శ్రీతులస్యుపాఖ్యానము/త్రయోదశాధ్యాయము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

బ్రహ్మవైవర్త పుహాపురాణము. ప్రకృతిఖండము.

శ్రీతులస్యుపాఖ్యానము.


నారదుఁ డిట్లనియె. సాధ్వి యు నారాయణునికిఁ బ్రియురాలు నగునా లక్ష్మి యెట్లు తులసియ య్యెను ఎచ్చట జన్మించెను? ఆ 'మె పూర్వజన్మ మున నెవ్వతె ఆమె ఎవ్వనికులమునఁ బు ఫొట్టినయది? ఆతపస్విని యెవ్వని కన్యక? ఆమె యేత పంబు చేసి బ్రకృతికం టెం బరుండును నిర్వికల్పుల డును నిరీహుండును సర్వ సాక్షి స్వరూపుఁడును పరబ్రహమయుఁడుము పరమాత్త స్వరూపుఁడుసు ఈశ్వరుండును సర్వారాధ్యండును. సర్వే శ్వరుండుసు సర్వజ్ఞుండును . సర్వకారణ కారణుఁడును సర్వాదారుఁ డును సర్వమయుండును సర్వరక్ష కుండును నగునా గాయణునిం జెం దెను? ఇట్టి దేవి యెట్లు వృక్షుత్వంబుఁ జెందెను? ఆతపస్విని యె ట్లసు రునిచే నాక్రమింపంబడి యె?ఇందు సందియంబు నొందుచు సొమనము లోల 'మై పలుమా:) నన్నుఁ బ్రేరేపించుచున్న యది. సర్వసం దేహము లను బోనడఁచునోనారాయణ మహర్షి నీవు నాసం దేహములఁ బాపు దగుడు వనియడిగిన నారాయణమహర్షి యానారదుని కి ట్లనియె.

తులసితండ్రియగు ధర్మధ్వజుని వంశక్రమము.

దక్షసావర్ణి యసుమనువు పుణ్యవంతుఁడు ను వైష్ణవుఁ డు ను శుచి యు యశ స్సంపన్నుఁడు ను కీర్తిమంతుఁడు నైన వాఁడు. ఆతఁ డు విష్ణునీయంశము చే సంభవించిన వాఁడు. ఆతని పుత్రుఁడు ధర్మసా వర్ణి (మనువాఁడు ధరిష్ఠుఁడు ను వైష్ణవుఁడు ను శుచి యు నై యుం డెడివాఁడు ' ఆతని పుత్రుఁడు విష్ణుసావర్ణి యనువాఁడు, అతఁడు వైష్ణ వుఁడు ను జితేంద్రి యుఁడు నగువాఁడు. అతని పుత్రుఁడు దేవసావర్ణి యనువాఁడు విష్ణువ్రత పరాయణుఁడు. అతని పుత్రుఁడు రాజసాసర్ణి యను వాఁడు మహా విష్ణుభ క్తుఁడు, ఆరాజసావర్ణి కుమారుఁడు వృషధ్వజుఁ డనువాఁడు వృషధ్వజునిభక్తుండు. శంభు వాతనియాశ్రమమునందు మూఁడు దేవయుగములు వసియించియుండెను. శివునికి నారాజునం దుఁ బుత్రునికం టె నధికమయిన ప్రీతి గలదు. ఆవృషధ్వజుఁడు యణుని లక్ష్మిని సరస్వతిని గారవింపనివాఁడు, మఱి యాతఁడు సర్వ దేవతల పూజనములు దూరీభూతములు గావించె.మదమతిశయించియా రాజు. భాద్రపదమాసమునఁ బ్రవృత్త మగుమహాలక్ష్మీ పూజనమును ఖండించి మాఘమాసమునఁ బ్రవ ర్తింపంబడు సరస్వతీ పూజనంబును నిలిపి వేసెను. అతఁడు యజ్ఞమును విష్ణు పూజనమును నిందించి నవి సేయక యుండె. శివుఁ డాతనియందుఁ బ్రీతుం డై జేసి యేసురలు ను ఆరా జేంద్రుని శపింప రైరి. దివాకరుఁ డా రాజును శ్రీవిహీనుఁ డగునట్లు శపియిం చె. అది యెఱింగి శంకరుఁడు శూలముఁ గైకొని సూర్యుని పైకిఁ బోవుడు దిననాధుఁడు తనతండ్రి యగుకశ్యపునిఁ దోడుకొని బ్రహలోకమునకుం జని యానలువను శరణుజొచ్చెను. శివుఁడు ను క్రోధము చే ద్రిశూలము హస్తము నఁ దాల్చి బ్రహలోకమునకుఁ బోవ బ్రహ యు భయభ్రాంతుఁ డై సూర్యుని మున్ని డుకొని వైకుంఠమునకుఁ జనియె. అంత శంకరుం డు శూలముఁ దాల్చి తాను సూర్యుని వెంబడించి పరుగిడ బ్రహ గశ్యపుడు సూర్యుండు ను సంత్రాసము నొందుచుఁ దాలు వులఁ దడి యెండఁ గా సర్వేశ్వరుఁ డగునా రా యణుని శరణు కొచ్చిరి. వారలుశిరములు వంచి హరికిఁబ్రగా మములు గావించి మాటి మాటికి. సంస్తుతులు సల్పి యందఱును తమభ సుములకుఁ గారణము విన్న వించుకొనఁ.. గా నారాయణుఁడు .కృపాయ త్తచిత్తు, డై వా రల కభయ మొసఁగి యోభీతులారా మీరు ర్యమున నుండుఁడు నేనుండఁగా మీకు భయ మెక్కడిది? ఎవ్వరు విపదము సంభవించి నప్పుడు భయముఁ జెంది నన్ను సంస రిం చెదరో వారలను వా రుం డుచోటికి చక్రాయుధుండ నై వేగం బ చని రక్షించుచుండుదును. ఓదేవతలారా నేను జగములకుఁ బాలకుఁడను. నేను నిరతము సృష్టి కర్తను. బ్రహస్వరూపమున సృజించెదను.. శివరూపమున సంహరిం చెదను. "నేన శివుఁడను. బ్రహ వగునీవును నేన. త్రిగుణాత్మకుఁ డగు సూర్యుండు ను నేన, నానారూపములం దాల్చి సృష్టిని పరిపాలిం చుచున్నాఁడను. మీరలు. పొండు. మీకు శుభ మగును. భయము మీ కేల? ఇది దొట్టి నావరము చేత శంకరునివలని భయము మీకు లేదు. భగవంతుం డగునీశంకరుండు శీఘ్రము గ సంతోషము నొందువాడు. అతఁడు సత్పురుషులకు గతి యగువాఁడు. సుదర్శన చక్రమునందును శివునియందును నాకు నా ప్రాణములకం టెఁ బ్రియ మధిక మై యుండు. ఈయిఱువురకం టెఁ దేజస్వి యగువాఁడు బ్రహ్లాండముల లేఁడు, మహాదేవుఁడు లీల'మెయి గోటి సూర్యుల నైనను సృజియింప శక్తుఁడు, ఇట్టి బ్రహలను కోటిసంఖ్యుల నైనఁ గలిగించును. ఆళూలి కసాధ్య మేమి యున్నది! నన్ను దీవానిశము "ధ్యానించు చుండుటం జేసి యాతనికి బాహ్యజ్ఞాన మొకించుక యుండదు. అతఁ డు భక్తితో నానామములను నాగుణముల నైదు మొగములచేఁ గీ ర్తించుచుండు. నేను ని బ్లాతనికిఁ గల్యాణము గలుగ నగు నని చింతిం చుచుందును. ఎవ్వరు న న్నెట్లు జెం దెదరో వారల నే నట్లు భజియిం చెదను.ఆభగవంతుఁడు శివస్వరూపుఁడు. శివమున కధిదేవత. అతని వలన శివమగును, కాన బుధు లాతని శివుఁ డని పల్కుదురు. అని చెప్పుచుండఁగా నాసమయమున శంకరుఁడు శూలమును కేలు గిలిం చి వృషభారూఢుఁ డై రక్తపంకజములకు సమానము లగులోచన ములతో సయ్యెడకుం జనుదెంచి తూర్ణముగ వృషభ వాహనము డిగ్గి భక్తి వినమ్రం బయినకంఠముతోఁ బరాత్పరుడు ను శాంతుండు నమనలక్ష్మీ కాంతునికి నమస్కరిం చెను. ఇట్లు రత్న మయభూషణభూషితుఁ డయి; కిరీటమును, కుండలములను, వనమాలయు, చక్రాయుధమును దాల్చి; నవీననీరదమున కొప్పయిన శ్యామసుందర విగ్రహముతోఁ ' జతు ర్భుజములతోఁ జందనం బలఁదినసర్వాంగములతో(బీతాంబరముతో బొడసూపుచు; లక్ష్మీ దేవి యందిచ్చు తాంబూలము భుజియించుచు;మంద స్మి తసుందరముఖారవిందుడైఁ విద్యాధరకాంతలు నేయున స్తనము సూచుచు చతుర్భుజు లగు పార్షదులు వింజామరములు వీచుచుండ రత్న సింహాసనమున వేంచేసియుండునా 'పరమాతునికి భక్తానుగ్రహ విగ్రహుం డగువానికి నమస్కృతు లొనరించి యమహా దేవుండు బ్రహకును ప్రణామంబుఁ గావించె. సూర్యుండును సంత్రస్తుం డగుచు భక్తితోఁ జంద్ర శేఖరునికి నమస్కరించెను. కశ్యపుఁ డాతని నతి భక్తితో సంస్తుతించి నితి యొనరించె, శివుండు సర్వేశ్వరుని సంస్తుతించి మణిమయా సనంబునం గూరుచుండెను. ఇట్లున్న తాసనంబునందు సుఖా సీనుం డై విశ్రమించి యుండుచంద్ర శేఖరునికి విష్ణు పొర్షదులు దగ్గరి శ్వేత చామరంబులచే మందమారుతంబు లొలయ వీఁచుచుండిరి. సత్త్య మయుని స్వర్గంబునఁ గోధం బడఁగి ప్రసన్నుండయి ముదంబునమంద సితంబుతో నాశంకరుండు పంచవ క్తంబులను పరుండు ను విభుండు నగునారాయణుని స్తుతించుచుండెను. నారాయణుండు ప్రసన్నాతుం డగుచు సుధామధురంబులు మనోహరంబులునగువచనంబులతో దేవ సభయందు భగవంతుండగునా చంద్ర శేఖరునితో నిట్లనియె. ఓమహా దేవా శివుఁడ వగునిన్ను గుఱించి శివప్రశ్న మొనరించుటయ త్యంతమవహాస్య మగును. అట్లయ్యును శివస్రశ్న ము సేయుట లౌకిక మనియు వైదిక మనియు సేయుచున్నాను. తపములకు ఫలము లొసంగువాఁడవై సర్వము లగుసంపదల నిచ్చుచుండునట్టినిన్ను గుఱించి సంపత్నము తపఃప్రశ్నము సేయుట యయోగ్యము. జ్ఞానాధి దేవత వయి సర్వ జ్ఞుఁడ వగు నిన్ను వృధా జ్ఞానప్రశ్న మేల సేయవలయు? మృత్యుం జయఁడ వై ననీకు విషత్తు లేని కాలమున నాప్రశ్న ము వలదు' వీయింటికి నీవు నచ్చినప్పు ఉలవచ్చితి వని ప్రశ్నము సేయుట నాకనుమతముగాదు. అయినను నీవు తాసముతో నియ్యెడకువచ్చుటకుం గారణ మేమి యని యడుగవలసియున్న ది, అందుకుఁ గారణముఁ దెల్పుము.

అని యడిగిన మహా దేవుం డి ట్లనియె. ఓహరీ నాభ క్తుండు ను నాకు నా ప్రాణములకంటె నధికప్రియుండు నగువృషధ్వజుని సూర్యుం డు శపియిం చెనని నాకుం గోపముసు డ్రా సమును గల్గి యున్న ది. భ క్తు సందలిపుత్రవాత్సల్యమున నై నశోకము చేత సూర్యునిం జంపుటకుం గడంగితిని. ఆతఁడు బ్రహను శరణుజొచ్చెను, ఆబ్రహ సూర్యునిం దోడ్ - ని నిన్ను శరణుజొచ్చి యున్న వాఁడు. ఏనరులు ధ్యానంబున నైన సచనముల నైన నిన్ను శరణు వేడెదరో ; వారలు విపత్తు గడచి శంకావివర్జితు లై మృత్యువును జయింతురు. అట్లుండ నిన్ను సాక్షాచ్ఛ రణము జెందిన వారలఫలం బే మని పొగడుదును, హరిస్మరణం - బెల్లప్పు డునభయం బొసంగునది. సర్వమంగళములు ను 'దానం గలుగు. ఓజగ తీభూ సూర్యుని శాపంబుకతమున సీరి చెడి మూడుం డై యుండు నాభ కునికిఁ గాఁగ లగతి యేమి? నా కది వచియింపుము. అని యడిగిన భగవంతుం డి ట్లనియె. ఈ వైకుంఠ Wన నర్ధక్షణమునకు భూమియందు నిజువది యొక్క యుగముల కాలము గైవము చే నతీతంబయ్యె. వేగంబ నృపాలయమునకుం జనుము. దుర్ని వారము ను మహాదారుణము నగుకాలము చేత వృషధ్వజుండు మృతుం డయ్యె. ఆతనికుమారుండు హంసధ్వజుండు ను సిరిచెడి యుండి మృతుం డయ్యె. ఆతని పుత్రులు ధరధ్వజుండు ను కుశ ధ్వజుండు ననుమహాభాగులు సూర్యని శాపమున హతశ్రీకు లయి రాజ్యభ్రష్టు లగుచు లక్ష్మి నిగూర్చి తపము సల్పెదరు. వారలభార్యలయందు లక్ష్మి యాత్మ కలాం శమున జనియించును. అప్పు లయి నృపోత్తము లగుదురు. ఓశంభూ నీ సేవ కుండు మృతుం డయ్యె. పొను. ఓ బ్రహ్లాదులా మీరలు ను పొండు. అని యి జ్ఞానతిచ్చి నా రాయణుండు లక్ష్మితో సభ నుండీ యభ్యంతరం బునకుం జనియె. దేవతలు ను శంభువు ను సంహృష్టు లయి పగమము లయినతమతమయాశ్రమములకుం జనిరి. 'శివుండు ను శీఘ్రమునఁ బరి పూర్ణ తమముగఁ దపంబు సేయం జసెను.

ఇది శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమునఁ బ్రకృతిఖండమునందు

నారాయణనారద సంవాదమునఁ దులస్యుపాఖ్యాన

మునం ద్రయోదశాధ్యాయము ముగిసెను.


కుశధ్వజసుత యగు వేదవతి చరిత్రము.

నారాయణ మహర్షియి ట్లనియె. ఓనారదమునీ యాధర్మ ధ్వజుం దును గుళధ్వజుండు నుగ్రం బయినతపము చేత లక్ష్మీ దేవి నారాధించి వారలు వెర్వేజ దమ కిష్టము లయినవరములు వడసిరి. అధర్మధ్వజ కుళధ్వజులు మహాలక్ష్మి వరము చేతఁ బృధ్వీ షతు లయి ధనము గలిగి పుత్ర వంతులైరి. అందు కుళధ్వజునిపత్ని మాలాపతి యను దేవి. ఆసతి కొంత కాలమునకు లక్ష్మ్యంశ సంభవయు సతి యునగుసుతం గనియె. ఆమె భూమిపణుం బడినంతట న జ్ఞానయుక్త యయి యందలు వినునట్లు స్పష్టముగ వేదధ్వనిం గావించి సూతి కాగృహమునుండి వెలు వడియె, ఆకన్యక జనించినయంత న వేదధ్వనిం గావించె గాన మనీషు లాకన్యకను వేదవతి యని పల్కుదురు. ఆమె జనియించినంత న బాగుగ జలకం బాడి తపము సేయ వనమునకుం జనియె. యయి యామె యెల్లవారు నిషేధించినను వినక వార లప్ర యత్నములు వము చేసి చనియె. ఆ వేదవతి పుష్కర క్షేత్రమునందు తపము సేయం బూని యొకమన్వంతరము లీల మెయి “నత్యుగ్ర. మగు