శ్రీనివాసవిలాససేవధి/పీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక

"శ్రీనివాసవిలాససేవధి " యనునది ఆంధ్రదేశమునందలి ప్రసిద్ధపుణ్యక్షేత్రమగు తిరుపతి కొండపై నెలకొని శ్రీనివాసులని పేరుగన్న వేంకటాచలపతి విలాసములను విహారలీలలను వర్ణించు నొక చక్కని ద్విపదకావ్యము. ఆ దేవుని విలాసకథలకిది యొకనిధి. ఇది శ్రీ వేంకటాచలపతియే స్వయముగాగోరి శ్రేష్ఠలూరి వేంకటార్యుఁడను కవిచే రచింపించుకొని తాను కృతిగొన్న కావ్యములలో నొకటి. వెంకటవీరరాఘవ అనునది యీతని పూర్తిపేరయినట్లు బ్రౌనుదొరగారువ్రాసికొన్నదానినిబట్టి తెలియవచ్చుచున్నదిగాని, యా పేరీతని గురువగు అన్నావి అప్పలాచార్యులపేరుగాఁ గనఁబడుచున్నది. బ్రౌనుదొరగారది యీతనిపేరే అని పొరబడియుండవచ్చును.

వేంకటార్యుఁడను నీ కవి భారద్వాజగోత్రుఁడు. ఆపస్తంబసూత్రుఁడు.

“అష్టభాషా కవిత్వార్జిత ప్రోద్య
 దష్టావధాన విఖ్యాత బైరదుడు
 శ్రీ కృష్ణయార్య లక్ష్మీగర్భవార్థి
 రాకాసుధానిధి రాజపూజితుఁడు
 వివిధ విద్యాశాలి వేకటార్యుండు"

అగునీతఁడు కావ్యరచనాభిలాషియై యుండగా శ్రీ వేంకటేశ్వరు లాతనికి స్వప్నమునఁ గానుపించి,

"గరిమ నీక్షించి, యో కవివర్య మున్ను
 ధర సంస్కృతప్రాకృతముఖ భాషలను

ద్రవిడాంధ్రములఁ గ్రంధము లెన్నియైన
సవరించితివి మాకు సంతసంబెసఁగ
నొక కృతి శేషాచలోరువైభవము
ప్రకటితాలంక్రియాస్పదవర్ణనలను
విసువక శృంగార వీరాద్భుతాది
రసములు భావముల్ రంజిల్లునట్లు
ద్విపద లోకులకెల్లఁ దెలివిడిగాన
ద్విపదగాఁ దెనుగునఁ దేటగావించు
వారాహ వామన బ్రహ్మాండ పాద్మ
గారుడ స్కంద మార్కండేయ ముఖ్య
బహుపురాణోక్తి సంబాధంబువలన
గహనమై పెనుగొన్న కథ చిక్కుదీర్చి
శరధిలోపల రత్నజాతంబు లేర్చి
మెరుగుసానను దీర్చి మెలకువఁ దేర్చి
భూషణంబొనరించు పొలుపున కర్ణ
భూషణంబుగను సల్పుము చెల్వు గుల్క."

అని యానతీయ, నాతఁడు వెంటనె మేల్కాంచి, పెక్కు పురాణములలోఁ జిక్కుపడియున్న శ్రీనివాసుల కథలలో, పునరుక్త కథను ద్రోచి, మొదలుతుద యేర్పరించి, పూర్వోత్తర విరోధములను దోచనీక, సర్వ సమాధాన సరణిని, భావుకభావ సంభావ్యతనలరఁ గావించి, పటుమహాకావ్యలక్షణములు వెలయ నందే వేంకటాద్రిమాహాత్మ్య మింపొందునట్లుగాఁ దెనుఁగున నీ ద్విపదకావ్యమును భూనుతవిఖ్యాతి పొసగ

విరచింపఁ బూనినటులఁ జెప్పియున్నాఁడు. పిదప నా కృతిపతియగు ధవేంకటేశుని షడ్వి ప్రాకృత భాషలలో - ననఁగా - ప్రాకృతము, శౌరసేని, మాగధి, పైశాచి, చూళికోక్తి, భాండీరం అనువానిలో స్తోత్రము

చేసినాడు. ఈ కవి సంస్కృత ప్రాకృతములందును, ద్రవిడాంధ్రములందును పెక్కు కావ్యములను రచించి, యింతకు బూర్వమే తన కర్పించినట్లుగా నా వేంకటాచలపతి యితని కలలోఁ జెప్పుటను బట్టి తెలియవచ్చుచున్నదే గాని యీతని యితర గ్రంథములేవియు నింతవరకు గానరాలేదు. ఆరు ప్రాకృతములలోని యల్పరచనలు మాత్ర మీ గ్రంథముననే గానవచ్చుచున్నవి. ఈతనిది ద్విపదరచనయే యైనను దాని నీతడు

"చటులార్ధకల్పనల్‌ శబ్దసందర్భ
మొరపొంద మాధుర్య ముల్లసిల్లగను
వరున పద్దెనిమిది వర్ణనల్ గులుక
నతుల శృంగార వీరాద్భుతరసము
లతిశయింపగ విభావాది భావములు
భావుక భావ్య సంభావ్యత నలరఁ
గావించి పటు మహాకావ్యలక్షణము
వెలయఁ దెనుంగున ద్విపదకావ్యముగ "

రచింపఁబూనినట్లు చెప్పికొన్నాఁడు. అట్లీ రచన ద్విపదయే యైనను మహాకావ్యలక్షణములతోఁ గూడినదై యే యున్నదనుటకు సందేహములేదు. వేంకటాద్రిమాహాత్మ్యమును, శ్రీనివాసుని విలాసములను వర్ణించు గద్యపద్యాత్మకములగు గ్రంథము లనేకములున్నను, ఈ ద్విపదరచనయే చక్కని తెనుఁగుదనముగలిగి, కావ్యలక్షణములతోఁ గూడి వానికన్న మిన్నయేమై యున్నదని చెప్పఁదగియున్నది.

ఈ వేంకటార్యుని తండి పేరు కృష్ణయార్యుఁడు, తల్లి లక్ష్మి. ఈతఁ డశేషదేశికులకెఱగి "వాధూల వంశావతంసుడగుఁ నస్మదాచార్యు నన్నావి యప్పలాచార్యు" ని భజియింతునన్నాఁడు. దీనిని బట్టి యితఁడు వాధూలవంశావతంసుఁ డగు అన్నావి అప్పలాచార్యుల పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/7 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/8 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/9 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/10 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/11 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/12 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/13 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/14 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/15 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/16 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/17 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/18 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/19 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/20 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/21 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/22 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/23 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/24 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/25