Jump to content

శ్రీ దేవీ భాగవతము

వికీసోర్స్ నుండి


శ్రీరస్తు

శ్రీ దే వీ భా గ వ త ము

మహాకవి దాసు శ్రీరాములు
మహాకవి దాసు శ్రీరాములు స్మారకసమితి

హైదరాబాదు

1978


మొదటి కూర్పు 1907

రెండవ కూర్పు 1920

మూడవ కూర్పు 1978
కాపీరైట్
ప్రచురణ కర్తలు :

మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి

వాణీ సదనము 3-4-885/A బర్కత్‌పుర

హైదరాబాద్-560 027
ముద్రణ : వాణీ ప్రెస్, విజయవాడ.మూల్యం రు 60-00

దేవీ భాగవతము

చ. వినఁబడె ముల్గు పాపయ కవిప్రవరుం డొక వందయేండ్లకున్
    మును వెలిగించి భాగవతమున్ సరసంబుగనంచు, దీని ము
    ద్రణమున నాల్గు స్కంధములు దాటినవెన్క; నతండు నాదు వం
    దనముల కర్హుఁ డెంతయును ధన్యుఁ డతండుగదా ధరాస్థలిన్ .చ. తిరుపతి వేంకటేశ్వర సుధీమణుల న్గొనియాడి మ్రొక్కెదన్
     సరసులు నాకు మిత్రులును సర్వజనస్తవనీయపాండితీ
     భరితయశుల్ తెలుంగునను భాగవతంబు రచింపఁ బూనిరం
     చెరిగితి వారివల్న గణియుంపరు నా యపరాధపుంజమున్.

క్రొన్నుడి

ముక్కోటి యాంధ్రుల మన్ననల నంది నేడు ముచ్చటగా మూడవ ముద్రణ మంది పాఠకమహాశయుల హస్తముల సలకరించుచున్న దీ "శ్రీమదాంధ్ర దేవీభాగవతము".

గ్రంథకర్త శ్రీ దాసు శ్రీరాములుగారు. క్రీ. శ. 18 వ శతాబ్ద్యుత్తరభాగమందును 23 వ శతాబ్ద్యారంభమునను మహాకవిగా ఖ్యాతిగన్న మహామనీషి. వారనేక శాస్త్రములందు సిద్ధహస్తులు. ఏకసంథాగ్రాహులు. బహుముఖ ప్రజ్ఞావంతులు, లఘుకృతులలో వేరేన్నిక గన్న "తెలుఁగునాఁడు" నందలివియు, బృహద్గ్రంథమయిన శ్రీదేవీభాగవతములోనివియు నగు పద్యము లిప్పటి కపులకుగూడ కంఠస్తములే.

శ్రీ దాసు శ్రీరాములు గారు రచించిన పొతములలో కొన్ని ముద్రితములయ్యు లభ్యమగుట కడు దుస్తరముగా నున్నది. కొన్ని శిథిలము లయినవి. మఱియు కొన్ని వ్రాతప్రతులుగానే నిలిచిపోయినవి. వీరి రచనలను జిజ్ఞాసువులకు లభ్యములు కావించుటద్వారా వీరి ఖ్యాతిని పునరుద్ధరణ మొనర్చుట ముఖ్యవిధిగా నెంచి మేము 1978 వ సంవత్సరము డిసెంబరు మాసములో “మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి" ని హైదరాబాదులో స్థాపించతిమి. వారి గ్రంథములు సేకరించుట, వాని ముద్రణ యనున వీ సమితి ముఖ్యాశయములు.

వీనిని దృష్టియందుంచుకొని ముద్రితములై యున్న గ్రంధములను కొన్నిటిని, ఆముదిత్రములైన 1. కురంగగౌరీశంకర నాటికను, 2. లక్షణావిలాస మను యక్షగానమును ఇప్పటికి సేకరింపగల్గితిమి. శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రుల వారిచే "రెండవ శ్రీనాథుడు"గా నేగ్రంథము వలన శ్రీరామకవిగారు భావింపబడిరో యా "తెలుఁగునాడు" 6వ కూర్పు ప్రప్రథమముగా మాచే ముద్రితమైనది. ప్రబంధలక్షణములన్నియు గలిగి, వచనములో నపూర్వకథతో నొప్పు "అభినవగద్యప్రబంధము" అటుపిమ్మట ముద్రణ నొందినది. ఆ తదుపరి వీరి జయంతి సంచిక. గ్రంథకర్తగారికి 'మహాకవి'యను బిరుదమును సమకూర్చిన ఈ దేవీభాగవతము నాల్గవది. ఆ ముద్రణమునందు వెనుకటి కూర్పులలోని దోషములు సవరింపబడినవి.

శ్రీ దాసు శ్రీరామామాత్యులవారు రచించిన యేగ్రంథమైన మా కందజేసియైనను, లేక యది లభించుతావు నెఱుకపరచియైనను మా యత్నము సఫల మొనరింప పాఠకమహాశయులను ప్రార్థించుచున్నాము.

మాకీ గ్రంథముద్రణమున సహాయ మొనర్చిన యెల్లరకు కృతజ్ఞతలు.

మాకు చేదోడు వాదోడుగా నుండియు, నిర్మాణమునకు పెక్కువిధముల దోడ్పడియు, మాకు సమధికోత్సాహము గల్పించిన “ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి" వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

హైదరాబాదు
20-7-1978
దాసు పద్మనాభరావు,
అధ్యక్షుడు
మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి.

శ్రీ దే వీ మ హి షా సు ర మ ర్ద ని
( శ్రీ కనకదుర్గ కళా సమితి సౌజన్యంతో )

ఆం ధ్ర దే వీ భా గ వ త ము

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

పీఠిక

ఆన 1000 సంవత్సరారంభమున గ్రంథకర్త దేవీభాగవతాంధ్రీకరణము నారంభించి ఐదుమాసములలో నాపని పూర్తిచేసి శుద్ధప్రతి నొకదానిని స్వహస్తమున వ్రాసి ముద్రణ కొసఁగిరి. కాని యా సమయమున వారి స్వకీయ ముద్రాక్షరశాలలో సర్కారు పను లధికముగ నుండుటచేతను, ముద్రాయంత్ర పరికరములు మితముగ నుండుటచేతను, నీ గ్రంథము తమ ముద్రణాలయమున ముద్రించుట కవకాశము గలుగదయ్యె.

కావున నితర ముద్రణాలయములలో నీకార్యము నిర్వహించవలసిన యావశ్యకత కలిగినది. ఆకారణముచేత గ్రంథము 1907 వ సంవత్సరమువరకు బయలువెడల వలను బడలేదు . అప్పటికొక సంవత్సరమునకు ముందు గ్రంథకర్తకు శరీరమందు జాడ్యమేర్పడెను, సవరణ పత్రములను మిక్కిలి జాగరూకతతో జూడ శక్తి చాలక యుండెను.వారి శరీరము నానాటికీ స్వాస్థ్యము తప్పుచుండుటయు, ముద్రణ మాలస్యముగ జరుగుచుండుటయు, తెలిసికొని వెంటనే యప్పటికి ముద్రితముగాక నిలచి యున్న చివరి యైదు స్కంధములు తమ ముద్రణాలయముననే పని జరుగునట్లేర్పాటుచేసిరి.

ఈ గ్రంథముయొక్క ముద్రణము ముగిసిన పదిమాసములతో గ్రంథకర్త మృతి చెందెను. సావధానముగ నీ గ్రంథమును తిరిగి పరిశీలించుటకుగాని ముద్రణా స్ఖాలిత్యములను బరికించుటకుగాని తగిన యవకాశము గ్రంథకర్తగారి జీవిత కాలమున వారికి జిక్కకుంటచే నిందు నచ్చటచ్చట గొన్ని లోపము లుండునేమో యని శంక పొడమినది. అట్టి లోపములెచటనైన గాన్పించినచో చదువరులు వానిని మాకు దెలుప బ్రార్థితులు.

మొదటి ముద్రణ మితరస్థలముల యందు జరిగిన కారణము చేతను, చిన్న యక్షరములతో గూర్పబడి యుండుటచేతను జదువరుల కంటి కింపుగ నుండలేదు.

ఇప్పుడు పెద్ద యక్షరములలో గూర్పబడి విలుపగల మంచి కాగితములపై ముద్రింపబడినది.

ఈ గ్రంథము యొక్క కవితారచననుగూర్చియు, కవియొక్క ప్రజ్ఞావిశేషములను గూర్చియు, నిందు ముద్రింపబడిన బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శతావధాని గారి యుపోద్ఘాతమే చెప్పుచున్నది. కావున వేరుగ వ్రాయ నవసర ముండదు .

బెజవాడ 1-10-1928.

దా సు కే శ వ రా వు

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.