుండై పుండరీకాకుండు ప్రత్యక్షం బగుటయు.

శా|| హర్దాశ్చర్యభయంబు లుప్పతిల సా షాంగంబుగా మ్రొక్కియు
త్తర్షింపంగఁ దరంబు గాని యొకయంత స్సౌఖ్యముకా బొంది పై
వర్షింపం బ్రచుదాశ్రు పూరము కరద్వంద్వంబు నొక్కొంతగా
శీర్షంబుం గదియించి సాంద్రపులక శ్రేణీపరీతాంగుఁడై.

దండకముII శ్రీవల్లభా ! గల్లభాగద్వయీ దర్పణాత్యర్పణా లోక ! లోకత్రయత్రాణలీలాకళాదక్ష ! దక్షాత్మజా భర్తృచూళీ పరి ష్కారమందారమాలా భవత్పాద నిర్యత్పయోధార ! దారాసహస్రాం శుదీప్తప్రభాభార దూరీకృతారాతిదైతేయనాధా వరోధాంజన ధ్వాంత సంతాన ! సంతానభూజప్రభాపాదపార్థిప్రజాభీష్టవస్తుప్రదానప్రశస్తా ! సమస్తాత్మభావానుభావంబు నీ వంబుజాతాక్ష ! కె కొన్న పైకొన్న నీమాయ నేమాయథామానముం గానఁగా లేక సాసోనుసంధాన సంధానుబంధానుబంధాంధకారంబుచే ని న్నెఱుంగం డెంగం దరంబా ? భువిం జిత్తగ_ర్తంబునం గుర్తృతాహంకృతికా జీవ బీజంబు సంకల్పరూపాంకురం బౌచు నుద్దామకామాదికాండప్రకాం డంబు లడ్డంబుగా బుత్ర మిత్రాది పత్రంబులకా- జొంపమై సంప దర్ మవ్వపుండ్రొవ్విరుల్గా బునర్జన్మకృద్బీజసంయోజనా మాత్ర పాత్రంబుగాఁ గర్మమర్మంబునం బండ నొండొంటి కంటైన యీ మేను లన్మానులం దట్ట మైనట్టి నిస్సారసంసార ఘోరాటవీవాటిక న్నిర్గమింపంగ మార్గంబు さ కెమ్మెయిం ద్రిమ్మరం గండ్లు ముండ్లుంగొనడా నొప్పిచే నెవ్వగం గూలుచుం దూలుచుం తద్వ్య పాయం బుపాయంబునం జెండు టానందమై తోఁచు నందందమై నింద్రియద్వంద్వసంప్రాప్తిచేఁ దప్పుల్బమ్మైన మానేరముల్ దూర ముల్ జేసి యాశీవిషాధీశశయ్యా ! మదీయాపదల్ వాపవే ! పాప వేగోదయంబింక మిమ్మింక నాలింపఁ బాలింపఁగా దిక్కుదక్కె వ్వరే ! నవ్వరే చీఁకునుంజీకుఁ జేయూఁతగాఁ జేఁత కీదృశ్య విశ్వంబునం దత్ర్పభావంబు భావంబునం దాన కానంగ లేఁడొక్క రుం డొక్కరున్ముక్త నింజేయఁగా శక్తుఁడే ? యు_క్తి సంధిత్స మాత్పర్యబకైకబుద్ధిన్వికల్పించి కించిత్పరిజ్ఞానముం గానఁగా లేని దుర్వారదుర్వాదులం గాదనం జాలి లీలాకలో త్సేకతన్నైక ਲ਼ਾ ਹੇਂ ద్యమానుండవై యెన్ననుద్యోగివై నీతవిద్యాగతికా లోకమున్ దూరితాలోకముంజేసి చీకాకుగాఁ గాకు సేయంగ నేపోకలం టోక యేకాకులై యాకులైశ్వర్య కార్యంబు వర్ణించి పంచేంద్రియాది ప్రపంచంబు నిర్జించి మోహంబులం గోసి దేహంబులన్- బూర్ణగే హంబులన్ రోసి శీతాతపాభీరులై జీర్ణపర్ణానిలాహారులై ఫెూర తీవ్రప్రభాచారచాతుర్య ధుర్యుల్మహాయోగివర్యుల్సదాగాథసంబోధ సంబాధనిర్భాధహృద్వీధులకా నిన్ను శోధించియున్ గట్టిగా బట్ట లేరన్నమ మ్మెన్నఁగానేల ! యేలా వృథాగాధ లింకకా ? భవాం ధాంధుషూలంబులం గూలి యుక్కేదిది క్కేదియుకా లేని పూడు ల్నిరూడానుకంపా గుణా విద్ధు లం జేసి నీవుద్ధరింపంగఁ దా రెంతయుకా నీపదారాధనాసాధనాసక్తులై భ_క్తి సంయుక్త లై ముక్తులై శుద్ధ మిద్ధంబు వేదప్రసిద్ధం బసూయం బమూనం బ మేయం బవాచ్యం బమోచ్యం బనాశం బనీకాశ మేసౌఖ్య మాసౌఖ్యమం గాంత రద్దాలయాకాంతా ! యేక్రంతలకా వ్రంతలకా జెందలే స్లుం దలే నింక నేఁ గింకరత్వంబు తత్త్వంబుగాఁ జూచెదక్షా- దాస్యమా శాస్యమంగా నపేక్షించెదకా భృత్యకృత్యంబు నిత్యంబుగా సేవకత్వంబు సత్యంబుగా నెంచెదకా- దావకీ యార్హనిర్ణేతుకారుణ్య గజ్యైకవీక్షంగటాక్షింపవే | శిష్టరక్షాపరా ! దుష్టశిక్షాకరా ! ధర్మ సంస్థాపకా 2 శర్మసందీపకా ! భక్తకర్మచ్చిదా ! ము_క్తిమర్కప్రదా !

సీ|| తృష్ణాపరుం డైన తెరువరి తియ్యని
             మున్నీటిసలిలంబు లెన్ని గ్రోలు
    నిరుపేద యగువాఁడు నిర్జరగిరిఁ జేరి
             జాతరూపం బెంత సంగ్రహించు
    గణనాపరుం డైన గణకుండు సమకొని
             రిక్కల నెన్నింటి లెక్క వెట్టు

లంఘనోన్ముఖుఁ డైన జంఘాలుఁ డొక్కరుం
డిమ్మహీవలయంబు నెంత గడుచు

గీ|| నట్టిదయ స్టో యనంతకల్యాణగుణస
    మృద్ధుఁ డగు నిన్ను ననుబోఁటి యెంత పొగడు
    నెంతమాత్రయుఁ బొగడుట కేది యెఱుక ?
    యెఱుక నేఁ డిఁకఁ గలుగునే ? యీశ్వరేశ !

చ|| తొలుదెసవేల్పమానికపుఁదోరపుఁగాంతికి మేలుబంతి క్రొ
    మ్మొలక మొయిళ్లవన్నియల మొల్ల మికిందగుపుట్టినిల్ల గుం
    పులుగొనుతోరపుంబసిమిబూమియచూపవిడంబనంబు నీ
   బలితపు మేనిచాయ కను(బండవు నా కొనరించె నచ్యుతా !

చ|| అసుజలవర్గమం జలరుహంబులు నీశ్వర ! తారు శారదో
    ల్లసనముఁ బూని యైన నవిలంఘ్యతమఃకృతమీలనంబు రా
    జనవృతి కల్మి యందలి ప్రసాదము నొందక యుండు నట్టి నీ
     యసమపదాబ్దయుగ్మ మలరారెడు మూమక మానసంబునకా.

చ|| సురనదికం పెఁ దార తొలుచూలుసుమీ యని యెల్ల వారికిన్
    జిరతరధాళధళ్యమునఁ జెప్పక చెప్పెడు భంగి బొల్చునీ
    చరణబినప్రసూననఖచంద్రమరీచులు పర్వి నామదిం
    దొరలు తమంబు వోనడిచెఁ దోయరుహోత్పల బంధులోచనా !

చ|| సిరియను ధాత్రియుకా శయకుశేశయయుగ్మములం బ్రవీణలై
    సరసత నొత్తుచోఁ బొదలి సంకులముత్పులకాంకురావళుల్
   బెరసిన యప్ప డీమెఱుగుఁబిక్కలు నిక్కము దాల్ప కుండునే
   యుదగశయాన ! పాదకమలోచితకంటకనాళ భావముకా ?



ఉ|| అందములైన నీతొడలయాకృతిశోభ వహింప లేని యా
    నిందకుఁ జాలమిం నిలువు నీఱగు టెంత యనంటికంబముల్
    నందిత భక్త లోకయతులం బగు నీ భవదూరుసామ్యముం
    బొందఁ దలంచు ధూర్తమతిఁ బొందెనధోగతి హస్తిహస్తముల్.

ఉ|| కన్నులపండువై ధగధగం జిగిరంగుఁ రుఱంగలింపఁగాఁ
    జెన్ను వహించు నీపసిఁడిచేల వహించిన నీలవర్ణ :నీ
    యిన్నెటిఁ జూడ మీఁదినగ మెల ఘనాఘనపం కి పర్విపై
    కొన్న మెఱుంగుబంగరువుకొండగతిం దిలకించె నెంతయున్.

ఉ|| లోకము లెన్నియన్నియును లోఁ గొనియుం దనలేమిఁ జూపు నీ
    యీకృశమధ్యభాగ మిపు డీక్షణలక్ష్యము గా దటంచు నే
    నోకమలేశ ! లే దనుట యుక్తముగా దలబ్రహ్మఁ గన్న నా
    శీకముతోడి పొక్కిలికి లేమి ఘటిల్లెడు నట్లు గావునన్.

చ|| పొలుపుగ మధ్యదేశమునఁ బూనిన కౌస్తుభ మెజ్జచాయలన్
    ధళధళితద్యుతుల్ గొలుప దైత్యవిమర్దన ! నీయురంబు ని
    ర్మలరుచి గూడఁ బొల్చె నడుమం బ్రతిబింబితబాలభానుమం
    డలము వెలుంగఁ బొల్చు యమునానది గన్న ప్రదంబు కైవడికా.

చ|| దళితము హే ద్రనీలరుచిదాయకవిగ్రహ ! నీగభీరతా
    జలనిధిభావముం దెలుపఁ జాలిన లక్షణలక్షితంబులై ـ
    యలవడెఁ గంకణాంకితములై సముదంచితశంఖచక్రసం
    కలితములై యభంగపరిఘాసమతుంగభుజాతరంగముల్.

చ|| తన సుషచూవిశేషములఁ దప్పక శంఖములకా జయించుటం
    దనికిన కీర్తీ రేఖలవిధంబున నుజ్వలకాంతిఁ బొల్చు నీ
    యనుపమ తారహారలతికాపరికల్పిత వేల్లనంబుచే
    గనుగొన నొప్ప నీ కిప్పడు కంధరకంధరవర్ణ బంధురా !

చ|| వెడవెడ క్రొత్త క్రొత్త మొగి విచ్చిన కెందలిరాకుఁ గెంవు చూ
    పెడు జిగి గల్గు నీయధరబింబమరీచులు దొంగలింప నీ
    బెడఁగు వహించు నెమైుగము పేరిటి పున్నమ చందమామకున్
    సడలని దట్టపం బొడుపుఁ జాయ ఘటించెడు నంబుజోదరా !

చ|| తిలకితదంత కాంతు లనుతీవ మెఱుంగులు సుస్వరాఖ్యగ
    లు గల నీవచో మృతరసంబులు పైఁగురియంగ నా మదిం
    గల భవతాప మెల్ల విడి గ్రమ్మవె యంగకదంబకంబులం
    బులకనవాంకురంబు లివి పొందగు రీతి గదా ! గదాధరా !

ఉ|| ముద్దులుగుల్కు నీభువనమోహనకుండలరత్నదీధితుఁ
    ల్గద్దఱిలాగమై ధశధళందొలుపా రెడు భంగిఁ జూడఁగాఁ
    దద్దయుఁ జెన్నుమీరెడు పదప్రణతావనకేళిలోల ! నీ
    నిద్దపుచెక్కుటద్దముల నిల్వక జాఱుచుఁ బ్రాకు కైవడిన్.

ఉ|| క్రొవ్వున మచ్చరించి తుద గూడక శరణార్థిబుద్ధితో
    నివ్వటిలంగ నీమొగము నెమ్మదిఁ జొచ్చి వెలుంగు మవ్వపుం
    గ్రోవ్విరితెల్లదామరలొకో యనఁగాఁ దగి చక్రహస్త ! లే
    నవ్వుదొలంకు నీదు నయనంబులు నా మదిఁ జూఱ లాడిడిన్.



ఉ|| నాసిక పేరి మువ్వపుటనంటికిఁ బైబొమ లాకు లయ్యెను
    ల్లాసము చూపు లేఁత మొవులాగు మెయిం దిలకంబు గల్లెడుం
    ద్రాసవగంధ మింకు నని బంభరడింభకపం_క్తి చేరున
    సకలేశ ! నీదునిటలాలక జాలక మింపు గొల్బెడిన్.

చ|| అభయవితీర్ణిధుర్య ! కరుణామృతవర్షము చూపు మేఘస
    న్నిభుఁ డగు నీకు నీవివిధ నిర్మలరత్నకిరీటభూషణ
    ప్రభలు ఘటించు చున్నయని భక్తమయూరమహోత్సవంబుగా
    నభినవపాకశాసనశరాసనసృష్టి కళాకలాపముల్.

ఉ||ఉల్లము చల్ల నయ్యె మొద లూడె మనోరధముల్ జగంబుపై
   నొల్లమి పుట్టె చేరుగడ నొందితి నీళుభదివ్యవిగ్రహా
   భ్యుల్లసనావలోకనసుఖోదధి లోపల నోల లాడుచుం
   దొల్లిటివాఁడఁ గాని గతిఁ దోయరు హేక్షణ ! సంతసించెదన్.

చ|| తెలియని ధూరవర్తనులు తెంపరులై తమ యు_క్తి భంగులన్
   బలుకుట గాక నిక్కముగ భ_క్తివశుం డగు నిన్నుఁ జూడఁగాఁ
   గలుగుటకంటె నొండి"క సుఖంబును గల్గునె కల్గనిమ్కు నా
   తలఁపున కింపుగా దిదియ తప్పక కల్గ ననుగ్రహింపవే !