శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము/ఏకాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


శ్రీప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము

ఏకాశ్వాసము

వేంకటాచలపట్టణవర్ణనము

అనుప్రాసయుక్తాక్కిలివడిసీసము

సీ. సింధురచితపాన బంధురాభ్రవితాన
సింధురకటదాన గంధలీన
మారవపవమాన సారవజ్జవమాన
గౌరవహయమాన సారమాన
మసమాన శరమాన లసమాన తేజోన
లసమాన ధరణీనరసనిధాన
మమరనాధవిమాన సమరజయనిధాన
సమరథాత్యుద్ధాన కమనయాన
తే. మమితగోస్పర్ధిఘనగోపురాగ్రభాగ
నిరతరమణీయహీరమణీకదంబ
విశదకాతివినిర్మితదశదిశాంత
ఘట్టనము వేంకటాచలపట్టణంబు. 1

ముద్రాలంకారయుక్తవింశత్యుత్తరశతవృత్తగోపనోదాత్తవచనము

వ. మఱియు నప్పురవరంబు మందాక్రాంతఫలసదనవనమంజరీమందారసరసిజోత్పలమాలికా సుగంధసుందరీ కనకలతా మణిభూషణప్రభాకలితంబై, రుచిరప్రభాతభాస్కరవిలసిత మణిదీపికా మణివితానకాంతి చామరపుష్పదామచంద్రకళవంశస్థాన మణిమాలికాసుందరంబై, భూతిలక వసంతతిలక కుసుమితలతావేల్లితమనోహరవాతోర్మినదిప్రఘోష పణవదృతవిలంబిత లయగ్రాహి విహితోజ్జ్వల హరనర్తన వనమయూర మత్తకోకిల భ్రమరవిలసిత హంసశ్రేణిక్రేచఖచరప్లుతమనోజ్ఞంబై, మేదినీజలధరమాలాకేతు మన్మహాస్రగ్ధర భాసురోత్తమాంగభద్రక మత్తేభవిక్రీడితంబై, భూనుత విభూతికాంత వినయ కవిరాజవిరాజితంబై, సింహరేఖోత్సాహ శరభక్రీడా శార్దూలవిక్రీడిత ప్రహరణోత్సు వీరవిలసిత మత్తాపరాజితేంద్ర-శ్రీకుమార లలితతురగ త్వరితపదగతిబంధురంబై, మేఘవిస్ఫూర్జిత తరల విద్యున్మాలా సుకాంతి మానినీ మదనవిలసిత ప్రముదితవదన రతిప్రియప్రియకాంతంబై, చంద్రికానిశావిచిత్ర భుజంగప్రయాతంబై, ప్రగుణమృగనాభిశాలినీ మాలినీ భుజగవిజృంభిత వీణారచన మధురోద్గత గీతాలంబన మణిరంగచిత్రపదంబై, మదరేఖాలసగతి గజవిలసితాశ్వ లలితరథగమనమనోహరంబై, వంశపత్ర పతిత జలోద్ధతగతి కమఠవిలసిత హరిణీ కవికంఠభూషణ హంసరుత భ్రమరవిలసిత క్ష్మాహార బింబపద్మసుకేసరంబై, సింహోన్నతవరవక్త్రపలాశదళ పృథివీభుజంగంబై, క్షమాలక్ష్మీకళాజిత ప్రతాపపద్మనాభ ప్రియంవదాష్టమూర్తియై, సర్వతోముఖమంగళ మంగళమహాశ్రీకలితంబై, వృత్తరత్నాకరంబుంబలె నలరుచుండు వెండియు. 2

ఉ. జాతుల మించి పల్లవరసస్థితియున్ సుమనోవితానవి
ఖ్యాతి వహించి శాఖలఁ బ్రకాశము నొందు సుభాషితద్విజ
వ్రాతముఁ గల్గి కాంచనపరంపరలన్ గణికానికాయసం
భూతవిలాసమున్ వెలయఁ బొల్చుఁ బురమ్ముఁ బురీవనమ్ములున్. 3

ఉపమాలంకారము


సీ. కమనీయయంత్రతంత్రములచే విలసిల్లి
సన్మార్గలంఘనసరణిఁ దనరి
పైపూఁత వన్నియల్ పచరించి యంచిత
మణిమాలికాస్ఫూర్తి గణనకెక్కి
చిత్రాంశుకనిరూఢిచే సోయగము మించి
పరిఖాప్తి నెంతయుఁ బరిఢవిల్లి
జోకమీఱ భుజంగలోకసంగతిఁ గాంచి
ప్రద్యుమ్నలీలల రహి వహించి

తే. శోభమానకవాటంపుసొంపు మిగిలి
సతతము ఖ్యాతిమహిమచే సంతసిల్లి
వెలయు విటవర్యురీతి నవ్వీటికోట
కదియుకొమ్మలసాంగత్యగరిమవలన. 4
వ. అట్టివిశాలంబగు సాలంబునకుఁ గ్రొత్తడంబు ఘటించు కొత్తడంబున. 5

ప్రకృతాప్రకృతశ్లేష


సీ. అల నృసింహుని యుద్ది నాగ్రహదశ నొంది
యుగ్రునివలెఁ జాల నుక్కు మీఱి
నలినసంభవుమాట్కి నలుముఖంబుల నాని
తమ్మియందమున నాళమ్ముఁ గాంచి
సత్ప్రబంధముపోల్కి సారధ్వని నిగుడ్చి
శక్తిభృద్గతిశిఖియుక్తి నొంది
సూకరపతిమేర నేకపద్ధతిఁ బూని
యలరువిల్తునిభంగి నతనుతఁ గని
తే. ద్రుమము వహి నున్నచోటఁ బాఁదుకొనియుండి
తుఱకకైవడి నల్లమందుపొడి మెక్కి
రాజువిధమున నరిపురిరాజి వేచి
వఱలు నోడక నెపరంగి వగపిరంగి. 6

తే. అన్నమున సున్నమున నృపుల్ బన్న మొంద
నెన్నిమందు లిడుదు రౌర యెన్నిమందు
లట్టిదొకశూరకర్మమె యనుచు నెట్టి
యెల్లమందుల గెలుపొందు నల్లమందు. 7

పంచచామరము
కుఱంగట న్బిరంగిగుండు గుండువారిదారి మే
దురంబునౌ దురంబులో నెదుర్కొనం బెనంకుచోఁ
బరస్ఫురత్తురంగపాళిబాళిఁ దాఁకి దాఁకి త
చ్ఛరీరపారవశ్యకృత్ప్రసంగి సంగతిం దగున్. 8

ఉత్ప్రేక్షాలంకారము


క. పరిఖాజలగతకైరవ
సరసిజములు గగనతారసమితియుఁ దనరన్
బురవప్రలక్ష్మిపదముల
శిరమున నర్పించు విరులచెలువం బనఁగన్. 9

రూపకాలంకారము


చ. పరిఖనువార్ధిలోఁ గలయ పారతరంబగు స్వర్ణముల్ పయో
ధరవరతస్కరుండు గొని దాఁటగఁ దత్పురలక్ష్మి గాంచి భీ
కరమణి గోపురోపరిముఖధ్వజహస్తము సాఁచి మోద పాం
డురకరకాళిదంతములు డుల్లఁగ నీరదసంజ్ఞ వర్తిలున్. 10

క. ప్రాసాదకేతువులు మరు
దాసాదనముఁ జరించ నది మత్పురికిన్
వాసవపురి యెన యేవివి
ధాసమవైభవములందు ననుగతిఁ దెలుపున్. 11

అక్కిలివడిసీసము


సీ. సురవైరి సోమకాసురహరణాత్తభా
సురవేదముఖరభూసురగణంబు
జన్యకుంభిన్యసౌజన్యాభియాతిప
ర్జన్యోగ్రపవనరాజన్యకంబు
భవసఖనిధిపరాభవచమత్కృతిపటూ
భవదమితధనూరుభవకులంబు
ధరవహాగ్రజబలోద్ధరణకేళివిధాన
ధరశక్తియుతహలధరజనంబు
గీ. చతురకవిబుధగాయనసచివరసిక
నటవిటీవీరరాహుత్తభటచయంబు
దనరు నప్పురిమహిమంబు ధాతకైన
భుజగకులనేతకైనను బొగడఁదరమె. 12

తే. పుష్కరస్ఫూర్తిఁ జెన్నొంది భూరిదాన
పటిమ చేమించి వైరిప్రభంజనప్ర
శక్తిఁ గని నీలరుచిఁ బొల్చి సరసగతుల
ఘనములన మీఱు నప్పురిగజచయంబు. 13

తే. అమరలక్షణములను ఛందముల మీఱి
యతులగతులను బదచమత్కృతిఁ జెలంగి
కందముల మించి సత్కవికావ్యసరణిఁ
బొలుచు నుత్తమహయము లప్పురమునందు. 14

చ. చిలుకపఠాణియు న్జెఱుకుసింగిణియు న్విరియంపకోలలున్
దొలఁగఁగఁ జేసి తత్పురము తోయజగంధులతో విహారము
ల్సలుపఁగ వేడ్కతోడ బలుజాడలరూపులు దాల్చినట్టి పూ
విలుతునిమూర్తులో యనఁగ వీట విటుల్ జరియింతు రెప్పుడున్. 15

రూపకాలంకారము


చ. అలకలె జాలసూత్రములు హారసమంచితరత్నరాజి య
వ్వలయము పూస లాత్మచెలువంబగు పుట్టిక గాఁగఁ గామినీ
కులమనుధీవరవ్రజము కూరిమిచేష్టల మేఁతచేతఁ జూ
పుల వల జిక్కఁజేయు విటపుంగవమత్స్యములన్ బురాంబుధిన్. 16

అపూర్వప్రయోగము


చ. అలుగువహిన్ వెలార్చి పొగరందము మీఱుచు స్నేహమానుప
ట్టుల నొరపై దలిర్చి యుదుటన్ గనుచున్ నసమాస్త్రుకేళిలోఁ
బలుమొనలాని మాఱ్మగలపగ్గెలు తగ్గులు జేసి ప్రోలునన్
గలసి చరింతు రవ్విలువకత్తెలు మారునికత్తులో యనన్. 17

రసప్రాధాన్యరూపద్విరుక్తిసీసము


సీ. మిలమిల బెళుకుచూపులు పేరెములు బాఱ
గలగల గజ్జెలు గులుకరింప
ఝణఝణ హస్తకంకణములు మ్రోయంగ
గణగణ మొలనూలుగంట లులియఁ

దళదళ కమ్మలు తళుకుఁజెక్కులు డాయఁ
గిలకిల నగవులు సొలపు లీన
గమగమమై కదంబములు గుభాళింప
రివరివ గుచ్చెలరవణ మెసఁగ
గీ. మిసమిస రత్నభూషణ ల్మెఱయమెఱయ
రవరవలగుబ్బ లొండొంటి రాయుచుండ
నిగనిగఁగడానికాశెలు జిగి దొలంక
మిసమిస మెఱుంగురంగు నెమ్మేను లలర. 18

సీ. తులకించుజిలుఁగుదువ్వలువపైఁటచెఱంగు
జాళువాపొళ్ళు వసంతమాడఁ
జెమటకస్తురిబొట్టు చెమరి ఫాలములపై
నలకంబులకు వింతచెలువుఁ దెలుప
జడలనల్లిన మల్లెసరులఘమ్మనితావి
మిండతుమ్మెదల కామెతలు సేయు
బిరుదందెలఝళంఝళరవమ్ములు త్రిదండి
సమితిగుండెలు ఝల్లుఝల్లుమనఁగ
గీ. సొలపునడపులగౌనులు నులివడంగ
బిరుదులకుగాఁగ నొరయుచుఁ బురమువీధి
మేళములఁగూడి విటులతో మేలమాడి
కొనుచు వత్తురు వెలజాతికొమిరె లెపుడు. 19

ఉ. వాడఁగనీకఁ గ్రొవ్విరులు వాసనకు న్బరువంపుసంపదల్
వీడఁగనీకఁ బుప్పొడులు వేమఱుసోమరిగాడ్పుసోఁకులన్
గూడఁగనీకఁ బల్లవులకోరిక లీరికలెత్త క్రేవలన్
జూడగనీక నమ్ముదురు బోటులు దత్పురిఁబూవు లెప్పుడున్. 20

సీ. ఇందు రమ్మనుచుఁ జోటిచ్చి తివాసిపైఁ
జెయివట్టి గూర్చుండఁజేసి యతనిఁ
దొడతోడఁ దొడఁ జేర్చి గడుమంచిబుక్కాముఁ
జూతుగాకంచు ముంజేత నునిచి

కఱ్ఱజవ్వాజి చొక్కమటంచుఁ జెవులందుఁ
జేర్చి చెక్కుల గోరఁ జేరఁదీసి
గంబురా యిట్టి దెక్కడ లేదు చూడుమా
యని రవ కనురెప్పలందుఁ జరిమి
గీ. యిట్టిచెయ్వులఁ గూరిమిఁ బుట్టఁ జేసి
పల్లవులచేతిరొక్క మప్పరిమళిములు
వెలలపేరిఁట దోచి యవ్వీటఁ బొల్తు
రలరు సరులమ్ము ప్రాయంపు టలరుఁబోండ్లు. 21

నారికేళపాకము


సీ. సారవత్పౌరవోజ్జ్వలదంఘ్రిశృంగార
నూపురం బలిబిలిగోపురంబు
గణనదుర్లభమణిగణఘృణిచుంబిత
గోపురం బలిబిలిగోపురంబు
ఘనమునిజనచిరంతనపుణ్యసరణికి
గాపురం బలిబిలిగోపురంబు
కీర్తితమోక్షలక్ష్మీపక్ష్మలాక్షికిఁ
గాపురం బలిబిలిగోపురంబు
గీ. కాంతిత్రవర్ణనితాంతకాంతియుతవ
నీపథమధులిట్ఛుకపికనికరకలక
లారవావృతవృషభాచలాగ్రమునకు
మూపురంబైన యలిబిలిగోపురంబు. 22

వృత్త్యనుప్రాసము


తే. హరియు హరియును హరియుఁ గాసరియుఁ గరియుఁ
గిరియుఁ గరియును బలునెమ్మిపురియు దరియు
దరియు ఝరియును జమరియు విరియు సురియు
నరియుగంబును దనరి యుండవ్వచరియు. 23

సీ. కొండలరాయనిఁ గొలుచు కవులకు బం
గారంపు ముడుపు మోకాళ్ళముడుపు
పరమదాసవ్రాతపాపంబు లెల్లను
గడలకుఁ దుడుపు మోకాళ్ళముడుపు
దిటమున నెక్కు నెంతటివారి కొదవించుఁ
గన్నంతజడుపు మోకాళ్ళముడుపు
నానాదిగా గత నరసంతతికిఁ బున
ర్గమనంబు లుడుపు మోకాళ్ళముడుపు
గీ. తడుపు లిడనట్టి మేనులు విడుపుఁ జూపు
నొడుపు మదినెంచి తపములు గడుపు మునుల
పొడవు లెఱిగించు జీఁకటినిడుపుగుహల
కడుపొలు పలరు నిడుపు మోకాళ్ళముడుపు. 24

యతిభేదము


ఉ. స్వామితమోపహారి కురుసారససారససారసారజా
తామితభంగచారికి మదానవదానవదానవర్థిత
శ్యామతనూవిహారి కళిజాలకజాలకాతిద
క్షామలకైరవారి కవిసారవిసారవిసారధారికిన్. 25

క. హారికిరినేత్రపాలిత
వారికి నిజదాసతురితవారణరాజీ
వారికి శ్రితకవిరాజికి
వారికిఁ గోనేరి కతులమగుసిరు లిడుచున్. 26

సీ. వెలసి పూదేనెకాల్వల నిగుడ్చును రేపు
నెత్తావితెమ్మెరల్ నినుచు మాపు
వలకారిదొమ్మితేఁటుల నల్గడల రేపు
మరున కందిచ్చు ముత్తరము తూపు
సంజీవనీముఖౌషధుల నెల్లెడఁ జూపుఁ
బుణ్యంపుఁద్రోవకుఁ బూటకాపు
శుకపికశారికానికరంబులకుఁ బ్రాపు
బడలికలన్నియుఁ గడలఛాపుఁ

గీ. జిన్నిచిగురుల నింగిని జేయు తోపు
తేటకొమ్మలకొనల మిన్నేట దోపు
పువుల వెలయుచుఁ బాపముల్ దివియుతోపు
లుద్ది లేదనఁదగుతోపు పెద్దతోపు. 27

ఉభయస్ఫురణము


చ. కనకనగాధినాయకశిఖాముఖజాగ్రదుదగ్రశీఘ్రలం
ఘనఘనకాంచనాబ్జకళికాతిలకాళిగరుద్గురుస్ఫుటాం
జనజనకప్రభాసితలసత్సితసారససంగభంగమ
జ్జనజనకల్పితాభిమతసత్పురుషార్థము పాండుతీర్థమున్. 28

సీ. సంతతపనితసజ్జనవృజినవిభంగ
ముహురజహజ్జహద్బహువిహంగ
లసితసముద్రభటిసముద్రవరసంగ
సకలతీర్థైకనిజప్రసంగ
యుత్ప్రతిధ్వనిదదర్యుభయపార్శ్వరథాంగ
గౌరీశవిళుకమనోరథాంగ
మృదులవాసితగంధకదళికేక్షులవంగ
ధరణీరుహోగ్రపతప్లవంగ
గీ. యూర్ధ్వసారంగసారంగ యుక్కుడుంగ
కలితసారంగముఖవిహంగమపతంగ
పుంగవగరుద్గణానిలభంగురాంబు
కణమణిఖచితశృంగ యాకాశగంగ. 29

సీ. కాండపాండిమహారిగగనధున్యుపమాన
హాటకపంకేరుహప్రసూన
కమనీయనవనీతఖండహాసనఫేన
మహనీయతరజీవమణినిధాన
నాగాహితప్రహుణకనిమంత్రణమీన
పులినభూనానాగఫలవితాన
సతతనిజస్నాతసాధుకిల్బిషదాన
తతవీచికాతిరస్కృతనదీన

గీ. దానవారాతిపాదపద్మభరలీన
మానసానూసనోనూయ మానదీన
మానవాళికిఁ గురియు హేమంపుసోన
వానమావు మొకము బయకానికోన. 30

శబ్దార్థోభయశ్లేష


మ. తనులావు ల్ప్రకటించుచున్ మొగములం దట్టంపుఁ గెంపుల్ జనిం
ప నుదారమ్ముగ రాజహంసతతి పద్మవ్యూహమున్ జొచ్చి నే
ర్పునఁ దద్వాహినియం దమందతరి వారు ల్గాంచుచు జోడు వీ
డని మత్తారికులంబు తోరణము జంటన్ జేయు లీలాగతిన్. 31

గౌడరీతి


చ. ఆగమహిమావలోకన సహర్షఘనాఘనఘోటకీభవ
త్ప్రగుణ ఘనాఘనౌఘ నిభ భద్రఘనాఘనసంఘ చంకన
ద్గనధునీపనీప తదఖండఝరీలహరీ పరంపరా
త్యగణిత ఘుంఘుమార్పిత గుహాప్రతిఘోషము ఘోష మొప్పగున్. 32

క. ఏతాదృశవిభవమ్ముల
శీతాచలసేతుమధ్య సీమోర్జిత వి
ఖ్యాతావినూతన హరిని
కేతన సువిశేషగిరివర మలరున్. 33

సీ. నకులకులమ్ము లుత్సుకఫణిఫణముల
చాయఁజాయల గొండ్లి సేయునపుడు
గన్నెలేళ్ళకు నెల్లఁ జన్నుబాలెంతయు
బాలెంత పులినంపు లీల నొసఁగు
నెమలికీరము బిడారముల మెలఁగుసారె
కీరముల్ చిత్రబిడారములును
ముదినాగములు సింగములు తోపుఁదోపుల
జోడుగాఁ గూడియే నాడునాడు

గీ. భయద రభసశరభ సముదయముఁ బ్రోచు
సాహసోదర భూదార చక్ర మచట
జాతివైరంబు లేక మజ్జాతిగాఁగఁ
గన్నువిన్కరిదిన్నె ఱేఁ డున్న కతన. 34

వ. అయ్యహిమహీధరంబు హిమధరంబువిధంబున సర్వమంగళకాభ్యుదయవిధానంబును, మేరుశిఖరగరిమ ధర్మస్వరూపరంజితంబును, రాఘవసైన్యంబుఠేవ సుగ్రీవనీలగజగవయపనసరమణీయంబును, శ్వేతద్వీపంబునుంబలెఁ బ్రధానపురుషశోభితంబును, కృష్ణునిపగిది వేణునాదవిలసితంబును, దానవారి వక్షంబుడంబున వనమాలికావీక్షణీయంబును, నలువనలువగు నలు వదనంబుల నిలువున బహుశ్రుతులచే విశ్రుతంబును, నీలగళుజటాజూటంబు నీటున నాకాశగంగాప్రసిద్ధంబును, ధనదాస్థానంబు పోలికఁ బుణ్యజనానందకరంబును, పురందరపురంబువైఖరి సుమనోమందిరంబై, పంక్తిరథసంపదుపలాలితంబై, యయోధ్యానగరిగరిమఁ దనరియు ఆరామాభిరామంబై, విభ్రమబహులతాలక్ష్మణద్యుతి నలరియు శుభశరభరతాస్పదంబై, శత్రుఘ్నమహిమ నమరియు ప్రకటరాజగుణోన్నతంబయ్యు లోకేశ్వరశోభితంబై, సత్ప్రబంధంబును వరారోహాంగంబునుంబోలె నానావిధాలంకారవస్తుధ్వనిరుచిరంబై విలాసంబుల నొప్పుచు, రాకానిశీథియును రంభాకందంబంబునుంబోలి చంద్రానుగమంబై ప్రసన్నతాకారంబున నమరుచు, మందరాస్థలంబును శంకరసుఖపురంబులు వనంబునుంబోలె విలసద్గంధర్వనికరంబై లతావితానంబును, వనేచరమందిరంబును రాజసౌధంబునుంబోలె జాలకావృతంబై వీణాకల్పనంబును వసంతాగమనంబును, సముద్రంబునుంబలెఁ బ్రవాళాంతరంబై భాగ్యవంతుని శాంతంబును నందనంబును, రాగంబునుంబోలె సంతానకాంతంబై పద్మాకరంబును కువలయంబును, విష్ణుపదంబునుంబలె రాజహంసమంజుళంబై శంఖచక్రాదిసాధనంబును గురతరవారివాహినీనివహంబును, నిజాంతస్థభూభృద్వారంబును ఘనాగమనంబును, రాజాభ్యుదయంబునుం బాడవోదారతేజంబులు మహామందరాగాభంగస్ఫూర్తియు నమరి అన్వర్థకమలాధిపాహ్వయంబై, సురశాసనాస్పదంబయ్యు నసురశాసనాస్పదంబై, ఏకశరభమహావనధుర్యంబయ్యు ననేకశరభ మహావనధుర్యంబై, నిశాధిక జ్యోతిర్లతాధామ రూఢంబయ్యు ననిశాధిక జ్యోతిర్లతాధామరూఢంబై, నవరతాహీనశృంగారోన్నతంబై, వారణగంధంబయ్యు నవారణగంధంబై, సమంబయ్యు నసమంబై, ఒక్కొక్కదిక్కున శతసహస్రారామ నదనదీఝరీపరీతంబును, ఒక్కొక్కచాయ ననపాయచిత్రవర్ణ శ్రీపర్ణకుముదసముదాయసముద్యన్మకరందస్యందిబిందు బృందాస్వాదతుందిలేం దిందిర సందోహ సంగీత భంగీతరంగితానషంగాంబులోల నాళీకజాల డోలాందోళనఖేల ద్బాలమరాళ చంచూపుటతృట దరాళ మృణాళవిసాల ప్రభానిస్తంద్ర చంద్రికా సారంబులగు కాసారంబున నలరుచు నొక్కొక్క చెంతఁ గాంతలతాంత కుంతాక్రాంత నితాంతతాతాబ్జ కాంతకాంత వేదికాంతారామరకాంతాకాం తైకాంతరతంతశ్రాంతి వారిక చేలాంచలజాయమాన పవమాన వలమాన విటపిపటలంబులం గనుపట్టుచు నొక్కొక్కవంకఁ బొంకంబగు నేణాంక పంకళాప్తోపలోపలాలిత సారహీరపద్మరాగ మరకత ప్రముఖ మణిఘృణి రమణీయంబగుచు, నొక్కొక్కయిక్క దహరాకాశ విహారమాణ పరామాత్మానుసంధాన సమింధాన పరమానందానుభవ పరిపాక తృణీకృత లౌకికవ్యాపార పారీణ ప్రసిద్ధులు వెలయుచు నిప్పగిది నలరుచుండు. వెండియు 35

చౌపదములు

సతతభక్తియుత సమ్మనిజాలా
కృతనుతులను రాగిలు పృథుశీలా
శృతయుగమునను సుకృతమయి లీలా
క్షితి వృషగిరియనఁ జెలగును జాలా.
సీతావరుఁ డూర్జితముగఁ జేరున్
రీతిఁ గనిన దారిని బొల్పారున్
ద్రేతను హరిని ధరించిన చారు
ఖ్యాతిని గరుడనగంబున మీఱున్.
వెలయు జవ్వనఁపు వ్రేతల పొందుఁ
గలిగిన కృష్ణుని కత లెందెందు

దళము కొనఁ గనగు ద్వాపరమందు
నల శేషాచలమునఁ జెలువొందు
కలియుగమునఁ జేకాన్కల నలరు
గొలిచి యిచ్చునక్కొలందిని సిరులు
బలువిడి నొసఁగెడు బహువైఖరులు
నలువుగ వేంకట నగమన వఱలు. 36

సీ. కలికాల కలుషాంధకారఖండనచండ
పటిమ ఖగంబు వేంకటనగంబు
సాధ్వాళి సాధ్వస సర్పదర్పాదైక
గరుడఖగంబు వేంకటనగంబు
కవిదీనతాబ్ద సంఘాత ఘాతానల్ప
కల్పాశుగంబు వేంకటనగంబు
పరతురుష్కాశరహర రాఘవామోఘ
నటదాశుగంబు వేంకటనగంబు
గీ. ప్రబలకన దీషణత్రయ భావముక్త
సూక్తి సక్త వరిక్తి సచ్ఛక్తి యుక్త
భక్తజనచిత్తచింతిత ముక్తి దఘన
చటుల భావనగంబు వేంకటనగంబు. 37

సీ. గురుదరీముఖఝరీవరలహరీవార
ఘుమఘుమ నిస్వనక్రమనిగాఢ
మగమాంతకాంతనిష్యంది సన్మకరంద
తుంది లేదిందిరామంద గీత
మా సద్భితోల్లసదప వర్గకామినీ
ప్రాపక జపశీల తాపసగణ
మదితిజేక్షణ హరషకృద దభ్ర శుభ్రాభ్ర
సఖమహాభ్రంకష శిఖర నికర
గీ మబ్ధనిస్తబ్ధి ఘనసత్వహతి విచల ద
భంగరంగ దుత్తుంగ తరంగ వర్గ
ఘళఘళార్భటి సందర్భ కవన కవిజ
నామిత తపఃఫలంబు శేషాచలంబు.

హరిగతి వేంకటశైల రగడ

శ్రీ లసదలమేల్మంగాసంగీ | స్థేమవిశాలము వేంకటశైలము
నాళీక భవాది వినిర్మిత స | న్మణిమయసాలము వేంకటశైలము
జలయంత్ర ఘనాఘనధారా | స్రవదబ్జాలము వేంకటశైలము
కలకలరవయుత శుకపికనికర | గ్రసితరసాలము వేంకటశైలము
తాలతమాలక్రముకల కుచముఖ | దాడిమసాలము వేంకటశైలము
సాలఘుమతియతిచింతిత కైవ | ల్యఘటనలోలము వేంకటశైలము
నానాసూనరసోద్భవకుల్యో | న్నతకల్లోలము వేంకటశైలము
మానవనాయక దీయమాన స | న్మదశుండాలము వేంకటశైలము
జాత పాపనాశన పాపవినా | శనకీలాలము వేంకటశైలము
ధాతురూప వంశవివరభవ శ | బ్దవరాభీలము వేంకటశైలము
సంసారచ్ఛల బలవద్గహన | జ్వలన జ్వాలము వేంకటశైలము
కంసాహిత కలహంత కందసం | ఘాతవినీలము వేంకటశైలము
ప్రకటితకుందమకరవర | పద్మసునీలము వేంకటశైలము
మకరధ్వజతోరణచామరపర | మపదోత్తాలము వేంకటశైలము
బంధురశిఖరోపరిపరిశోభిత | బలభిన్నీలము వేంకటశైలము
గంధద్రుమసంవేష్టితభుజగా | గ్రజకాకోలము వేంకటశైలము
శ్యేనానూనాళీఖగ కబళన | చిరకాకోలము వేంకటశైలము
దానవభేదనతల్పవికల్పవి | ధాయకతూలము వేంకటశైలము
కంతుసమంధనచందనపరిమళ | ఖని వాతూలము వేంకటశైలము
సంతతసేవితభాగవతావే | శసువాచాలము వేంకటశైలము
గందగజాసురహరణార్పిత మ | గ్రద్యుతి శూలము వేంకటశైలము
అంధుప్రస్ఫుటమర్కటకీటకృ | తాతతజాలము వేంకటశైలము
మహనీయచతుర్దశభువనావన | మందిరజాలము వేంకటశైలము
గుహపుష్కరిణీచరజలకరణీ | గురుతరజాలము వేంకటశైలము
రాజితరాజీవకుముదసముదయ | రంజకజాలము వేంకటశైలము
నైజపుణ్యభూమ్యవినిర్మితతత | నాళీనాళము వేంకటశైలము
సారరసాభవకిటిదంతవిబా | సారసనాళము వేంకటశైలము
దారుణకేసరి కాసరసంయుత | తతభూగోళము వేంకటశైలము

ప్రకటఫలిత కదళీ జంబూముఖ | భాసురకోలము వేంకటశైలము
కవిదారిద్ర్యోదద నామక భి | త్ఖర కుద్దాలము వేంకటశైలము
అతుల పురజన వృజిన ఘన హనన స | దాదిమకోలము వేంకటశైలము
పతితయవనపుర లంకాపురహృ | త్పావని వాలము వేంకటశైలము
కాండ వికాండ తరీకృతసరసీ | ఘనశైవాలము వేంకటశైలము
తాండవ వేళోద్దండలాసికో | క్త భరతతాళము వేంకటశైలము
జనభోజన దర్శన భయద సుద | ర్శన కరవాలము వేంకటశైలము
ఘనపులినావృత దీర్ఘఝల్లరీ | కల్పితవాలము వేంకటశైలము
హరిదురువాసిత కుంకుమకస్తూ | ర్యతి జంబాలము వేంకటశైలము
పరిపరివిధములఁ బెనగొనియెడు పా | పంబుసరాళము వేంకటశైలము
మకరీపత్రకనద్రామామమణి | మంజుసలీలము వేంకటశైలము
సకల జననికర భవహృద్ధి వ్యౌ | షది కత్తైలము వేంకటశైలము
చమరీవాలజ పవనృ రణిత వం | శ విలసదైవము వేంకటశైలము
అమరభ్రమరకచా గీత ప్ర | త్యారవదైలము వేంకటశైలము
కాకోదరతతి పతినామ విశృం | ఖల కృత్కీలము వేంకటశైలము
లోకేశ్వర నిర్జరవరసన్నుత | లోలుపశైలము వేంకటశైలము
ప్రాభవ భవమృదు శైత్య మాంద్యసౌ | రభయుగ్వేలము వేంకటశైలము
వైభవహవ ధూమ శ్యామలతా | వాటి స్థూలము వేంకటశైలము
కందరబృంద రటన్నిర్ఘర లం | ఘన జంగాలము వేంకటశైలము
స్యందన కరి తరుగ గరుడవాహన | సంభ్రమహేలము వేంకటశైలము
అతుల బహిర్ద్వార వితానక కృత | హాటకచేలము వేంకటశైలము
గతి సురభీకృతనైక దిగంతర | గంధ బిడాలము వేంకటశైలము
కమల భవాకర కలిత విహరణో | త్కంఠమరాళము వేంకటశైలము
అమిత మత పాషండ మదాప న | యన నారాళము వేంకటశైలము
పరవన తుందిల భద్రోన్నిద్రా | వనశార్దూలము వేంకటశైలము
గురుతర శాఖిశిఖోద్యద్రిం ఖ | ద్కోలాంగూలము వేంకటశైలము
సింధుర కందర సంఛన్నోపల | శేఖర కూలము వేంకటశైలము
సైంధవ సింధుర చంద్రమణి విలా | సజననమూలము వేంకటశైలము
అనయ పుళింద పురందర నిర్మిత | హారి కుకూలము వేంకటశైలము
అనయము తపసుల కనుపును కజ్జా | యపు కండోలము వేంకటశైలము

మొక్కు వరాలందిడును వరాలు క | పురతాంబూలము వేంకటశైలము
గ్రక్కున తనుబొగ డర్థుల కొసఁగును | కనకదుకూలము వేంకటశైలము
తవులఁగఁ గనరేయి పగళ్ళు దివిజ | దనుజులయాలము వేంకటశైలము
అవిరలమృగయోత్సవధావచ్ఛా | గాదిసృగాలము వేంకటశైలము
సూటిగఁ బొగడని ఖలుల న్మీలకు | జొక్కపుగాలము వేంకటశైలము
ఏటను బ్రహ్మోత్సవమున సుజనుల | కిచ్చువిరాళము వేంకటశైలము
ప్రాకటచతురాస్యోక్తనిగమసా | రంపు నిరాళము వేంకటశైలము
ఏకాంగులకును వైష్ణవులకు సిరు | లిడు హేరాళము వేంకటశైలము
నార్ఖాదాధిపు పట్టిన హరియం | దపు వింటాలము వేంకటశైలము
ఆర్ఖేలనవర్ణిత విగ్రహమగు | హరిమణికీలము వేంకటశైలము
ఎసక మెసఁగ దిశ ఘూర్ణిలు వేలుపు | టింతులమేళము వేంకటశైలము
వసుధాధీశాంతః పురకాంతా | వారనిచోళము వేంకటశైలము
లంబుగ నెలకొన పసులకుఁ దాపసు | లకు ననుకూలము వేంకటశైలము
అంబరచుంబి కదంబ కదంబ మ | హాహింతాళము వేంకటశైలము
శోభిత విద్వత్కవి రచితాకృతి | స్తుతిధారాళము వేంకటశైలము
ఆభపదోన్నతి పెరిగానుక యు | న్నది పాతాళము వేంకటశైలము
గజహయ పుష్కల ముష్కరతౌరు | ష్కబలపిఫాళము వేంకటశైలము
భజియింపని జనులకుఁ జూపును ద | ప్పక గోపాలము వేంకటశైలము
కొలిచినవారల కనువారము నొన | గూర్చు సుమాళము వేంకటశైలము
తలఁచినభక్తుల కభిమత శుభమతి | దయనిడు వేళము వేంకటశైలము
ఇరువుగ నుండెడు నరులకుఁ గోర్కుల | నిడు ఫలకాలము వేంకటశైలము
పరిపరిగతులను యతు లాత్మలఁ దలఁ | ప గదగు శీలము వేంకటశైలము
హరినతఫాలము వేంకటశైలము | హరులదువాళము వేంకటశైలము
దొరువులతాళము వేంకటశైలము | దొరలకు మేళము వేంకటశైలము
వేంకటశైలము విబుధావాలము | వేంకటశైలము వినమితనీలము
వేంకటశైలము విగతికరాళము | వేంకటశైలము వెన్నునిపాళెము

అనుప్రాసదళవచనము

వ. అట్టిగట్టునఁ జడలతుదల మొదలఁ బొదలు విరిబొదలరొదల వదఱుచుఁ గదలెడు కొదమతుమ్మెద కదుపుల నెదుగఁ బదిలముగఁ గుదురఁగనిన నిరుకప్పుకప్పుట కొప్పులగు గొప్పకొప్పులు, పున్నమవెన్నెల చిన్నెల మిన్నల మిన్నెల్లఁ జెన్నలర న్నెలకొన్న క్రొన్నెల నెలయించ నెదురు నెన్నుదురులు, రేరాఱాల తెలిడాలు నగఁజాలు వాలుగన్నుల జిగిగల వాలుగన్నులు, పొంకంబగు జింకల బింకముఁజూపు చూపులు, శంపాలతికల సొంపునింపు సంపంగిసంపద గుంపులఁ బెంపుపెంపున స్ఫుటమ్ములయిన నాసాపుటమ్ములు, శ్రీవర్ణసవర్ణంబులగు కర్ణంబులు, నిద్దపుటద్దపుటుద్దుల తళుకులఁ జెక్కుఁజెక్కులు, నిగరాలమగఱాల నిగరాల గను నితాంతకాంతదంతంబులు, పగడంబుల జగడంబులపై జగడంబులు సేయ విడంబించు పదవుల పదవులగు పెదవులు, వలమురి మురువుల చమరితనంబున జయించ నగ్గలంబుగల గళంబులు, చొక్కపుఁ జక్కదనంబుల జక్కవకవఁ గవకవ నవ్వు నిబ్బరపు సిబ్బెపుటుబ్బు గబ్బిగుబ్బలు బిసమ్ముల వసమ్ముగాని వెక్కసమ్ములాడ నారజమ్మగు భుజమ్ములు, ఆకసంబుఁ గేకసల్కొట్టి కాకుసేయుట కౌనను కౌనులు, అవక్రచక్రంబు నాక్రమించిన ఘనజఘనంబులు, రంభాస్తంభసంరంభంబు వెడలం గడలకు గడలుకొలుపు దొడలు, నాణెంబులగు తూణంబుల జాణతనంబులాడి ధిక్కరించు నిక్కులకిక్కులౌ పిక్కలరు పిక్కలు, సరససారసవిసరంబుల పసదనంబుల నిరసించు టొసపరి మిసమిసలు దెసల నెసఁగ నాస్పదంబులగు పదంబులు గలిగి వాలుగంట్ల పడగ కొమ రమరు మరువెలిదమ్మి వాలుగంట్లకైపు సొలపు మెలపుల నలపుగొలుపు వాలుగంట్లకింపులునింపు నవ్వనంబు సురపతి యాస్థానంబు కైవడి సుమనోవిరాజితంబై, రాజానుగ్రహంబు లీల నపరిమితఫలానుకూలంబై, అనుకూలాంగనారత్నంబు విధంబున ననవరతోత్సవకరంబై, పారావారంబుమేర వాహినీసమాగమస్థలంబై, మార్తాండునిరీతిఁ గమలానందకరంబై, కంఠీరవంబుచాడ్పునఁ గందరమావిలసితంబై, భారతంబు చందంబున భీమార్జుననకులసహదేవశోభితంబై, వినాయకుని పగిది సువర్ణపత్రమంజుళంబై, మహానటుని జటాజూటంబువైఖరి యహీనభోగాస్పదంబై, నిగమనికరంబుఠేవ నిరవద్యజటాధారంబై, కుకవిప్రబంధంబుమర్యాద జాతివార్తాశూన్యంబై, దూతికల తెఱంగునఁ బల్లవరాగం బొనగూర్చుచు, సాదిపోలిక తావుల మావుల బ్రోదిసేయుచు, సౌరభావరణంబున కళికామితోత్కర్షఫలంబున కరంబుసొంపు సంపాదింపుచు, భాసరుకేసరంబులు రాజితాక్షతలును, అసమానసార లసమాన పరాగ పవమాన డింభములు చెలువలరు చలువతెరలను, శారికావార సుకర కలకలరవంబులు క్రొత్తముత్తైదువ పాటలును, ఫలాపేక్షాయాత నూతన రాజకీరావళులు నిచ్చలపుఁ బచ్చతోరణంబులును, కేకికేకారావంబులు వందిమాగధబృందమంగళాష్టకంబులును, కోకనదసముదయంబులు మెట్టుఁబుట్టికలును, కింశుకముకుళంబులు సురుచిరదీపంబులును, పికకులకలకుహూకారంబు లవార్యతూర్యరావంబులును, కిసలయవితానంబు వితానకపుఁ దానకంబును, కుందకళికాసందోహంబు మీసరపుసేస ముత్తెంబులును, జనులు ప్రియంపడి చూతమను జూతంబు నవకపుఁ బెండ్లి చవికయును, తత్సుమవిసర రసలుబ్దంబులై చుట్టుసోలి వ్రాలిన మదాళినీశ్రేణి నల్లపూసల చాలును, తన్మధ్యభాగలంబమానఫలగుచ్ఛంబు తాళియుంగా వనేందిరా మాధవు కల్యాణమందిరంబు తెఱంగునం దఱంగలించు, మఱియును—

ద్వంద్వప్రాసకందము

క. వనము నిఖిలజన సంజీ
వనము సకృద్దర్శనాభివర్ధిత పుణ్యా
వనము నిరంతరమునిసే
వన ముపగతజీవనము సువనపావనమై. 41

వ. వెలయు దత్ప్రదేశంబున. 42

ప్రకృతాప్రకృతశ్లేషయుక్త సాగరోపమానవన వర్ణనసీసము


సీ. అశ్రాంత సౌమనస్సామోదకృద్రస
సారముద్భవరస కారణంబు
తారప్రవాళశితద్రుప్రవాహస
ద్గ్రాహభ్రమోత్కాళికాకరంబు
గోధికాహరిశంఖ కోలపోతస్థల
రాజీవరాజీవరాజితంబు
బ్రహ్మకళాగూఢ బాడబరాగప్ర
కాండవిఘోషరంగత్తటంబు

గీ. నగుచు శంకరవరబాణహారిపవన
శశధరాభ్యుదయాన్వితశ్యామలాభ్ర
సహితకమలాదిజన గురుస్థాన మయ్యె
సంగు రంగుగ వనరాశి సరణి వనము. 43

రూపకాలంకారము


సీ. వనమహీస్థలికొల్మిఘనకింశుకప్రసూ
నంబు లంగారవారంబు లచటి
యళిసమూహంబు నల్లలు మందపవనుండు
చర్మభస్త్రికమూతిచయము తలిరు
టాకుజొంపములు తీవ్రానలజ్వాలలు
వనపక్షిరవము తజ్జనితరవము
కమలకర్ణికఠాయికడునొప్పు కేతకి
పసవదళంబులు పట్టుగార్లు
గీ. గాఁగ నామనియను లోహకారకుండు
మదనునకు జిగురువాలును మంచివిరుల
శరములును వాడిగాఁజేసి బిరుసుపదను
పువ్వుదేనియ నించె నాఁ బొల్చు నచట. 44

మధుమాసవర్ణనము


సప్తానుప్రాసచరణసీసము


సీ. ఒకమేర మృదుసౌరభకిశోరకసమీర
మొకయోరవరకీరపికవిహార
మొకచోటనాఖేట సకలాట పికకూట
మొకబాట వనఘోటక కుల ఝాట
మొకపొంత సులతాంత నికరాంతరప్రాంత
మొకచెంత ఫలసంతతి కుజకాంత
మొకలోయ ఖగనాయ కుదాయ సముదాయ
మొకచాయ సురగాయక కృతగేయ

గీ. మమిత సారస సారస కుముద నికర
మధురసాసార మధురసా మధురసార
భృంగసంగీత భంగీతరాంగితాభి
లాగమంబు దలిర్చు చైత్రాగమంబు. 45

లయగ్రాహి. అంత ముదిత ప్రసవకుంతము విచిత్రసుల
తాంతము నిరస్తము నిశాంతము తరుశ్రీ
మంతము గళన్మధువసంతము పికోల్లసదు
దంతము ఘనర్తురసవంతము రసాలా
క్రాంతము వీటీవృతవనాంతము హితానిలని
నిశాంతము కనచ్ఛుకశకుంతము నికుంజో
ద్భ్రాంతము కరాళికులకాంతలసమంచితవ
సంతము తనంతన నిశాంతము చెలంగెన్. 46

ప్రాససీసము


సీ. ఔరగందపు మెట్టుదారిఁదారెడు పాఁప
కోరసోకిన సెక యూరుటకును
తీరైన పాండ్యరాణ్ణారీకుచోదార
హారవళీయుక్త చారుగంధ
సారపంకవిహారహారియై నిబిడ శృం
గారవనంబులఁ జేరి మీఱి
సారస సారస సారసౌరభములు
చూరలు గొనుచు గర్పూరముల దు
గీ. మారములు దూఱి హిమవారి పూరమాని
పేరెములు బాఱి మిగులగంభీరముగను
సారెపురవీథి గడితేఱి స్వారిదిరుగు
మేర నందందు మందసమీరణంబు. 47

రూపకాలంకారము - అపూర్వప్రయోగము


ఉ. ఆననతేఁటిమ్రోఁతయె యుపాంగముగాఁగఁ బికాగ్రనాదమే
గానముగాఁగ నామ్రగశుకస్ఫుటపత్రరవంబు మర్దళ
ధ్వానముగాఁగ లేఁజివురు బాహులు ద్రిప్పులతాంగనాళి నెం
తేనియునాడఁ జేయుఁ బురితెమ్మెరనట్టువ పూవుఁదోఁటలన్. 48

శబ్దచిత్రసీసము


సీ. తనసుదర్శనలీల తన సుదర్శలీల
కరణి పుణ్యజనవర్గంబు బెంపఁ
దనవిగ్రహోన్నతి దనవిగ్రహోన్నతి
వలె నసమాయుధపటిమ జెలఁగఁ
దనదుశ్రీవత్సంబు తనదు శ్రీవత్సమ
ట్లఘనమా సంగతి లలిఁ దలిర్పఁ
దనదుదరస్ఫూర్తి తనదు దరస్ఫూర్తి
గతి శరజాతాచ్ఛకాంతు లెసఁగన్
గీ. బరిఢవిలు సిద్ధ సాధ్య సుపర్వశర్వ
విధివిధుబ్రధ్న పాధోధి విబుధనాథ
భావనుతి రూఢిగూఢ పాత్పరిబృఢాఖ్య
భూరిధరణీధర విహారహారి శౌరి. 49

క. తురగావరూఢుఁడై భూ
భర ముడిపెడు నపయశంబు పరిహారముగా
నరలోకరక్షణార్థము
తురగము నెక్కెనని జనులు తొడరి నుతింపన్. 50

సీ. ప్రణవంబు రమణీయమణి ఖలీనము గాఁగఁ
బ్రొద్దునిద్దామొగముట్టు గాఁగఁ
దపసికన్పాపముత్తెపుఁ దలాటము గాఁగఁ
బండువెన్నెల దృష్టి దండ గాఁగ

బలుసంజిడంబు కెంబట్టు పల్లముగాఁగ
మొదటిపల్కులు మువ్వపదువుగాఁగ
వినువాఁర తరగలు వెల్లజల్లులు గాఁగ
వాల్మించు కెంపు హబాయిగాఁగ

గీ. జోడ నలమీఱి లేదెందు జోడనంగఁ
బరుగుచున్నట్టి గరుడుఁడన్ గరుడునిపయిఁ
జేరి నందితధారావిహారహారి
సరణి వాహ్యాళి వేంకటస్వామి దలఁచి. 51

షడ్రుతూపమానాద్యంతయమకవచనము

వ. అప్పు డప్పన్నగనగవిభుం డానందమందిరంబైన యానందమందిరంబు ప్రేమం దిరంబుగా నొయ్యన వెడలి కడలి కడలెత్తి మొరయ వడువున నడవడిగల నడవడిని యడుగడుగు వెంబడిబోడము బడలిక లడంచి తడబడక బుడిబుడి మొక్కులిడి యెడనెడఁ బొగడు పౌరజన జయజయనినదంబు మతకరించు భూరిభేరీమృదంగకాహళపటహడెంకణఢక్కాహుడుక్కానినాదంబుల లోఁగొను నిద్దపుఁ బెద్ద మద్దెలల మొఱపపుటుఱుములు నెఱమెచ్చి పురివిచ్చియాడు నెమ్మికొమ్మల యొమ్మిక సమ్ముఖంబునం గమ్ముక ముమ్మరమ్ముగా వరుస బురుసాకాశలాశలం బసిఁడిపొడివసంతంబులాడ జోడుల కోలాటంబులు వేయు కైలాటకపు మిటుకులాండ్ర జాఱుజడల నల్లిన మల్లెపూసరుల వఱలు గమగమ వలపుల విటులకుఁ దలదిమ్ము పుట్టించునట్టి వెట్ట దినంబులయ్యును పార్శ్వనిస్తంద్ర చంద్రశిలామయ చంద్రశాలోపరి భాగాభోగ వలభి దుపల వలభిపాళీకీలితచిరత్న రత్నకోరక వారక ఫలదీ బహుధావన సమాగతంబులగు కలికిచిలుకల కులుకుపలుకుల కులుకు కలరవంబుల కలరవము కింకుర్వాణమానసలై మను తలంపులు నుతించు ప్రోషితభర్తృకల దృక్తారకంబుల కీ లెఱింగి తదుచితశయ్యాతలంబునకుం దార్చి కూర్చు నెచ్చెలులు నేర్చు కైవడి కెల నమర్చిన తేఁటపన్నీటి ధూమ్రంపు భస్త్రికలముంపున నసమయ హేమంతసమయంబయ్యును, మహోత్సవాలోకన కుతూహల నిఖిల దిశానిశాయాత మనుజ పరంపరా ప్రయత్న సంపాదితా లేపనాపకరణ క్రియోపార్జిత గ్రామీణ కుమార కటితట లంబమానంబులై యత్తలిరుగుత్తి గుత్తంపు మొత్తంబులతో నెత్తంబులఁ దత్తరంబుల తత్తద్గతుల నత్తమిల్లి క్రొత్త దళుకొత్తు మెత్తని తన్నీరు తిత్తుల యొత్తుల ధారాళంబులగు సలిలాసారంబుల నకాండకాండదాగమంబయ్యును మధ్యరంగప్రదేశ పురోగామి గణికాపాళిగల్లపాళికా శ్రమకణ నిర్వాపణ రసిక కర నికర చల ద్వృంతోశీర తాలవృంత సంజాత సుగంధ బంధుర వాతపోత సంచారంబున నవ్వేళ వసంతవేళయయ్యును అధికారి నియమితంబులై యప్రతిప్రతిత ప్రతిభవనద్వారంబుల కురుంజులక్రింద రంజిల్లు నపరంజి కొప్పెరల దెప్పరంబగు నిరంతర పరిమళవంతంబైన కుంకుమ రసవంతంబుకాంతావిజయోదంతంబున నింతింతనరాని సంతసంబున మంతుకెక్కిన కంతుని కరాంతంబున నెంతయు వింతగాని లతాంతకుంతంబున సంతసంపు దొంతర పికిలిపూబంతుల నతివిచిత్రంబులగు నేత్రంబుల మెండగు నందెల యొమ్మైన చిమ్మనగ్రోవుల మించిన యగ్గిలికల ముంచిన తడిసి జడిసికడాని నీరు పాపల రూపుల నొంటి జిలుగు తడివలువ లంట వడవడ వడంకు కామినీ కాముకుల వలన నకాలశీతకాలంబయ్యును, కౌశికాగరు కర్పూర సామ్రాణి ధూపమ్ములు ఘుమ్మన గ్రమ్ముకొను పూచప్పరంబుల నుప్పరంబులు నిగనిగ వెలుఁగఁగల జిలుగుజిగివగ బిగిసరుగ నిగుడి నెగడు పొగరు వగల మిగుల మదిదిరుగ దిరుగు తేఁటి మగువల తెగల తగులుగ తగిన జిలిబిలి తేఁటపాటల వాటిలు సొంపు సంసాదించు తెలిదామర గుంపుల నింపు నింపు చికిలి మకరతోరణంబుల ధోరణిగా మిటారించు నిద్దపుటద్దంపుఁ జకచకల మొలక వెన్నెలల వలన ననవసర శరదవసరంబయ్యును నొప్పునట్టి బ్రహ్మోత్సవంబునఁ దత్సేవాపరాయణ భూపాలక కుమార కాగ్రభాగ సంస్థాపిత నూతన కేతనవ్రాత పటాపటాత్కార గంధసింధుర ఘంటికా ఘణఘణాత్కార దుర్దమ సమ్మర్దోన్నమిత సుభట పటలి హస్తాగ్ర విన్యస్తశాత కుంభశుంభత్సరుప్రభాసమానాసమాన నానావిధాయుధ సంఘర్షణోత్కర్ష జాయమాన ఘణఘణాత్కారాదిశబ్దకోలాహలంబున సకలలోక లోచనానందకరుండయ్యెఁ దత్సమయంబున. 52

జాతిసీసము


సీ. జంపుసూరెపుటంపు కెంపునిద్దపు ఠేవ
గుత్తంపు బంగరు కొమ్ముకట్లు
డంబుమించిన పగడపు తలమాళిగ
నాణెంపు పెద్దకట్టాణి గద్దె
జాతికిరీటి పచ్చలరావిరేకలు
గమకపు పోలాతి గంటజోళ్ళు
నిండుచందురునిగ్గు వెండిమేలందెలు
కప్పురాసంతన యొప్పుటొరిజ
గీ. సానదీఱిన వజ్రాంకుశంబుబారి
నిగళమష్టమదములు గుడుగుట యేక
సరముఁ గంబాటమును నిజచాయల ప్రతి
కరులని గరి బడుటగల్గు గంధకరులు. 53

ఉ. ఆవులు దివ్యవస్త్రములు నాభరణంబులు వెండిపైఁడియున్
గావడినేతులున్ బునుఁగు కప్రము కస్తూరి గంధమింతులున్
బూవులు వీవనల్ ముకురముల్ ముడువుల్ గొఱియ ల్ఫళావళుల్
దేవశిఖావతంసునకుం దెచ్చిరి కానుక లెల్లవారలున్. 54

క. కోరి తలయిండ్లు దాల్చిన
వారును నడుగడుగు మ్రొక్కువారును ప్రాణా
చారము లెల్లెడ నొరిగెడు
వారిలు తీర్థములు వచ్చువారైరెందున్. 55

సీ. అభయంబులిచ్చు మాయిభరాజవరదున
కుభయంబు లొనరింపుచున్నవారు
వెఱవులు మాన్పుమా వేంకటేశ్వరునకుఁ
జరువులు భయభక్తి జరుపువారు
ఘనయోగిజన సమావనయోగి కనుమ్రోల
వినియోగములు సేయుపనులవారు
దురితరు జౌఘవైద్యునికి హృద్యంబుగా
నునివేద్యము లొసంగఁ గనెడువారు

గీ. పరులఁ బొరిఁగొను జోదుకు పరులు నరుల
దోసములు దోసునయ్యకు దోశ లలరు
నప్పనికి నప్పము లతిరసాధిపతికి
నతిరసంబుల నిచ్చువారైరి వరుస. 56

సీ. బడలినవారికి వడపప్పుపానకా
లనఁటిపం డ్లోపిన యన్నిగలవు
యెళనీరు బిసనీరు లెందుహేరాళంబు
నీరుచల్లయుఁ బెరు గపార మచటఁ
గప్పురగంధంబు కైరవల్పట్టీలు
తట్టుపునుంగును జుట్టుపూవు
లెందువేడినవెల్ల యేచప్పరంబున
విప్పైన గొడుగులు విసనకఱ్ఱ
గీ. లేలకులు శొంఠియును లవంగాలు పనస
తొలలు చెఱుకులు ఖర్జూరఫలము లెన్ని
వేడినను గొండనుచు జాటు వేంకటేశు
భక్తజాలంబు తిరునాళ్ళ ప్రజకు నపుడు. 57

సాయంకాలవర్ణనము


మ. అపరాహ్ణంబను వర్ణకారుఁడు ప్రతీచ్యంభోజపత్రాక్షి క
చ్చుపడన్ జందురుకావి యంబుదపటస్తోమంబు నన్నించఁగా
నపరాబ్ధిస్థలినుంచు కుంకుమరస వ్యాకీర్ణకుంభంబునాఁ
దపనుం డస్తవసుంధరాధరము చెంత న్నిల్చి గ్రుంకెన్వడిన్. 58

సీ. గఱులు చుఱుక్కవ నెఱసంజకాకసోఁ
కిన వెఱఁగంది యీకియలు ముడుచు
ముడిచి కౌఁగిలి పెంటి సడలించి నిట్టూర్పు
నిగుడ మోమీక్షించి దిగులుఁ జెందుఁ
జెందిఁ వాపోవుచుఁ జెంతఁ ద్రిమ్మరుపెంటి
దఱిమి మెట్టగఁ జేరి వెఱచి మరలు
మరలి బిల్చుచు తొల్లి మమతఁ గూడిన తన
నెలవులు మూర్కొని కలఁకి యొరలు

గీ. యొరలి తూటలు కసిగాట్ల కొఱికి నిలుచు
నిలిచి పెనఁగొన్న నాచుతీఁగలను డాఁగు
డాఁగి విరహభరమ్మునఁ గాఁగి కుందు
కుంది యబ్బుర మొందెను గోక మొకటి. 59

సీ. అఖిలప్రపంచమహాభూతమోహిని
మునిజనానుష్ఠాన ముఖ్యవేళ
స్వైరిణీపుణ్య సాక్షాత్కారదైవంబు
చోరావళీభావిశోభనంబు
కలితనిశీథినీ కాళికా జనయిత్రి
కమలామయావహక్షతజ పూర్తి
మందేహ గృహ కుంకుమ స్ఖానకసమృద్ధి
యస్తా గదావాలనాభివృద్ధి
గీ. ఘనపలాశ కుసుంభ కోకనద బాల
కిసలబంధూక హల్లక విసర గైరి
క చపలాదాడిమీ సుమకాంతి యనఁగ
గగనతలమున సాంధ్యరాగంబు దనరె. 60

యతిభేదకందము


క. వలసినమేవులు గొని కా
ళ్ళు లావులును నిక్కులించి దుక్కెగరిపయిన్
బులుగులు చట్టుపలార్చుచుఁ
గొలకొలమని కూఁత లిడుచు గూడులు సేరెన్. 61

ఉత్ప్రేక్షాలంకారము


క. అరబాలు సంజకెంపున
నిరవై దనరారి కడమయిరులను సాబాల్
కరిబరగుచుఁ జద లత్తఱి
గరిగల గురువిందగింజకైవడిఁ దనరెన్. 62

క. కాకోల ఘనాఘనఘన
కాకోల ఘనాఘనౌఘ కలహంస శిఖి
శ్రీకంఠ కంఠ భానిభ
ఘూకప్రితనుతమ మలఘు దిశలఁ బర్వెన్. 63

స్వరూపోత్ప్రేక్ష


సీ. ఇనుఁడు గన్పడ నిసుళ్వెఱిఁగి మందేహులు
కొంచక నిల నల్లుకొని రనంగ
సకలంబు నాక్రమించుక నొక్కరూపమై
పరఁగిన మాయాప్రపంచ మనఁగ
జారవాంఛిత మహీజాతముల్ శోభిల్లఁ
బ్రాపించు దోహద ధూప మనఁగ
విరహులపై దాడి వెడల వేయించిన
మారుని నీలగుడార మనఁగఁ
గీ. గటికి చీఁకటి పుడమి యాకసము జత యొ
నర్చి కాటుకబరిణచందమునఁ జేసి
చెలఁగు నభిసారికల దీవనలనఁ బెరిగి
సూదిమొన కెడమీక హెచ్చునను నెరసె. 64

తే. రాజు చనుదెంచు నని నిశారమణి యప్పు
డింద్రనీలఁపు మణిపాత్ర లిడిన సోబ
నంపుటారతి తెలిముత్తియంపు గుంపు
లనఁగ నభమునఁ దారక లతిశయిల్లె. 65

అపూర్వప్రయోగము - స్వరూపోత్ప్రేక్ష


సీ. నిక్కుతమశ్శాఖి నెగసి యంతట నుండి
పొడచూపు మిడుగురుపురువు లనఁగఁ
గాల కృష్ణ మృగాంక కలితమై గనుపించు
బెడిదంపు తెలిచాయ పొడ లనంగ

యజ్ఞవరాహ దేహనిశాతరోమజా
త స్యూత గగనరంధ్రము లనంగ
దట్టంపుతీవలు చుట్టుకయున్నట్టి
పొదలపైఁ జూపట్టు పూవు లనఁగ
గీ. దేవతల వీటివాకిట దివ్వెపండు
వులకుఁ బెట్టిన దీపాలకళిక లనఁగ
నాకసంబెల్ల మెల్లన యావరించి
మినుకు మినుకునఁ జుక్కలు మెఱయఁ దొణఁగె. 66

అపూర్వప్రయోగము - ప్రకృతాప్రకృతశ్లేషము


సీ. నీలాంబరాన్విత లీలచే రాణించి
సద్బలాఢ్యతను నిచ్చలు వహించి
యాశ్రితద్విజరాజి ననయమ్ముఁ బోషించి
పాండుతనూజ సంపత్తి గాంచి
పరచక్రఖేదన పటిమను గనుపట్టి
పంకజాతమ్ముల బస నడంచి
అతులి తొత్తాలంకగతిని చాలఁ జెలంగి
శీతోల్లసత్కర ఖ్యాతిఁ దనరి
గీ. రేవతీపతి సంజ్ఞ ధరించి మఱియుఁ
గమలజుండునుఁ హరియు శంకరుం డనంగ
బుధభృతిఁ దగి సుదర్శన స్ఫురణఁ జెంది
కృత్తికాయోగమున మించి యిందుఁ డలరె. 67

హేత్వాలంకారము


క. కమలములకు గుముదంబును
గుముదములకు ముదము మదచకోరవితతికిన్
బ్రమదంబు కోకముల క
ప్రమదంబును గాఁగఁ దుహినభానుఁడు వొడమెన్. 68

క. తనయుఁడు గలిగిన ముదమున
వినుముట్టె సుధాబ్ధియందు విలసిల్లెడి య
వ్వనజాయతాక్షుఁ డోయనఁ
గనుపట్టిన చందునందుఁ గందు జెలంగెన్.

సమాసోక్త్యాలంకారము


మ. రవి యస్తాద్రికిఁ జేరె నంత శశియున్ రాగాత్ముఁడై తమ్మి లే
నవలాశీతకరంబులం దొడరినన్ నాథుండు గామీసుదోఁ
చు విధంబున్ దగమోడ్చెఁ దమ్మివిరు లచ్చో నవ్వెనాఁ బూఁచెఁ గై
రవిణుల్ తానవమానియైనగతి రేరా జొప్పె వెల్వెల్లనై. 70

ప్రకృతాప్రకృతశ్లేష వ్యతిరేక యుక్త హేతూత్ప్రేక్షాలంకారము


సీ. పద్మాప్తతనయా కబంధ రోచుల మించి
నీలాంబరద్యుతి నికర మడచి
పటుతరానంతభారాలి బిట్టదలించి
నారదస్ఫుటకాంతి నగుచుఁ ద్రుంచి
నీలకంఠప్రభాజాల మంతయుఁ గేరి
దాక్షాయణి విభాతతిని మీఱి
భీమకర్బుర గురుధామరేఖ నదల్చి
హరిమణి దీధితిఁ గరము గెల్చి
గీ. జారచోరాదరస్థితిఁ దేరె దీని
కనుచు తా నిత్యపరిశుద్ధ మగుట చటుల
భయనిధానంధతమసకబళనమునఁ బి
చండిలంబగు పండు రేయెండ గాసె. 71

క. కందు బలుకాపుఁ బెట్టుక
జెందొవరా మాంత్రికుండు చీఁకటిదయ్యా
లందఱుమఁ బూది జల్లిన
పొందిక వెన్నెల జెలంగె బుధులు నుతింపన్. 72

క. అంతట జంద్రాతపము ది
గంతము లన్నిండఁ బద్మజాండము తళుకున్
దంతపుబరిణ విధంబున
వింతై కనుపట్టె భువన విస్మయలీలన్. 73

వ. ఆ సమయంబున-- 73

సీ. జీవరత్నప్రభ జెలఁగు దివ్యవిమాన
పంక్తినాఁ దేరు దీపములు వెలుఁగ
ఘనపద్మరాగమకరతోరణములు నాఁ
దిరుదండె దీపముల్ దేజరిల్ల
నిజవాహఫణిఫణానిర్యన్మణిద్యుతు
లనఁగ నిచ్చెనపంజు లతిశయిల్ల
నీరార్పితమణి నీరాజనములు నా
నేనికపంజు లెన్నేనిఁ జెలఁగఁ
గీ. బ్రతిమగమి చేతి దీపికల్ బరిఢవిల్లఁ
గొలువుదివిటీల కోటానుకోటు లమరి
వరుస గన్పట్ట నుభయపార్శ్వముల భక్త
దత్తసామ్రాణిధూపముల్ దనరె నపుడు. 74

సర్వలఘు రూపసమసీసము


సీ. నిఖిల సురదనుజ నికరమధిత జల
నిధిభవ ఘుమఘుమ నినద మనఁగ
నభినవ ఘనసమయ సముదయ దశ ని
లసదమిత పెళపెళ రవ మనఁగ
సహరహగమనట దభవకర ధృత ప
రఢమరు ఢమఢమ రణిత మనఁగ
ఖల కనకకసిపుదళన విహరణ నృ
హరి భయద కహకహ రుత మనఁగ
గీ. దతతుహిన మహిధదర తటపదతులిత
గగన సరిదిదుత బహుళ ఘళఘళ మహి
మ యనఁగ దివిభువి నెనయు రయము మెఱయ
రహి వెనుకొని నిజపటహరభటి నిగుడ. 75

శబ్దస్ఫురణము - అపూర్వప్రయోగము


ఉ. వేంకటశైలభర్త తిరువీథుల రా వినిచెన్ దృఢంబుగా
బంకజసంభవాండఘటపంక్తి హటద్దళనోగ్రబాణ యం
త్రాంక ఫెడీల్ ఖణీల్ ఫెళఫెళాదిఢమిండమి డబ్బుడబ్బు ఢా
ఢంకరణ ప్రచండిమ విడంబిక డంభ విజృంభితార్భటుల్. 76

సీ. ప్రళవభైరవ హస్త పటహపటపటధ్వ
నులు బలుపెట్లు గ్రోవుల తతులును
మహి డిగ్గి సేవించి మరలు నింద్రునిఁ గొల్వు
పంజులౌ నక్షత్రబాణములును
పనిబూని చక్రంబు బహురూపలాస్యవి
భ్రమమందె ననఁ జక్రబాణములును
పరిచరణాయాత తరణి చంద్రప్రభ
లన తదీయజ్యోతుల గణములను
గీ. రోదసీ సరసీజలపాదపద్మ
కుముదరూపము లాకుంచ కోలగముల
చెలఁగు బిరుసులు పగలు వత్తులుగ నమర
బరఁగు బహుచిత్రబాణవైభవము గనుచు. 77

జాతివార్తావచనము

వ. వేంచేయు నవసరంబున గురు మహాప్రధాన మాండలిక సామంత సేనాపతి ద్వారపాల కావసంక ఘటికా నిర్ధారక గణక లేఖక పౌరాణిక పురోహిత జ్యోతిషక కావ్యజ్ఞ విద్వద్దేవార్చక మాల్యాకార పరిమళాకార గోష్ఠాధికార, గజాధికారాశ్వాధికార వస్త్రాధికార భాండాధికార ధాన్యాధికార్యంగరక్షక సూతసూద చాణూరబేతాళమల్లతాంబూలిక తాళవృంతిక నరవాహక చాత్రిక చామరిక కాళాచిక కరదీపికాధారక కఠారిక కారవాలిక పాదుకాధారక నర్తక గాయక వైణిక శాకునిక మాగధ వైతాళిక స్తుతిపాఠక పరిహాసక క్షౌరక రజక సౌచిక చర్మకార ముద్రాధికార పురపాలక వనపాలక నరవైద్య గజవైద్యాశ్వవైద్య పశువైద్య భేరీవాదక మురజవాదక కారక స్వర్ణకారక శిలాచ్ఛేదక కాంస్యకారక కుంభకారక చిత్రకార వ్యావహారిక జాలిక మృగయార్థి పక్షిపోషకులును, ఫణిహారులు రాయబారులు నుగ్రాణంపు తెగలు కెవనిబంటులు వేశ్యాజనంబు లనియెడు డెబ్బదిరెండు వినియోగంబుల వారలు నలుచెఱఁగుల గొలిచి రా, బహువిధచిత్రబాణ యంత్ర ప్రావీణ్యాలోకన కనత్కౌతుకాయత్తచిత్తులై తొలంగంద్రోయరాని సందడి దలంగి చన నియమించు కాచనం కలధౌత వేత్రపాణుల మునుకొను వింజామరల క్రోవుల యంత్రధారలవలనఁ గలగుండువడు వారును వేఱొక్కదిక్కున కోరనేల కోరనేల యనిపించు వీక నుదురుల నున్నని సన్నపుఁ బూదిరేకలు జందెపువాటుగా నీటుగానఁబడ మెడల వెండి గొలుసుల సజ్జగుసజ్జలు, జవ్వాది మెఱుం గేర్పడఁ గనిపించు పడగల బెడఁగు క్రొమ్ముడులు దాడిమపూవిత్తులపై దాడిమీఱు వీడెంపు బలుకెంపు నింపు పలువరుసలు ముక్కుల తళుకులు పొదలికల నెన్నడల కులుకులు గల బలిజకన్నడ మిటారులు, కుందనపు బిందియల యందంబు క్రిందుపఱచి పచారించి సరిబిత్తరిద్రోయు క్రొంబసపు మిసిమి నిబ్బరపు టుబ్బుసిబ్బెపు గబ్బిగుబ్బలు యపరంజి నక్కులవలె రంజిల్లు మంజరి కాపురూపు చెక్కుల, యలరుటమ్ముల రుటమ్ముల యలరుటమ్ములు చూపుఁజూపువాలిక చూపుచూపులు చికురాకు పొగరు జిగివగ తొగరు నూకుటడుగుల జోడించిన పాలవెండి పాగడమ్ములు మినుమినుకను పెనుమిణుగురుఁ బురువులు గిరికొన్న తాపించ గుచ్ఛంబుల దినుసున నెఱసంజజిగి గురుగింజల మెండుకొను కొండెలు గల చోళవిలాసినులు, పంజులవలె వెలుంగు మానికపు పంజుల కమ్మలు యరికమ్ముల గోరజపు టారజంపు తిలకంబులు కప్పురాల బరణుల యొప్పు రాలజేయు నిడుదవేనలి నూనెముడులు చూచువారి పెదవులకుఁ జవు లొదవించు నాణంపుటాణి సుప్పాణి ముంగురులు గల గుజరాతి హొంతకారులును, మకరధ్వజుని కొంప యొకచెంప జీరుమడిచారలమీఱు జిలుగుటంచు మణుంగు కుడివంకపైటచెఱంగులు పంచబాణుని యర్ధచంద్రబాణంబులన శోభిల్లు నాభినామంబులు చిక్కెంటలఁ జిక్కెడలించిన నూనె నీటు మెఱుంగు కొనవాడి చిలుకముక్కుం గోళదువ్వి పొంకపఱచిన డావంక చెవిగప్పుజాఱు గొప్పుల పూసరంబులు మగల గికురించ కంకణంబులు గట్టినరీతి నత్తమిల్లు పుత్తడికంకణంబులుగల సాతనిజాతి నీటుకత్తెలాదిగా నేతెంచిన నాయావిలాసవతులు నాలిమగనాలి గుంపులొకరికొకరు కేలుకేలున గీలించి తమతమ చెంగటి కోడెప్రాయంపు గోవాళ్ళకుఁ దిరునాళ్ళచూచు వేడుకలలోఁ బిసికెళ్ళఫలము కల్పించ నుపాయంబు లెంచి తళుకుబెళుకు చూపులసైగల జెదరి బెదరిచూచి చెరువుల మెరుపుల బొల్ప పట్టయిన మేరువులంగట్టిన కదళికా తరు ఫలముల జతగూర్చ పుండ్రేక్షుకాండంబులంగని యవురా చెఱకులఁ బండ్లు బండెన్ గంటిరో యనిన నచ్చెంతనె జేరి జారువాటుగా నోరమోములఁ దెలియవేడి యేమేమి యెక్క డెక్క డనిన నచ్చిలుకలకొలుకులు వలకారి కలికి కపురపుఁ బలుకుల జలజలన యొలుకు బలుకులును బంగారు బొంగరంబుల హొరంగుల రంగుల తురంగలించు పొంగారు చన్నుంగవల తెఱంగులును, రత్నాంకిత తాటంక రుచులు తలంకక లంకెలు గొన నలికించు నకలంక సాంకవ పంక సంకలిత సంకుచిత రేఖాలంకరణంబులై యిరుగెలంకుల కుంకుమపు సుంకుల వెదచల్లు బింకపు చంకల పొంకంబును, చూచు నాసలి పైకొని యిట్టుట్టు నెడతెగిపోలేక పునుఁగు పిల్లులవలె చుట్టునుం దిరుగుచు నఱచేతుల కసిదీరఁ దోపుదోపుల బాలికల పాలిండ్లు పిసికిళ్ళం బట్టి నొక్కుచు గ్రుక్కిళ్ళజిక్కు సుకుమార విటకుమారుల వలనను, మఱియు నొక్కయెడ నెడమీనిమానిసి యుక్కలజిక్కి యువ్వ పాతఱలను మక్కినక్రియనూర్పు గాడ్పుల కవకాశంబు లేకునికి తమలో దా రొకరికొకరు పదరికొని పట్టునూలియల్లిక చేత్రాళ్ళగమకంబులును కటిసూత్రంబుల రసఘుటికల డంబులును సందిళ్ళమణుల తాయెత్తులును, జరాసులా యెత్తులును, గచ్చుకేడెమ్ములును మచ్చు వీడెంబులును నిలుపు మందుల కరాటంబులును, బయిటి బరాటంబులును నులిగొన్న కోఱమీసాల కనుంగొను గిరువు చూపులకోపులును, మచ్చువగలుజేయు మబ్బురాయుంటల మేపులును, మెలిబెట్టిచుట్టిన ముంజేకోకలును అగ్గలికలవేయు కేకలును, అంకుశపు టలుగుల క్రింది కొంకుల ములుకులుగ తగులుకొనిన యినుప సరిపెణల పెనఁకువగల యిఱ్ఱికొమ్ము సింగోటుల గుప్పుడులును కొండబూరుగ మాని చేవ కొఱడుల ద్రిప్పుడులును, పూలతురాయీల రాణించు చేకత్తుల గిలగిలలును, ఢీకెంతపాయంచు నగెడి పొగరు నగవుల కిలకిలలును వన్నెలాడాపట్టంపు జూపట్టు పటికెంపు జంబువాలును, పెక్కు లొక్కని పలుకు పికిళుల కేలును మడిమలు సోఁకనేగు పుటము లెగరుట వలనం బటువులగు పిరుదుల మురువు సగం బిరుదుగాఁ గనుపింపఁ బిక్కటిల్ల తొడగినట్టి నరిగకంగుల కూరుపుపనికవురు పరకాళి యొంటి పొర బిగువు నిడుదకాసెల రాగిల్లు గుల్లకావిగోచి చల్లడంబులపైఁ జుట్టిన గంధకావిదట్లు పొరలవరలు ముదురు బదనికల దనరు నరపెట్టులును నెన్నుదురుల వలపుల గొలుపు జేగుఱుకావిబొట్టుల చిట్టెలును పెద్దగోతమ్ము మురళించుట కతన టోడుగ్రమ్ము నురమ్ములమీఁద ననుపు వెలవెలు మోదుగమొగ్గచాయ నిగ్గెడి కురువంపు మొనవాడి గోరంట నొత్త లత్తుకకెంపు నెరసిన యలతి గాయమ్ములు మాయుటకుఁ దీఱిచిన తమ్మిమొగడ లందపు గంధపుపట్టెల హరువులును, చెవులుకుం జవులనించు ముత్యాలయొంటుల కమరిన మగఱాల మురువులును, కెమ్మోవుల పచ్చిగంటుమాటుటకు వహణించిన రవిక సరవిమణుచు మడుపులు సగము మునిపంట గొఱికి నెక్కుటెక్కులును చదరు వదరుల పిక్కలును నిడురలేమిం దేలగిలు కడకన్నులం గనుపట్టు కట్టెఱ్ఱ మఱుంగుపరచుటకు ఘటిియించిన చలువ కలువ విరిబంతులు హత్తించు దత్తులును యెదురవారలు బలిమి వళుకులు వైచి పంతముల కొలారిక లంపెడి జిత్తులును చంపలజాఱుసిగల కులీశముల ముళ్ళ నావరించిన కత్తర వరుస పూవుటెత్తులపైని బొమ లఱ నిక్క గట్టిన జిలుగు కురుమాలదంపు దసిలీక సీదురుమాలుముచ్చుంగుల బురుసాకుచ్చురింగులును జంటనేస్తగాండ్రచేతి తిపిరికిన్నెరల టింగుటింగురులును, చౌశీతిబంధపు వ్రాతపని ప్రతిమల చుట్టంచు చందురుకావి దుప్పటి బంగరుచెఱంగుల వలెవాటులును బింకపు నెమ్మేనుల నీటులును బేరజపు టారజపు తందనాల పదమ్ములును వింతవింతలుగాఁ జూపట్టి మీఱ రంగారు బంగారు సింగారపు గొలుసుల దండమానపు పదమ్ములును టెక్కగు చెక్కుల జవ్వాదిమేలు మేలుపట్టీలును నెడనెడ నడుగులు తడబడ తొడలనడుమ తడిబట్ట మేలిపట్టు కీలుకీలును, హోంతకారులపై బడి ముడిగి రెండుమోచేతుల పోటుల గరిబడు రీతులును గర్వాలా పదనవదన ఛూత్కారంబుల గంధసింధురంబుల కైవడులు ననుకరించి సమదండ గజదండ భృంగిదండ యెడుమయోరభృంగి కుడియోరభృంగి భృంగపటలముపై సరపుదండ సింగపుదండ పొదలికదండ యడుగడుగు పొదలికదండ మద్దెలసంచు కుక్కుటపుదండ మొదలుగాఁగల పదిరెండుదండలును; యెడమడుగు పరువడి కుడియడుగుపరువడి కదలుపరువడి దాటడుగుపరువడి కోవుపరువడి యొంటియడుగుకత్తెర సర్పబంధకత్తెర జాగెనకత్తెర పొదలికకత్తెర చిట్టడుగుకత్తెర పావుపావు జోగినపావు మొదలుగాఁ గల పదిరెండు పరువడులును; హరిగతి గజగతి వ్యాఘ్రగతి మహిషగతి జంబుకగతి మర్కటగతి మాఖరగతి హరిణగతి చటకగతి పక్షికది తాండవగతి సరసగతి మొదలుగాఁగల గతులు పదిరెండును; విష్ణుచక్రంబు రామబాణంబును నాగబంధంబును తొలకరిమెఱుపును అల్లినుత్తును విస్సందు హస్తాభరణంబును పదఖండనంబును నురిత్రాడును లోబిత్తరియు వెలిబిత్తరియు సర్పాంకుశంబును మొదలుగాఁగల పదిరెండు గాయమానంబులును, లోమొన వెలిమొన యుశిమొన చదురుమొన పుణ్యంపుమొన పాపంపుమొన చాటగుమొన దాటడుగుమొన కదలుమొన యరమీటుమొన నెరమీటుమొన సరితాశంబుమొన లాదిగాఁగల పదిరెండు మొనలును, లోవెలిగజ్జుదుముకు చూరణనఱుకు మొదలయిన యిరువగల నఱుకులు; దారుధాణు దఢ యుద్భడ అంత్రటీక టీకనాట్యము ధారుఢాణ ఝాటుధాణు కపాలు దారుగపాలు ధాణు ధారుకఢాకు ఢాణుదారు ఝాటు మొదలగు పదునాల్గు విసరులు, కక్తి కొనడొక్కర ముత్తరడొక్కర కుమ్మరింబు జోడింపు సందుసీసంబును కొంతుమారును సమసీసమ్ము సురాటమ్ము చేబయు కందనంబును కర్లనంబును తొట్టను కిల్లియు బలి బడుటయు రొండివేటును పణంబును కర్నాతును భారంబును చొంగణయు పెట్లాగును రూణింపును సరిబిత్తరంబును లాగును వింటాలంబును తిణింగియు పాదనివారణము పదగశాప్తియు గళకత్తెరయు నృసింహంబును కాశినిలుకడయు నను ముప్పదిరెండు విన్నాణంబులును; దండనిల్కడ కదలుదుటు కలయు మెలఁకువ వింగళింపు దిశాపదిశలు పాదపుపారువ హస్తపుపారువ దేహపుపారువ నయనపుపారువ లివరాకడ యేకసరవైసర ఝంపుపిక్కు కరలాఘవంబు మొదలగు వితమ్ము లెఱింగి; అసి ముసల ముద్గ ప్రాసరోహణ కణయ కంపణ ముసుంఠి భల్లాతక భిండివాల పరశుగదా కుంతకోదండ కఠారిక తోమర త్రిశూల వజ్ర ముష్టి పరిఘాతల చక్రపట్టెస ప్రకూర్మ నఖర యోదండ నారాచంబులు లౌడి వంకిణి సబళ యీటె సెలకట్టె శిళ్ళను ద్వాత్రింశదాయుధంబులు, విచ్చలవిడి తచ్చెన కచ్చెలు దీసియు పెచ్చుమల్లాడియు గచ్చులు సేసియ హెచ్చుకత్తులు దూసియు ఘల్లుఘల్లురన నొకటిరెండు మొనలు బయలు చిమ్ములు చిమ్మి కమ్మిన ఝల్లుఝల్లన గుండెలదరి బెదరి ఝల్లున సందడివిరియ తెఱపిగని యిట్టలగు పట్టుల నిలిచి వీచు రొమ్ముముట్టెలును కావి దట్టీలును పులులెక్కిన యంగములు దుఱిం గరింప జూపట్టు కరమ్ము కరంబుల నిలువు సానకత్తుల నెగుభుజంబుల నిక్కనొరిగి పెక్కుబెరిగి యిక్కువెఱిగి మాయామోహిని వర్గంబు నుంబోని వారాంగనల కటాక్షమార్గం బపేక్షించు బిరుదు కెంచపుమాష్టిలచాలును, మఱియు నొక్కచొప్పున నుప్పరిగల ముంగని చప్పరంబుల మధ్యరంగంబున నొప్పులకుప్పలై ముత్యపుఁజిప్పల చొప్పున విప్పులగు కనురెప్పల కప్పు దప్పనరికి బవరి తరితీపు చూపు చూపు తీరువుల తదీయముఖ పంకరుహ భ్రమద్భ్రమరవిభ్రమంబు పుట్టించు ప్రతిభవనభూపాలాకావరోధ కన్యకల కరాంచల హేమపాత్రికల దేజరిల్లు కర్పూరనీరాజనంబులవలనను, నేత్రోత్సవంబై వెలయు వలయు వైఖరీమండలాకారంబుగాఁ జుట్టును దిరుగు వీణావేణు శంఖకావాళ పటహ ఘనఢక్కా డమరు డిండిమ నిస్సాణ జర్ఝరీభేరీ మర్దళ మురజ తుత్తుంబికాది బహువిధ నిరవద్య వాద్యనిర్ఘోషంబును, శశిముఖీశయకుశేశయాధిష్ఠిత శాతకుంభకుంభ ప్రదీప్తదీపంబును అరాత్రిక పాత్రధారిణి పరంపరామంజుమంజీర సంజాత సింజానుపుంజరంజిత మణిమేఖలాఝణఝణత్కారంబునునై జూపట్టు తటిత్తు వేడుకల గైకొని గోవిందలిడుచు యెద్దులపై తమ్మటమ్ములు తిడిమి తిడిమని మ్రోయవేయుచు వచ్చు రోణంగి దాసరుల గంతులు గని నిజదివ్య త్రిభువనావనభవనాంగణంబున వేంచేసి తదనంతరంబున. 78

సీ. అలమేలుమంగామనోబ్జభృంగ పరాకు
యహరహర్దానవహర పరాకు
శ్రీతిరుపతిమహాసింహాసన పరాకు
దివిజాధినాథవైభవ పరాకు
సకలభక్తజనరక్షణవిచక్షణ పరాకు
జరవందితపదాంబుజ పరాకు
కమనీయసందీప్తగరుడవాహ పరాకు
శతకోటిమన్మథాకృతి పరాకు
గీ. దేవర పరాకు తిరుమలాధిప పరాకు
మాయురే! స్వామి చాఁగు భళా యటంచు
మాగధులు చేరి సముఖంబు వేగవిప్ప
నలువుమీఱంగ నిజవాహనంబు డిగ్గి 79

సీ. ఒకచోట మునికూట సకలప్రణుతి ఝాట
మొకమేర నతిధీర సుకవిదార
మొకదండ వేదండ నికురుంబ హయకాండ
మొకఛాయ ఘనగాయకకృతగేయ
మొకసీమ నిజధామ చకచక ద్యుతిభూమ
మొకమూల భూపాల మకుటజాల
మొకపొంత శశికాంత నికరాజితప్రాంత
నొకక్రేవ నటభావ సుకరరావ
గీ. మమర నమరీశయ కుశేశయాభిరామ
చామర సమీరణార్చక చలిత కైశ్యుఁ
డగుచు వేంకటభర్త సింహాసనమున
నిండుకొలు వుండెఁ గన్నులపండువుగను. 80

అపూర్వప్రయోగము


చ. సరిగ సలాము చేసి ముదిసన్నపుత్రాళ్ళు ధరించి మల్లుకై
బిరబిర తానకంబు లివిడి పేర్కొని మీసలు దువ్వి బిత్తరిన్
జొరవకు చొచ్చి వ్రేశి బరి చొంగణసీసమకక్తి చేబయున్
గరవళము న్నృసింహమును గైకొని జెట్లను గాంచి వెంబడిన్. 81

సీ. కంబము కొడిదెలాగను డొల్ల తాటిదం
డములు త్రోయంగ రెట్టల గమకము
సంగడాల్ బూన బుజాలపు రాయంబు
బరిలోడు ద్రిప్పు మేల్బరుల యుబ్బు
బలుగోతమయి రళింపగ నురంబులటోకు
పడి తాళములు సేయు తొడలకంటె
మొరపుగ తిరుపట్టె కురుచలెత్తఁగ పొంచ
ముల లాడు డంకలు బొరల మెడల
గీ. బలిమి గనిపెట్టి గంధపట్టె లెఱమట్టి
కావి తిరుకాశదట్టులు గావుబొట్లు
మొల్ల సరులొప్పు చరిత్రాటి పిల్ల జుట్లు
పెద్ద చేత్రాళ్ళుగల జోడు బిరుదు జెట్లు. 82

తే. కడఁగి దిశలు ప్రతిధ్వనుల్ బొడము నటులు
గా మిగులు మల్ల జఱచి సలాము లిడుచు
ముందఱను నిల్వఁగా డసదంది తత్క
రమ్ము లిరుగేలఁ బూని పరాకటంచు. 83

చ. విడిచినయంత మల్లులటు వెన్కకుఁ జెంగున వింగడింపుచున్
బడిబడి మీసలంటి మెలిబట్టుచు దండల నిల్చి కమ్ముచున్
బిడికిళు లూది పట్టుకొని బిట్టుగఁ గేకలు వేయుచున్ బొమల్
ముడిగొనఁ బండ్లుగీటుచు సముద్ధతి చేఁజేయిసోఁక మీఁటుచున్. 84

క. భాయీ యిదెయొకనుడిలో
మాయనుపించెదను చూడుమాయని కరిమై
చాయఁగని ఱొమ్ము గ్రుద్దిన
చాయగ గ్రుద్దుటను పెట్లు సరిగాఁ దాఁకెన్. 85

సీ. అత్తఱిఁగల బడిబిత్తరులను హత్తి
చేతుల దట్లకాశెలను జేర్చి
సుడిగాలి తిరగెడు వడుపున వడిజుట్టు
కొంచు వైలాన లాగించివ్రేయు
వ్రేటులో లాగించి వ్రేసి సమమ్ముగాఁ
బుడమిపైఁ బడియంటు లిడకలేచి
మెడలపైఁ గర్నాదులిడి పులుల్ వలెత్రాటఁ
జిక్కి నఖమ్ములఁ జిమ్ముకరణి
గీ. రెమ్ముచును పొంచములు గూర్చి రెండుకడల
నిరికి గళకత్తెరలు గట్టు టెఱిఁగి కూడ
తిరుగఁబడి కురుల తగరుల్ ఢీకొనుగతి
నురిది తలఁ దలఁ దాఁకించు నొకరికొకరు. 86

ఉ. కొక్కెసచే బిగింప మెడ గొబ్బుల కేల్వడిఁ బెట్టి దీసి మే
ల్కక్కిత బట్టి త్రిప్పి చెయి లావును డుస్సుక రెండుప్రక్కలున్
జొక్కరసందు వ్రేయఁ దొడనొక్కుచు సందెడఁ జేసి త్రోసి వెన్
జక్కి సురాట మెక్కివడి జాఱి గడంబడ డింక బొర్లఁగన్. 87

సీ. వడిగ కర్లమునకు వచ్చి చక్కఁగ కాళ్ళు
వెనుకకు నిగుడింప వెంబడిగను
మోకాళ్ళు వంచి తెప్పున బొటవ్రేళ్ళచే
తిరుకాశ డూర్చి యెత్తి పొరలించి
సరసుక యోర రాఁ బరిబడి పొరలించి
యొకకేలఁ గుత్తుక నొడిసిపట్టి
ముడిగి గడ్డముక్రింద ముడ్డి యాడించి యం
కిణి గొట్టి సీసాన కిలిసి నిలువఁ
గీ. జంకలను చేతు లునిచి పై చక్కి నెత్తి
తలకు సందిలి తప్పించి తొలఁగిలేచి
వివసమాయించఁ జూచ యావీణ జెట్ల
కెలమి బిరుదు లొసంగి వీడ్కొలిపి యంత. 88

క. బిరుదుగల తులువ లిరువురు
నెఱమట్టి మెఱుంగు దట్టు లెగచల్లడముల్
బరగంగ బొందెకోలల
హరిగలు తాటించి మ్రొక్కొయారము మీఱన్. 89

క. పొదలుచు నొండొరు చలమునఁ
బెదమీసల దీటుకొనుచుఁ బట్లాటకు బె
ట్టిదమగు గేకలు వ్రేయుచు
కదియుటకై దండబూని కలనిల్చి తమిన్. 90

ఉ. పెట్టినదండ దియ్యకొక పెట్టునఁ బై బడనియ్య కోరఁగా
గట్టిగ బట్టినట్టి హరిగల్ వెలిలోనుగ ద్రిప్పి యొడ్డి కేల్
బొట్టిలకోలలన్ మొనలు చోరకు ఱొమ్మునకున్ మొగానకున్
బిట్టుగఁ దాఁకఁగా బొడిచి పేరమ వారుచు హెచ్చరింపుచున్. 91

ఉ. గిబ్బ లెదిర్చి కొమ్ముల ఢకీలుఢకీలునఁ గ్రుమ్ములాడు దా
రబ్బికయైన చిత్తరులహత్తి బెనంగుచు బొందెకోల బల్
దెబ్బలు ఖేటకోపరితతిన్ గళిపెళ్ళుగధాఁరఁ బోరి పె
ల్లుబ్బుచు వింగళించి తగనుద్దిగ నిల్వ బహూకరింపుచున్. 92

వ. తదనంతరంబు

క. సంగీతపు మేళపు జత
సంగతి తాళములు నాగసరములు ఢక్కీల్
చెంగులు ముఖవీణియలు ను
పాంగము తప్పెటలు గజ్జలందుక చేరన్. 93

మ. ఎకతాళంబున వీరమర్దళరవం బేకంబుగా నట్టువుల్
ధికతోం తత్తక ఝంకు ఝంకు కిణతాం ధిత్తాంకియల్లో ధికు
ద్ధికు తెత్తెయ్యధిమిక్కు తక్కుధిగుతాంధిత్తాత్త తాళంబులన్
గకుబంతంబుల మాఱుఁబల్కు కొనుగోల్పట్ట నప్పట్టునన్. 94

సీ. భైరవ శ్రీరాగ బంగాళ హిందోళ
మాళవులును రాగమంజరియును
భూపాళ గౌళు లన్భురుష రాగాష్టకం
బహిరి లలిత బిలాహరులును
గుజ్జరి మలహరి గుండక్రియ వరాళి
దేవగాంధారియు దేశతోడి
దేవక్రి కురంజి దేశాక్షిరామ క్రి
యాంధాళి నాట ధన్యాసి పూర్వ
గీ. గౌళ సారంగ మంగళ కౌశికులును
కన్నడయును చాయ గౌళ కడు నపూర్వ
మైన భల్తాతకియును నారాయణియును
గ్రమత నిరువది నాల్గు స్త్రీరాగములును. 95

సీ. కాంభోజియును గుమ్మకాంభోజియును సింధు
రామక్రియయు నందనామక్రియయు
రామక్రియయు మేళరామక్రియ వసంత
సామంతి శుద్ధవసంత మధ్య
మాదులు సామంత మలహరులును చెంచు
మలహరి ముఖారి మాళవియును
గౌళనారాయణ గౌళవసంత
వరాళిపున్నాగ వరాళిశంక

గీ. రాభరణమును శోకవిరాళి మేఘ
రంజి గుజ్జరి పంతువరాళి నాట
జౌళి దేశాక్షి తోడివరాశి శ్రీవ
రాళి హెజ్జజ్జ కేదార గౌళిపాడి. 96

తే. రీతిగౌళయు నీలాంబరియును ఘనము
దనరు హంవీరనాటయునని నపుంస
కములు ముప్పదిరెండు రాగములు మఱియు
దేవ మలహరి సాహరి రేవగుప్తి. 97

తే. మాళవశ్రీయు సాకొండు మలహరియును
కోనమలహరి నానైదు గూర్చి పంతు
లాదిగాఁ గల మిశ్రంబు లన్ని మదికి
నరిదిగన్పట్ట వినికి సేయంగఁ దెలిసి. 98

సీ. గానంబునకుఁ బ్రతిగాన మెందునఁ జతు
ర్దశరాగదోషముల్ రహిని విడిచి
సరవి ముప్పదిరెండు సంచారము లెఱింగి
పదునార్గు మూర్చనల్ పరిహరించి
దైవతషడ్జగాంధారనిషాదపం
చమమధ్యమఋషభస్వరగణముల
క్రమముతో మంద్రమధ్యమతారకంబుల
మెఱయింపుచును శత్రుమిత్రరాగ
గీ. విధములను వేళలను జతుర్విధసులక్ష
ణములు భరతము ఛందఃక్రమమును దెలిసి
పొసఁగఁ జంఛత్పుటము చాచి పుటముఖముల
మేర నూటొక్కతాళంబు వేఱుపఱచి. 99

సీ. ఘుమఘుమ మధురనిర్ఘోషంబు రాణింప
ననురాగమున మైత్రు లనుసరింప
స్థాయీక్రమగ్రామసరణి నిరూపించి
ఘనదేశ్యశుద్ధవైఖరి నటించి
సమయోచితప్రాణసంవిధాన మెఱింగి
యంగచేష్టాదోష మపనయించి
పవనజయవ్యాప్తిభావంబు సమకూర్చి
ముఖవికాసారూఢి మొనయఁజేసి

గీ. ఛత్రకత్ర జౌధారణి ఝంకె సరళి
పాటసైసిక యుపఝంకె మీటుకంపి
తాహతంబులు హుళియుఁ బత్యాహతమును
స్ఫురితములు వాద్యము లనయ సరణి మీఱి. 100

చ. సొలపుగ నిర్ఫద్తెదు విడిచూపులు నాల్గుమొగంబు త్రిప్పుతీ
డలవడ బొమ్మసన్న లొక యర్వదినాలుగుహస్తచేష్టలున్
వలనుగ కేకిహంసవృషవారణ కేసరి శుద్ధ సంగతుల్
వెలయుచు ముట్ట నేర్చి సరిరేమలలో బిరుదంది పొందకన్. 101

సీ. తనమ్రోల డిండిమధ్వని మ్రోయ నలుగడ
బెళుకుచూపుల భుజంగులను గాదఁ
గులుకు నెన్నడల రాగిలుకుటందెలసద్దు
నటుల కాదిమతాపటిమఁ జూపఁ
జెలులకు నర్మోక్తిఁ దెలుపుచు చేయుకేల్
కదలిక తచ్చాస్త్రగరిమ నెఱప
నీటుసింగారపు నెమ్మేనిమై సరి
విరివింటి దొరనైన మరులుకొలుపఁ
గీ. బట్టుచాలని ఱవిక చన్గట్టుదెగడు
బిగువు సిబ్బెపుగుబ్బచన్నుఁగవ యుబికి
పైఁటజార్పఁగ నుడిగపుఁబడతి దిద్ద
మురువుగ నెసంగె నొకజగన్మోహనాంగి. 102

వ. నిలిచిన

సీ. మునుమున్ను భువనమోహనరంగమర్దళ
ధీరస్వరమ్ముల ధిమ్ము మనియె
నావెంబడిగను గాయనగాయనీమణి
గానమ్ము ఘమ్మున గ్రమ్ముకొనియె
నావెంటనె విచిత్రయవనికాగ్రవసంత
కుసుమముల్ ఝల్లన ముసురు చూపె
నావెనుక నటిపదాంగుష్ఠవిన్యాస
మున గజ్జియలు ఘల్లుమనుచు మ్రోసె

విజయవిలాసము


గీ. నంతఁ గనుపట్టెఁ గల్పశాఖాగ్రకిసల
నవ్యమణిముద్రికాకంకణప్రదీప్త
కోమలకరాంగుళీకటకాముఖైక
చతురలీలాభినయము విస్మయముగాఁగ. 104

క. తెర యించుక వంచినఁ జం
దురుకావిరుమాలముసుఁగుతో నింటిమొగం
బరతోఁచ నపుడు తళతళ
మెఱుపుం దీఁగె యనఁగాను మేసిరి యమరన్. 105

విలాసము
తే. సొగసు తలివాలు నునుసోగ సొంపు తళుకు
బెళుకు చికిలి యొయారంపుఁ బేరెముదుటు
సొలఁపు విడియంబు దేలింపు చుఱుకు టోర
కలికి బెదరెచ్చు చూపుల కలికిఁ జూచి. 106

తే. హరుని మున్నేయ మఱచిన యరిది శరము
మరుఁడు సమ్మోహమంత్రాభి మంత్రితముగ
నేసెనోయనఁ దెరయోరఁ జేసి వెడలెఁ
దన్మయావస్థ జనులచిత్తముల ముంప. 107

క. లయకోపు దృష్టియును నభి
నయ ముదుటుదరమ్ము మోడినయ మున్నతిరే
కయును బ్రమాణము హరువున్
మెయిసిరి యవళఘము మురువు మెలకువ యమరున్. 108

సీ. దిరదిరఁ జక్రంబు దిరుగు చందంబున
లగువు గన్వడ నడ్డలాగు లెత్తి
కడలినీటను పెంటికరుడు బొర్లు విధాన
కుఱుచగా ముంగలి మెరుము వైచి
కీల్బొమ్మరము జాట గిఱ్ఱును ద్రిమ్మరు
తెఱఁగున వేడెపు తెరువు గట్టి
నేల యురుమురుము లీల పేరిణి వగ
పదఘాతమున శబ్ద మొదవఁజేసి ప్రబంధరాజ వేంకటేశ్వర

గీ. యొరపుగాఁ దీగె మెరుపాని మెఱయుకరణి
కోపు పొదలిక విడుదల కోపుదీఱి
తమ్మి చిరవలిగదలు విధాన మే నొ
కింత యిటునటు బళికించి యంతమఱియు. 109

సీ. కయ్యడ కట్టిన క్రమములు వినుపించి
దేశి శుద్ధాంగముల్ దేటపఱచి
తొలుత సూళాదుల కొలవణి మెప్పించి
జక్కిణిగతుల నొసంగులంది
మండల నృత్తమసంభ్రమసంగతులు జూపి
చిందుల నంద మందంద నెరపి
తిరువుల లాగుల తరితీపు గల్పించి
దళచంచు గతుల బిత్తరము మెరసి
గీ. దండపాద వినోదా వధాన కరణి
విభ్రమములన నాయాసవిధము దాల్చి
మాయురే యన నాడె రంభా తిలోత్త
మాఘృతాచి ముఖుల కవమాన మొదవ. 110

అపూర్వప్రయోగము
క. ఏణీలోచన యీగతి
నాణెముగా నాడునట్టి నాట్యం బార్త
త్రాణపరాయణుఁ డటు గని
పోణిమి బహుమాన మొసఁగి పుత్తెంచి వడిన్. 111

వ. అంత నేకాంతంబున కాంతంబుగా మోహినీరూపవంచమానాపంచశరుండును, సప్తసాలభేదనచణశరుండును, విహంగేశయానుండును, భుజంగశయానుండును, మహాభ్యుదయుండును, సదయుండును, సారసోదరుండును, సాదరండును, యర్చితోమాధవుండును, భక్తజనవ్రాతచూతమాధవుండును, గుణుండును, నిర్గుణుండును నైనవందారు మందారుండు తిరుపనిపిళ్ళలు పొందళిహల నమర్చి తెచ్చిన బంగారుతీఁగ విప్పపూరాజనాలు విజయవిలాసము

పుష్పమంజరులు కస్తూరినగరాలు ముత్తెసరు లేనుఁగ కొమ్ములు గంగాజలములు కేసరులు చంద్రవంకలు వెన్నముద్దలు దాళువాలు నారళ్ళు రామబాణాలు కటకసరులు రత్నసరులు జీనిసరులు రాయసరులు పచ్చదినసరులు గంధసరులు మద్దిగండ్రలు రేఖాములు కాంభోదులు మదనసరులు జలమబుడతలు వెలవడాలు మల్లెశ్రీగంధులు కుసుమపూరాజనాలు కృష్ణనీలాలు ముద్దుఁబ్రాలు కస్తూరిపట్టెలు చెన్నుగులు శ్రీరంగాలు చింతపూలు గోరోజనాలు సన్నెమణ్ణంగులు జీఱకఱబ్రోలు పోతుగంట రాజనాలు సీతాభోగాలు గౌరీకుంకుమలు నాగమల్లెలు గొబ్బికాయ బలుగుత్తులు రణము బెండ్లికొడుకులు ఈశ్వరప్రియములు యేలకిరాజనాలు పిచ్చికగోళ్ళు వంగాకుబుడుమలు ప్రయాగలు పసుపుగన్నేర్లు గుత్తిబలుగుత్తులు రావిపూరాజనాలు పొన్నశ్రీరాజనాలు నివ్వరులు నీరుకావులు రెడ్డివంకెలు చౌటవరులు తీగెమల్లెలు సుఖభోగులు సన్నసూదులు గొరవంకరాజనాలు కాటుకరేకులు ముంగురమొటికలు పసుపుముద్దలు మంచివిరులు రంభచెక్కిళ్ళు చిలుకముక్కులు మధురములు చామరాలు పెండెముడువులు రాచవన్నెలు తులసివనమాలికలు సింధుకర్పురాలు రాయమెచ్చులు యేరుమల్లెలు మునిమనోహరాలు వెండిగుండ్లు బొంతమడమలు కూటికుప్పలు కాఱుసంపెంగలు కందర్పభోగులు గజపతిలాగీలు బొందడీలు పునుఁగుఁదావులు తేనెతొలలు మోసనాలు గుఱ్ఱపుతోఁకలు తేటచలములు ఊదుఘటికలు గాజుకడియములు జాజికుసుమలు దూసలు భీమగుదెలు యేడాకుమొలకలు గుజ్జరులు బిరుసులు జున్నుఁబ్రాలు చిన్నిచుక్కలు కళింగలు వంగవరులు జగన్నాథప్రియములు రామలక్ష్మణులు కలియుగమహిమలు కాసరులు కాశీప్రయాగలు షష్టికముయి గమ్మసరులు ననునూటనాలుగు వగల పైరుల చేరుడు బియ్యంపువట్టి ప్రసాదంబులు కలమాన్నంబులు కలవంటకంబులు పొంగలి పులియోగిర దధ్యోదనంబు తిరువీసంబు పరమాన్నం బానపాలు జున్నులు మీగడ తెరలు నవనీతంపుఘుటిక లొలుపుం బప్పు లప్పడంబులు వరుగులు వడియములు శాకత్రాతంపు బజ్జులు చారులు శిఖరులు పచ్చళ్ళూరుబిం డ్లావకాయ మొదలూఱుగాయలు చక్కెర ఖండచక్కెర జీనిచక్కెర కల్కడంబు పుల్ఖండంబు ద్వీపద్రాక్ష పనస కదళీచూత ఖర్జూరనాళికేళాది ఫలంబులు ముసురు ప్రబంధరాజ వేంకటేశ్వర

దేనె పూఁదేనె జుంటితేనె పుట్టతేనె పెరతేనె కఱ్ఱతేనె కురుజుతేనె పుండ్రేక్షు రసపానకంబులు వడంబలి బేడలు వేపుడు సెనగ లనుపగుగ్గిళ్ళు చలిమిడిముద్దలు కాయంబులు చిమ్మిలి యడుకలు పోరులు నుండ్రంబులు కుడుములు దోసెలు నిప్పట్లు రొట్టెలు వడ లతిరసంబులు యప్పములు వెన్నప్పములు సుకియ లమృతకలశంబులు లాగులు చక్కెరబురు లుక్కెరలు కరిజలు పొరివిళంగాయలు తిమ్మనంబులు పాలకాయలు చక్కిలంబులు మోరుండలు మనోహరంబులు గారెలు బూరెలు మండెంగ లంగరొల్లెలు మణుఁగుఁబువ్వులు ఫేణీ లొబ్బట్లు కడియపుటట్లు చాపట్టు లిడ్డెనలు తేనెతొలలు గురుగు లేలకికాయలు వెన్నమెఱుంగులు నిడికుండుకలు లడ్వాలు ముత్తెపుఁజిప్పలు చంద్రకాంతంబులు మణతలు సారెసత్తులు చలువమజ్జిగ లెళనీరు శొంఠికషాయంబు మొదలుగాఁగల నిఖిలభక్ష్యభోజ్యలేహ్యచోష్యపానీయాదులు ధ్యానావాహనార్ఘ్యపాద్యాచమనీయస్నానవస్త్రోపవీత గంధాక్షతపుష్పధూపదీపనివేద్యతాంబూలంబులును షోడశోపచారంబులు సన్నిధి నంబు లొసంగ నంగీకరించి యారగింపునం దృప్తి జెంది సుఖసుప్తి నున్న సమయంబున. 112

ప్రభాతవర్ణన
క. కోరి చకోరక దంపతు
లారసి గుమిగూడి పొట్ట లాకలి దీఱన్
బారణ సేయుచు వెన్నెల
నీరము తమి మీఱఁ బెంట్ల నిమురుచు నంతన్. 113

ఉ. చక్కని చొక్కు వెన్నెలరసంపు బిరంజి ప్రియాంగనాళికిన్
గ్రక్కున నోరికిచ్చి తమిఁగౌఁగిటఁ జేర్చుచు ఱెక్కలార్చుచున్
ముక్కున ముక్కుఁ గూర్చి రవముల్ నిగుడింపుచుఁ దోన పాయుచున్
మక్కువ డాయుచున్ గలసిమంపిలు నౌర చకోరదంపతుల్. 114

చ. సలలితకాలసింహపటుశాతనఖాంకుశధారణన్ దమో
జ్జ్వలదురుకుంభికుంభభవశస్తసుమౌక్తికరీతి వేగుఁజు
క్కలరెను బ్రాఙ్నగంబు సుత నమ్మెయి బుట్టిన రక్తపాళినా
వెలువడి క్రొత్తకెంపు జిగి విన్నున వన్నియ నించెఁ జెన్నుగన్. 115 విజయవిలాసము

యతిభేదము
క. గ్రావవసదుఊఊ౩ ఇ
త్యేవంకాలాచ్క్రమలఘుదీర్ఘప్లుతస
ద్భావజ్ఞాంఘ్ర్యాయుధసం
భావోదాత్తానుదాత్తా మధ్యమరవముల్. 116

వ. వెలయుఁ దత్ప్రదేశంబున. 116

అనుప్రాసవర్ణనివృత్తి యమకవృత్తము
ఉ. జాతి తొగల్ నలంగ జలజాతములెల్లఁ జెలంగ బాంథులన్
భీతి తొలంగఁ బైట నళిబృందము లుప్పతిలంగ నెమ్మిసం
గాతిగలంగఁ బుప్పొడులు కంతుని పావడలై వెలుంగఁ బ్రా
భాతదిశల్ మెలంగె ననపాయబలాతతవాతపోతముల్. 117

చ. భవనములందుఁ దమ్ము వసుభారమునన్ వెలయంగఁజేయు రే
కువలయనేత్రకార్శ్యమునకున్ దగ విన్నదనంబు నొందెనా
సవసవదీపపంక్తులు వెసన్ దెలుపెక్కెఁ దలంప మిత్రులం
దవిలినయార్తి డెందములఁ దాల్పరె స్నేహదశానువర్తనుల్. 118

సూర్యోదయవర్ణనము
బహువిధోల్లేఖాలంకారము
సీ. జేజేల సభను రంజిలు వెలిమావు వె
డఁ దపికి లుపూతలాటం బనంగఁ
దూరపు వెలఁది నిద్దురఁ బోవునట్టి వి
న్పాన్పుపైఁ గెంబట్టుబటు వనంగ
సాముసేయుచును వాసవియెత్తు వలకేలి
కడిఁది మానికపుసంగడ మనంగఁ
గడిలిరాజు హరికిఁ గైగాన్క నిచ్చిన
బటువు క్రొంబగడాలబంతి యనఁగఁ
గీ. బాలితాంభోరుహనికురుంబంబు ముదిత
నిఖిలలోకకుటుంబంబు నిబిడతమిర ప్రబంధరాజ వేంకటేశ్వర

కుధరశంబంబు దీధితి మధిత మృదుల
పక్వబింబంబు తపన బింబంబువొడమె. 119

క. తొలిమల గుహయను గొలిమిని
గలితోదయ సమయలోహకారుఁడు రాగా
నలమునను గాచి యెత్తిన
బలులోహపుముద్ద యనఁగ భానుఁడు దోచెన్. 120

ఉపమాలంకారము
ఉ. ఆవనజాప్తుఁ డద్రిపయి నంబుధి స్వప్రతిబింబముం దగన్
గేవలమైన యద్భుతము గీల్కొను చక్రయుగంబుగా మయూ
ఖావళిసూత్రసంహతి యుగాభువిబాంధుల మేలుతూరుపన్
జావిలి దెల్పుఢక్కయను చాడ్పున నొప్పె విచిత్రభంగియై. 121

ఉత్ప్రేక్షాలంకారము
మ. జగదాశా బహుదైన్యవారణ విరాజద్వీక్షణాన్వీత యౌ
గగనశ్రీ కిరుచక్కి ప్రాగపరదిగ్గ్రావద్విపద్వంద్వ హ
స్తగతాంచ ద్వసురౌప్యకుంభములు నా సంధిల్లె సత్కాంతులన్
మిగులన్ సూర్యసుధాంశుబింబములు నెమ్మిం దద్దిశాంతంబులన్. 122

రూపకానుప్రాణితోత్ప్రేక్షాలంకారము
తే. పూర్వశైలస్తనగములఁ బుష్పవంత
బింబములు వొల్చె సమముగా నంబరమునఁ
గాంచనాబరధరు కరాగ్రములయందు
నమరియుండెడి శంఖచక్రము లనంగ. 123

అపూర్వప్రయోగము
సీ. తొలిబల్కు చెలులాడు తలిరాకు టుయ్యెలఁ
గూర్చిన పవడంపు గొలుసు లనఁగఁ
బ్రాచీదిశాలక్ష్మి పట్టు మేలిమి తామ
రను మించు మించు పత్రము లనంగ విజయవిలాసము

రాజుపై నెత్తిన ప్రత్యూషనృపు తోఁపు
దళుకొత్తుఁ దేరీజత్రాడు లనఁగఁ
దూరుపుగుబ్బలిదొర చెంతఁ జేర్చిన
సూరెపుటపు టల్లిజొంపము లన
తే. నగ్రజన్మకరాబ్జ దత్తార్ఘ్యతోయ
నిశిత నారాచదళిత మందేహ దేహ
దారుణ స్రవదస్రోరుధార లనఁగ
నవ్యఖద్యోతకాంతులు నభముఁ బ్రాఁకె. 124

చ. జలరుహమిత్రుఁ డయ్యుదయశైలముపై నటదోచుఁ గంటెముం
గలసమయోచితజ్ఞ పటుగాయక మంగళగీతికాచయ
మ్ములు తనునిద్ర మేల్కొలుపఁ బొల్పుగ మేల్కొని నిత్యకృత్యముల్
వెలయఁగఁ దేర్చి శారినృపవేషముఁ బూనక రాజసంబునన్. 125

తెనుఁగు సమాసము
మ. నెలఱాతీనియ సంతసంపుమగఱా నీరాళపుంగొప్పటా
కుల నిద్దంపు బసిండి నున్జవికె నిగ్గుల్ దొట్టుకట్టాణిపూ
సల మేల్బొబ్బ మెకంబు చెక్కడపు కీల్ జాగా జగా గద్దియన్
జెలువెచ్చ న్గొలువుండె నెల్లరులు జేజే యంచుఁ దన్గొల్వఁగన్. 126

వ. అట్టిపట్టున.

స్వభావోక్త్యలంకారము. జాతి
సీ. జొత్తు దళ్కొత్తు జుంజురు ముంగురులు కోర
శిఖలపై తలముళ్ళు చేరఁజుట్టి
వనమృగంబులు జేర ననువైన మొగసిరి
తిలకము ల్ఫాలసీమల నమర్చి
ముంజేతవాకట్టు మూలిక ల్గట్టిన
పులుగుపూసలు చాల నలువరించి
కరదండమధ్యభాగమ్ముల గురుగింజ
పట్టియల్ నీటుగాఁ బరిఢవించి ప్రబంధరాజ వేంకటేశ్వర

గీ. నీలికాశల పిడియమ్ము లోలిజేర్చి
గూర్చికర్ణంబులను కొండగోఁగుఁబూవుఁ
జేర్చి జేగురునామముల్ దీర్చిచెంచు
నాయకులు వచ్చి రధికసన్నాహములను. 127

క. అందు నొకకొంద ఱడవుల
యందులవలెఁగాక పురమునందుల వింతల్
డెందమలర వందఱువెర
గందుచుఁ గనుఁగొనుచు మోదమందుచుఁ జనుచున్. 128

అపూర్వప్రయోగము
సీ. మణిసౌధములఁ జూచి మాభూమికొండల
నీరీతిని మెఱుంగు లెఱుఁగమనుచు
ఘనకుడ్యచిత్రముల్ గాంచి జేజేలంచు
ముదమంది చెయ్యెత్తి మ్రొక్కులిడుచు
సభలోని కలకలస్వనముల విని భీతి
నొండొరుమాటున నొదుగుకొనుచుఁ
గలవడంబులు గాంచి కళుకెంత యీసీమ
పారటతలిరుజొంపముల కనుచు
గీ. బెక్కువన్నెల పులుఁగులు పెంచఁదగిన
యడవిమెకములు మఱియు వనాంతరముల
గలుువస్తువు లచ్చట గాంచి నవ్వి
వటుఁ డయిన భుజగారిరావటుని యెదుట. 129

జాతి
సీ. మెడతెరువులు నల్లిపొడలు కాలీకలు
సోగలాగలు నిక్కు రాగికాళ్ళు
బిల్లికన్నులు మొనపిచ్చికపల్లులు
సున్నపుపోలికలు చిన్నితలలు విజయవిలాసము

బూరుగకాయబోల్ బోరలు లవిటిల
కొనకత్తెరలకట్లు కొంకిగోళ్ళు
గరెలమేల్ నిడుదసైకపుటత్తెవ్రేళ్ళు క
ప్పుమెఱుంగు గొప్పరూపులును నుదుట
గీ. మలపములు కేరకొట్టుటన్ చలము గలిగి
కుమ్ముపురువు చిక్కుపురువు గుంతపురువు
సుడిపురువు నుస్తెపండులు మిడుతమెతుకు
చెఱుకుపాల్ పాలెరకుఁ గ్రోలి యగిరిఁగెరలి. 130

గీ. ఎదటి కురుఁజులఁగని తూరి పొదివిపట్టి
ఱెక్కతుదబోర మెడతోడ ప్రక్క పెంచె
మెరిఁగి బిరబిరఁ జుట్టుచు కరచి తరము
బిరుదుకురుజు పికిళ్ళ పంజరపుగూళ్ళు. 131

సీ. వడిపెద్దరెక్కలు పొడియీకె జడకాళ్ళు
దురసుటీకలు సోఁగ తోఁకచాలు
బలితపుఁ గురుచుమెడలు జేగురుమొగముల్
లావునడుములు నల్లనిమెఱుంగు
వన్నెలు పింగాణికన్నులు తిరిబొముల్
మిడిడేగచాఱలు మిద్దెజుట్లు
మొగ్గారెలును కొద్ది మొనగట్టి పల్లులు
మందపు ఱొమ్ములు మట్టురూపు
గీ. లమరికలఁ గల్గి సంకటి తమిదరొట్టె
వేఁటపొట్టజన మినుపపిండిమెఱిక
లొడికముగఁ బొక్కి దగదీరఁ బడ్డకోళ్ళ
గఱచి కాటులగెల్చు రొక్కముకోళ్ళు. 132

సీ. ఎఱజర్ల మిడిగుడ్లు నెగుపెడతల చండ్లు
పలుచని డొక్కలు బలుపుఁ బరులు
నలుపు జుంజురు రోమముల బల్మి కందముల్
దురుసుమొగములు సత్తువయొడళ్ళు ప్రబంధరాజ వేంకటేశ్వర

విప్పు జబ్బలకాళ్ళు వ్రేల్మట్టు తోకలు
గురువర్తులాండముల్ కొద్ది చెవులు
బలు పెనగూడిన మెలిగట్టు కొమ్ముల
తలలును మదము చెంపలు మొదలగు
గీ. నంగములు గల్గి వారిజపాకు లులువ
తొక్కుమిరియా లుమెతకాయ మెక్కిసెలఁగి
కుఱుచనిది సన్నలుబడ డీకొని తమి నెదు
టి దగరులఁగెల్చు గురుబపొట్టేళ్ళజోళ్ళు. 133

జాతి
తే. మేను తల తోక కాళ్ళు పల్ మించు గలిగి
రెట్టమెడనెత్తి తొడప్రక్క పొట్టపెంచ
మఱచికాటున విడువక తఱమిగెల్చు
దొడ్డపికిలిపిట్టల బిరుదుకురుజులును. 134

సీ. గందపుమ్రాఁకులు గపురంబుటనఁటు లె
న్గుతలముత్తెములు జేగురుచిలుకలు
గోరంకిదిమ్ము కస్తూరిమెకమ్ములు
వెదురుబియ్యము కొండవెలఁగపండ్లు
చాఱపప్పు సితఖర్జూరముల్ ద్రాక్షలు
తేనెకావళ్ళు రాతిబదనికెలు
నెమ్మిపురులు నక్కకొమ్ములు తలముళ్ళు
పారుటాకులు మణులౌ కేరిజములు
గీ. గసగసలు వీకవిఁడ్లు సోగ చిలుకలును
సింగములు పులిపిల్లు జింకలేదు
గములు మానిసికోతులు కాఱుపోఁతు
లేడికదుపులు పులిజున్ను పాడిపసులు. 135

మ. సెలవిం డ్లేనుఁగుదంతముల్ పికిలిపూచెండ్లున్ బునుంగిఱ్ఱిమై
యొలపున్ గస్తురి కప్పురంబు పులతోళ్ళొడ్డిలు జవ్వాది సి విజయవిలాసము

ల్లులు పీల్కుంచెలు పుట్టతేనె సవరాలున్ జల్లులుం బందికొ
మ్ములు ఱాబువ్వును జీడిపప్పు మయినంబున్ గోరజం బాదిగన్. 136

అపూర్వప్రయోగము
తే. కానుక లొసంగి ప్రణతులై కడను జంక
చేతు లిడి నిల్చి రప్పుడా చెంచుదొరల
యందుసడిసన్న ప్రోడ మాటాడ సభల
దిట్టయగు ఠింగణాశౌరి కిట్టు లనియె. 137

ద్విపదకందగుప్తగీతి
క. కలువదొర మానికముల
దళంపు తళుకుల నెపుడును దగలోఁ గొనఁగన్
గల తరగల పాలకడలి
చెలంగు చెలువుని నినుఁ గొలిచెద లోకమునన్. 138
గర్భితద్విపద
కలువదొర మానికముల దళంపు - తళుకుల నెపుడును దగలోఁ గొనఁగన్
గల తరగల పాలకడలి చెలంగు - చెలువుని నినుఁ గొలిచెద లోకమునన్.

లాటానుప్రాసము
క. నినుగను కన్నులు కన్నులు
నినుఁ బేర్కొను పలుకు పలుకు నీపుణ్యకథల్
వినియెడువీనులు వీనులు
నినుఁ దలఁచిన తలఁపు తలఁపు నీరజనాభా. 139

అస్ఫుటకందము
క. శ్రీనాయక తావకభుజ
మానితఖడ్గంబు సకలమహిమండలితో
నానాసురసేనాసం
తానయశస్నిగ్ధదుగ్ధధారలు గ్రోలున్. 140

పరిణామము
క. వేలుపుటింతుల కౌఁగిటఁ
బాలుపడం దివికిఁ బోవు పగతురకెల్లన్
నీలాల నిచ్చెనా యను
నీలాలిత బాహుహేతి నీలాద్రిపతీ. 141 ప్రబంధరాజ వేంకటేశ్వర

ఉపాత్తక్రియానిమిత్త జాతిభావ స్వరూపోత్ప్రేక్ష
క. ధరణిభరణదీక్షకు వా
విరిఁ బూనిన గెలుపు లచ్చి వేనలి లీలన్
బరఁగు కరాళభవచ్చుభ
కరనందన మబ్ధికన్యకాచిత్తేశా. 142

ముద్రాలంకారరూపార్ణవదండకము
కలితభువనయోగ జీమూత గోత్రావళీ శాత్ర వాశ్మద్యుతిచ్ఛేద నోద్ధామధామాభిరామకృతీ, విలసితమునిభావ షట్కోణపంకేరుహాంతస్థ సత్కర్ణికాపార సంచారి భృంగానుకారీస్థితీ, ఘనవిపిన సరోంబుపాన ప్రభిన్నాగ్రపాదస్ఫుట ద్గ్రాహకగ్రాహ మస్తాగ్ర భిద్భీమ చక్రాయుధా, వినుతజనదురంత సంసార ఘోరార్ణవోత్తారణాకారణాభూతనౌకా ప్రతీకాశనైకాభిదా. 143

ఆర్యాగీతి రూప కందము
క. వ్యాళాధిప నగనాయక
నీలధారాధారినేత నేడజకులరాట్
శైల పశ్వేతక్ష్మ భృ
త్పాలా వృషభగిరినాథ ధరరాజవరా. 144

అభేదభేదాతిశయోక్తి - అపూర్వప్రయోగము
క. ఈతేజోనిధి కర్హమై
రాతిరి సత్కాంతఁ జెందరామి యనుచు ఖ
ద్యోతు రెయి సరుచి జేయు వి
ధాత కరింగడచి నీప్రతాపము శౌరీ. 145

ధ్వని
సీ. తలయెత్తుటకుఁ గల్గెఁ దనజాతివారిలో
దెలి వేయిపడగల చిలువసామి
కనయంబు చాయపొం దొనరింపఁగాఁ గల్గె
గటికిచీఁకటి పాఱ గదుము ఱేని
కలరు విల్తునిదాయ యౌదల నిలఁగల్గె
జల్లని వెల్గు లేజందమామ
కలదచ్చి దెసల కొండలు నిల్కడగల్గె
నింగినంటకయున్న నీటిదారి గీ. కవుర భువనాతిశాయి వైభవ విభూతి
బూని సుజ్ఞానజేగీయమానుఁడ వయి
పిట్టగమి పాదుశాబాసుగట్టుమీఁద
నెలకొనఁగ మెల్చి దేవర వెలసియుండ. 146

జాత్యభావ ఫలోత్ప్రేక్ష
క. తగవరు లిలలో వెలఁదులఁ
దెగటార్పరు గాన మిమ్ము ఢీకొను పగరల్
దిగవిడుతు రనుచుఁ గాదా
వగభీరువులైరి లచ్చి వలపులరాజా. 147


గుణతాసాధారణానుపమాన కందము
క. గడిగాటపు గిరి గీముల
గుడిగూబల గెబ్బుగైత గొల్లలు గౌలన్
దడలుచు గండరిగర్వము
విడుతురు నీరిపులు జేరి వేంకటశౌరీ. 148

అనుపాత్తవాచకధర్మోపమానలుప్తవృత్తీప్రాససీసము
సీ. ఇటు గిబ్బతేజి యెక్కటిరౌతు చేపట్టు
గరితగాంచిన గట్టుగాంచినాఁడ
నిటు జోడువీడని బటువు పుల్గుటనుంగు
చుట్టపుట్టువు మెట్టుఁ జూచినాఁడ
నిటు నండుటేటిపాలిటి కలంకులు దీర్చు
గేస్తు గుబ్బలిఁ దిలకించినాఁడ
నిటు వల్లెతాటి మిక్కుటపు టెక్కురికీబు
కెడగొప్పతిప్ప వీక్షించినాఁడ
గీ. జియ్య యేమందుఁ గొదనాల్గు చెఱఁగులందుఁ
దిరిగి కనుఁగొందునెందు దేవరకు దొరయు
పురుడు నేగాన నీబంబుబురుకగాన
చామనమెఱుంగు తిరుమేని సామిగాన. 149 అధికము
క. ఉల్లము పొడుపు దొరయ్యా
చల్లని నీ యసము పాలసంద్రములోనన్
దొల్లిఁటి సాముల యసముల
నెల్లను బుద్బుదములట్ల నిలఁ గన్పట్టున్. 150

సమత
సీ. వితరణంబులు లేవె వివిధపంగ్వంధ
ధ్యల కభీష్టములు సంధిలవుగాక
నుత్సవంబులు లేవె యురుహరు హరిదాగత
ప్రభుదత్త విత్త మేర్పడదుగాక
గిరిదుర్గములు లేవె పరమోత్తమ సమస్త
తీర్థరాజాప్తి వర్తిలదుగాక
నెఱతనంబులు లేవె నిరుపమ పారసీ
కచ్ఛేదనోద్వృత్తిఁ గనదుగాక
గీ. ధరణి పుణ్యస్థలముల దేవరలు లేరె
నీవలెను దివ్యతిరుపతి నిలిచి భక్త
వారములఁ బ్రోచు సాములు లేరుగాక
పంకజాతాప్త నీకాశ వేంకటేశ. 151

శయ్య
క. వలరాజఁట కొమరుఁడు చి
ల్వలరాజఁట పాన్పు ముద్దులమఱఁది చెంగ
ల్వలరాజఁట కావుననే
వలరాజని నిన్నుఁ బొగడ వసమే సామీ. 152

అపూర్వప్రయోగము - తెనుఁగు మఱుఁగు
సీ. పయ్యరమేపరి నెయ్యఁపు బోనంపు
తెలిమెకం బెకిగింత గలుగు సామి
రెంటత్రాగుడు చట్ట రెట్టింపు తాలుపు
తలపువ్వు తండ్రిలో నిలుచు జియ్య బొక్కలాయపు జక్కి యెక్కటి తోడెక్కు
తత్తడి పురిసికఁ దాల్పువేల్ప
మబ్బు పూబుట్టువు మాళిగలోనుండు
గుబ్బెత నెదచేర్చి యుబ్బుజేజె
గీ. సంజ జగడంబుకాక రాచాయమించు
తలఁపు మానిక మరచేత నిలుపు రాజ
డాలు తులకించు బేడెస టెక్కియంపు
సాహెబును గన్న చొక్కపుఁ జక్కనయ్య. 158

అపూర్వప్రయోగము
శా. నేలన్ గూఁతలు వెట్టువాలు పులిచక్కిన్మించు పావాలు మున్
గాలంజాలు జెలంగుడాలు మొనకెక్కన్ బక్కిరాడాలు ని
ర్గేలన్ బేర్కొనువేల్పుచాలు నెదనెమ్మిన్నిల్వబూ చాలు నే
వేళం బూతల మేలు మేలును గలా వెన్నుం నినుం గొల్చెదన్. 154

జాతివార్తలు
సీ. చలిగాలి దిండిమేతల జాతికొమ్మల
యాటల కిరవైన యట్టి సెలలు
గుఱ్ఱపుమూతుల కులము పొల్తుల తేఁట
పాటలకునికైన మేటిచరులు
నిసుమంతమాన్సివంగసము బాలల కిన్నె
రల మ్రోతలకు మారువలుకు గవులు
తెలిసుద తెరగంటి తెరగంటి తెఱవల
రచ్చపట్టగు నెలఱాతిగములు
గీ. జంట ముక్కాలి ఱెక్కడాలంటు చేత
మలినమౌ నలినములుండు బలుకొలఁకుల
గలిగి చెంచులకెల్లను నిలుక డయిన
పొన్నవలిమల చెంత మా బూమిసామి. 155

తే. అట్టి సలిమల సేరువ యడవి నున్న
చెంచులెల్లను మాపని సేయనుండి
కోరి దేవర యడుగులు కొలువ వేడి
యరుగుదెంచితి దామకుఁ డండ్రు నన్ను. 156 ఉ. ఈ దివసంబునందుఁ దగనిచ్చటి కోనల యీ కిరాండ్రనం
బేదలు మామలల్లుడులు పెద్దలు సుట్టలు నల్లిబిల్లిగాఁ
బ్రోదిగ వేఁటలాడి కడుపు ల్దనియించుచు నిల్లుముంగిలై
సోదెము జూచువారలకు జూపుచునుందుము నాడునాటికిన్. 157

క. సామీ సల్లనిప్రొద్దున
నేము దలంచవలె మిమ్ము నిట జేజే రా
గీములపట్లను బీళ్ళను
నేమును మీసలువవలన నెమ్మది నుందున్. 158

అపూర్వప్రయోగము
క. పులిమీసల నెపుడే ను
య్యెల లూఁగుచు విల్లుపూని యెదటన్ గిదటన్
బలమున్ గిలము న్వెలయఁగ
నలుగుల నెలుగులను ద్రుంతు నలవోని తఱిన్. 159

సీ. గెలుపుపేరు వజీరు గినిసిన కప్పుటై
దువరాచ సెంచు మాదొడ్డివేల్పు
సతబాసవాల్దంట కతలాని పాఱు వే
సముఁగొన్న బోయ మాజాతిపెద్ద
సురఁటివీఁపుల చుట్ట దొరమొక్క రానేస్తి
జంగిలి యెఱుక మాసంగడీఁడు
దరమంపుటొజ్జకు తదవ్రేలొసంగిన
యానాది మాకితవైన ఱేఁడు
గీ. వేయునేటికి తరిమల వెండికొండ
తాలిగుబ్బలి కడగట్టు ఠావులందు
నప్పసం బుప్పతిల్లుచు మెప్పుగన్న
యట్టికొరవంజులెల్ల మాసుట్టలయ్య. 160

సీ. బలితంపు వణుఁకుగుబ్బలిక్రింది నాడెల్ల
కేలిగా మాపెద్ద కైరఁ డేలు గందపుఁగట్టు దుర్గపుఠాణములనెల్ల
పట్టుగా మాసిన పాపఁడేలు
బొడుపుకొండకు సెల్లుబడి కోనలవి యెల్ల
కొమరు మీఱంగ నాకొమరుఁ డేలుఁ
గర్వంపు వెంబడి బంగరు గ్రంకు మలలెల్ల
దేవరబంటు సాధించి యేలు
గీ. నిండె కొంచెపు నక్రమయీదరములు
మత్తు బొత్తిల్లు తనకేలుసత్తి దనర
నాదు పినమన్మఁ డేలల్ల నాటనుండి
చిలువమలవాఁడయో రాచకలువఱేఁడ. 161

సీ. డంబెచ్చు తపసికన్నుంబాప పేరెక్కు
నందలి కుందేటి కందు నొకటి
చాయజక్కవ చంటి సాహేబు పాపని
తురకమానికమగు దుంత యొకటి
ముక్కంటి పండుల మ్రొక్కు లీడేర్చు నా
యంకుని తండ్రి చేసింక యొకటి
జాళువా పరపయ్య జంపి యీపట్టికి
మేలిచ్చు సామేని మెకము నొకటి
గీ. నీటియెకిమీని మొలనూలు బోటిమిన్న
నొంటిపంటనుగల కిటి యొకటి నిక్క
కలను నెమకిన మెకముల పొలపుఁగాన
మేము జేజేల గాచిన సామిసంద. 162

సీ. మా వేటలకుఁ దప్పి వేవచ్చినదిగదా
మెలఁగెడి యీనేల మెకములెల్ల
మాసెలవిడి పారవేసిన యదిగదా
యిమ్మైన యీయేన్గుకొమ్ములెల్ల
మేమువాసవి సూడ మిగిలిన యదిగదా
యీనెలవున దెచ్చు తేనెలెల్ల
తొలుత మాపోగు కట్టల రాలినదిగదా
యిందు గల్గిన హరిబీకలెల్ల గీ. యేము సెప్పిన సుద్దుల యింత గలుగ
దితపుగాఁ బల్కు యీ సోటుకతలదెల్ల
కాన యీకాన నాకెనగాన మేటి
నల్లయెఱుకాన యెఱుకాన నల్లసామి. 163

ఆ. మేము గలుగు పజ్జ మీకొక వేఁట దో
టలను వేడ్కఁ జూపవలయుఁ గాక
నురకయిండ్లకడను నుందుమే మీసొమ్ముఁ
దినిన ఋణము దీర్తు మనుచుఁ బలికి. 164

క. వేయేల జియ్య విన వ
య్యా యిక మా వినప మొకటి యటు కనుఁగొనఁగా
నేయెడఁ జూచిన నడవిలు
లాయంబులు వెలయ జమునిలాయము లనఁగన్. 165

క. ఇనమణి యవిగాకా చెం
తన యెక్కటి రెండుమూఁడు నాల్గయిదాఱే
డెనిమిది పతియుఁ బ
దలకొండ్బండ్రెండు గాఁగ దగ నేర్పడుచున్.

జాతివార్త
సీ. కోనము న్వెలువడి ముర్ఘురధ్వనులతో
దారిముస్తెలు మోర లోరసిలగ
నేల జల్లెడువలె నెలకొల్పి పొలమెల్ల
పోడు గొట్టిరన గోరాడి చప్ప
రింపుచు పైవేరు దెంపుల దంట్రలు
నూరిజాల్సెలవుల నురుగు బిరుదు
జల్లులగతినొప్ప దుళ్ళుచు నవ్వాడి
కోఱల నరవాడుదేరు చీఁక
గీ. దిగుబురుత్తరింపుచు వెదురుగడలువడ
రాచి తుదలెల్ల ఝాడించి రాలుబియ్య
మెరకుగొని పెంట్ల గూడిమై నెరులు నిక్క
నేన్గు దోమగఁ జూచు న య్యేకలములు. 167 క. ఇది పొల మిది బిల మిది చే
నిది బై రిది కుంజ పుంజ మిది చె
ట్టిది ఝరి యిది దరియని తెలి
యదు మెకములు నేలయీనినటుల మెలంగున్. 168

క. కైవాలుపండు పంటల
కైవాలు మెకమ్ములామి కైవాలుటచో
నీవాలున నీవాలున
నీవాలున నీ ప్రశస్తి నెఱపఁగవలయున్. 169

ఆదియమకము
క. బలుబంది పందికదుపులు
పులు లెలుఁగులు సిలుగు చిఱుత లేనుఁగులున్
గలయడవుల గలకొలఁదుల
దులదుల వేటాడగాక దులవలయు హరీ. 170

ఆద్యంతైకనియమ ఛేకానుప్రాస యమకరూపకందము
క. నేనిక నేనికయౌదల
మానిక మానికరమైన మానికడెంబుల్
పూనిక పూని కరంబుల
కానిక గానికగ నిచ్చుఁ గానిక యిత్తున్. 171

ఉ. రమ్ము మురారి నిన్ను సుకరమ్ముగఁ దోకొనిపోయి నేడు నా
యమ్ములచేత జంతునిచయమ్ముల నెల్ల వధించి మావినో
దమ్ములు చూపి నీమది ముద మ్మలరింతును నాదుజోడు లో
కమ్ములయందు సెంచుకులకమ్ముల గానము సాము సత్తునన్. 172

క. ఇడుములబడి మెకములవలె
యడవులను జరించునట్టి యదము లటంచున్
గడు చుల్కజాడకే మె
ప్పుడును పురండములు విన్న ప్రోడల మనుచున్. 173 అపూర్వప్రయోగము
సీ. బాసఁదప్పక బూమి రాసబాపని కిచ్చి
నిజము సేకొన్న మన్నీనికతలు
నలకిపుట్టువు గ్రోలనరచేతను గలాని
చిలుకుముక్కున నిల్పు బలియుకతలు
కంపటీలను పసిగాపరులకు గొండ
వేలనెత్తిన గొల్లబాలుకతలు
నలుమారుమనువుబిడ్డల బిడ్డలాటకై
నేలకు జేయు కయ్యాలకతలు
గీ. కులముపెద్దల రచ్చల గుంపుగూడి
చేరగావచ్చి కోయితల్ జెప్పుకొనఁగ
సకలమును విన్నవారము సామి మమ్ము
నేళముగ సూసి సిత్తాన నెంచకయ్య. 174

చ. అనవుడు వానివాక్యముల కయ్యెడ మిక్కిలి సంతసించి నె
మ్మనమున నుగ్రవన్యమృగమండలి హింసవిలాసధర్మమౌ
నని పరికించి వారికిఁ బ్రియంబునఁ గట్నము లిచ్చి దూతలన్
బనిచి దిగంతశైలవనపక్కణభూముల కాక్షణంబునన్. 175

క. కమ్మలు కైరాతకకుల
కమ్ముల రమ్మనుచుఁ గౌతుక మ్మలరారన్
సమ్మతి బనిచిన నొకదివ
స మ్మతి గడవ కవి దమకు సమ్మతి గాఁగన్. 176

అపూర్వప్రయోగము
క. అయ్యెడ నడవిని నొండొరు
కుయ్యిడి పిలుచుచును లుబ్ధకులు హరిపనుపుల్
సెయ్యుచు గనుగొని బాగెము
నెయ్యంబున మనకు గల్గెనే యని చేరన్. 177 క. ఆసమయంబున నొకశుభ
వాసరమున నంజనాద్రి వాస్యవ్యుం డు
ద్భాసురతరచిత్రమృగ
వ్యాసక్తి మనంబు విలసి తానందముగాన్. 178

సీ. మును చెవిబాయజాఱిన యోరసికను క
సీదురుమాలు భాసిల్లగట్టి
సరిలేని కట్టాణి చౌకట్లు ధరియించి
కస్తూరికాతిలకంబు దిద్ది
తలిరుచందురుగావి దట్టిగట్టిగజుట్టి
వలవంక రతనంపు వంకిజెక్కి
కుంకుమరసమునఁ గూర్చుగంధ మలంది
వలిపెదుప్పటి వలెవాటు వైచి
గీ. సకలభూషణమణిరుచినికరకిరణ
రాజి గడుమించ నిజమందిరంబు వెడలి
పొగడపుగుబ్బలి నడుమను వెడలునట్టి
వనజబాంధవవైఖరి వనర నపుడు. 179

జాతి
చ. గొరిజలయుబ్బు మేనిజిగి గొప్పయురంబు వెడందపంచకం
బెరుపగు వన్నె చిన్నిచెవు లెక్కువమై సిరసెత్తు మెట్టువాల్
కొరసగిలింత గల్గి మఱి కొంచెము కండము కాళ్లవేగమున్
మెఱుఁగుఁగనుల్ సుదేవమణి మెత్తని రోమము లొప్పు మెప్పుగన్. 180

సీ. తగినట్టి మాష్టీని దండపోల్కిమెఱుంగు
మెఱయుకైవడి బిసమీటినగతి
కీల్బొమ్మతెఱఁగున గిణిబెళ్కు చాట్పున
లకుముకిపోలిక లాగుసారె
ద్రిమ్మరు మేర రసంబు కదలుమాడ్కి
నీట మునిఁగి లేచు సూటిత్రాటి
బాణవితానపటము విడచినయట్లు
రిక్కతెగిపడినరీతి మింట గీ. చిల్కబాఱినవైపున జింకదాటు
పగది బంతియెగయుదారి పాపములకు
సరవి యంతరపల్లటి వరుస బిరుదు
పాత్రవలెనాడగల జిత్రపత్రమునకు. 181

ఉ. బంగరుజల్లులున్ బికిలి బంతితలాటము ముత్తియంబులున్
రంగుగ మోముపట్టు నపరంజిఖలీనము పట్టుపల్లమున్
సింగిణి విండ్లు తూణములు చిల్కల కోలలు పట్టియంబులున్
సంగతి పార్శ్వభాగముల జక్కఁగఁ బూనిచి సాది నిల్చినన్. 182

గీ. వాజిగుణమును రాగెయు వాగెభూమి
మానమును శరశస్త్రసంధానములును
జోడు పరశస్త్రముల రాక సూటివిధము
ననెడి యష్టావధానము లాత్మ నెఱిఁగి. 183

గీ. బిగువు పదిలంబు చూచి గంభీరవృత్తి
మ్రొక్కి పొన్నంకి వన్నియు ద్రొక్కి నిక్కి
సరవి కైరని నెక్కి యుత్సాహలీల
పిక్కటిల్లఁగ దుమికించి యెక్కువగను. 184

పంచధారాయుక్తసీసము
సీ. వలయాద్రి పరిమిత వసుమతి గైకొన్న
గమనిక చుట్టు వ్రేడెములు ద్రిప్పి
విరసించు నసురుల శిరముల మెట్టింతు
ననెడు చందముల జోడనలు బట్టి
నిజకీర్తిచంద్రికల్ నిగుడి యంబుధులెల్ల
గడచె నన్న విధాన నిడివి దోలి
యిలమీఁద తనయాజ్ఞ చెలియలికట్టగా
నిలిపినగతి కుఱుచలను మలచి
గీ. తనకు ప్రతిదేవుఁ డెందు లేఁడనుచు నెమకు
పగిది తగు నడ్డ వేడెము ల్బరపి మఱియు
భంజళి మురళి ఝళిపి ఝంపయి సుఢాల
మనఁ గతు లెసఁగఁ జూపుచు హాళిమీఱ. 185 వ. అప్పు డయ్యాటవికనికరంబుతో నారాయణవనప్రాంతంబున మృగశరణ్యంబగు నమ్మహారణ్యంబు సొత్తెంచు నత్తఱి ముత్తెపుఁదేటనీటి చొక్కాటంపు సెలయేటి దరుల వఱలు చలువల బోదన నేదిన పంటవలంతి నెమ్మేన శృంగారరసం బుప్పొంగిన తెఱంగున చెంగలించిన నిచ్చలపు పచ్చికల మచ్చికల విచ్చలవిడి మెసవి మిసమిసల మసలుచు నీఁగవ్రాలిన జరీనజీరుకు బారు నునుపుతనువులం దనరుచు వలికరువలి బొలసిన సొలసి బెగడి మిడిగొరిజలవడి చివుకుచివుక్కున నుప్పరంబులు గుప్పించుచు తళుకుబెళుకుచూపుల నేపు జూపుచు కుఱంగట లొద్దుగు మోదుగ కంకేళి దాడింబ దాసన బంధుజీవనం బాదిగాఁగల చెట్టుల నిట్టలంబుగ నగ్గలికల నలరు కలికల నమరు సుమనికరంబుల దూరంబులం గనుంగొని కారుసొదయను బమ నెదల నెదుగ నెదగదుర తండంబులుగ నడ్డంబులుగ నుండు గుండుల గండు మీఱి జంఘాలత నుల్లంఘించి పొదలెడు కన్నెలేడులును, రావి మఱ్ఱి యందుగు వెలఁగ వెదురునంటుల నంటులైన చిగుళ్ళు కంటి కంటి కంటినని కంటికి నింపుగా నాకంటికి మెసవి వేసవి తేటనీట నీటగు కొలంకులం జేరి నీరంబులు జల్లుకొని పొరలి కెరలి మరల తామరల పరంపరల వెంపరలాడి తుండంబుల తండంబులు పొడవులెత్తి భూత్కారంబులు చేసి చల్లనితావులకు తావులగు మావుల క్రేవలకైవశంబులయి వశాళితో గొండ్లిసలుపు దంతావళావళులం దిలకించి వేసటగొనక సటలమెకంబులు గమకంబగు తమకంబులపైకి దుమికి నఖముఖంబులన్ గుంభంబులు సంరంభంబున చక్కులుగా వ్రక్కలించి జొత్తిల్లు నెత్తుటంబొదలు మెదడు పొలసొంపొలయ మెక్కిపుక్కిళ్ళకు కక్కసంబైన కోరల యోరలఁ జిక్కిన పెక్కుదొర ముత్తెంబుల నుమియ దానపుడమికి జగ్గుమను నిగ్గులుదేరు వన్నెమ్రుగ్గుల సింగారంబుల తెఱంగులును యరచిచ్చులకై పెచ్చుగాఁ జూపట్టు పుట్టపట్టులు గొట్టి గుడ్డుచీమల బారువాముల మిలమిల మొదలు చెదలు కదుపుల లెస్సగా బుస్సుబుస్సున గూర్చి యెగబీర్చుచు ముసముసన ముసరు కటికచీఁకటి తుటుముల నందంద గ్రందుకొని యందలి తేనియలాని గుటగుటార్భటుల నటునిటు ద్రిమ్మరు జల్లిదంపు బొల్లిమొకము మెకంబులును, తరువుల మెండుకొని యుండు కొండగొఱియల మురియలుగ నఖరశిఖరంబుల విదళించి కుత్తుకలొత్తి నల్లలుగావు బట్టియెరగొని గవులుచుట్టుకొన గవులమివుల నిదురగదుర పొగరున గురువెట్టుచు చిత్రవర్ణకంబళంబుల డంబువిడంబించు చాపులగు వీపుల రూపుల నేపుదనరు చిఱుఁతపులులును నిర్ఝరంబుల జర్ఝరితంబుగా నూరునీరంబుల మెరసినిరవుకొనిన సమ్మర్దంబున కర్దమంబు గావించు దుర్దురంబుల నిర్దయత మార్దవంబు పొసంగమెసంగి కుబుసంబులూడ్చి బుసకొట్టుచు మీఱు సరీసృపనారీవారంబులతో మసకముల తనివి ననక సంచరించు నాచుతాచులం గాంచి మేను లుప్పొంగ చెంగుచెంగున దాఁటుచు డగ్గరి వావిప్పి తెప్పున కబళించి చప్పరింపుచు నొప్పు పొడదుప్పులును నిండారగండశైలంబుల డాలీను గైరికంబుల నిజాంగంబులు ప్రతిబింబితంబులయినం గనుంగొని మదులనెదురుగ రోసంబుల భాసిల్ల పిఱిఁదికి సని బిరబిరన ఢీకొని మొకంబులు వంచి రెండిమ్ముల ఢకాఢకి దాఁకి సెలగభంగంబులైన యుత్తుంగశృంగంబుల మీసరంబులగు కాసరంబులును, ఎందెందు సంచరించు నందందు కమ్మతావులు ముమ్మరంబుగాఁ గ్రుమ్మరింప నింపగు గస్తూరికామృగవారంబులు వెన్నెల జెన్నెలరు వెన్నెలకువ్వల మవ్వంబున నివ్వటిల్లు తెల్లజల్లుల నుల్లసిల్లు బల్లిదంపు జల్లిమెకంబులును పదయుగనఖాంచలంబులఁ జంచచ్చంచూపుటంబుల రెట్టిత్రావుడు బొబ్బమెకము దచ్చి కాళ్ళ మెకంబుల నిరికించి కఱచుక యుప్పరంబున కుప్పరం బెగసి మలలసెలయేఱ్ల పులినతలంబుల నజ్జుగాఁ జెండు గండభేరుండకాండంబులును, చిమ్మనక్రోవు వెలువడు జలంబుల కరణి తరునికరకర్షణంబుల చిల్లున చమురుగారు శరీరంబుల మత్తిల్లుచు క్రేళ్ళురుకు పాకానీకంబుల దోకొొని ఘుర్ఘురారావంబుల మీఱుచు గములు గట్టిగట్టి మొనయై దులదులమెలఁగు నలుగులజుట్టు చుట్టును వేండ్రంబునం దీండ్రించి జండ్రనిప్పులకుప్పుయొప్పునఁ దేజరిల్లు బిల్లికన్నుల నలుదెసలం గలయఁజూచుచు నల్లనల్లన బలగంబుల నెలయించికొనుచు కురువిందబృందంబులు గల కెలంకుల ముట్టెల నట్టిట్టుగాఁ బెట్ట గలిగించి చప్పరించి రొప్పుచు కోనల డొంకలం జెఱువుల దొరువుల పడియల మడుఁగుల నెలవుల చలువల పజ్జల నజ్జులు సేయుచు నీరంబులు దూరుచు పేరెంబులు వాఱుచు ఘోరాకారంబుల మీఱుచు పారంబుల దాటుచు నింపారు నుదారభూదారం బులును, లేవెలుంగు మినుగు శకలకు గాక చలుఱాతి పడగల రంజిల్లు బిల్లులు బెల్లుగాబట్టి గరగరఁగొరికి బిరుసులేని నునుగఱ్ఱల నెఱ్ఱగా జవ్వాది యొత్తి యెమ్మెరం ద్రిమ్మరు జవ్వాదిపిల్లులును పిల్లల నక్కునందు నెక్కొననిల్పి నిక్కుగల కొమ్మలనెక్కి పచేళిమంబులైన క్రొమ్మావిపండ్లు మెక్కి గ్రక్కున నిక్కడక్కడ దాఁటుచు నందునిందు మాటుచు నిక్కినిక్కి వెక్కిరించుచు చెవులు రిక్కరింపుచు పండ్లిగిలింపుచు గండ్ల బెదిరింపుచు కిలకిలారావంబులు నింపుచ గలగలన చెట్లు గదలించుచు వెనుక ముందఱఁ జూపి మెలఁగుచు పెనఁగులాటలం జెలంగుచు పిక్కటిల్లు మర్కటంబులును గలిగి విలసిల్ల విలోకించి యంత యక్కాంతారంబున నొక్కసెలయేటి కెలన నిలిచి యచ్చిలువమలఱేఁడు శేనంపాత మొదలగు వేఁటలాడుఁడని లుబ్ధుల కానతిచ్చిన. 186

క. పులియెలుగు పొడల చల్లడ
ములు దట్టులు నీలిగోణములు పీకల దం
డలు కావుబొట్లు మెట్లును
కలిగి చెలగునట్టి బోయగమి యవ్వేళన్. 187

క. బలువిండ్లు చిలుకుటమ్ములు
మొలిదట్టులు నీలిగోణములు కురుచపిడె
మ్ములు పీకలు చేకొమ్మలు
నలరఁగ బోయదొరబిడ్డ లాహరి యెదుటన్. 188

ఉ. కొంచెపువాలముల్ గురుచగోళ్ళును గొప్పశిరంబు కాళ్ళమే
ల్మించిన నాల్క డొక్కజిగి మిట్ట యురంబు వెడందకండ్లు మై
పెంచిచెలంగు భీముఁడు తుపాకిలకోరి కరాళిగొంటు క్రొ
మ్మించు తలారిజీడిపులి మేఘమునాఁదగు జాగిలంబులున్. 189

యతి
మ. సెలకట్టెల్ తడువిండ్లు నుర్లుతెరలున్ జేకత్తులున్ చల్లిపా
దులు పందీటెలు దీమముల్ చిలుకులూదుల్ చిక్కముల్ మోటక
త్తులు బోనుల్ బడెగండ్లు ముంగిసలు నెద్దుల్ పొగులున్ బోటుకో
లలు జాలంబులు గంటలున్ దివెలు గాలంబుల్ జిగుర్మీటలున్. 190 జాతి
సీ. అన్నువతల గొప్పకన్నులు నల్ల నా
లుక తెరిపి మెడగులు కరివన్నె
తెల్లబొమల్ జట్టతిరులు నిక్కగు మెడ
లెల్లబాణీలును నల్లిపొడలు
వెడఁదసన్నపుటత్తు వ్రేళ్ళుబ్బు చెక్కిళ్ళు
రెట్టకట్టెదురీక మిట్ట బోర
కురుచలవిటిమాచ్చు గొరవంక కాళ్ళెఱ్ఱ
బాణీలు మొనపండ్లు పరుపు గలుగు
గీ. వారణంబును జలకట్టె బైరిగెద్దు
చంచడము సాళువము శనిశరము మించు
యాష్టమును తళుకాదిగాఁగ వేరవేర
నొప్పు డేగల జతగూర్చుకుండుటయును. 191

అజహల్లక్షణము
సీ. ముందరవిలు చాలు మొనసితుపాకీల
బారు లాతరువాత బలసికురుచ
బల్లెంపు గుంపు లాపజ్జదెప్పరమైన
గడలపౌజులు నిరుగడల నడుమ
మదగజంబులు వాటి గదిసి యరదములా
పార్శ్వంబులందు బాబాల తుటుము
లావెన్క హితులు ధరాధిపుల్ మంత్రులు
గొల్వ వెన్నుని వెంట గూనివీపు
గీ. లిఱుకు భుజములు కెంజాయ కఱుకు మీస
లుఱంకు కనుగ్రుడ్లు మిట్ట పండ్లుఱుకు నెఱులు
బెఱుకు చూపులు పరువుల విఱుపులగల
యెఱుకల దొరదామకుఁడు కొందఱిని యందు. 192 సీ. ఏనాదిరాయ నీవీ కోనలో రమ్ము
ముతరాచ నీవల్ల పొదను నిలుపు
వేకరిసామి నివి పట్టు సూడుము
బోయనీ వాసలచాయ కాపు
మెఱుకులఱేఁడ నీవీనెప్పు సూడుము
సెంచనీదౌ పొగయంచకదలు
వేసమన్నీఁడ నీవీకాన వెరజుము
గైతనీవా జాడ గనగ చూపు
గీ. తాచురారూపు చుట్టునేస్తంపు జియ్య
యయిన రాససక్కరపతి యదె పిరపడి
సూసి బందుగు లిటురాఱ్ఱ జోస్తి ననుచు
పలికి యావల వల వేటరులను గలిసి. 193

క. వలలం గాలంబుల గొడ
మల సూదుల జువ్వలను గ్రమంబున మడుగే
రుల యడలవ్రేసి యెడ్డియు
బలువిడి నూదియును దొడఁగి బారలు మీరన్. 194

ఉ. ఉల్లికతట్ట మారువము వాలుగ బేడస కొఱ్ఱమీను పెం
జెల్లయు పక్కెపారియును నీచును ముచ్చగ బొమ్మడాయముల్
డొల్లిక తేలుమీని సుకదొంతును పిత్తడికాసుమల్లు మీ
నల్లెయు గండెరొయ్య పరకాదిగ చేపలఁ బట్టిబెట్టుగన్. 195

వ. అంత నయ్యెఱుకలుగల యెఱుకుఱేఁడు ప్రేమంది తనమందిని గూడి శౌరి కనుఁగొన లటహపటహంబులు దిక్తటంబుల నడర చరపించి. 196

గీ. వలలు వేయించి తడికలు వంచి యడుగు
జాడ లెత్తించి బోనలు సంఘటించి
పోగు వారించి గసికలు పొసగనుంచి
మినుకు లరయించి తడికలున్మాటి యచట. 197

గీ. పాదులను దీముగువ్వల పాదుకొల్పి
జిగురు గండెలు నురులును జిప్పతుదల నిల్పి మీటలు తరువుల నిగుడజేసి
వట్టి మృగముల పిట్టల గొట్టియందు. 198

గీ. ఒకటి తొలుత వేఁట జిక్కిన మెకముఁ దెచ్చి
నెత్తి నీటను గడిగి చేకత్తిచేత
ముంచి కనుగ్రుడ్లు బెఱికి తన్నెంచ చెంచు
లంచ తమ్మి కంటికి నివాళించి చెలఁగె. 199

వ. అట్టిపట్టున.

చ. కని చిగిరింతయున్ గదుడు కారయు కోరిక చేరి బోడయున్
గునుకును సొంటి చిప్పరయు గొఁగడ యూదరనక్కతోఁకయున్
బొనుకెడ పీరితోణగియు పొత్తర మల్లవ మారువెల్లియున్
వెనుతరు ప్రొల్లబూదియును వీడలి పిచ్చుకబియ్య మెండ్రయున్. 200

గీ. కనుము కందురు గరిమిడి గఱికె పొలికి
తొప్పరంట్రింత సాలువ యుప్పుగడ్డి
పరిక ముల్లూచి మొదయము బైటితుంగ
మొదలుగాఁ బూరి రవలింప పొదలు వెడలు. 201

సీ. శార్దూల గజసింహ శరభసంఘంబుల
సమయించి కణతుల జక్కుసేసి
భల్లూకశల్యశంబరలు లాయంబుల
దునిమి సివంగుల దూల బొడిచి
సారంగగండకచమరీమృగంబుల
నురుమాడి కొర్ణగండుల వధించి
గవయ జంబుక ఖడ్గ గండభేరుండ ప
టలి గూల్చి మన్ను పోతులనుఁ జంపి
గీ. యేదులను నొంచి దుప్పుల నేపణంచి
శశకముల ద్రుంచి యిఱ్ఱుల సంహరించి
యితర వన్యమృగావలి నెల్ల విశిఖ
చాతురిని గెల్చి ఫణిగిరి స్వామి మఱియు. 202 క. కాయంబులు గాయములై
యాయంబులు పగుల మిగుల నాయంబులచేఁ
దోయంబుల టింకిని బలు
తోయమ్ముల మృగకులమ్ము దూలించె వడిన్. 203

క. సామికిటికటము నేసిన
యా ముత్తియమమ్ము సుదనయమ్మునం దనరె
న్రాముని కృపగలగిన రఘు
రాముని తూపుతుద నీటి రాజుండు వహిన్. 204

గీ. అంతట నిఖిలమృగయావిహారలీల
సలుపుచును వచ్చి యాదైవసార్వభౌముఁ
డఖిలపరిజనపరివృతుఁ డగుచు వేఁట
సరవి చేయెండ సోఁకునఁ జాల బడలి. 205

యతి భేదము
సీ. మును పుష్యరాగంపు మొదల రక్కొని మించు
వైడూర్యశాఖల పచ్చదార
డమ్ముసందుల పగడంపు సైకపు సుడి
తలిరుల తుదల నిద్దపు సుపాణి
మ్రుగ్గుల నొరయు క్రొమ్ములఱా లిరులక
డాని పుప్పొడి రాల్పడ నన వగ
చిందు గోమేధిక సీధువునకు మూగు
నింద్రనీలపుఱాతి గండుదేఁటి
గీ. మ్రోఁతలకు సొక్కు బంగరుపులుఁగు లెఱకు
పలుమొనల చించు రతనంపు పండ్లవడియు
రసము బ్రవహించు సెలయేటి యిసుము దిబ్బఁ గ
లుగు చిత్రతరుచ్ఛాయ కెలనఁ జేరి. 206

క. అటు ముందట పటుశైత్యో
ద్భటమయి దిటమయి నిగాఢదళసంతతి వి స్ఫుటమయి దుటమయి కడునా
వటమయి బటువయిన దొక్కవటముం గనియెన్. 207

చ. కనునెడ మంత్రియో సురశిఖామణి చూచితె యెంతవింత యీ
జననుత భోగికంకణత సద్విజరాజ సమాశ్రయత్వమున్
ఘనతరజూటభాసురత గన్గొన నప్రసవాయుధారి యో
యనఁ జెలువొందె నివ్వట మహర్నిశ మంచు విలాసవైఖరిన్. 208

గీ. పలుకు నమ్మంత్రి కూడుక ఫణిగిరీశుఁ
డత్తరుచ్ఛాయ కలరు నెయ్యంబు మీఱ
వచ్చి శ్రమమార్ప నొకకొంతవడి ప్రియంబు
వెలయఁగా విశ్రమించిన వేళయందు. 209

సీ. వెన్కజిక్కిన మెకంబును దెచ్చి తలనీట
దడిపి పువ్వులు సుగంధంబు వేసి
కొనతోక తెగగోసి మునిమీసలు పెకల్చి
కానుకజేసి కాట్రేని గొలిచి
క్రొవ్వని పందుల కొన్నిటిగ మలిచి
కత్తిఱాలను చివ్వి కౌచిగడిగి
తాలిచి కఱుకుట్లు గాలిచి యుప్పును
మిరియంపు పులుసును మేళవించి
గీ. చలువగల మఱ్ఱి తొఱ్ఱ క్రీచట్టుమీఁద
నిలువ నందఱితోఁ గూడ పొలుసు మెసవి
కోరకైదువదునెదారి గుఱుతుగట్టి
సామి సంతోషముననున్న సమయమునను. 210

సీ. తొగరు జుంజురుకులు తొలఁగదిద్దిన గొప్ప
కొప్పుల నెమలీక లొప్పజెరివి
సొగసుగా నుదుట కస్తూరినామములు దీర్చి
పొసఁగ జేగురుచుక్క బొట్లు వెట్టి
పాఱుటాకు చిగుళ్ళ పయ్యెదల్ సవరించి
యురమున గురిగింజ సరు లమర్చి
సరగణ్పు పండువెదురు వీఁకగల విండ్లు
లెక్కించి చిలుకమ్ము లేర్చిపట్టి గీ. మెకము వాకట్టు వెలిబూది మేళవించి
కరిమదం బంగములయందు గలయ నలది
నీటు మెఱయంగ నందంద నిలిచి మ్రొక్కి
కొమరు చెంచెత నాసామి కొమరు గాంచి. 211

సారాలంకారానుప్రాణితైకావళ్యలంకారము
క. గిరికలు కిరులను మించును
కిరుల శరీరముల బోలు కెరలెడుకరులున్
గరుల పొడవు లున్నతములు
గిరుల గడవ గిరులు మిన్ను గెంటించు హరీ. 212

అలంకారకృతవస్తుధ్వని
గీ. సామినీయసపు చెలికి చందుమొకము
చుక్కచాల్ గోళ్ళు వెండి మంచు మలలు జిగి
దొరయు గుబ్బలు తెల్లతామరల తళుకు
కలుకు నిడువాలుగన్నులు దలఁచి చూడ. 213

అంత్యచరణయతిభేదయేకాక్షరకందము
క. కైకోకీకా కెకుకై
కోకాకా కింకకూకి కూకకు కోకీ
కాకుకకు కేకికేకిక
కూకోకొక్కూకకింకకో కైకౌకా. 214

విస్మయము
క. హరినీదు ప్రతాపాతప
మరరే బ్రహ్మాండకర్పరావృత మగుటన్
బరులు వడకుదురు గొడుగులు
తిరసకర్తింపుదురు గంట తిమిరము గప్పన్. 215

దేశ్యపు తెనుఁగు వచనము
వ. కంటి విన్కలి దంట పేరింటి గుంటి యెకిమీఁద యీరైదు తూపుల నెసఁగు దునేదారీ తెల్లదీవిరాజ సుడివాలుకేలున దనరిన యొడయ కాకరా వెన్నెలగుత్తి కన్దోయి మన్నీఁడ తీవంచ మిన్కుల దొంగ నడంచిన సామీ పున్నెంపుప్రోదియై చూపట్టు తిరుపతి ప్రోలునేలు రామిమ్మ మబ్బుపూవిడుపు నిద్దాకప్పు కప్పు నెమ్మేనికాఁడ పాలసంద్రంపు బిడారంపు దేవర కన్నులీకలతమిన్న నాయక పులుగు సాహేబు బాబారాయఁడ మొసలివాయొంటుల నాయఁడ బూరగొమ్ముగల తుపాసి జాలువాసాలు తాలుపు జియ్య మోదుగ మొగ్గనిగ్గు చొక్కాటంపు ముక్కుమిటారంపు పటాని నెక్కువాని నెక్కు తండ్రి పొలదిండి గొంగదొర యుంగుటంబునజాలు గన్నయ్య కఱివేల్ప ముక్కంటి పండుల మెక్కు మొక్కళిని గన్న ముక్కంటి పొగడిక నమరిన ప్రోడ వ్రేతల యీలువులు కొల్లలాడిన నెఱవాది చాగపు మ్రాన్మ్రుచ్చిలించిన గంట రెంటత్రావుడు మొరాలించిన దిట్ట కఱ్ఱినేస్తి తరిమల మోపరి తమ్మికంటి కయ్యపుటోగిరంపు టయగారి పాట వినుజాణ జడదారి డెందంబు నెలవరి పదినూఱుపేరుల దిరుగు జేజే కలుగు లాయంపు టెకిరింత నెఱరౌతు గన్న దేవర నెలంత కొమరు మామడాచిన రతనంపుగని కొడుకు బోనంపుగుంపు వజీరు నీటికందుపాపని పినతండ్రి మూకల సూడు పొలదిండిరాయని పట్టి దురము బన్ను నెలవు పెనురాయనిసువుబంటు పాదుషా పదియాఱువేల నూట యెనమండ్రు జవరాండ్ర నేలిన మాయదారి యలివేలు మంగమఱేఁడ బారుదుగ జగములానిన బొజ్జగలాఁడ చేవంచదుగకొండల కాణాచి కాఁడా. 216

అచ్చతెనుఁగు పంచరత్నసీసములు
1సీ. కలిమివాల్గంటితోఁ జెలిమిచేయని మేలు
జులిమి వావిరి జూపు బలిమివాఁడ
మెడద వాటిలు కిత్తు వెడదవావడి గ్రోలి
బెడదవాపెడు గొప్ప యెడదవాఁడ
పులుఁగువార్వము నూని యలుగు వారల జెండ
గలుగు వాటంపు చుట్టలుగువాఁడ
కరమువాదిడు మామ యురము వాలించు మొ
క్కరము వారని మేలికరము వాఁడ
గీ. జారిపోరోగిరపు జడదారిమన్నె
పాట పాాటాన విని సొక్కు బోటువాఁడ
సొగసుకాటుకపేరి గొండగవిదారి
నోమి నెక్కొన్న నలరూపు సామిమిన్న. 217

2సీ. తులలేని పెందళ్కు నలుమోము జిగిపిల్ల
తుమ్మెద నునుబొజ్జ తమ్మివాఁడ
జగజోతిచే బొక్క సాదరమిడి వేడి
చూపులమై సొమ్ము లేపువాఁడ
యిత్తికతల యెన్ను నీను చూలాలు వా
విరి బూచు తఱిరెప్ప విప్పువాఁడ
తావితాల్పరి పగదాయకూటపు దిండి
రెక్కకట్టెర పక్కి జక్కివాఁడ
గీ. నెగడు తిగలేని తపసికంటి పొరబువ్వ
మన్నె వారిడు పొగడిక గన్నవాఁడ
సొగసుకాటుక పేరి గొండగ విదారి
నోమి నెక్కొన్న నలరూపు సామిమిన్న.

3సీ. గుడుగుపాల్ మబ్ముఱాపిడుగు వానకుగట్టు
గొడుగువాటము దాల్చు వడుగువాఁడ
నుడుగువాల్ గుమిమైల గడుగువారి మెఱంగు లు
డుగు వారని వ్రేలు మడుగువాఁడ
పడుగు వాలికనని చెడుగువారిని చెండ
పొడుగువానగుకత్తి దొడుఁగువాఁడ
వడుగువాకుగ బలి నడుగు వాకునఁ జేరి
యడువాలఁ ద్రొక్కు నడుగువాఁడ
గీ. నడుగు వదలని జగజెట్టి ముడుగుటకును
చిడుగుడు నగరిడి నడ చెక్కుడగువాఁడ
సొగసుకాటుకపేరి గొండగవిదారి
నోమి నెక్కొన్న నలరూపు సామి మిన్న.

4సీ. ఛాగపు పొలదిండి సాహేబు తలమాని
కపు వినుకొమరు పొగడ్తవాఁడ
ననుమీను మనుమని నుడిపంట వ్రాయుమేల్
దంటగన్న తుపాసి బంటవాఁడ
మోదుగ నునుమొగ్గ ముక్క చక్కనిపక్కి
నెక్కు నెక్కటి గేరు టెక్కువాఁడ
తపసిరా చందుడెందపు తమ్మి ముద్దియ
పటి నంగుగ మెలంగు మయిమవాఁడ
గీ. కోరి యనయంబు ప్రామిన్కు కొనలుదెల్ప
లేని వలకారి జిగిరూపుమేనివాఁడ
సొగసుకాటుకపేరి గొండగవిదారి
నోమినెక్కొన్న నలరూపు సామిమిన్న.

5సీ. బలితంపు వలపు దాల్పరిదిండిగమి ఠావు
గల దొరవాకిట నిలుచువాఁడ
చాగపు ననదోఁట సామింట జాలీను
బాలెంతయగు బొటవ్రేలివాఁడ
పాలేటిరాయని పాపనిసైఁదోడు
పెద్దకొల్విడు రొమ్ము గద్దెవాఁడ
బెడఁగు చెంబడిబిడ్డ కడుపున బొడమిన
జడదారి వడిసుడి నదరువాఁడ
గీ. వెల్లనుడి చుక్క తలగోము బొల్లిమోము
పక్కిరా మూపు నడిచక్కి నెక్కువాఁడ
సొగసుకాటుకపేరి గొండగవిచారి
నోమినెక్కొన్న నలరూపు సామిమిన్న.

అభేదరూపాలంకారము
సీ. కలఁచి సంద్రము బయల్ సెలసి కొట్టిన కోర
తుద చుట్టికొను నాఁచు మొదలి తాచు
చప్పరింపఁగ జాఱి చక్కఁగా సెలవిని
చిందు నురుగు బుగ్గ చందమామ
కొప్పరింపఁగ రోమకోటి వింటను డుయ్యఁ
బొడమిన బెజ్జమ్ము లుడుగణములు
రిక్కించి వీనులు దిక్కు లదరఁ జేయు
ఘుర్ఘురధ్వని ప్రతిఘోష మురుము
తే. పొరలి కలనంటు మున్నీట బురదతోడి
యొడలు జాడింపఁ గడనూడి పడిన పెల్ల
లబ్జజాండంబు నీవు మహావరాహ
రూప మందిన వేళ గారుడగిరీశ. 218

మ. వనమేలా వనమేల పట్టణగణావాసప్రవాసప్రరం
జనమేలా జనమేల రాజగృహసంచారప్రచారప్రసా
దనమేలా ధనమేల ఘోటకభటాధారద్విదారద్విపాం
గనమేలా గనమేలనిన్ గనఁ బరా కారూపకారూపకా. 219

గూఢచతుర్థపాది
చ. మెలఁగిన బాలికన్ రెయితమిన్ డిగనీక వరాల్గురించిమేల్
గలరవనాదముంచి యెద లాగెజు పౌరుషమామురారి సా
గుల మిడిగాక నీపనికి గోవెల చానఁగ బొట్టుకట్టిలో
గిలియిడి గల్గు మేరదయ నేరుముసామిక నీవెనట్టులో. 220

సమానాక్షరనకారయుక్తప్రాసావకలిప్రాససీసానుప్రాణితసర్వలఘుసీసము
సీ. తనువును దనువును పెనఁగొన నెనసిన
మిసమిస మను నును చనుమొనలును
చనువున నినిచిన తనివిని దనరును
మును నిను జెనకిన వనితను గన
కనునను నెనరెన యని కినుకను పని
గొని కినుకను దనియ నతనుఁ డని
మొనలను పొనపొన గునగున మునుకొని
దినదినమును గొనబున ననిచిన
గీ. ననయను ధనువున గినిసిన వెనుక చి
న వనటను గనుట నికను ననువున దను
న నెల నెలను మనసున ఘనతను గనుచు
నెనను మునుపొనర నవని వనజనయన. 221

ద్వ్యక్షరి
క. నిన్ను నెమ్మనమున నమ్మిన
ననుమానము మాన మాననని నేమమునన్
మన నీనామము నూనె
న్నను మానిన నిన్ను మాన నానేమేనా. 222

ఏకాక్షరకందము
క. లోలాళిలాలిలీలా
ళీలాలీలాలలేలలీలలలలులే
లోలోలైలాలలల
ల్లీలైలలలాలలోలలేలోలేలా. 223

ద్వాత్రింశదనుప్రాసయుక్తప్రాససీసావకలిప్రాససీససంసృష్టి
సీ. జాలువ్రేలును సంకు గ్రాలుడాలును బిల్ల
రాలు కేలునుగల బాళివాఁడ
పాలుప్రోలును పుల్గుడాలు మేలును పచ్చ
దేరు సాలునుగల హాళివాఁడ
మేలుకోలును జగమేలుకీలును గల్మి
జాలునాలును గల కీలులవాఁడ
వాలుడాలును మున్గు చేలుప్రాలును వేల్పు
చాలుమేలునుగల వేలవాఁడ
గీ. రేలును బగళ్ళు నెఱజగడాలు బన్న
పాలువడు గాణ పొగడత సోలువాఁడ
బేలుపోవని పొలదిండ్ల నూలుకొనుచు
దీలువడ గొట్టునట్టి గగ్గోలువాఁడ. 224

షట్చక్రవర్తి షోడశరాజనామాభిరామప్రాసభేద భాసమానవృత్తము
చ. పృథివిఁ బురూరవు న్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంత్రమ
త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయు న్భగీ
రథుని మరు త్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం
బృథుని యయాతి రంతి శశిబిందుని భార్గవు మించవే హరీ! 225

క. దేవర చూడని వేటలు
లేవే మిము మెచ్చజేయ లేమేయైనన్
మా విలువిద్యల నేరుపు
నీవించుక చూడవలయు నేడమి కడఁకన్. 226

క. వాలమ్మున నొకచమరీ
వాలమ్మున నేసి భిల్లవల్లభ యవినిన్
వాల మ్మనువుగ మృగయా
వాలమ్మునఁ బట్టి శౌరివైపు గనంగన్. 227

క. జాలమ్ము వెడల శబరీ
జాలమ్ములయం దొకర్తు జవమున ఖగరాట్
శైలపతి మెచ్చనేసెను
కోలెమ్మునఁ గాడయేరు కోలె మ్మొకటన్. 228

క. ఈవిధ మొసరఁగ మృగయా
ప్రావీణ్యము నెఱపఁ గాంచి ఫణిగిరిరాయం
డావల వస్త్రమణీభూ
షావళు లిప్పించియున్న యత్తఱి మిగులన్. 229

కకారాద్యక్షరకందము
క. కలకంఠము కరెపులుగును
కలవింకము కంకణంబు కహ్వము కరుడున్
కలరవము కనకభుక్కును
కళకును కంకమును గాకి కక్కెరకైదున్. 230

మ. మొదలైనట్టి ఖగవ్రజంబు తగ సమ్మోదంబుతో వేటయం
దదవౌ డేగల ముష్టిబట్టి గములైయంతంత చప్పుళ్ళు బె
ట్టిదమై యుండఁగఁ జెట్టు చెట్టు సెలకట్టెన్ గొట్టి బెట్టేయుచున్
మది నుప్పొంగుచునున్న యా మృగయులన్ మన్నించుచున్ శౌరియున్. 231

గీ. ఆఱుత దోరెపు త్రాడుచే నత్తె మమర
దళుకుచేఁ దోల్త వానకోయిలల దునిమి
బైరిచే వెన్క కొంగలబాఱు గొట్టి
సాళువముచేత గుందేళ్ళు జీరెనంత. 232

సీ. చెంగావిచాయ హొరంగు మీఱిన దట్టి
చుంగులువార చెఱంగు జెక్కి
అపరిమితప్రభాతతపనీయకటిసూత్ర
వలయంబుపై చిక్క మలవరించి
వలచేత మఱిముద్రికల కాంతి దిశలందు
మొనయు వేష్టపు డేగ ముష్టి బట్టి
డాకేల పచ్చరాడంబైన చోపుడు
గోలనెల్ల విహంగకొలు జోపి
గీ. వెన్కకును జాగి యూకించి వ్రేసివేటు
తోన చెంగున లంఘించి దాని దిగిచి
హస్తమును పూని పక్షిసంహారమునకు
వేఁటకాండ్రను దోడ్కొని విపినభూమి. 233

సీ. లావుక పసరిక లకుముకి గిజిగాడు
పూరేడు జీనువు కారుకోడి
గువ్వ గుంకనకోడి గోర్వంక కోయిల
భరతము జక్కువ పావురమ్ము
పొటిపిట్ట యుల్లంకి పొన్నంగి తీతువ
గున్నంగి యేట్రింత కొక్కరాయ
పిచ్చుక కేరిజబెగ్గురు వడ్లంగి
చీడ చెమరుగాకి చిల్కపెడిచె
గీ. పికిలి పాల కూకటి బెళపజిట్ట
కక్కెరవెలిచె గొఁగడ కన్నె లేడు
పాలజీనువ డాబయుఁ బైఁడి కంటె
నీళ్ళముచ్చును నుల్లంకి చల్లపిట్ట. 234

క. తమిహెచ్చ పొదలకైదుల
గుమిగని యీకెలును డేగకును డిండివడిన్
చమరుం బాతని పిడికిట
నమరంగా బట్టి యేయ నది యవ్వేళన్. 235
(పా) క. (చమురుంగాకిని శ్రీహరి
కొమరుగ నీకియలు డేగకును దడివడిగన్
చమరందంబుగ ముష్టిని
యమలంగా బట్టి యేయ నాసమయమునన్.)

సీ. కైదుబారెగరిపో గనుగొని క్రిందుగా
చివచివ మెఱుఁగుతీగవలె సాఁగి
యవ్వేటుపడిపయి నంటి తొడిగొకటి
విఱిగిపడగ నట్టె వెంబడిబడి
పాటున నొక్కటి బట్టుక యటుతారు
బిరికైదు నొక్కటి గఱచి తొంటి
పలుమొన దిగియుచు ప్రక్కలఁ బాఱుకౌఁ
జుల రెక్కలను గొట్టుచును పొదలుచు
గీ. గలగలన మెల్లనే మువ్వగదల కొదవ
పుఱుగులదహ గూయుచునుండ దెలసిశౌరి
కదసి యాడేగ చేనుంచి కైదు తలలు
నొక్కి కొనగో మెదడెల్ల చెక్కిమెసఁగి. 236

గీ. కాళ్ళుకైదులు నెడమచే కడకు దివియ
నంతట నదను దప్పినదగుటఁజేసి
తేలిగుడిజుట్టి యాసామి కేలిడేగ
నొయ్యనొయ్యన జుక్కలనొరయ నెక్కె. 237
(పా) తే. (పిట్టపిట్టకు చిక్కంబు పెట్టినట్టి
యదను ననదను దప్పిన దగుటఁజేసి
తేలిగుడి సుట్టి యాసామి కేలిడేగ
యొయ్యయొయ్యన జుక్కల నొరయనెక్కె)

శా. ఆరీతి న్వినువీథి నెక్కినను డాయన్ లేక యాశౌరి యొ
య్యారం బొప్పఁగ నెండమాటుగను చే యడ్డంబుగా మోమునన్
జేరంజేయుచు దృష్టినిల్పి వెనుకన్ జేయూది కూర్చుం డొకిం
తోరై చూచుచు నంతనొక్కవనికై యొయ్యొయ్య కేడించినన్. 238

క. కనుఁగొని యచ్చట వ్రాలుట
మనమున నిశ్చయము చేసి మంత్రిసహితుఁడై
తన సేనల నచ్చోటనె
యుని చటు చని కనియె నొక్కయుపదన మెలమిన్. 239

వ. అంత

క. నారాయణవనమున భుజ
సారుం డాకాశరాజచంద్రుని సుత నాం
చారున్ నెచ్చలులుం శృం
గారవనమ్మునను మిగుల గారవ మెసఁగన్. 240

మనోజపూజాభివర్ణనము
అపూర్వప్రయోగము
సీ. విరివియౌ తరుల క్రొవ్విరి తేనె మురువైన
కరువలి వీచు చెంగల్వకొలని
కెలన రేజోతి రాచలువతిన్నయపొంతఁ
బరువంపు పూలచప్పరము బన్ని
కురువేరు పెడవెట్టి మరువంపు దడిగట్టి
ముంగిట కపురంపు మ్రుగ్గుబెట్టి
గురుతరకౌశికాగురుధూపధూమము
లిచ్చి సువాసన మెదుట నుంచి
గీ. మదనురతి యుక్తముగ మృగమదమునందుఁ
జేసి తత్పీఠమున నిల్పి భాసురముగఁ
జందనసుమాక్షతములఁ బూజలు ఘటించి
బహువిధోపాయనమ్ములు వహి నొసంగి. 241

సీ. ధ్యానమాత్మభవున కావాహనము లోక
చారి కాసనము ద్వక్స్థాయి కర్ఘ్య
మంబు దాపునకుఁ బాద్యము వార్ధిమన్మని
కాచమనీయ మబ్జాంబకునకు
స్నానంబు శంబరాసనునకు వస్త్రము
ప్రకటాంబరతనుధారి కుపవీత
మద్వజరాజు మేనలునకు సుగంధ
మతిశీలగంధవాహరధి కక్ష
గీ. తముల విహతశౌర్యునకుఁ బుష్పము విరివిలు
తునకు ధూపము సురభి మిత్రునకు దీప
మల రవీంద్వక్షసుతునకు ఫలనివేద్య
ము శుకబలునకుఁ దాంబూలము రతిపతికి. 242

గీ. అనుచు సకలోపచారంబు లర్థిఁ జేసి
మకరచిత్రపతాకాయ మదకరాయ
మత్తహంసగజేంద్రాయ మన్మథాయ
మానినీమానహరణాయతే నమోస్తు. 243

వ. అని వెండియు.

శా. జేజే యిక్షుశరాసనా శరణు రాజీవధ్వజా మ్రొక్కు భ
ద్రాజీవేళకుమారకా వినుతి సారంగీగుణా డెంకణల్
రాజీవాదిశిలీముఖా భజనమో రాజాప్త కొల్వోశుకీ
రాజాదండము దర్పకా ప్రణుతులో రామామనోహారకా. 244

చౌపదములు
అదనిదె మముఁ బ్రోవ తులోన్మదన
మదనమోహన చమత్కృతి సదన
సదనానిల కౌశల శరమదన
మదనటనస్థితి మదిని వలదనా. 245

వితాక్షచౌపది
కమ్మని చిటిపొటి కరువలి తేరు
తుమ్మెద బలగపుఁ దొలఁగిన బాఱు
కొమ్మల దళములఁ గూర్చునజీరుఁ
డొమ్ముమదన నియ్యొణి కెవ్వారు
పచ్చవింటిచే పంతముతోడ
మెచ్చుల గెలుపుల మించులఱేఁడ
హెచ్చుకంటిదొర నేఁడిన ప్రోడ
పొచ్చెము లెంచక పూవిలుకాఁడ. 246

డిండిమవృత్తయుక్తకర్ణాటచౌపది
విరివిగానెల పండువెన్నెలలుగాయ
పురివిచ్చి నెమ్మిగుంపు తటానడాయ
మరువౌ చిలుకవార్యము దువాళిసేయ
తరిగాదు మనుపు మందఱిని రతిరాయ. 247

చ. అని వినుతించి మ్రొక్కి కమలాసన లా వివిధోపహారముల్
గొని తమలోన భక్షణలకుం బ్రియమైన ఫలాదులన్ రుచుల్
గొనుచు మనోవికాసములకుం దగు జాజసపాట లుబ్బుమే
లెనయఁగఁ బాడి సోలుచు రహిం దమలోననె దారు మెచ్చుచున్. 248

వనవిహారవర్ణనము
చ. మదనుని యిట్లు నోమియల మానిను లెంతయు సంభ్రమంబునన్
బొదలుచు నాసవంబనఁటి పూవుదళంబుల ముంచిముంచి మె
చ్చుదనర నొండొరుల్ చవులు చూచి భళీ సొగసయ్యె నంచు స
మ్మద మొదవంగఁ ద్రాగుచును మాటికిఁ గేరుచునుండ నయ్యెడన్. 249

క. ఆవసములు చవిగ్రోలెడి
యాసవసవ లెఱిఁగి తేటు లలరులగమిపై
యాసవదలి పొదలికదలి
యావరస గాంచి చెంత నాడర యమునన్. 250

దశదోహదవృత్తము
క. పలుక కొరవి గోగిడ వా
విలి మూర్కొన్న పొన్నఁదన్నఁ బ్రేంకణము మి పా
టలఁ గ్రోవినగ చనుపకము
తిలకముగన మావినంటఁ దెగడన్ బొగడన్. 251

వ. పువ్వుఁజేసి యవ్వారుఁబోడుల వెండియు.

సీ. తిలకంబుఁ నొకతె చూపులసన్న గావించెఁ
జాంపేయ తరువోర్తు జంకజేసె
గోగు నొండొకతె యెగ్గులు బల్కుచును దూరె
గడుఁజేరి యొకతె ప్రేంకణమువాడె
నొకతె డాయుచుఁ గురవకము గౌఁగిటఁ జేర్చె
వకుళంబుపై మించ నొకతె యుమిసె
ఱేమావి చేనంటి ప్రేమనొక్కతె యూఁచె
నొకతె వావిలిమఁద నూర్పు లొసఁగె.
గీ. గడిమి నొకతె పొన్నఁ గనికి కాకిక నవ్వెఁ
బ్రకటముగ నశోక మొకతె తన్నె
నిట్లు పానవశతనింతులు మెలఁగ నా
తరులు సరచి విరులఁ దనరెనంత. 252

వనకేళి మధురగతిరగడ
సారసవదనలు సారపదమ్మున | గారవముగ శృంగారవనమ్మున
తములెచ్చిన చిత్తములను వేడుక | గములై తగు పూగములను గూడుక
యెదల పొదలు పయ్యెదలును జాఱఁగ | మెదలు చూపు తుమ్మెదలటు జేరఁగ
బలువిడి జిగిగుబ్బలు జిగి దేరఁగఁ | దలతలమను వార్తలు ముదమారఁగ
నలువుమీఱ వేనలు లలరింపుచుఁ | గులుకు నడల బెళ్కులు గన్పించుచుఁ
బలుకుల కపురఁపు బలుకులు నింపుచుఁ | జెలరేఁగుచు కుచ్చెలల బిగింపుచుఁ
బకపకనగి చంపకముల కరుగుచు | శుకములె గరకింశుకములు దిరుగుచు
బరుపపు ననకాపరువని దిరుగుచు | గురువిందలపొద గురువని మఱుఁగుచు
నిమ్మరువము దన కిమ్మనువారును | రమ్మదె కర్పూరమ్మను వారును
సహకారమ్ములు సహకారమ్ములు | మహిళకుఁ బ్రియమీ మహిసుఫలమ్ములు
నారికెడంబులు నారికెడంబులు | వేరులుంచ కుర్వేరువటంబులు
పొన్నదేని దా పొన్నకు డాయకు | సన్నజాజికై సన్నలు చేయకు
నలగని సురపొన్నల చే నదుమకు | చులకనగా మంజుళకము జిదుమకు
యీకుందము చెలి కీకుందము నిలు | మాకందంబులు మాకందంబులు
కదలిచూతమీ కదలివికాసము | పొదలగంటె పూపొదల విలాసము
వెదకు మిపుడు క్రొవ్వెదకును మల్లెలు | మెదలెనిందు తుమ్మెదలకుఁ బిల్లలు
మరల గంటితామరల కొలంకుల | గురులనెతగవా గురులు కెలంకుల
మలయఁగ జొచ్చెను మలయసమీరము | కళికలకేన నగ్గళికల మీరము
కలికతనముగల కలికికుచమ్ములు | తుల యనఁదగు పంక్తులకుచమ్ములు
నలరుగొన్న తరు లలరుల నాగము | చెలువరొ చేయుము చెలువగు గానము
నని వనితలు వని ననితరలతులను | వనమయూరధావనమృదుగతులను.258

అచ్చతెనుఁగు ప్రాసకందము
క. చిలుకల కొలుకులు బిత్తరి
సొలుపుల మెలపులను గరికి సొబగుల ముద్దుల్
చులుకఁగఁ బలుకుల కపురపు
బలుకులు జలజలన యొలుక బలుకుచు మఱియున్. 254

అచుంబితరచితచతుర్దళయతయమకాంత్యనియమభరణచరణగరిష్ఠనిరోష్ఠ్యవిరాజితరగడరాజము
అపూర్వప్రయోగము
కలికి కలికితనాన నానది గట్టి | గట్టిగ నంటి నంటిని
కలికి కలికిచ నిన్న నిన్ననగాక | గాక కడికంటి గంటిని
జాలి జాలిచెనంత నంతట జాల | జాలక నీతి నీతిగ
నేల నేలకిలతిక లతికన నీక | నీకడజాతి జాతిగ
సారసారస రాజిరాజిల సరస | సరసత చల్లచల్లగ
కేరికేరిస దాడి దాడిలకింక | కింక నెల్ల నెల్లగ
నాడనాభగ నాచనాగజయాన | యానన గట్టగట్టగ
నీడనీడగ నేలనేలకి నెచ్చ | నెచ్చెలి దిట్టదిట్టగ
దరిని దరినిల లేక లేకల దండ | దండిన నంగనంగన
సరసి సరసిని సన్నసన్న నెసంగ | సంగతి నంగచంగన
నిచ్చనిచ్చన నయ్యనయ్యెడనెన్న | నెన్నడరేక రేకగ
నచ్చినచ్చిక కాని కానిగయాళి | యాళిరి సాకసాకగ
కన్నెకన్నెరికాన కానల గన్నె | గన్నెర చాయ చాయగ
నెన్నెనెన్నిన దాస దాసనకింత | కింతగ డాయ డాయగ
గదలి గదలిక నలరె నల రెయిగాయ | గాయక నీడ నీడగ
నదిరి నదిరహి సరిగసరిగయి సందె | సందెల జూడఁజూడఁగ
రాగ రాగతలంకెలంకెగ రాక | రాకడ లెక్క లెక్కడ
తీగతీగడి నీవ నీవనదేట | దేటకి నిక్కనిక్కడ
నీటనీలన ననియెనని యెంతేని | తేినియతేరతేరకె
చాట నాటన కాదకాదయ సంగి | సందిడ చీర చీరకె
నాతి నాతిలకాళి కాళి జనించ | నించదె నాగనాగనె
నీతినీతిక కానకాన జనించ | నించదె నాగనాగనె
లలన లలనలతతిని తతినిం లాగి | లాగిగడించ డించగ
నలిని నలినిడ నిగ్గనిగ్గెడ నాట | నాటల నంచనంచగ
ననల ననలన గతిగగతిగన నాచె | నాచెయి గట్టగట్టగ
ననిచె ననిచె ననంగ గంగఱయంత | యంతట జిట్టజిట్టగ
చక్క జక్కనిదంట దంట లెసంగ | సంగతి దాట దాటది
అక్క అక్కడి లీల లీలత నంట | నంటని చాట చాటది
నీలినీలిని నాడనాడన నీచె | నీచెన దాయ దాయగ
రాలరాలగ నేయనే యలరంగ | రంగర కాయ కాయగ
యింతి యింతియె యేనయేనల నింద | నిందగ నేన నేనన
కాంతకాంతత తాళితాళిచె కలసి | కలరి సితాన తానన. 255

సీ. ఏలాలతలు దూర నేలాలతాతన్వి
ననలేని కోయ క్రన్నన మృగాక్షి
మరువబోకింత యేమరువంబు జానన
జాతిటు బెనుపుటే జాతినాతి
గోరంట పూగొమ్మ గోరంటకే కొమ్మ
కేళిగైకొమ్ము కంకేళి బాల
వాదులేటికి విరవాదులకె లేమ
పొగడదండల కెంత పొగడె దబల
గీ. కన్నెగేదఁగి రేకుకై కన్నెవలన
వలని మచ్చరమేల యేవలన ననుచు
నోజమై గూడి యవురు పయోజముఖులు
చయము వేడుక పుష్పాపచయము జేసి. 256

జలక్రీడాభివర్ణనము
ప్రాసభేదము
క. వ్రీడావతు లయ్యెడ నీ
లీలం బుష్పాపచయకలితఘనకేళీ
లాలితజనితశ్రములై
యాలోజలకేళికాంక్ష నటు చన నెదుటన్. 257

క. అంభోజోత్పలకైరవ
బంభరకలహంసచక్రబకవివిధరవా
రంభవిజృంభణసంభ్రమ
గంభీరంబైన కొలను గనుఁగొని యచటన్. 258

మాధుర్యము
క. నారీమణు లయ్యెడ దమ
సారపు మణిభూషణములు సడలించు నెడన్
గారా కెడలిన లతలన
తీరై కనుపట్టి రధికతేజం బలరన్. 259

క. అక్కొలను జేరి దిగునెడ
చక్కఁగ సౌపానములను జాఱి యహ యో
యక్క యిది యెంత జర్కని
యొక్కసఖియ తనదుచెంత యూతఁగ నిల్చెన్. 260

క. నీకును నాకును జోడ
ల్లా కిన్నెరకంఠి కామృగాక్షికి సరియౌ
నాకొమ్మకు దానికి సా
టికలికికి నుద్ది యల్ల యింతి యటంచున్. 261

ముద్రాలంకారము - అపూర్వప్రయోగము
మ. వనజాతాక్షి యురోజకుంభములతో వర్తించురోమావళీ
ఘనహస్తస్థితితోఁ గన న్మకరికల్ ఘర్మాంబులన్ దోఁగ జా
ఱిన గస్తూరిమదంబుతోఁ దళుకు మీఱెన్ హారపద్మాభతో
మన ముప్పొంగఁగ డిగ్గెఁ దత్సరసికి న్మత్తేభవిక్రీడితన్. 262

జలకేళి వృషభగతిరగడ
చలువ పలువగ మించ నంచను సరసి | సరసిజముఖులు వీడక
నలువు వలువలు గట్టిగట్టి మనంబు | నం బురికొనెడు వేడుకఁ
దరని సరినిల నమరి మరితమ తమక | తమకము లొనర డిగ్గుచు
మెఱసి యొరసి యొకళ్ళొక ళ్ళటుమెట్టు | మెట్టుచు మిగుల మొగ్గును
ఘనత గను తమివలపు గలపము కరగ | కరగత జలము చల్లుచుఁ
దనువు లనువుగ డయ్య నొయ్యన తరగ | తరగక నిలిచి మళ్ళుచు
యెలమి బలిమిగ నీదవే దుడుకేల | కేలటు సాచకానవు
లలన యెలనగ వొమ్మర మ్మొకలాగు | లాగున నెంతదానవు
రావ కావగ ననుచు బిరాన | రానను తొడిగి గ్రమ్ముచు
తీవరేవల ననఁగి పెనగుచు తెలివి | తెలివిరిదమ్మి రెమ్ముచు
కుసుమరసములు విసరుపగ గైకోక | కోకనదంబు గాంచెదు
వనము బీసములక్రేవ నావగవారి | వారిని దనుప నెంచెదు
కప్పుపుప్పొడి వ్రేయ నాయమె కంట | కంటటు బెంచివేగమె
యప్పమెప్పుగ తోవకలనీ వాడ | వాడకయుండలాగమె
మరలి పొరలుచు నలికతిలకము మాయలు గొన్ని సేసెదు
తరలి కెరలుచు తోన వేనలి తరమె | తర మెఱుఁగకయ తీసెదు
వద్దు రాగతనాలు వలుకకు | వాదులాడగ తగునె వారికి
యద్దిరా దొరసాని విటు రా | నగునె పొమ్మటు నీదుదారికి
యనుచు నుండగ నేచి యొకచెలియందు | నందఱ జాచి కొందఱ
దనర నొహో రంతు సేయఁగ | తగునె యిటు నెఱబిరుదు ముందఱ
యెల్లవారికి నోలపెట్టెద | నీదులాటకు బిరుదు గట్టెద
నొల్ల ననియెడివారి దిట్టెద | నొనర మన్మథు నా నీబెట్టెద
నెందు జునిగెద రంచు బెట్టుగ | నేచి చే సుమరజము నొట్టుగ
యందరలపై జిల్కిపట్టుగ | నాడి సఖియకు బ్రియము పుట్టగ
నోల యాచిగురాకుఁబోణికి | నోల యాయంబురుహపాణికి
నోల యాయలినీలవేణికి | నోల యీమదకీరవాణికి
నోల జక్కవబాల కిప్పుడు | నోల తామరగోల కిప్పుడు
నోల తుమ్మెదనారిమీఁదను | నోల యంచయొయారిమీఁదను
నోల యాకసవిభుని నందన | నోల యోషాకలితచందన
యనిన సతు లందఱును భళియో | యతివ నేర్పరి వని రయంబున
వనరుహాకరసీమ సుద్దులు | వరుస నిడిన యనంతరంబున. 263

ఉత్ప్రేక్షాలంకారము
చ. అలయక వెన్కయీత నొక యంబురుహానన క్రీడ సల్పుచో
వలిపెపు పైటమాటునను వట్రువచన్మొన లొప్పెఁ గాంతి తా
వలపు బ్రవాళవల్లికల వ్రాలిన కోకయుగంబు మారుచే
వలబడి ముక్కు లెత్తుకొను వైఖరి జూడఁ జెలంగెఁ జిత్రమై. 264

ముద్రాలంకారము
వనమయూరము. చండగతి పెన్నెఱులు జాజి కటిసీమన్
మెండుకొని గప్ప కడుమీఱి జలకేళిన్
దాండవము సల్పెడు విధంబునను నీటై
యుండి రబల ల్వనమయూరముల రీతిన్. 265

రూపకాలంకారము
సీ. తళుకు పెన్నెరి ముంగురులు గండుతుమ్మెదల్
సోగకన్నులు కప్పుచూపు తొగలు
తరులతల్ మొగములు తగు తెల్లదామరల్
గబ్బిపాలిండ్లు జక్కవలజోడు
బడుగులు బెడగు లయ్యరుణాంబుజంబులు
మీఁగాళ్ళు మేటి తాఁబేటిచాలు
చేతులు తూండ్లు రాజిల్లు నాభులు సుళ్ళు
సోలుచూపులు బెళ్కు మీలు గాఁగ
గీ. లలన లెసఁగిరి కాసారలక్ష్ము లనఁగ
సుడియు నడుములు వడవడ వడక జడత
నడల నడుగులు తడబడ తొడలు జడియ
నెడల బడలిక లెడనెడ నడల నపుడు. 266

సీ. చిలుకలకొలికి తొయ్యలి యింతి యుగ్మలి
మగువ పైదలి బోడి మచ్చెకంటి
యెలనాఁగ వెలఁది కన్నుల కలికి నవలా
మెలఁత మెఱుఁగుఁబోడి నెలఁత పడఁతి
చెలువ జక్కవ చంటి చేడియ లతకూన
పొలఁతి ముద్దులగుమ్మ పువ్వుఁబోడి
జవ్వని బిత్తరి చాన ప్రోయా లన్ను
కన్నె లేమ తెఱవ కలికి గోల
గీ. ముగుద కొమ్మ సకియ ముద్దియ జవరాలు
నతివ గోఁతి కొమిర యందగత్తె
యెరపులాడి బోటి యువిద బంగరుబొమ్మ
తలిరుబోడి మొదలు చెలులతోడ. 267

క. వేళంబె సలిలవిహారణ
కేళిరతిం దేలి యామృగీలోకనతా
చాల ముదమంది యొండొరు
కేలూదుచు సరసభమునఁ గేరుచుఁ నగుచున్. 268

గీ. జిలుఁగు వలిపెంపు మైనెల్లఁ గలయనంటి
యంగరుచి చేలమున మించి రంగు మీఱఁ
గొలను వెలువడు నప్పు డాకొమ్మ యొప్పెఁ
బటిక నార్చిన యపరంజి ప్రతిమబోలి. 269

చ. చలువలు దెచ్చియిచ్చె నొక చాన నెరుల్ తడియార్చె నొక్క తొ
య్యలి నెఱిగొ ప్పమర్చె నొక యంగన వెంబడి పూలమేల్ తురా
నెలకొన నిల్పె నొక్కచెలినిం డెదగంధ మలఁదె నొక్కపైఁ
దలి మెలిసొమ్ము లుంచె నొక తన్వి *నభోపగు గూర్మిపుత్రికిన్. 270

  • నభోవిభు (1882 ప్రతి)

    క. అరయ నపరంజి ప్రతిమకు

మెఱుఁగిడి చొక్కమగు జాజు మెయి జరమిన యా
యిరవున యాకాశమహీ
శ్వరసుత తగనెరుల చూడ్కి వహి నింపెసఁగన్. 271

సీ. సంపంగికావులు చందురుకావులు
వెలిపట్టుజీబులు వేఁట చాళ్ళు
బొమ్మంచు ముయ్యంచు పొప్పళి హొంబట్టు
నుదయరాగము కందులు రత్తవన్నె
ముత్తలపందిళ్ళు నుత్తరగోగ్రహ
ణంబులు కరకంచు నాచువన్నె
నిండువన్నెలు మంచినిగమగోచరులు సా
మంతవీథులు ప్రతిమలును బొగడ
గీ. పచ్చలును మేఘవన్నెలు పచ్చపట్టు
గరుడపచ్చలు నేత్రముల్ తురగవళ్ళు
హంసవళ్ళును పద్మాలు హరిణవళ్ళు
మొదలుగా వల్వలు ధరించి ముదిత లపుడు. 272

ఉత్సాహయుక్తగీతి
ఉ. అందమైన కీలుగొప్పు లందుఁ బూలుతేనియల్
చింతనీక యుంచి నిగ్గు చెంగళించు జాళువా
సందిదండలుం గరాలు సన్నసన్నసరులు హొం
నందెలుం గడెంబు లచ్చహారముల్ తురాలు క్రొం
గీ. బసిఁడి గంటల మొరనూళ్ళు బాహుపురులు
సరిపెణలు ముత్తియంపు ముంగరలు తాళి
పతకములు దాల్చి పన్నీట పదనుమించు
చందన మలంది రంతట సంతసమున. 273

క. ఈరీతి వారి భూరి వి
హారానంతరమునందు నతిచతురగతుల్
మీఱఁ గయి జేసి మనమొక
మేరన్ క్షణమాత్ర విశ్రమింతమె యనుచున్. 274

క. ఒకవంకఁ బువ్వుతేనియ
నకలంకంబైన వంక యండను మెలఁగన్
బికశారికశుకనికర
ప్రకటరవంబు విని సతులు పరమోత్సవలై. 275

ఉ. కేవలమైన నుంజిగురు కెంజడమై సుమనఃపరాగ మే
తావి విభూతిై పికలి తాననినాదము సింగినాదమై
క్రేవలఁ *బూపిదీనియంబు గీల్కొన దాల్చిన యోగపట్టియై
మావివిలాస మింపెసఁగ మన్మథమోహనసిద్ధుఁడో యనన్. 276

  • బూవుదీనియలు


క. ఆచూతము చెంగటఁ గని
నాంచారును దొడుక చెలులు నయమార్గాతి
ప్రాచుర్యప్రౌఢోక్తి
శ్రీచాతురి మనము బొదలఁజేయుచు డాయన్. 277

క. లలనామణు లావేళనె
యెలమామిడి కొమ్మ వదలి యిటునటు జన రాఁ
గులుకుచుఁ బలికెడు డేగను
గలకలమని మువ్వ గదలగాఁ గని వేడ్కన్. 278

ఉ. కాంతలతో నభోవిభుశిఖామణి పుత్రిక వేగడేగ న
త్యంతరయంబునం బొదివి యత్తరుశాఖల నెక్కి మిక్కిలిన్
సంతసమంది పట్టుకొని చాలప్రియంబున గారవించి యం
తంతకు నుబ్బి భూషణమయంబగు హస్తముచేత దువ్వుచున్. 279

ఉ. ఎవ్వరిదొక్కొ యివ్వలన నివ్వని కెవ్వలనుండి వచ్చెనో
జవ్వనులార యిప్పులుఁగు చందము నందము డెందమందునన్
నివ్వెరగందఁజేసె నిఁక నేటికి మాటికి మాటలేటికిం
దెవ్వతెయైన యిట్టిచెలు వెన్నను విన్నను గన్నఁ దెల్పరే. 280

క. అని చిరతనూరి నాంచా
ర్వనితామణి చెంతనున్న వామాక్షి కరం
బున కావేసడము నొసం
గిన యత్తఱి నంజనాఖ్యగిరివరుఁ డచటన్. 281

గీ. ఎండచేఁ గంది దండనాథుండు దాను
నందనమునకు వెడలి యానందలీల
వచ్చి వనిఁ జొచ్చి చల్లనివసతు లందు
బడలికలఁ దేలి వయ్యార మడర నపుడు. 282

గీ. తళుకు గులుకంగ ననుచు మావులను బెనుచు
కొనిన పూదీవ లునుచు వాసనల గొనుచు
మలయు నీడల నిలుచు జల్వలను మనుచు
మెలఁగు నలులను బెనుచఁ దెన్నులను జనుచు. 283

గీ. మిసిమిరాచిల్కఱెక్కల పస నదల్పఁ
బూను నచ్చపు బచ్చఱాతేనె జూచి
యాత్మ నరుదంద దందశూకాద్రినేత
సచివుఁడును దాను గూర్చున్న సమయమునను. 284

అపూర్వప్రయోగము
సీ. వేగమె మదినెంచి వేంకటనాథుండు
తనదు నెయ్యంపుఁబ్రధాని జూచి
యివ్వని మనడేగ యెచ్చట నున్నదో
నెమకు పొమ్మన రమారమణునాజ్ఞ
జవదాట కవ్వేళ జని యమాత్యవరుండు
చిరతనూరను పద్మసరసిచెంత
నెచ్చెలు ల్గొల్వఁగా హెచ్చిన నాంచారు
దేవిని గనుఁగొని భావమునను
గీ. సంభ్రమంబు ముదంబు నాశ్చర్య మొకటి
పెనఁగొనఁగ నప్పు డౌరౌర యనుచు
దొరలగా నొక్కు ఘనసార తరువునీడ
నిలిచి యచ్చెంత నున్న నెచ్చెలులఁ జూచి. 285

అపూర్వప్రయోగము - యమకము
క. నాళీకవనాళీ కల
నాళీకకువేలపాలహారిముఖాళీ
పాళీదృక్పాళిం గని
బాళిం బడెనేని మౌని బద్ధుఁడు గాఁడే. 286

వ. అని తన మనమున నుతియించి యయ్యలరుంబోండ్ల నెయ్యంపుటేలికసానియైన తొయ్యలిం గనుంగొని.
అలమేలుమంగాభివర్ణనము
అపూర్వప్రయోగము - యమకము - ద్రాక్షాపాకము
క. బెళికియు బెళుకని చూపుల
మొలచియు మొలవని యురోజముల తేనియలన్
జిలికియుఁ జిలుకని పలుకులు
చెలిమై నూనుఁగువయసు చికిలి దనర్చెన్. 288

చ. పలుచనగాక మిన్నదయి బర్వకయుండెడి చిన్నిమోవియున్
దెలుసుటెగాక పల్కుగడి దీరి నెఱుంగని క్రొత్తసిగ్గునన్
మెలఁగుటెగాక గుల్కు వగ మించఁగనేరని నెన్నడెందమున్
జలజదళాక్షి కింపెసఁగె శైశవ యౌవన సంధి వింతన్. 289

స్వభావోక్త్యలంకారము
సీ. ఎడఁదమ్మి లేమొగ్గ లెనసి పైనిల్చెనో
యనఁ బూఁపచన్నులు నునుపుదేర
వెడఁదగూడులనుండి వెన్నెలపులుఁగులు
తెమలెనా నేత్రాంచలముల బెళుక
గలదు లేదనువాదకలితోక్తి మార్గమ
నఁగ కడుసన్నపు నడుము చెలఁగె
బాల్యపు టేఱింకబాఱఁ గన్పట్టెడు
యిసుము దిన్నియనాఁగ నెసఁగె బిఱుఁదు
గీ. కొదమరాయంచ యంచల మెదలె ననఁగఁ
గులుకు నడ యందమయ్యెఁ జెంగల్వనేస్తి
సిస్తుఁ గనె మోము నెమ్మేను మస్తు మీఱెఁ
గంబుకంఠికి మొదలిప్రాయంబునందు. 290

క. ప్రియ మొనరించెను సతి ప్ర
త్యయకారకగుణసమాస తద్ధిత వృత్య
వ్యయ వర రూపక వృధ్యా
శ్రయభావమువలన శబ్దశాస్త్రము భంగిన్. 291

ఉపమాలంకారము
క. మొలకవలె నింత గదలెడి
తలిఱు మఱుంగునను దోఁచు తళుకుగులుకు మొ
ల్లలవలెను మోవిమాటున
పల్వరుస దనరె నబలకు మిగులన్. 292

క. తొలుతటి శ్రీవర్ణంబులు
చెలివీనుల నొక్కపోల్కి చే నగు లేదా
తలఁపఁగను కమ్మ లంటుక
నలవడు నక్షరనిరూఢి యబ్బుట గనునే. 293

క. తమివయసు వచ్చుటకు బా
ల్యము వాయుట కాత్మజన్యుఁ డాశుగ పంచాం
గ మరసి యట పైఁగాఁ బో
ల్రమణిక నెమ్మేన నొక్క లగ్నం బునిచెన్. 294

అపూర్వప్రయోగము
క. రోమలతా రాహువదన
యామవతీనేత బొదువు ననుచు దురాగా
కామాహితుఁ డీకుండెఁడు
నామెరవెలఁదికినిఁ ద్రివళు లతిశయ మయ్యెన్. 295

ఉపమాలంకారము
సీ. జలదంబుపయి మెఱుఁగులు మెఱసినరీతిఁ
గ్రొమ్ముడిమొగలిఱేకులు జెలంగ
లతను గెంజిగురు లుల్లసిలు చందంబున
నెమ్మేన రతనంపుసొమ్ము దనర
మంచుగప్పినగట్ల మర్యాద మొగలిఱే
కులపైఁటలో గబ్బిగుబ్బ లమర
దొనలలో సానబట్టిన తూపులిడుమాడ్కి
విప్పుఱెప్పల వాడివీక్ష లమర
గీ. డాలుపగడాల భరణి క్రొమ్మూలఱాలు
పరగు గతి కావి మోవి పల్బంతి యనఁగఁ
బొసఁగియున్నట్టి పొన్నారి పొగడఁ దరమె
నలువకైనను వేనోళ్ళచిలువకైన. 296

అనుప్రాసకందము
క. తళుకులు గని చిలుకలకొలి
కలరులగుది వలపులనెల కలికులకచ వె
న్నెలగల తొలుకరి మెఱుఁగెల
నెలడాలున నన్నుమిన్న యీ చెలి భళిరా. 297

అనుమానాలంకారము
సీ. బిత్తరి నెమ్మోము నెత్తమ్మి గాదేని
భ్రమరకమ్మలు పైని బరఁగు టెట్లు
కలికిచూపులు దీపకాంతులు గాదేని
కలితకజ్జలరేఖ గలుగు టెట్లు
జవరాలిపాలిండ్లు జక్కవల్ గాదేని
గవగూడి తముదామె గవయు టెట్లు
జవ్వని నాభి కాసారంబు గాదేని
యనయంబు తుఱులండ దనరు టెట్లు
గీ. గాక యీయింతి సౌందర్యగరిమ చిలువ
కన్నెకైనను మానవకన్నెకైన
వేల్పుకన్నియకైన భావింపలేదు
పొసఁగ నాసామికే తగు వసుధలోన. 298

మధ్యమయమకము
క. సుందరి గళకుచనాభీ
సందీపిత నిగనిగ చకచక ధళధళ లెం
దుందరమున్ మందరమున్
గందరమున్ దరము కరము గౌరవలీలన్. 299

అచ్చతెనుఁగుయమకము
క. మిన్నా నడుమల కలువల
మిన్నా నెఱిచూపుమేలి మిన్నలు వెన్నన్
వెన్నా పలుకులు చక్కని
వెన్నాయనటాకు కలిమివెలఁదికి గనఁగన్. 300

చక్రవాళసీసము
సీ. కన్నెనాసిక చంపకము గెలుచుట కోపు
కోపుమై క్రొమ్మెఱుంగు జిగిచూపు
చూపు నీలంపు గచ్చుగల కలువరూపు
రూపు వాతెఱ చిగురుగమితోపు
తోపు నెమ్మోము చందురు మిన్నలును మాపు
మాపు బొమ్మమరుకమ్మ విలుకోపు
కోపు నెన్నడ యంచకొదమ గడకుఁ బాపు
బాపు నా దగు కౌను బయలుదాపు
గీ. దాపు తానయ్యె కీల్జడతాచుదొరకు
దొరకునే యన గంఠంబు దరము దరము
తరము పల్జిగి మొల్లల తరము తరము
తరువు వారువున పిఱుఁదిల మురువు గన్నె. 301

ప్రతిభేదధ్వని వ్యతిరేకాలంకార ధ్వనిద్వయయుక్త సంభావనాలంకారము
సీ. అంటితో గౌరు కేలంటి యుండినగాక
పడఁతి తొడలసాటి నుడువ వశమె
యెలదమ్మితో నెల యెలమి బొందినకాక
యింతిమొగము సవ తెన్నదరమె
చిలువతో నెమ్మిమచ్చిక జేసినను గాక
యన్నువేనలి కెన యెన్నవశమె
వెన్నలతో నిరు ల్వెలసి నిల్చినగాక
పొలఁతిచూపుల సరిబోల్పఁ గలమె
గీ. యెనయు గా కేమి యని పొర యొత్తి ముడిఁగి
విరిసి కంది పడగ మోడ్చి పురి విదిల్చి
వెల్లనై మూలఁబడి పోవె విలసితోరు
వదనకచవీక్షణావళి యెదిరినంత. 302

పాదత్రయయమకోదాహరణము - అపూర్వప్రయోగము
క. యువతీమణి తనురుచిగనె
నవతారుణ్యాప్తి విలసనమ్మున వీనుల్
నవతాస్థితిఁ గనె నవతల
నవతను గనె కౌను నౌననవతంసముగన్. 303

వర్ణవృత్తి ముక్తపదగ్రస్తగీతి
గీ. తళుకు చిలువచెలువ జడములుకు కులుకు
కులుకు కొొరపల్కు కపురపు పలుకుచిలుకు
చిలుకువడికోపు విడిచూపు బెళుకు కళుకు
కళుకువాతెఱ పెరతేనె లొలుకు ములుకు. 304

గీ. గోలకౌనునభంబు నిజాలకౌను
బోటి చూపు మెఱుంగుల సాటి చూపు
చెల్వగోరు సదావళి గెల్వగోరు
కాంతరూపు రమాకృతి నంత రూపు. 305

పూర్వగీతిశబ్దచిత్రయమకము. సొమ్ము
క. చెలికి రతనాలకమ్మలు
వెలసెన్ దెసగెలుపు టచ్చవెడవిల్తుఁడు చూ
పులములుకులు పదను గలుగ
నలవడ రతనంపుశాణయంత్రము లనఁగన్. 306

యథార్థప్రతిపాదకపద తదాద్యక్షర నిర్ముక్తార్థాంతర సూచకపద్య తదాక్షర వినిర్ముక్త వర్ణాంతర గ్రాహి సీసము - అపూర్వము
సీ. భూరిపున్నాగంబు పొక్కిలి నాగంబు
గతి గంబురాపల్కు కళుకు చెక్కు
లవిరణరాంశుకం బవయంబు శుకంబు
కలితవాక్యనిరూఢికంబు వరుత
ఘనవసుధాస్థితి కటిమండలము సుధా
రీతి యధరము ధాకృతికుచములు
నవచకోరములు నయనముల్ కోరక
ములు దంతములు రకము పురివేణి
గీ. అలప్రవాళముకేలు వాలమ్ము చూపు
నభము నెన్నడుము భములు నఖరతంక్తి
ధనువు కనుబొమ నువుబువ్వు తళుకునాస
వెన్నెల నగవు నెలమోము వెలఁది కలరె. 307

రూపకాతిశయోక్త్యనుప్రాణితగమ్యోత్ప్రేక్షాలంకారము
సీ. జగిమోము నెత్తమ్మిజేసి యచ్చటితేనె
తియ్యనిగచ్చువాతెఱను నునిచి
మెఱుఁగుమీఁగాళ్ళు తామేళ్ళను జేసి త
త్కఠినతపాలింఢ్ల గలుగ నునిచి
నునుపు మీఱిన తొడ లనఁటుల జేసి యం
దలి కపురమ్ము పల్కులను యునిచి
పొక్కిలి గవిఁజేసి యక్కడి యిరులచాల్
పొందుగా నవలగ్నమందె యునిచి
గీ. గళము దరమునఁ జేసి యక్కళుకు మొలక
నగవుననె యుంచి మేను మించుగను జేసి
దాని బెళుకులు చూపులలోన యునిచి
జగతి నీకొమ్మ నలువ వింతగ సృజించె. 308

త్రిప్రాసము
క. చిందమ్ముల చందమ్ముల
కెందమ్ముల జిగి దెగడు సకియ మెడకేల్
మారందమ్ముల చెందమ్ముల
యందమ్ములగు మహిళాధరాస్యేక్షణముల్. 309

శబ్దచిత్రకందము
క. అరికుచ జంఘల కళిక మ
కరి యాదిమవర్ణ ముడిగి కరియై గతి నే
పరికాంత సానుబంధత
సరియయ్యును బాహులతకు సరిగాదయ్యెన్. 310

శ్లేషవిశేషఘటకచరణసీసము
సీ. నారీమణి ముఖంబు తారస్ఫురణ మించుఁ
గొమ కటి చక్రమార్గము భ్రమించు
రమణి చన్నుఁగవ తాళముల నీతి హరించు
సతిపల్కు మధురసాకృతి భరించుఁ
గలకంఠి కన్దోయి కమలవైఖరి మించుఁ
జెలిచూపు వాలుగతుల గడించు
గజయాన నెమ్మేను కనకస్థితి హసించు
లేమవేనలి ఘనాళిని గ్రసించు
గీ. ముత్తియము జక్కబండికల్ పుడమి తాటి
పండు కైవడి ద్రాక్షాసవములు తమ్మి
మృము మీనల్గు పైడి సంపఁగయుఁ దేఁటి
మొగులు కవగూర్చి నలువ నేర్పున సృజింప. 311

శ్లేషోద్భావితోపమాలంకారవిశేషఘటకదుర్ఘటచరణసీసము
సీ. కలికివేనలి సోగ గననొంచి పింఛంబు
కడుతోకచాలయి కానఁబడఁగఁ
గన్నియ క్రొవ్వెద కప్పుకొన గడంగి
యిరులెల్ల కహ్వర మెడలఁ జొరఁగఁ
గప్పురగంథి నున్గొప్పుమెఱుంగు లా
గఁగఁ జేరి మొగులుఁ బల్ గట్ల బ్రాఁక
నీరజాస్యతుఱుము నెఱిఁబూన మార్కొని
కఱిత్రాచు పుట్టమల్కలను దాఱ
గీ. భళి కలాపంబునకుఁ గలాపంబు నుత్త
మమ్మునకు నుత్తమమ్ము ఘనమ్మునకు ఘ
నమ్ము చక్రికిఁ జక్రియై నాచు నళి య
మునను నీలము నలము పూఁబోణివేణి. 312

నియమయుక్తశ్లేషానుప్రాణితోపమావిఖ్యాతగీతి
గీ. తెలిదళము రూపుఁజూపుట జలజ మగును
వాలుమించుహించుట వాలుగయగు
రెంటఁదగు పేరు కందోయి నొంటికరన
నాతి రాజిల్లె రాజీవనయన యనఁగ. 313

శ్లేషవిశేషపోషితపాదాదికేశాంత కేశాదిపాదాంత ఉపమేయావయవ తద్గుణ ఘటనభాసురసీసరాజము

సీ. అళికచపాదద్వయము పద్మపాళికి
మదకంబు గళజంఘ మకరపతికిఁ
గందరనాభిక కటిశ్రీకనదరికి
నాగారిమధ్యయార్ భోగిపతికి
రంభోరుకుచము ధరాధినాథునకుఁ గూ
ర్మవిభుప్రపద వాతెఱ సురమణికి
తారకానఖరవక్రస్థితి విధునకు
గజయాన ముంగురు ల్ఘనునకైన
గీ. కరమెదువు సుడిరేక సైకమ్ములోఁతు
వలదనుడు సోగజిగి వట్రువ నునుమెఱుపు
తెలుపుతేట కులుకుముల్కుతీరు పొగడ
దరమె యనఁ బొల్చె ధరణి నత్తరళనయన. 314

శబ్దచిత్రము
తే. నలువ నలినకువలయ మీనపదముల తు
దలఁ దనరు వర్ణము ల్దివిచి లలన తెలి
కళుకు బెళుకు తళుకుగ కన్నులు సృజింప
నది మొద ల్నయనాభిద విదితమయ్యె. 315

ఛేకానుప్రాసనియమద్వయయమకవృత్తము
ఉ. తారల గోరుగేరు వెలితామర గేరుటఁ జూపు జూపు బం
గారము రూపు రూపు లతికాతతి నెంతన కేలుఁ గేలు క
ర్పూరపుఁబల్కుపల్కు తెలిపువ్వులమిన్నల నవ్వు నవ్వు శృం
గారపువేణి వేణి యొడికంబుగఁ గంబుగళంబు కొమ్మకున్. 316

అధికాద్యేకాద్యక్షరయోగోపమాన గోపనచరణసీసము
సీ. తర్కింపఁ జక్కని తలిరాకుఁబోణికి
ధరము చన్దోయి కంధరము వేణి
అరయంగఁ జిన్నిపాయపుటన్నుమిన్నకు
సరము లేగెలు శ్రీసరము నాభి
పరికింప సామి శుభ్రకరనిటాలకు
దరము కంఠంబు ప్రదరము చూపు
భావింప గంధ దంతావళయానకు
రస మధరంబు సారసము కరము
గీ. అమరు మంజుభాషకు నలసములు గమన
ములు గురునయనములు మీనములు గణింప
గామినికి జంఘిక మకరగతి హిమకర
గతి వదనమయ్యెఁ జిత్రసంగతి గజగతి. 317

విచిత్రయమకత్రయ దీపితోపమాద్వయ నియమోదాత్తవృత్తము
చ. పొలఁతుక జానుకౌనుహరి బోదగమిన్ దగమింగమించు లే
నెలఁతుక యౌరసౌరు జిగి నీలహరిన్ లహరిన్ హరించు నె
మ్మెల చెలిమిన్నకన్నుఁగవ మీల్దొగలన్ దొగలన్ గలంచు మె
ప్పుల కొమతేటమాటనగుఁ బూరసము న్రసము న్సమున్నతిన్. 318

సభంగాభంగశ్లేషానుప్రాణితోపమాలంకారాంత్యనియమఘటకపాదసీసము
సీ. సుందరిపొక్కిలి సుమసరమ్మును గెల్చు
రమణికురులు కప్పుఱాలఁ గెల్చు
భామకన్నులు మహోత్పలముల నిరసించుఁ
జెలిగోరు తారకముల హసించు
మగువచన్దోయి మన్మథఫలంబులఁ గేరుఁ
గాంతమై పద్మరాగముల మీఱుఁ
గన్నెనగవు సదాకాశాకృతినిఁ గొట్టు
నింతి పల్కెన్నగోయిలల మెట్టు
గీ. లలన కేల్సూటి కొమ కపోలములసాటి
కలికిముఖరీతి కామినీగళముభాతి
వనితచూపుల రహినాతి వాతెఱ నహి
తెఱవనడుము సరణిబోణి పిఱుఁదు కరణి. 319

ఆద్యంతప్రాసైకనియమముక్తపదగ్రస్తానందకరకందము
క. పొల తోరచూపు వలతో
వలతోదత నీలపున్రవలకమ్మలతో
యలతోరపుఁబిఱుఁదులతోఁ
దులతొయ్యలి లేక గజగతులతో నలరెన్. 320

ఆద్యేకాక్షరలోపప్రాణితోపమేయ భావభావితోపమమానగర్భితచరణ దుర్ఘటసీసము
సీ. మానినికి సునితంబంబు నితంబంబు
కుందరదనకు వాగురులు కురులు
చిన్నికన్నియకు వాల్గన్నులు కన్నులు
కలువకంటికి కుచము లకుచములు
బాలికామణికి శైవాలమ్ము వాలమ్ము
పాటలాధరకు శ్రీపదము పదము
కైరవేక్షణకు రంభోరులు భోరులు
కొమకుఁ గ్రొమ్మెఱుఁగు మెఱుఁగుమెయి
గీ. పూర్ణచంద్రాననకుఁ దలిర్మోవి మోవి
భద్రగజగామినికిఁ దేనె పలుకు పలుకు
పూవుఁబోడికి మిన్నఖములు నఖములు
గాఁదగె లతాంగి చిత్రసంగతి నెసంగె. 321

గీ. అనుచు వెఱఁగంది పన్నగాహార్యవిభున
కీతలోదరి యూరుపేరెఱుక పడఁగఁ
దెలిసి యెఱింగింతునని మదిఁ దలఁచి యధిక
సంభ్రమంబున జేరంగఁ జని యతండు. 322

ఉ. కాంత విలాసవైఖరులు కన్నులపండువు గాఁగఁ జూచియే
కాంతలచేత నీ యబల కార్యములెల్ల నెఱుంగువాఁడ నీ
చెంతకు నెట్టిమార్గమునఁ జేరెద నింకిట నెద్దిబుద్ధి యీ
యింతిని మావృషాద్రిపతి కెవ్విధిఁ గూర్తు నటంచు నెంచుచున్. 323

క. నావచ్చినపనియైకద
కావలె నఁట మీఁదవలయుఁ గార్య మటంచున్
దేవకరస్థస్యేనము
దా వెదకుచు నింతనంతఁ దరుణీమణులన్. 324

ఆ. డాయనేగి యొక్క తోయజముఖితోడ
నున్న డేగఁ గాంచి యుత్సహించి
మంత్రివర్యుఁ డపుడు మానినీమణితోడఁ
బలికె స్వామికార్యపటిమ దెలియ. 325

క. ఏవిధమున నీడే గిపు
డీవనిలో మీకు దొరికె నిది మాహరిచేఁ
దావలమైనది మీరా
దైవం బెవ్వరని యడుగఁ దలఁచితి రేనిన్. 326

చతుర్వర్ణయమకగీతి
గీ. మావిభుండు యశోస్థ హిమావిభుండు
మావిధుం డాస్యజితపూర్ణిమావిధుండు
మావిలాసి తనూసుషమావిలాసి
మాగురుండు నితాంతక్షమాగురుండు. 327

గూఢదశకందము
క. ఈ ధర చంద్రక గురు విభ
గోధరభవమణిగతి న్నగు కళాతేజో
మేధాజవన యశమధృతి
బోధవితరణాత్మ విహృతి మురరిపుఁ డెపుడున్. 328

ఏకవింశతివర్ణయుక్త మధ్యాంతయమకవృత్తము
చ. నిగుడెడి భూతికాంతి జయ నీతి కృపావన సారశుద్ధి ధ
న్విగతి విలాసవైఖరుల నీడ జరాణ్ణగభర్త గెల్చు ప
న్నగధర రేవతీధవ ధనంజయ భార్గవ రామచంద్రులన్
నగధరరేవతీధవ ధనంజయ భార్గవ రామచంద్రులన్. 329

సీ. వనధి నొంచినయల్గు తను ధరించిన పుల్గు
గలుగువాఁడు తనంత వెలుఁగువాఁడు
కలువదట్టినరూపు చిలువమెట్టినయేపు
గన్నవాఁడు విధాతఁ గన్నవాఁడు
గిరిని మోచిన సత్తి కరిని గాఁచిన బత్తి
దనరువాఁడు గిరీశు నెనరువాఁడు
కరువలియెరసజ్జ మురువుతామర బొజ్జ
నెసఁగువాఁడు శుభంబు లొసఁగువాఁడు
గీ. వాలుగనులవాఁ డలబిల్లవాలువాఁడు
మేలు వాఁ డిందిరకు జగ మేలువాఁడు
జాళువా సాళువాఁ డంఘ్రిజాలువాఁడు
డాలుగలవాఁడు దనుమచ్చడాలువాఁడు. 330

గూఢాష్టమిగీతి
గీ. ధరణి శత్రుఘ్నలక్ష్మణభరతరామ
భద్ర గురుమణి గురుమణిస్థిత గేరుప్రధనచాప
నీతిబలధర్మవాగ్వితీర్ణి మహిమగతి
శాశ్వతంబుగ శ్రీ వేంకటేశ్వరుండు. 331 ఆ. అనుచు సచివుఁ డిట్టు లాశౌరి ఘనతర
విభ్రమప్రతాపవిధులు దెలిపి
రమ్ము లెమ్ము తెమ్ము నెమ్మి డేగను గొని
చనఁగవలయు ననినఁ జాన యపుడు. 332

వ. అయ్యానందనిలయునియందు డెందం బానందంబునం బొందుపఱచి కురుపతి మనోన్నతి నతకరించి నరపతియగు తిరుపతివేంకటేశ్వరునియందుఁ గల కూరిమి పరుల కెఱుకపడకయుండునట్టుగా నుండియు మోహం బెచ్చరించి నిలుపోవక యతనివాక్యంబుల కుత్తరం బిచ్చుట కులకాంతధర్మంబు గాదనియు నూరకుండిన తిరస్కారంబై తోఁచుననియు విచారించి కించిద్దరహాసప్రతిశిరోల్లాసంబున నిజసఖీజనవితానము క్రేగంటఁ జూచి లజ్జాభరైకతానమతిఁ దా నతాననయై యూరకున్న నమ్మోహసంచారచారు నాంచారుదేవి యభిప్రాయం బెఱింగి. 333

అపూర్వప్రయోగము
గీ. తోడిచేడియలందుల రూఢికెక్క
నింగితాకారచేష్టల నెఱుగఁ నేర్చు
కనకమాలికయగు నొక్కకనకగంధి
సచివుఁ గనుఁగొనె దరహాసరుచులు మెఱయ. 334

క. అనియెఁ దనస్వామి కార్యం
బనుకూలము సేయ బొంకు టదియెల్లను మీ
కును సహజము పదివేలై
నను నమ్మఁగలేము దండనాయక నిన్నున్. 335

అపూర్వప్రయోగము
చ. జగతి నరుండు బొంకిన రసజ్ఞత దప్పు నకీర్తి జేకురున్
మొగసిరి బాయు నాపదలు ముంచు శుభంబు దొలంగు వీడు న
మ్మిగ జెడు ధర్మ మెల్లణఁగు మేలిమి నాశము నొందు నాయు వ
మ్మగు కలిదోషమందు భయ మంటదు నేస్తము బాయు సద్గతుల్. 336

వ. అదియునుం గాక.

అభేదప్రాసము
ఉ. ముందుగ తావకీన హరిమోహనరూపము చూడలేదు నీ
వందుకు దేనె లుట్టిపడ నాడుచు నావిభుఁ డుప్పు లేక ము
ప్పందుము గంజి త్రాగునని పల్కెదుగా యెటులైన చూత మిం
కందఱిచేతనున్న మణికంకణమున్ గన నద్ద మేటికిన్. 337

క. నే వచ్చి చూచి మీ హరి
కీవలసినయేని డేగ నిచ్చెద బద మం
చావెలఁది మంత్రివర్యుని
భావంబు కళంకు దేర్పఁ బలికెన్ మగుడన్. 338

ఉ. నీవు మహానుభావుఁడవు నిన్నిటు నమ్మకయుంట గాదు నే
నావిభు జూచుముచ్చటల నాటకు దోడ్కొని వేడ్క మీఱఁగాఁ
బోవలె నంచు నిన్ను పొరపొచ్చెము లాడితి నింతెగాక యీ
భూవలయంబునందుఁ గడుపూజ్యులు మంత్రులు గారె యెంచఁగన్. 339

చ. అనవుడు మంత్రివర్యుఁడు ప్రియంబు నయంబును మీఱ నప్పు డా
వనితను దోడితెచ్చి యొకవంకను బూపొదచెంత వేడ్కతో
నునిచి నిజేశుఁ డున్నయెడ కొయ్యనఁ జేర నేగునంత న
య్యనఘుఁడు పచ్చఱాజగతియందుం గడు న్సుఖసుప్తుఁడౌ నెడన్. 340

ద్విరుక్తకందము
క. తళతళమను జెక్కులనెల
గలకలనగు ముద్దుమొకముఁ గవజక్కవలన్
దలతలమను వలిచన్నులు
కలిగిన యొకసకియ శౌరి గలలో గనియెన్. 341

తర్కము
చ. కలఁ గని లేచి తాఁగలికిఁ గాంచుట నిక్కమె యంచు నిక్కమై
వెలసినకాంత యెక్కడికి వేచనె నంచు నిదేమి చూడఁగా
గలయును గాదు నిక్కువముగా దిదియంచుఁ దలంచి యేక్రియన్
గలఁ గనుఁగొన్ననాతి బిగికౌఁగిట నుండెద నంచు నెంచుచున్. 342

మ. నిలుచున్ నిల్చినచోట నిల్వ కరుగున్ నిర్వీణుఁడౌ నూరకేఁ
దల యూఁచున్ దనలోన నవ్వుఁ గడు సంతాపించు నల్దిక్కులన్
గలయన్ జూచు దలంకుఁ దత్తరము గొన్గన్ వ్రాల్చుఁ జిత్తంబునన్
దలచుం బాలిక నిట్లు శౌరి మదిలోనన్ వంతచేఁ గుందుచున్. 343

వ. ఇవ్విధంబునం బ్రపంచత పంచపంచశరాశుగనిర్భిన్నధైర్యకంచుకంబు గల యవ్వెంకటాచలపతిం గనుంగొని యమ్మంత్రిచంద్రుం డాశ్చర్యంబును భయంబును మనంబునం బెనంగొన. 344
క. ఇపుడు హరిస్వాంతం బొక
నెపమున నున్నదని తడయ నేరము లే కే
యపరాధముఁ జేసితినో
చపలత నని వెన్నుఁ జేరఁజని యిట్లనియెన్. 345

హరిహరాభేదసీసము
సీ. అవిరళరుచి కలాపవతంసుఁడగు వాని
సుమకరకుండలీశ్రుతులవాని
అతులితాసితకంధరాభఁ గాంచినవాని
వరసువర్ణధరచాపంబువాని
తనువిలేపనభాసితకదంబమువాని
కల్యాణకృత్త్యంశుకంబువాని
అనుపమాన వృషాచలారూఢుఁడౌవాని
ధరను మాధవనామగరిమవాని
గీ. యెడతెగని మిన్కు లీను పేరెడఁదవాని
వేంకటేశ్వర పదనిజద్వివిధరూప
వేషరహితపదార్థసంశ్లేషవృత్తి
నలరు నిను నెంతు దేవదేవాదిదేవ.

ప్రాసభేదము
క. పక్షీశ్వర తుఖ్కార భ
వత్క్షేమంకరగభీరపాధోధిమహో
క్షాక్షీణధ్వజనుత దయ
రక్షింపుము వల దుపేక్ష రాజీవాక్షా. 347

గూఢదశమి
తే. ఋతు బలాజి హయ కళార్య నతికళార్థ
యాశమ రమాప్తి ధర్మభీమార్జుననకు
లసహదేవరాజవరపాళి సుగుణమహి
మాద్యత హసింతువౌ వేంకటాద్రినిలయ. 348

ద్విరుక్తి త్రికనితాంతానుప్రాసైకప్రాససీసము
సీ. సార సారసభవో దార దారఖ నదీ
తారక తార కర్పూరసార
తార తారవిధూనీహారహార తురంగ
శార శారద ఘనసారహార
భార భారకులిశా పారపారదసురా
హీరహీర సురభిక్షీరపూర
గౌరగౌరవపద్మమారమారకభ మం
దార దార మరాళ వారణార
గీ. నారద పటీర డిండీర సార దంతి
కైరవ కరక ముకుర విస్ఫార మల్లి
కారములతోడ నీకీర్తి తారసించు
నౌర గాచలభూరివిహారిహారి. 349

విశేషాద్యక్షరనామకందము
క. భువనజఠర! జయసన్నుత!
గవాధిపా! ధన్యకలితకారుణ్య! రమా
ధవ! పరమపురుష! తీవ్ర రి
పువిపాలమహోవిశాల! భుజగధరపతీ! 350

గుణస్వరూపోత్ప్రేక్ష
క. హరి నీదు భాగ్యసూచన
కర గురు దృక్కోణ శోణకాంతి చెలంగెన్
శరణాగత భరణాయతి
కరుదుగ సాకారమౌ దయారస మనఁగన్. 351

వృత్త్యనుప్రాసము
క. చందన హరిచందన శర
కుందేందుపురందరాశ్వగోబృందశతా
నందస్యందనతారా
సందోహాసితారవింద సత్కీర్తిహరీ. 352

కవిప్రౌఢోక్తి సిద్ధార్థశక్తిమూలవస్తుకృతాలంకారధ్వని
క. జలజాక్ష నీదు తేజో
నల మిల వెలయఁగ నభింధనజ్వలనుం డా
జలరాశిఁ బట్టె దావా
నలము మహారణ్యఘోరనగములఁ జెందెన్. 353

శబ్దశక్తి వస్తుమూల ధ్వని
తే. అతులితమహేంద్రపదగుణఖ్యాతిఁ జెంది
కలితగంగౌఘపదవృద్ధి గాంచి మిగుల
వెలయ శ్రుతి సతి సీమంతవృత్తి సుపధ
రూపమును గన్న శౌరి పాపాపహారి. 354

సంబంధాతిశయోక్తి
సీ. శక్రవిలాససంచారసద్రచితసై
కతసంగతి నెసంగె గగనగంగ
సాలమూలాతివిశాలవేదిక దీర్చె
రమణీయనందనారామసీమ
భూరిపార్థివలింగపూజామహత్త్వంబు
తగ సమకూర్చె సప్తర్షులకును
భువి తెఱం గమరంగఁ బొసఁగించె వింతగా
బయలాని తిరుగు దేవతల కెల్ల
గీ. కదనమదవదసురవరహృదయభయద
భవదురుతరబిరుదభటపటలజలద
నిబిడరజములు దిశలను ప్రబలు తఱిని
యంజనాద్రి నివేశ సూర్యప్రకాశ. 355

శ్లేషానుప్రాణిత కార్యకారణ విపర్య యతిశయోక్త్యలంకారము
సీ. అని నీదు కోపంబు ఘనతఁ జెందకమున్నె
తత శరవర్ష మంతటను వెలయుఁ
దత శరవర్ష మంతట వెలయకమున్నె
ఘనరసాధివరవాహినులు వాఱు
ఘనరసాదివరవాహినులు బాఱకమున్నె
యరిజీవనోన్నతి యందుఁ దేలు
నరిజీవనోన్నతి నంది తేలకమున్నె
బహుతరతత్ప్రతాపంబు నిలుచు
గీ. నరరె వినుతాద్భుదాన పరివిధాన
సదవ ధానప్రధాన దిగ్జయనిధాన
దాన సంధాన మేధా నవీన విభవ
విలయ చండార్క సంకాశ వేంకటేశ. 356

తాద్రూప్యాభేదరూపకసంసృష్టి
సీ. అవిరళనిజకీర్తి ధవళాంబుజమునకు
గగనమండలము భృంగంబు గాఁగ
అసదృశదోఃప్రతాపసమీరబంధుసం
కాశరతతి శలభాళి గాఁగ
నతులితదానధారాంభోధిరాజుకు
చంద్రికాధవళి ఫేనసమితి గాఁగ
ననుపమసౌందర్యఘనజాలసరణికి
మెలఁతలచూడ్కులు మీలు గాఁగ
గీ. నెగడఁగాఁ జేసి భాసిలు నీకు దొరయు
దొరను నేగాన తావకచరణమాన
కోరకైదువు దునెదారిపేరి పుడమి
దారిగవిదారి దారుమందారి దారి. 357

విరోధాభాసాలంకారము
సీ. సరసామృతాహారనిరతి నియ్యదు గాని
సరసామృతాహార నిరతి నిచ్చు
బరమసంతానసౌభాగ్య మియ్యదు గాని
పరమ సంతానసౌభాగ్య మిచ్చు
హరివాహనాధిరోహణము నియ్యదు గాని
హరివాహనాధిరోహణము నిచ్చు
నమరభామాసుఖావ్యాప్తి నియ్యదు గాని
నమరభామాసుఖావ్యాప్తి నిచ్చు
గీ. ని న్నని నెదుర్చు ప్రత్యర్థినికరము గని
దారి మొనజూపి నీహేతి దానరీతి
కంటి విన్కలి దంటి పేరింటి గుంటి
చక్కి నెక్కొన్న నలరూపు సామిమిన్న. 358

ప్రకృతాప్రకృతశ్లేషసీసము
సీ. శ్రీకరమైన హేవాకభాగ్యము నంది
వరకచ్ఛపాద్యవిస్ఫురణఁ జెంది
యచ్ఛభూదారసమాఖ్యచే నలరారి
నరసింహమహిమను నలువు మీఱి
యత్రివిక్రమత మే లతిశయంబు వహించి
యతులభార్గవగురుప్రతిభఁ గాంచి
శ్రీరామభద్రప్రసిద్ధిని విలసిల్లి
బలభద్రవైఖరిఁ బరిఢవిల్లి
గీ. యలఘుసర్వజ్ఞతాస్థితి వెలయఁ గాంచి
కలికిరూపున జగ మెఱుఁగంగ బొల్చి
దనరు విఖ్యాతిగ దశవతారరీతి
శేషశైలనివాస కౌశేయవాస. 359

వకారాదినియమశబ్దార్థాలంకారశ్లేష
సీ. వజ్రిభిన్నగరుచివైఖరిని విదల్చి
వరశరజాతాభవహి నదల్చి
వాణీవరద్యుతి వారక నిరసించి
వనజవిశదదీప్తి వడి వహించి
విజయపత్రవిభను వేడుకగా జీరి
విపులాజి దీధితి వేగ జీరి
విధుకాంతమణి కాంతి వేటాడి పైదూరి
విమలచంద్రప్రభ వెరజ దూరి
గీ. విభవవీరత్వవాగ్వర్ణవిజయవిహృతి
విశృతదయావితరణాప్తి వెలయ మీఱు
భవదుదారయశఃప్రతాపరమ జెంద
భేదరీతి ప్రబలును దిగ్బృందమందు
నందితానందనిలయ యానందకంద. 360

కందగర్భితప్రమితాక్షరవృత్తము
క. రవిచంద్రనేత్ర సుర రా
జవరస్తవనీయచక్ర శరజాత సరోం
బువిహార నిర్భరసము
త్సవచిత్త వనద్విపేంద్రదర దాతిశయా. 361

త్రివిధాపహ్నవలక్షణము
మ. స్థిరచక్రం బిది గాదు బాహుజమహాశ్రీగాని శంఖంబుగా
దురుకీర్తిద్యుతిగాని దేహరుచిగా దుద్యద్ఘనౌఘంబుగా
ని రహిన్ జూడఁగనంచు నీదు నెఱచిన్నెల్ ధన్యులెన్న న్ఫణా
ధరగోత్రంబునఁ గానుపింపవె రమాధ్యక్షా జగద్రక్షకా. 362

అశ్లిష్టమాలాపరంపరితరూపకము
మ. వనితాదృ క్కుముదేందుబింబము యశోవల్లీవసంతాగమం
బని దా పూర్వకథాసుధాంబుధి భుజౌజోర్కోదయక్ష్మాధరం
బన రాజద్గుణరత్నరోహణము నీ యాకార మెవ్వారికిన్
జనునే సన్నుతి సేయ? శ్రీహరి! దయాసంత్రాతమాద్యత్కరీ. 363

ఛేకానుప్రాసపంచచామరము
ఘనాఘనాభిరామధామ కంధిజా దరీదరీ
వనావనాభిలాకలాదవైణవా హరీహరీ
వినావినామదైత్యదంతవీరకేసరీసరీ
దినాదినారజాక్ష సమ్యదృక్సుధాకరీకరీ. 364

హరిహరవర్ణనాయుక్తానులోమప్రతిలోమకందద్వయము
మారవిభావాభవన ప
చారధరజయదర వనిజననుత యజరా
వారధిదర పర పురహర
సారగకజరామ సువనజనయన జేజే. 365

ఆదిచరణద్వయగుప్త గీత్యుపరిచరణద్వయ సంబుద్ధికలికా తురగవల్గనరగడసయుక్త సర్వలఘ్వంతనియమకలితసీసము
సీ. నిగమకవి పవిహరణ నిఖిల వివదపహరణ
సతతచతుర విహరణనుత వితరణ
కపటదవిధినిగరణ కనదవితతరువరణ
జలరుహ సదృశ చరణ శరధిశరణ
విదితదితమురసురణ విధివిశదనఖకిరణ స
నయజగదవతరణ జననభరణ
గజవరదబుధశరణ యజవిభస దరికరణ
సమదచలదనుసరణ సముపచరణ
గీ. నిరత గిరిరిపు శిఖి యను నిఋతి వరుణ
పవన ధనద హరమకుట పటుమణిగణ
ఘృణి పరివృత భుజగ పరిబృధనికషణ
విలసిత తనువర కుమతి విదళ చరణ. 366

చకార ప్రాస కందద్వయ గర్భిత త్రిస్తబక రూపక లయవిభాతి
నలిననయన సదయదలధవరువాస
ఖలదళచణ ఘనాఘన రుచి లలిత శుభాంగా
విలసితగుణ విదితబల గరిమపాల
లలదలకవిభ గోపజన ఫలదసదపాంగా
కలితనయ ధీనదర జలజభవపాల
నలదవలవగ నికాయమణి వలహృదనుషంగా
తులిత మహిమచిదుదయ లపనసదావిచల
దలఘుతరమానస సకలనుతరధాంగా. 367

సంబంధాసంబంధాతిశయోక్తి
క. మురహరతావక వితరణ
చరితము విని వితరణంబు చాలించెను కి
న్నరనాథుఁడు గాంచును జై
త్రరథవిహారంబు వితరణ మొకవేళన్. 368

వ్యతిరేకరూప సంభావనాలంకారము
సీ. సతతంబు కువలయాహిత మొనర్పకయున్న
నతిరతాశావృత్తి నందకున్న
దోషోదయంబునఁ దొలఁగిపోవకయున్న
క్షితినందఱకుఁ బగల్ సేయకున్న
వారుణీ నిత్యసేవనము జెందకయున్న
ద్విజరాజభావంబు దివియకున్న
ఘనసమాగమవేళ గని చాటుగాకున్న
గ్రహముల కెకిమీడు గాకయున్న
గీ. యప్రతిమమైన నీదుభుజప్రతాప
మునకు దీటనవచ్చు నవ్వనజహితుఁడు
కంటివిన్నరిదంట పేరింట గుంటి
నడుమ నెలకొన్న వేంకటనాథశౌరి. 369

రూపకశ్లేషముద్రాసంసృష్టి
సీ. నీయాదరోన్నతి నిఖిలసజ్జన విప
ద్వారిధికిఁ దరణివార మయ్యె
నీకీర్తివిస్ఫూర్తి నీరేజభూతాండ
వరపేటికకు నిందువార మయ్యె
నీవితరణప్రౌఢి నిర్ణిద్రసేవకా
వళికిఁ గల్పక కుజవార మయ్యె
నీనీతిమార్గంబు నిందితమూఢధా
వనబోధకా బుధవార మయ్యె
గీ. నీరుటము నరులకు గురువార మయ్యె
నీరుచితరాటవికి శుక్రవార మయ్యె
నీయభితకలుషాద్రికిని దలఁప శని
వార మయ్యెను దేవదేవాదిదేవ. 370

అపహ్నవాసుప్రాణితకావ్యలింగము
సీ. తీరైన మెయితావి తెలిగందపొడిగాదు
చేతోజ తనుజాత భూతిగాని
నుదుటఁ బెట్టిన మృగమదతిలకముగాదు
గొప్పయెక్కువ కనుఱెప్పగాని
గళమున గప్పు డాకంఠసరముగాదు
కమనీయగరళక్షణముగాని
కటి తటి గురుచిత్రపట విషముగాదు
డాలీను బెబ్బులితోలుగాని
గీ. వాలుపై నిల్చియున్న దా శైలపుత్రి
ధరణి నీశ్వరుఁడవు నీవె తలఁచిచూడఁ
గంటి విన్కలిదంట పేరింటి గుంటి
నడుమ నెలకొన్న వేంకటనాథశౌరి. 371

ఛన్నకందము
క. నమ్రాదిత్యాధీశా
కమ్రాస్యాస్తేందుబింబగంగాభృత్కీ
రామ్రక్షోణీజాతా
సామ్రాజ్యాపేక్ష శేషశైలాధ్యక్షా. 372

త్రిస్తబక ముక్తపదగ్రస్త చరణయోజాలంకారసీసము
భండన జ్యాకండ ఖండపరశుకాండ
కాండహారిపిచండచండ చక్ర
ధ్యానభక్తనిదానదాన గజాదాన
దాన మకరమాన మానదాన
నాగారికృతరాగ రాగకాళియభోగ
భోగవర్తనయోగ యోగచరణ
భీమాశరదధామ ధామమహాధామ
ధామకృత్యభిరామ రామఖేల
గీ. గండమండిత కుండల కంపమాన
మసకాఖండల ముఖప్రశస్తవినుత
వనచరద్వయ మృగయుగ మనుజషట్క
తా సముజ్వల లీలావతారవిభవ. 373

సీ. భావత్కథానాంబుభవతటినీసంఖ్య
భద్రాయితగుణ సముద్రుఁ డెఱుఁగు
దావకీన రథాంగ దళితాశరేట్సంఖ్య
భాస్కరపంకేజబంధుఁ డెఱుఁగుఁ
దావకకీర్తి సద్వ్యాజగత్సంఖ్యను
గాయకసారస్వతేయుఁ డెఱుఁగు
భవదాకృతిఁ దలంచు యువతీమణులసంఖ్య
మాన్యసంకల్పసంభవుఁ డెఱుంగు
గీ. సారవత్వజ్జయాంకితస్తంభసంఖ్య
రూఢిగా దచ్చి దిక్కు లెఱుంగుఁగాక
నితరు లొక యింతయైన దారెఱుఁగఁ గలరె
శేషశైలనివాస కౌశేయవాస. 374

సీ. భోగీంద్రశైల బోభూయమానోత్సవ
వైయాసకి సదుక్త వరపురాణ
ప్రణయినీ సంపనీపద్గ్య మానోరస్క
నోనువన్మాన హనూన వరద
దేదీప్యమాన మధ్యేసముద్రశయాన
మఘువాది రాజాయమానరూప
కీర్తియన్నారద క్షేమదాయి కటాక్ష
యతిమనోబ్జ విజరీహద్విరేఫ
గీ. అవితరూపవతీ చతురాంబికముఖ
వల్లవీహృదాచిత్త సుపల్లవమణి
ఖగవ రాశ్వోరసోడ్డీన గతివిశేష
కింకరీకృతబాణేశ వేంకటేశ. 375

బహువిధోల్లేఖాలంకారము
సీ. ప్రాగ్దిశాపరివృఢ భామినీకబరీషు
జ్వలనసీమంతినీ గళతటేషు
ధర్మరాజాంగనోదారవక్షోజేషు
నైఋతికాంతాఘనజఘనేషు
వరుణసతీమణి వరకర్ణపత్రేషు
హరిణాశ్వవనితారుణాధరేషు
యక్షకులాధినాయకవధూనిటలేషు
పురహరమానినీకరతలేషు
గీ మానసూనంతి హారంతి మలయజంతి
ధవళచేలంతి వజ్రంతి దరహసంతి
నవసితాభ్రంతి ముకురంతి తవయశాంసి
పంకరుహబంధుసంకాశ వేంకటేశ. 376

క. హరయే దుష్టక్రవ్యా
దరయే దానవమదేభహరయే ధృత స
ద్గిరయే పరిపాలితశాం
కరయే తుభ్యం నమోర్యకలయే యనుచున్. 377

ముక్తపదగ్రస్తనిస్తుల్యకైవారగద్య
శ్రీమద్రమారమణీమణీసముజ్జ్వల హృజ్జలజాతమార్తాండ, తాండవాడంబరసంభృతానల్పాకల్పజటాకుటీరజటాజూటకోటీరనానటద్గగన గంగాతరంగాభంగురఘుమఘుమారావచమత్కారధిక్కారగంభీరవచోనిగుంభిత పదబంధానుసంధానబంధుర ప్రబంధధౌరంధర్య వామలూరూద్భవవ్యాసప్రముఖకవిరాజ సంస్తూయమానగుణప్రకాండ, కాండముక్సముద్భూతగర్జానిర్ఘోషభీషణదరీఢౌకమాన భూరిఝారిసముత్పతక్షిప్రావసరోద్ధగుబగుబచ్ఛందైందమానబుద్బుదపాణింధమ శీతలకబంధవిధూతాఘౌఘతీర్థరాజకాండ, కాండచ్ఛటాసంభరణోదరత్వదియ్య మహిమోల్లంఘన విజృంభమాణాంభోనిధానఖర్వగర్వనిర్వాపణోద్దండార్దేందుకాండ, కాండగ్రీవావతారసాధారణమేధాసంవిధానప్రదాహృద్యానవద్య విద్యానుబోధితామేయవాచంయమవేదండ, దండ ధర ద్రుహిణాఖండల త్రిపాద్విభావసూద్భవ నార్కాదార్ణోధి పాశుగైలబిలోక్ష ప్ముఖ కకుప్పరివృఢార్జున కిరీట ఝాటస్థగిత చిరత్న రత్న నిర్యత్న ప్రభానీరాజితాంఘ్రి పంకేజ దేదీప్యమానాత పత్రీకేతనాహలకులిశకలశాంకుశరేఖాప్రచండచండ తేజోవిరాజత్పాఠీనకమఠస్తబ్ధరోమ నృహర్యక్ష త్రివిక్రమ కుఠారభృద్దాశరథి ప్రలంబజిత్ప్రబుద్ధ గంధర్వరూప శ్రీకృష్ణాద్యవతారాఖండపరశుప్రేయస్యహల్యా ద్రౌపద్యాటవిక పాటలాధరాదేవ భూతిక్ష్మాసుర భార్యాత్రివిక్రా భీరికాగణ్య పుణ్యప్రమదామోక్షభోగప్రదాన శ్యౌండ పాపర్య మాననిజకథాతుంబురునారదగాయకాభిధేయళిమతాపత్రయ వైయాసక ప్రభృతి భక్తజనవిధేయక వక్షస్థలప్రాలంబమానకౌస్తుభగ్రైవేయక కటీరన్మస్త కౌక్షేయక ప్రహ్లాదాది పరమభాగవత చింతిత ఫలదాయక వేంకట శైలనాయకా పాహిమాం పాహిమాం పాహి.

వర్ణవృత్తి వృత్తములు కదళీపాకము ప్రాసభేదము
శా. వేదోద్ధారక వేణునాదకుతుకా వేల్లత్కృపావీక్షణా
వేదాంతాటన వేదనావిరహితా వేశ్మీకృతాబ్ధిస్థలా
వేదిశ్రోణిరమేశ వేషదశకా వేదస్ఫురద్విక్రమా
వేధోండావన వేంకటాచలపతీ వేదండరక్షాకృతీ. 379

మ. కరిసంరక్షణ కామపాలసహితా కంజాక్షకాకోదరే
శ్వరతల్పా కమనీయరూప కనకాక్షధ్వంస కారుణ్య సా
గర కల్యాణమయాంబరాంతకటిభాగా కంససంహారకా
తరసందోహ భయాపహారి కలితా తార్క్ష్యాఖ్యగోత్రాధిపా. 380

చ. శరధియాన శార్ఙ్గధర శంఖశశాంక దివాకరాక్షశం
బరహర శౌరి శుక్రమణి భాసురభాసిత తాటకేయ శం
కరసఖ శాశ్వతాశరవిఖండితవాసవిశౌర్యధుర్య శం
బరజభవాండపాలిక శమప్రదభద్రమహీంద్రవల్లభా. 381

చ. నరసఖ నవ్యరూప నరనాథశరీరగ నక్రకుండలా
భరణ నగాత్యజావినుత పావననామక నందనందనా
నరహయమిత్రచాపధర నారదగా నసకౌతుకానతా
దర నవనీతచోర నయదానవినోదర నాగభూధరా. 382

చ.వరదవరాహరూప వసువాసవశీకృతలోకవార్థిభూ
వర వరుణాలయోన్మదనివారణవందితమౌనిజాల వా
సరమణిపుత్రికాహృదయశాసనసోదర వాసుదేవ వా
ర్ధరతనుకాంతిశోభి వనదంత్యవనావరనీలశైలపా. 383

ధ్వని — అపూర్వప్రయోగము
క. అమితమృగాటన రమణీ
యమహారణ్య సరసీతరాలయ నక్రో
ద్గమిత గజత్రాణసుధా
ను మహిమ మహనీయుఁడౌ నిను భజింతు హరీ. 384

అంత్యప్రాసనియమ చరణగుప్త ద్విపదతాళవృత్తగీతి
తే. దమిత కంసవిపక్ష దంతావళోక్ష
యమితసేవక రక్షణాయత్తతీక్ష
సమరభుఙ్మునిదక్ష శశ్వత్కటాక్ష
యమరనాయకపక్ష యబ్జాయతాక్ష.

ఆరభటీవృత్తి
ఉ. చండమయూఖ సంహనన సంభవభంజన భూరిఘోరకో
దండవిఖండనోజ్జ్వలదుదారపరాక్రమవీర్యధుర్యదో
ర్దండ ధనుర్విముక్తశరదారితమేరుధరాధరోన్నతా
ఖండల విద్విషత్ప్రబల కాయఘనాంజన శైలనాయకా. 386

ముక్తపదగ్రస్తము
సీ. శ్రీమత్కటాక్షరక్షిత వనద్విపరాజ
రాజవిభూషణ ప్రణుతసార
సారంగరూపరాక్షసదాన చణబాణ
బాణరాత్రించరప్రాణహరణ
రణభోజనాత్రమార్కండేయనుతిబృంద
బృందవనాంతరప్రియవిహార
హారకోటీరకేయూరముఖ్యాకల్ప
కల్పాగసుమధరానల్పమహిమ
గీ. హిమమయూఖాబ్జబాంధవకమలనేత్ర
నేత్రవల్కలధారణనృపతిధామ
ధామవిదళితరావణదస్యుసార
సారఘనరామ వేంకటశైలధామ. 387

కవిప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూలవస్తుకృతవస్తుధ్వని
సీ. మడిగాసుమల నొంటియడుగు నిక్కున నిల్చి
బెడిదమౌ కెంజాయజడలు దాల్చి
యనయంబునౌఁ దల వినువాఁక ధరియించి
తెలిమేనిపై బూది కలయ నలఁది
బలితంపుపొడల బెబ్బులితోలు కటిఁ జుట్టి
మిసిమిగాఁ గుత్తుక విసము నించి
యఱచేత ముమ్మొనకఱకువా ల్గీలించి
యొడలఁ బాములు బ్రాక నోర్పు గలిగి
గీ. నీసమాఖ్యను బోల పూనికలను తప
మిపు డొనర్చుచునున్నాఁ డుమేశ్వరుండు
కానిచో వాని కేల యీగతి మెలంగ
సన్మునినాథ వేంకటశైలనాథ. 388

సంవత్సరయుక్త సీసము
సీ. శ్రీముఖ ప్రభవ సుస్మేరాభకౌస్తుభ
సర్వజిద్విక్రమ చక్రహస్త
సౌమ్య భావ మునీంద్ర సన్మనోంబుజ భృంగ
యవ్యయానంద హృద్భవ్యరూప
ధాత్ర సాధారణస్తవనీయ నిజచర్య
విభవ ప్రమోదాప్త విబుధనాథ
జయ దుందుభిధ్వాన చకితాసురాధ్యక్ష
దుర్మతి రాక్షసశర్మహరణ
గీ. చిత్రభాను స్వభాను జిత్సిద్ధతేజ
విజయనందన ఖరసూత విధివినోద
మన్మథ క్రోధి ధర్మనిర్మధనసార
వృషగిరీశ్వర సంకాశ వేంకటేశ. 389

సీ. శృంగారరసము మూర్తీభవించినయట్ల
యతసీలతాంతదేహంబు దనరఁ
గరుణారసంబు సాక్షాత్కరించినరీతిఁ
గనుఁగొనలను రాగగరిమ మొనర
శాంతరసంబు ప్రసన్నమైన విధాన
నెదఁ గౌస్తుకప్రభ కుదురుకొనఁగ
నద్భుతరసము ప్రత్యక్షమైన కరణిఁ
గటితటిఁ గనకాంశుకంబు చెలఁగ
గీ. గరచతుష్టయవిలసితదరరథాంగ
ఖడ్గసార్ఙ్గముఖాయుధకాంతు లెసఁగ
మొసలివామేలి తమ్మెట్ల మిసిమి బొసఁగఁ
దపసి డెందాన నెలకొన్న తమ్మికంటి. 390

సీ. దేవరపంపున నీవేళ నటకేఁగి
విలసితంబగు నొక్కకొలనుగంటి
నక్కొల నండఁ బెక్కబలలు గొలువంగ
గడునొప్పు నొకరాజకన్యఁ గంటి
నక్కన్యఁ జేరఁగా నరుగుచో నందొక
సకియచేనున్న వేసడము గంటి
నావేసడము మాది యని మిమ్ముఁ గీర్తించి
పలికిన నలరి యా కలువకంటి
గీ. తనదు కూరిమి సఖియచేఁ బనుప డేగఁ
దెచ్చి యాకాంత యిట నొక్కదిక్కునందు
నున్నదని పల్కఁ జిలువరాదిన్నెఱేఁడు
విని ప్రియమ్మునఁ దోడి తెమ్మనుచుఁ బలుక. 391

సర్వలఘువచనము
వ. అపుడు సచివుఁడు గరుడగిరివిభుసముఖమున నునిచిన నుడధిపవదన ముదమున మును వినినది గనుక సరసిజనయన యరిదరవరకర యసురనికరహరణ మునిజనవినుతచరణ తన వచన మొకటి వినుము దయ జిలుకు గనుఁగొనల ననుఁ గనుఁగొనుము భవదుపవనమున నొకపురమున కినుఁడయి గగనపతి యనఁగ నొకనృపుఁడు గలఁ డతఁడు తనకు సుతులఁ బడయుటకు బహుదినములు దపములు సలిపిన నతని తపమునకు నతికృపుఁడయి వలిమలసుతమగఁ డెదుట నిలిచి నృపవర యిహపరముల కయిన సుత నొసఁగెద నది యెటు లనిన భుజగనగమున కిరుదల దొరదెసను జిరుతనగరమున జలజసరసిని గమలము నడువ నొక సిసువు దనరెడు నది తనయఁగఁ గయికొని విషధరదరపతికిఁ బరిణయ మొనరుపుమని పలికి చనినతఱిఁ దదనుమతిని ముదితను దొడుక ముదితహృదయుం డయి పొనపొన నచటికిఁ జని దనకు నుడువు శివుని వచనసరణిఁ గమలసరసిని నిలచిన నిసువు నరసి కని కుతుకమునఁ దన తనయఁగ గయికొని సకలవిభవంబు లొనరిచి మఱియు నొకశుభదినమున జలజనిలయ యని యభిదయిడి సుముఖుఁడయి నిలిచిన సమయమున నతనితనయ దినదిన మధికముగఁ బెరిగినదయి వయసు బొడమినదయినతఱి నొకదినమునఁ జెలులఁ యుపవనమునన ననలు దునిమి వెనుక నయముగఁ గొలకుల జలవిహరణ మొనరిచి వెలువడి యచటఁ గనుగలిగి వినయము బ్రియము బెనంగొనఁగ నునుజెఱకువిలునళిగొనయము కఱకఱి గరిగరి గఱవ దురుసున బరుపుట కొరవుగను గఱకుటరవిరిశరములు శుకపికనికరముఖబలములు గలిగిన మదనుని గని గొలిచి తనకుఁ జిలువమలదొరను మగనిగ నొనరుపుమని మదినిఁ దలఁచు నవసరమున జతనమున మిముఁ గొలుచు సచివుఁడు పులుఁగును వెదకికొనుచు మముఁ గని పొనపొన గినిసి బహువిధముల మిముఁ బొగడిన విని యపుడె చెలువలతల రతనము నెఱతనముఁ దనరిన దొరతనముఁ గలిగిన దవుట నను బిలిచి పులుఁగు నొకచలువ కలువసర మవసరమున నొసఁగి సచివుని వెనుకొని మిముఁ గని యెఱుక పఱపుమని యనిచిన ననిచిన మనమున ననుచు వనిత పనుపున నిచటికి నడచితిని ననుఁ గనకపుసర మనుదు రని హరిపదములకు నొరఁగి తెలియఁ బలికి పులుఁగును గలువసరమును నొసంగి యచటికి కలికి చెలువము బొగఁడగ నలువకు నలవి యగునె యయిన నెఱిఁగిన తెఱఁగునఁ దెలియఁ బలికెద. 392

క. సిరిసుగుణపంక్తి తదుదా
హరణత్తారావళి నఖముల మంజరి చ
న్నరి యాకందముల ప్రబం
ధరీతిఁ గచ మింతి వింత ధరలోఁ గలదే. 393

తే. రహి మది యయోధ్య వాతెఱ రక్తి మధుర
కౌను మాయా కబరి కాశి కటియు కాంచి
గాంచి వెలయు నవ్వెలఁదిని గాంచినంత
యబ్బురమె క్షేత్రఫలము మీ కబ్బు టెల్ల. 394

సర్వయమకరూపత్రిప్రాసకందము
క. సరమా కే లనఁటికి మీ
సరమా మెఱుఁగుఁదొడ నాభి సరమా జలజా
సరమా ముఖరుచిభసలవి
సరమా కురుల జిగి కొమ సుసరమా పొగడన్. 395

అనుప్రాసగీతి
ఆ. వాలుమీలు డాలు నేలింతి కన్గవ
సోము గోము నోము రామ మోము
మించుమించు సంచు మించు బాలికమేను
మిన్ను చెన్నుఁ దన్నుఁ గన్నెనడుము. 396

యమకము
క. నెమ్ములు గమనమ్ములు మీ
నమ్ములు మంజులతరనయనమ్ములు తళుకూ
నమ్ములు దృక్చలనమ్ములు
నెమ్మిఁగన మెఱుఁగుబోణి కిమ్మెయిఁ దనరున్. 397

ద్వాత్రింశదవయవవర్ణవరూపకాలంకారము
సీ. తుఱుమహిమోము చంద్రుఁడు నుదు రఱనెల
బొమలు విం డ్లక్షు లేణములు ముక్కు
నువ్వుఁబువ్వు చెవులు శ్రీల్ నునుబండ్లు మొల్ల ల
ధర మిగు ర్చెక్కు లద్దములు గవుద
తాటిగింజ మెడ చిందము వ్రేళ్ళు పగడముల్
కరము లబ్జములు కక్షములు దిరుగు
దలు కేలు తూండ్లు గుబ్బలు గిరు ల్వళు లలా
రువాల్ నాభి గుహ నడుము విన్ను
గీ. కటు లరులు తొడ లంట్లు మోకాళ్ళు బొంగ
రములు పిక్కలు బొదులు గుల్భము లరడలు
ప్రపదములు కూర్మములు నఖరము లుడు లడు
గు లెడదమ్ములు వెనుపల్క వెలఁది కొప్పు. 398

సభంగాభంగశ్లేషానుప్రాణితోపమాలంకారము
సీ. సకియవేణి ఘనాళి నొకమూలకును దెచ్చు
రమణియానము కలభముల నిమురు
యువతి వాతెఱ శోభన వసుధఁ బాలించు
నతివ పొక్కిలి సుడినంటి మించు
ననఁబోఁడి మెడ యలనవకంబు నిరసించు
నబల మై వాల్మించు నతిశయించు
వెలఁది సిబ్బెపుగుబ్బ లలరు బంతులఁ గొట్టుఁ
గొమ చెక్కు చంద్రఖండము హసించు
గీ. నాతిచూపులక్రియ బోటినఖములవలె
నువిదకటి పోల్కి నెలఁత యూరువుల పగిది
యన్ను వళిగతి మగువ నూగారు కరణి
ముదిత పలుమాట్కి యెలనాగ నుదురు ఠేవ. 399

ఆ. నెలఁత కొమిరె వయసు నెమ్మేను మోము గో
మించు మించుఁ జందు మించు మించు
మగువకేలు తుఱుము మదను మొదటియాన
వాలువాలుగు హరవాలు వాలు. 400

క. మగతేఁటి కలువవెన్నెల
నిగళం బల మెఱుఁగుశరము నీలము వలలన్
జగడించి గెలుచు చూపని
దుగి నుండెడు ననవ సంఖ్య తొయ్యలివీనుల్. 401

చతుష్పాద్యమకము
క. కుందరమా విలసమున
కుం దరమా చెలి నఖాళి గుఱి నెన్నఁగ నా
కుం దరమా యని యపు డళు
కుం దరమా కొమ గళమునకుం గనుచోటన్. 402

త్రిదళయుక్తకందము
క. నిగరాలగు మగఱాలను
నిగరాలుగఁ జేయు నౌర నెలఁత రదనముల్
పగడంబుల జగడంబులు
జగడంబు లిడు న్మిటారి చవిమోవిరుచుల్. 403

మధ్యమయమకము
క. మందగమన నెమ్మోమున
నందలి తిలకమున దృష్టినలకమ్ముల లీ
కందమ్ముల కుందమ్ముల
కందమ్ములఁ గేరు మీఱు గరసించ నగున్. 404

క. విమలరుచి రుచిరతర హీ
రమణిన్ నో రదుము రదము రంజిల్లెడు సం
జమెఱుంగుఁ దొగరుఁ జిగురున్
గొమరున కాస్పదము పదము కొమిరెకు నమరెన్. 405

చరణాద్యంత చతురక్షరనియమయమకము
ఆ. కప్పురాల మించు కప్పురాల దలంచు
కోపుచూపు చెలువ కోపుచూపు
కుందరాజిమిన్న కుంద రాజిలుచున్న
సన్ననవ్వు కన్నె సన్ననవ్వు. 406

చతురక్షరయమకము
ఉ. ఆలపనంబు తేనె జడియాలపనంబు శశాంకబింబ మా
వాలుగదా బెడంగు జడ వాలుగదాయల వాలుఁగన్నులా
జాలపదమ్ముల న్గెలువఁ జాలపదమ్ములు బొల్చు మేలుమే
లాలత కూనయైన నుతు లాలతకూనవెలంది మేనికిన్. 407

క. కందమ్ముల చిందమ్ముల
చందముఁ గని గెలుచు చెలువజడ మెడ బెడగిం
దిందిరములఁ జెందిరముల
యంద మగున్ మగువవీక్షణాధరకాంతుల్. 408

సావయవరూపకాలంకారము
సీ. నిద్దంపు నెమ్మోము నిండుచందురునకుఁ
దెలినవ్వు వెన్నెల తెలివి గాఁగ
దిలకించు కోపుచూపుల తూపుగములకు
నెఱికప్పు ఱెప్పలు గరులు గాఁగ
బొంగారువలిగుబ్భ బొంగరములకు నా
పై మొన ల్ములుకుల బాగు గాఁగ
నతులితకాంతి బాహామృణాలములకుఁ
గరములు మెట్టదామరలు గాఁగ
గీ. మించు క్రొమ్మించులీను నెమ్మేనులతకు
మంచివయసు వసంతాగమంబు గాఁగఁ
దను గనినవారి చూపులు తమకు మఱల
చనినరూపున దనరె కడానిపొలఁతి. 409

ఆదివర్ణవృత్తికందము
క. ఆమో మాకురు లానొస
లామెడ యాకుచయుగంబు నాతఱు లాయా
రామధ్యం బాకటి తటి
యామోకా ళ్ళాయడుగులు నాచెలి కలరెన్. 410

ముక్తపదగ్రస్తద్వయఘటితచరణసీసము
సీ. మించు లందున మించు మించువైఖరినింపు
నింపునెమ్మేని నిద్దంపు సొగసుఁ
బువ్వులజిగినవ్వు నవ్వుచొక్కపుడాలు
డాలువేలార్చు కపోలపాళి
సరసభావ మమరు మరువిల్లులకు నేర్పు
నేర్పు సోయగమున నెగడు బొమలు
గండుతేఁటులకప్పు కప్పురీతులఁ జూపు
జూపు సింగారంపు చుఱుకునిగ్గు
గీ. పద్మినీవైరితోఁ బోరు పడఁతిమోము
మోముగోమును శిరము కప్పురము బల్కు
కళుకు గననీని కనుఁగవ తళుకు గలుగు
చెలువచెలువంబు వర్ణింప నలువ తరమె. 411

ధ్వని
చ. వెలితిగ నవ్విన న్మొలుచు వెన్నెలమిన్నక యూర్పులంట మో
మలతివడన్ గొనుం జిలుక యల్లనవ్రాలిన నెఱ్ఱనౌ కర
మ్ములు పలుకంగ వాడధరము న్గనుచోటను దృష్టిదాకు మై
కొల దడు గిడ్డ కందు నడు గుల్భళి పైఁదలికన్నె గాఁదగున్. 412

కైశికీవృత్తి
ఉ. కొంచెపువ్రేళ్ళ సోయగము గొప్పపిఱుందును వెన్నుచెల్వమున్
మించునమించు కన్ను లటు మీటిన ఖంగను గుబ్బదోయి బొ
మ్మంచు వెలందిమోవి యసియాడెడు కౌ నలతాచు నీగిఁ బొ
మ్మంచును నూగుటారు నడలందము చందనగంధికే తగున్. 413

లాటీరీత్యుదాహరణము
తే. తామరబిడారుకొమ్మ నెమ్మోమునకును
సారచంద్రబింబస్ఫూర్తి సాటియగునె
నాతితల మిన్న నున్నని వాతెఱకును
సారబింబస్ఫూర్తి సాటియగునె. 414

త్రివర్ణనియమయుక్తముక్తపదగ్రస్తము
క. శ్రీసతి సన్నపునడుమున
కేసరికే సరి రదాళికి గణింపఁగ ము
క్తాసరి తాసరి ఘన మహి
మాసరి మాసరిత జఘన మహిమకు నరయన్. 415

లాటీరీత్యుదాహరణోపమాలంకారము
తే. పదము లంబుజభవకాంతిఁ బరిఢవిల్లు
గుబ్బ లచ్యుతదీధితి గ్రుమ్మరించు
కబరి నీలకంఠద్యుతిఁ గాంచుఁ గాన
యలరుమేల్మంగకన్న సాములు గలారె. 416

శ్లేషరూపవైదర్భీరీతిభేదవృత్తము
ఉ. ఆజగడాలు మోముసొగ సాతెలిగన్నుల కోపుచూపు తీ
రాజిగిఠీవిమోవిపలు కానునుగొప్పుమెఱుంగుసోయగం
బాజవసందులే నిఱుకుఁజన్నులు సిబ్బెపుటుబ్బు గబ్బిసౌ
రాజవరాలికే తగు నయమ్ముగ నబ్జదళాయతేక్షణా. 417

ఉ. ఆ లలితాంగి యావెలఁది యాజిగి తానక మాపడంతి యా
బాలిక యామెఱుంగు విడిపాళెము యా చిగురాకుఁబోఁడి యా
గోల మిఠారి యాకులుకుగుబ్బెత యాకలకంఠి యా
మేలిమిబొమ్మ యాకలికిమిన్న తలంపఁగ స్వామికే తగున్. 418

అనుప్రాసద్వయమధ్యయమకవృత్తము
చ. అరికుచ తావిమోవి తొగరాతొగ రాచమొగంబు డంబునా
యరవిరి తేనెసోన పలుకా బలుకాకల చెన్నుపొన్నుతో
సరియగు మేనునైన ఘనమా ఘన మాస్థితి నొప్పుకొప్పు నా
యరివికఁ జూపు చూపు మెఱుఁగా మెఱుఁ గారయ నెన్నశక్యమే. 419

ద్విపాదపంచమవర్ణయమకము
క. బాలికసిబ్బెపుగుబ్బలు
తాలసమానములు కుటిలతాలసమానం
బాలేమ తళుకు కురు లా
బాలేందుఁడు ముదిత నుదురు పద్మదళాక్షా. 420

శబ్దచిత్రము
క. కొమ గుబ్బలతోఁ బోర న
గములా వృద్ధిఁ గని యూరుగమనములకు లో
గి మొదట పుంభావంబై
క్షమ పొక్కిలి కోడె గతులు గలుగని కతనన్. 421

ఉ. ఎక్కడ కాంతి మిన్న దన్న దన మెంత నుతించిన నంత యొప్పు నా
చొక్కపుమోము నానడుము సోయగ మాసొగసైనకొప్పు నా
చక్కెరమోవి యామెఱుఁగుఁజన్నులు నానిడువాలుఁగన్ను లా
చక్కనిజెక్కు లాపిఱుఁదు చందము నందము దానికే తగున్. 422

శ్లేషయుక్తవైదర్భిరీతి
శా. ఆలావణ్య మగణ్య మాగుణ మనన్యస్త్రైణసామాన్య మా
శీలం బప్రతిమాన్య మావినయ మక్షీణోదయం బాకళా
జాలం బుజ్జ్వల మావచోవిభవ మాశ్చర్యావహం బావయ
శ్రీలాలిత్య మనర్ఘ్య మాకుల మతిక్షేమంకరం బచ్యుతా. 423

సీ. వనిత వేనలిఁ జూచి వనధర మవనత
గతిఁ జెంది ధర మయి కదిసి నిల్వ
గురునితంబం బొత్తుకొనిపోవ దర మయి
దొరయ గళ మెదిర్చఁ దులకు రాక
తిరిగి రదమ్మయి దినుసైన కోరక
మరగతి నొందించి యంతఁ గోక
మై యుండఁ గుచమును కో యని యట్టె పైఁ
గని పైకమై నుడి నెనయ వాణి
తే. కినియ నది రాజదేశము నన వెలుంగ
నానన మెదురన జతమై రాది తా మె
లంగి తారాస్థితిఁ గడుఁ జెలంగ నఖము
గెలిచెఁ గనుక నా కనకాంగిఁ దలమె పొగడ. 424

యమకానుప్రాణితరూపకఘటకదుర్ఘటచరణసీసము
సీ. తులకించు వాలుగన్నులు వాలుగన్నులు
నలువు నాచుగురులు నాచుగురులు
చుక్కన గోరును చుక్కన గోరునున్
గుబ్బలు గుబ్బుల యబ్బురంబు
పల్లవములు పల్లవములు మెఱుఁగుకోపు
చూపు మెఱుఁగుకోపు చూపు చాలి
మూలరాబలరూపు మూలరా బలరూపు
మేలిమిమెయి మేలిమి మెయి నెల ను
గీ. దురు నెలనుదురు మెట్టదామరల గరము
మెట్టతామరల గరము మెఱయు నెమ్మి
నడపు నెమ్మినడుపు నడుబెడఁగగు నెల
మోము నలమోము భామాలలామ కరయ. 425

అనేకాక్షరఘటితదుర్ఘటయమకవిఖ్యాతగీతి
ఆ. కలికి మెయి మెఱుంగు కలికిమెయి మెఱుంగు
కులుకు చూపు తేటి కులుకు చూపు
వెలఁది యలరు నవ్వు వెలఁదియలరునవ్వు
తళుకు చెక్కు పసిఁడి తళుకు జెక్కు. 426

ప్రతీపానుప్రాణితశబ్దచిత్రరూపకోపనీత ప్రతిపద దీపితోపమాలంకారసంసృష్టిసీసము
సీ. కంబుకంధరనితంబంబుతో మార్కని
పాదము ల్ముఖవర్ణభంగ మొంది
తరళాయతాక్షిముంగురులతో డగ్గరి
యళులు సమ్ముఖవర్ణహాని జెంది
కువలయనేత్రచన్గవతో నెదిర్చి భూ
ధరము విముఖవర్ణసరణి బొంది
భద్రేభయాననున్బలుకుతో డీకొని
శుకమును ముఖవర్ణవికల మంది
గీ. వహి తదీయాంగసముచితవర్ణధరభ
రమున పదములు వళు లధరము మొకము న
యి సరి దొరయ తమ్మిల నల నిగురునెలను
దగుజడత తగ్గు వడక కందు గనజేసె. 427

త్రిప్రాసాద్యంతైకనియమయమకకందళితకందము
క. తాననయని చంద్రోపమి
తానన యెలుగెత్తి యే కతానన నిడు పం
తానన విలుతుఁడు మెచ్చఁడె
తానన నానొకతె యేకతానన యౌరే. 428

శబ్దశక్తిమూలాలంకారధ్వని
క. తరుణీరత్నము పద్మిని
పరికంపఁగ నినుఁడ వీవు భామినికి భవ
త్కరసంగతి చేకూరక
దొరుకునొఁకో సంతసము చతుర్ముఖ జనకా. 429

తే. భాగ్యముల యిక్క యొరుల కా పడఁతి యందు
దొరకుటలు పుణ్య మెటువంటి దొరకు దొరకు
నొక్కొ యనుచును నృపశౌరి దిక్కుఁ జూచి
యక్కలికి పెక్కుగతుల బెంపెక్క బొగడి. 430

చ. ఎనయఁగ డేగ నయ్యబల యిచ్చిన వాడిన గల్వదండయున్
గొనియట జేరి వేగఁ గయికొమ్మను యిచ్చిన యనంతరంబ నే
పని విని వచ్చు మా పయిని బక్షముతోఁ గృప యుంచు మన్న నా
వనిత వచోవిశేషములవైఖిరికి న్బ్రమదంబు నొందుచున్. 431

తే. తొలుతఁ దావచ్చు తెఱఁగెల్లఁ దెలుపు మనుచు
మగువ నటు బంపి తనకూర్మి మంత్రిఁ జూచి
దాను కలగన్నయట్టి యాతన్విరూప
విభ్రమంబుల వర్ణించి వేడ్క నుండ. 432

క. చని యచట సరసిచెంతను
తనరాకకు నెదురుచూచు దరుణీరత్నం
బును గని ప్రమదముఁ గూర్మియు
మనమునఁ బెనఁగొనఁగఁ గనకమాలిక బలికెన్. 433

త్రిప్రాసకందము
క. క్షీబాళి కబరి చెందిర
శాబాళిక కేళి నీకు చక్కని బాబా
యేబాలిక తలఁపున నిడు
నీబాళికిఁ దగిన యినుని నే దెల్పెదనే. 434

ఉ. ఏమని యెంతునో చెలియ యే నిపు డాజలజాక్షువిభ్రమ
శ్రీమహితాకృతిన్ వినుతిఁ జేసి నలున్ నలకూబరు న్మరు
న్వేమఱు నెన్న నందునకు వేయవపాలికి సాటిరాదనన్
భూమిపశేఖరాత్మజులఁ బోల్పగ వచ్చునె యీడు జోడుగన్. 435

బిబ్బోకము
ఆ. అనుచు మఱియుఁ గరతలామలకంబుగాఁ
దెలుప వినిన యంతఁ దలిరుఁబోఁడి
కపుడె యతని మూర్తి యద్దంబులోఁ గానఁ
బడినయట్ల మదిని బొడమునంత. 436

క. కొమ గళశంఖము కటిచ
క్రము జంఘాగదయు రోమరాజీఖడ్గం
బమితభ్రూచాపము భూ
న్కి మహాచ్యుతరూప మందెఁ జెలు లరుదందన్. 437

వ. అట్టిపట్టున.

క. ఖరకరుఁ డంబరమధ్య
స్థిరుఁడై గనుపట్టె రుచిరదీధితిని వియ
ద్విరదమున కంశురజ్జువు
గరమొప్పఁగఁ గట్టుబొడ్డుఘంటయ పోలెన్. 438

అపూర్వప్రయోగము
ఉ. ఆరవి రశ్మిచేత విపినాంతరవిహారమునందు డప్పి లో
నారమి మంత్రిఁ జూచి సఖియా శ్రమ మెల్లను దీర్ప నొక్కకా
సారము లేదె యన్న గడుఁజల్లనినిర్మలతోయ మున్న దీ
చేరువ నంచు నాహరిని శీఘ్రమె దోకొని వచ్చు నయ్యెడన్. 439 ప్రాసానుప్రాసగీతి
గీ. కేళికా శారికా సురసాలసాల
పాళికా శారికాసార మౌళికాబ్జ
ధూళికా మాలికాత్త మధూళికాళి
బాలికా హేళికా ధ్వను ల్బరగుచోట. 440

అపూర్వప్రయోగము
సీ. వలెవాటు వైచిన జిలుఁగు జందురుకావి
మేలిపయ్యెదకొంగు దూలియాడ
జవ్వాది మెఱుఁగిచ్చి దువ్విన వేణికా
భార మించుక వలపలికి జాఱ
నిఱిగబ్బిగుబ్బపాలిండులపొంగున
గడుసన్నమైనట్టి కౌను గదలఁ
దొలకరి మెఱుపనఁ దులకించు నెమ్మేని
తళుకులు దిశల బిత్తరము జిమ్మఁ
గీ. దరుణి గైదండఁ బూన జిత్రంపుఁబనుల
పసిఁడిపాదుక దనవామపాదమందు
నోరగాఁ ద్రొక్కి కొంతయొయ్యార మెసఁగ
నిలిచియున్నట్టి నృపకన్య చెలువుఁ గనియె. 441

వ. కని వెండియు.

రత్నావళ్యలంకారయుక్తకేశాదిమధ్యపర్యంతపాదాదిమధ్యపర్యంతావయవవర్ణనము
సీ. కంద ధమ్మిల్ల నఖశ్రేణితార ల
ర్ధమృగాంకఫాలపాదములు కిసము
లేణాక్షిజంఘలు తూణీరయుగళంబు
తిలసుమనాస యూరులు కదళులు
విద్రమాధరకటి విశ్వంభరాస్థితి
కంబుకంధరవలగ్నము నభంబు
నవలతికాహస్తనాభికాసారంబు
శైలవక్షోజరోమాళి ఖడ్గ
గీ. మనఁగ నెఱులు గోళ్ళడుగులును నుదురు కను
గవయు బిక్కలు దొడలు ముక్కధరమును బి
ఱుఁదు నడు మఱుతకేలు సౌరుఁగను పొక్కి
లారుగుబ్బలు పదియాఱు నలరె యనుచు. 442

క. కనుఁగవ విందుగ మును దనుఁ
గనుగొను శ్రీహరిని వేడుకలు మదిఁ బొదలన్
వనిత దిలకించెఁ గేళీ
వనితలమునఁ దమిని ఱెప్ప వ్రాలని చూడ్కిన్. 443

యమకత్రయఘటితచరణసీసము—అపూర్వప్రయోగము
సీ. రేలుఁ బగళ్ళుఁ దారేలు బల్ మిన్కుల
రేలు గన్గవ నొప్పు లీలవానిఁ
గరి మొఱాలించి మకరి వధించుటకును
కరియైన నరిబూన్చు కరమువానిఁ
గాఱంబుదంబులు కారంబుఁ గలమై
చొకారంబు నెప్పుడుఁ గాంచువాని
మేలి మించుల కన్న మేలి మించులు గన్న
మేలి మించిన జిల్గు సాలువాని
గీ. దరము దరము దరము జిగి హారువువాని
విజయ విజయ విజయమతి వెలయువాని
సాల సాల సాలఘు దయాశయమువాని
కాండ కాండ కాండరుహ మార్తాండు గాంచె. 444

స్తంభము
చ. నెలఁతుక వేంకటేశ్వరుని నీటుఁ గనుంగొని నిశ్చలాంగి యై
వెలసె విలాసచేష్టలము వేఁగలయంగ నటింపజేయు న
వ్వలపులసూత్రధారి మురవైరితనూరుచిఁ జూచి దానఁ జం
చలత వహింపఁగా గదలజాలనిజంత్రపుబొమ్మకైవడిన్. 445

ముక్తపదగ్రస్తఘటితమధ్యవృత్తము
చ. దులదులమించు కన్దొగలతోఁ గల తోరపుచందుమోముతో
దుల ఫణిగాఁగ మించు జడతోజడతో రుప క్రమంబుతోఁ
దొలఁకెడు వీక్షణాంచ దళితో దళతోడు నఖప్రభాళితో
తొలగకఁ గొల్చు కోపనలతో నలతొయ్యలి చాల లోలయై. 446

సర్వగురువచనము
వ. ఆవేళం దాశ్చర్యారూఢాత్మాంభోజాద్యత్కందర్పాటోపస్ఫాయన్నారాచస్తోమశ్రేష్ఠోద్బోధాధీనాంచద్బోధానైపుణ్యప్రౌఢి శ్రీనారీరత్నం బిట్లూహించెన్. 447

సంశయాలంకారము
సీ. రతినాథుఁడో కాఁడు రతినాథుఁడైన న
య్యలరువిల్లును బువ్వుటమ్ము లేవి
నలకూబరుఁడొ కాడు నలకూబరుండైన
రహిఁ గూడి బాయని రంభ యేది
చంద్రుఁడొ కాఁడల్ల చంద్రుఁడైనను మేన
ననువైన నేణలాంఛన మదేది
యింద్రనందనుఁడొ గాఁ డింద్రనందనుఁడైన
ననిమిషత్వము కన్నులందు నేది
గీ. యలరు విలుఁదీసి రంభను దొలఁగఁజేసి
కందు కడనుంచి యనిమిషగతి నడంచి
యవనికై వచ్చు నీ నల్వురందు నొకఁడు
గాక నృపుఁడైన నీసోయగంబు గలదె. 448

ప్రాసభేదము
క. అని సంశయంబుతోఁ దన
మనమునఁ జర్చింపఁ గనకమాలి కనియె నే
నినుఁగని దెల్పిన నారా
యణుఁ డితఁడే జక్క జూడవమ్మా కొమ్మా. 449

ద్వంద్వప్రాసము
క. సవరాలఁ దెగడి నీలపు
సవరాలుచు కుఱులు దనరు జవరాలి కొలం
బు విరాలి గొలుప వచ్చెను
తొవరా వియ్యంపు మోము దులకింపంగన్. 450

మధ్యమయమకము
క. నావిని యావనితలమున
నావనితల మిన్న గన్ను లల్లార్చి హరిం
భావనితాంతావనతా
తావనతాంతాక్షి వీక్షణావళిఁ జూచెన్. 451

విలాసము—అపూర్వప్రయోగము
క. ఇరుదెసల వెలఁది గిరిగొని
తరళములై వెలికి బెళికి తళతళ మనుచు
న్బెరసిన జూపుల నిందిర
హరికి నివాళి యొనరించె నత్తఱి మఱియున్. 452

అనుభావము
క. అలసములు జంచలమ్ములు
నలఘువ్రీడాభరమ్ము లతినిశితమ్ముల్
గలితానురాగములనై
జెలఁగెన్ రమ హరిని జూచు జిగిబిగి చూపుల్. 453

రోమాంచము
తే. పెన్నిధానంబుఁ గనుఁగొన్న పేఁదకరణి
నలరి హర్షాశ్రుజలము గన్నులను గ్రుక్కి
కళుకు నెమ్మేనఁ బులకలు గడలు కొనఁగ
విరహపరితాపభరమున వెచ్చనూర్చి. 454

అంత్యప్రాసము—అటతాలార్ధపు ఱేకు
క. పలుకులఁ దేనెలు జిలుక
న్సలలితముఁగ నధరమునను జక్కెర లొలుక
న్గలికి మొగము సిరి దొలుకన్
నిలువున శృంగారరసము నిగ్గులు గులుకన్. 455 వ. అటుల నెంతైన సేపు నిలిచి మదిని ముదంబు గదుర నెదుట దానంత వడి యచ్చోట నున్న సవతులేని విలాసవతులగు యువతులు నిచ్చలపునిచ్చ నేమందురో మున్ను నేనోచిన ఫలం బీడేరె నిప్పట్టున నుండరా దని యొకమేరగా నాంచారున్నయెడ నచ్చెలువపై చెలు వలరు ప్రేమ నచ్చోటు కదలి చెంగట నిలిచి శాత్రవలలాటతమఃప్రభార్కప్రభావిభాసురుండైన యచ్చిలువమలఱేఁడు గమకంబుగతమకంబున నప్పుడు. 456

రూపకచిత్రసీసము
సీ. పడతుక పొక్కిలి సుడియౌననే గదా
యావర్తమాన మెం తబ్బురంబు
సకియ వట్రువగుబ్బ చక్రమౌనని గదా
యల్ల వృత్తాంత మెం తక్కజంబు
గన్నె చెక్కిలి చంద్రఖండమౌనని గదా
యీపల్కు జందమే యద్భుతంబు
జవ్వని నెమ్మేను చపలయౌననె గదా
యీ మించు వైఖరి యేమి చిత్ర
గీ. మౌర చెలి ముగ్ధ యగుట యీ యన్ను చెన్ను
మున్ను నాతోన గానక నెన్నె గాక
దీని యవయవములకు నెంతైన దెలియు
సాటి గలుగనె వలవని మాట లేల. 457

అభంగశ్లేషద్వయానుప్రాణితాభేదరూపకాలంకారము
సీ. ఈ లేమ నెఱిగొప్పు నీలాంబువాహంబె
యనఁ జెల్లునది ఘనమౌట కతన
యీపడంతుక బెళ్కుచూపు సోగ మెఱుంగు
యనఁ జెల్లు నదియు మించౌట కతన
యీ యింతి కన్బొమదోయి సింగాణి వి
ల్లనఁ జెల్లు మేలిమి యౌట కతన
యీ నాతి చక్కనిమేను బంగరుతీఁగ
యనఁ జెల్లు మేలిమి యౌట కతన
గీ. యీనెలంతుక గళము హెచ్చైన చింద
మన మిగులఁ జెల్లునది దరమౌట కతన
భళి భువనరూఢి మేల్తళ్కు బాపు వీఁక
యద్దిర చొకాటపుంబసి మవుర రేక. 458

శ్లేషానుప్రాణితాసంబంధాతిశయోక్త్యలంకారకందము
క. లికుచ కుచ మొకమ్మునకున్
జికురములకు సరియడంచు జెప్పంగలరా
యొకనెల యొకయబ్దము కొం
కక జతగా సోముఁడేని ఘనుఁడే యెదుటన్. 459

యమకత్రయగోపనోపమానయమకయుక్తవృత్తము
చ. అళికచకుల్కుపల్కులు పికాంగనలన్ గలన న్గలంచు వ
ర్తులకుచకోపు చూపు విరితూపగలన్ బగల న్బగల్చు మేల్
చెలువపుటన్ను చన్నుగవ చెంగమలన్ గమల న్మలంచు ము
ద్దులకొమరంగు ముంగురులు తుమ్మెదల న్మెదల న్దలంచునే. 460

శ్లేషానుప్రాణితోపమాలంకారవిశేషఘటనచరణసీసము
సీ. రాకేందుముఖి తనూరాగస్థితి నెదిర్చి
పొగరు క్రొమ్మించులు పుట్టజనఁగఁ
దరలాక్షి నెమ్మేని తావు లానఁగఁ జేరి
పువ్వులు విరియుచు పొదల కరుగ
నెలఁతమే న్పెక్కువన్ నెగడి గొల్వఁగ నెంచి
తీవియ ల్తరువుల తివిలిసురుగ
నన్నుమిన్నమై మిన్నలాగఁ గడంగి
గట్టిబంగారంబుకాక కరుగ
తే. రూఢిగా మెఱుఁగునకు మెఱుఁ గలరునకు
నలరు మంజులతకును మంజులత మేలి
మికిని మేలిమియై సరి మెఱయు దలిరు
నంద లిరువార మూను నీయతివ మేను. 461

ఆద్యంతైకనియమముక్తపదగ్రస్తనిస్తులకందము
క. ఈలేమ మోవిచెఱకుం
బాలె బాలేందుతీరుఫాలపు మేలే
మేలే జిగి గుదిరికి జగ
డాలే డాలేపురుషుని డాలే గన్నుల్. 462

ఆద్యంతైకనియమముక్తపదగ్రస్తచక్రవాళసీసము
సీ. తరము గుబ్బలు ధరాధరము గేరఁగఁ గోరు
గోరముత్యము గెల్వ బారు దీఱు
దీరుగాఁ జీమచాల్ వారించు నూగారు
గాఱుమబ్బును గెబ్బుఁ గబరిసౌరు
సౌరుచ్యమున మోవిచవి తేనె వగ నూరు
నూరు లంటుల మీఱి దారి తారుఁ
దారుణ్య మబ్జజాకారము పై దూరు
దూరునెమ్మోము చందుపలుమాఱు
గీ. మారుతేజీల నగఁ బల్కుఁ బోరువారు
వారిరుహముల బదములు మేరజీరు
జీరుపల్జిగి మగఱా మిఠారి పేరు
పేరుగల కన్నె నెన్న నెవ్వారి తరము. 463

తే. మంచిగంధంబుఁ గనుట సంపంగి యగును
మేలియంశుక మానుట మేలిమియగు
రెంటగలుగు సమాఖ్యమైనంటి యుండె
గనుక కనకాంగి యనుట యీకలికి కలరు. 464

సార్వత్రికనియమకతత్పూర్వోపరియమకరూపనియమకద్వయఘటకవృత్తము
ఉ. మించును జూపు చూపు విరి మించుఁగ నవ్వును నవ్వు యాన మ
మ్మించును నెమ్మి నెమ్మిజడ మించును దాచును దాచు గోరు రె
మ్మించును దారదార గతి మించును నంచల నంచ గుబ్బ న
మ్మించును చెండు చెండును భ్రమించు నను న్గొమ రూపు బాపురే. 465

శబ్దభ్రమకానుప్రాణితనియమయమకగీతిగర్భితచరణదుర్ఘటసీసము
సీ. వనిత మెయిరకమ్ము కనకమ్ము నణఁగించుఁ
దిరుగ నదియు నాస దెగడు నాస
చంద్రముఖిగళమ్ము జలజమ్ము నణిఁగించు
మఱల నదియు గేలు మాటి కోలు
గన్నెరూపపుప్రభ కాళికాభ నదల్చు
మగుడ నదియుఁ గొప్పు నగుట కొప్పు
పడతి నఖముఖమ్ము భవిభపార విదల్చు
మఱల నదియుఁ జూపు మెఱయజూపు
గీ. రూఢి గా దనులోమవిలోమసరణి
నైన నేకసరణినైన నళుదులైన
జంట చవుకపుపేరుల సరవితోన
గాన నీనాతి బ్రతినెన్నగాన జగతి. 466

తే. కలికి వదనాంఘ్రి రోమాళి కాంతి కలికి
తొగల చెలిగందుచుఁ బదాఱు తునక లయ్యెఁ
ద్రమ్మివిరియుచు నూఱు ఖండమ్ము లయ్యె
జిలువ దల వంచుకొనుచు వేజిదుప లయ్యె. 467

క. బాలాదృగీక్షణాలక
జాలాభకు నోడి దొనల శరములు దుమికెన్
మీలలుగుల మొనల బడెన్
నీలాభ్రము విషము గ్రోలె నిజముగ ననుచున్. 468

గీ. తరుణి చన్దోయి సౌరుమందరముఁ దఱము
దరము నవకమ్ము గ్రమ్ము బిత్తరము తరము
తరము కంఠమ్ము శుభవిభాకరము కరము
కరముగొను తమ్మిచే ప్రియకరము కరము. 469

క. ఆనిమ్మపండ్ల నలచుట
యానికయే బొమ్మరముల నలతాళములన్
దీని కఠినస్తనద్వయి
కానిమ్మని నలము త్రాటగట్టుం గొట్టున్. 470

సార్వత్రికనియమయమకాంత్యప్రాసభాసమానవృత్తము
ఉ. నూరును మారుకైదువ తనూరుచి దాపలుమాఱు రంభ చె
న్నూరులు మారుమోవిచవి నూరును తేనెకు మాఱు శీతభా
నూరుత గోరు మోముడుల నూరుచు తీరగు గోరుమేన దీ
నూరువు జేరుచో మిగుల నూరు నెమ్మదిఁ జేరు నద్దిరా. 471

ఆద్యంతయమకరూపముక్తపదగ్రస్తగీతి
తే. కాంత నగ వెంచ దిల జాల గప్పురాల
కప్పురాల సరము గేరు గలికి యూరు
మేటి చెలిమేనునగు నల మించులతల
మించులతలను దగనేలు మెలఁతకేలు. 472

విరోధాభాసాలంకారము
సీ. అలగౌను కలిమి మిన్నంది మిన్నందియు
నాలోన ముష్టికి బాలుపడియె
ఘనకుచశ్రీలు దుర్గమదుర్గముల నేలి
ననుదినం బుపవాసమునకు జిక్కె
భువి కటి రమ భూరి భూరివేది గని య
నిశ మమితక్షామదశను జెందె
గళలక్ష్మి శంఖ శంఖమ్మును మించియుఁ
దగు గొంటుపోకల దారి గాంచెఁ
గీ. గటగటా ధాత కొకయింత గరుణ లేదె
గాస యౌగాము లెఱుఁగఁడెఁ గడఁగి దలఁప
నవతఁ గని సిరు ల్పూనగా నవునుగాని
సంపద వహించి లేమి భరించు టెట్లు. 473

మ. కళకు ల్జిమ్మెడుమేను బంగరుసలాక న్మీఱు నయ్యారె యొ
ప్పులకుప్పా చలితోరు తత్తరపుజూపుల్ కారుక్రొమ్మించు ని
గ్గులు మాధుర్యఘనోక్తి గప్పురపుబల్కుల్ రాలు గెమ్మోవి తే
టలు ఝల్ఝల్లున కండచక్కెరలు వేట్కన్ జిల్కు నిక్కల్కికిన్. 474

ఉభయచిత్రోత్ప్రేక్షోలంకారము
క. సిరిమొగమునను నలువ య
క్షరావధానజననముగ గ్లౌస్థితి దలఁచన్
గురువౌత్వము లత్వంబు నొ
నరించె నన నుదురు గురు వెనయు బొమ లమరెన్. 475

గీ. నిక్కు నెఱుగొప్పుకందము ముక్కు చంప
కంబు నేత్రద్వయం బుత్పలంబు వదన
మంబుజంబు నితంబబింబంబు పృథ్వి
తరమె యీలేమవృత్తతత్త్వము నుతింప. 476

శబ్దచిత్రము
తే. సతికి వనజదర్పణ నలాహిత పదత్ర
యాదివర్ణముల్ గ్రహించి యబ్జసూతి
కళుకు నెమ్మోము నిర్మించు కతన సూవె
నదిమొదల్ వదనాహ్వయ మద్దమయ్యె. 477

ఉపమేయోపమానవాచకనకారాదిపదగుణితాసాధ్యమత్తేభవిక్రీడితము
మ. ననలన్ నాగము నుప్పునీళ్ళ నుడుగున్ వామాక్షి నూత్నాసి నె
మ్మనపున్నైశమునోమనౌ కళల నంటౌతమ్మి నర్మన్న గం
గన సహ్మాసయు నిగ్గు నీటు మడి నూగా ర్నెన్నడ న్గల్గు తి
న్నన నైజాంగము నోము నాక నుదురు న్నవ్యాంఘ్రి నర్మోక్తియున్. 478

ఉపమానోపమశబ్దైక్యాపహ్నవరూపకాలంకారము
సీ. పరికింప జాతరూపము జాతరూపము
మొగినెల మేలిమోము నెలమేలి
మోము నాభ్రమరకములు భ్రమరకములు
కన నంబకము లంబకములు తళుకుఁ
జెక్కుతళుకుఁ బెక్కు నక్కరములు చిగు
రులు కీరములు చిగురులు పృథుల కు
చమ్ములు పృథులకుచమ్ములు భద్రక
రోరులు భద్రకరోరులొగి ని
గీ. తంబము నితంబము నలపదములు నలప
దములు గణియింప నఖవిభదానఖవిభ
కొప్పు ఘనమును కొఱఁత లేకొప్పు ఘనము
పాలకడలిని బొడమిన బాల కౌర. 479

ఫలోత్ప్రేక్షాలంకారము
సీ. బలునీచుకంపుమేనుల దాల్చు సడి తెఱ
గంటి వంగసమునఁ గలుగు కొదవ
వడిజాలములఁ దగుల్పడి పోవు నారడి
వలవంతలు గుంది నిలుచు నింద
బవరాల మరుఁ డోరపడఁగసేయు కొఱంత
యలుఁగుల పాలుగానైన దూఱు
జీవనమున కొడ్లఁ జెఱచిన యాడిక
పొరలెత్తి పోడాఁగి పోవుఱట్టు
గీ. నరుల కెంతగాలములకు నగప డసదు
మదినిఁ దలపోసి యవియెల్ల మాన్పనెంచి
పండువెన్నెల జిగిఁ జెందు గండుమీలు
బాల తెలివాలుఁగన్నులై బరిఢవిల్లె. 480

ప్రతీపాలంకారము — అపూర్వప్రయోగము
సీ. రామవేనలిమాద్రి చామరస్తోమంబు
డాయునంతనె తోఁక గోయరాదె
పడఁతి యూరులతోడఁ బ్రతి నెన్ను ననఁటులఁ
గొంచకఁ జర్మ మెత్తించరాదె
వనిత చూపులకుఁ దిర్వళిక నిగ్గులు సరి
గాంచవచ్చిన నివాళించరాదె
యువిత బొమ్మలసాటి నొందు చెఱకువిండ్ల
మించి పిచ్చలుగ ఖండించరాదె
గీ. వెలఁది గుబ్బలతోడను దుల యటంచు
డీకొనినఁ బుట్ట చెండ్లఁ గొట్టించరాదె
యన నగణ్యైకలావణ్యయౌవనాభి
రామయై యొప్పె నాకాశరాజపుత్రి. 481

కైశికీవృత్తవృత్తము
చ. తళుకుఁ బదమ్ము లందపురదమ్ములు కౌను బెడంగు గబ్బిగు
బ్బల యుదుటారజంపు నునుబల్కులు లత్తుకమోవి చిన్నిక్రొ
న్నెల నుదు రద్దము ల్దెగడు నిద్దపుఁజెక్కులు మోము తేట ముం
గల తలఁజుట్టి వచ్చు కనుగల్వలు చెల్వకు నొప్పు మెప్పుగన్. 482

తే. నలువ తమ్ముఁడు ముక్కంటి గెలువ నెంచి
కలికి తలమిన్న నెమ్మేనిఁ దలిరు వింట
జేరిచిన సోగ కురువేరు నారి గాఁగ
మడిమ లానిన తెగ కీలుజడ జెలంగె. 483

ద్రాక్షాపాకము
మ. అవురా వాతెఱ తేటఖూబు పిఱుఁ దొయ్యారంపు మజ్ఝారె చ
న్గవ తళ్కుల్ బళిదంతకాంతు లరెరే కన్బెళ్కు లప్పప్ప కొ
ప్పువిలాసం బహహా తనూరుచి బలా బొమ్మంద మయ్యారె యూ
రువికాసంబు శవాసు చెల్వమని బేర్కో గల్గె నిక్కామినిన్. 484

యమకగీతి
తే. తమ్ములందును గాజుటద్దమ్ములందు
మెఱుఁగు గానమి యీజగ మెఱుఁగుఁగాన
నిందునం దననేల లే దిందునందుఁ
గందధమ్మిల్ల మొగము చక్కందనమ్ము. 485

కైశికీవృత్తి
ఉ. మాటల తేనెగాఱు కటి మందము చక్కిటిమేను మించులో
తేటమొగంబు చందురుని తీరగు చక్కెరలప్పమోవికన్
సూటి తలంతజుట్టును మినుక్కను మాత్రమెగౌను పిక్కలన్
దాటును సోయగంబు జడ దర్పకు చూపులు జూపు లింతికిన్. 486

ఏకార్థప్రతిపాదకపదవిముక్తబ్రాథమికవర్ణాంర్ధాంతరనిరూపకపదఘటితసీసము
సీ. దరకుందరదకుఁ గందరము పెన్బొక్కిలి
దరము కంఠంబు కుంజరగమనకు
విధుబింబముఖికి శ్రీబింబంబు శ్రుతిరీతి
బింబంబు పెదవి రోలంబకచకుఁ
గమఠప్రపదకు గుంభములు వక్షోజముల్
భములు నఖమ్ములు పద్మపదకు
నీలకుంతలకు శైవాలమ్ము నూగారు
వాలమ్ముచూపు శంపాలతాంగి
గీ. కన్నుమిన్నకు కేసరి యసదుగౌను
సరియలరుఁగేలు నెలఁతకు సిరివెలఁదికిఁ
గోయిలల నుడి యిల కటి కొమిరెవయసు
సొగసువగలాడి కలరె నీజగములోన. 487

అనుమానాలంకారము
సీ. కళుకుటద్దము మోము గావలెఁ గాకున్న
జోడుపట్టుపిడి యాచుబుక మగునె
ఘనశంఖము గళంబు గావలెఁ గాకున్న
జిన్ని పూసరము లాచేత లగునె
గౌరుకేల్నూగారు గావలెఁ గాకున్నఁ
గుంభంబు లాచనుగుబ్బ లగునె
కడుచివురులు వ్రేళ్ళు గావలెఁ గాకున్న
నవకోరకమ్ము లానఖము లగునె
గీ. తళుకు సింగిణిబొమలు గావలెను గాని
చోఁ లకోరులు క్రొవ్వాఁడి చూపు లగునె
యన వినుతి సేయఁ దనరె మోహనవిలాస
భావదూర్వహయై యిందిరావధూటి. 488

విషమాలంకారము
సీ. చక్కని నునుముక్కు సంపంగిమొగ్గపైఁ
బొదలెడు చూపుఁ దుమ్మెదుల నిలిపి
తిన్ననితావి వాతెఱ దొండపంటిపైఁ
గులికెడు బలుకు రాచిలుక నిలిపి
నిండుమెఱుంగుఁ బూనినమోముఁ దమ్మిపైఁ
బొందుగా నుదురు లేజందు నిలిపి
వెలిబర్వు చిఱునవ్వు వెన్నెల నిగ్గుపై
నురుతరాక్షి చకోరయుగము నిలిపి
గీ. నిజబలాన్యోన్యవైరంబు నిగ్రహించి
కాయజుఁడు నేర్పు చేఁగూర్చెనో యనంగ
నిద్దపుఁ బసిండి నెత్తమ్మి మిద్దెనడుము
మొలచిన నెలంత తలమిన్న నిలువు దనరె. 489

ద్విరుక్తికందము
క. నకనకని నడుము నక్కులు
చకచకల వెలార్చుతొడలు జక్కనితొగలన్
వికవికనగు తెలిగన్నులు
వికచకమలవదన కొనరె వేడుక మీఱన్. 490

క. తిలకంబు ములికి నాసాం
చల కాంచన శరగృహీతశార్ఙ్గంబును బొ
మ్మల కోపుల వ్రే ల్తెలి జ
ల్లు లనఁగఁ జెక్కుల నగవు తళుకమరె రమకున్. 491

విభావనాలంకారము — అపూర్వప్రయోగము
సీ. ఒదవుఁబో నొకచక్కిఁ గదళికాస్తంభంబు
లాపయి నిసుముది బ్బరిది గాదె
మొలుచుఁ బో నొకమేరఁ దళుకు దొంతరకర
ళ్ళాపయి గుబ్బలు లరిది గాదె
గలుగుఁబో నొకచెంతఁ గనకారవిందంబు
లాపయిని బిసమ్ము లరిది గాదె
బుట్టుఁబో నొకచోటఁ బున్నమచందురుఁ
డాపయి నిరు లుంట యరిది గాదె
గీ. ధాత్రిఁ జిత్రిత పుష్పకోదండనేతృ
నూతనవిధాత సృజియించెనో యనంగఁ
గలికి యూరులు గటివళుల్ గబ్బిచనులు
కరములు భుజమ్ము లాస్యంబుఁ గబరియొప్పె. 492

కైశికీవృత్తి
చ. పెలుచగువీలు శ్రీలు గడు బేసడ లాడ సలాము సేయు క
న్నులు దెగబారకెచ్చు జడ నున్దలిరాకు వెలార్చు మోవి చెం
డులవడిఁ జెండు గుబ్బలపటుత్వము నూరులతీరుగాఁక వె
ల్గలపుబసిండిమైజిగి చొకారము నియ్యెలనాఁగకే దగున్. 493

యతిభేదము
క. మారనరేంద్రుఁడు నెఱి నూ
గారను బెనుబాము వెడలఁగా దిగి నెదుటన్
జేరుపనగు నఱపెట్టియ
సౌరునఁ బొక్కిలి దనర్చెఁ జంద్రాననకున్. 494

ఉ. ఆనునుఁగొప్పువ్రేఁకదన మాతెలిగన్నుల బెళ్కు సోయగం
బానగుమోము చొక్కటము నాబిగిగుబ్బలయుబ్బు నిబ్బరం
బానులిగౌను తిన్నదన మాకటి మిక్కుట మావినూత్నపా
దానుగతాబ్జరేఖలు నయారె యొయారికి దీనికే దగున్. 495

కైశికీవృత్తి
ఉ. సోఁకినఁ గగ్గుమేను నగు జొప్పున త్రెవ్వెడు గౌనుచంద న
ఱ్ఱాకులఁ బెట్టు నెమ్మొగ మయారె యొయారపుబెళ్కు జూపు పెన్
జీఁకటి గప్పు కొప్పు తొలుచిందము చందము కంటమందమున్
వీఁకగ మచ్చరించి సరి నిక్కుచనుంగవ బొల్చె నింతికిన్. 496

సమాసాలంకారము
సీ. పలుచనియడుగులు పద్మవైఖరిఁ జెందె
నాసన మబ్జవిఖ్యాతి నలరె
బెళుకుచూపులు మహోత్పలరీతిఁ జెన్నారెఁ
బొక్కిలి సారసస్ఫూర్తిఁ దనరె
బాహువులు బిసప్రభవకాంతిఁ జెలువొందెఁ
గన్నులు రాజీవగణన నొనరె
లేఁ గౌను బుష్కరలీలచే రాణించెఁ
గంఠంబు జలజసంగతిఁ దనర్చెఁ
గీ. గరము జిగిరూపు కమలాళి గరిమ గాంచె
నలరుమేల్మంగ గనుక తత్ఫలము బొందె
గాన బొగడఁగ నెవ్వారికైన వశమె
కంటికింపుగఁ గంటి వాల్గంటి నిపుడు. 497

త్రిప్రాసయమకకందము
క. కుందమ్ములు పలుకుదురున
కుం దమ్ములు తెలిగల తళుకుం దమ్ములు మో
మందమ్ములు నడుపులు బలు
మందమ్ములు ములుకు లౌర మానినిచూపుల్. 498

ఉభయచిత్రసీసము
సీ. పడఁతి దేహము కుసుంభము నడంచుటయ కా
దువిద వక్షోజంబు లోటుపఱచు
రమణి పల్జిగి కోరకముల రాల్చుటయ కా
దింతి సిబ్బెపుగుబ్బ లెగరఁదోలు
వెలఁది నవ్వు గుళుచ్ఛము లదల్చుటయ కాదు
మదిరాక్షి పాలిండ్లు చిదిమివైచుఁ
జెలియారు శైవాలములఁ గొట్టుటయ కాదు
ముదిత చన్నులు ఱాల మోఁదఁజేయు
గీ. నవుర మధ్యమవర్ణంబు దివియ నుత్త
రార్థకథితోక్తి కుపమలై యవియె మదిని
గోరి యెన్నెడుచోటుల కుంభ కోక
గుచ్ఛ శైలంబు లగుచు నిజేచ్ఛఁ దనరు. 499

ఆదియమకము — అపూర్వప్రయోగము
500. క నలినమ్ముల నలినమ్ములఁ
జెలికేల్ నూగారు నడుపు చెలువము నగు వె
న్నెలమించుల నెలమించుల
నెలఁత నగవు మొగము మేని నిగనిగ దెగడున్. 500

శ్లేషపరికురాంకహేత్వర్థాంతరన్యాసాలంకారసంసృష్టిసీసము
సీ. ప్రతినచేఁ గృష్ణసర్పమును బట్టి శిఖండి
మలసి తమ్ములదాటి మధుపసమితి
పదిరి గొబ్బున విష్ణుపద మంటి విషదుండు
నీట మునిఁగి బైట నిలిచినాఁడు
మునుమున తారకల్ ముట్టి తమస్థితి
కడఁక సోముని గొట్టి ఖలతముండు
నాజ్యార్ద్రాతాస్ఫూర్తి నలరి చిలువ చాలు
బలిపీఠ మొనసి తప్పక భుజంగి
గీ. సంపద లొసంగి వెండి దండింపసాఁగె
సర్వమును మిథ్యాగా నెంచి చక్కనివని
త బలుజడతానబద్ధమూర్ధన్యబుద్ధ
మగుటను మలీమసుల కెందుఁ దగవు గాదె. 501

శ్లేషానుప్రాణితానుమానయుక్తపరికరాలంకారము
సీ. హరిమధ్య పాలిండ్లు లాగట్లు గాఁబోలు
గాకున్న శృంగారగరిమ దగునె
పొన్నారి కన్బొమ పూవిల్లు గాఁబోలు
గాకున్న మాధుర్యగతి గలుగునె
కొమ్మనుడి వనఃప్రియమ్ము గాఁబోలును
గాకున్నఁ బల్లవగ్రాహి యగునె
కమలాకరమ్ము లబ్జములు గాఁబోలును
గాకున్నఁ గంకణకాంతిఁ గనునె
గీ. పటుకళానిధి గాఁబోలు పాపమోము
గానిచోఁ గౌముదీహరికాంక్షఁ బడునె
యలరు మించులు గాఁబోలును లతకూన
చూపు లటుగానిచోఁ గడి రూపు లగునె. 502

ఉభయస్ఫురణము
సీ. కలికి కంఠము సౌరు కలికి చూపుల బాఱు
కంబుజాలము జాలకంబు గేరుఁ
జెలువ కౌనుహొరంగు దెలిగన్నుల తెఱంగు
మృగరాజమును రాజమృగము నణఁచు
వెలఁది మొగము సొంపు వెలఁది వాతెఱకెంపు
రాజబింబము బింబరాజ మెనయుఁ
బొలఁతి నెన్నడలాగు తళుకు కీల్జడబాగు
మునునాగమును నాగమును జయించు
గీ. నాఁతి ముంగుఱుల కళుకు నగవు కులుకు
సారఘనమును ఘనసార సరణి మించు
ననుచుఁ దనమనమునఁ గను వినుకరిదొర
కొండరాయుండు గొనియాడుచుండు నపుడు. 503

క. మును వనితలమున నిలిచిన
వనితను పొనపొనను జేరి వలపు సొలపునున్
గని వినయము నయబ్రియమును
మనసునఁ బెనఁగనఁగఁ గనకమాలిక బలికెన్. 504

మధ్యమయమకద్వయఘటితచరణసీసము
సీ. ఔనెలో నానాట నానాట నీవంటి
వనిత లివ్వనిత లివ్వనిని మెలఁగ
నీ వీశుప్రేమాన నేమాన నేజూచు
కలనమ్ము కలనమ్ము తెలివి గాదె
వలపు నీకును చలచ్చలదళాంచలదళా
రహిమాని రహిమాని బ్రబల మగునె
మరుఁ డేయ నిన్ను దామరలఁ దామరల పూ
వింట పూవింటను విడియఁదగునె
గీ. సరవిగా రామగారామల వెలసిన
పనులు నీవేళ నీవేల మనమునందు
దలఁచ వింతైన వింతైన దానఁ గాను
గనుక నాయాన నాయాన వినఁగదమ్మ. 505

త్రివరణయమకవృత్తము
మ. రమణీ హీరమణీప్రభాపటలిఁ గేరంజాలు నీ దంతముల్
బ్రమదాదీప్రమదావళప్రతిభఁ బెంపంబూను నీ యానముల్
గమలా సత్కమలారుణస్ఫురణ వీఁకం గెల్చు నీ హస్తముల్
సుమతీ శ్రీసుమతీక్ష్ణగంధము వహించు న్నీతనూవాసనల్. 506

అనుప్రాసవర్ణవృత్తినియమవృత్తము
ఉ. కౌనుహొరంగు చెక్కుల చొకాటపురంగు నొయారమైన నె
మ్మేని మెఱుంగు పల్కు వడిమించు మఱుంగు మిటారి గుబ్బలుం
దానికరంగు కస్తురి పయంట చెఱంగు జెలంగ నీవు డెం
దాన వరుం గురించు టది దైవ మెఱుంగుఁ గురంగలోచనా. 507

చ. తగునె నృపాలకన్యలకు దవ్వుల నవ్వుల పువ్వులాట లీ
వగలఁ జరింప నిందుఁదగవా మగువా మగవార లుండగా
మగుడి పురంబుఁ జేరఁ జనుమా వినుమా యనుమాన మేల నీ
సొగసు విలాసమందమును సొంపును నింపును బెంపు మీఱఁగన్. 508

త్రిదళయుక్తచతుర్థీప్రాసార్థకందము
క. తారకముల గోరకముల
వారకముల కెల్లనెల్ల వారకము లిడున్
శ్రీరమణీ హీరమణీ
భారమణీ యత్వదీయపదనఖరంబుల్. 509

అపూర్వప్రయోగము
క. తమ్ముల ఘనవిద్రుమ జా
విడికెంపు జిగి వితమ్ముల చివు ర
త్తమ్ముల వరలాక్షా జా
తమ్ముల నిరసించు నీ పదమ్ములకాంతుల్. 510

క. అని యీ గతిని యొకనెపం
బున నా భామినికి మదిని బుట్టిన ప్రేమం
బును భయమును నడఁగు నటం
చును బలికెడు నట్టి సఖినిఁ జూచుచు నచటన్. 511

వ. కొంత తడవుండి యంతట కలరవశుకీ శిఖాశ్వళకలహంసరథాంగ భృంగ కహ్వ బలాకాకలకంఠి శారికాముఖ కలకల కలరవ నితాంత కమనీయంబై మధూకమాలూర మహీరణాసహామండూకపర్ణి మధుశిగ్రు మాలతీమధూళికా మన్మథ మాతులుంగమాకంద సమ్మార్జున మాధవీలతా కీరసహకార సహకార నారికేళ పూగ ఘనసార ఘనసార భూజమధ్య కుముదవనజాత వనజాత కుందబృంద గళిత సుమధూళి సుమధూళి కలితమైన తత్సరోవరప్రాంతంబునకుం జేరి, తారకాసురహరగురుకంటె నసాధారణాధారణాధారధీరపారీణవిహరణుండై నయార్భవద్రుమాంతాపశక్తిహరణుండు, ప్రసృతినయన న్గనుంగొని మోహంబున నిట్టట్టుఁ బోలేక, గుట్టువీడక నదరక, ధైర్యంబు వదలకఁ దనమంత్రినిం జూచి మది నొకతంత్రంబుఁ బన్ని, నిజసైన్యంబు దోడుకరమ్మని కర మ్మనిచియుండె; నంత నారామయారామాభిరామసహకారకోరకములం గోరక నమరాలినుతమరాళీవరాళి రాజరాజీవరాజన్మానసమాన సమానసరోవరతీరంబున నొక్క బువ్వుటీరంబున నుండి యాహరిపై మోహంబున మన్మథతాపపరిపాకభరంబున వాడుదేర గూర్చున్న సమయంబున— 512

త్రిదళయుక్తకందము
క. ఆంజపుజడ గందపుమెడ
మందపునడ గలిమి కలిమి మగువను నేయన్
సందువ గని కందువ గని
చెందు వగఁని కని మరుండు జెలఁగుచుఁ గడకన్. 513

ఉ. సొద్దెపుఁదేటి ఱెక్కకొన సోఁకులచే రవళించు తమ్మిపూ
ముద్దెడ మావిస ద్దఁడర మోదుగునేజయుఁ గల్వకేడెమున్
గద్దువలాను పూబొమిడికంబు దవిర్చిలుకొత్తుఁ దాల్చి తా
గద్దఱి చిల్కనెక్కి పికకాకలికాహళి మ్రోయ డాయుచున్. 514

ఉ. పేర్చి కరంబు మచ్చరము బెంచటు పచ్చని వింటఁదేఁటి నా
రేర్చి రయమ్మునన్ మెఱయ నెక్కిడియందుఁ బ్రసూనబాణముల్
గూర్చి గరిన్ గరిన్ గడవ గుప్పలుగా గుఱినాతిఁజేసి పె
ల్లార్చి మెఱుంగ నాగమది గాడఁగ నేయుచునుండె నయ్యెడన్. 515

ఆద్యంతరమణీయదుర్ఘటానుప్రాసభాసితకందము
క. కలకోమల కోకిలకో
టుల కొల్తలకో చిలుకనుడుల కోపులకో
పులకా దులకో తలకో
తలకొందల కొమ్మవిరిఁ బొదల కొమ్మలకో. 516

ఏకనియమత్ర్యక్షరయమకసంధానితకందము
క. ఇలకోయిలకో బలుకొల
కుల కోరులకో యిగురులకోరుల వె
న్నెలకో నెలకో యళికో
పులకో పులకోత్కరంబు బొడమెన్ గొమకున్. 517

సీ. అరియయ్యె సారసాస్యకుఁ జక్రవాకంబు
పరభృతమయ్యెఁ గోపనకుఁ బికము
పుండరీకంబయ్యెఁ బొలఁతికి వెలదమ్మి
గ్రహమయ్యె మహిళకుఁ దుహినకరుఁడు
పున్నాగమయ్యెఁ గర్పూరగంధికిఁ జొన్న
పగలయ్యె మగువకుఁ బ్రతిదినంబు
బర్హియయ్యెఁ బ్రవాళపదకు మయూరంబు
విషధరమయ్యెఁ దన్వికి ఘనంబు
గీ. కుముదమయ్యెను దెలిగల్వ కుందరదకు
మానసాసియయె మరాళి మంజువాణి
కంగదం బయ్యెఁ గేయూరమణి చికురకుఁ
గాని చెఱకయ్యె నించువి ల్మానవతికి. 518

విప్రలంబదాహరణసీసము
సీ. కమలాకరాంతరభ్రమణోరుమదశిలీ
ముఖములు పటుశిలీముఖము లయ్యె
మలయాచలేంద్రకోమలశీతవిహరణ
సురుచిరాశుగము లాశుగము లయ్యెఁ
గాశ్మీరసాంకవకస్తూరికాయుక్త
చందనశరములు శరము లయ్యెఁ
జారు రంభాఘనసారకాండంబులు
నవఘనసారకాండంబు లయ్యె
గీ. ఫలరసములాను చిలుకలు చిలుక లయ్యె
నమితవాలమ్ము లొఱపు వాలమ్ము లయ్యె
విరహమున నేఁగు నింతికి విశ్వ మంత
నతనుమార్ణపంజరం బనఁగఁ బరఁగె. 519

ఉద్దీపనవిభావైకనియమదుర్ఘటనచరణసీసము
సీ. కలహంస రత్నంబు కాదంబ మయ్యెను
బొగరు మించిన శుకంబు చిలుక యయ్యె
హిమవారి యధికశైత్య మగుణం బయ్యెను
బగటువా కోయిల పత్రి యయ్యె
విడిమించు గొరవంక విశిఖాగ్ర మయ్యెను
రేకనెత్తమ్మి నాళీక మయ్యె
బలితంపు నల్లమొగులు ఖగం బయ్యెను
దళుకు నెత్తమ్మి పతంగ మయ్యెఁ
గీ. దీరుగల పావురంబు లకోరి యయ్యె
మ్రోల గనుపట్టు నలగోల గోల యయ్యె
విరహపరితాపభరమున వేఁగు కొమకు
భువనమంతయు మరునంపపొదిఁగఁ దోచె. 520

గీ. తోఁచి చూపులఁ జెలులను జూచి చూచి
కమ్ము కన్నీరుఁ గొనగోరఁ జిమ్మి చిమ్మి
తలఁచి వెన్నునిఁ దనమదిఁ దలఁచి తలఁచి
నొగులు మిగులను వగలను బొగలి పొగలి. 521

అపూర్వప్రయోగము
క. ఫుల్లారవిందలోచనఁ
బల్లవపాణులు మనోజ్ఞభాష లలర నా
యల్లక పరితాపంబునఁ
దల్లడఁ బడఁగాంచి మఱియుఁ దలఁచుచు మదిలోన్. 522

శా. రామన్ గూడుక మేమువేడుకలు మీఱ న్మున్వనాంతాళికై
పోమో పువ్వులఁ గోయమో సరసి నంబుక్రీడఁ గావింపమో
రామో క్రమ్మరి వెన్నుఁ డిచ్చటికినై రానేల నేఁ డీక్రియన్
బ్రేమం జూడఁగనేల బాల ననుచున్ బ్రీతిన్ సఖీరత్నముల్. 523

క. నీవింత దాఁక నెన్నడు
నీవింత నెఱుఁగకుండి నేఁడిపు డకటా
నీవింత వగలఁ బొగలఁగ
నీవింతలు నృపతివిన్న నేమను మనలన్. 524

యమకము
క. పాయము బాలికలకు నన
పాయము గాదమ్మ వలపుఁ బసచే నీకున్
నాయమ్మ యిట్టి బుద్ధులు
నాయమ్మా విన్నవారు నగరే జగతిన్. 525

మధ్యమచరణసీసము
సీ. ఈవని నిటులుండనేటికిఁ
గ్రమ్మరుమనుచనఁ గానవైతి
వల్ల నాజలకేళి నాడనేనాడనే
యెరుఁగించుకీలేమి యెరుగవైతి
రమ్ము నామాట గైసొమ్మనే కొమ్మ నేఁ
జెప్పిన యటులను జేయవైతి
చూడవద్దనుచు నీతోడనే తోడనేఁ
బలికినయదియును దెలియవైతి
గీ. వకట నిఁక నిన్ను నేర మేమైన నెంచి
బలుకు టదియెల్ల గతజలబంధనంబు
గాన నెటులైన మా నేర్పుకలిమి బలిమి
తాప మెడలింతు మిపుడింత దలఁకకమ్మ. 526

సీ. మాలతీలతికాంగి మధుపరాగం బన్న
ననుపయోగంబని యాడఁదగునె
వరపల్లవాధర వాపికావళి యన్న
నది యవాహితమని యాడఁదగునె
కృష్ణాహినిభవేణి కేతకి యని నంత
నదియ యుక్తమని పోనాడఁ దగునె
కమలాస్య చంద్రఖండ మనిన యంతన
నది యేకమనుచుఁ బోనాడఁ దగునె
గీ. యన్నుదలమిన్న నీకింత వెన్నునెదల
వేఱు సేయుచు మామాట మీఱితేని
దెలియ మధుపికకేకిచంద్రులకు నీకు
వైర మొదవును నీపేరుఁ బేరుకొనిన. 527

ఉ. బోటి విచార మేల మముబోటి సఖీమణు లుండ నీకు నో
పాటలగంధి యాటలును బాటలు మాని వియోగజాతమౌ
హాటకమేల కాంతిజితహాటక పెద్దల చాటుకన్నె వే
నాటను మారుతూపు లెదనాటను మోహము బెంపఁ జెల్లునే. 528

క. ఇన్నాళ్ళును విరహిణులగు
గన్నెలఁ గని నగెడు నీవు ఘనతవిరహవా
రాన్నిధిఁ బొఱలఁగ నగరే
యన్నెలఁతలు నీకు నాయ మగునే యనుచున్. 529

క. అందలి సుమకుంజము దిగు
వం దవిరుల సెజ్జ నునిచి వనితలు చెలి కి
పొందఁ నెద గందమిడుతఱిఁ
దెందెగపైఁ బైని పూలతేనియ గురిసెన్. 530

ఉత్ప్రేక్షాలంకారము
చ. మెలఁత యురస్థలంబు పయిమెత్తిన గందపుఁ బూవుఁదేనెకై
యళియటు వ్రాలఁ దత్పదము లందు మునింగినఁ దాపవహ్ని వె
గ్గలమున గట్టిగా నెగయ గ్రక్కున ఱెక్కలు విచ్చి యొప్పెఁ బూ
విలుతుని తూపు వీఁపునను వెళ్ళగఁ జిక్కిన పింజయో యనన్. 531

ముద్రాలంకారయుక్తతద్గుణాలంకారము
ఉ. ఏమని యెంచవచ్చుఁ బ్రసవేషుశరాసనతాపవేదనన్
వేమఱుఁ గుందుచో సఖులు వేగఁ బ్రఫుల్లసరోజమాలికా
స్తోమము మేనఁ దాల్ప నవితోడనె కంది విచిత్రభంగియై
భామ యురోజసీమఁ గనుపట్టెను నుత్పలమాలికాకృతిన్. 532

క. వనమున నిట్టివిధంబున
వనితకు నుపచారవిధుల వలన నొకింతై
నను శమింపక విరహము
ఘనమగుటయుఁ జూచి యపుడు కాంతాజనముల్. 533

చ. తలిరుల నొత్తుచున్ మిగుల దట్టముగాఁగ పురంబొకింత మైఁ
గలయఁగఁ జల్లుచున్ మఱియుఁ గన్నుల గొజ్జఁగినీటఁ దోయుచున్
గలికి పదంబులం గరయుగంబులఁ బుప్పొడి మెత్తుచున్ గడున్
జెలు లుపచారముల్ వరుస జేయునెడన్ మలయానిలుం డొగిన్. 534

క. వడజల్లుగఁ జిలుఁగుంబా
వడ జల్లగ విసరునంత వనితకు మిగులన్
వడియైన తాప మెంతే
వడియైనను నిల్వలేక వగఁ గుందు తఱిన్. 535

ముద్రాలంకారము - త్రిపుట - మానినీవృత్తము
మానిని. నిబ్బరమైనది నెక్కొను వేదన నిల్పఁ దలంపుచు నేర్పులచే
నబ్బుర మంద రయాన కొనర్చిన వన్నియు నిష్ఫల మౌచునుబో
నుబ్బినకాఁకకు నోర్వక ఱెప్ప లటొయ్యన వ్రాల్చుచు నుస్సురనన్
గబ్బిసఖులు తటకాపడి మానినిఁ గన్గొని పల్కిరి కర్ణముగాన్. 536

ఆర్తి
ఉ. కాఁక శమింపఁజేతు మనఁగాఁ గలకంఠరవంబు వీనులన్
సోఁకిన గుందె గాడ్పు మెయిఁ జొచ్చుట గొందల మందె నంతలో
వ్రేఁకపుఁ జిల్కపల్కువడి వేఁడిమి రాయిడి నొందె మార న
ఱ్ఱాఁకలఁ జెందెనెట్లు చెలియన్ వడజేర్చెదమంచు నెంచుచున్. 537

సీ. వనితగన్గవ నొత్తి వైచిన గలువపైఁ
గరమాని రేఱేని యురువు గందె
మగువ చేనిడి త్రోయు చిగురాని నాలుక
పొక్కపస్వరమునఁ బొగలెఁ బికము
పడఁతి యంఘ్రులనుంచి కడకుఁ ద్రోచిన తమ్మి
విరిసోఁకి సుడివడి తిరిగెఁ బవన
మువిద చంటనుఁ జేర్చి యవలఁబో మీటిన
సుమగుచ్ఛముల వ్రాలి కమలెఁ దేఁటి
గీ. భామ బాహుల నిల్చి త్రోఁబడిన తూఁడుఁ
గమిచి రాయంచ పద్మాకరమున దుమికె
వేగఁ గపురపుహారంబు విరియబాఱె
వెలఁది నెమ్మేని విరహాగ్నివేఁడి ననుచు. 538

అత్యుక్త్యలంకారము
చ. కొలని కెలంకులన్ జెలులు కోమలి నిల్పిన మేనికాఁకచే
సలసలఁగాఁగె నీళ్ళు జలజంబులు సుక్కెను దానఁ జిక్కితేఁ
టులు మొఱఁ బెట్టుచున్ గమలె డుక్కె బిసంబులు వ్రీలెఁ బత్రముల్
గలువలు వాఁడెఁ బుప్పొడులు కగ్గెఁ దొలంగెను జక్రవాకముల్. 539

అనుప్రాసవచనము
వ. ఇవ్విధంబున నక్కాంతాతిలకంబు భుజంగగ్రామణి గ్రావరాడవలోకనజాతవిరహభలసంచలితమానసయై, వళక్షేక్షుకోదండమాధురీధురీణత్వసంబంధబంధురగంధాంధపుష్పంధయస్తనంధయశింజినీమంజుఝంకారఠంకారగంభీరదర్పకందర్పకరవిముక్తాసారసారసనారాచధారాక్షతలంబుల వలనను, అనుదినవిరహిణీలోకభీకరశుకపికశారికానికరకలకలరవంబుల వలనను, యావలి యావలి యావలిక శిఖావళావళికి, సఖు లవలాళవళికి నల్లనల్లన నుల్లంబు డిల్లు జెడి తల్లడమంది యప్పల్లవాధరి యొల్లంబోయి బరవశత్వంబునం గుందియున్న సమయంబున. 540

అనుప్రాసవచనము
సీ. చక్రస్తని యటంచు జగడించకు శశాంక
గురుతమోవేణి యీ కుందరదన
మధురాధర యటంచు మట్టుమీఱకు తేఁటి
చంపకనాస యీ జలజవదన
బిసబాహ యని మాఱు మసలకు రాయంచ
జలధరచికుర యీ కలువకంటి
పల్లవకర యని త్రుళ్లకు కోయిల
శ్రీరామమూర్తి యీ కీరవాణి
గీ. వదనకుంతల యాన సుస్వర సఖిత్వ
మొనసి యుండుట కతన మీ కిత వొనర్పు
ననుచు నళి చంద్ర పరభృత హంసములకు
భయము నయమునఁ దెలియఁగఁ బలికె మఱియు. 541

దైన్యము - చతుర్దశానుప్రాసఘటితచరణసీసము
సీ. అందమా లావణ్యకందమా యేచుట
చందమా పున్నమచందమామ
వైరమా ఫలసారహారమా వాచాల
కీరమా యీదారిబీరమూనఁ
గోపమా కృతవేణికోపమా సముదితా
టోపమాఁ కేకీకలాప మార్ప
నీతమా మలయాద్రిజాతమా సితమరు
జ్ఞాతమా నీమేలుసేఁత మాన
గీ. సదనకదనోగ్రమదనయున్మదనమదన
సదనసదనారతాతతశరశరవ్య
కరణసముచితభావనిగాఢదాహ
వతికి నతి కిలికించివతికి నలుగ. 542

రోషము - అపూర్వము
క. జుణుఁగకురా మదనా మా
తుణుమధ్యను సామి యేలినంతనె నీపొం
గణఁగుటకుఁ దుంటవిల్లరు
పణఁచుచుఁ బిప్పిగను నేలపాల్ సేయింతున్. 543

తృతీయ చతుర్థ చరణాపూర్వప్రయోగము
క. అని చతురవచన రచనల
ననవిల్తుని నతని బలము నగి సఖియౌ కాం
చనమాలిక నాంచారును
గని భయ మణఁగింపఁ దలఁచి కడఁకఁ దలిర్పన్. 544

కావ్యలింగాలంకారము
చ. మనసిజుఁ డంబకత్రయము మాటికి ముజ్జగమున్ జయింపఁగాఁ
బనిచి తదీయశేషమగు బాణయుగంబున నిన్ను నేయఁగా
ననువుఁ దలంచు నంతను నిశాధిపుఁ డొక్కటి భానుఁ డొక్కటిన్
బనివడి మొక్కఁబుచ్చి రల భావజుఢాకకు నేలఁ జింతిలన్. 545

వక్రోక్తి
సీ. వనజాయతాక్షి వీరినిఁ గూర్చి భయమేల
నంగహీనుఁ డుమరుఁ డదియుఁగాక
గొదవెన్నఁగాఁ బుట్టు గ్రుడ్డులు కీరముల్
పెంపుడుగున్నలు పికకులములు
మధుపానవిభ్రమోన్మత్తముల్ తుమ్మెదల్
కోకాభియాతి దోషాకరుండు
మిగుల నాకులతను మీఱు నమ్మాధవుం
డలసాలసుఁడు దక్షిణానిలుండు
గీ. ధాత భళీ 'యథారాజా తథాప్రజా' య
టన్నది ధరిత్రి నిజముగా మున్నుఁ దెలుప
దొరను బంట్లను దగఁ గూర్చె దొరయ ననుచుఁ
జతురవాక్కులఁ బలుకుచు నతివఁ జూచి. 546

అపూర్వప్రయోగము
ఉ. అక్కట యేలపోయితిమి యావనకేళికిఁ బోయి యున్నచోఁ
బొక్కిడి వేంకటాచలవిభుం డపు డేటికి వచ్చె వచ్చెఁ బో
నిక్కలకంఠి ఱిచ్చవడి యెందుకు దప్పకఁ జూచె జూచినన్
జక్కెరవింటివాఁ డదియ సందుగఁ దూపుల నేయ నాయమే. 547

గీ. ఇట్టి వృత్తాంత మవనీశుఁ డెఱిఁగెనేని
మనల నేమని యెంచునో యని తలంచి
యేమి సేయంగఁ గలవార మెద్ది యుపమ
యేది తెఱఁగంచుఁ దమలోన నెంచుచుండ. 548

శబ్దపునరుక్తిత్రిస్తబకక్రమాలంకారసీసము
సీ. గోధర గోధర గోధర ప్రౌఢిమ
బాణబాణప సుమబాణ మహిమ
నాగారి నాగారి నాగారి విస్ఫూర్తి
కృష్ణ కృష్ణాధిప కృష్ణగరిమ
హరిభవ హరిభవ హరిభవ ప్రఖ్యాతి
రాజ రాజారీతి రాజరీతి
నగవిభు నగవిభు నగవిభు స్థితిలీల
వనపతి వనపతి వనపతిగతి
గీ. ధీవిభవ దాన కవన భూతి తను బలజ
వ గతిశౌర్య సత్యావన వచననీతి
భక్తిధనచాపగాన భాభరణధృతి జ
యస్థితివిలాసముల గెల్చు నభ్రనృపుఁడు. 549

గూఢషష్ఠిసీసము
సీ. బలభూతిశాంతి రూపవితీర్ణరణరూఢి
మరుదీశ్వరకుమార మణిరుచిఁ దగి
పటుమతి జవకీర్తి భాశ్రీదయోప్రౌఢి
కవిరాజసన్మాన గరిమ గెలిచి
ధర్మగాన జయసంధాయాన గుణవృత్తి
నరరాజ రఘురామ హరిభృతి నగి
ధర్మధృతి శుచితాధామవాక్స్థితి రీతి
గోధర గాంగేయ గురుగలిఁ గని
గీ. బ్రబలు నతఁ డతులితతతరభసభయద
పరుషవిలయసమయ పురహర కరధృత
డమరు ఢమడమ రవసమసమర విజయ
పటహ నినదోగ్రుఁ డాకాశపార్థివుండు. 550

అపూర్వప్రయోగము
సీ. అధరాధీశ్వరుఁ డట వధూసహితుఁడై
చల్లవేళల విలాసంబు మీఱఁ
జనుదెంచి తనకూర్మి తనయ యున్నవిధంబు
గళవళమందు దొయ్యలులఁ జూచి
యిది యేమి వృత్తాంత యెఱుఁగఁ బల్కరె నావు
డతిభీతచిత్తలై యనిరి చెలియ
లొలపక్షమింతలే కోదేవమునుపటి
వలె బాళివనకేళి సలుపఁబోవ
గీ. నచటి కొకడేగ వచ్చె నేమందఱమును
దఱిమిపట్టితి మపు డొకదండనాథుఁ
డాదటను వచ్చి తనశౌరి దనుచు నతని
కులము రూపంబు గుణమును దెలియఁబలికె. 551

సీ. ఒకదక్షిణాక్షి సూర్యునికిఁ బాలుగ నొక్కఁ
డాకన్ను చంద్రున కాకరముగ
నొకచేయి చక్ర మెండకు బిడారుగ నొక్క
చేసంకు వెన్నెల చికిలి గూర్ప
నొకయంఘ్రి గగనగంగకు ఖళూరిక నొక్క
యడుగు వేదములకు విడిదిఁ జూప
నొకపుట్టువడుగు నాజ్ఞకు తక్కువుగ న్కొక్తి
యవతార మఖిలంబు నాక్రమింప
గీ. నొకమతి సురుల రక్షింప నొక్క తలఁప
సురుల శిక్షింప నొకదయ హరునిఁ బెనుప
నొక్కకృప నరునిఁ గావఁ బెల్లుల్లసిల్ల
పల్లు వాల్జెల్లు ఱాగట్టు పట్టు దిట్ట. 552

క. అతఁడఁట తిరుపతికెల్లను
బతియట గరుడాఖ్యగోత్రపాలనుఁడఁట నీ
క్షితి వేంకటేశ్వరుండన
నుతి కెక్కినవాఁ డటంచు మిగులఁగ నెంచున్. 553

అపూర్వప్రయోగము
క. ఆవే ళచటికి శేష
గ్రావనికాయుఁ డరుదేర రమ ణతనిఁ గనెన్
భూవర యది మొదలీచెలి
యీవిధమున నున్న దనుచు నెంతయు మఱియున్. 554

దశావస్థలు — అపూర్వప్రయోగము
సీ. కనినంతఁ దలిరె రాకాచంద్రబింబాస్య
చింతించఁదొడఁగె రాజీవనయన
కఱదలు మాని సంకల్పించెఁ గలకంఠి
యెద విలపించె నన్నుదలమిన్న
లేశంబు నిద్దురలేక యుండె లతాంగి
యంగదచే డస్సె నలరుఁబోఁడి
చక్కటిఁ బుయిలోటిఁ దక్కె జక్కవచంటి
చేర నుంకించెఁ గర్పూరగంధి
గీ. మోహమున సొమ్మసిల్లె నంభోజవదన
వరుస నీ తొమ్మిది యవస్థ లరసి యిప్పు
డలరుమేలు మంగమ యని పలికినంత
మదిని వెఱఁగంది ముదమంది మమతఁ జెంది.555

షోడశరాజయుక్తకందము — మరుత్ అని విచిత్రప్రయోగము
క. భువి భరత భగీరథ భా
ర్గవ మాంధా త్రంబరీష రంతి శిబి సుహో
త్రవిభు దిలీప మరు ద్రా
ఘవ పృథ్వంగ శశిబిందు గయ నహుషు లనన్. 556

వ. మీఱిన యీనారాయణవనపాలకుండు మున్ను ముక్కంటిచేత విన్నవాఁడు గావునఁ దనముద్దుకూఁతురి మనోభిలాషంబునకు ననుకూలసంభ్రమాయత్తంబైన చిత్తంబునఁ దేజరిల్లి తల్లీలోద్యానవనపద్మసరోవరప్రాంతకేళీసౌధాంతరంబునఁ బుత్రికారత్నంబు నుండ నియమించె నంతట. 557

అశ్రువు
ఉ. చూచి విరాళి జాలిఁ బడుచున్ బడుచున్ వగఁ బూపపాయపున్
రాచమిటారి తాల్మి వలరాచకటారికి నగ్గమౌటచే
లోచని జిక్కి సారసవిలోచనముల్ ముకుళించి మెల్లనే
లేచుఁ బడున్ గలంగుఁ దరళీకృతబాష్పముఖారవిందయై. 558

మోహము
సీ. తరుణి యంతటనుండి తాపంబుచే మాట
లాడదు జెలులతో నాడఁబోదు
గతి వేడఁ దొల్లింటిగతి వీణ మేళంబు
సేయదు బ్రేమఁ గైసేయఁబోదు
సకియలు సంగీతసాహిత్యరీతులఁ
జదువఁగా వినదు దాఁ జదువఁబోదు
సరసపదార్థముల్ సరవి జిహ్వను రుచిఁ
గొనదు మోదంబును గొనఁగఁబోదు
గీ. ముకుర మంటదు గిన్నెర ముట్టఁబోదు
బూలు దాల్పదు గంధంబుఁ బూయఁబోదు
వీడెమును సేయ దొరులను జూడఁబోదు
విరహపరితాపభరమున వేఁగుచుండి. 559

ముద్రాలుప్తోపమా రూపకాతిశయోక్తి హేతూపమ రూపక సందేహ సంకర యథాసంఖ్యస్మృతి మత్ప్రత్యనీకయుక్తహేత్వాలంకారము
సీ. గోపికాకోపనాటోపభాగభిరామ
గ్రీష్మర్తుమిహిరభాభీష్మధామ
యాతపోద్గారి మహాకౌస్తుభసువక్ష
ఖలవిదుంతుదశిరోదళనచక్ర
సాంకవ మృదమగపంకమేచకదేహ
ఫాలాక్షసన్నుతపదసరోజ
యాదికుంభీనసానల్పతల్పక
యతులితవజ్రహస్తానుజన్మ
గీ. యను చెలికరాక్షి వచనముఖానిలములు
గాంచి కిసలయోత్పల శుక గంధపవన
ములఁ దలఁచి మధు విధు మార మలయములును
దనదు గన్నులఁ గట్టిన దారినుండి. 560

మంత్రవర్ణనవచనము
వ. ఆసమయంబున నిజకీర్తిప్రకాశకరుండైన యాకాశరాజు నిఖిలతంత్రప్రవీణులగు మంత్రులం బిలిపించి, దొలుత బుడుతనెలఁదాలుపు ముదల పాలించిన తెఱం గెఱింగించి, తమ్మికంటికిఁ గూఁతు నొసంగ సంగతంబే యని యాలోచనఁ గావించ నాలోకనాయకుని కిచ్చుటకన్న నెన్నభాగ్యం బున్నదే యని ధీమంతులగు మంత్రులు మంతుకెక్కఁ బలికిన, నానందతరంగితాంతరంగుండై, కుల, రూప, గుణ, విద్యా, ధన, బల, రాజ్య, తపంబు లనియెడు నష్టమదంబుల నహంకరించక, శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సౌర, స్కాందంబు లను షడ్దర్శనసముండై మీఱి, బ్రహ్మాండ, విష్ణు, బ్రహ్మ, నారదీయ, మార్కండేయ, వామ, నాగ్నేయ, గారుడ, భవిష్య, ద్బాగవత, స్కాంద, మాత్స్య, లైంగ, కౌర్మ, వాయు, పాద్మ, వారాహ, బ్రహ్మకైవర్తాష్టాదశపురాణపారీణులైన మౌహూర్తికుల రావించి తద్వధూవరుల కానుకూల్యంబుగా నుభయబలవచ్ఛుభముహూర్తంబు నిశ్చయించి తత్కల్యాణమహోత్సవమునకు జిరతనూర శృంగారవనం బలంకారంబు గావించి దాను చిఱుత నూరక నొసంగం దలంచి చతురంగబలసమేతుండై తద్వనప్రాంతంబున కవిబుధగురుసేనామధ్యంబున కవిబుధగురుతారకానికరభాగంబున వెలుంగెడు రేవెలుంగు చందంబున నందంబుగా నున్న భాస్వరకార్తస్వరగిరిపరివృఢధీరుని నిజభుజప్రతాపదీపితసమరవీరోధీరుని హృదయముదయోదయపోషితాశేషధీరుని శరధిశరపరిహృతశరధీరుని పాలితనిరవధీరుని సర్వగీర్వాణక్రియమాణస్వస్వలోకసంత్రావిధీరుని ధీరుని కింకరీకృతవానరుని రక్షితనరుని నిరంతరగానకృద్గంధర్వకిన్నరుని భక్షితదావవైశ్వానరుని రైపమానాభిదానిదాననిశాతచక్రుని నిజకీర్తిపరిపూరితదిశాచక్రుని నూరీకృతతొండమాన్చక్రవర్త్యాది భక్తసాత్కృతవైభవుని అతులితప్రాభవుని మురాసురహరుని మైత్రీకృతహరుని డాలెచ్చ గండ్రగొడ్డంట బల్ చిక్కటారెక్కటిని నుక్కడంచి మించిన మందరాగధరుని యమందరాగంబునం గని యాసచే వెదకు దివ్యౌషధరాజంబు ముంగలం గనుపట్టిన తెఱంగున మదంగంబుఁ బావనంబు సేయ దీనులపాలిటి పెన్నిధివలె సన్నిధిం జేసితిరి కర్తుమకర్తుమన్యథాకర్తుమతిసమర్థులైన దేవరతిరువడిహళు గొలిచిన దొరనై యోష్మాకీనవాల్లభ్యపరిలభ్యసౌఖ్యంబుఁ జెంద నుర్వరవరనైపుణ్యంబునం బుణ్యంబుగా నెలఁతమే లెదుమే లెదుగబడనీక నొకనిమేషంబున శోభనమిషోన్మేషంబున మీనమేషంబు లెంచక జకచకితమేచకవికచకరుచినిచయంబుఁ గమిచి బ్రచురమగు శుచివిచికిలఘుమఘుమద్గంధబంధురోత్తమాంగంబుఁ దదరుణతరుణచరణనాళీకంబు సోఁక జాగిడక జాఁగి యర్ఘ్యపాద్యాదులం బూజించి వరభక్తిచే దేవరకు మత్పుత్రిక నాహూయకన్యాదానంబు నిదానంబుగా నొసంగెద నితోధికభాగ్యంబు వేఱె యే మున్నదని యాత్మావచ్ఛిన్నతావకీనావతారంబులు గణియింప నాతరంబె పాణిగ్రహణంబు నంగీకరింపవలయు భవదీయచిత్తం బెత్తెఱంగై యున్నయదియో గాని ‘శుభస్య శీఘ్రంబు’ అన్నవిధంబున నిక్కార్యంబునకుఁ దావసంబు సేయక విచ్చేయవలయునని సూచన యొనర్చి నచ్చిన ప్రేమ నిలిచిన నృపపుంగవునకు హృదయంగమంబుగా సమంచితసుభాషితంబుల, మంచిది, మిగులసంతోష మాయెనని రామేయామేయసౌందర్యుండగు గోవిందుండు గజారూఢుఁడై, ముంగల నూదుట, మీఁటుల వ్రేయుట, కీయుట, కంచుపైకం, బాలాపంబులను పంచమహావాద్యంబులతో ననుకరించి భూరిభేరీభాంకారంబులు భోరుకలంగ, సకలబిరుదధ్వజంబులు జెలంగ, వందిమాగధకైవారంబు లుప్పతిలంగఁ, దత్పురజనులు సేసలు జల్లంగఁ, జందనాగరుగురుసాంబ్రాణిధూపము లిరుగడలఁ బ్రబలంగఁ, దొలంగఁ ద్రోయరాని తన నలువగునలువగల జలగంబులతోఁ గదలివచ్చునప్పు డప్పుడమిఱేఁ డీరేడులోకములు కడుపునఁ గడపు నేరేడుబండుతీరు మేనున జొక్కపుఁజక్కెరమొక్కుఱెక్కపక్కెరపక్కి నొక్కు చక్కనిమొక్కలిఁ గన్న వెన్నునిఁ గూర్చి మున్నుగాఁ దత్పద్మసరోవరంబుమహిమఁ దేటపడ విన్నపంబు సేయంగడంగె, మాతపితృగురుదేవవేదబ్రాహ్మణనిందకులును, దేవతాబ్రాహ్మణద్రవ్యాపహారకులును, మధుపానోన్మత్తమత్తకాశినీమధురాధరపానం బొనర్చు దుష్కాములును, గోబ్రాహ్మణబాలకస్త్రీహింసకులును, సాధుశీలయు యౌవనయు నైన కులసతినిం బాసి కేళినిదారోదారవ్యాపారంబున నపారంబుగా వారాంగనాసంగమం బపేక్షించువారును, లజ్జ యుజ్జగించి మగని కనుమొఱఁగి పెఱమగనిఁ దగులు మగువలును, బాలకులసొమ్ము లొడుచువారును, దేవాలయమఠప్రాకారతటాకవనఘాతకులును, అన్నవిక్రయులును, దుర్దానప్రతిగ్రాహకులును, యెఱుఁగని ప్రాయశ్చిత్తవిధు లేర్పరచువారును, కొండీఁడును, కొండియంబు వినునతండును, గరదుండును, గృహదాహకుండును, తనజీవనంబుకై పరులకార్యంబుఁ జెఱచునతండును, ఘనులయందు గుణంబులు మాని యీషద్దోషంబులు బ్రకటనంబు సేయువారును, పైతృకంబు విడిచిన యతండును, నమ్మి గొలిచినవారిఁ గికురించి గ్రాసంబు లివ్వక వెలయు దుష్ప్రభుండును, స్వామిద్రోహియును, విశ్వాసఘాతుకుండును, వంచకుండు, లక్షణలక్ష్యరాహిత్యకవితానిబంధనధవులగు కుకవులును నేదొకనిమిత్తంబున నీపద్మసరోవరంబున నిలవరంబున నొక్కపరి తానం బొనరించినఁ దత్పాపంబుల నెల్ల బాపఁగల దిష్టముదిష్టమీమహిమ నుతిసేయఁగలరసజ్ఞ రసజ్ఞ యనిన వినిన నిజతీర్థనిమజ్జనాగతసజ్జననభోభువద్దరిద్రతావిద్రాణంబును, సౌఖ్యసమాచక్రసాన్వితజంతుసంతానకలకలోన్నిద్రాణంబును, తామరసికదామరసికాభ్యుదయాదరిత్రాణంబును, వయోరిరంసాయాతదేవకామినీకుచకుంకుమపంకముద్రాణంబును, సమ్మతతపఃఫుల్లహలకారుణారుణప్రభావిద్రావితసమీపవనాంతరాథఃకరణాంధకారంబులు సంతతవసంతశ్రీజరీగృహ్వమాణామితసితాబ్జప్రకారంబును, అగాధాధరప్రదేశపంమాశబ్దికద్విరేఫజాజాయమానఝంకారంబును, చక్రచంక్రమణవర్తులాకారంబును, దురితవ్యవహారకైకాగారికశరణ్యరణ్యనిసాధ్వసకారణశ్రమయుతాధ్వనీనజరీజృంభ్యమాణనిష్టాపముష్టింధయసమీచీనవాచీనబాలపల్లవమానంబును, పశ్యల్లలాటజేగీయమాననూనచరీదృశ్యమానంబును, ప్రతిఫలితగతాగతగంధర్వవిమానరారజ్యమానంబును, యోజనాయలమానంబును, చకాసత్కల్లోలహల్లీసకహల్లోహలతమసారంబును, పరివసన్మదయుక్తకోకసారసంసారంబును, కేవలశేవలవిభానిరస్తమసారంబును, వారిమధురతాజితసుధాసారంబును, నిరవత్కైరవప్రసారంబును, విధుకాంతకాంతసోపానవికాసారంబును, నిరంతరపారదృశ్యవిజఠిహృద్విసారంబును, మానసరసంసారంబును నగునాకాసారంబు దరిసి క్రిక్కిరిసిన సొంపున మెఱసి, కరిని డిగ్గి, హరియందు మంగళస్నానం బొనరించి, చెంతనున్న నాప్తమంత్రినిం గనుంగొనిన స్వామిచిత్తం బెఱింగి, తత్కృపాపావనుండయి యాదండనాథాఢ్యంభవిష్ణుండు, విష్ణువు నలంకరించ నుద్యోగించి యంత. 561

క. క్రొవ్వాఁడి నఖంబులచే
దువ్వి హొయ ల్మీఱవైచు తోరపుసికపై
జవ్వాజితావి గట్టిన
పువ్వులసరు లతఁడు జుట్టి భుగభుగ వలువన్. 562

ఉపమోత్ప్రేక్షసాంకర్యము
సీ. తూర్పుగుబ్బలిమీఁదఁ దోఁచిన రవిభాతి
డాలీను బురుసారుమాలుఁ గట్టి
కాటుకకొండపైఁ గప్పు లేయెండనాఁ
గటితటిఁ గాంచనపటముఁ జుట్టి
వదనసౌందర్యార్ణవస్ఫురన్మకరలీ
ల లనఁగ మకరకుండలము లునిచి
కరుణారసంబు సాక్షాత్కారమయిన క
రణి మేన కుంకుమరస మలంది
గీ. దీక్ష జేసెను భక్తి సంరక్ష కనఁగఁ
గరము నందునఁ బూనిచి కంకణంబు
శివుఁడు జాబిల్లి రేఖఁ దాల్చిన విధాన
ఫాలమున నుంచి ముత్యాలబాసికంబు. 563

క. తొలుఁదొలుత నిలువుటద్దము
నెలకొన నిడి యెదుట వెన్నునికిఁ గస్తూరీ
తిలక మళికమునఁ దీర్చె
న్నలవడ శృంగారరసమహత్వం బనఁగన్. 564

క. ఈరీతి మంత్రిచంద్రుఁడు
కూరిమిచే హరిని పెండ్లికొమరునిగా శృం
గారించిన నప్పట్టున
ధీరుం డాకాశరాజు తేజం బెసఁగన్. 565

సీ. రంగు మీఱిన యపరంజిగోడలచేత
మిన్నకుంకుమపువ్వు దిన్నియలును
జిలువమేపరి పచ్చపలకలచేతను
దొగసూడు ఱాజిగి దూలములును
విడి మగఱాల చెక్కడపుబోదెలచేత
బలు కప్పుఱాల కంబముల గములఁ
ద్రమ్మి మానికపుసంతనపట్టియలచేతఁ
జొక్కపుముత్తెపుసోబనములఁ
గీ. జేగల మెకమ్ము కొమ్ములఁ జేసినట్టి
బోరుతలుపులచేతఁ గస్తూరిమణుల
విరివి యరుగొప్పు గొప్పయుప్పరిగయందుఁ
బరఁగుచున్నట్టి ద్రాక్షచప్పరముక్రింద. 566

సీ. రవి కిరణాళి దూరఁగనీకఁ గార్కొని
తఱుచైన యుపవనతరుల గములఁ
బూఁదేనెసోనతుంపురు జాలువాఱిన
గాల్వల నివమైన గప్పురంపు
టిసుముదిన్నెలమీఁద నెసఁగు గొజ్జంగుల
వలనైన నాలచ్చికొలనియందుఁ
గలహంసబకచక్రకలరావముల్ తమ
వీనుల కింపుగా విని మనమ్ము
గీ. లమ్మనమ్ములు చూపుదనమ్ము నమ్మ
కామినుల నవ్వు తేటలఁ గరఁగు గలువ
విందుఱా మెట్టులను గల పెండ్లిచవిక
లోన వెన్నుని నునిచి తోడ్తోనఁ గనఁగ. 567

ఉత్ప్రేక్షాలంకారము
క. మొదలన్ మదిగల చంద్రము
డుదయం బగువేళ నుదుట నుంచిన కావున్
గదయన హరిపేరెదపైఁ
బదలిగ శ్రీవత్సకౌస్తుభద్వయ మలరెన్. 568

వ. అని యబ్బురమంది చుట్టుల మందిగల నిలాతలప్రతిజతనంబునఁ దన కుమారికయైన యలమేల్మంగనాంచారును తోడి తెమ్మని బువ్వారుఁబోండ్లఁ బంచిన వల్లెయని వచ్చి యచ్చేడియలు తమతమ యిచ్చల మెచ్చు వెచ్చ విచ్చలవిడి నచ్చెంగట నున్న మానికపుబొమ్మ మానినిం గనుంగొని ప్రేమాని యమ్మా నీకోర్కు లీడేఱె లెమ్మని నీనెమ్మదిం దలంచిన వేంకటాచలపతి నీపతి యగుటకు నతివేగముగాఁ దోకొనివచ్చి పెండ్లిచవికలో వసియింపఁజేసి నిన్ను వెన్నునకు సాకల్యముగాఁ గల్యాణంబు సేయందలంచి మీతండ్రి దయార్ద్రహృదయుండై ధృతి నినున్ బిలుచుక రమ్మని ప్రేమమ్మున మముం బంపెనని పలుకు నప్పట్టునఁ బట్టజాలని సంతోషంబు హల్లీసకంబు సలుప మందాక్ష మందాక్షియై యున్న నక్కన్నియను జెంతనున్న పుప్పొడిదిన్నెను వసింపన్ జేసి సంపంగినూనె నించిన రతనంపుగిన్నియఁ గర్పూరతాంబూలంబులు వికుచఫలంబులు శోభనాక్షతలు కుంకుమరసంబునఁ గదింబించిన పచ్చిపసుపునలుంగు నమర్చి బంగరుపళ్ళెరం బెదుట నుంచి దీవించి నుదుట నక్షతలు గీలించి కుఱంగటను నైదువలు పాటలు పాడ వేడుకమీఱ నప్పుడు. 569

మ. అలకల్ చిందులు ద్రొక్కఁ గొను వడకన్ హారాళి నర్తింపఁ జె
క్కులు ఫాలంబుఁ జెమర్పఁ బైఁట యెద వీడ్కోల్ జెంద బంగారుగా
జులు టోకివ్వఁగ నూర్పు లెచ్చఁ దరులచ్చోనిక్కుఁ దాళస్థితిన్
దలయంటెం గనుదోయి సొక్క నొకకాంతామౌళి మంగాంబకున్. 570

క. పల్లవపాణులు కొందఱు
బళ్ళెరములఁ బూని ఱవలబంగరుగాజుల్
ఘల్లురన సుంకుఁ జెరిగిరి
యల్లోనేరేడటంచు నయ్యిందిరకున్. 571

చ. అటునిటు జిక్కుగొన్నకుఱు లందముగాఁ గొనగోళ్ళ దువ్వి మి
క్కుటముగ నూనెఁ బో నెడను గొజ్జెఁగి నీరునఁ దోఁచిరాచి యొ
క్కట నిరువాయఁగాఁ బిడిచి గొబ్బున విప్పి కదల్చి చందనం
బటకలిఁ బ్రామె నొక్కకుటిలాలక యంబరరాజు పట్టికిన్. 572

చతుర్విధశృంగారము
సీ. జలక మార్చి మడుంగు జిలుఁగు దువ్వలువను
దడి యొత్తి చిత్రవస్త్రంబు గట్టి
మనసార కుంకుమకర్దమం బొకపాటి
నెఱిపూఁత గాఁగ మైనిండ నలది
తలపెచ్చ మొగలిఱేకులు కొంత గానరాఁ
గీల కొప్పొకవంక గీలుకొలిపి
యాపాదమస్తకం బఖిలభూషణమణీ
హారవల్లరులచే ననువు పఱచి
గీ. కాంత లీరీతిఁ జతురశృంగారగతులు
నలరి గైసేయ నొకవింత నెలువు గాంచి
మదనసామ్రాజ్యలక్ష్మి నాఁ బొదల మిగుల
సార రుచిమించు నాంచారు సౌరుఁ జూచి. 573

చతుర్యమకయుక్తాక్కిలివడిసీసము
సీ. దరము కంఠంబు మందరము చన్దోయి కం
దరము నాభి సుదసోదరము పలుకు
ఘనము వేనలి ఘనాఘనము నెన్నడ తటి
ద్ఘనము మేను ఖగలం ఘనము చూపు
బింబ మధర మిందుబింబము మోము త
ద్బింబము బొట్టు శ్రీబింబము చెవు
లురులు ముంగుఱులు చివురులు వ్రేళ్ళంట్ల స
వురులు కురువు లల యలులు వళులు
గీ. తమ్ము లడుగులు చెక్కుటద్దమ్ము లతుల
తరుణకుందము లలరు దంతముల జిగి
యిల కటీరతటంబు కోయిలస్వరంబు
గాఁగ మననాతి గమనాతిగరుచి గనియె. 574

వ. అని వినుతిసేయుచుఁ దనుఁ దోడితెచ్చు చేడియలం గూడుకొని. 575

ఉపమాలంకారము
సీ. క్రొమ్ముగుల్ వడగండ్లు గ్రుమ్మరించినరీతి
నఱజాఱుకొప్పులో విరులు రాల
శీతాంశు ముద్దిడఁజేరు రోహిణివలె
మొగమున ముత్తెపుముక్క ఱమరఁ
దూఁడున గెందమ్మి దోఁచిన చాడ్పున
దళుకుటారంటి పొక్కిలి జెలంగ
జక్కవకవగూడ ఱెక్క లించుక విప్పి
నగతిఁ జన్గవ మకరికలు మెఱయ
గీ. నడుపులకు మూఁగు నంచ చప్పుడు లనంగ
బవరి మొలనూలి గంటల రవళి నిగుడ
దండ నెచ్చెలి యిచ్చు కైదండఁ గొనుచు
వచ్చెఁ దనతండ్రి మ్రోలకు లచ్చి యంత. 576

గీ. అచటి మణిపీఠమునను శ్రీహరి వసించు
సమయమునఁ జంద్రకళ యతిసంభ్రమమునఁ
గనక భృంగారు గొని యుదకములు బోయఁ
గడిఁక బదములు గడిగి భూకాంతుఁ డపుడు. 577

గీ. అర్చనలు జేసి గంధమాల్యాదు లొసఁగి
జీరకగుడంబు హరి వలచేతఁ దాల్ప
వైఖరి నొసంగి జలముల వార్వఁజేసి
యట సుఖాసీనుఁ గావించినట్టియెడను. 578

యమకము — అపూర్వప్రయోగము
గీ. శోభనాభీష్టదానాభిశోభియైన
మోహనాభర భీరు మోహనునకు
నాభినుతనాభి సారంగనాభిఁ దెచ్చి
నాభినామంబు నొక నతనాభి దీర్చె. 579

అపూర్వప్రయోగము
గీ. ఇంతి యోర్తు సామి కెదసూటి నీటున
తేట తాళితగెభిదిరకరోప
లకలశంబు మంజులప్రభాదూర్వాద
ళమునఁ దొడఁగి విడని క్రమము దోఁప. 580

ఉత్ప్రేక్షాలంకారము
చ. అలవడ స్వారివచ్చి మరుఁడాత్మను బోవుచు బైట భృత్యులన్
నిలుమన వార లచ్చటను నిల్చి తదశ్వము నీలిత్రాటిచే
నెలకొనఁ గట్టి డా లెదుట నిల్చిరొ నా హరిదాల్చు వక్షమం
దలతిరుమాల రాజిలుక తాళియుఁ గస్తురిపట్టెలుం దగెన్. 581

వ. అంత.

క. ఒకచోఁ గచసుమవాసన
యొకచోఁ దాంబూలచంద్రయుక్తపరిమళం
బొకచో మెయికుంకుమస
జ్జికమగు నెత్తావి హరికిఁ జెలువం బెసఁగన్. 582

సీ. కలదు లే దనుకొను వలకేలఁ గీలించి
ప్రౌఢ యొక్కతె కాంతఁ దోడి తేగ
జెలువ పావడ నొక్క చెలి గంధగజయాన
చిఱునవ్వు మోముపైఁ జెమటఁ దుడువఁ
గొమ్మ యొక్కతె చాల గుబ్బపాలిండ్లపై
నిసుమంత జాఱు పయ్యెద నమర్ప
మృగనేత్రి యొక్కతె చిగురాకుఁ బొడిమన్
గొప్పునఁ జెదరిన కురులు గూర్ప
గీ. బిత్తరము జిమ్ము చూపుల మొత్త మంఘ్రు
లందు నీలాలయందెల నంద మందఁ
బ్రేమయును సిగ్గు హర్షంబుఁ బెనఁగొనంగ
సరగ నాంచారు మును బెండ్లి చవికిఁ జేరె. 583

ఉపమానాలంకారము
క. నెలవుగఁ జేరిన నచ్చెలి
కెలనన్ దమిమీఱ నిలిచి కేశవుఁ డొప్పెన్
వలరాచయాక మామిడి
సెలగొమ్మను పండుడాయు చిలుకయుఁ బోలెన్. 584

క. అంతట భూసురకామిను
లంతంతను వివిధభూషణాలంకృతలై
వింతలుగ మణుల నారతు
లెంతయుఁ బళ్ళెరములందు నిడికొని వేడ్కన్. 585

సకలయమకము — అపూర్వప్రయోగము
ఉ. వాలుమెఱుంగు మేని జిగివాలు చొకాటపు నూగుటారు మేల్
వాలుగడాలు రాయనిరవాలు మిటారపుఁ బల్కు చందు సాఁ
బాలు నొస ల్ప్రసూనముల వాలు వరాళులు చూపు నెమ్మి బల్
వాలుకచంబునొ చెలియ వాలుగ నీయురవాలు నయ్యెడన్. 586

వ. అనుచు ననిచిన మనమ్ముల. 587

గీ. వలయ నగవలయితధరావలయమునకుఁ
బతివి గమ్మన్నరీతి నారతులు ద్రిప్పి
భువిని నాచంద్రతారకంబుగ సుఖించి
యెపుడు మనుమనుక్రియఁ బొడవెత్తి రపుడు. 588

క. పుడమిఁగల సాము లందఱ
వడి నితనికి సాటిఁ బోలవచ్చినవారి
న్నొడసి పడవైతుమను క్రియ
వడి నెఱ్ఱనిపూలఁ ద్రిప్పివైచిరి మిగులన్. 589

ముద్రాలంకారము
మత్తకోకిల. గానవైఖరినందు గొందఱు కాంత లయ్యెడఁ జేరి సో
బానయంచొక పాటఁ బాడఁగ బాడినంతనె వింతయై
గానుపింపఁగఁ బూర్వశోభన గాథలెల్లను మీఱఁగా
మాని నుల్కవగూడి పాడిరి మత్తకోకిల రీతులన్. 590

క. అంతటఁ గూరిమి యల్లుని
సంతసమున డాయఁజేరి జనపాలకుఁడున్
గాంతాయుతుఁడై మణిపీ
ఠాంతరమున నుంచి విప్రులనుమతి జేయన్. 591

గీ. పసిఁడిచెఱఁగులు గల మధుపర్క మిచ్చి
సకలమణిమయరుచిరభూషము లొసంగి
రమణ నిర్వుర గోత్రనామములు జెప్పి
యనుఁగుటల్లునిఁ బ్రార్థన మాచరించి. 592

క. సుముహూర్త మనుచు సాధు
క్రమమున భూసురులు బలుకఁ గా భూవిభుఁడున్
రమణియు మనమున నడలొక
క్రమమున నడుపుచును గౌతుకము మెఱయంగన్. 593

క. అభ్యంతరులగు దొరలున్
సభ్యులు వినుతింపఁ బెండ్లి జగతి న్నియతిన్
‘తుభ్యం ప్రజాదిసత్క
ర్మభ్యః ప్రదదామి’ యని కరమ్మునఁ గన్యన్. 594

గీ. దారఁబోసియున్న తదనంతరంబున
బంధుజనులు మోదభరితు లగుచు
నిరువురకును సిగ్గుతెర జాలదే యంచు
నవ్వుకొనుచుఁ దెర నొనర్చిరంత.

క. మరుఁ డా నడుమను నెలకొని
గరగిరి గరువగను దమ్మి కలువల కోరుల్
సమకూర్చి యేసెనో యన
నిరువుర నెఱిజూపు లమరె నిరువురమీఁదన్. 596

శా. రాకాచంద్రముఖీజనంబులు మదిన్ రాగంబు లుప్పొంగఁగా
జోకల్ గూడుక వర్ణభేదములచే సొంపుల్ జెలంగ న్బికా
నీకోదారరవంబు మీఱ బుధులెంతే సన్నుతు ల్సేయఁ గౌ
రీకల్యాణముఁ బాడి రప్డు గరుడాద్రిస్వామి కిం పొందఁగన్. 597

క. చెంగటను జేరి ధవళము
రంగుగ వినుపింప నిజకరమ్ముల నలమేల్
మంగనుఁ బ్రేమ న్గళమున
మంగళసూత్రంబుఁ గట్టె మరుగురుఁ డంతన్. 598

క. పుత్తడిపళ్ళెరములఁ దెలి
ముత్తియపుంబ్రాలు నించి ముదమున మంత్రుల్
హత్తి యిరుగడల నుండఁగఁ
జిత్త మలర శౌరి బ్రాలు జెలితల నుంచెన్. 599

క. కొప్పున జాఱిన తలఁబ్రా
లప్పుడు సతి కొప్పె వింతయై చూపఱకున్
గప్పు మొగుల్ ముత్తెంబులు
కుప్పలుగా మేలు వాన గురిసిన భంగిన్. 600

వ. అట్టి సమయంబున.

ఉపమాలంకారము — అపూర్వప్రయోగము
క. కులుకువలి గబ్బిగుబ్బల
కలిమి చెలిన్ హరి కరమ్ముఁ గైకొను టొప్పెన్
వెలిదామర విరి మొగడలు
గలకమలిని గమిచినట్టి కలహంస బలెన్. 601

సప్తోపమానోపేయయథాసంఖ్యాలంకారసీసము
సీ. ఘనశుకాబ్జమృణాళకంబు శైలకరభ
కచవచఃపదభుజాగళకుచోరు
భారీభహరిరాజపల్లవరాజీవ
నఖకటిగతి మధ్యముఖకరాక్షి
శ్రీసుమావళివసువాక్స్త్రీకుందవిద్రుమ
శ్రుతి తనుదృక్కాంతి మతిరదోష్ఠ
రతిశివాకూర్మి పరభృతహీరార్ధేందు
జనిగుణశమవళిస్వరహృదళిక
గీ. చంద్రికావర్తదర్పణచంపకమణి
విషధరవకుళహాసనాభీకపోల
నాసికాంగుళరోమరాజీసుగంధ
యగుచు నలమేలు మంగమ యలరె నపుడు.

సీ. పడతితో శౌరి పుత్తడిపెండ్లిపీఁటపై
వసియించి వృద్ధతాపసపురంధ్రు
లిరువురు శుభవేది నిడినట్టి హవ్యవా
హంబున లాజహోమం బొనర్చి
ప్రేమానుబంధంబు పెంపునఁ గొంగుము
ళ్ళమరంగ సప్తపదములు నడచి
వనజగేహినిచేత సనికల్లు మెట్టించి
ధ్రువు నరుంధతి వేడ్కతోడఁ జూచి
గీ. వేలుపులకెల్ల వేలుపై వెలయు దాను
మామ యిలువేల్పు దర్శించి మధురభక్ష్య
పానీయభోజ్యవస్తువులతోడ
హైమఖాజనముల బువ్వ మారగించె. 603

క. ఈగతి నాలుగు దినములు
సాగిన మఱునాటిరేయి శాస్త్రోక్తముగా
నాగవళి కంబవల్లియు
నేగు న్బెండ్లియుఁ జెలంగె వృషగిరిపతికిన్. 604

శుభలక్షణవచనము
వ. అప్పు డన్నరపతి యొఱ పతిశయిల్లు కడలి యిల్లుగాన మరి తన కల్లుఁడైన గోవిందునకుఁ దన తనయపొత్తున నారగింపు జేయించి, తనకోర్కె సఫలం బాయెనని యెంచి యవ్విరించి జనకునకు నరణంబుగా మించులు గండపెండెరంబులు రాకట్టు మొలకట్టు లుంగరంబులు ముంగైమురారు లంగదములు చేసరులు చేకట్టులు హంవీరతాయెతులు తాళీలు కంఠమాలికలు కంఠసరు లుత్తరిగెలు చౌకట్టు లొంటులు మురువులు తురాలు కిరీటంబులనం బరఁగు నాభరణంబులును పీతాంబరంబులు నీరాదులు బురుసాలు వన్నెమణుంగులు చందరుకావులు గంధకావులు మాదళంబులు తోఁపులు మేఘవర్ణంబులు పచ్చపట్టులు చీనీలు శాలువలు కబ్బాయిలు నడికట్లు చౌదగులు హాసావళులు తగటిపాగలు చలికప్పదంబులు సకలాతిగుడారములు బుర్నీసు బల్లాని తెట్టులు తిప్పనక్క గోడసరాదుల పటవిశేషంబులు ఫిరంగికత్తులు బంభురగంధ సింధురసైంధవ శిబికాందోళికోష్ట్ర సందోహంబులు సోగసన్నంపు గోమపేముటానియ బల్లిదంపుటల్లిక నాబరించు జిబునీ జిబుకుతినీబపంతి వింతఁజూపట్టు కెంబట్టు చందవాపొందికఁ జెంది జనుల గనుబండువులగు హొయల్ బండులును రత్నకంబళంబులు దుద్దుగంబళులు జమ్ముఖానాలు జమకాళంబులు తివాసీలు పట్టుచాఁపలు పగడాలకోళ్ళమంచంబులు కుంకుమపువుపరపుఁ బఱపులేకరంగీతలాడలును సుళువుతాప్తాకురాడంబులు పరంగిపీటలు చదరంగంబులు పగడసాలలు హొన్నంచుసురఁటులు ఛత్రచామీకరముకురవీటికాకరండకర్కరికాకుళాచికాబిరుదధ్వజంబులు జాలవల్లికలు పింగాణిగిన్నియలు పన్నీరుచెంబులు గంధపుమ్రాకులు జవ్వాదివంకులు కస్తూరివీణెలు పునుఁగుజట్టంబులు కప్పురపుఁగ్రోవులు లేటికొదమలు పొట్టేళ్ళు పంచవర్ణములచిలుకలు గోరవంకలు మయూరంబులు పావురంబులు డేగలు పికిళులు బచ్చికోళ్ళు రుద్రవీణియలు స్వరమండలంబులు తంబురలు కిన్నెరలు రావణహస్తంబులు రబాబులు మీటుసురతానులు కామాక్షులు ముఖవీణెలు పిల్లఁగ్రోవులు దండెలు ఢక్కీలు చంద్రవలయంబులు రతనంపుతంబిగలుఁ గుందనపుబిందియలు పైఁడికొప్పెరలు వెండికొప్పెరలు వెండిదివెగంబంబులు లుడుగలదిండ్లును సంచపురేకుబాగాల దంతపుబరణులును మఱియు వినోదోచితంబు లైన వస్తువులు సిస్తుగా నొసంగిన నంతలోన నలమేలుమంగ తన తల్లిదండ్రులైన జంద్రకళకు నాకాశరాజునకు దండంబులు వెట్టిన యప్పటికిఁ దగినరీతుల బుద్ధులు సమకొల్పి నవరత్నంపుటొడి బియ్యంబు నించి నానావిధాంబరాభరణంబులు బసపునకుం బసగలిగి యసంఖ్యంబులగు వస్తువు లొసంగి గ్రామంబు లాలమందలు దాసీజనంబులు సమర్పించిన యాపిమ్మట దత్పరిజనంబులకు వారయాత్రికులకు విందులకు విందులిడి భూమిదొరబూమికఁగ నిగుడి ప్రేమగనియగు లచ్చిమగని నిగనిగనిమేచుగని పొగడని యెడతెగని పొగడిక నెసఁగనిలిచి వేఱొకతలఁపు రానీక నీకటాక్షసుధోర్మికానీకమ్ము కమ్ముక మేనం గ్రుమ్మరించు మనుచు భావంబున సాష్టాంగనమస్కారంబుతోఁ దదుచితబహుమానంబు లొసంగి దనపట్టినిఁ బట్టుగాఁ జేబట్టుమని మనవిగాఁ బరికించి యొప్పించి బంపి జెలువంది వంధిమాగధకైవారంబులు మీఱ సమీరబలశాలియై యానాలోచన చేసి ఖలమదకలకేసరి తనకేసరియైన దేవేరితో బంధుయుతంబుగాఁ బరివారంబులుం దానును నిజపురంబు జేరి కొలుచువారిఁ దదావాసంబుల కనిచి చంద్రకళతులగల చంద్రకళతో నాకాశరాజనిభయశోవిదుఁడగు నాకాశరాజు నందనునిభక్తి నిజనందనునిశక్తియుఁ గలిగి యాశాతటినిస్తులప్రశస్తయశస్తరుణీస్తనోపరిభాగాగ్రహారంబులఁ దేజోవిరాజితంబగు నిజపురంబు ద్విజరాజరాజాగ్రహారంబుల దానశీధుసాగరశిక్యశీకరమదఘర్మమేఘాష్టమదధారావాహంబులకుం దావలంబగు దంతావళంబుల నమరుచు నభిమానవిధూతసుయోధనుండును నభియాతిచేతోభయదాయోధనుండును నఖిలసప్తాంగసాధనుండును నహీనశయనానారతారాధనుండును నశ్రాంతతత్త్వబోధనుండును నపరిమితశ్రీధనుండునునై యలంకృతుల మెఱయు చమత్కృతుల ముఖ్యకృతులు కృతులఁ దనుఁ బొగడ సకలభోగంబు లనుభవించుచునుండె.

నక్కడ శ్రీవేంకటేశ్వరుం డలమేలుమంగ నాంచారుతో నపరంజికుప్పెల నొప్పారు బికిలి పారుకుచ్చులు నింద్రగోపంబు రూపంబు జగజంబారికుచ్చులు జుట్టు సరిగపని సింగంపుఁబ్రతిమల యల్లికపస మించు ముసనాబును బొంకంబగు గుంకుమపువ్వు నించిన పచ్చతాప్తాపరపుగను పఱపును నిద్దంపుఁబసిమి హురుమంజిబిల్ల నేతపట్టు జూపట్టు పచ్చడంబును దళుకులు గులుకు జీవదంతంపు గుత్తంపు గొడియలును గ్రొమ్మావిపండ్లకై మలసి చుట్టు వ్రాలిన రాచిలుకల తెఱుంగున బచ్చఱాల కెంపురవల చెక్కడంబు రంగారు బంగారు చిలుకలదిండ్లును జీనానూలిత్రాళ్ళును నేనుఁగుకొమ్ముపోటుపెరుకు గఱినరుకులాకు జీరవెండవీటిక నులివంక యగ్గిసోఁకుడు పొక్కిడిపులుగు ముక్కునొప్పు పుప్పి చీమదిండి యేకలమ్ము సెలవు నిడుద గణుపు లేఁతయు ముదురు సన్నము గమకంబు నీలధవళరక్తహరిద్వర్ణంబులు మొదలుగాఁగల దుర్గుణంబులు లేక వీఁకగాఁబసపునిగ్గుచే మొదటినుండి సోయగమ్మునఁ బెరిగి వెనుక నెనిమిది ముంగల తొమ్మిది నడుమ కుఱుచ గణుపు వీరైదు నొకటి గలిగి యోరశిరంబుగా తెఱగంటి దొరవింటి తెఱగంటిన కొమ్మును, బికిలిపూ పన్నాగంబును, సూర్యపుటపుటొఱుగును గల యందలమ్ము నధివసించి యాత్మీయసేనాపరివృతుండై ముక్కుల తుదలఁ జుక్కబొట్టులు జెవులమూయు కుళ్ళాయిలు కటులనీలికాసెలు జొనిపిన కుఱుచపిడెమ్ములు జంకలవ్రేలెడు తోస్తానంపుఁదిత్తులు బదంబుల బిగువారు బిల్లమెట్లు నిరుకువీఁపులు సందిళ్ళ గడియంబులు కాయలు గాచిన నెగుభుజంబులపైఁ దడిబట్టపొత్తులు దనరుబెస్తలు సిస్తుగా మోచి నిబ్బడుగు ముండ్లడియంగాలజడుపు వైసరంబోరడి యడుగులో జతనము మోరడి బలిమికం బొద్దిక బొట్టడి చిట్టడిమోపనబదిలము మించడుగు దువాళిసమాధానజల్లిక లుప్పరము కిరడుపాదబెళుకడుగు లోదాటునిబ్బరము జడుకులో జీవదాన పాదొత్తుగల్లు కరెకప్పుపటము తాకుడుమైసుళువుమారు వెంబడి మెదుగుడు సెలవుచోరుగొమ్ము మోపడుగు నీరడికండబలిమిలాగు మోపులహొయలు బిగువు మొల్లడిపదిలము హెచ్చరిక స్వామిపరాకన విని సంతసిల్లు కంసారి మునుపుసారి వెడలిన దారిని దుముదారిగా వేగంటిదునేదారి రాజసమ్మునగు మీసరమ్మునఁ దచ్ఛుభవాసరమ్మున వచ్చునప్పుడప్పడవాళ్ళేతెంచి సాష్టాంగదండంబు లాచరించి లేచి శంకలేక సంకలఁ జేతు లిడుకొని యందుఁ గొందఱు కరమ్ముల వాతెఱలు మాటుకొని తగ్గిమెల్లనె సవినయంబుగా ‘నో, లోకనాయకా యీయిక్క నొక్కమొక్కలంపు బోయరాయిడి సేయుచు దేవరకు గనుంగొనువాఁడైయున్నాఁ’ డనిన ననితరసాధారణదారుణభుజప్రతాపాటోపంబు దీపింప విజయభేరీదంధణధ్వానంబులు దిక్కు లదర రథగజతురగపదాతులతోడఁ గదలి వచ్చునదియు జైత్రయాత్రాసంరం భంబని విజృంభించుచుఁ బాషండహృత్పుటభేదనంబగు నిజపుటభేదనంబునకుఁ జేరు నయ్యభ్యంతరంబున. 605
నాగదత్తోపాఖ్యానము
ద్విరుక్తిరూపకనియమదళత్రయఘటితచరణసీసము
సీ. రసరసాధికసంతమసమసారగవి
హాయససాధూన్నతి హర్మకంబు
ధరధరార్చకమహీసురరాజకవైశ్య
వరవరావరవర్ణగురుతరంబు
మదమదావళబలాస్పదపదాత్యాజితో
విదవిదాశ్వశతాంగవిలసితంబు
నవనవామోదసూనవనవనవాపుత్థకై
రవరవాన్వితబంభరవ్రజంబు
గీ. వెలయుఁ బారావతారవకలితలలిత
భావసంభావకేళికాప్రౌఢరూఢి
వారవారణయానాంఘ్రివనజరణిత
వితతమణినూపురంబు తిరుపతిపురంబు. 606

వ. ఆపురవరంబున.

మ. కలఁ డభ్యస్తసమస్తశాస్త్రనిగమగ్రంథార్థసంఘర్షని
స్తులవాచారభటీధురాధరితసింధుప్రోల్లసల్లోలని
ర్మలకల్లోలఘుమంఘమారవయశోమాన్యస్వకీప్రథా
కలనాధర్ముఁడు మాధవుం డనెడు సత్కర్ముండు ధాత్రీస్థలిన్. 607

గీ. ఆతఁడు బహుకాలమున నొక్కసుతుఁడు గలుగ
జాతకర్మాది శుభవిధు ల్సంఘటించి
భూరియిడి నాగదత్తుఁ డన్బేరు పెట్టి
ప్రేమఁ బోషించి వడుగును బెండ్లి సేయ. 608

గీ. అక్కుమారుండు వినయవిద్యాతిశయము
నెనయఁ దిరుపతిపట్టణమునఁ జరించుఁ
దండ్రికన్నను నెఱవాదితనము మంచి
తనము గ్రామణిమనము వర్తనముఁ గలిగి. 609

సీ. అపఠితాగమమనభ్యస్తశాస్త్రక్రమం
బపరిశీలితనిగమాంత మనను
భూతషడంగవిఖ్యాతి యనుపలబ్ధ
సాహితీమర్మప్రసంగ మవిది
తప్రౌఢకావ్యసందర్భచాతుర్యబో
ధితగానవిద్యాప్రధితరహస్య
మకృతయాగాదిక్రియాసత్కలాపమ
కాలోచితపురాణ మననవరత
గీ. కీర్తనీయహరిధ్యానగీత లెందు
మందునకునైన లేక సమస్త మెపుడు
గరతలామలకంబుగాఁ బరగె నతని
ధరణిసురుమాత్రమాత్రుగా నెట్లు దలఁపవచ్చు. 610

వ. అంత నాగదత్తుం డప్పురి యాళ్వారుతీర్థంబుచెంతఁ గొంతకాలంబున.

శా. వీతాచారుఁడు దుర్మదాంధుఁ డగుచున్ వేశ్యాంగనావాటులన్
ద్యూతక్రీడలఁ జౌర్యవర్తనలచే దుస్సంగదోషంబులన్
జేతోజాతవశంవదుం డయి జరించె న్లజ్జఁ బోనాడి న
ద్వ్రాతంబు న్దను జూచి రోయఁగ మహావ్రాత్యస్థితి న్మీఱుచున్. 612

సీ. గుడిగుడిగుంజాలు చిడిగుడిచింకణా
బిల్లగద్దెన బొడ్డి చిల్లగోటి
చిరిసింగణాబంతి తరుముడు జెండును
వెన్నెలకుప్పలు కన్నుకట్టు
చీటికి మొటికాయ చింతాకుచుణుదులు
బులియాటలును జిట్లబొట్లకాయ
దూరనదుంకముల్ దోపిడియాటలు
బంతియాలంకి దీపమ్మనములు
గీ. పొట్టగీరనగింజలు బొంగరములు
గచ్చకాయలు దాఁగిరి మ్రుచ్చులాట
బంతిమెకమాట జిందర పరపులాట
లనెడు శైశవదుర్వృత్తి నధిగమించి. 613

క. సటలు దటవటలు నటనలు
మటుమాయలు జాటువగల మాటలవింత
ల్గుటిలతయుఁ దెలిసిపాఱుఁడు
విటవిద్యకు బిరుదువేసి వికవిక నగుచున్. 614

క. నిరతముఁ జదరంగంబున
గిరిజలసొగటాల నారికేళఫలములన్
సరిజేసి యొడ్డువిడుపులు
చెఱకులబందె మిడి గెలుపుఁ జేకొని యవలన్. 615

స్వభావోక్త్యలంకారము
సీ. పికిలిపిట్టలును లావుకలు బిచ్చుకలును
గాఱుపుల్గుల జేరి కేరిజములఁ
గైదుల వలిచలఁ గాట్లాట విడుచుచుఁ
గోడిపుంజులుఁ దన్నులాట నిడుచుఁ
బొట్టేళ్ళ సన్నలఁ బెట్టుచు గిజిగాండ్లఁ
బిలుపుదీయుచు జీనువులనుబైటఁ
బారాడఁజేయుచుఁ బారాలపల్లటీల్
గనుఁగొంచు రెయివేఁటలను దిరుగుచుఁ
గీ. దీండ్రవయసెచ్చఁ జేకత్తికాండ్రఁ గూడి
గరడిమాష్టీల జెట్లతోఁ గత్తిసాము
పెనుఁగులాట లొనర్చుచు బేరజంపు
టారజమ్మునఁ గడుగడి దేరఁ దలఁచి. 616

క. మల్లియలు సన్నజాజులు
మొల్లలు సంపెఁగలు మొగలిపూ ల్జేమంతుల్
మొల్లముగను వరుసగ రం
జిల్లెడు బువుదండఁ గోరసిగఁ జుట్టివడిన్. 617

అపూర్వప్రయోగము
సీ. ముచ్చుసన్నంపు రుమాలు బిగ్గరజుట్టి
తొడిసన్నకసెల చల్లడము తమిని
దేవతాపూజార్థమై దెచ్చి దాఁచినయట్టి
గంధముఁ బదనిచ్చి కలయనలఁది
నీర్కావిధోవతి నెఱిక గన్పడుఁగట్టి
వలిపెదుప్పటి వలెవాటు వైచి
నునుగోపిచందనంబున నొనర్చిననూర్ధ్వ
పుండ్రంబు పైవ్రేల్మి బొట్టమర్చి
గీ. కేలనున్నట్టి పొత్తంబు వేళముగనె
నేల నిది మ్రోవ నింకని నేలవైచి
బాలపైఁ బ్రేమ మిగుల దువాళిమీఱ
మదనపరితాపదోదూయమానుఁ డగుచు. 618

ప్రాసభేదము
ఉ. వ్రేలిమి వ్రేల్వఁ డెప్పుడును వ్రేల్చుమొగంబు వధులలామకై
చాలుగ సంధ్య వార్చఁడు ద్రిసంధ్యల వార్చును వంటవార్పులా
బాలికయింట దండ్రి సలుప న్గననొల్లఁడు దేవపూజ యే
వేళల లంజతల్లి యిలవేలుపుమాత కిడు న్బ్రణామముల్. 619

చ. ఒకవెలయాలిమీఁద నిలుపోపని కూరిమి గల్గి యింటిలో
సకలము దెచ్చి యిచ్చినను జవ్వని యెవ్వని నిచ్చమెచ్చ కే
సకినెలతూఁగుటుయ్యెలను జక్కనిసామిగ రార యంచు మా
రకదనచాతురి న్నిలువరమ్ముగఁ గూడి చెలంగె నయ్యెడిన్. 620

అచ్చతెనుఁగు
క. చికిచికి నఱసిన బొమలును
గొకిబికిమెడ యెఱుఁగుమూతి నొసలు పాఁ
పకడెమ్ము దోలుటడుగులు
బికిలినబుట్టంబుఁ గూనివీఁ పఱచునుడుల్. 621

సీ. పాడింటువలె సందుపట్టుఁ దప్పినమేను
గానుగఱోలు వీఁకఁదగుకౌను
కోవెలతముకుపై కొడుపులగతిఁ బొట్ట
టోకిచ్చువ్రేల్డండ్లు బోకినోరు
నంజివేసినతాటిగింజకైవడి తల
గచ్చకాయలవంటి కాయకండ్లు
వికలంపు దెడ్లపోలిక డొంకుచేతులు
పందిటిగుంజలపగిది కాళ్ళు
గీ. మంటితలపట్టుకుంటి రాకంటివ్రేళ్ళు
నొంటిపలునుంట తుంటలు గంటుముక్కు
వింటిరూపంబు బొగుచుట్ట విడుపుఁదిత్తి
గలిగిచెన్నొందు నవ్వెల వెలఁదితల్లి. 622

సీ. చిటిచాపక్రిందఁ జేర్చిన మున్గుదామర
తెల్లజిల్లెడుప్రత్తి దివ్వె లెత్తి
యొక్కండు తోనూరు వక్కల బరణియు
గావుకరాటంబు గాటుటద్ద
మరుదైన తిపిరికిన్నెర తుమ్మపడిగంబు
వన్నెకోకల చందువా పిరంగి
పనిగిండి చిటికెన పావురా ల్సొగటాలు
నుంజలు గొరవక పంజరంబు
గీ. గందవడిపువ్వు పొట్టముల్ గద్దెపీఁట
కాసెకంచెల గజ్జె లగ్గలపుటగరు
ధూపములు పుట్టములవేటి పాపబెత్త
మిడుపు విశ్వాసిగల పడకింటియందు. 623

ఉపరిసురతము
ఉ. దర్పకశాస్త్రమార్గమణితస్ఫుటగల్లచపేట మంఘ్రి యు
క్కూర్పరతాడనం బమితగుంభితకంకణకింకిణీరవం
బర్పితచుంబనోద్యదధరామృత మీక్షణపారవశ్యము
న్సర్పవరాఖ్యబంధగతిఁ జాతురి గల్గిన కూఁతు డాయుచున్. 624

క. రాజీవకేతనాదిమ
రాజీవాశుగమురీతి రాజిల్లక యా
రాజీవంజీవాక్షివి
టాజీవభవద్విలాస మరుటగనుదురే. 625

జాతివార్త
సీ. ఇంతిరో! మనవీట వింతగా మును ‘పెఱు,
కెఱుకో’ యటం చొక యెఱుకసాని
యేతెంచె; నడుగ వేమే, యవ్వ! యొకసుద్ది
సెప్పెద, బాగెపు సేయి సూపు;
కొల్లాపుర మ్మాన, పొల్లాపు లే దొండుఁ
దలఁచితి; వదిగాదు దయ విటుండు
గడకేఁగు నినుఁబాసి; కన్నది పెఱవాని
నిన్నుఁ జేర్చు నెఱుంగ నేరవీవు
తే. గానఁ దరకట బురకట గాదు మేట
జేరు బురకని తోడు తే తారుకాణ
యొండు రెండే దినాల కిం దుండి నాదు
మాట మఱువకు మని పోయె మఱచినావె. 626

మ. చెలుము ల్దప్పకమున్న గూర్ములెదల న్జిట్టాడ కన్మున్నఁ బో
టులు బైకోకయ మున్న నెచ్చెలులు వీడ్కోల్ గాంచునన్ మున్న మా
టలు నీవే నను మున్న దన్ దొలఁగి దాఁట న్జూచు నమ్మున్నగాఁ
దొలఁగం గావలదే చెలు ల్విటులపొందు ల్నీటిపై వ్రాఁతలే. 627

గీ. ఇంతి నీకుఁ దెల్ప నీరసం బగునేనిఁ
దెలివి పఱతు నింకఁ గల తెఱంగు
నన్నుఁ జేరబిలిచి నమ్మింప దామర
పాకు నీటి చంద మయ్యె మనసు. 628

క. తెల్లని వెల్లను బాలని
యుల్లంబున నుండి గుడిని యుండియు గుడిత్రా
ళ్ళెల్లఁ దెగఁగోయు టెఱుఁగక
గల్లదియై కుడిచి నింటి కడయే రెండున్. 629

క. ఱాబొమ్మకు గిలిగింతలు
నీ బోటిని బేలుపఱచి నేఁ డిదె చుట్టం
బై బమయించెను నన్నున్
సాబాసే బాలవాని సరసకుఁ దీయకే. 630

శా. ఓరామామణి నీదుతోడిచెలు లయ్యె సర్వసౌఖ్యంబుల
న్మీఱ న్నీ వొకఱిత్తగాని వలకు న్మీనంబవై చిక్కితే
శ్రీరామా యని వీనుల న్గదియఁగాఁ జేదోయి గీలించి యె
వ్వారే మౌదురొ తమ్మిచూలి యిటుగా వ్రాసె న్లలాటంబునన్. 631

గీ. నీవిలాసంబు రూపంబు నేర్పు నోర్పు
నడవిలోఁ గాయువెన్నెల లయ్యె నకట
యిట్టిమానిసి యే నిన్ను మట్టు మీఱ
నేలువాఁడు దయ న్నీకు మేలువాఁడు. 632

క. నినువంటివారి నెందఱిఁ
గనుఁ బ్రామినవాఁడొ వీఁడు కటకట నీ చూ
పునకు నితఁ డెట్టివాఁడై
గనుపించెనొ నెట్టివేళఁ గలసితొ వీనిన్. 633

చ. అడిగినఁ దెచ్చువాఁడొ గడునందమున న్గననైనవాఁడొ మే
ల్నడవడికాఁడొ వీటఁ దగు నాయకమై చరియించువాఁడొ చే
విడిముడిగల్గువాఁడొ దలవెండ్రుక లందఱు రాకుమారకు
ల్ముడుపులు వానఁగాఁ గురియ ముట్టవు గారణ మేమి కూఁతురా. 634

ఉ. ఏమని నీకుఁ దోఁచె నిది యేమని యూరకచూచియుందు నే
నేమని యోర్చుదాన నిది యేమని మానుపనేర్తు వీఁడు ని
న్నేమని గారవించె నిది యేమని నీకు సహించె నక్కటా
కోమలి వింతగాక మనకు న్దగునే యిటువంటి చైదముల్. 635

అపూర్వప్రయోగము
క. ఈలాగున వానితో నవు
లాటకుఁ బన్నిదమిడి సొగటా లాడఁగ నో
టాలగు నీ కర్ధేందుని
టాలాయని దక్కగొను కటా లలితాంగీ. 636

క. ఓరమణి నీదు పిక్కలు
దారల నగు మోవి పంచదారల నగు స్వ
ర్దారల నగుఁ జెలు వమృతపు
దారల నగు నుడి నఖాళి దారల నవ్వున్. 637

యమకరూపత్రిప్రాసకందము
క. పున్నాగము నగు నీ యూ
ర్పున్నాగము గేరు నీదు పొక్కిలి బటువా
పున్నాగము నగు నీ నడ
పున్నాగము నెనయ కధముఁ బొందితి తగవే. 638

సీ. తెఱవ నీ తీయవాతెఱ మణిసారంబు
రమణి నీ నెన్నొసల్ రసతిలకము
పొలఁతి నీ మోము ప్రబోధచంద్రోదయ
మతివ నీ నవ్వు కావ్యప్రకాశ
మబల నీ చూపుటొయ్యారంబు కౌముది
కలికి నీ మే నలంకారసరణి
కొమ నీ కనుంగవ కువలయానందంబు
మగువ నీ చందోయి మంజరి గతి
గీ. నెలఁత నీ కొప్పు మేఘసందేశ మయ్యె
గలికి నినుఁ జూచినంతనె కలుగు నతను
విద్య రసికుల కెల్ల నుర్వీస్థలమును
గాఁగ నినువంటి జాణ కీ ఖలుఁడు దగునె. 639

సీ. జాజికాయయుఁ గురాసానియోమము వస
చెంగల్వమర్లు మాతంగి పచ్చ
యెన్ను లుమ్మెత్తవిత్తు లేనుఁగు మదము ప
చ్చికమంచుపుర్వుమైచెమటమన్ను
గంబూర గుల్లసున్నంబుఁ గాల్మడిచేత
నూరి నీడనె దటియాఱినంతఁ
బసరపుగొమ్ము మేల్బరణిలోపల నుంచి
విడి గురిగింజంత విడెములోన
గీ. నిచ్చె గాఁబోలు లేదేని యింతవాని
పైఁదమాసున నేవేళఁ బ్రక్కఁజేరి
గడియసే పెడతెగలేక కలసి మెలఁగఁ
గారణం బేమి దెల్పవే గలికిమిన్న. 640

గీ. చాఱపప్పును గసగస ల్జాజికాయ
సెనగలును ములువత్రియు మునుగపువ్వు
కొబ్బెరయు మందపాలతోఁ గూర్చి త్రావి
యుబ్బు దబ్బఱకాఁడు నీ కబ్బుటగునె. 641

అపూర్వప్రయోగము
క. చెల్లఁబొ హిందోళకధ
మ్మల్లకుఁ దీయమోవి గలుగు మదిరాక్షీ మ
త్తల్లికి పాణితవాణికి
వల్లెయె యీజూటుకూటు వల పొనరింపన్. 642

అపూర్వప్రయోగము
క. నాచిన్నిబిడ్డ విను తను
శ్రీచిన్నముగలుగు దొరను జేర్పక వృధగాఁ
జూచుచు నోచెనొకో నీ
చేచిగురా కిట్టిబెట్ట చెట్టును బట్టన్. 643

క. కుటిలుఁ డపకారి జూదరి
లొటలొటకాఁ డగడీఁడు లోభి ఖలుఁడు దు
ర్విటుఁడు బలురోగి తక్కరి
మొటిగిడి బాపన గరాసు ముట్టకు మబలా. 644

సీ. నీవు గల్గుటగుగా దేవళ్ళ గుళ్ళఁ బ్రా
ణాచారవిధు లెల్ల నలవరించి
నోములు వే లెస్స నోఁచి వెన్నుఁడు దయ
చేసినయంతనే చీరజిక్కి
తెలుపెక్కి చెక్కులు వళు లుబ్బుఁగని గౌను
బలసి నెన్నడ దొట్రుపాటుఁ జెంది
చను మొనల్కప్పాని మను దానిపై యాస
గలిగి వేవిళ్ళెచ్చి కనుల నలఁత
గీ. బొడమి యిటుఁ దొమ్మిదినెలలు కడుపుమోచి
మంచిలగ్నమునను నిన్నుఁ గాంచి నామ
కరణ మొనరించి సంతోషకలిత నగుచు
నేటఁ బెంచిన దానిని న్బూటఁబెంచి. 645

మ. కొసరు న్బల్కులు తప్పులే యడుగు లుగ్గు ల్గోరుట ల్చాచి
గుసుమాళంబులు మద్దికాయవగ పోగు ల్గాజులు న్బొద్దులున్
రసపు న్దాయెతు గజ్జ లందియలు దోరంబైన పుల్గోరు క్రొం
బసపు న్దాల్గుబుసంబు జెన్నలరు నీ బాల్యంబుఁ జూ చంతటన్. 646

అపూర్వప్రయోగము
గీ. వయసు గనుపట్టుచో నాదు వాంఛ దీరె
ననుచు నెరియెంచి నిన్ను నన్మనుప నింక
భారమని దెల్పి నేను నీ బల్కుబడిని
నమ్మి మనజాతి నడవళ్ళు నాయముగను. 647

చ. తెలిపినవన్నియు న్దెలిసి తేఁకువ వేకువమోము మజ్జనం
బలవునఁ జేసి గన్నుఁగవయందునఁ గాటుకరేకఁ దీర్చ మే
లలికమునందు జాఁదిడి యొయారపు గుబ్బలవాడఁ గుంకుమం
బలఁది కచంబు దిద్ది ఱవిక న్శుకము న్ధరించి వేడుకన్. 648

గీ. వేగ భుజియించి పొగఁ ద్రావి విడెముఁ జేసి
సఖులతోఁ బ్రొద్దు సుద్దుల జరిపి సంజ
వేళఁ బచ్చనగిల్కు పావాలు దొడిగి
బుడత కైదండఁ బూని యి ల్వెడలి బైట. 649

వ. నిలిచిన.

చ. కని దొర లాసఁజేసి యుడిగంబులఁ బంపిన కీ లెఱింగి మో
మునఁ జిగురొత్తు లేనగవు మోసుల సమ్మతి యౌటఁ దెల్పి వెం
టనె యెదురేగి జూపు చికటారులఁగాను కొనర్చి వారిఁ దో
డ్కొని బువుసజ్జ నీవు తమిఁగూడక వీడఁగ నాడి యక్కటా. 650

గీ. వలపు తల కెక్కి వాని మందులకు జిక్కి
జాత మెల్లను రోయు నీ జన్మ మేల
యొక్కనికి దక్కి చౌకయై యున్న చెలిని
సూళిగేరిని వెదకినఁ జూఁపగలవె. 651

క. ఏసొమ్ము లేటివస్త్రము
లేసుఖ మేభోజనంబు లీవల పేలా
వేసమ్ములు గాసములకు
నాసలు రూకలకు గావె యది యట్లుండెన్. 652

అపూర్వప్రయోగము
క. తొఱుఁగు తమి నిన్నుఁ జెలులం
దొఱు నలరతిదేవిరూపు తుల నీరేఖం
దురు గౌనులు జవ్వాడన్
డుఱుము న్గదల వదలఁగ జను లుధృతులు వడిన్. 653

గీ. గుడికి ముద్ర వేసుకొని కులమున వన్నె
వాసిఁ గాంచి మాట వాసిం బెఱిగి
సాని మగువలందు జాణవై మగనాలి
పాటు కోర్చి తెట్లు పద్మనయన. 654

గీ. జక్కవలఁ బోలు నీగుబ్బచన్ను లేడ
వీని యుర మేడ యివి కొన్ని వెతలు గాక
కతలు నీబ్రతు కిఁక నేమి గలదు దూరి
కూళమారివిధాత చేకూర్చె నిటుల. 655

సీ. గుడిపామువలె బుసకొట్టిన న్వాకట్టు
మాటఁ బన్నినయట్టి మంత్రవాది
దనుఁ గనిపెంచు దల్లిని జోగురాలిగా
బందుకట్టిన యట్టి పాఁపజాతి
కన్నుల జగమేలు గలికి కొమ్మను నిన్ను
మగనాలిఁగాఁ జేయు మాయలాఁడు
తరువాత నినుఁ దెచ్చి దాసిఁ జేయఁదలంచి
యదను వేచినయట్టి యాతతాయి
గీ. గుఱుతు లొకకొన్నిమఱపులు కొన్నివెతలు
కొన్నిబాసలు కొన్నియుంకువలు కొన్ని
వలపులు కొన్న దనకుఁ దోడళుకు మదిని
గలుగఁజేసె నితండు నా కన్నులాన. 656

ఉ. ఓర్పరియందు సత్యవిభ వోజ్జ్వలునందు రసజ్ఞలీలలన్
నేర్పరియందు భోగముల నెక్కౌను జక్కనివానియందు, బెం
పేర్పడు శూరునందు, జగదేకవదాన్యునియందు, మిక్కిలిన్
గూర్పుదు రింతు లొక్కయెడఁ గూర్తురె వీనిని యేటి కూరుముల్. 657

మ. ఉఱుము ల్మంతనముల్ విచారములు నిట్టూర్పు ల్విధిం దూరుట
ల్గుఱుతు ల్బాసలు దప్పు వావులు ననుం గుల్లోపము ల్నమ్మిక
ల్మరువు ల్మోహము లొడ్లనేరముల నేమంబు ల్సహాయంబుగాఁ
బరుల న్జిక్కుల బెట్ట కొండుతెఱఁగు ల్బాటిల్లు నే యెల్లెడన్. 658

గీ. ఏటి వెలయాలితనము వీఁ డేటి విటుఁడు
పాతపంచాంగ మెక్కడి పాతకంబు
వెలఁది కొకపూట జాలదే బెళుకులేని
మిండగినివాని కౌఁగిట నుండు సుఖము. 659

క. ఒకని పడకింటిపొరువున
నొకని న్మజ్జనపుటింట నొక్కని మొగసా
లకు నొకని నుంచి తగులక
నొకని కొకం డెఱుఁగనీక నుండు కుమారీ. 660

క. ఇత్తెఱఁగునఁ దత్తరమున
బత్తి గలుగ బ్రోఁచు తల్లి బలికిన ‘స్త్రీణాం
చిత్తం చలాచలం’ బను
నుత్తమవచనంబుఁ దలఁచి యువిద గలంగెన్. 661

శోకరసము
క. కలఁగుచుఁ గాటుకకన్నుల
జలబిందువు లురుల నవరసాలకిసలయా
కులకోకిలకాకలికా
కలనాకలనాదకంఠకాకుధ్వనితోన్. 662

గీ. గోరఁ గన్నీరు మీఁటుచుఁ జీరచెఱఁగు
మొగముపైఁ జేర్చి యేడ్చుచు మగువ బిగువు
గౌఁగిటను జేర్చి లాలించి గారవించి
విటుఁడ నీతోడ నేఁ జెప్పినటుల మెలఁగు. 663

క. కాదనకుము పెరుమాళ్ళ ప
సాదము బుచ్చుకొని యెండ జల్లబడిన యా
మీఁదట నీయిలు సేరుము
నీదయ నున్నార మిచట నెమ్మది ననినన్. 664

సీ. చెదరిన విరుల జార్సిగఁ జుట్టిన రుమాలు
బస పంటిన మిణుంగు వల్లెవాటు
గెమ్మోవిపైఁ జిన్నిగెంపుల చిమ చిమ
ల్దరళాక్షి బుక్కిటితమ్మలంబు
గుంకుమజనుగుబ్బ గుమ్మెడా ల్జిటుల గం
ధపురొమ్ము నెలవంక కవురు చంక
జూపుల నిదురకుఁ జొక్కు గన్గవల కెం
జాయలు భుజముపై సానకత్తి
గీ. వారరమణీమణీక్షపావసరకుసుమ
కాండసంగ్రామపరిచితగ్లానివలన
నలయు నెమ్మేను దనర మధ్యాహ్నవేళ
వెడలెఁ బడకిల్లు భూసురవిటవరుండు. 665

క. కొంచక బిరబిర నడుచుచు
నించుక దలవాంచి వచ్చు నెడ నెడపక నే
త్రాంచలములు జలకణముల
మంచు గురిసినట్లు గురియ మార్గమునందున్. 666

అపూర్వప్రయోగము — చతురక్షరయమకము
తే. కంతుకంబు విలాసంబు గళము డంబు
కంతుకంబు విలాసంబు గనుకుచంబు
నెఱసరిని మించు మించు కేలొరపు బొడము
నెఱసరిని బెంపుజెంపుగా నెలతనడుము. 667

గీ. హరిపదముఁ బోలు జవరాలి గౌనుకౌను
మిక్కుటద్దములను గొమ చెక్కుఁ జెక్కు
గులుకు దేటుల కింతి ముంగురులు గురులు
గరిమ నిలకన్న కన్న జఘనము ఘనము. 668

గూఢతృతీయసీసము
సీ. జవరాలి చిఱునవ్వు చవిమోము నెమ్మోము
చంద్రబింబస్ఫూర్తి నవధరించుఁ
దలిరాకుఁబోఁడి నున్బలుకులు హస్తము
ల్గళము సితాబ్జవైఖరి ధరించు
చిలుకలకొల్కి చూపులు నెన్నడుము కు
తలములు నీలాభ్రవిభ్రమము మీఱు
గామినీమణి నాస కటి గుబ్బచన్గవ
కనకాచలోన్నతి గరిమ మీఱు
గీ. వెలఁది మైజిగి నఖములు వ్రేళ్ళు మెఱుఁగు
రిక్కలగు నింతి వీను లాకృతియు నూరు
లు నవరంభాస్థితి జయించు వనిత నడుపు
జడయు నూగారు నాగాళి సరణి గెల్చు. 669

క. అని పొగడి గడియ కల్లల
గని యుడుగని వలపుసెకల గని కలగనిగ నె
మ్మనమునఁ గినుక న్గొనక
న్గనుసన్న బ్రసన్నత నిడి కటకటఁ బడుచున్. 670

ఉ. తీరనికౌఁగిలింత లెడ త్రెవ్వని కోరిక లంగకంబునన్
జేరిన చెమ్మట ల్మఱుఁగు బెట్టని కూరుము లొండొకళ్ళు వే
సారని జిట్టకంబులును శయ్యసమోపరిసంగమంబులన్
నూరటలొందు నెమ్మనము లొక్కటియైనది యెంచి వెండియున్. 671

సమసురతము
సీ. తలఁపు వెంబడిగాని వలకారి చిన్నెలు
కలకూజితము గాని పలుకుఁబడులు
పునరుక్తములు కాని పొందికమాటలు
సొక్కించుటకు గాని చూపు వగలు
తమిసురతప్రేరణము గాని లేనవ్వు
లా చుంబితము గాని యధరములును
కౌఁగిళ్ళసడలింపు గాని మై పెనకువల్
కళ రేచుటకు గాని బలుచెణకులు
గీ. గాఢసీత్కృతిసహితంబు గాని యూర్పు
లలయిక నెఱుంగమికి గాని యారజములు
నాత్మఁ దలఁచిన లేవయ్యె నౌర నేను
నాలతాంగియుఁ గ్రీడించువేళలందు. 672

అపూర్వప్రయోగము
ఉ. బాలికఁ దల్లి బిల్వ నఁట బల్కకయుండిన గీ లెఱింగి డా
కేలఁ గుచాంశుకాంచలము గీల్కొని మోవికి ద్రివ్వ వెన్కకున్
వ్రాలిన నాతలం పనెడి బేడసఁ బట్టదొడంగు మారుచే
గాలపుజివ్వ బోల్చెవి చొకామెయి యెమ్మెయి డాయ నబ్బునో. 673

వ. అనుచు ననిచిన మనంబున.

క. ఇల్లాలి మేన సగమును
దల్లిపయి న్సగము గాఁగఁ దక్కిన సొ
మ్మెల్లను పోకడ బెట్టిన
నిల్లని యొకటునికి డెంద మిటునటు కలఁగన్. 674

సీ. తందనాలు బాడి యంద మాయె నటన్న
వానిపై మీఁది దువ్వలువ వైచి
యెడకారితనములు నడచు గత్తెరకాండ్ర
కిచ్చకమ్ములు గాఁగ మెచ్చు లొసఁగి
పిలుపుఁ జెప్పినరాక నిలిచినబోఁటికి
రోవట్టుగా వేడు రొక్క మిచ్చి
చడిదంబుల కొకింత జడియక నొకమాట
లోననె వెయ్యాఱులైన నొసఁగి
గీ. వీటిలో మిడిమేలపు విటుని విధము
సాఁగఁ గొన్నాళ్ళు నిజపితృసంచితంబుఁ
బొల్లుగాఁ జల్లి యదియెల్ల సళ్ళుటయును
దల్లడిల్లుచు దుర్మార్గతల్లజుండు. 675

అచ్చతెనుఁగు
క. బా కడిదము చేకత్తియు
బోకలు నాకులును బూని బుడత గొలువఁగా
మేకొని ఢీకెంచపయను
వాకటు చాలించి యింటివాకిటికవలన్. 676

క. వగదప్పి తిరిగి విఱిగిన
పగిది న్దలవాంచి యెల్లబంధులు దెగడ
న్మొగసాల వచ్చి నిలిచిన
వగసాలక జనని దొడుక వచ్చె న్వానిన్. 677

గీ. ఇంటియిల్లాలిచేఁ దలయంటఁజేసి
మజ్జనము భోజనంబు నమర్చి పిదప
వీడియ మొసంగి సాత్విగ జాడనున్న
కొడుకు తల దువ్వుచును తల్లి నుడివె నిట్లు. 678

ఉ. గట్టులు వేదవిద్యల కగారము శాస్త్రవివాదరూఢికిన్
బుట్టినయిల్లు శీలతకు భూస్థలి నట్టిగృహస్థునందు నీ
యట్టికులైకపాంసనుఁడు నక్కట గల్గునె యాణిముత్యము
ల్బుట్టెడు దామ్రపర్ణి మఱి బుట్టకయున్నదె యోటిగుల్లయున్. 679

ఉ. సాధుతనంబున న్మెలఁగి సజ్జనుఁ డంచును మంచివారు ని
న్నాదరణం బొనర్ప వినునట్టిది మేలు గణింపఁ జెల్ల దీ
జూదరియంచు బల్కు వినుచు న్జరియించుట లెల్ల వీతమ
ర్యాదములౌ ప్రయోజనము లర్హములే మహిదేవజాతికిన్. 680

నారికేళపాకము
శా. బంధుద్వేషదవాగ్నిగంధవహముల్ బాపావలంబాజ్ఞతా
గ్రంధుల్ సంచితవిత్తభూరుహకుఠారంబుల్ సుసంసారజీ
ర్ణాంధుప్రస్పుటపాతహేతువులు వేదాంతజ్ఞధైర్యాబ్జినీ
గంధేభంబులు వారకామినులవీక్షల్ నీ వపేక్షింతువే! 681

సీ. ఉత్తముం డురుతత్త్వవేత్తయు నిర్జితేం
ద్రియుఁడు దుర్జనజయాధికుఁడు సర్వ
శాస్త్రార్థపారగుఁ డస్త్రశస్త్రవినోది
సకలభూతహితుండు శాంతచిత్తుఁ
డతిథిపూజాపరుం డార్తావనుఁడు దయా
శాలిసముండు సుజ్ఞాననిష్ఠుఁ
డర్థవంతుండు సదాచారసంపన్నుఁ
డీషణత్రయదూరుఁ డింగితజ్ఞుఁ
గీ. డన్నదానచణుండు మహానుభావుఁ
డు పితృభక్తికల్పుండు నిష్కపటగుణుఁడు
సత్యవచనుండు నిఖిలలక్షణతనుండు
శౌరికీర్తనయుతుఁడు సజ్జనుఁడు గాని. 682

ధ్వని
సీ. అవివేకి యున్మత్తుఁ డలసాత్ముఁ డజ్ఞాని
యపకారి దుర్మార్గుఁ డప్రసిద్ధుఁ
డనృతవాది పరాంగనాసక్తుఁ డల్పుఁడు
నాస్తికుఁ డధముఁ డన్యాయపరుఁడు
మూఢుఁ డపూజ్యుండు ముచ్చుజూదరి పంద
జాల్ముండు మిత్రవంచకుఁడు లోభి
గర్వాంధుఁడు శఠుండు కాముకుండు దరిద్రుఁ
డు మలినుండు పతితుండు కుజనుండు
గీ. కొండియుఁడు హింసకుఁడు సాని దండగీఁడు
బంధుదూషణుఁ డసమర్థుఁ డంధుఁ డగుణి
తల్లితండ్రిని విడనాడు తనయుఁ డిచట
నుండరా దౌర హరియాజ్ఞ నోతనూజ. 683

ప్రాసభేదము
క. మిత్రునితేజము విశ్వా
మిత్రునిశక్తి గలదంచు మెండుగ మిథ్యా
మిత్రస్తోత్రము వినను వి
ధాతృఁడు నీరీతి నీదు తలవ్రాసెనొకో. 684

అపూర్వప్రయోగము
క. నీనారిని వీడి యుదా
సీనతచే దాసి డాసి చెడి తిరుగకుమా
నానోము ఫలమ నిను నే
నోనాడఁగ లేనురా తనూజాతవరా. 685

ఆదియమకము — అపూర్వప్రయోగము
క. పారావారగభీరయు
దారోదారోర్జితగుణతతతతవిద్యా
మారామారాజితగృహ
మేరా మేరాగవింత మెరమెర కొమరా. 686

క. మది రాగిలదోని ప్రే
రాదినేఁ డెంత వింత యయ్యెను బైపై
మదిరాక్షి కొసఁగ నాసొ
మ్మదిరా జూచుకొని వెడలు మను నిను తనయా. 687

ధ్వని — ప్రాసభేదము
క. లోకమునఁ దల్లిదండ్రుల
వాకొనరింపుచును పత్ని వదలక బంధుల్
లోకులు మేలని పొగడెడి
నీక్రియ సత్పుత్రకులు చరింతురు పుత్రా. 688

సమాసగతపూర్ణార్థి
క. చల్లదనంబును వితరణ
ముల్లాసము చక్కఁదనము నుర్వీస్థలి రం
జిల్ల కళాభావుకుఁడై
హల్లక హితరీతి తనయ యలరుదువు గదా. 689

ప్రసాదము
సీ. బ్రహ్మచారి ద్విజపటలికి నీడంబు
గృహి కుముదావళి కిందుబింద
మఖిలవానప్రస్థ హరిణాళి కుటజంబు
యతిదేవతకి పుణ్యస్థలంబు
బాంధవగణపాదపములకు మధువేళ
సజ్జనమణులకు సాగరంబు
మార్గణకమలసంహతికి భానూదయం
బాశ్రితశిఖుల కబ్జాగమంబు
గీ. హరికథాదిమనిగమాప్తి కగ్రభూమి
సకలశుభపరంపరలకు జన్మదేశ
మమితసత్కర్మఫలముల కాస్పదంబు
నైన నీ యిల్వరుసనెంత రాకుమార. 690

దుష్కరప్రాసము
క. బాహ్లికహయాధిరోహణ
యాహ్లాదకరోరుమానసాంబుజభక్తి
ప్రహ్లాదసుస్వరజితఘన
నహ్లాసశరత్ప్రపూర్ణ నాయనివదనా. 691

కాంతి
సీ. తులలేని దమయంతి గలవాని గలవాని
కొమరుని కొమరుని కొమరురూపు
మొన కిమ్ముకొను నెమ్మెన నయమ్మున నయమ్ము
ననయమ్ము గను మేటి యయ్య యోర్పు
తులకించు పసిఁడిమిన్నలమించు నలమించు
నలమించు నెనసిన యతనియీవి
రవణాలచేల చొక్కపురాల కపురాల
కపురాలమున గెల్చు కడిఁది యశముఁ
గీ. బూని విలసిల్లు నీవంటివాని కిటుల
యింట లేనట్టి నడవడి యెట్టు లొదవె
కొదలు దీరెను నీయట్టి కొడుకు గలుగఁ
దల్లిదండ్రుల కిపుడు వీతనయ తనయ. 692

గీ. గునియు జాఱ్సిగ చెక్కిట గోరు మోవి
కెంపు లత్తుక నుదుర గంధంపుచిటులు
వాడు పసపంటు వసువతో వచ్చినట్టి
పుత్ర యిది కాని నడతకు పులుగు గాదె. 693

శా. నామాట ల్విననేరకే నియతి నున్నన్భస్మహవ్యంపుగా
కేమీ దానఁ బ్రయోజనంబు గలదే యేలన్నఁ బూర్వంబునన్
రామాదు ల్పితృవాక్యపాలకులు గారా వారు నీసాటి రా
రా మెం డొడ్డఁగ నేలరా తనయ రారా లేచి నావెంబడిన్. 694

సీ. దీపితక్షాంతిప్రదీపంబు కోపంబు
పాపసర్పాంధకూపంబు కోప
మాపూర్ణనయకక్షాక్షేపంబు కోపంబు
బంధుసుస్నేహదీపంబు కోప
మాపాదితప్రభాలోపంబు కోపంబు
భయదవచోస్త్రచాపంబు కోప
మాపదుగ్రానలాటోపంబు కోపంబు
పౌరుష్యగుణకలాపంబు కోప
గీ. మంబర సుమాత్యబద్ధరూపంబు కోప
మంబుజాక్షగృపాదురాపంబు కోప
మంబికావేశహేతుధూపంబు కోప
మగుట కోపంబు వలదు మాయన్న వినుము. 695

మ. అవివేకాస్పదమౌ పరాంగనలసఖ్యం బేడ నీయాయజూ
కవిష్ఠాన్వయ మేడ నిర్దయుఁడవై గారాబుటిల్లాలి శీ
లవయోవిభ్రమధన్య నిట్లలంచ మేలా తల్లినిం దండ్రినిన్
జివుక న్జేయుదె పుత్ర నీ వెపు డుదాసీనప్రచారంబులన్. 696

గీ. అన్న యేలయ్య నిను విన్న కన్నవారు
గానివాఁడనఁ దలవంచి యేనుమెలఁగ
నాఁడు నాటికి నీకాని నడతచేత
గులము నిల్లుని వేఱుకాఁ దలచినావు. 697

సీ. సాధువర్తన ననూచారసంతతగుణో
త్తరుఁడైన తండ్రినిఁ దలఁచవన్న
యాయజూక మహాన్వయావరేణ్యుఁడై
దగు మేనమామను దలఁచవన్న
సత్యవ్రతాచారనిత్యవర్తనల ను
త్తమమైన నిన్నెదఁ దలఁచవన్న
కులరూపగుణములఁ దులలేని యౌవనో
జ్జ్వలయైన యిల్లాలిఁ దలఁచవన్న
గీ. ప్రౌఢులగు తోడివారలఁ జూడవన్న
వాడను సజ్జనశ్రేణిఁ గూడవన్న
యాడికల కోర్చుమతి విడనాడవన్న
నేఁడు మొదలుగఁ గీర్తిరా జూడవన్న. 698

ద్రాక్షాపాకము
క. పదునాలుగేండ్లప్రాయపు
జదురాలి న్ముద్దరాలిఁ జక్కని యాలిన్
వదలుదురె యకట! యది నా
పొదిగింటిలో నిదురఁబోవఁ బొసఁగునె తనయా. 699

ఉ. కొమ్మను నేలుకొమ్ము కడికుందన మీవిసుమమ్ము రెమ్మ రే
గుమ్మ తుపాసిరేక నిది కోపుజగా జిగిగ్రమ్ము తెమ్మె ర
త్నమ్ము బెడంగురంగు విడిదాల్చిన పైఁడిగనమ్ముబొమ్మ శ్రీ
లమ్మరునమ్మ యిట్టి నవలానవలా నొకబాల బోలునే. 700

సుకరప్రాసము
క. అరవిందానదీధితి
కురువింద రదాంశకంబు కుఱుఁచు గనిన బల్
గురువిందగింజ వాతెఱ
సరవి న్దగు లికుచకూచను సడల న్దగునే. 701

శా. అన్నా నిన్గని యెత్తిపెంచి యుపవీతాన్వీతుఁ గావించి యీ
కన్నె న్బెండ్లి యొనర్చి మీ రిరువురు న్గారాముచే నొప్పఁగాఁ
గన్ను ల్జల్లగఁ జూతునంచు మదిఁ గాంక్ష మ్మీఱ నే నుండఁగాఁ
జిన్నం బుచ్చితి విన్నినాళ్ళు నను దుశ్శీలుండవై పుత్రకా. 702

శా. సారస్యంబునఁ దండ్రికన్న సుగుణశ్లాఘుండవై భూమిభృ
ద్ధారాదత్తసమస్తవిత్తములచేతన్ సత్కళావిత్తముల్
జేరన్ సత్కృతి జేసి నీ వలర నీక్షింపంగ మాబోటులౌ
వా రాసింపరె చందమామపొడుపా వారాశిచందంబునన్. 703

శా. ఏమీ పల్కవు నేను బిల్వ దయలేదే నీకు నాయయ్య ని
న్నేమంటి న్సుకుమార నాయెడను ద ప్పేదీ కుమారాగ్రణీ
నామీఁదన్ జలమేలరా తన నన్మన్నించరా పెన్నిధీ
నీ ముద్దుల్గన నోచినా గదల తండ్రీ నీతిపారంగతా. 704

మ. అనిన న్మాటకు లోఁగి నట్టులనె వాఁ డట్టిట్ట నా కూర కుం
డినఁ దా నెంతయు సంతసించి యనుమానింపం దలంపేది పు
త్రునకున్ బ్రీతిఁగ వానిపై మమత యెంతోకాని మైనున్న సొ
మ్మును దాఁ గోడలి కిచ్చి సూను భవనంబున్ జేరఁగాఁ బంచినన్. 705

అపూర్వప్రయోగము
సీ. కొలని కెలంకునందలి గుజ్జులేమావి
చెంగటఁ జలువగొజ్జఁగులఁ దగిన
సురపొన్నదరికి నుత్తరపుఁగప్రపుటనం
టులపజ్జఁ బొగడ లంటుల నెగడిన
బెనుమల్లెలఁగల సంపెఁగలఘుమఘుమ
ల్గలగొని సోరణగండ్లదారి
గని వచ్చు గరువలిఁ గదలు జంత్రంపుఁబ్రతి
మలు వాయించు మద్దెలరవళికి
గీ. దొలుత సుతి కోయిల యొసంగఁ దోడ గోర
వంక తాళము లుగ్గడింపఁగ నెమలి
సకియ నటియింప మరునాట్యశాలలీల
పంతువగ బొల్చు కేళీగృహాంతరమున. 706

చ. చికిలి కిరీటపచ్చరవ జెక్కడపుంబని పాదపట్టెలన్
రకమగు బూదిదాల్పువిడిరాజిగి చొక్కపు టెచ్చుకోళ్ళపై
సకినల పల్కుగ న్బిరడ సంతన గూర్చిన జంటపోగుట
ల్లిక గల కీలుమంచమున వేవడి బాడబుఁ డబ్బురంబునన్. 707

చ. చెఱఁగులు నాల్గు సుక్కెడలఁ జేసి బిగించి గడున్వలార్చు పూ
పఱపున బవ్వళించి దన పైదలి రాకకుఁ గల్వనేస్తి బల్
చుఱుకు హొరంగు రంగుగల సోరణగండ్లను దృష్టి నిల్పి ద
త్తఱపుదువాళి చూపు బెడిదంబునఁ జూచుచునుండి యయ్యెడన్. 708

భావశబలితము
మ. చెలిపల్కెప్పుడు విందునో నగరె నా శీలంబు గన్గొన్న గౌఁ
గిలి నాకెన్నఁ డొసంగునో సకి మృదూక్తిన్ దల్లి బోధింప మా
ర్మలయ న్దోసము గాదె నే మనుదు నాత్మన్ధాతవ్రాల్దప్పునే
నలనా మోహినిఁ జూడకున్ననిక నాబ్రాణంబు లెట్లోకదే. 709

స్వభావోక్త్యలంకారము
సీ. మొదటను రేకయౌ కుదురున గనుపించి
మొలకలై మొగ్గలై తళుకుఁ గలిగి
గఱిగట్టి పోకల కలమట్టులై బొన్న
కాయల యంతలై చాయ లెసఁగి
తాళములంతలై దగనిమ్మపండుల
కొద్దులై బొంగరా లుద్దిగాంచి
తాళఫలంబుల తరములై బంగరు
కుండల జోడులై గండుమీఱి
గీ. కొండలవిధమ్ములై ఱొమ్మునిండ దొరసి
సరిగ విరివిగ నొకటొక టొరసి మించి
మొగమునకు నెగయుచున్న బిగువు గబ్బి
గుబ్బచన్నుల చెలికౌఁగి లబ్బు టెపుడొ. 710

ఔత్సుకము
సీ. తరియించు టేలాగు తలిరుటాకుంబోడి
వెలలేని సరసోక్తి వినకయున్న
వడదేరు టేలాగు వాలుఁగన్నుల కల్కి
వలిపపయ్యెద గాడ్పు సొలయకున్న
తమి బుట్టు టేలాగు కొమిరెపాయపు టన్ను
తలమానికపు దండ గలుగకున్న
నిదురించు టేలాగు నెలఁత వేడెపు గుబ్బ
నిండుకౌఁగిట నంటి యుండకున్న
గీ. తాపమారుట యేలాగు తమ్మికంటి
గళరవమ్ములు మంజీరకలరవములు
మూల ఱాకమ్మ బెళుకులు మొలకనగవు
లెనయుఁ బైకొని రతి నలయించకున్న. 711

వ. అని దురంతచింతాశబళితాంతరంగుండై కులకాంతమీఁద నొలసి యొల్లనితమి నున్న సమయంబున. 712

క. సుతుచెంతకుఁ దన కోడలి
సతతము గై సేసి పిలువ చలు వలరు మరు
త్పతదేలాలత నాలో
లత నాలతకూన తొట్రిలం బడ నగుచున్. 713

ఉ. తచ్చనలాడి బువ్వుటడిదంబు గ్రమంబున సన్నలెత్తఁగా
వచ్చినరీతినంత గడువైపున గౌఁగిటఁ గ్రుచ్చి మెల్లనే
నచ్చెలి నంచలంచ లడు గామడగా దొడి తెచ్చి బిడ్డఁడు
న్నచ్చట నిల్పియేగెను రయంబున నొక్కనెపంబు తోడుతన్. 714

ఉ. ఎప్పుడు బ్రొద్దుగ్రుంకు సతి యెప్పుడు జేరఁగవచ్చు దాని సొ
మ్మెప్పుడు నాదు చే దొరకు నెప్పుడు వారలతాంగగి కిత్తు న
న్నెప్పుడు గారవించు నిది యేక్రియ నోరుతునంచు నుండఁగా
నప్పుడె వచ్చె నింతి మగఁ డైన దురాత్ముని నమ్మవచ్చునే. 715

క. వెలయాలిచైవు లెంతయుఁ
దలఁపుచుఁ దద్వరిహవహ్నితాపాలసుఁడై
గలఁగు బతిన్ రతిచింతా
విలమానస యగుచుఁ జేరి వినయం బెసఁగన్. 716

యతిభేదము — అపూర్వప్రయోగము
చ. మెలి ముకుకెంపు మేల్చిలువ మేపరి ఱాపనికీలు చిల్క సూ
రెల విడిదాచు కుందనపు ఱెక్కల చక్కని చెక్కుపండుటా
కులు కొనగోటఁ జీలిచి భుగుల్కొను గప్రపుసున్న ముంచి య
చ్చెలి మడు పోరనుండి తమిసిగ్గున డగ్గరి వీడె మివ్వఁగన్. 717

క. మడుపుఁ గరమ్మునఁ గైకొను
వడువునఁ జెలికేలు బట్టి వద్దికి దివియన్
బడఁతుకు యొదుగుచు మెల్లనఁ
దొడతొడ యొఱయ న్విరాళితో వసియింపన్. 718

క. అత్తఱిని నాగదత్తుఁడు
బత్తిగలుగు సతికి దనదు ప్రౌఢిమ జూపన్
జిత్తంబు గరఁగి మోహపుఁ
దత్తరపు దువాళి మీఱ దయ దైవాఱన్. 719

నవోఢాసంగమము
సీ. సాచీకృతాననోజ్జ్వలమందహాసంబు
సకటాక్షతాటంకచకచకంబు
హుంకారకంకణక్రేంకారనినదంబు
స్ఫురితవక్రీకృతభ్రూయుగంబు
కరనిరుద్ధస్తనోపరిభాగచేలంబు
హస్తిద్వయీకృతస్వస్థికంబు
కుంచితాంగక్రియాగుప్తనీవీగ్రంథి
ధీరసంయుతకోమలోరుయుగము
గీ. విలసితస్వేదవదనాబ్జవిలసనంబు
గాఢపులకోద్గమంబును గలుగు సతిని
దొలుత రతిఁ దేల్చె నాగదత్తుండు దనదు
విలువ జవరాలి కూటమిఁ దలఁచి తలఁచి. 720

గీ. అపుడు నిట్టూర్పు నిగుడించి యలరు సజ్జ
నవ్వలవ్వలిమొగమున బవ్వళించి
మెల్లనే చేతిగాజులు ఘల్లు రనఁగ
గృహిణపాదంబు లొత్త నిద్రితుఁడువోలె. 721

క. ఉండునెడ నతని మంచము
దండఁ బదప్రాంత సరణిఁ దన చెఱఁగు మహీ
మండలిఁ బఱచి శయించెను
నిండినప్రేమమునఁ దరుణి నిద్రాన్వితయై. 722

శా. అంత న్లేచి లతాంగి మైదొడవు లాద్యంతంబు సంతోషిత
స్వాంతుండై సతిసేయు భాగ్యవశతన్ జంపం న్దలం పేది వాఁ
డెంతేనిన్ దయలేక పుచ్చుకొని తా నిల్వెళ్ళి యావేళనే
చెంత న్నిల్వక వారకాంతయిలు జొచ్చె న్సిద్ధసంకల్పుఁడై. 723

గీ. చొచ్చి తన నెయ్యురాలికిఁ జూపి దాని
తల్లి పాతరలాడ సొమ్మెల్ల నొసఁగె
దలఁచుకో నేరఁడయ్య మీఁదటి తెఱంగు
నింక నిమ్మన్న నేరి సొ మ్మివ్వఁగలఁడొ. 724

క. ఇచ్చిన నా సొమ్మంతయు
మచ్చికరాఁ దీసి కొన్ని మాసంబుల కా
నెచ్చెలిని గన్న జంతటు
బచ్చెనమాటలను బయలుపందిలి యిడుచున్. 725

అపూర్వప్రయోగము
సీ. పడుచులచే వాని పాదము ల్గడిగించి
హొయలుఁ బావడఁ దడి యొత్తఁ జేసి
కైలా గొసంగి వేగంబె దోకొనిపోయి
తళుకుఁ గుంకుమగంధ మలఁది చలువ
గట్టించి యొరయెత్తు కపురపు బాగాల
విడె మిచ్చి వరములు బడసి కన్న
లేజవరాలితో రాజసంబుగ వాని
మంచంబు చెంగట మంచిచీని
గీ. చాపపై నుండి యుచితసల్లాపగరిమ
వెలల బన్నెడు దనకూళ తలఁపు నేఁడు
నుబుసుఁబోకల నొకకొంత యూరడించి
గాన లేఁడని వెలనేస్తకానిఁ జూచి. 726

అపూర్వప్రయోగము
క. ముంటిమొ నిల్చినటు లే
ముంటిమి నినుఁ బాసినట్టి మొద లీవరకున్
వెంటనె రాఁగంటను నినుఁ
గంట నిదానంబు గంటకాదే చెలియా. 727

కాక్వాక్షిప్తము
క. ఇచ్చునెడఁ గనలు గర్జిలు
నిచ్చియు నచ్చియును జాఱు నేదెసకైనా
హెచ్చుగ నీవలె నిచ్చునె
యచ్చటి ఘనుఁ డెపుడు మాధవార్యుని తనయా? 728

చారుతావినోక్తి
ఉ. కోపముగాని చూపు నెలకొన్న వికారము లేని రూపు సం
తాపము రాని యేపు నిరతంబును వేసట లేని ప్రాపు నె
ప్పాపమునేనిఁ బాపు కలబాగెపు నెమ్మదికోపు బూమిలో
వైపున నీకెగాక బెఱవారికి లేదుగదా ధరామరా. 729

పంచదశవర్ణయుక్తపాదయమకము
క. ఔరా మాధవ యజ్వకు
మారా మనుమదనసమరమాధుర్యుఁడవై
ధీరా విటార్య యేలితి
మా రామను మదనసమరమాధుర్యుఁడవై.

ఏకనియమద్విప్రాసలయగ్రాహి
మాఘ వనకుంద కుసుమౌఘ వలదుత్కటర
సౌఘవరణీయ జిత మాఘవచన శ్రీ
లాఘవవచోవిభవ నాఘ వశమానస సు
మౌఘ వనజ వ్రజనిదాఘవసుమూర్తీ
మేఘవ దిభోత్తమ ఘటాఘవలయ ధ్వనిన
మోఘవసతీడ్య శరలాఘవ భుజాజో
రాఘవ సమానకవి లాఘవనివృత్తికర
మాఘవన పాలనవమేఘవరదానా. 731

క. మెచ్చితి నన నిక్కముగా
నుచ్చాటన జేయఁదలఁచి యున్నదియని వాఁ
డచ్చెంగటఁ దత్సుతఁ గని
పచ్చనికాసునకు వెరవుబాయక యంతన్. 732

క. ఓరమణి యిట్టులేటికి
హారమణీ భూష లిడక యసురుసు రనుచున్
దీరని చింతాభరమున
గూరెద విత్తెఱఁగు పేరుకొనుమా తెలియన్. 733

చ. తొలురతి నీవు నన్గెలిచి తోడగు మోవికి కావిడాల్ కర
మ్ములకును బచ్చఱాకడియముల్ జనుదోయికి హారము ల్కటి
స్థలికిని మేఖలంబును బదంబున కందె యొసంగి పోరుటి
మ్ముల వెనకౌట కొప్పు బలమున్ ముడికట్టులఁ గట్టితే చెలీ. 734

ఉ. ఏటికి న న్నెదుర్కొన వదేటికి కౌఁగిట గ్రుచ్చి చేర విం
తేటికి విన్న నయ్యెద వదేటికి చూచెదు ఱిత్తచూపులన్
మాటితివెందు నీకులుకుమాటలు నీ నగుమోము తేటలో
పాటల పాటలాధర కృప న్గనుమా యనుమానమేటికిన్. 735

మోహము
సీ. భామ నీమోముఁ దప్పక జూచు మోహంబు
నెలత నీమై సోక నిలుచుబాళి
బాల నీమధురోక్తు లాలించఁ గలప్రేమ
పడఁతి నీమోవి ముద్దిడు తలంపు
చెలువ నీచన్గవఁ జేపట్టు తమకంబు
కలికి నిన్గిలిగింత గొలుపు వలపు
లలన నీయూడిగంబులకుఁ బాల్పడు మేలు
వనిత నీకౌఁగిటఁ బెనఁగెడు తమి
గీ. వెలఁది నీయుపరతిమీఁద బొలుచు హాళి
కొమ్మ నిను దక్కి దక్కించుకొనెడి యాస
మమ్మురమ్ముగ నన్నేచ మోడిదగునె
చలముఁ జాలించు పరిపూర్ణచంద్రవదన. 736

త్రిప్రాసము — అపూర్వప్రయోగము
క. వెడవింటిఱేనినేనియుఁ
గడకంటనె నేలుకొనఁగఁగల వెలనవలా
పడకింటిలోన వింతగు
కడకంట చరింతె నన్నుఁ గాదని యవలన్. 737

సీ. మేఁత లొసంగిన బూఁతలు బూసిన
గనుక ట్టొనర్చిన గాతలిడిన
మందులు బెట్టిన సందిటికడ నీవి
కట్లు గట్టొరులకుఁ గాకయుండఁ
జెరివిన పూవులు చేనంట నిచ్చిన
వాడెలు గూర్చిన భద్రకాళి
బంపిన మోహిని నంపిన మంత్రతం
త్రముల బన్నినగావుల మరిచినను
గీ. మాయలాడివి యొకతృణప్రాయము గను
పడక లందుల గుట్టికబాళి బెనచి
చెలువు నిధనంబు తల్లికిఁ జేర్చునటుల
గావు నీ నాయెడ తలంపులో వెలంది. 738

వృత్తప్రాససంస్మృతి
సీ. ఇది గదా కొన్ని పన్నిదములనే నీవు
నెత్తమ్ములాడు పొందికల కూట
మిది గదా నీచేత హృదయంగమంబుగా
వీణానినాదంబు విన్నచవిక
యిది గదా యానాటి కొదవిన పొలయల్క
వాదుదీర్చిన నెఱవాది చిలుక
యిది గదా మనము సమ్మదకథాలాపముల్
మున్ను బల్కుచు నున్న వెన్నెలబయ
గీ. లిది గదా సంభ్రమారబ్ధమదనకదన
సమయసంజాతసమధికశ్రమము దీర
వేడుకల విశ్రమించిన బైఁడిమేడ
మఱువ నీతోడు దయఁజూడు మందగమన. 739

కావ్యలింగాలంకారహేత్వలంకారద్వయసాంకర్యము
సీ. కామినీ నీనెమ్మొగము పూర్ణచంద్రుండు
చెలువ నీకనుబొమ ల్చెఱకువిండ్లు
చివురాకుఁ బోడి నీచెవులు చక్కిలములు
తొయ్యలి నీమోవి దొండపండు
తరుణి నీదంతము ల్దాడింబవిత్తులు
కలకంఠకంఠి నీపలుకు తేనె
యింతి నీనునుబుగ్గ లిప్పపూమొగ్గలు
బోటి నీగుబ్బలు తాటిపండ్లు
గీ. బాల నీవళుల్ సైకపు పాలతెరలు
వనిత నీకటి చక్కెరనునుపు దీవి
గనుక మధురాంగి నీమేను కమ్మతావి
విటహృదాకర్షణవిధాయి విద్య యయ్యె. 740

శ్లేషానుప్రాణితరూపకాలంకారవ్యక్తోపమాధ్వని
సీ. పల్లపాణిధమ్మిల్ల మభ్రచ్ఛాయ
మగువ సిబ్బెంపుచన్నుఁగవ సున్న
కంజాతనేత్రి వక్త్రము మహాదర్శము
మానవతీమణి కౌను బయలు
చిన్నారికన్నియ జిగినెన్నొసలు కల
చిలుకలకొల్కి పొక్కిలి భ్రమమ్ము
జవ్వని రూపంబు చంచలాప్రాయంబు
వారణయాన నూగారు జల్లి
గీ. యైన నొకయించి చూచిన యంతలోన
నెల్లవారల మిగుల మోహింపఁజేయు
మహిమగల నీకు నఖిలభూమండలమున
మోహినీనామ మన్వర్థమునఁ జెలంగె. 741

ఉ. గ్రక్కున గౌఁగిలించి దెలిగన్నుల చల్లనిచూపు జూచి నీ
చక్కెరమోవి తేనియ లొసంగి మనోజునికేళిఁ దేల్చి నా
యక్కఱ బాపుమన్న వదనాబ్జమున న్జిఱునవ్వుఁ దెచ్చి యా
జక్కవ చంటి యిట్లనియె జక్కెర లొల్కెడు ముద్దుబల్కులన్. 742

సీ. చదువును గుడికొల్వుసాధనయును కడ
నోసరించిన యట్టి యునికిఁ దలఁచి
వీణాదిసంగీతవిద్య లొజ్జకు మళ్ళ
నొప్పగించిన యట్టి యునికిఁ దలఁచి
దాసదాసీపశుతతి బరామరిసింప
కూరక యున్నట్టి యునికిఁ దలఁచి
యిల్లాలితోఁ బొందు నెడజేసి యిచట ని
న్నొంటి యుంచిన యట్టి యునికిఁ దలఁచి
గీ. యేమి పలుక నీకు నెట్లుండునో యనె
డునికిఁ దలఁచియ గడు మనికిఁ దలఁచి
యున్నదానగాని నిన్నెఱుంగయుండఁ
గలదె చింత కొండుకారణంబు. 743

ఇష్టనిషేధాభాసరూపాపేక్షాలంకారము
సీ. తలఁపులోఁ బాయక నిలు తనపునరుక్తి
యంత నీ సొమ్మ ననార్యవృత్తి
నినువీడి మెలఁగ లేనన నసంభావ్యంబు
భర్త వీవన నభఃప్రసవకాంక్ష
తొలుదొల్త నిందురావలె నన్న గర్వోక్తి
చనుదెంతు నేనన చపలగుణము
మరుఁ డేచునన సాక్షి బరఁగని వచనంబు
చలిగాడ్పుసెక యన జనవిరుద్ధ
గీ. మరయ నీయధీనమగు నన్నలఁచు నాక
ళాధరుండన భవదుపాలంభరీతి
గనుక నే మాటలు నెఱుంగ నెనరు నిలుపు
సాగుబడి హత్తగుణవిత్త నాగదత్త. 744

గీ. ఔర యన్నిఁటఁ బ్రౌఢ వీవౌట వింత
గలుగ యో నాగదత్తార్య తెలుపు మనిన
నౌర యన్నిఁట బ్రౌఢ వీ వౌట వింత
గలదు మోహిని యిడని నన్గాచు టొకటి. 745

అపూర్వప్రయోగము
గీ. సమయభేదంబు లాత్మరాగంబు గనక
చూచి యడుగని నిను మెచ్చచూచి నానె
దయకు రమ్మని చేసాఁచి పయఁట ద్రివ్వ
మోహిని తలంపులో నిను మోహరింప. 746

వార్త
గీ. కరము గాజులు ఘల్లన కంచె లొరయ
దత్తనిభ నాగదత్త నీదత్తరంపు
గుత్తగానితనం బెత్తు గుత్తగాను
పంజమాటలఁ గూడు నా లంజరికము. 747

మ. అవురా యెంతకు దట్టిగట్టితివి మే లాహా బళా మంచివాఁ
డవె పో వేఱొకచోటఁ గానవె కదా టాటా ల్గుణించంగ నీ
ఠవళీవిద్యలు జూపనోర్చునది వీటన్లేదు మాబోంట్లతో
నవుగాము ల్గన నట్టి క్షుల్లకముగా కాపోశనప్రాయమే. 748

వ. అని మధ్యధీర పల్కిన పల్కులు తన చెవులకు ములుకులు గాఁగ బులుకు పులుకునం గనుంగొని యపుడు. 749

గుణీభూతవ్యంగ్యము
సీ. గాజుకుప్పెల వంటి గబ్బి సిబ్బెపు టుబ్బు
చిన్ని గుబ్బలు గోరఁ జెనక వెఱచి
చీనిచక్కెర వంటి చెంగావి వాతెఱ
యింత పల్మొన సోఁకనీయ కళికి
జిగిమల్లె పూవంటి చిన్నారి నెమ్మేను
బిగువుఁ గౌఁగిట నాని పెనఁగఁ దలఁకి
హొసతమ్మినూల్వంటి యసదు లేఁగౌనుపై
నోరగాఁగఁ బరుండి యొరఁగఁ గొంకి
తే. మనసు దీరఁగ నొకనాఁటి యునికి లేక
మోసపోయితిఁ గసికాటు ముచ్చటలనె
యింతలోననే నన్ను నీ వింత సేయు
టెఱుఁగనేరని కతనఁ బూర్ణేందువదన. 750

ధ్వని
సీ. వడగండ్లచేత దేవరగుళ్ళు నిర్మింపఁ
బట్టి కన్నుండఁ గన్నాపఁ దివియ
నిసుము నన్నము సేయ నెండమావుల నీళ్ళు
గావింప నేన్గుఁ గన్నాన లాఁగ
నీట ఱాల్ దేలింప నీళ్ళు మూటగఁ గట్ట
నెడ పులిమీస లుయ్యల లొనర్ప
బొమ్మల పోట్లాట పొనరింప వర్షధా
రల నెక్కి డిగఁ బగల్ రాత్రి రాత్రిఁ
గీ. బగ లొనర్ప మాధ్వులశాస్త్రి పటిమ దొరల
తలఁపు జంగాల బూటకంబులు గరీబు
కరుణ కోమటినిజమును గలికిచెలిమి
నేను దెలియంగ గలనె యోసాని యవల. 751

సీ. పొలఁతి బూరుగమాని పొడ వడవికిఁ గాయు
వెన్నెల చెప్పుడువిద్య బిరుదు
మాష్టీనిబీరంబు ముష్టి పండందంబు
పలనాటి గొల్లల పాటజాతి
దొమ్మరి పెద్దతనమ్ము ఱాబొమ్మ సిం
గారమ్ము బక్కయగారి బలిమి
వెలమత మానమ్ము వెఱ్ఱిజాణతనమ్ము
రాచగబ్బితనమ్ము నాచురితవు(?)
గీ. కోఁతుల శివమ్ము నాలవజాతి తపము
శ్రోత్రియుని తెలుఁగు కవిత కింశుకము తావి
జడునిచదువును బెస్తనేస్తమ్ము వలెను
జేసి తీజాడ నిఁకనేమి సేయువాఁడ. 752

గీ. రావిపువ్వును బెండులోఁ జేవ పిచ్చు
గుంటు పర్వును గుఱ్ఱపుకొమ్ము కాకి
తెలుపు రాయంచనలుపు మించుల నిలకడ
గలుగ వెలయాలి వల పిల గలదె యనుచు. 753

గీ. ఇవ్వ గొరగాక యక్కొమ్మ బాయలేక
పణ్యవృద్ధాంగనామహోపద్రవమున
నారివేరంబురీతి నిందందుఁ దిరిగి
గోఁచికాఁడయ్యె బాపన కోఁడెకాఁడు. 754

సీ. తలమాసి పువ్వుటిత్తులకు జిల్గురుమాలు
బట్టగట్టిన తల బట్టగట్టెఁ
బడవవాటున వాటుబడ్డ చన్గజనిమ్మ
కాయ గాచిన చెయి కాయగాచె
నాఁకటి పెక్కువ నతివ కౌఁగిటి నంది
చిక్కజారిన మేను చిక్కబారె
వెకలియై తిరుగ నేవేళను రతికేళి
కళలు దేరెడుమోము కళలుదేరె
గీ. నిన్నియునుగాక యూరకే యేలమాను
వారకాంతల చెంతలఁ జేరెనేని
యేడకుల మేమివర్తన మెట్టినడక
యేటిగౌరవ మేమని యెన్నగలదు. 755

గీ. తల్లిదండ్రులు వాని వర్తనము రోసి
ప్రాణములు దాఁచుకొనెడు లాభంబు గనిరి
వారి శుశ్రూషయందుఁ దద్వనిత యుండె
వాఁడు రెంటికిని జెడిన రేవణుని బోలి. 756

క. విచ్చలవిడి లంజల దిన
వెచ్చములకు జూదగాని వెచ్చములకు ని
ప్పచ్చరమై తనలాహిరి
వెచ్చములకు లేక మ్రుచ్చు విద్యకుఁ జొచ్చెన్. 757

వ. ఇత్తెఱంగున కన్నాగదత్త నిభుండగు నాగదత్తుండు ధీరశాంతనాయకత్వం బుద్వాసనంబు జేసి గానంబు కవితయు కొక్కోకంబు జూదంబు దేశభాష లిపిజ్ఞానంబు లిపిలేఖనంబు చరాచరాన్యధాకరణంబు విలువిద్యయు సర్వజ్ఞానపరిజ్ఞానంబు శాకునంబు సాముద్రికంబు రత్నపరీక్ష అరదంబుఁ బఱపుటయు తురగారోహణంబు మల్లశాస్త్రంబు పాకచమత్కారంబు దోహదప్రకారంబు ధాతుగంధరసవాదంబులు కుట్టుపనుల వినోదంబు మహేంద్రజాలంబు జలాగ్నిస్తంభనంబులు మొనకట్టు వాకట్టు వయస్తంభనంబు వశ్యాకర్షణమోహనంబులు విద్వేషణోచ్ఛాటన సంహరణ కాలవచనంబులు పక్షిగతిభేదంబులు యోగరాగంబు వచనసిద్ధి ఘుటికాసిద్ధి యింద్రజాలంబు అంజనంబు ధ్వనివిశేషజ్ఞానంబు వంచనంబు స్వరవంచనంబు మతిమంత్రౌషధక్రియలు చోరత్వంబు చిత్తరువు వ్రాయుటయు లోహకారకత్వంబు కాసెపనియు కులాలకర్మంబు వడ్లంగిపనియు మేదరపనియు జోళ్ళు నిర్మించుటయు సాలెపనియు నదృశ్యకరణి దూత్యకరణి వేఁటసన్నాహంబు బేరంబు పాశుపాల్యంబు కృషియు మైరేయంబులుగూర్చు వగలు లావుక కుక్కుట మేషాదులఁబోరు హత్తించుటయు ననెడు చౌషష్టివిద్యల నెఱింగి దత్తరమ్ముల కొదలేక యదరు బెదరు సోకనీక మదముమీఱ ముదముదేర నొంటికి నొంటిదప్పికి దప్పి నిదురకానిదుర చేసి తనతోవాసికి నుర్వర నెవ్వరైన నాన బూనుదురా నుదురకన్నుగల దొర నెదురుకాక నిఁక నీదైవానుగ్రహంబున నిజదురాగ్రహంబునను నుగ్రారివిగ్రహంబులు విగ్రహంబున నిగ్రహంబు సేయు జాగ్రతనుం దేరి కాదంబరీపానవాదంబున మోదంబు మీఱి జూదంబున చౌర్యవినోదంబున సంసారఖేదంబు విడిచి లజ్జగడచి మట్టువీడి గుట్టుఁబోనాడి రట్టునకు లోగి పెట్టునకు నాగి పెక్కుమాట లొక్కచోట పిక్కటిల్ల తక్కువెల్లజూటువగలు మాటతెగలు చాల దెలిసి లీల మలసి వడిసుళ్ళనుబడి గుళ్ళను జరియింపుచు సిరిపెంపుచు నిజజంజన్యమానకైతవగాత్రుండును తంతన్యమానదురితచరిత్రుండును పాపఠ్యమానాంబుస్వీకృతకలితముఖుండును రారజ్యమానదుష్టసఖుండును నగుచునగుచు నందునందు నందుఁజెన్నొందు వాసరమ్ములు మీసరమ్ములుగాఁ జాల కడపట గడపంజాలక. 758

గీ. కావు ములుబంతి సికముళ్ళు గద్దగోరు
నల్లదట్టిసబిల్ల కన్నంపుకత్తి
బూది దివ్వార్పుపురు విసుమూదు గ్రోవి
తోలు నిచ్చెన మొదలు ముందుగ ధరించి. 759

అశుభశకునములు
సీ. ఎచట కేగెదవని యెవ్వరు నడుగక
తంబళి బాపఁడు తారసిలక
తుమ్మెడు పులి నక్క తోడువచ్చెదనను
పలుకులు వీనుల వినక పిల్లి
యడ్డంబుగాకను గొడ్డురా లెదుటను
నిలువక జాగిలంబలుకుడిడక
పాలవెన్కకుఁ బోక పక్కిపై రొప్పక
పొనుకుఁబడిన యగ్గి బొగ్గులు దిస
గీ. మొలనరు పరపు మైలచీరలు దూది
కసవు తొండయు గుడ్డి మూగ కఱిచిలువ
విధవ కుందేలు పొగ వొంటిపిచ్చుగుంటు
నూనెతలవాని యెదురుగాఁ గానఁబడక. 760

శుభశకునములు
సీ. మునుక్షేమకారి యాడిన పాలకుడినుండి
యెడమ కేతెంచినఁ గుడిభుజ మద
రిన వాయసంబు దీర్చిన పైడికంటె వే
కలయ బలికిన బంగారుకలశ
మెదురైన గుడిపల్కు లెనసినఁ గాడిద
లెలుగిడ వేశ్యల నెలిమి గన్న
కలకల దక్షిణగౌళి పల్కిన మేన
జల్లనిగాడ్పు విసరినఁ గవగ
గీ. బ్రాహ్మణు లెదిర్చినను ఘంటరవళి వినిన
నైదువలు పాటఁ బాడిన నశ్వహేష
వినఁబడినఁ బండ్లు గాన వచ్చినవి మొదలు
మేలుశకునంబు లెఱిఁగి యవ్వేళలందు. 761

క. ఆయన సేయని పాతక
మే యనువున లేకఁ బురికి నెడయై జని దా
బోయల గూడుక దెఱవుల
నాయకు లేతేర తాను నడుమ నడుచుచున్. 762

గీ. ఎన్ని గోహింస లెన్ని స్త్రీహింస లెన్ని
విప్రహింసలు గురుబాలహింస
లెన్ని గావించె నేమని యెన్నుకొనునొ
పోయె నీతంబు బాపన బోయ మదిని. 763

క. ఆజాడల మెలఁగుచు నే
యేజాడల గట్టి కొట్టి యెదలఁ గిరాతుల్
జేజేయని దనుఁ గొలువఁగ
రాజుల నగరములు జొచ్చి రాయిడిఁ జేయున్. 764

ఛప్పన్నదేశనామధేయసీసము
సీ. మాళవ మళయాళ మత్స్య చోళ విదేఙ
కురు విదర్భ పుళింద కొంకణాంగ
కర్ణాట చేది టెంకణ వత్స సింహళ
మద్ర భోట సుదేష్ణ మగధ యవన
కాశ వరాట కేకయ కుంత లావంతి
సౌరాష్ట్ర శబ రాంధ్ర చేర పాండ్య
ఘూర్జర సాళ్వ కుకురుహూణ నేపాళ
బాహ్లీక శక వంగ పౌండ్ర లాట
గీ. కోసల కరూశ పాంచాల కుత్స నిషద
సింధు గాంధార కేరళ సింగటాట్ట
శూరసే నోత్కళ మరు కాశ్మీర బర్బ
ర కరహా టాఖ్య దేశముల్ బ్రబలి తిరిగి. 765

ఉ. కామగమైన రూపములు గాంచుక కాంచి గయా ప్రయాగ మా
యా మధురా కవేర తనయా యమునా సరయూ మలాపహా
హైమవసుంధరాచల హిమాచల రాజిత శైలతామ్ర ప
ర్ణీముఖ వాహినీ పురవనీ నగము ల్జరియించు యావలన్. 766

క. లోవాడియు వావాడియు
చేవాడియుఁ గలిగి మిగుల సీమారామా
గ్రావాగ్రహార జనపద
దేవస్థానాటవులను ద్రిమ్మరు కతనన్. 767

సీ. వలుద గుబ్బలమీఁది చలువ ముత్తెపుపేరు
లిరుకు నిల్వుల దట్టి పొరలఁ జొనిపి
సాగి మ్రొక్కటు జూపి సోగవ్రేళ్ళను మట్టి
యలు జిమ్మి యంకుల నణఁచి తిగిచి
యవలి వానికి సున్న మందిచ్చి చేదీయు
ననువున కమ్మ లల్లంత మీటి
సందడి నలజడి నంద జేయిమ్మని
యుంగరంబులు లాగి చెంబు విడిచి
గీ. గత్తెరల నొడ్డియాణము ల్గత్తిరించి
కుంపటిసుముల సవరంపు కుప్పె లూడ్చి
కెడల యవిజూపి మెడనూలి కీలువాపి
వరుసవారల వెతలఁ బాల్పరచి రందు. 768

క. ఇరువురు మువ్వురు నలువురు
తెరువులఁ దెరువరులఁ దాము దెరువరు లగుచున్
చొరవగని నొంటిపాటున
మొఱపెట్టఁగఁ గొనిరి చేతిముడుపులు కడిమిన్. 769

సీ. నిదురించువారిలో నిదురించి నటులుండి
దొరసిన వెత్తుక జరుగువారు
మీవారు వేరె రమ్మా వెంట నన పిల్చి
పడుచుల నెగమీటి పరుచువారు
సున్నంబులోపల సొక్కుమందులు బెట్టి
కలిగిన వంకించి తలఁగువారు
వెలయాండ్రఁ దప్పు చైవులు దార్చి బంతులు
నోటిలో నిడి దోచి దాటువారు
గీ. కొంగురాలను పెడతలఁ గొట్టి కెడపి
సొమ్ము లాగించి సందడి జుణుఁగువారు
తారు దొంగలి దొంగలఁ దామె తఱిమి
పట్టు పట్టంచు నూడని బాడువారు. 770

వ. ఇట్లు తిరిగి యున్మత్తుఁడైన నాగదత్తుఁడు తత్తడి కిత్తుమొత్తంబు మిణుగుర్లఁ బోలి యంబరంబుల దంబరంబులు బంగారుసొమ్ముల సింగారంబులు చూపులయేపులు పిలుపు మెలపులు నయమ్ము లభయమ్ములు క్రొవ్వులనవ్వులు యిక్కువల మక్కువలు గచ్చులమెచ్చులు గలిగి తద్భటులంత నంతర్గతంబున. 771

క. అందులను దనివి జాలక
యందఱు నొకచోటఁ గూడి యదిరా మనకీ
సందడి జుణుఁగుల దీరునె
తుందుడుకుల సామిసొమ్ము దోఁచక యున్నన్. 772

చ. అని రథమార్గమం దరిగి యావల మావులతోటఁ బశ్చిమాం
బుధిని నినుండు గ్రుంకకయ మున్నుగ డగ్గరఁ జేరి యందఱున్
గనుకని వెన్ను బొక్కసము గ్రక్కున నడ్డము దూరి జూచి మో
చినటుల రత్నకాంచనవిశేషసువస్తులు గొంచు వ్రేల్మిడిన్. 773

అపూర్వప్రయోగము
క. వెడల హరిభటులు పైకొని
కడువడి యాసొమ్ము తమవి కాన్కలిడు గతిన్
బడవైచి పోవఁగని వెం
బడి యూర్పులఁ బొడుపొడువేని వడ నడరుటయున్. 774

అపూర్వప్రయోగము
క. నడచినఁ బాఱుం డప్పుడు
కడితల యరిగెయు ధరించి కఱివేలుపు బ
ల్దడములు దను నఱికినఁ గని
కుడియెడమలఁ దగ్గి యొడ్డుకొనుచు న్బెలుచన్. 775

వీరరసము
ఉ. గొంతులు నొవ్వఁగాఁ బరవఁ గూఁతలు గూసిన బంటు లైతిరో
పంతము లేల నాయెదుట బాఱులు దీరుఁడు మైలసంతలో
గంతుల సాగ వంతయును గానఁగ నయ్యెడు లెస్సఁ గోసెఁగా
మంతరసాని బొడ్డు క్షణమాత్రములో మిము గెల్వకుండినన్. 776

అపూర్వప్రయోగము
క. ఏవాఁడు గలా డిందుల
నావడి జగమున కెదుర నగరిపుసుతుఁడై
నా వెఱవక నిలఁగలఁడే
కావున నే నిపుడ గెల్పుఁ గైకొను చరయన్. 777

ప్రాసభేదము
క. నేతును మంత్రము లందఱ
నేతును దద్రిపుల ప్రేవు లీ రణమునకున్
నేతు బ్రియంపడు పొలుపుగ
నేత్రివిధమ్ములను మీర లెనయే తనకున్. 778

రౌద్రరసము
క. చెఱకులఁ బన్నిదమాడిన
తెఱఁగున మీరూపు లొక్కతేప చే
నఱకుచు బేతాళున కే
డ్తెఱ నెత్తురు సాక సాక తీరున సేతున్. 779

భయానకము — ప్రాసభేదము
క. నాకౢప్తకాంచుఁ డంచును
చీకాకుఁగ రెండి మేల చెల్లాచెదరై
మూక బరతేర విసరుక
ఢాకన్ ఝాటు ధడయు ద్భడ దుముకు మొనలన్. 780

అపూర్వప్రయోగము
క. మిడుగురులు రాలఁ బొడిచిన
కడువడి దప్పించి లేదుగా యని తారా
బడుగుంబాపని బాపని
యెడతెగ నియ్యకను జుట్టి యేసలవానిన్. 781

క. కేడెము కత్తి తుపాకీ
లౌడియు విండ్లమ్ము వీటెలం గొని తొలుతన్
జోడులు దాలిచి మేనులు
జోడులు తమకన్నలేదు సూసవి కినుకన్. 782

అపూర్వప్రయోగము
క. తనువులను చెక్కు చెమరక
యని చేసిన నాగదత్తుఁ డాసేనల బే
ర్కొని తూరుచు మార్కొని భో
రన గరిడిన్ సాముచేయు రహి నెఱ వేడ్కన్. 783

అద్భుతరసము
క. మొనచేసిన చోటన ధుము
కును ధుముకును సేయు తఱిని కొంచెపు మొనయున్
మొన ధుముకు ధుముకు మొనయును
గనుపించక జేసియంత కాంతాళమునన్. 784

క. పద్దుగ వెన్నుని బలముల
కుద్దుల టేర్పడి దిటమ్ము లొద్దిక యగుటన్
గద్దింపులచేఁ జప్పుడు
విద్దెలు వినుపించు రీతి వితతము మెఱయన్. 785

అపూర్వప్రయోగము
క. ఇది మొన యిది నరు కిది పో
టిది మీ టిది చూ టిది ధుము కిదె యిదె యని తా
రుదిరిపడు బంట్లు గీటుచు
సదమదముగఁ గాలుఁ గేలు జంటఁ బెనంగన్. 786

క. హరులున్ హరులును గిరులున్
గిరులును గరులున్ గరులును గిరులున్ గిరులున్
మఱియు మఱి దుర మొనర్చిన
కరణిన్ సరిఁ బోరి పోరిగరుసు దురుసునన్. 787

నవరసోపమానయుద్ధవచనము
వ. ఆయెడ నాయెడ వయసుచాయ బోయలు చండితనంబునఁ జండింపుచు భ్రాంతం బుద్భ్రాంతం బాప్లుతం బావిష్కృతం బాహికం బవిధం బకరం బవికరంబు విశ్రుతంబు మానుషంబు నిర్మర్యాదంబు చిత్రంబు భిన్నంబు సవ్యజానువు జానువ క్షిత్తంబు ధృతంబు గుడంబంబు లంబనంబు సవ్యబాహువు వినిబాహువు త్రిబాహువు సవ్యోత్తరం బుత్తరంబు సవ్యకరంబు తుంగబాహువు ప్రదికంబు యోధికం బాపృష్ఠత ప్రహారంబు వల్గితంబు కుంచితంబు స్వస్థికంబునను ద్వాత్రింశత్పచారణ్య వ్యాపారంబుల బచారించి పరిభ్రమించి కొలిచిన బంటులవలె చొరవ గల్పించుకొని బిరుదుమాష్టీలయునికి దండ యేమరక చోరులగతి హెచ్చరిక దప్పక లోభుల కరణిఁ గేలు సడలక వసంతము లాడెడు పెండ్లికొమరుల మాడ్కి యాస నెదురెక్కి పైన జిమ్మి కోమట్ల వహిని లెక్కపెట్టక బచ్చుల సరవి సరకుఁ గొనక నిస్పృహుల విధంబునఁ దృణీకరించి మాంత్రికుల పగిది హుంకృతులు నిగుడించి విటులమేర భయంబులు విడిచి వీరావేశంబుల నట్టహాసంబులు సేసి రోసంబులఁ గోర మీసంబఁ దీఁటుచుఁ గలంగక తొలంగక తిరుగుడుఁ బడక నైదుఁబది సేయక నీరంబులు చెడక బీఱువోక యోడక యొడ్డిగిలక వేసరక వెక్కసంబు వేడుకగదుర నసమసమరంబున సవ్యమండలముగా నుండినం బుండరీకాక్షుని గింకరులు సాహంకారులై శంకింపక కుడివంక పక్కళంబుగాని మొక్కలంబున డాసి కరాచూరుల ఝాటులు వ్రేసిన భిల్లవల్లభు లత్తెఱంగునకుఁ జిత్తంబు హత్తనీక వడి దరగక పాటింపక యోలంబు జూపక నోసరిలక సడలక సందీక వేగిరపడక జిరచిరబరతెంచక చలింపక చాయదరుగనీక గడిదలలూని ఝళిపించియును తాలించియు మించియుఁ గమ్మియుఁ దేకువయుఁ దెలివియు మదంబును మచ్చరంబును వేరంబును వెరవును తెంపును సొంపును నింపుమీఱఁ బిడుగులు బిడుగులు గదిసిన చందంబున ముఖచాళిబూని వారలపై ధాణుధారలుం జూప నప్పట్టున జుట్ట పిట్టలావు నెట్టెంపుఁ దాలుపు బలగంబు స్వస్థికంబున నొడ్డుకొని తమకంబులఁ గమకించుచు హురుమత్తున తూరి యంపరల పరంపరల వెంపరలాడిన హుసియని దొందడిని పుళిందులు కఱకుమీఱి చుఱుకుచూపులు చూచి యెందుబోయెదరు నిలునిలుడను కూతలు సేసి గడుసుగొన్న గడిదలలు బిఱిందికిఁ జొనిపి మేనులు బయలుగాఁ జూచి గోవిందుని సేవకులు చొరఁగూడక పేరములు బాఱి బారితుపాకులు సంధించిన మేనులు వంచి బొంకించి నాగదత్తుండు తనబలంబుల నెచ్చరించి పరుజులో నెడగండ్ర పిటిపట్టుగా హత్తించి పరుఁజించుపూనికకై పరుజించి తగ్గితగ్గి డగ్గరి డిగ్గనం త్రటిత నాట్యములో సేయు జగ్గునకుఁ దమ్మికంటి బలంబంటు వీడక గంటిమి గంటిమి మేలుమేలని పొగడి గదలని గుడియెడ తెగకం బొడిచి వెంబడి మొలపిణెమ్ములు ఝరన దిగిచి యత్తఱి మిడుక దఱిమిక్రుమ్మిన చెమ్మటజెందక తడబడక బుడిబుడి నడల నొడళ్ళు సోఁకనీకుండ చూచి నిలుచుక కఫాలుకఫాలున చూరణిబడిబడి బెడాలున జొచ్చి బిడాబిడి సరిబిత్తరుల మిడుక దఱిమి హత్తిన కడాకిడి కరంబుల యడిదంబులు బెడిదంబులుగా నొకటొకటరొరసి ఝల్లుఝల్లున మిడుగురల రాలుచు వింజామరల క్రోవుల ఠేవఁ గోల మెఱుంగుల తెఱంగునఁ గోలాటమ్ము లాడు బొమ్మలకైవడి మురహరునకుఁ బురవిజయేందిర రతనంపుటారతు లెత్తిన జోతులరీతిఁ గన్పట్టియుండ గండుమీఱి రెండుతెగల నంబులఁ జలంబుల ద్వంద్వయుద్ధంబునకు సన్నద్ధులై యంతటంతట నందందు నక్కడక్కడ నాడాడ జోడులు గూడి పాచికల చొప్పున జంటకరుళ్ళపోలిక పాములదారి తాళపుఁజిప్పలభంగి శస్త్రాశస్త్రి కుంతాకుంతి దండాదండి ఖడ్గాఖడ్గి గదాగది బాహాబాహి ముష్టాముష్టి కచాకచి యోహరిసాహరిం బెనంగుచు మేనులు వంచుచుఁ దటాలున నేదుఁబందుల చాడ్పున నెఱకలు నిట్రబొడువ నొడళ్ళు ఝాడించుచు సరుచు కొసరుచుఁ దిట్టుచుఁ గొట్టుచుఁ బాయుచు డాయుచు జడియుచు నొడియుచుఁ గదలుచుఁ బొదలుచు మిడుకుచు మెడుకుచు వ్రేయుచు రోయుచు విసరుచుఁ గసరుచుఁ జిమ్ముచు రెమ్ముచుఁ బొడుచుచు విడుచుచు నఱుకుచు బెరుకుచు నాఁబోతుల కుమ్ములాట మర్యాదను బెబ్బులులు తారసించిన వరుసను లులాయంబులు తలపడిన వడువునను తగరులు సన్నలదార్కొన్నవీఁక తులువల పోట్లాట మాడ్కి రక్కాముపుంజులు కఱచి కాట్లజుట్టులు గఱచుక నారెలు డుస్సి పాఱువరుస వ్రేటులు వ్రేసిన మెరవడిని చలముఁ గలిగిన పికిలిపిట్టల కిరకిర పెక్కులొక్కని మలపము లిడుచుఁ గిలకొట్టుచు ఱెక్కలార్పుచు లవటీలఁ ద్రిప్పుచుఁ బించములు సేయుచుఁ దల లాడింపుచుఁ గటుకు గటుక్కునఁ బల్లుసోఁక బిరబిరం జుట్టుకొని వెలియైన తావులు ముడిగిన సరసుక కఱచినకాటులు విడక కాళ్ళుపట్టక పడి యెగరోజు సవతునను పిచ్చుకలు కాట్లాడి పట్లుపట్టెడి జోడున నొండొరువుల తనువులు జర్ఝరితంబులై చిఱిగి తరుణమున నరుణమున జొత్తిల్లి జొత్తుపాపల వగను పూఁచిన మోదుగునాగున రౌద్రరసము వెల్లిబర్విన యందంబున మించుచు మఱియుఁ బెక్కువిన్నాణంబులు సేయుచుఁ బక్కటెమ్ములు వమ్ముగా మోకాళ్ళ నూకుచు తలతలం దాకుచు కేలుకేలున జుట్టి యందుకొనుచు రొమ్మురొమ్మునఁ గదియించుచు భుజము భుజమున నొత్తుచు నడుగడుగున దాటింపుచు బీతిజోదులను బడాయింపుచు మదులనెదుగ రోసమ్ములఁ బెంపుచు బెదరి బెదరి కాంచుచు నలసి సొలసి యలఁతజెంది చింతజెంది బడలికనొంది వడమించి సేదగాంచి దిటముడిఁగి రుటమడిఁగి లావులు సడలుచుఁ గొంతకొంత యడలుచు మిడిగ్రుడ్లు బిరబిర ద్రిప్పుచు చక్రమ్ముల నీటున జిరజిరఁ దిరిగి దగల నెగరొప్పుచుఁ జమురు సడలిన దీపంబులకరణి తాల్చిన ప్రత్తివత్తులరూపున నలచిన నిమ్మపండ్లసూటి మధించిన రసము విధానము దారుచు చూరుచు మెడలు నలసియు తొడలు బడసియు మూపులు బగిలియు వీఁపులు నొగిలియు ముక్కులు చదిసియు చెక్కులు గదిసియు ప్రక్కలు వ్రీలియు డొక్కలు చీలియు భీభత్సాద్భుతరసంబులు బెనంగొనఁ బరస్పరవిజయేచ్ఛలఁ జిక్కుదీసినటుల దాయాదుల పాళ్ళు బంచిన యుపమనురాలు వ్రీలిన హవణిక సంజవేళ జక్కవలు కవ లెడబాసిన చందంబున తెరప్రతిమలతులను కాంతలు పొలయల్కల మాఱుమొగంబులు బెట్టిన సొగసున నిరువా గిరువాగై జోడుపట్లు వీడినజాడ తోడనె నిజబలంబులఁ బద్మాక్షుండు జిఱునగవు మొగమునఁ జెంగలింప శాంతస్వాంతంబుతో దయ దైవాఱఁ గనుంగొని కాయంబుల గాయంబులు మాయంజేసి దొమ్మి కయ్యమునకు సెలవిచ్చిన మోహరమ్మగు ననిమొనలో నావేళ దగనేగుఁ బెండ్లి శృంగారరసంబు సంబరాలదినుసున దిక్కులు బిక్కటిల్ల నుల్లరపు బిరుదధ్వజపటపటల పటపటాత్కారంబులు స్యందనఘటితఘంటికాఘణఘణాత్కారంబులు మావంతుల హుంకారంబులు రథికుల సింహనాదంబులు మదావళుల ఘీంకారంబులు వాజిహేషాచమత్కారంబులు రాహుత్తుల ఝూత్కారంబులు వీరభటహంకారపూర్వక కహకహారభటివారంబులు దండిచారుల కలకలారావంబులు క్రెక్కల కైవారంబులు సింజనుల టంకారంబులు నిస్సాణంబుల ధణంధణలు ధమామీల దిందిమ్ములు విజయశంఖంబుల ఘుమంఘుమలు ఫిరంగుల ధింధిమ్ములు జబరుజంగుల ఖంగురింగులు గుంటిక్రోవుల డబ్బుడబ్బులు తుపాకీల ఫెళఫెళలు బాణముల చరచరలు లకోరీల రింగురింగులు పెట్లగ్రోవుల వరుసల ఖంగు పెఠీల్ ఢిమిరింగుకఠీల్ ఢమీల్ ఢాంగుఖణీల్ గుభుల్ చఠాల్ ఢాంఢంకరణశబ్దంబు లబ్జంబుల గర్జల దర్జించి యొక్కమొగి భూనభోంతరంబు భోరుకలంగ నక్కోలాహలంబు విని మునుపనిచేసిన వీరుల వీరరసంబు గని యిఁక నిల్వరాదని యందు నాగదత్తుండు ముందుగాఁ గొందఱు పుళిందులు దక్కఁ దక్కిన బోయలు మందిభయమంది భయానకకరుణారసంబులు కళవళమంద నదరిబెదరి కన్బెదరి యళికి బిట్టుళికి తలఁకి దెసచెడి కలగుండుబడి హల్లకల్లోలమై అతలకులతమై యట్టిట్టై యుఱ్ఱూఁత లూఁగి హఠాత్పలాయనంబుగా నెక్కడనున్నవా రక్కడనుంచి కలవస్తువులు డించి లక్షోపలక్షలు కోటానకోట్లు తండోపతండంబులు పుంఖానుపుంఖంబులు శాఖోపశాఖలు నేలయీనిననటుల మున్నీరు వెల్లివిరిసినవైఖరి పుట్టు యిసుళ్ళ కరణి కాకులజోక కొండమ్రుచ్చులచాగున గాడ్పుచేఁ బోవు చొక్కాకులరేక బుట్టివాయి వెడలు పులుగుల మట్టున చట్టంబుల నెగయు నాకాశబాణంబుల దురుసున నిచ్చవిచ్చల విచ్చుమొగ్గ విరాలిమొగ్గగా కంచుమించై చిందరవందరై చీకాకై తారుమారై పంచబంగాళమై చెల్లాచెదరై గజిబిజియై బెండాబెడగై కకావికలై పటాపంచలై యథాయథలై జలకట్టెల తండంబులై గొఱ్ఱెదాటులై జిరుకుబండమీఁది పోకలై జల్లించి యొకడుపోయిన త్రోవ నొకఁడు బోక నొకనివెంట నొకఁ డంటక నొక్కనిపల్కు నొక్కఁడు వినక నొకనిమొగం బొకఁడు సూడక గొందఱు పిలపిలంబారి యీబారి దప్పిన బలుసాకుఁ దిని బ్రతుకవచ్చు ననుచఁ దిరిగిచూడక కాలికొద్ది వడిఁ జూపువారును గొందఱు బిరబిర బోలేక పొట్టిపొట్టల బరువున బుసకొట్టుచు నడుగులు దడబడ బోరగిలఁబడి యతనిభక్తుల సూటి పొర్లుదండంబుల వగలఁ బొర్లిపొర్లి పోవువారును కొందఱు దులదుల బరతెంచి దడదడ గుండెలు దల్లడములంద గన్నులఁజీకట్లు గ్రమ్మఁ దెరవులు గానక నిండుచెఱువులు జొచ్చి యఱ్ఱులబంటినీళ్ళలో నిలిచి తెలివిదప్పి డప్పియమవారును కొందఱు దుడిదుడిబోయి పదము పదమున దాఁకి మ్రొగ్గి దిగ్గున లేచి కాట్రేడా యీతూకు దరిఁజేర్చితేని నీపొలముచుట్టు క్రొవ్విన మెకంబుల కఱకుట్లు తోరణంబులు గట్టించి జాతరలు సేయించెదమని వేడుకొనువారును కొందఱు బుడిబుడి జని దూపను జాలిబట్టి తెప్పరిలి తమయాకిరాండ్ర సూడఁగలిగిఁ జాలు కంబమురాయా నీకుగల పణ్యారములు సాగింతు మనుచు జగ్గుజగ్గున పరువులెత్తి తొడలు వడంక తొట్రిలి మొగ్గి తగ్గుచు దగ్గుచు గేకరించి నాలుకలఁ దడిలేక నుమియకు లోఁజిక్కి గుఱ్ఱుగుఱ్ఱున మూల్గుచు నీల్గుచుఁ బోవువారును కొందఱు గునగున నేఁగి చేరువఁ బుట్టలఁ జేరువారును కొందఱు నోటిబీగముల దాసళ్ళ పెల్లున నోరులఁ బూరులు గఱువారును కొందఱు తిరునాళ్ళ ప్రజనిజముననో వేంకటేశా శరణు శరణు కావు కావు మని గోవింద లిడువారును కొందఱు బిరబిర గట్టులెక్కువారును కొందఱు దొందుమేనల నిటునటు కదలలేక జీనిపందుల పొందికను రక్తార్ద్రవసత్రంబులతో బ్రాణాచరంబులు మెళకువ నొదిగి తలక్రిందఁ జేతు లిడికొని ‘యో వడ్డికాసులస్వామి యీమాఱు గాచిన బిడ్డలం గని మీపేరుఁ బెట్టెద’ మని మ్రొక్కుచుఁ గన్నులు మోడ్చుకొని యుండువారును కొందఱు దొమ్మరుల గుఱుతన నహహాయని బడితీఁగెల వెంబడి నెగఁబ్రాకువారును కొందఱు బెరుకు బాపనపిసాసి బోయల నమ్మించి తోడుకవచ్చి లచ్చి మగనితోఁ బోరువెట్టుకొని యందఱఁ జంప నెసురుఁ బెట్టెనని మోమోటము లేక చుల్లరపు వాకువాకుల దెప్పిచెప్పి శరబడులం జేరువారును కొందఱా నాగదత్తునిం గనుంగొని “యోరి పాఱుబోయీ నీ గొనం బోరబోయె బెండు మునుఁగుట గుండు దేలుట కప్పకాటు బాపనపోటు గలదా నీవు చింబోతు గంభీరంబున గూబజంకెనలు సేయుచు నిన్నాళ్ళవలె నిన్నాళ్ళలో తెరవాటు గొట్టి పొట్టసాకుచు కక్కొనమేర నీవలె దిరుగక పరుసుబుద్ధి పొడమి కొఱవిఁదల రాచుకొనుచు వైపున నగ్గితో మిడుత యొరసిన బద్ధతి గౌరుతో దోమ ఢీకొను త్రోవ సింగంబుతో జాగిలంబు గవయుజాడ బెబ్బులితోఁ నీఁగపులి యెదిరించిన పొలుపునఁ దమ్మికంటి బలంబుతోఁ గంటుబలాదూరని యెంచక బలాదూరనిన నీనడుమంత్రపు దొరతనము నీబంటునెఱతనము హాస్యరసంబున కాస్పదంబయ్యె నీవే గెలుము పెగ్గెలు మునుపుగ వదలుము యింక నిను గొల్చిన వడిగలతనంబు దక్క” దని మిడిసిపడు మీను కరణి నీటముంచి విడిచిన సొరకాయ యెగసిన నిక్కున బిగిసి మిట్టిపడి కేరడంబులు బల్కు గారుడంబులు సాలించి మెల్లమెల్లనే యవ్వలికి వచ్చి యడిదంబులు విడిచి గరుడగంబంబుల డంబున గండారంబుల బొమ్మల రహిని మౌనుల రేవను చక్కఁగా మేనులు నిసుమంత గదలనీక నిలుచువారును కొందఱు వంకసిగలూడ మొలఁజుట్టిన దట్టులు వీడ బిళ్ళమెట్లవాళ్ళు తునకలై చీరాడసొక్కు వీడెంబు చొంగలు సెలవులపైఁ జిందులాడ మిడిగదలికను కన్నెలేళ్ళవలెఁ జెంగుచెంగున దాఁటి తమపరువులంటు వాలఁగలరే యని కిలార్చి ‘కొలిచిన కొలువులు వీట బోనిమ్మీపాటి గీముల జేరిన మేరలు దక్కు’ నని గ్రక్కున నూడనిబాడువారునునై తనబలంబు చదరంగబలమువంటి హరి చతురంగ బలంబున కూరకయెదారనం బెగ్గడిలనెగ్గి వేఁటకాండ్రు చోపుడువెట్టఁ బొదలు వెల్వడి పిట్ట లెగిరిపోవు చాడ్పున గట్టుల గుట్టల చెఱువుల కురువుల డొంకల వంకల నీరంబులఁ దీరంబులఁ గోనలఁ గానలఁ గలసినయందు కావంత వంతఁ జెందక బలవంతుండై నాగదత్తుండు దన పొత్తున హత్తి సావాసంబుచేసి సాహసంబుగఁ గొలుచు బోయజాతంపు పెద్దవాండ్రతో ‘మీరు కంటిరో కానలేదో పెక్కండ్రు జాతిబోయ లీయెడ నీలాగాయెనైన నేమాయె నామాయలింక సూడుం డీసూడు మీకు దిరుగ మీకొప్పని వారి క్రొవ్వని నణఁగింతు మీరున్నఁ జాలు’ ననిన నామేటితో వార ‘లోరప్ప రవ్వ నీయుప్పు దిన్నవారము గావున తారు నీ తోటివారము యెందుకా కరుమపుసాకిరి లేకున్న నినువంటి జన్నిగట్టులు సాకిరియని సెప్పనేల నీనేల నీనేల చెఱువుతెగి వెల్లువఁ బోయెడి నీళ్ళరిగట్టఁ గూడునా పోయిన ప్రాణంబులు మగుడునా యిత్తడి పుత్తడివలె యొఱకు వచ్చునా సామిదోగులై పాఱిపోయెడి వారు తిరుగ రానేర్తురా హరిదళంబు హరిదళంబు చాయ చూతంతేయీతంతే’ యని పురికొని పలుకు పలుకుల కతండు నిచ్చమెచ్చి యీపరి యందఱ మొక్కచిదుమై వెంటనే గుంపులుడ్డలు తుటుములు మూకలుగా డాకలు మీఱ నాలుగు కోపులతో నీనిన పులుల బాళిని యూతలు గ్రమ్మిన లీలను పొంగుబారిన చాయను వలలు వేసిన పొందిగను సుడిగాలి వీఁచుదెప్పరంబున కొంగలకు దూఱుబైరి డేగలగతిని కణితిరీఁగలు ముసురుకొను భాతిన చుల్లరంబుల మొత్తంబున సివంగులు చుట్టుకొను హరువున సరవత్తుల వేగమున రంజకంబు దినుసున సురటి దిప్పినట్లు తోఁకచిచ్చునాఁగ నెదిర్చిన పగర గుండెలు చిద్రుపలుగ విదిర్చవలె నిలనద్రువ ననుచుఁ దమతమ ముస్తీదులతో సిస్తుగా దోస్తిని చుట్టుముట్టి కోపాటోపంబున— 788

ప్రాసభేదము — అపూర్వప్రయోగము
క. మీసలు మెలిబెట్టుచుఁ గడు
రోసమ్ములు గ్రమ్ముకొనఁ బురోభాగములం
దాశ లద్రువ కేక లిడుచును
దూసినకత్తులను త్రిప్పుడులు గుడుసువడన్. 789

ఉ. వ్రేసినలేదు బంతి యని వ్రేటునవెంబడి జొచ్చి బిత్తఱిన్
డాసి బెళాన లాగెను తటాలున వ్రేసి గుణంబు రాటమున్
సీసము కత్తి చొంగణ నృసింహము కొక్కన కెల్లి బెట్టు య
భ్యాసి విధంబు జూపుచుఁ గిలార్పుచు మే ల్జెగజెట్లకైవడిన్. 790

ఆ. వింగళించి యాటవెలఁది చందంబున
కోపులందు మీఱి యేపుతోన
మిత్రగణము లతి విచిత్రంబైకొన
దైవగణము లెదురఁ దారసించె. 791

బీభత్సరసము
ఉ. తారసమైన యంత బెడిదంబుగలో వెలిదప్పి తెప్పునన్
మోరలు బోరలల్ల చనుముక్కులు ముక్కులు చెక్కి కేలివాల్
దారులు దప్పనీకనని దారు లెఱింగి తమున్ బిరా దునే
దారులు మెచ్చ శాత్రవవిదారులునై జయమంది యున్నెడన్. 792

క. తప్పినవారలు పాఱుడు
దప్పినవారలును గ్రోలి తల్లడ పడుచున్
దప్పటడుగు లిడు చప్పుడు
తప్పుట బాగెము లటంచు దలఁపుచు మదులన్. 793

గీ.సేకరించుక తక్కిన మూకనెల్ల
మాయలెడపగల చుక్క బోయమిన్న
కొదమ సింగమ నాయక గూటికురుజ
ముచ్చుదొర కోలు సన్నాసి చిచ్చుపిడుగ. 794

క. అని యేసబాసఁ బిలుచుచు
ననికిన్ మరల బురికొల్పిన బలమ్ములు సౌ
జనమించుక నెనరించుక
గనఁ గొంచములంచు నెంచకయె పికిలితమిన్. 795

ద్విరుక్తకందము
క. తొకతొకల నుడికి మిడుగుచుఁ
దికతికలై యొండొకళ్ళు దెగుకత్తులబల్
చకచకలు నెసక మెసఁగన్
గకవికలుగ హరిబలంబు కళవళమందన్. 796

మ. శరధిధ్వానసమానమై హలహలచ్ఛబ్దంబు రోధోంతరం
బరికట్టం గరికట్టి దిట్టలయి బోయల్ దాయలై పాయక
ప్పురవీథిన్ బరవీరుల న్గదమ గుంపుల్ గూడి కైజీతముల్
దఱుమ న్బర్విడి స్వామిపుష్కరిణితీర్థంబందు వేఁ గ్రుంకినన్. 797

గీ. అందుఁబడి వారి మేనులయందుఁ గలుగు
బోయినేతల పాపము ల్బోయెఁగనుక
విధుని పదమున కరిగిన విధుని దూత
మానవులు దెచ్చి రతుల విమానచయము. 798

క. ఆదివ్యవిమానంబులఁ
గైదండలు దేవకన్యకామణు లొసఁగన్
మోదమునఁ బారిజాతపుఁ
బూదండలు దాల్చి హరినిఁ బొందిరి వారల్. 799

గీ. ప్రాణభయమ్మున నంతటి పాపకర్ము
లతులగుహ పుష్కరిణిఁ గ్రుంకి హరిఁ గలసిరి
కావలెనటంచుఁ గ్రుంకెడు ఘనుల కెపుడు
భ్రాంతమే కామితార్థవైభవము గనుట. 800

వ. అయ్యవసరంబున ——

సవ్యాపసవ్య సప్తధా వృత్యష్టదిక్పాల తద్వాహన మత్తేభపంచపాది అపూర్వప్రయోగము
మ. హరికీలిన్ శుచి వాసవుల్ రవిజుఁ గాలాగ్నిద్యువుల్ కర్బురున్
నరఖాదార్కి శిఖీంద్రు లవ్వరుణుకే నక్రవ్యభుగ్దండి బ
ర్హిరగారుల్ వలికాప్పదైత్య యమ వహ్నిస్వర్పతుల్ యక్షరై
వరపాబ్ధీశ నిశాట సౌరి జల భూవజ్రుల్ భవుంగూడి గో
హరి సారంగ సువక్ర మానవలు లా యా విద్విరూపాఢులై. 801

త్రివిధదళయుక్తప్రాససీసావకలి ప్రాససంసృష్టిసీసము — అపూర్వప్రయోగము
సీ. చలువ పుట్టువు ఱేని గెలువ పట్టగుమేని
చిలువగట్టునఁ బూని నిలుచువాని
నలువ యోపికనేని నిలువ రూపగరాని
నలువగు రూపూని యలరువాని
కొలువ పోరిడు మౌని చెలువలరు కడాని
చెలువ పేరెదవాని వెలయువాని
కలువగొంగకు లేని బులువగంగను జీని
వలువరింగులు పైని గలుగువాని
గీ. మొనయు వలి పిల్ల లావులా వుల్లమునకు గాని
బొల్లి నెమ్మోము దనరారు పుల్గుఱేని
పల్లటీలను పె ల్లుల్లసిల్లువాని
దాని వరదానిగని వేఱె తలఁపు మాని. 802

అద్భుతోపమ-ప్రాసభేదము
క. చీఁకటి వెన్నెల యెండయు
నేకముహూర్తమునఁ గలసి యిల వెలసె ననన్
శ్రీకాంతయుఁ గౌస్తుభమణి
యాకడ శ్రీవత్స మలరె హరి నీయెదపై. 803

క. ప్రాలంబక భాగ్రీవా
రోలంబకటాక్షయుక్సరోజగృహేశా
సాలంబకాసురాంతక
యాలంబక హేమవైజయంతీధామా. 804

శృంఖలిత వచనరగడ
శ్రీవిహార హారకీర్తి కీర్తి తాబ్జతాబ్జ పుణ్య
పుణ్యకాంతి కాంతి ధామ గోత్ర గోత్ర భూమ
భూమ హారి హారి చక్ర చక్రరాజ రాజరాజ
వీనకాండ కాండభాగ భాగమంద మందరాగ
రాగధారి ధారిదాన దానలోక లోకపాల. 805

ఆది ద్విప్రాసదళమధ్యత్రిప్రాసనియమాంత్య ద్విప్రాసదళ చరణాక్కిలివడి సీసము
సీ. పురహరాదిక సురాసుర దురాసదధరా
ధర వరామిత భరా భరణ దారి
మదవదాకృతి ముదాస్పద మదావళ రదా
గ్రద గదా భుజవదా వదజనౌఘ
ఖల పలాశన బలాతుల బలాహకకులా
ఖిల పలాయన కలా నిల నిభాస్త్ర
భయరయానమదయాన్వయ నియామక జయా
లయ దయారస మయా శయ విలాస
గీ. హేమభూమ సముజ్జ్వల క్షేమధామ
దీన మానస కృష్ణాభి మానదాన
నక్ర విక్రమ హర కరావక్ర చక్ర
పావనావన వేంకటగ్రావ దేవ. 806

భుజంగప్రయాత స్రగ్విణీవృత్త గర్భిత దండకరూప చిత్రసీసము - యెత్తుగీతిద్వ్యక్షరి
సీ. పూతనాదాసుర భ్రాతృ సంత్రాణ సూ
ర్యప్రకాశాకృతీయప్రమేయ
శేషతల్పాకర స్ఫీత శంఖారి గాం
భీర్యవార్థీ స్థితాభీమవంద్య
దంతి రక్షావరాద్వైతమార్గప్రభా
వాత్తచిత్తాధికాయద్రిధైర్య
కంజనేత్రాశరఖ్యాత జీమూత సం
కాశవర్ణాతిగా కంబుకంఠ
గీ. మున్ను ముని మననమ్మున నెమ్మి నోమి
నెమ్మ నమ్మున నిన్ను నే నమ్మినాను
నేమమున నేమమున నెన్ను నీమనమున
మేన నున్నని నెమ్మేని మీనుమిన్న. 807

(పైపద్యమునందలి గర్భితవృత్తములు)
గర్భితభుజంగప్రయాతము
సురభ్రాతృ సంత్రాణ సూర్యప్రకాశా
కరస్ఫీత శంభారి గాంభీర్య వార్థీ
వరాద్వైతమార్గ ప్రభావాత్తచిత్తా
శరఖ్యాత జీమూత సంకాశవర్ణా.

ప్రబంధరాజ వేంకటేశ్వర

గర్భితస్రగ్విణివృత్తము
భ్రాతృసంత్రాణ సూర్యప్రకాశకృతీ
స్పీత శంఖారి గాంభీర్య వార్ధీ స్థితా
ద్వైతమార్గ ప్రభావాత్త చిత్తాధికా
ఖ్యాతజీమూతసంకాశవర్ణాతిగా.

బహువిధచిత్రకంకణ బంధద్విగుణితసీసచరణ చతుష్టయగర్భిత, ద్విపద, కందద్వయ, సమవృత్త, చౌపదయుగళాటవెలఁది, తేటగీతి, మదనవిలసిత, తురంగవృత్త, బహువిధతాళవృత్తాష్టక, ధవళ, శోభాన, గానారాత్రిక, గానజంపె, త్రిపుటార్థచంద్రిక, సువ్వాల, లాలిపదేలా, మంజరి, సమతాడిండిమతాళవృత్త, మణిగణవికర, తురగవల్గనరగడోదాహరణసంబుద్ధి కలికోత్కలికార్థాహిరీరాగదళ, ముఖారిరాగాటతాళదళ, కాంభోదిరాగరూపకతాళదళ, కాంభోదిరాగసమపద, కన్నడరాగసాంగత్య, కొరవంజిదళరేవగుప్తిరాగసమపదసావేరిరాగైకతాళదళ, బిలహరిరాగాటతాళసమపద, పుష్పమాలికాబంధ, గోమూత్రికాబంధ, సార్గ్ఙబంధ, షోడశదళపద్మబంధ, పాదుకాబంధ, నవరంగబంధ, ఖడ్గబంధ, గుచ్ఛబంద, ఛత్రబంధ, చామరబంధ, గదాబంధ, చక్రబంధ, శకటబంధ, నాగబంధ, రథబంధ, వీణాబంధ, శంఖబంధ, మదంగబంధ, పాదభ్రమకబంధ, పాదార్థభ్రమకవింశంతిబంధ భేదకందానుష్టుప్-శ్లోకాంతరంగత, చతుర్భద్ర, నవరంగ, సర్వతోభద్రాందోళికాబంధయుక్తానులోమవిలోమకంద, భాషాశ్లేషకంద, కందాటవెలఁదిగర్భితాంత్యతేటగీతియుక్తచౌషష్టిభేదచిత్రసీసము
సీ. సారాగ్ర్యసారస సమనేత్రయుగళ నా
రదరుచికాంతి నర ఘనపనిత
సారాగధీర విశదవీన తురగ భై
రవభవ జైత్రభర శుభకరణ
సారాతిహార విసరచారణహరిసా
రసహిత చంద్రశరజజయనుత
వారాశినారదవర పూజితపద గౌ
రవకటిఖడ్గ గరళగళ సఖ విజయవిలాసము

గీ. హరినగనిలయ గిరిధర యసురదశన
మణిమయమకుట సురమణి మధువిశరణ
కరివరదకు వరరుచితరవసన న
రహరి లసితదర నిగమ విహరణహరి. 808

(పైపద్యమునందలి గర్భితములు)

1. ద్విపద
సారాగ్ర్యసారస సమనేత్రయుగళ
నారదరుచికాంతి నరఘనపనిత
సారాగధీరవి శదవీనతురగ
భైరవభవజైత్ర భరశుభకరణ
సారాతిహార విసరణ చారణహరి
సారసహితచంద్ర శరజజయనత
వారాశినారద వరపూజితపద
గౌరవకటిఖడ్గ గరళగళసఖ
2. ప్రథమకందము
సారస సమనేత్రయుగళ
నారదరుచికాంతి నరఘనపనితసారా
గధీరవిశద వీనతురగ
భైరవభవజైత్రభర శుభకరణసారా.
3. ద్వితీయకందము
హార విసరచారణ హరి
సారసహితచంద్రశరజ జయనుతవారా
నారదవరపూజితపద
గౌరవకటి ఖడ్గగరళగళసఖ సారా.
4. సమవృత్తము
సారాసారస సమనేత్రయుగళ | సారాధీరవిశదవీనతురగ
సారాహారవిసరచారణహరి | వారా నారదవర పూజితపద ప్రబంధరాజ వేంకటేశ్వర

5. ప్రథమ మహానవమి చౌపది
సారాగ్ర్యసారస సమనేత్రయుగళ
నారదరుచికాంతినరఘనపనిత
సారాగధీరవిశదవీనతురగ
భైరవభవజైత్ర భవశుభకరణ.
6. ద్వితీయ మహానవమి చౌపది
సారాతిహార విసరచారణ హరి
సారసహితచంద్రశరజ జయనుత
వారాశి నారదవర పూజితపద
గౌరవకటిఖడ్గగరళగళసఖ.
7. ఆటవెలఁది
నారదరుచికాంతి నరఘనపనితసా
భైరవభవ జైత్రభర శుభకర
సారసహితచంద్ర శరజజయనుతవా
గౌరవకటిఖడ్గగరళగళసఖ.
8. తేటగీతి
సారససమనేత్రయుగళ నారదరుచి
ధీరవిశదవీనతురగభైరవభవ
హారవిసరచారణహరిసారసహిత
నారదవరపూజితపదగౌరవకటి.
9. మదనవిలసిత వృత్తము
నర ఘనపనితా
భర శుభకరణా
శరజజయనుతా
గరళగళసఖా.
10. తురంగవృత్తము
తానాతానన. సారససమనేత్రయుగళ నారదరుచికాంతి నరఘనపనిత
ధీరవిశదవీనతురగ భైరవభవజైత్ర భరశుభకర
హారవిసరచారణహరి సారసహితచంద్ర శరజజయనుత
నారదవరపూజితపద గౌరవకటి ఖడ్గ గరళసఖ. విజయవిలాసము

11. బహువిధతాళవృత్తము
తానాతందనతానా. నారదరుచి ధీరవిశద
భైరవ భవహారవిసర
చారణహరి సారసహిత
నారదవరగౌరవకటి.
12. అష్టకము
సారససమనేత్రయుగళ | నారదరుచినరఘనపనితా
ధీరవిశద వీనతురగ | భైరవభవభరశుభా
హారవిసరచారణహరి | సారసహితజయనుతా
నారదవరపూజితపద | గౌరవకటిఖడ్గసా.
13. ధవళము
సారససమనేత్రయుగళ
నారద నరఘన పనిత
ధీరవిశద వీనతురగ
భైరవభవ శుభకరణ.
14. శోభాస
సారససమనేత్రయుగళ
ధీరవిశద వీనతురగ
హారవిసర చారణహరి
నారదవరపూజితపద.
15. హారతి అనఁగా నారాత్రికము
సారాగ్ర్యసారస సమనేత్రయుగళఘన
భైరవభవజైత్రభర శుభకర
సారాతిహార విసర చారణ హరిజయ
గౌరవకటి ఖడ్గ గరళ గళసఖ.
16. జంపె
సారాగ్ర్యసారస సమనేత్రనరనుత
గౌరవకటి ఖడ్గ గరళ గళసఖ ప్రబంధరాజ వేంకటేశ్వర

17. త్రిపురరేకులు
హారవిసరచారణ హరిసారసహిత చంద్ర జయనుత
నారదవర పూజితపద గౌరవకటి
నారద రుచికాంతి నరఘన సారస సమనేత్రయుగళ
ధీరవిశద వీన తురగ భైరవభవ.
18. అర్ధచంద్రికలు
కరివరదకు వర | హరినగ నిలయ
19. సువ్వాల
సారససమనేత్రయుగళ
నారద రుచి నరఘన
ధీరవిశద వీనతురగ
భైరవభవ
20. లాలి
సారససమనేత్ర నారదరుచి
భైరవభవ జైత్రభర శుభకరణ
21. ఏల
ధీరవిశద వీన తురగ | సారసమనేత్రయుగళ
హార విసరచారణ హరి | సారసహిత నారదవరపూజితపద
22. మంజరి
నారదరుచి కాంతినరఘన పనిత
వీనతురగ హార విసర శుభకర
సారస సమనేత్ర చంద్ర జయనత
శరజవారాశి విశద పూజితపద
మధువిశరణ మణిమయ మకుట హరి
కరివరద హరినగ నిలయనిగమ.
23. సమతాడిండిమతాళవృత్తము
తక్కతోంగ ధిక్కతోంగ ధిమితతోంగ ధిమితతా
తనన తనన తనన తనన తనన తనన తనననా| విజయవిలాసము

సారససమనేత్ర యుగళ నారదరుచి నరఘనా
ధీరవిశద వీనతురగ భైరవ భవ భర శుభా
హారవిసరచారణహరి సారసహిత జయనుతా
నారదవర పూజితపద గౌరవకటి ఖడ్గగా
హరిన గనిల యగిరి ధరయ సురద ళనమ ణిమయమా.
24. మణిగణనికరము
నరఘననుతభవ భరశుభకరణా
హరిజయనుత వరగరళ గళసఖా
సురమణిమధు విహహరినగ నిలయా
కరివరదకువర నరహరి నిగమా.
25. తురగవల్గనరగడ
హారవిసర చారణహరి సారసహిత చంద్రశరజ
నారదవర పూజిత పద గౌరవకటి గరళ గళస
ధీరవిశద వీనతురగ భైరవ భవభర శుభకర
సారస సమనేత్ర యుగళ నారదరుచి నరఘననుత.
26. ఉదాహరణ సంబుద్ధికళికార్ధము
గౌరవకటి గరళ గళస హారవిసర చారణహరి
సారసహిత చంద్రశరజ నారదవర పూజితపద
భైరవభవ భర శుభకర సారస సమనేత్ర యుగళ
నారద రుచి నరఘననుత ధీరవిశద వీనతురగ.
27. ఉత్కళికార్ధము
హరినగనిలయ గిరిధరయ | సురదళన మణిమయ మకుట
సురమణి కరివరదకువర | నరహరి లసిత దరనిగమ.
28. ఆహిరీరాగదరువు
సారాగ్ర్యసారస సమనేత్ర యుగళ
సారాగధీర విశద వీనతురగ
29. ముఖారిరాగదరువు-ఆటతాళము
సారాగ్ర్యసారస సమనేత్రయుగళ
భైరవ భవజైత్ర భరశుభకరణా. ప్రబంధరాజ వేంకటేశ్వర

30. ఎఱుకల కాంభోదిరాగదరువు-రూపకతాళము
సారాతిహార విసర చారణహరి
వారాశి నారదవర పూజితపద.
31. కాంభోదిరాగసమపదదరువు
సారస సమనేత్రయుగళ
నారదరుచి కాంతినరఘనపనిత
సారాగధీర విశద వీనతురగ
భైరవ భవజైత్రభర శుభ కరణ.
32. కన్నడరాగ సాంగత్యదరువు పదము
సారాగ్ర్యసారస సమనేత్రయుగళ
నారదరుచి కాంతి నరఘన పనిత
సారాగధీర విశద వీనతురగ
భైరవ భవజైత్ర భరశుభకరణ.
33. కొరవంజిదళ రేవగుప్తి రాగ సమపద దరువు
సారాతి హార విసర చారణహరి
సారసహిత చంద్ర శరజ జయనుత
వారాశి నారదవర పూజితపద
గౌరవకటి ఖడ్గ గరళగళ సఖ.
34. సావేరి రాగైక తాళదరువు
హరినగనిలయ గిరిధర
యసుర దళన మణిమయ మకుట
సురమణిమధు విశరణ
కరివరద సువరలసితవర.
35. బిలహరిరాగట తాళ సమపద దరువు
సారాగధీర విశదవీన తురగ
నారదరుచి కాంతి నరఘన పనిత.
36. వింశతిబంధకందం
క. సారవరహార వారా!
సారహరీనరహరి హర శరకర సారా!
గౌరధర ధీరచారా!
సారహరీ సురహరి నరసరసారభరా!
విజయవిలాసము

37. అనుష్టుప్ శ్లోకము
సారాసారరసారాసా
రాగ హార రహాగరా
సహాయసా సాయహాసా
రరసామమసారర.
38. ఆందోళికాబంధ యుక్తానులోమ విలోమ కందము
మారామా సాదయభర
భారశరాసాజలజ సువదన నిజరసా
సారజనినదవసుజలజ
సారాశరభార భయద సామారామా.
39. భాషాశ్లేషకందము
మేలా నాయక బలిరా
యేలా చలమానగాన దేరాలివల
న్నీలాగీ తీరగునా
వేలము దయ కావగదర వేంకటరమణా.
40. ఎత్తుగీతియందలి కందము
హరినగనిలయ గిరిధరయ
సురధళన మణిమయ మకుట సురమణి మధువీ
శరణ కరివరద కువరరు
చిరతర వసన నరహరి లసిత దరనిగమా.
41. ఎత్తుగీతియందలి ఆటవెలఁది
హరి నగనిలయ గిరిధరయసుర దళన
మణిమయమకుట సురమణి మధువిశ
రణకరి వరద కువర రుచితరవస
న నరహరిలసిత దరనిగమ విహ.

(శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారి జ్ఞాపిక - పైపద్యమునందలి గర్భితమును, బంధభేదములును జేరి చౌషష్ఠి భేదములని యెఱుంగునది. మఱియు అనుష్టుప్ శ్లోకమునకు అనులోమ విలోమ కందమునకు రెండు వర్ణములును భాషాశ్లేషకందమునకు నాఱువర్ణములును నీసీసములోనివి కావని యెఱుంగునది.)

ఆది చతుశ్చరణ గర్భితమత్తేభవిక్రీడితవృత్త తదంతర్గత షడక్షర సమవృత్తోత్తరగీతి గర్భితకంద విభాసమానసీసము


సీ. సవినయాచారవిచారతత్పర మహా
వేదాంత విద్వందితాది దేవ
సుజనవర్యామితశోభనైకఘటనా
చాతుర్యలీలాస్పదాతతాత్మ
భవన చారిప్రతిపారికాంక్షి హృద
యాబ్జాతద్విరేఫాకృతీతగాత్ర
భువనరాశీశ్వర పుత్రికాభినుత
సద్వస్తు ప్రదానోత్సవాత్యుదార
గీ. గురుతర దయాసముజ్జ్వలయ దీరికర
దారితారిహస్తివరద వారిరుహన
యనవసుఘటితాంబరధర ఘననిభతను
విభ ఫణిగిరివాసా నిత్యశుభవిలాస. 809

1. గర్భితమత్తేభవిక్రీడితవృత్తము
వినయాచారవిచారతత్పర మహావేదాంతవిద్వందితా
జనవర్యామితశోభనైకఘటనాచాతుర్యలీలాస్పదా
వనచారిప్రతిపారికాంక్షి హృదయాబ్జాతద్విరేఫాకృతీ
వనరాశీశ్వర పుత్రికాభినుత సద్వస్తు ప్రదానోత్సవా
2. గర్భితషడక్షరసమవృత్తము
వినయాచారవి | జనవర్యామిత
వనచారిప్రతి | వనరాశీశ్వర
3. గర్భితకందము
గురుతర దయాసముజ్జ్వల
యరిదరికరదారితారి హస్తివ రదవా
రిరుహనయనవ ఘటితాం

బరధర ఘననిభతనువిభ ఫణిగిరివాసా.

ఆది చతుశ్చరణ గర్భితమత్తేభవిక్రీడితవృత్త వృత్తోత్తరగీతి గర్భితకంద విభాసమానసీసము


సీ. మహితనానామునిమండలీవిరచితా
హీనాతివేల్లత్త్సవానుషంగ
వితతజన్యాంగణ విక్రమక్రమలస
త్క్రవ్యాద సంహారకానుభావ
వినత బర్హిర్ముఖ విస్ఫురన్మకుటర
త్నశ్రేణి రాజత్పదాభిరామ
విగతవిశ్రాణన విస్మయ స్మయదివౌ
కశ్శాభిజైవాతృకాది దాన
గీ. నిరుపమకృపాంపయోంబుధి నిరతశుభద
ధీరచరిత నిర్మలతర దేహరుచిజి
త సజల జలదాయురగేంద్ర ధరణిధరవ
రయురు సుగుణనిధీ పక్షిరాజవాహ. 810
1. గర్భితమత్తేభవిక్రీడితవృత్తము
హితనానామునిమండలీవిరచితా హీనాతివేల్లత్త్సవా
తతజన్యాంగణ విక్రమక్రమలసత్క్రవ్యాద సంహారకా
నత బర్హిర్ముఖ విస్ఫురన్మకుటరత్నశ్రేణి రాజత్పదా
గతవిశ్రాణన విస్మయ స్మయదివౌ కశ్శాభిజైవాతృకా.
2. గర్భితకందము
నిరుపమకృపాంపయోంబుధి
నిరతశుభద ధీరచరిత నిర్మలతర దే
హరుచిజిత సజలజలదా
యురగేంద్ర ధరణిధరవరయురు సుగుణనిధీ.

అత్వేత్వోత్వతురంగవృత్తఘటిత చతుశ్చరణసీసము
అపూర్వప్రయోగము
సీ. పద్మసంభవ శక్రపర్వత వరధర్మ
ధర వచనస్తవ్యనరసహచర
సిరికిని క్షితికిని విరివిని జిగినించి
సిరిగిరి నిలిచితి చిత్స్థితినిధి బుధులును గురులును పుణ్యులు
నుతులుంచు మురువుకు శ్రుతులు గుఱుతు
లుగ జగత్రయి ధగద్ధగల గత్ఖగవర
ధ్వజమరుద్ధతిఖల ధ్వజినిమ్రగ్గ
గీ. నమరు మరుఁగన్నజియ్య దృప్తమరుజియ్య
జియ్య విశదాంతరీపనికాయ్య భుజగ
శయ్యపావళీసమిద్ధాయ్య సమితి
శాయ్యనర్ఘ్యగుణాక్షయ్య చక్కనయ్య.

చిత్రసీసము
సీ. నీరజదేహకాంతి రజనీకర వక్త్ర
జలధినయన రవి శశినయనయు
గా రజనీచరవార దళారిక
రాఫణిపతికు ధరవర నిలయ
గరుడ తురంగ చంక్రమణ కౌతుకచిత్త
వారిజోదరనర వాసవనుత
మహిమ యలర్మేలుమంగా హృదంబుజ
భృంగాయనాథాంతరంగ కువర
గీ. పారికాంక్షికరక్ష పంకేరుహాక్ష
చారుకౌస్తుభవక్ష జన్యారిశిక్ష
పురహరణ సఖయమరకింపురుష గరుడ
సిద్ధసాధ్య విద్యాధరసేవితపద. 812

ఏకగణయుక్తైక నియమానుప్రాస షట్కఘటిత చరణాక్కిలి వడి సీసము
సీ. తులలేని యలమేని కలవోని వలఱేని
సొలపాని కలనూని నిలఁగలాఁడ
అరిదాపు తరిరూపు కరిదాపు దరిజూపు
నరిపైపు నెఱిప్రాపు కరమువాఁడ
పొగరొందు తొగవిందు సిగబొందు తగఁజెందు
మగపొందు సొగసొందు మగువతోడ
యలమించు నలమించు తలమించు తలమంచు
నలయించు చలముంచు వలపుఱేడ గీ. పాపరాపగ జిగిబిగి పక్కి జక్కి
నెక్కు నెక్కువఠేవ సొంపెక్కు దేవ
గిబ్బ గుబ్బలి నడుదిబ్బ నుబ్బు కబ్బి
తమ్మిముద్దియ గద్దియ తాతతాత. 813

ముక్తపదగ్రస్తవిశేషాక్కిలివడిసీసము
సీ. ఘనకీర్తి జితశరద్ఘనసారఘనసార
సారకుమార కాసారసార
సారభట్యుద్ధతా శరవారవార
వారణార్తి ప్రతీకారకార
కారారిదళిత శేఖరధీర ఖరదీర
ధీర భక్త శుభదోదారదార
దారదాతిక్రూర దవచార దవచార
చారచరాపదుద్ధారధార
గీ. ధారణీధార ధారరాద్ధైర్యహార
హారనుతిపారపారమ్యదారితార
తారకాకారకారణాత్మకవిహార
హారమతదూర మారశృంగారగార. 814

యతిభేదవిభక్తియుక్త సీసద్వయావలికడిసీసము
సీ. అబ్ధి కన్యాతి భోగైక పారంగత
మాంసాశనేశ సంహారతేజ
రమ్యతరాది నారాయణ విగ్రహ
హారి వైణవకలాలాప నినద
హేవాక పాండురద్వీపమధ్యశయాన
ఋషికులవినుత వర్ధిష్ణుమహిమ
తజ్ఞత్వరహితాస్మదహన కారణనామ
నాస్తివాదజనచేతోబ్జదూర
గీ. యిరువు గనుపట్టు చలువతెమ్మెర రతీబు
దాడితత్తడి సాది కడంగరియ్య
హయసఖ యలరుమేలు మంగమ్మఱేఁడ
హెచ్చు సొన్నంపువల్వ ధరించుమేటి. 815 సంస్కృత విభక్త్యంతసీసము
సీ. తావక నగజల స్నాత పాపహరాయ
యతిమాత్ర సాధన జ్ఞానదాయ
యాపద్దశాప్తి వేదండ భీదళనాయ
రాజితశ్రీవత్సలక్షణాయ
వాఙ్మదుభవగీతలగ్నచేతస్కాయ
ముచికుంద ముఖభక్తపూజితాయ
తతవీచిమాలి బంధాగ్రనాళీకాయ
పార్వతీప్రాణేశవర్ణితాయ
గీ. జలజవాస్తవ్యకలశీకుచప్రియాయ
పరశురామవిపాటనభంజనాయ
సవనధారీశరీరాయ శంఖచక్ర
హస్తపద్మయుగాయ తుభ్యం నమోస్తు. 816

చతుర్విధకందము
1. వనజాయతాక్ష వాసవ
వినుతా యురగేంద్రశయన విశ్రుతచరితా
వినతా సుతాశ్వశరజిత
వనధీ తిరువేంకటేశ వారణవరదా. 817
2. ఉరగేంద్రశయన విశ్రుత
చరితా వినతా సుతాశ్వశరజిత వనధీ
తిరువేంకటేశ వారణ
వరదా వనజాయతాక్ష వాసవవినుతా.
3. వినతా సుతాశ్వశరజిత
వనధీ తిరువేంకటేశ వారణవరదా
వనజాయతాక్ష వాసవ
వినుతా యురగేంద్రశయన విశ్రుతచరితా.
4. తిరువేంకటేశ వారణ
వరదా వనజాయతాక్ష వాసవవినుతా
యురగేంద్రశయన విశ్రుత
చరితా వినతా సుతాశ్వశరజిత వనధీ. నవాక్షర సమవృత్త కందద్వయ మణిగణనికరగర్భిత సరసిజవృత్త పంచవిధవృత్తము
సరసిజవృత్తము
శ్రీలోలా చంద్రాలయ చేలాశ్రిత । సురచయ తనుజిత సజలఘనా
వ్యాలగ్రావావాలదయాళూ । హతదితి సుతపతిహరి సమగమనా
బాలార్కాభాశైల దపాలా । ప్రతతభువనచయభరణ నరసఖా
జాలోద్వేలా ఖేలనశైలీ । సతతము గొలుతుము సరవి మనుపుమీ. 818
(ఈవృత్తమున నేకతాళి యర్ధచంద్రిక లెనిమిది ఱేకులు సరిగాఁ బొందుపఱచి యున్నవి గాన సరిచూచుకొనునది. (పూ.రా.))

1. గర్భిత నవాక్షరపాద సమవృత్తము
శ్రీలోలా చంద్రాలయ చేలా । వ్యాలగ్రావావాల దయాళూ
బాలార్కాభా శైలదపాలా । జాలోద్వేలా ఖేలనశైలీ

2. గర్భితప్రథమకందము
శ్రీలోలా చంద్రాలయ
చేలాశ్రిత సురచయ తనుజిత సజలఘనా
వ్యాలగ్రావావాలద । యాళూ హతదితి సుతపతి హరిసమగమనా

3. గర్భితద్వితీయకందము
బాలార్కాభా శైలద । పాలా ప్రతతభువనచయభరణ నరసఖా
జాలోద్వేలా ఖేలన । శైలీ సతతము గొలుతుము సరవి మనుపుమీ.

4. గర్భితమణిగణనికరవృత్తము
శ్రిత సురచయ తనుజిత సజలఘనా
హతదితి సుతపతిహరి సమగమనా
ప్రతతభువనచయభరణ నరసఖా
సతతము గొలుతుము సరవి మనుపుమీ.

ఏకసమాససీసము - అపూర్వప్రయోగము
సీ. కలిగెఁ గానిపు డబ్జదళగళన్మకరంద
ఝలతుందిలమిళిందకులనినాద
డిండిమమండలీఢిమిఢిమినిర్ఘోష
విలసితశోణకువలయముకుళ
కైతవదనదీపీకాశ్రేణికాద్యుతి
జాతవాతాహతచరితతుంగ
రంగత్తరంగస్ఫురచ్చామరాదిమ
మంగళబిరుదాంగమహిమకలిత
గీ. వర్ణనీయాపగాఢ్యసాత్వప్రభావ
ధుర్యగంగాగ్రదన్మహేతుప్రశస్త
హలకులిశమత్స్యపద్మాంకుశాతపత్ర
భవ్యమహనీయతావకపాదసేవ. 819

అన్యోఢ
సీ. కోరకైదువ గుంపు గురికాని దాఁగిలి
మూతలాటల కన్ను చేత మాటి
వారణేంద్రునిపైని నేరము ఘటియించి
చిఱునవ్వు మోడిచేఁ జెక్కుఁ గొట్టి
దంష్ట్రిని బొలయల్క దారిజూపుచుఁ దనుఁ
బేరుకోవలదని నోరుమూసి
విమలకులాచలేంద్రము నెన్నగ యఘన
స్థితి జెదరంగ గద్దించి చూచి
గీ. కీర్తికాంతవిధాన నీ క్షితివధూటి
వలచి నీబాహుసంకేతతలముఁ జేరె
నిసువు వలిపగరాపేరి నేలదారి
నడియు దిరిమేడ నడయాడు కొడిమెలాఁడ. 820

ద్విపద మత్తకోకిల కందగర్భిత సీసము
సీ. సారసోద్భవ శర్వ సన్నుత సారవా
రణ రక్షణావసు రమ్యనేత్ర
ధారుణీతనయాది ధర్మవిధారి దా
రుణశిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార నీ
రజవీక్షణానిధిరాజదాన
పారికాంక్షికసత్కృపారస భారపా
రసులక్షణాపటురమ్యకృతిస
గీ. సవితృబింబ వసతి సౌర సమాదక
విజయ భూతరాజ విదితధీర
వేదవేద్యయ భవ వేదాంత తత్వజ్ఞ
యసురనాశ! వేంకటాచలేశ! 821

1. గర్భితద్విపదము
సారసోద్భవ శర్వ సన్నుతసార
వారణ రక్షణా వసురమ్య నేత్ర
ధారుణీ తనయాది ధర్మవిధారి
దారుణ శిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార
నీరజ వీక్షణా నిధిరాజదాన
పారికాంక్షిక సత్కృపారసభార
పారసులక్షణా పటురమ్యకృతిస
2. గర్భితమత్తకోకిల
సారసోద్భవ శర్వసన్నుత సారవారణ రక్షణా
ధారుణీ తనయాది ధర్మవిధారిదారుణ శిక్షణా
హారమానసయుక్త హారివిహార నీరజ వీక్షణా
పారికాంక్షిక సత్కృపారస భారపార సులక్షణా
3. గర్భితకందము
వసురమ్యనేత్ర తతరూ
పసారనిధిరాజదానపటు రమ్యకృతీ
ససవితృ బింబవసతి సౌ
రసమాదకవిజయభూత రాజవిదితధీ

శ్లోకగర్భితచంపకమాలికావృత్తము
చ. నరసఖ నారశాయి నరనాథ నతామర నారదస్తుతా
దరకర ధారదేహ ధరధారి ధరాధిపదారితా శరా
హరిబలహారి కంఠహర హారిహతాహిత హార హృద్భివా
స్థిరతర సీరపాణి శివ శీలజితాసుర సింధుబంధనా. 822

1. గర్భితశ్లోకము
శ్లో. నరనాధనతామర నారదస్తుతా
ధరధారి ధరాధిప దారిత శరా
హరహారి హతాహిత హారహృద్భిదా
శివశీలజితాసుర సింధుబంధనా.

2. గర్భితగీతి
నారదస్తుత నరనాథ నారశాయి
దారితాశర ధరధారి ధారదేహ
హారహృద్భిదహర హారిహారికంఠ
సింధుబంధన శివశీల సీరపాణి.

అసంగత్యలంకారసీసము
సీ. స్తంభంబు లొదవెను దైత్యదేహంబులఁ
బ్రళయము ల్బొడమెఁ దత్పట్టణములఁ
రోమాంచములు మించె భీమవిక్రములెడఁ
బ్రభవిల్లె చెమటలు పందలందు
మొక్కలిదొరల మోముల వివర్ణతఁ దోఁచెఁ
బగటువాతెగలఁ గంపములు గలిగె
గడిమన్నెచెలుల కన్గవల నశ్రువు లూఱె
శఠుల సూక్తులను వైస్వర్యమబ్బె
గీ. వింత యిదిగాదె నినుఁ జూచి విజయలక్ష్మి
పొందుగను సాత్వకోదయమందు నంత
కంటి విన్కలిదంట పేరింటి గంటి
నడుమ నెలకొన్న వేంకటనాథ శౌరి. 823

కార్యకారణ విపర్యయ రూపాతిశయోక్త్యలంకారైకావళిసంసృష్టిసీసము
సీ. భవదీయ బలరజఃపాళి సంధ్యకుమున్నె
తాఁగ్రుంకు దనుజప్రతాపహేళి
యాహేళి యస్తాగమందుఁ గ్రుంకకమున్నె
నలరుఁ దద్రిపు దుర్యశోంధకార
మాయాంధకారౌఘ మాక్రమించకమున్నె
బొడముఁ దావక కీర్తి పూర్ణచంద్రుఁ
డాచంద్రుఁ డుదయాద్రి నవతరించకమున్నె
కొమరొందు సజ్జనకుముద నివహ
గీ. మహహ హిమధర బహుతట కుహర విహర
మాణ సురసరి దురతర మధురనినద
దళన చణజయదరరవకలిత హృదయ
మానిత శుభాకృతివిలాస శ్రీనివాస. 824

కందద్వయగర్భిత భాస్కరవిలసితవృత్తము ముద్రాలంకారము
పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతతవిహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుదసితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా. 825

1. గర్భితప్రథమకందము
పంకజదళ నిభలోచన
శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ
పంకోరస్థలకృతపద వననిధి కన్యా
2. గర్భితద్వితీయకందము
లంకృత మణిగణభూషణ
యంకీకృత మృదుగతి మరుదసితశరీరా
వేంకటగిరివర రుచ్యక
లంకా భాస్కరవిలసిత లగదరిహస్తా
ఈ వృత్తముపేరు భాస్కరవిలసితము అని పద్యంలో రావడం వల్ల ఇది ముద్రాలంకారమౌతుంది.

ప్రమితాక్షరవృత్త కందగర్భిత నాగబంధయుక్తి చంపకమాలికావృత్తము
చ. ఘనఖగరాజమాన హయగాయగదస్థిరనాగ భోగహా
జనజగతీతలేనవర సారకనన్నిజ భోగమోదనా
నననగవాహలూన భయ న్యాయగ తీవ్రత రాగదీనపా
యన యగధీరమానజయదా యరిగర్వహరాగ వాతిగా. 826

గర్భితప్రమితాక్షరవృత్తము
1. ఖగరాజ మానహయ గాయగదా
జగతీ తలేన వరసారకన
న్నగవాహలూన భయన్యాయగతీ
యగధీరమాన జయ దాయరిగా.

గర్భితకందము
2. ఖగరాజమాన హయగా
యగద స్థిరనాగభోగహాజనజగతీ
నరవాహలూనభయన్యా
యగ తీవ్రతరాగ దీన పాయనయగధీ.

గోమూత్రికాబంధ చతుష్కందము
1. శరణాగత జనకాతర
వరదానవ కృష్ణ ఘనసుభతనూవివరా
వరభోగరాజభీకా
సురవార వినయ కృతఘన సువ్రతకవిరా.
2.వరభోగరాజభీకా
సురవార వినయ కృతఘన సువ్రతకవిరా
శరణాగత జనకాతర
వరదానవ కృష్ణ ఘనసుభతనూవివరా
3. నవ కృష్ణ ఘనసుభతనూ
వివరావర భోగరాజ భీకాసురవా
రవినయకృతఘనసువ్రత
కవిరాశరణాగత జనకాతరవరదా
4. రవినయ కృతఘన సువ్రత
కవిరాశరణాగత జనకాతరవరదా
నవ కృష్ణ ఘనసుభతనూ
వివరావరభోగరాజభీకాసురవా. 827

ధ్వని
క. దీనులయెడ ముంగిళ్ళ ని
దానమవై యన్యదేవత లొసంగఁగ లే
రేనాట నెంచి చూచిన
యానన దరహాస వేంకటాచలవాసా. 828

వ్యతిరేకమాలికాలంకారసీసము
సీ. తెల్లనై తళతళ ల్జల్లునందమె గాని
చల్లనగాదు వజ్రంపుఁబలక
చల్లనై వెలిమిన్న లుల్లసిల్లునె గాని
వాసన నీదు ముక్తాసరంబు
వాసనమించు చల్వయుఁ జూపునేకాని
యలరునె తియ్యనై మలయజంబు
తియ్యఁదనము చల్వ తెలినిగ్గుతావి జెం
దునె కాని యంతటఁ దనరునె సుధ
గీ. చలువ వెలయించు దివ్యవాసనలు నించుఁ
దియ్యఁదన ముంచు జగముల తెలివిగాంచు
నవుర భవదీయ మహనీయ ధవళకీర్తి
శేషశైలనివాస లక్ష్మీనివాస. 829

కటారికాబంధకందము
క. సారతరశూరబుధమం
దారాహారాభిరామ దాక్షిణ్యనిధీ
ధీరాగ్రేసరరిపు సం
హారా భీమప్రతాప యసురవిరోధీ. 830

మంజరీగీతి గర్భిత చరణవహమహానాగబంధసీసము - అపూర్వప్రయోగము
సీ. సురభిభావగరాగ సూరాగణితధామ
వర్ణితశాశ్వతైశ్వర్యధామ
వర్ధిత దానవ వారపారావార
మధ్యమస్థామహామత్తవార
నమ్రతామరజాత నవ్యభవ్యయుతాసి
రక్షిత తాపసరత్నవర్య
వర్ణిరూపారూఢ వాసవాదరలాప
హారగౌరద్యుతి సారహార
గీ. వరమురజ దమితనుతహ సరసహాస
రాసలీలాభిలాష వరతమపార్థ
భద్రవస్ఫురవారణాపారభయద
ఫణివరాచలపాల ప్రభాతిరమ్య. 831

గర్భితమంజరి
సురభిభావరాగ సూరాగధామ
వర్థిత దానవవార పారావార

గర్భిత ఆటవెలఁది
సురభి భావరాగ సూరాగణితధామ
నమ్రతారజాత నవ్యభవ్య
వర్యవర్ణిరూఢ వాసవాదర లాప
హీరగౌరసార హారమురజ.

దశావతారగర్భిత గుణిత వర్ణాచలజిహ్వాకోష్ఠ్య వర్ణ భుజంగప్రయాతవృత్తగర్భిత నిరోష్ఠ్యాచలజిహ్వాసంకీర్ణవర్ణ సమగణ దండకము.
జయ హరిగిరిపా భవాకారబోద్ధాగమోద్ధారణా భానుభృద్ధుర్యభి న్నేతరాత్మీయదంష్ట్రాధృతతక్ష్మాతలా భీమరూపా భుజంగేంద్ర వాసస్థ దైతేయరాణ్మస్త విన్యస్త పాదాంబుజా భూరిరాజన్యమార్జ త్కుఠారప్రభా దేవచూడాతి భాస్వద్ధనుర్భంగ బాహాబలా భైరవాంగప్రలంబా శిరచ్ఛేదనోదారసీరాయుధా భోగ మోఘీకృత త్రైపురస్త్రైణపాతివ్రతీభూమ భౌమ ప్రసూవైరి సంహారి గంధర్వ రూపాధికా భంజితస్థైర్య కంసాహిభర్మాంబరశ్రోణిభాగా పయోముగ్విభా భావ్య భాభాగ్వి భావావయోభావయుగ్లోపవామా విభావ్యా భయోగ్యోపమా కుంభి పాపాప భీమా వయో గోపవాగ్భామ వాగ్భూమ భూమీశరశ్చంద్ర చంద్రాళి సచ్చారదా నారదా దిత్యరాడ్దంతి సంతాన ధాత్రీజతారాద్రి తారాశతారేశ శారాచ్ఛనీరేజరాజిద్ధరాధార శక్రానిలార్కా శరాధీశ నీరేశ గంధాంతరాట్కిన్నరేశత్రినేత్రాది దిఙ్నూధ చంచత్కరీటాగ్ర నిర్యత్న రత్నచ్ఛటాసాంద్ర నిర్యద్రజస్సార నీరేజితేడ్యాంఘ్రి నీరేజి నానారతాశ్రాంత నృత్యత్కటాక్షాంచలా నారదారాధ నానారతాహ్లాదితా నీరదాళీలస న్నీల తేజశ్రితా సారదైత్యచ్ఛిదా చండ చక్రాంచితా శ్రీరసాలంకృతా శేషశైలస్థితా భర్గవాగ్దేవతా వల్లభస్తన్య నైపుణ్య పుణ్యాభిదా భక్తపారంపరీభూరివాంఛాఫలా పాదిపాదాంబుజా త్వం సమస్తాపరాధం సహస్వాద్యమేభూయసీం దేహిభక్తిం భవత్పాదయోః స్థైర్య యుక్తాం విభూతీం నమస్తే నమస్తే నమస్తే హరే. 832

గర్భితాచలజిహ్వాకోష్ఠ్యవర్ణభుజంగప్రయాతము
పయోముగ్విభా భవ్య భాభాగ్ని భావా
వయోభావయుగ్గోప వాామా విభావ్యా
భయోగ్యోపమాకుంభి పాపాపభీమా
వయో గోపవాగ్భామ వాగ్భూమభూమీ.

గర్భితనిరోష్ఠ్యాచలజ్జిహ్వాస్రగ్విణీవృత్తము
నారదా రాధనా నారతాహ్లాదితా
నీరదాళీల సన్నీల తేజః శ్రితా
సారదైత్యచ్ఛిదా చండ చక్రాంచితా
శ్రీరసాలంకృతా శేషశైలస్థితా.

హరిహరాభేద వర్ణనశ్లేషయుక్త కావ్యలింగసీసము
సీ. రమణీయకమలధారణముచే రాణించి
యల వినాయకసేవ నతిశయించి
హృదయంబు శోభిల్లు శ్రీని వేడుక నాని
యబ్జశేఖరమున నంద మంది
యచలశరాసన మమర సంతోషించి
కలధౌతమయవాస మలరఁ గాంచి
గంధగజాసురక్షణదానగతి మించి
పంచాననస్ఫూర్తిఁ బరిఢవిల్లి
గీ. హరుఁడు మీరను భేదమే సరణి లేక
పూని లోకంబులకు నీశుఁడైన తండ్రి
కంటివిన్కలిదంటపేరింటిగుంటి
నడుమ నెలకొన్న వేంకటనాథ శరణు. 833

దశాద్యేకపర్యంతపదార్థసీసము
సీ. శ్రీమీన కమఠపోత్రి నృసింహ కుబ్జ భా
ర్గవరామ బలబుద్ధ కల్కులు నహి
మకర కుజ బుధ గురు కవి రవిజ తమః
కేతు లింద్రానలార్కి నృహిగుణిక
శివ సఖేశ్వరులు వసిష్ఠకౌశిక జమ
దగ్ని కశ్యప భరద్వాజ గౌత
మాత్రులు మధునిదా ఘాభ్ర శరద్ధిమ
శిశిరాగమము లిలా కుశ శుచి హరి
గీ. ఖములు ధర్మార్థకామమోక్షములు విధి వి
ధు భవులు క్షరాక్షరము లాద్యుఁడును తుదయు
సత్తసత్తును వెలిలోను సగుణనిర్గు
ణంబు లంతయు నీవెకా యంబుజాక్ష. 834

లయగ్రాహి. నిండుఝంపె
పంకజ తనూజ హరి శంకర ముఖామర వి
శంకట నవీన నుతి సంకలిత పాదా
లంకరణ జహ్నుతనయాంక మునిమానస వ
శంకర రణాంగణ నిరంకుశ పలాశా
తంకద ఖగేశ బిరుదాంక కమలాకుచ వి
టంకయుత సంకుమద కుంకుమరస శ్రీ
పంకిల భుజాంతర మనోంకణము నందుఁ గల
సంకటముఁ బాఁపఁగదె వేంకటగిరీశా. 835

చతురక్షరాద్యంతైకనియమయమకము
క. ధారాధర రుచివంశా
ధారాధరవైనతేయ ధారధరరా
ధారాధరతా నిబిడసు
ధారాధర వచన సేవ్య ధారాధరదా. 836

దుష్కరప్రాసము
శా. కుధ్రద్వట్ప్రతిమల్లకర్బురవరక్రూరాసుహృత్సాయకా
గృధ్రాద్యండజరాట్ప్రడీనగమనక్రీడాప్రియంభావుకా
లోధ్రత్విణ్ణిభకౌస్తుభాభరణవల్గుమ్లక్షవక్షస్థలా
సధ్రాధిన్యసనోత్కటార్జునపటీస్ఫాయత్కిరీటాంచలా. 837

క. ఇందీవర తను విజితస
దిందీవర రాజరాజహితనుత వితతా
నందనిలయ కనకమాయ
నందనిలయ మధ్యవాసనరవరవరదా. 838

పంచచామరము - అపూర్వప్రయోగము
కబంధరాశిధైర్యశౌర్య ఖండితాశరస్ఫుర
త్కబంధ గోత్రశత్రుపుత్ల గర్వహృద్భుజాపృష
త్కబంధకృత్ఖలేంద్ర జిద్భిదాముదవహానుజా
కబంధ గంధ సింధురప్రకాండ సింహికాండపా. 839

ద్విప్రాసము
క. విభవ రమణీయహాటక
విభవ సనకటీర శశి రవి భవన్నయనా
విభవావన మహి మహిమా
విభవా రచితస్తుతాంఘ్రివిభవ విలాసా. 840

కవిరాజవిరాజితము
త్రిభువనపావన సన్మునిభావన దీనజనావన ధీరగుణా
యభయ సుధీవన మాధవజీవనదాభమనోవన జాప్తఘృణా
యిభవిభు భావనటద్భయలావన హేత్యనుభావ నగోద్ధరణా
శుభజిత యావనయాశుగ దావన శోషితజీవనరాదగణా. 841

గోమూత్రికాబంధవిశేషయుక్త చక్రవాళచంపకవృత్తము
చ. హరిహరి భోగిభోగి శయనాశయనారజ చక్రచక్ర భృ
ద్ధర ధరధామధామ శరదాశరదారిత తారతారకా
ధరధరధారిధారి వరదా వరదానవదానదాన శే
ఖరఖరమారమారజనకాజనకావని ధీహరీహరీ. 842

దుష్కరప్రాసము
క. దేధ్మాయిమానధరధర
సిధ్మల కమలాకుచాగ్రశీలిత కరపా
పేధ్మహుతాశనవసలీ
లాధ్మాతపయోదదేహ హరిగిరిదేహా. 843

క. హల్లక చరిష్ణు బంభర
మల్లకలితదృగ్విలాసమంజులకమలా
ఫుల్లకమలాంఘ్రిలాక్షా
యల్లకయుతహృదయ వేంకటాచలనిలయా. 844

పాదాద్యంతాక్షర కావ్యకర్తృనామగుప్త పూర్వకవిగుప్తసీసము
సీ. {వెం}టాడి యసురుల విదళించు దేవ [వేం]
{క}ట రాజితాభిధ గ్రావతిల[క]
{టె}క్కైన వేల్పుల సొక్కించు నెఱజూ[ట]
{శ}యబలాతి శయాస్త శంభుచా[ప]
{వి}బుధసుధాహృతి విశ్రుత నిజవీ[తి]
{లా}వణ్యకారణ లలిత తిల[క]
{స}కలభక్తవ్రాత సారసోదితర[వి]
{ము}నిజనానందకృన్ముఖ్యచరి[త]
గీ. (వ్యా)సనిగమోక్త దశశతాహ్వయధురీ(ణ)
(స)మరభుఙ్మాని కీర్తన సారరా(గ)
(పు)వ్వు దీపించు విల్గల ప్రోడతా(త)
(రా)వణాహిత దయ మమ్ముఁ బ్రబలఁ గను(ము). 845

పైపద్యం సీసచరణాల మొదటి ఎనిమిది అక్షరాలను వరుసగా జోడిస్తే, వెం-క-టె-శ-వి-లా-స-ము అని; చరణాల చివరి ఎనిమిది అక్షరాలను జోడిస్తే, వేం-క-ట-ప-తి-క-వి-త అని, ఎత్తుగీతి చరణాల ఆద్యంతాలలోని నాలుగు నాలుగు అక్షరాలను జోడిస్తే వ్యా-స-పు-రా-ణ-గ-త-ము అని దళాలు ఏర్పడుతున్నాయి. వ్యాసపురాణగతము అన్న మాటను బట్టి వేంకటపతి తన కావ్యం వేంకటేశవిలాసం వ్యాసపురాణానికి ఆంధ్రీకరణమని ప్రతిపాదిస్తున్నాఁడు.

సర్వత్రయమకము
మ. వలనాంచద్ద్విజ రాజగోత్రనియతి న్వ్యాపించు సత్కీర్తియున్
కలనాదద్విజరాజగోత్ర విహృతి న్గన్పట్టు విఖ్యాతియున్
జ్వలనాభద్విజ రాజగోత్ర వినుతి న్వర్తిల్లు కారుణ్యమున్
గల నిన్ను న్భజియింతు మెప్పుడు భుజంగక్ష్మాధరాధీశ్వరా. 846

భుజంగప్రయాతగర్భిత స్రగ్విణీవృత్తము
పావనాత్మాశి సంపత్ప్రదాానాశ్రయా
దేవతానాథ సందీప్త పూజోఛ్రయా
భావనామేయ సద్భవ్యరూపోవయా
సేవకవ్రాత దాక్షిణ్య శీలాజయా. 847

గర్భితభుజంగప్రయాతవృత్తము
జయపావనాత్మాళి సంపత్ప్రదానా
శ్రయదేవతానాథసందీప్తపూజో
ఛ్రయాభావనామేయ సద్భవ్యరూపో
దయాసేవకత్రాతదాక్షిణ్యశీలా.

మణిగణనికరవృత్తగర్భితకందము
క. ధరణిధర భరణతతకర
సరసాశరవర విదళనచణనిశితశరా
పురహరనుతనిజభుజబల
గరిమాఖరకరనిభవిభ గరుడగిరిపతీ. 848

గర్భితమణిగణనికరవృత్తము
ధరణిధర భరణతతకరసరసా
శరవర విదళన చణనిశితశరా
పురహర నుతనిజభుజబలగరిమా
ఖరకరనిభవిభ గరుడగిరిపతీ

పాదభ్రమకకందము
క. మానుత ఘనౌఘ తనుమా
యానత సుజనావభావరాజసుతనయా
దీనఖదపాదఖనదీ
యానవిమదజయవిభావియజదమవినయా. 849

పాదగోపనకందము
క. వెలలి యుదార మధుర దయ
నిలుపు గుహన్ దత్తినలరు నీవిడు భక్తిన్
గలిని ఘనదేహ శౌరీ
వెలిదామరయలుఁగు దనరు విభుగనిన హరీ. 850
(పైకందమునఁ బ్రథమాక్షరము మొదలుగ నక్షరము విడిచి యక్షరమును మూఁడవపాదాంతము వఱకుఁ జదివినఁ జతుర్థపాద మేర్పడును.)

పుష్పమాలికాబంధ, గోమూత్రికాబంధ, గుచ్ఛబంధ, హలబంధ, ఛత్రబంధ పంచకనిరోష్ట్యకందము
క. శ్రీనకనకనయనధన
జ్ఞానకనద్యాన సానసనకనదీనా
ధ్యాన జనన నగ నటన
స్థాన జనస్థాన హీన జనఘన హననా. 851

చతుర్దళగర్భితద్వాదశదళపద్మపంధ, పాదుకాబంధద్వయ మణిగణప్రవాళానుష్టుప్ శ్లోకము
రావదే ప్రోవమాధారా। రాధామాహాత్మ్యసాగరా।
రాగసాహిత్యవాజీరా। రాజీవాకారాదేవరా॥ 852

శంఖబంధకందము
క. మరకత మణిమయ మహిమత
కర మలరుతను కళకలిమికలికి సతమ్మౌ
యురమును భుజగవరధరా
ధరమును నమరు హరి మదనదమననుత పదా. 853

రథబంధకందము
క. శ్రీ మీవెంట న్గూడుక
రా మకరిని టెక్కడంచి రమ్యగజేశ
గ్రామణి గావన్ లేదా
నీమాయాలీల సూవె నీలనగపతీ. 854

ఖడ్గబంధకందము
క. సారసజాతస్తుతజయ
దారిద్ర్యాధీశదాసధరభరదమర
జ్యారజ్యాదసదాశర
వారావార శయచక్రవదన విలాసా. 855

పట్టెసబంధోత్సాహవృత్తము
తారకాసారకీర్తిధారకారమారతా
తారకాచలేశసన్నుత ప్రసిద్ధి రాజితా
తారకాత్మ రావణాది దండనోగ్రధీరతా
తారకాసురాదివంద్య దంతి రక్షణోన్నతా. 856

మురజబంధవిద్యున్మాలావృత్తము
వీరోదారా వేదారాధ్యా । నారోదారానాదారాగా
గారోదానాకాదాధరా । వీరోదారా వేదాధామా. 857

త్రిశూలబంధపంచచామరము
సతీపతీరసారసాను సారకా ఘనాయతా
నతాయనాఘకారకా ఘనాయతానదానసూ
తతాజయాజ తాతసూనదామధారతారకా
రతారధామదాసదాజరాధిరాజదాసదా. 858

ఛత్రబంధకందము
క. సారకరధీర వరదా
తారావీనపనవీన తతతరిపరిప
క్షారూఢాగోరాధీ
ధీరాగోపతి దరవర ధీరాకరసా. 859

అనుపాత్తవాచక సాధర్మ్యోపమానలుప్త గుణితయుక్త దశావతార మత్తేభవిక్రీడితవృత్తము
మ. కగరూపోన్నతకామఠోద్ధకిటిరేఖాకీర్తితోగ్రాంగకు
బ్జగకూద్వాహనృకేసరిప్రభవరక్షఃకైటభార్యాగ్రకో
పగుణోద్యజ్జినకౌశలార్వమణికంపర్యంకకర్ణాహిపా
నగభిద్వహ్నియమాశరాంబుసమరున్నాదేశముఖ్యార్చితా. 860

చక్రబంధశార్దూలవృత్తము
శా. సత్యాకల్పకప్రస్ఫుటాశరభిదా చారావిశంకక్రమా
మత్యావిష్కృతబంధురాదరణభూమాజంతుకూటాశ్రితా
దిత్యావేందన ధర్మసారరతమూర్తీ ముత్కరాద్రిక్షమా
మాత్యుల్లాసపద మహావిదితధామా సాధుతారక్షమా. 861

నాగబంధచంపకమాలికావృత్తము
చ. కరివరదానశూర సుగౌరవసజ్జితపాదసారసా
ధరధరధారిసూరి నర తార కనిత్య నశోకదాసఖా
స్వరమదకౌశలారహర సారకుభృద్వరధీర మౌనిభా
సురశుకగీతమారనిభ శోభనరమ్యశరీరసంభృతా. 862

పుష్పమాలికాబంధయుక్త కందమదనవిలసితశ్లోకగర్భితస్రగ్ధరావృత్తము
శ్రీరామేరానురాగస్థిరతరమురళీస్మేరసారస్వరశ్రీ
తారాదారాధరాస్యాదరభరహరణాదానితానిత్యనిష్ఠా
తారాపారాబ్జరావాదరభరణరతాద్రౌపదీపస్వపక్షా
సారాచారాభిరామాశరవరశరణా చారుకారుణ్యరుద్యా. 863

గర్భిత కందము
శ్రీరామేరారాగా
తారాధారాధరాస్య దరభరహరణా
దారాపారారావా
సారాచారాభిరామ శరవరశరణా

గర్భిత మదనవిలసిత వృత్తము
స్థిరతరమురళీ
దరభరహరణా
దరభరణరతా
శరవరశరణా

గర్భితశ్లోకము
స్థిరతరమురళీ స్మేరసారస్వరశ్రీ
దరభరహరణా దానితానిత్యనిష్టా
దరభరణరతా ద్రౌపదీపస్వపక్షా
శరవరశరణా చారుకారుణ్యరుచ్యా

దుష్కరప్రాసకందములు
క. దంష్ట్రీ శరీరమాధవ
దంష్ట్రభినవదంత చణవదన బింబఖరా
దంష్ట్రాశుగదళితాసుర
దంష్ట్రినగాధ్యక్ష వికచతామరసాక్షా. 864

క. వ్యఙ్త్రాభరణధరరమా
సఙ్త్రాయత సదయహృదయ సన్మునిచేతో
మఙ్త్రాశయకుత్సితమత
భఙ్త్రాకృతికృష్ణ రఙ్తృ పద్మదళాక్షా. 865

క. దృఢనక్తంచర దరకర
దృఢగోవర్ధనగిరి పరిబృఢదృఢవక్షో
దృఢసింధూద్భవచరణా
గ్రఢౌకమానాభ్రగంగ గరుడతురంగా. 866

క. అర్ఖేచర వరదాయక
తర్ఖరదూషణముఖారిదళన పటీయో
వర్ఖరసాయకధారా
మూర్ఖజనాత్యంతదూర ముదిరశరీరా. 867

దుష్కరప్రాసశార్దూలవృత్తము
శా. సేర్క్ష్యాదిత్యవిరోధినాథదళనా హీనాహిచంచద్భుజా
వార్క్ష్యాధ్యక్షవరప్రదానచతురా వామార్ధజానిస్తుతా
సార్క్ష్యాంచద్విధుతుల్యమౌక్తికవిరాజత్కర్ణభూషాననా
తార్క్ష్యాశ్వోత్తమ వేంకటేశ్వర రమాదాంపత్యనిత్యోదయా. 868

మాలినీవృత్తము
వరశుభదరాసా వల్లవీహారిరాసా
సురచిరదరహాసాసోల్లసచ్చంద్రహాసా
గరుడ తురగలాసా కంధిజాహృద్విలాసా
తిరుమలగిరివాసా దీపితస్వర్ణవాసా. 869

విద్యున్మాలావృత్తగర్భిత స్రగ్ధరాష్టదళపద్మబంధము
స్రగ్ధర రామారక్షోదలప్రాగ్య్రదరకదననత్రాసపధ్యారమారా
రామారథ్యాపసత్రా ప్రకటగుణ సముద్రాపవిత్రాసమారా
రామా సత్రావిపద్రారవినిభకర చక్రాశరణ్యాగమారా
రామాగణ్యారశక్రారథితఖగవరా ప్రాలదక్షోరమారా. 870

గర్భితవిద్యున్మాలావృత్తము
రామారక్షోరామారథ్యా
రామాసత్రారామాగణ్యా
రామారక్షోరామాగణ్యా
రామాసత్రా రామారాధ్యా

చౌపదములు
మునుల మనోంబుజముల నెఱదీవి
దనరు గుణమణులఁ దగు బలుఠీవి
మినుకు విరులలో మెలఁగెడుతావి
చెనఁటుల నని గెల్చిన మాయావీ.
దినమును వనిలోఁ దిరిగెడుబాళి
యెనయఁ జెంచెతల యెదల విరాళి
బెనచి యలుక లిడి వే బతిమాలి
తనియ నేలి దయఁ దగు వనమాలీ.
వహి గను బృందావనమున జాడ
విహరింపుచు వేవెలఁదులతోడ
రహి కెక్కిన యల రాసక్రీడ
విహితముగాఁ దగవేడ్కఁగలాడ
దిసమొలలుగ వ్రేతెలవనభూమి
దొసఁగిడి వలువలు దోఁచుక నోమి
పొసఁగ నెక్కి సురపొన్నను నోమి
ముసిముసినగుమొగమునఁ దగు సామీ. 871

తురగవల్గనరగడ
1. రామరామవారిచారి రామరామసదవతార
ధామధామజైత్రచిత్ర ధామధామ విదళితార
2. మారమార రక్షణక్ష మారమారమణ్యధీశ
సారసారవాహిశోభి సారసారహితసదేశ
3. కాండకాండ జఠరపిఠర కాండకాండతసముద్ర
దండదండనప్ర దీప్ర దండదండ చక్రభద్ర
4. రాజరాజమానదాన రాజరాజదాస్యమాన్య
రాజరాజ మానదాన రాజరాజతావదాన్య
5. తారతారకాజిభోజి తారతారకీర్తిదీప
వారవారకీలిహేళి వారవారకప్రతాప
6. రాగరాగ సరళమురళ రాగరాగ హృద్వికాస
నాగనాగవాహనేహ నాగనాగతనువిలాస
7. గోపగోపసేవ్య భవ్య గోపగోప సదవభావ
గోపగోపనాపతాప గోపగోపదప్రభావ
8. జాలజాల సాలసాల జాలజాల కవనఖేల
నీలనీల మణ్యగణ్య నీలనీల యుగహిశైల. 872

క. తుద కనుపడని మొగలిపూ
పొదిపాపనిజోడు వేల్పుబుడుత పగరతే
రదిమెదిరిన మూకలడఁచ
మదిగల యునికిఁ దగు ముదురుమాయల మనికిన్. 873

త్రిమూర్త్యాత్మక త్ర్యర్థికందము
క. స్థిరసత్యాసక్యాశయ
నరకచ్ఛేదనధురీణ నగరాజకరా
సరసాదరకమలోదయ
హరిహయతనయాయజాహ్వయాపరమాత్మా. 874

చతుర్దళయమకచూర్ణిక
శ్రీహరే, సకలలోకశరణ్య కారుణ్యసింధో, దీనబంధో, భక్తాగమసందోహవసంతం భవంతం, కృష్ణాధిమానసంరక్షణం సర్వశుభలక్షణం, కృష్ణాతిరామణీయకవిగ్రహం దైత్యనిగ్రహం, కృష్ణానుసారిణం మిత్రవిందామనోహారిణం, కృష్ణావతారమోహితవల్లవీజనం శృంగారభాజనం, గోపజనకనాభీపంకేరుహం గోవర్ధనావహం, గోపకల్లోలమాలికాడోలికాఘనవిహారం నిర్వికారం, గోపసోదరం వేణుగీతిసాదరం, గోపవేషధారిణం కుమతవిదారణం, అబ్జసంకాశవదనం అంభోధిసదనం, అబ్జదళనోత్కంఠం అద్యుషితవైకుంఠం, అబ్జసఖచంద్రనేత్రం హైమనేత్రం, అబ్జప్రముఖదిక్పాలకస్తూయమానవిజయవిలాసం భాసమానదరహాసం, నాలీకబాణజనకం నాసాజితకనకం, నాళీకనిస్తులకౌస్తుభమణిరమణీయక్రోడం పురాతనక్రోడం, నాళీకవచనగోచరం నతఖేచరం, నాళీకదళితసంక్రందననందనం నిఖిలావయవలిప్తహరిచందనం, పుష్కరచరపాపఠ్యమానబిరుదాంకం నిష్కళంకం, పుష్కరధరప్రతిమానతనూవిలసనం ఆరచితచాణూరనిరసనం, పుష్కరగంగాదిసకలతీర్థవితతీప్రతివర్షసేవ్యమానకౌమారసరసీతటనివాసినం శబరతరుణీవిలాసినం, పుష్కరసమాచరణం కుచేలశరణం, తారకావీననేత్రస్థభీష్మసూజననదేశపాదాంగుష్ఠనఖరం ఖండితకరం, తారకాధీశోద్భవకారణహృదయం సదయహృదయం, తారకమంత్రసారం ధర్మాధారం, తారకాసురారాతిసేవితం తపోధనకదంబసంభావితం, ధనంజయమపినమతాందదానం జగన్నిదానం, ధనంజయతేజోమయస్వరూపం అప్రతిమప్రతాపం, ధనంజయప్రముఖపురాతనసుకవికావ్యాలోకనప్రౌఢిమ దస్మదీయవాక్యసరణిపవిత్రీకరణపారీణశుభచరిత్రం, మణిగణదేదీప్యమానఫణిఫణాయతాతపత్రం ధనంజయసారథిం బాణాగ్రకీలికీలాలేహ్యమానవారిధిం, పుండరీకప్రభృతిపరమభాగవతజేగీయమానానంతలీలావితానం సేవకనితాంతసంతానం, పుండరీకామరహరసఖం అవ్యయసుఖం, పుండరీకనోమకరికరోపమానచతుర్భుజం రక్షితవజ్రం, పుండరీకవిశాలేక్షణం కాళీయశిక్షణం, భద్రకుంభినీప్రముకస్త్రైణభోగానుసంధానుభోగాభిరామం మురవిరామం, భద్రకుంభీనసాధిపశైవేశానం భుజంగపుంగవశయానం, భద్రకుంభిచిరత్న రత్నసందానితగోపురప్రాకారమంటపాలంక్రియమాణనిజదివ్యప్రాసాదమధ్యమధ్యాసీనం పాలితానేకహరిసేనం, భద్రకుంభీంద్రావనం చరితబృందావనం, చంద్రకాంతదరభాసురకరం ప్రపన్నక్షేమంకరం, చంద్రకా్తఖచితవీథిరారజ్యమానకాంచనరథసంచారం నవనీతచోరం, చంద్రకాంతవిభాసమానబర్హావతంసం దండితకంసం, చంద్రకాంతమనోనాథం నీలాసనాథం, కవిరాజమస్తన్యస్తైకపాదం శీతలతులసీదళమాలికామోదం, కవిరాజర్షిసూయమానత్రిలోకవిద్రావణరావణబలఘనాఘనవిధ్వంసనాశుగదాసుగధారాహిండితచండకోదండం కబంధబాహుకదళికాఖండనవేదండం, కవిరాజనోనూయమానావార్యశౌర్యం కొటికందర్పసౌందర్యం, కవిరాజవిరాజితముఖవృత్తనిభందనప్రబంధరాజవిలాసం గోపికావిరచితరాసం, కమలాసనాథబాహాంతరాళం సత్యామానసమరాళం, కమలాసనాతనశాబకవిలోలలోచనోజ్జ్వలకలాగణేయమహిళాసహస్రపరివృతం యశోదోపలాలితం, కమలాసనర్తుమార్తాండసాహాయదాయిబాహారథాంగం గరుడలింగం, కమనాసనాది నిర్మాణచణప్రభావం మహానుభావం కలాపాలికావిజ్ఞానశాలినం, వనమాలినం కలాపాళీకాడంబినీనీలకచకలాపం భంజితశివచాపం, కలాపాళికాఘటితభవ్యకావ్యరసానుభవశోభినం, రాధాధరసుధారసధారాలోభినం, కళాపాళికాలంకృతసకలాంగం, నిర్భిన్నకపటకనకసారంగం, హృదయవిలసదలమేల్మంగం కరుణాతరంగితాపాంగం, సనకసనందనాదిమునిజనాంతరంగం, వనజసారంగం, ఆనందనిలయ మానందనిలయవాస్తవ్యం, శివాస్తవ్యం, దివ్యం, శ్రీవేంకటేశమతివిశంకటప్రకాశం, సకలదేవతాధీశం, అమీవయం భజామః 875

ప్రాకృత శౌరసేని మాగధ పైశాచి చూళికా అపభ్రంశ సంస్కృత ఆంధ్ర అష్టభాషాసీసము
సీ. ణాయమాణస్సిణీ ళోయ ధమ్మిళ్ల పజ్జణ్ణ యవిజ్జుళా సరిసపాయ
ఛాయ. (నాకమనస్వి నీలోకధమిల్ల పర్జన్యక విద్యుతి సదృశపాద)
పురవదేవ్వ విదాణ గరువమరట్టదుఃఖట్ట జాద విజేయ కళనసీహ
ఛాయ. (పూర్వదేవ వితాన గర్వమదోద్ధతగజ జాత విజవన కలన సింహ)
చళనశాళస నిళంతళ భత్తచిందితపళశమస్తనకేళి పారియాద
ఛాయ. (చరణ సారస నిరంతర భక్త చింతిత ఫలసమర్ధనకేళి పారిజాత)
మతనసూతనధేరతిత శవళ్లహముహగననిజ్జగల్లానగు నదురీన
ఛాయ. (మదన సూదన ధాతృత్రిదశ వల్లభముఖ గణనీయ కల్యాణగుణధురీణ)
గీ. కందకచళా చలఖ్కణ పంధుళాళి
ఛాయ. (గంధ గజరాజరక్షణ బంధురారి)
మహయముఖధి కరీ హేదు మహపడుఝ్ఝ
ఛాయ. (మగువ ముఖాశ్చర్య హేతు సమ సమూహ)
ఆజవంజవ జలధిమగ్నాత్తతరణి
మబ్బుపూఁబుట్టువు బిడారు మగువఱేఁడ. 876

శీర్షిక - (ఆది పాదైకైక చరణానులోమ ప్రతిలోమోష్ఠ్యాచలజిహ్వికా గోపన గోమూత్రికాబంధ తత్పాదార్థభ్రమక గోమూత్రికాబంధ పతకబంధ పాదుకాబంధ నవరంగ సమపంచాక్షర ఖండ చతుష్టయాక్షయ దళోపరినిరోష్ఠ్య పూర్వోవిధ నియమ ద్విచరణ దళోపరి పూర్వోక్తానులోమవిలోమ నియమ నాతిక్రమ్య దళాద్యక్షర నియమపాదద్వయోపరి చరణద్వయ ప్రత్యైకానులోమ నియమోపరి దళచతుష్క ప్రత్యైకపాద ద్వయ భ్రమక గోమూత్రికాబంధ తత్పాద గుప్త గోమూత్రికాబంధ షట్త్రింశచ్చక్రబంధుర ద్వాదశదళస్ఫుట సర్వలఘు ద్విరగగతిరగడము).
1. భవిభువిభ భవభవభ భవభవభ భవిభువిభ
వివిభవివి విభవభవి విభవభవి వివిభవివి
2. జయనయజ జలజలజ జలజలజ జయనయజ
నయనయన నలదళన నలదళన నయనయన
3. వసువసువ వనదనవ వనదనవ వసువసువ
వసనసవ వలదలవ వలదలవ వసనసవ
4. మహిమహిమ మదనదమ మదనదమ మహిమహిమ
వహనహవ వరదరవ వరదరవ వహనహవ
5. సరసరస జయదజయ జయదజయ సరసరస
పరవరప వశితశివ వశితశివ పరవరప
6. పవనవప భసలసభ భసలసభ పవనవప
కవనవక కరకరక కరకరక కవనవక
7. కదనదక ఘనఘనఘ ఘనఘనఘ కదనదక
పదకదప వసుదసువ వసుదసువ పదకదప
8. నమనమన నవకవన నవకవన నమనమన
యమనమయ హరియరిహ హరియరిహ యమనమయ
9. జలజనయ నపవిజయ సరసయశ గరదలహ
హలదరగ శయసరస యజవిపన యనజలజ
10. పరహజని యమజనవ భరకరభ దరసురవ
వరసురద భరకరభ వనజమయ నిజహరప
11. కరకరక భరవసన ఘనజసుత తరవరన
నరవరత తసుజనఘ నసవరభ కరకరక
12. పరవిరస హరవరద భవననగ గరిహరద
దరిహరిగ గననవభ దరవరహ సరవిరప

ఏక ద్వి త్రి చతుః పంచ షట్సప్తష్టాక్షర క్రమపాద నియమ సీసము
సీ. రారార రారర రూరూర రేరార
రేరార రీరర రూరరార
భాభీరు భీభర భారభేరీరేభి
భూరిభాభాభీ భూభూ భరాభ
నలినీ నివనైక లలనాకళానూన
లాలనలోలా కళంక లీల
దరదారి దర ధర కరదదాదోదర
దార కాదర కరోదారవరద
గీ. గోపబాలక పాలక పాపలోప
సాలక విలాస వేంకటశైలవాస
భవ్యభాస భవాకారదివ్యరూప
రాధికాస్పుటదిక్కరి కాధరాంగ. 878

స్రగ్విణీవృత్త మంజరి ముక్తపదగ్రస్త ద్విపద చండకవృత్తి దండక గర్భిత దుర్భర ద్విప్రాసత్రిస్తబకాంత్యనియమ సమధికపద చిత్రాస్పద చిత్రచరణ భాసమానసీసము
సీ. వారణావారణా వక్రసన్నక్రస
త్పాదనాపాదనాగ్రారధార
కారవాధార వాగ్వారణాకారణా
ర్హావనాధావనాయాసవాస
సారహంకార హంసారధామారధా
మానసాభ్యాసనా చాపచాప
మారసంహారసంభావ్యభానవ్యభా
గాగమాంతాగ మాంతాలవాల
గీ. పారదాపారతారాబ్జ తారతార
శారదా శారదాభ్రకర్పూర పూర
హారనీహార నిర్భరఖ్యాతిరీతి
దీనపాదీన పాదీన దేవదేవ. 879

గర్భితస్రగ్విణీవృత్తము
వారణావారణా వక్రసన్నక్ర స
త్కార వాధారవాగ్వారణాకారణా
సారహంకార హంసారధామారధా
మారసంహార సంభావ్య భానవ్యభా.

మంజరి
వక్రసన్నక్రసత్పాదనాపాద
కారవాధారవాధారణాకార

ముక్తపదగ్రస్తము
సారహంకార సంసారధామార
మార సంహారసంభావ్యభానవ్య.

నమస్కారశబ్దలక్షితకందద్వయగర్భితవచనము
వ. శ్రీవైకుంఠమందలి వాసుదేవునకు మ్రొక్కు, యామోదస్థలమందలి సంకర్షణునకుఁ జేమొగువు, ప్రమోదస్థలమందలి ప్రద్యమ్నున కేడికోళ్ళు, సమ్మోదమందలి యనిరుద్ధునకు సలయు, సత్యలోకమందలి విష్ణున కేకిసలు, సూర్యమండలమందలి పద్మాక్షునకు జోడీలు, క్షీరాబ్ధిస్థలియందలి శేషశయనునకుఁ జెంగనాలు, శ్వేతదీపమందలి తారకస్వామికి కన్నులమ్రొక్కు, బదరీవనమందలి నారాయణునకు జోతలు, నైమిశారణ్యమందలి హరికి జోహారు, హరిక్షేత్రమందలి సాలగ్రావస్వామికి సురతానిసలాము, అయోధ్యయందలి రఘూద్వహునకు దోయిలి, మధురనున్న బాలకృష్ణునకు సాఁగిలి, మాయాస్థలమందలి మధుసూదనునకుఁ గోళిగి, కాశీక్షేత్రమందలి భోగిశయానునకు నివాళి, యవంతియందలి యవనిపతికి మెలు, ద్వారవతియందలి యాదవేంద్రునకుఁ గొలువు, వ్రజస్థానమందలి గోపీజనప్రియునకు గొబ్బిళ్ళు, బృందావనమందలి నందసూనునకుఁ బొగడ్తలు, కాళీహ్రదమందలి గోవిందునకు గొండీలు, గోవర్ధనమందలి గోపవేషునకుఁ డెంగనాలు, భక్తలోచనమందలి భవఘ్నస్వామికిఁ గౌడీలు, గోమతపర్వతమందలి శౌరికి మోడ్పుఁగేలు, హరిద్వారమందలి జగత్పతికిఁ జేవిప్పు, యాగయందలి మాధవునకు సాంగుబలా, గయయందలి గదాధరునకు మోడ్పు గంగాసాగరసంగమస్థలమందలి విష్ణువునకుఁ గైమాపు, చిత్రకూటమందలి రాఘవునకుఁ గిడిగిళ్ళు, నందిగ్రామమందలి రాక్షసఘ్నునకు జేజే, ప్రభాస్థలివిశ్వరూపున కల్లోనేరడల్లో, శ్రీకూర్మమందలి కూర్మమూర్తి కెరగుట, నీలాచలమందలి పురుషోత్తమునకుఁ జేసాపు, సింహాచలమందలి మహాసింహునకుఁ జిన్నిపువ్వు, తులసీవనమందలి గదాధరునకుఁ గోణిగి, కృశశౌచమందలి పాపహరునకుఁ దెలియుట, శ్వేతగిరియందలి సింహలోచనునకు వెన్నెల, ధర్మపురియందలి యోగానందునకుఁ గొల్వు మ్రొక్కు, శ్రీకాకుళమందలి తెలుఁగురాయనికి దండము, అహోబిలగరుడాద్రియందలి హిరణ్యాసురమర్దనునకు నమస్కారంబు, పాండురంగమందలి విఠలునకు సాష్టాంగంబు, యాదవపర్వతమందలి నారాయణునకు నమస్కృతి, ఘటికాచలమందలి నృసింహునకు నమోనమో, వారణగిరియందలి వరదునకుఁ బ్రణుతి, కాంచియందలి కమలలోచనునకు వందనంబు, యదోక్తస్థలమందలి యధోక్తకారునకుఁ బ్రణామంబు, పరమస్థలియందలి పరమేశ్వరునకు ముకుళితహస్తంబు, పాండుభూస్థలి పాండవదూతకుఁ బ్రణిపాతంబు, విక్రమస్థలిఁ ద్రివిక్రమునకుఁ బుష్పాంజలి, కామాళియందలి నృసింహునకు సన్నుతి, అష్టభుజస్థలమందలి యష్టభుజున కానతి, ప్రవాళస్థలమందలి ప్రవాళవర్ణునకు వినుతి, దీపాభస్థలమందలి దీపాభున కంజలి, గృధ్రస్థలమందలి విజయరాఘవునకు శిరోనమ్రత, వీక్షారణ్యమందలి శయానవీరరాఘవునకు శరణు, తోతాద్రియందలి తుంగశయానునకు నమోవాకంబు, గజస్థలమందలి గజార్తిఘ్నునకు శరణార్తి, బలిపురమందలి మహాబలునకు ఆరాధనంబు, భక్తసారమందలి మహాజగత్పతికిఁ బూజ, యింద్రస్థలమందలి దేవదేవునకు కైంకర్యంబు, గోపపురమందలి గోపపతికి సపర్య, అంతర్వేదివాసుండగు నారసింహునకు నమస్కారంబు, భద్రాచలమందలి కోదండరామునకు భద్రంబు, శోభనాద్రివాసుఁడగు సుబ్బరాయనికి క్షేమంబు, మంగళగిరి నరహరికి నిత్యసేవనంబు, శ్రీముష్ణమందలి యాదివరాహస్వామికి శుశ్రూష, మహితస్థలమందలి పద్మలోచనునకుఁ బరిచర్య, శ్రీరంగమందలి రంగస్వామికి నమస్య, శ్రీరామస్థలమందలి జానకీప్రియునకు నర్హణంబు, శ్రీనివాసస్థలమందలి పుణ్యమూర్తి కభిస్తుతి, స్వర్ణమందిరమందలి స్వర్ణస్వామికి సంస్తుతి, వ్యాఘ్రపురమందలి మహాబాహునకు స్తవంబు, యాకాశనగరమందలి హరికి స్తోత్రంబు, యుత్పలావతకమందలి శౌరికి వినుతి, మణికూటమందలి మణిప్రభున కభివాదనంబు, విష్ణుపురమందలి మహావిష్ణునకు దాస్యంబు, భక్తస్థానమందలి భక్తిప్రదునకు దిగ్విజయంబు, శ్వేతహ్రదమందలి శాంతమూర్తికి విజయంబు, అగ్నిపురమందలి మురద్విషునకు మంగళంబు, భార్గవస్థానమందలి భర్గునకుఁ గళ్యాణంబు, వైకుంఠమందలి మాధవునకు శుభంబు, పురుషోత్తమమందలి భక్తిసఖునకు భవ్యంబు, చక్రతీర్థమందలి సుదర్శనునకుఁ గుశలంబు, కుంభకోణమందలి శార్ఙ్గపాణికి క్షేమంబు, భూతస్థానమందలి శార్ఙ్గస్వామికి శోభనంబు, కపిస్థలమందలి గజేంద్రవరదునకు నిత్యోత్సవంబు, చిత్రకూటమందలి గోవిందునకు సేమంబు, ఉత్తమస్థలమందలి యుత్తమస్వామికి భద్రంబు, శ్వేతగ్రావమందలి పద్మలోచనునకు బరిణామంబు, పార్థస్థలమందలి పరబ్రహ్మునకు సేవ, కృష్ణకోటయందలి మధుద్విషున కభివృద్ధి, నందిపురియందలి మహానందున కీడితంబు, వృద్ధపురియందలి వృషాద్రిశయునకుఁ బనితంబు, సంగమగ్రామమందలి సంగమస్వామికి రీతంబు, శరణ్యమందలి శరణ్యునకు జయ జయ, సింహక్షేత్రమందలి మహాసింహునకు సమ్మానంబు, మణిమంటపమందలి మల్లారిస్వామికి బహుకరణంబు, నిబడమందలి నిబిడాకారునకు దక్కెదము, ధానుష్కమందలి జగదీశ్వరునకు లెంకల మయ్యెదము, మాహురమందలి కాలమేఘునకు బంటుల మయ్యెదము, మధురయందలి సుందరరాజస్వామికి భక్తి చేసెదము, వృషభాద్రియందలి యళఘరికి దాసానుదాసుల మయ్యెదము, వరగుణస్థలమందలి నాథస్వామినిఁ బ్రార్థించెదము, కురకయందలి రమాసఖుని భజించెదము, గోష్ఠీపురమందలి గోష్ఠపతి నుపాసించెదము, దర్భసంస్తరణమందలి శయానస్వామి నాశ్రయించెదము, ధ్వనిమంగళకస్థలమందలి శౌరినిఁ గీర్తించెదము, భ్రమరస్థలమందలి బలాఢ్యునిఁ గొల్చెదము. కురంగస్థలమందలి పూర్ణస్వామి మమ్ము రక్షించుఁగాత, వటస్థలమందలి విష్ణుండు మదీప్సితంబు లొసంగుఁగాత, క్షుద్రనదియందలి యచ్యుతుండు మాదృశుల దయాదృష్టి వీక్షించుఁగాత, అనంతశయనమందలి పద్మనాభుండు మత్తనువులు పావనత్వ మొంద సమకూర్చుఁగాత, వేంకటశైలంబున శ్రీనివాసస్వామివై నూటయెనిమిది దివ్యతిరుపతులయందు నిన్నిరూపుల వెలయుచున్న నీకు ననంతనమస్కారంబు లని పొగడి
కరిమేషమహిషనృమకర
హరిణహయవృషగతియుతులు హరికయమనరా
డ్వరుణకధన్యులు నగు తో
మరిదండ్యుదశిగుణికేతు మద్గతి శూలుల్.
నిజాంఘ్రి సేవకు లగుట నాదేవతలమీఁద నాదరమేదురంబైన తనవచనంబు వారల కందంబుగా
యమరప కుశలమె యనల శు
భమె శమన సుఖంబె నిరృతి భద్రమె పరిణా
మమె జలపతి మంగళమె ప
వమాన భవ్యమె కుబేర స్వాగతమె హరా
యని కటాక్షమ్ముల నాలోకించి తదావాసమ్ముల కనిచి వారివారి కవ్వారిగా సేవయు సంపద లొసంగి రమాసంగి యంత నందలంబు డిగ్గి గరిమందిరంబైన యానందమందిరంబుఁ బ్రవేశించి క్రొమ్మూలఱాల మేలితమ్మి కెంపుమానికపు జగడంపు బొగడల నిగుడి విడంబించు పగడంపుఁ బట్టెల నిచ్చలపు పచ్చల గచ్చున హెచ్చుకట్టాణి ముత్తియంపుఁ జేరుల యోరలఁ జాచిన కప్పరాలదిండు తండంబుల డంబైన పిల్లికన్నులఁ బోలిన రతనంపుపీఁట నడుచక్కిఁ జెక్కిన చుక్కకెంపుటోవరాల నిగనిగల దెగడు నాలకడుపున బొడము పసుపువన్నియ చెన్నగుచున్న నెలఱాల రవల రవణంపు తూఁగుటుయ్యెల నలరు టలరు పై నెలకొన్న యన్నుఁదల మిన్నతోఁ గూడ నధివసించి కస్తూరి గంబూర చాఁదు జవ్వాది యగరు పన్నీరు తట్టుపునుంగు శ్రీగంధంబు లనియెడు యష్టగంధంబు లలందిన దివ్యమంగళవిగ్రహుం డాభోగభోగంబు లనుభవించి ప్రతిదినహేవాకమహోత్సవసముత్సుకుండై సకలలోకపాలనపరాయణుం డగుచు వెలయు శ్రీవేంకటేశ్వరు కరుణాకటాక్షవీక్షణంబుల సకలకల్యాణసమేతంబగు భక్తజనవ్రాతం బిట్లని స్తుతియించె.
(పైవచనమున గర్భితకందద్వయము గనుపడుచున్నది. పూ.రా.)

పంచరత్నములు
సీ. శ్రీమించు బంగరుచిఱుగజ్జె లడుగులు
వరదకరము కటివామపాణి
పీతాంబరమ్మును పిడెము పొక్కిటితమ్మి
విశ్వంబు లిడు బొజ్జ వెడఁదయురము
చెంగట నలమేలుమంగ శ్రీవత్సంబు
శంఖచక్రాంకహస్తద్వయంబు
భుజకీర్తులును గళంబున తులసీదళ
మాలిక వీనుల మకరకుండ
గీ. లములు నునుమోవి చెక్కులు కొమరుముక్కు
తీఱు దయలీను కన్నులు తేటయగు మొ
గము కిరీటంబుగల మిమ్ము గంటి మిపుడు
జలజహితధామ వేంకటశైలధామ. 881

సీ. తోమని పళ్యాలతోడ చేఱుడు బియ్య
ము పసాదము మెసంగు ముదుగుఁ దలఁచి
యెడ్డెల బెదరించి యొడ్డికాసులతోన
కానుక ల్గొనెడి యాగడముఁ దలఁచి
శ్రీవైష్ణవాగ్రణి సేయు కుళమునకు
మనుమోయు నంబేదతనముఁ దలఁచి
దనయంతకులకాంత నెనసియు వేఱొక్క
మగనాలిఁ గైకొన్న యగడుఁ దలఁచి
గీ. తాళునే యలమేల్మంగతాయి యిన్ని
దలఁచియే కాదె యనఁటిబొందెలను నీకు
బుద్ధి జెప్పించె బెండ్లిలోఁ బద్దుమీఱి
జలజహితధామ వేంకటశైలధామ. 882

సీ. మునుపుగా నెంగిలిఁ దినిపించు శబరికిఁ
దండ్రివై నేరము ల్దలఁచి మనుప
నెన్ను లొసంగిన యెఱుకలగమికాని
కేమౌదువేఁ గోర్కెలెల్ల నొసఁగఁ
బడి తరంబులు కొంచపఱచి సొమ్ములు నాచు
పాదుషా నీసరి పాలివాఁడె
చూఱగా సీమంతపారుపత్యము సేయు
వాఁడు నీకును జెలికాఁడె తలఁప
గీ. వారియేలిక వీవొ నీవంటి వేల్పు
వేఱొకఁడొ తెల్పవే కొల్వు వెదకవలయుఁ
దప్పు లెన్నక రక్షించుదాత నొకని
జలజహితధామ వేంకటశైలధామ. 883

సీ. అతులితోన్నత తిరుపతి పరిపాలన
విభవోన్నతుండవై వెలసికాక
యేరిని నేరుపు నేరంబు లెంచక
నుభయలోకసుఖంబు లొసఁగి గాక
మహిమ యలర్మేలుమంగ యిల్లాలుగా
మును నోచు పుణ్యవాసనుగాక
చేఁదోడువాఁదోడునై దయ నెవరు బి
ల్చినతోడ మాటలాడననె గాక
గీ. దేవుఁడ నటన్న నూఱక తీఱునెట్లు
చెల్లఁబో నీకు నొకనికిఁ జెల్లుఁగాక
తండ్రి వీ వలమేల్మంగ తల్లి మాకు
జలజహితధామ వేంకటశైలధామ. 884

సీ. ఆగమాంతార్థరహస్య మావాలంబు
ప్రణవంబు కూఁకటి బలిమివేరు
పెనుమొదల్ భువనమోహనమైన కాయంబు
కరచతుష్టయము శాఖాచయంబు
వనమాలికయుఁ బల్లవశ్రేణి కౌస్తుభ
ము సుమంబు వినువాఁక పువ్వుదేనె
పయినల్లు లేఁత తీవియ యలమేల్మంగ
భక్తులఁ బ్రోచుట ఫలముగాఁగఁ
గీ. గలుగు నీపేర వెలసిన కల్పకంబు
నామనంబను నందనారామసీమ
పాదుకొనుగాక సకలవైభవసమృద్ధి
జలజహితధామ వేంకటశైలధామ. 885

ఫలశ్రుతి
క. ఇది వేంకటేశు పేరిఁట
నొదవించు విలాస మెవ్వరొక దినమేనిన్
జదివిన వ్రాసిన వినినను
మదికోర్కులు సంఘటించు మనుజులకెల్లన్. 886

చ. గణపవరాన్వయంబు నిధి కైరవబాంధవుఁ డప్పనార్యు ల
క్షణకవి వేంకటార్యమణి సంతతశోభన కీర్తిసంతతుల్
గణనకు నెక్క వేంకటనగప్రభు పేర నొనర్చె సత్కవి
ప్రణుత విలాసరాజము ధరన్ దగనా విధుతారకంబుగన్.

సంపూర్ణము