Jump to content

శ్రీరంగమహత్త్వము/పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీరంగమహత్త్వము

పీఠిక

శ్రీమతే రామానుజాయ నమః

సప్తప్రాకారమధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే
కావేరీమధ్యదేశే ఫణిపతిశయనే శేషపర్యంకభాగే।
నిద్రాముద్రాభిరామం కటినికటశిరఃపార్శ్వవిన్యస్తహస్తం
పద్మాధాత్రీ కరాభ్యాం పరిచితచరణౌ రంగరాజం భజే౽హం॥

మానవల్లి రామకృష్ణకవిగారు (1888-1957)

శ్రీరంగమహత్త్వమును ప్రప్రథమముగా ప్రచురించి (1912) వెలుగులోనికి తెచ్చినవారు - శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు, ఆంధ్రవాజ్ఞయమునందు మౌలికమైన పరిశోధన గావించిన కొందరిలో ముందుగా పేర్కొనదగిన కవిగారు - మన తెనుగుసాహిత్యవిమర్శనమునకు పాధేయ మొసంగినారు. ఆంధ్రమునందేగాక - ద్రావిడ కర్ణాట కేరళ ప్రాకృత సంస్కృత భాషాసాహిత్యములందు వీరు గొప్ప వైదుష్యము గలవారై ఆయాభాషలయం దెంతగానో కృషి సల్పిరి. ప్రాచీ గ్రంథపరిశోధనము చేసి ఆ గ్రంథముల సంస్కరించి ప్రకటించుటయందును, శబ్దముల సాధ్వసాధుత్వముల నిర్ణయించుటలోను - వీరికి గల ప్రజ్ఞాపాటవములు ఇతరులయం దంతగా లేవన్నను అతిశయోక్తి కాదు. దీనికితోడు - వీరికి అపారమైన ధారణాశక్తి, సరసమై ప్రబంధఫక్కిలో కవిత్వము చెప్పు నైపుణ్యము - బంగారమునకు తావి యబ్బినట్లైనది.

సాహిత్యరంగమున కెనలేని కృషిచేసి - యనేకకృతిరత్నముల బయటకు దీసిన వీరిని, సరస్వతి మాత్రమే చల్లచూపు చూచి లక్ష్మి పెడకన్ను పెట్టినది. తెలుగుదేశము మాత్రము వారికి బాకీ పడియున్నది. ఒక్కమాటలో చెప్పవలెనన్న - నన్నయగారి పేరెత్తకుండా తెలుగుకవిత కవిగారిని పేర్కొనకుండా సాహిత్యపరిశోధన - లేదు.

కవిగారు తెలుగువారి పుణ్యమో? ఆంధ్ర - శారద యదృష్టమో? యనునట్లు (క్రీ. శ. 1904నుండి) కొంతకాలము వనపర్తి ప్రభువువద్ద అంతరంగికకార్యదర్శిగా నున్నారు. వారికి ఈ సమయము సాహిత్యపరిశోధనకు చక్కగా ఉపకరించినది. సంస్థానాధీశ్వరులు వీరికి అన్నివిధాలుగా సాయపడినారు. అప్పుడే 'విస్మృతకవులు' అనుపేర మనోహరము లగురచనలను సాహిత్యోద్యానమున గుబాళింపచేసిరి. (ఈ గ్రంథమున గల ప్రథమముద్రణ చివరి అట్టపేజీపై వాని జాబితా గలదు.) అట్టివానిలో నొకటి భైరవకవిప్రణీతమైన యీ శ్రీరంగమహత్త్వము, ఆనాడు కవిగా రీగ్రంథముల సంపాదించి ప్రకటించకున్నచో - నేడు- చాలభాగము వాని నామరూపము లైనను లేకుండెడివి. కవిగారి కీప్రతి లభించిన పద్ధతిని గూర్చి- వారు వ్రాసినదానినే యిచట పొందుపరచుచున్నాను.

'ఈకృతి నాకు రెండు ప్రతులు వనపర్తి సంస్థానాధీశ్వరుల తాళపత్రలిఖితగ్రంథములలోనే లభించినవి. అందులో నొకటి 188 సంవత్సరములకుఁ బూర్వమునను దానికిఁ బుత్రికయగు వేఱొకటి 98 సంవత్సరములకుఁ బూర్వమునను దత్సంస్థానాధీశుల ప్రేరణంబుననే లిఖింపఁబడినవి. నేను దత్సంస్థానాధీశ్వరాశ్రయము వొందనికాలమున గ్రంథాన్వేషణము నిమిత్తము గద్వాల వనపర్తి సంస్థానాదులఁ గొంతకాలము సంచరించి వారి యనుగ్రహంబునకుఁ బాత్రుండనై గద్వాలలో భోజరాజీయాదికృతులు సంపాదించి వనపర్తిలోఁ బుస్తకములు శోధించుటకు ననుజ్ఞ వడసి వానియెదుటఁ గూర్చుండి తాళదళసంపుటముల విప్పదొరకొనుసమయమున నకస్మాత్తుగా నప్పకవి యుదాహరించినఁ "గందపుగొండనెత్తము" యను భైరవునిపద్యము మనస్సునకు స్ఫురించెను. అంత నయ్యో! మన కేల యీకావ్యము ఈ గ్రంథసమితిలో లభింపరా దని మొట్టమొదటిపుస్తకము విచ్చి కొన్ని యాకులు ద్రోచి చదువఁగాఁ బ్రప్రథమమునఁ బై పద్యమే దృష్టిగోచర మయ్యెను, నాకుఁ గలిగిన యమందానంద మిట్టిదని చెప్పఁ జాల. కుమారసంభవాది సత్కృతుల కున్నిది తీసిపోయినను నే నుత్సుకుఁడనై వెదకిన కృతిలోఁ బై పద్యమే మొదట గోచరించుట వైచిత్రీవిశేష మని తెలియబఱచితిని -' (పీఠిక-పుట viii)

ఈ పీఠికద్వారానే కట్టా వరదరాజు అనుకవిని గూర్చి - ఆతని శ్రీరంగమహత్త్వమును గూర్చి తెల్పినారు, వారు తెల్పువరకు వరదరాజు శ్రీరంగమహత్త్వమును గూర్చి యెవ్వరికిని తెలియదు.[1]

1912 సంవత్సరమునందు రామకృష్ణ కవిగారు మొట్టమొదటి మారు ప్రచురించిన - తెనుగులో మొదటిదైన - శ్రీరంగమహత్త్వము పీఠికలోనిది - ఈవిషయము.

కవిగారు ఒక గ్రంథమునకు పీఠిక వ్రాయుచున్నపుడు దానికి సంబంధించిన ఇతర గ్రంథములగూర్చి తెల్పుదురు. ఇది మంచిపద్ధతి. మానవల్లివారు - వనపర్తి సంస్థానమున నున్నప్పుడే కాకతీయశాసనములు సేకరించిరి ('కొన్ని కాకతీయ శాసనములు") తరువాత భారతి (రక్తాక్షి - పుష్యము) పత్రికయం దివి ప్రచురింపబడినవి - వీనిలో నొకటి - సిద్ధేశ్వర శాసనము. ఇది సంస్కృతమున చక్కనిశైలిలో గల నిరోష్ఠ్యకావ్యము, తెలంగాణమున శాసనములందు నిరోష్ఠ్యరచన - ఇదియేగాక బూదపుర శాసనమునందును గలదు - (మహబూబ్ నగరం జిల్లా)

ఈ విధముగా బహుముఖములైన కృషి చేసిన కవిగారు వనపర్తి సంస్థానమున యపవాదులపాలై - ఉద్యోగమును వదలి మదరాసు చేరుకొనిరి - వారి ఆబాధను - 'శ్రీరంగమహత్త్వము' పీఠికలో నిట్లు తెల్చిరి.

'వ్యయప్రయాసములమాట బోనిచ్చి శతచ్ఛిద్రవ్యాకులంబగు తాళదళపరిశోధనం బధ్యాసవశంబున జుగుప్సారహితంబుగ నలవఱచుకొని కార్యము నెట్లో - నిర్వహించుచుండుటయు కొంద ఱీర్ష్యాగ్రస్తులు చూచి యోర్వక పరిపరివిధముల నగుబాటు పఱచుచున్నారు" - (పుట vii)

అసూర్యంపశ్యలై యున్న అమూల్యగ్రంథములను వెలుగులోనికి తెచ్చినందుకు నాడు కవిగారికి మిగిలినది - మనోవ్యధ - వ్యాకులత, వనపర్తిసంస్థానమును వదలుట.[2]

'అంధకజనదూషితంబులు ఘనంబులు గావె
యమూల్యరత్నముల్'

ప్రాతఃస్మరణీయు లైన కవిగారు ప్రకటించిన గ్రంథమును మరల ఈనాడు నా సంపాదకత్వమున సాహిత్య ఎకాడమీవారు ముద్రించుచున్నందులకు ధన్యుడను.

కవిగారిపై నాకు గల భక్తిభావము ఈ నాల్గుమాటలు వ్రాయించినది. ఆ యశశ్శరీరునకు సవినయముగా వందనసహస్రము లర్పించుచున్నాను.

పండితప్రభాకరులు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు క్రీడాభిరామము పీఠికలో కవిగారిని గూర్చి -

"సాహిత్యప్రపంచమున మాబోంట్లు తిన్నగా
కన్నులు తెఱువక పూర్వమే రామకృష్ణకవి
గారు ప్రాచీనప్రబంధములను ప్రకటించిరి -"

(క్రీడాభిరామ పీఠిక - 1930)

వీరు ప్రకటించిన 'శ్రీరంగమహత్త్వము' శ్రీరంగక్షేత్రవిషయము గలది గదా! అందువలన శ్రీరంగమును గూర్చి స్వల్పపరిచయము చేయుదును-

శ్రీరంగము

దక్షిణదేశమందలి అతిప్రాచీనములైన పుణ్యక్షేత్రములలో పేర్కొనదగినది శ్రీరంగము. అరవవారు దీనిని అరంగమందురు. నేటి తమిళనాడురాష్ట్రములో తిరుచినాపల్లి జిల్లాయందు ఈ క్షేత్రము గలదు. ఇచ్చటిస్వామి శ్రీరంగనాయకులు. 108 దివ్య తిరుపతులలో నొకటగు ఈ క్షేత్రము - శ్రీవైష్ణవులు సేవించు ముఖ్యక్షేత్రములలో నొకటి. ఈ దేవాలయ నిర్మాణము ఎప్పుడు జరిగినది చరిత్రకారులకు అందని విషయము. పురాణములయందు మాత్రము ఇది క్రీ పూ 10 శతాబ్దానికి చెందిన ఆలయ మని గలదు. దేవాలయ శాసనాలు — రికార్డులు- 10 శతాబ్దము A. D. నుండి గలవు. ప్రస్తుతమున్న దేవాలయము 13 శతాబ్దమున అభివృద్ధి చేయబడినది. దీనికి పాండ్యులు ముఖ్యులు. అనంతరము వచ్చిన రాజవంశములవారు ఈ స్వామివారికి భూరిదానము లిచ్చినట్లు మన చరిత్రలు తెల్పును.

ఇట్టి దివ్యక్షేత్రము — ఎన్నియో రాజకీయమైన దండయాత్రలను - అన్యమతస్థుల ప్రధ్వంసకార్యములను అనుభవించినది. ముఖ్యముగా మహమ్మదీయుల దండయాత్రల వలన దేవాలయశోభ చెడిపోయినది. క్రీ. శ. 1371లో - మలిక్ కాఫిర్ దండయాత్ర (బుక్కరాయల మధురా విజయయాత్ర కూడా ఈ సమయముననే) జరిగినప్పుడు ఆ అల్లకల్లోలములకు తట్టుకొనలేక - శ్రీమాన్ వేదాంతదేశికులవారు- స్వామివారి విగ్రహమును తిరుపతికి తీసుక వెళ్ళి రక్షించి- అనంతరము యథాస్థానమును చేర్చినారట. ఈ విషయమును దెలుపుచు దేశికులవారు వేయించిన ఒకశాసనమునం దీ క్రింది శ్లోకము గలదు.

'ఆనీయానీలశృంగద్యుతిరచితజగద్రంజనాదంజనాద్రేః
చెంచ్యా మారాధ్యకంచిత్ సమయమధనిహత్యోధనుష్కాన్ తురుష్కాన్
లక్ష్మీక్ష్మాభ్యా ముభాఖ్యాం సహనిజనరరే స్థాపయన్ రంగనాథం
సమ్యక్చర్యాన్ సపర్యాన్ పునరకృతయశఃప్రాపణో గోపనార్యః॥

(బుక్కరాయల ధర్మోద్ధరణమును శ్లాఘించుచు దేశికులవారు శిలాఫలకమును వేయించుచుండగా- గోపనదండనాథుడు స్వామివారికి చేసిన యనితరసాధ్య మగు బృహత్ కైంకర్యమును - దలచి - ఆశువుగ నీ శ్లోకమును చెప్పి- వ్రాయించినారు)

ఆనాటి దండయాత్రలకు దేశికులవారు ఎంతగా కుమిలిపోయిన దీశ్లోకమే తెల్పుచున్నది.

ఈఅలజడుల కారణముగా అప్పటికి విజయనగరరాజులచే నిర్మాణము చేయింపబడుచుండిన స్వామివారి గోపురనిర్మాణముకూడా ఆగిపోయినది. తర్వాత అనగా క్రీ శ. 1530-1542సం.లో చేరరాజు విజయానికి చిహ్నముగా అచ్యుతదేవరాయలవారు నిర్మింప తలపెట్టిన గోపురముకూడా 46 అడుగుల పరిమాణములోనే ఆగిపోయినది.

ఆనాడు అచ్యుతదేవరాయలవారు అసంపూర్తిగా వదిలిన గోపురమును నేడు తమిళనాడు ప్రభుత్వమువారు పూర్తిచేయ తలపెట్టి 20-5-1979 నాడు ప్రారంభోత్సవము చేసినారు. ఇది పూర్తియైనచో- 248అడుగుల ఎత్తు, 15 అంతస్థులు ఉండగలదు.

ఆశ్చర్యకరమైన విషయ మేమనగా- ఈరాజగోపురము పునాది (ఫౌండేషన్) 18అడుగులకు మించిన లోతులో గలదట. శ్రీ లోకనాథం అనే చీఫ్ఇంజనీయరు- త్రవ్వించిచూడగా - అంతు చిక్కలేదు - గాని అపరిమితముగా నీరు మాత్రము ఊరి వచ్చినది, 'ఆజలాంతం- 'దేవాలయనిర్మాణ మనుపద్ధతికి ఇది యొక తార్కాణము.[3]

స్వామివారి గర్భాలయము సప్తప్రాకారములు దాటిన తర్వాత గలదు. ఇందలి మొదటి మూడుప్రాకారములు లౌకికుల పట్టణములు, నాల్గవదానినుండి- శ్రీరంగనాయకులవారి ఆస్థానము. అయినను, యాతాయాతజనవ్రాతము- ప్రయాణీకుల వాహనములు- ఈరద్దివలన మనము ప్రాకారములలోపల నున్నవిషయమే విస్మరింతుము.

ఇచట, స్వామివారిది శయ్యావిగ్రహము, సుమారు 20 అడుగుల మూలవిరాణ్మూర్తి, దేవాలయమున కుభయపార్శ్వముల కావేరి ప్రవహించును.[4] ఇచట ఈనది రెండుగా చీలి-ఉత్తరశాఖ కొల్లడ (కోల్ రూన్) అనే పేరు గలిగియుండును. దక్షిణవాహిని కావేరి-ఇది మరి ఐదు శాఖలుగా మారి ఆప్రాంతమును సస్యశ్యామలముగా చేసినది. త్యాగరాజస్వామివారి తిరువయ్యూరు (తిరు-అయ్యారు, ఐదునదులు) కావేరీతీరముననే గలదు.

కరికాలచోడుడు ఈకావేరికి ఆనకట్టలు కట్టించుట ప్రసిద్ధమైనవిషయము.

ఇట్టి శ్రీరంగక్షేత్రమున శ్రీవైష్ణవమతాచార్యులు తమప్రతిభాపాండిత్యములను-శక్తియుక్తులను ధారపోసి విశిష్టాద్వైతమతస్థాపన చేసి-ప్రచారము చేసినారు.[5]

శ్రీమన్నాథముని-యామునముని-శ్రీమద్రామానుజులు, పరాశరభట్టరు, దేశికులవారు, అందరూ ఈ కేంద్రమునుండియే తమ శ్రీసూక్తుల ప్రవచనము చేసిరి. దేశికులవారు ప్రధమపర్యాయము శ్రీరంగమునకు వేంచేసినప్పుడు- స్వామివారి అవయవ సౌందర్యమునకు ముగ్ధులై -'భగవద్ధ్యానసోపానము'ను రచించినారు. తమ ఆచార్యులవారి అనుశాసనమును కాదని- శ్రీరామానుజులవారు - ఈదేవళ శిఖరమునుండియే-అందరకును అష్టాక్షరీమంత్ర ముపదేశించి-ముముక్షువులుగా చేసి - ఆచార్యులవారి మంగళాశాసనములకు పాత్రమైరి. శ్రీవైష్ణవమతప్రచారము చేయుచు శ్రీమద్రామానుజులవారు ఈక్షేత్రముల సంచరించిరట.

శ్రీరంగం కరిశైల మంజనగిరిం తార్క్ష్యాద్రి సింహాచలం
శ్రీకూర్మం పురుషోత్తమంచ బదరీనారాయణం నైమిశం
శ్రీమద్ద్వారవతీ ప్రయాగ మధురా కాంచీగయా పుష్కరా
సాలగ్రామగిరిం నిషేవ్య రమతే రామానుజో౽యం మునిః॥

రామానుజులవారికి పూర్వము మిక్కిలిగా ప్రచారమునందని శ్రీ వైష్ణవము-వీరి అవతారప్రాదుర్భావముతో మిక్కిలిగా వ్యాప్తి చెందినది. వర్ణసాంకర్యమును (వర్ణభేదమును) శ్రీవైష్ణవ మంగీకరింపదు. అందు కుదాహరణము- ఆళ్వారులే. వీరియందు పంచమజాతివారును గలరు-శంకరాచార్యులవారు - మనీషాపంచకమునందు-

'చండాలో౽స్తు సతు ద్విజో౽స్తు గురురి త్వేషామనీషా మమ' అని సెల విచ్చినదానిని మొదట శ్రీవైష్ణవులే అవలంబించినారు.

రామానుజులవారి యనంతరము - దేశికులవారి హయాములో - ప్రపత్తిమార్గమున వచ్చిన భేదభావములవలన శ్రీవైష్ణవము - రెండు శాఖలుగా మారినది, ఒకటి - వడగళ్, రెండవది తెనగళ్, వడహలశాఖకు దేశికులవారు ముఖ్యులు కాగా తెనగల సంప్రదాయమునకు పిళ్ళలోకాచార్యులవారు ముఖ్యులైనారు. వీరి ప్రచారముల కారణాన మతాభివృద్ధి విశేషముగా జరిగినది.[6]

దేశికులవారి కుమారుడు - శిష్యుడును అయిన వరదాచార్యులవారు (వీరికే నైనారాచార్యులను నామాంతరము) రాచకొండ సంస్థానమునకు విచ్చేసి - పండితులతో వాదించి శైవుడైన శాకల్యమల్లనను ఓడించి - ప్రభువులను - కవిని శ్రీ వైష్ణవులుగా మార్చినట్టు చారిత్రకుల వ్రాతలు సాక్ష్య మిచ్చుచున్నవి. వీరినుంచియే తెలంగాణమునందు - శ్రీవైష్ణవము వ్యాప్తిచెంది వెలమ - రెడ్డి ప్రభువులు - శ్రీమతే రామానుజాయనమః - అనుచు - తదాచారములతోనే ఉండిరి. (నేటికిని వీరియం దీపద్ధతి తెలంగాణమున గలదు) వరదాచార్యులవారి ప్రభావమున - భట్టరు, కందళ - తిరుమల, నల్లాచ్చక్రవర్తుల - మొదలైనపీఠా లేర్పడినవి. వీరి ప్రభావముననే - తెలంగాణమున విష్ణ్వాలయముల నిర్మాణము - కవులు విష్ణుగాథాపూరితములైన రచనలు విరివిగా చేయుట జరిగినదనవచ్చును, తెలంగాణమున శ్రీరంగనాయక స్వామి ఆలయాలు వెలయుటకు కూడా ఇదియేకొంత ప్రోద్బలము ఈ విధముగా రాచకొండవారిపై బడిన శ్రీ వైష్ణవప్రభావము - కవులకును తప్పలేదు. అందుకే భైరవకవి శ్రీరంగమాహాత్మ్యమును వ్రాసినాడు, (ఈ భాగమున శ్రీ వైష్ణవవ్యాప్తియే సంక్షిప్తవరిచయము చేయబడినది, మతము - సిద్ధాన్తములు - సాహిత్యము వీనినిగూర్చి తెల్పలేదు -) ఇది పురాణానువాదముకావున - పురాణములు - మాహాత్మ్యములగూర్చి కొద్దిగా తెలిసికొందము — పుట:Shriiranga-mahattvamu.pdf/18 పుట:Shriiranga-mahattvamu.pdf/19 పుట:Shriiranga-mahattvamu.pdf/20 పుట:Shriiranga-mahattvamu.pdf/21 పుట:Shriiranga-mahattvamu.pdf/22 పుట:Shriiranga-mahattvamu.pdf/23 పుట:Shriiranga-mahattvamu.pdf/24 పుట:Shriiranga-mahattvamu.pdf/25 పుట:Shriiranga-mahattvamu.pdf/26 పుట:Shriiranga-mahattvamu.pdf/27 పుట:Shriiranga-mahattvamu.pdf/28 పుట:Shriiranga-mahattvamu.pdf/29 పుట:Shriiranga-mahattvamu.pdf/30 పుట:Shriiranga-mahattvamu.pdf/31 పుట:Shriiranga-mahattvamu.pdf/32 పుట:Shriiranga-mahattvamu.pdf/33 పుట:Shriiranga-mahattvamu.pdf/34 పుట:Shriiranga-mahattvamu.pdf/35 పుట:Shriiranga-mahattvamu.pdf/36 పుట:Shriiranga-mahattvamu.pdf/37 పుట:Shriiranga-mahattvamu.pdf/38 పుట:Shriiranga-mahattvamu.pdf/39 పుట:Shriiranga-mahattvamu.pdf/40 పుట:Shriiranga-mahattvamu.pdf/41 పుట:Shriiranga-mahattvamu.pdf/42 పుట:Shriiranga-mahattvamu.pdf/43 పుట:Shriiranga-mahattvamu.pdf/44 పుట:Shriiranga-mahattvamu.pdf/45 పుట:Shriiranga-mahattvamu.pdf/46 పుట:Shriiranga-mahattvamu.pdf/47 పుట:Shriiranga-mahattvamu.pdf/48 పుట:Shriiranga-mahattvamu.pdf/49 పుట:Shriiranga-mahattvamu.pdf/50 పుట:Shriiranga-mahattvamu.pdf/51 పుట:Shriiranga-mahattvamu.pdf/52 పుట:Shriiranga-mahattvamu.pdf/53 పుట:Shriiranga-mahattvamu.pdf/54 పుట:Shriiranga-mahattvamu.pdf/55 పుట:Shriiranga-mahattvamu.pdf/56 పుట:Shriiranga-mahattvamu.pdf/57 పుట:Shriiranga-mahattvamu.pdf/58 పుట:Shriiranga-mahattvamu.pdf/59 పుట:Shriiranga-mahattvamu.pdf/60 పుట:Shriiranga-mahattvamu.pdf/61 పుట:Shriiranga-mahattvamu.pdf/62 పుట:Shriiranga-mahattvamu.pdf/63 పుట:Shriiranga-mahattvamu.pdf/64 పుట:Shriiranga-mahattvamu.pdf/65 పుట:Shriiranga-mahattvamu.pdf/66 పుట:Shriiranga-mahattvamu.pdf/67 పుట:Shriiranga-mahattvamu.pdf/68 పుట:Shriiranga-mahattvamu.pdf/69 పుట:Shriiranga-mahattvamu.pdf/70 పుట:Shriiranga-mahattvamu.pdf/71 పుట:Shriiranga-mahattvamu.pdf/72 పుట:Shriiranga-mahattvamu.pdf/73 పుట:Shriiranga-mahattvamu.pdf/74 పుట:Shriiranga-mahattvamu.pdf/75 పుట:Shriiranga-mahattvamu.pdf/76 పుట:Shriiranga-mahattvamu.pdf/77 పుట:Shriiranga-mahattvamu.pdf/78 పుట:Shriiranga-mahattvamu.pdf/79 పుట:Shriiranga-mahattvamu.pdf/80 పుట:Shriiranga-mahattvamu.pdf/81 పుట:Shriiranga-mahattvamu.pdf/82 పుట:Shriiranga-mahattvamu.pdf/83 పుట:Shriiranga-mahattvamu.pdf/84 పుట:Shriiranga-mahattvamu.pdf/85 పుట:Shriiranga-mahattvamu.pdf/86 పుట:Shriiranga-mahattvamu.pdf/87 పుట:Shriiranga-mahattvamu.pdf/88 పుట:Shriiranga-mahattvamu.pdf/89 పుట:Shriiranga-mahattvamu.pdf/90 పుట:Shriiranga-mahattvamu.pdf/91 పుట:Shriiranga-mahattvamu.pdf/92 పుట:Shriiranga-mahattvamu.pdf/93 పుట:Shriiranga-mahattvamu.pdf/94 పుట:Shriiranga-mahattvamu.pdf/95 పుట:Shriiranga-mahattvamu.pdf/96 పుట:Shriiranga-mahattvamu.pdf/97 పుట:Shriiranga-mahattvamu.pdf/98 పుట:Shriiranga-mahattvamu.pdf/99 పుట:Shriiranga-mahattvamu.pdf/100 పుట:Shriiranga-mahattvamu.pdf/101 పుట:Shriiranga-mahattvamu.pdf/102 పుట:Shriiranga-mahattvamu.pdf/103 పుట:Shriiranga-mahattvamu.pdf/104 పుట:Shriiranga-mahattvamu.pdf/105 పుట:Shriiranga-mahattvamu.pdf/106 పుట:Shriiranga-mahattvamu.pdf/107 పుట:Shriiranga-mahattvamu.pdf/108 పుట:Shriiranga-mahattvamu.pdf/109 పుట:Shriiranga-mahattvamu.pdf/110 పుట:Shriiranga-mahattvamu.pdf/111 పుట:Shriiranga-mahattvamu.pdf/112 పుట:Shriiranga-mahattvamu.pdf/113 పుట:Shriiranga-mahattvamu.pdf/114 పుట:Shriiranga-mahattvamu.pdf/115 పుట:Shriiranga-mahattvamu.pdf/116 పుట:Shriiranga-mahattvamu.pdf/117 పుట:Shriiranga-mahattvamu.pdf/118 పుట:Shriiranga-mahattvamu.pdf/119 పుట:Shriiranga-mahattvamu.pdf/120 పుట:Shriiranga-mahattvamu.pdf/121 పుట:Shriiranga-mahattvamu.pdf/122 పుట:Shriiranga-mahattvamu.pdf/123 పుట:Shriiranga-mahattvamu.pdf/124 పుట:Shriiranga-mahattvamu.pdf/125 పుట:Shriiranga-mahattvamu.pdf/126 పుట:Shriiranga-mahattvamu.pdf/127 పుట:Shriiranga-mahattvamu.pdf/128 పుట:Shriiranga-mahattvamu.pdf/129 పుట:Shriiranga-mahattvamu.pdf/130 పుట:Shriiranga-mahattvamu.pdf/131 పుట:Shriiranga-mahattvamu.pdf/132 పుట:Shriiranga-mahattvamu.pdf/133 పుట:Shriiranga-mahattvamu.pdf/134 పుట:Shriiranga-mahattvamu.pdf/135 పుట:Shriiranga-mahattvamu.pdf/136 పుట:Shriiranga-mahattvamu.pdf/137 పుట:Shriiranga-mahattvamu.pdf/138 పుట:Shriiranga-mahattvamu.pdf/139 పుట:Shriiranga-mahattvamu.pdf/140 పుట:Shriiranga-mahattvamu.pdf/141 పుట:Shriiranga-mahattvamu.pdf/142 పుట:Shriiranga-mahattvamu.pdf/143 పుట:Shriiranga-mahattvamu.pdf/144 పుట:Shriiranga-mahattvamu.pdf/145 పుట:Shriiranga-mahattvamu.pdf/146 పుట:Shriiranga-mahattvamu.pdf/147 పుట:Shriiranga-mahattvamu.pdf/148 పుట:Shriiranga-mahattvamu.pdf/149 పుట:Shriiranga-mahattvamu.pdf/150 పుట:Shriiranga-mahattvamu.pdf/151 పుట:Shriiranga-mahattvamu.pdf/152 పుట:Shriiranga-mahattvamu.pdf/153 పుట:Shriiranga-mahattvamu.pdf/154 పుట:Shriiranga-mahattvamu.pdf/155

  1. కట్టా వరదరాజ కృతమైన శ్రీ రామాయణము (ద్విపద) ను - పరిష్కరించి 1950 సం, శ్రీ నిడుదవోలు వెంకటరావుగారు తంజాపుర సరస్వతీమహల్ సిరీస్ - 12 గా ప్రకటించినారు. ఇతని శ్రీరంగమహత్త్వము చెలికానిలచ్చారావుగారు 'ఆముద్రితాంధ్రగ్రంథసర్వస్వము'న - 8వ గ్రంథముగ ప్రచురించిరి. 1921 సం శ్రీరామవిలాసముద్రాక్షరశాల - చిత్రాడవారు - గ్రంథముగా వేసినారు.
  2. 'మానవల్లి కవిరచనలు' అను గ్రంథమును ఆం. ప్ర సా. ఎకాడమీ వారు, 1972 సం, ప్రకటించిరి. సంపాదకులు, శ్రీ నిడుదవోలు వెంకటరావుగారు, డా. పి. యస్. ఆర్. అప్పారావుగారు. ఈ గ్రంథమున కవిగారిజీవితము-విశేషాలు, వారి పీఠికలు, వ్యాసాలు, రచనలు, గలవు. అప్పారావుగారు-"నేనెరిగిన మానవల్లికవిగారు' అని 82 పుటల వ్యాసమును వ్రాసిరి. ఈ గ్రంథము తప్పక చదువదగినది.
  3. 29-7-79నాటి 'హిందూపత్రిక'లోని చిన్నవ్యాసము ఆధారముగా ఈవిషయములు గ్రహించనైనవి.
  4. ఇచ్చట కావేరి బాహువులు సాచిననాయిక యని-స్వామివారు నాయకుఁ డని- కవులవర్ణన-అట్టిదే-ఈ శ్రీరంగమాహాత్మ్యమునందు గలదు(1-104-141).
  5. 'వైష్ణవము'-విజ్ఞానసర్వస్వము. 3సం. తెలుగు సంస్కృతి. 560–565పుటలు.
  6. శ్రీవైష్ణవము - వివిధసంప్రదాయములు - శ్రీమాన్ చెలమచెర్ల రంగాచార్యులవారి వ్యాసము, సంగ్రహాంధ్రవిజ్ఞానకోశము - 8 సం. 417- 425 పుటలు, మరియు - తెలుగు జానపదగేయసాహిత్యము - డా॥బి. రామరాజుగారు. (ద్వితీయముద్రణ. 1978, పుటలు - 348 - 352)