Jump to content

శ్రీతులస్యుపాఖ్యానము/చతుర్దశాధ్యాయము

వికీసోర్స్ నుండి

వారలభార్యలయందు లక్ష్మి యాత్మ కలాం శమున జనియించును. అప్పు లయి నృపోత్తము లగుదురు. ఓశంభూ నీ సేవ కుండు మృతుం డయ్యె. పొను. ఓ బ్రహ్లాదులా మీరలు ను పొండు. అని యి జ్ఞానతిచ్చి నా రాయణుండు లక్ష్మితో సభ నుండీ యభ్యంతరం బునకుం జనియె. దేవతలు ను శంభువు ను సంహృష్టు లయి పగమము లయినతమతమయాశ్రమములకుం జనిరి. 'శివుండు ను శీఘ్రమునఁ బరి పూర్ణ తమముగఁ దపంబు సేయం జసెను.

ఇది శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమునఁ బ్రకృతిఖండమునందు

నారాయణనారద సంవాదమునఁ దులస్యుపాఖ్యాన

మునం ద్రయోదశాధ్యాయము ముగిసెను.


కుశధ్వజసుత యగు వేదవతి చరిత్రము.

నారాయణ మహర్షియి ట్లనియె. ఓనారదమునీ యాధర్మ ధ్వజుం దును గుళధ్వజుండు నుగ్రం బయినతపము చేత లక్ష్మీ దేవి నారాధించి వారలు వెర్వేజ దమ కిష్టము లయినవరములు వడసిరి. అధర్మధ్వజ కుళధ్వజులు మహాలక్ష్మి వరము చేతఁ బృధ్వీ షతు లయి ధనము గలిగి పుత్ర వంతులైరి. అందు కుళధ్వజునిపత్ని మాలాపతి యను దేవి. ఆసతి కొంత కాలమునకు లక్ష్మ్యంశ సంభవయు సతి యునగుసుతం గనియె. ఆమె భూమిపణుం బడినంతట న జ్ఞానయుక్త యయి యందలు వినునట్లు స్పష్టముగ వేదధ్వనిం గావించి సూతి కాగృహమునుండి వెలు వడియె, ఆకన్యక జనించినయంత న వేదధ్వనిం గావించె గాన మనీషు లాకన్యకను వేదవతి యని పల్కుదురు. ఆమె జనియించినంత న బాగుగ జలకం బాడి తపము సేయ వనమునకుం జనియె. యయి యామె యెల్లవారు నిషేధించినను వినక వార లప్ర యత్నములు వము చేసి చనియె. ఆ వేదవతి పుష్కర క్షేత్రమునందు తపము సేయం బూని యొకమన్వంతరము లీల మెయి “నత్యుగ్ర. మగు తపము సలి పె. అ ట్లయ్యు ను పుష్ట మై క్లేశము నొందక నవయానన సంయుత యై వెలుంగుచుండె. ఇట్లుండ, నా మెకు 46 ఓ సుందరీ నీకు జనాం తరమునందు శ్రీహరి తా న భర్త యగును. బ్రహ్లాదుల చేత దురారా ధ్యుం డగుపతిని నీవు వడయంగలవు” అని యా కాశ వాణి వినంబడి యె, ఆయాకాశ వాణివచనములు విని యు నాయమ రోషంబు తో గంధమా దననగమునకుం జని యచట నొక నిర్జనస్థలమున మరలఁ దపంబు సేయు టకుపక్రమించెను. అచటఁ చిరకాలము తపముగావించియుఫలం బందక నిట్టూరుపుని గుడించుచుం గూరుచుండి యెదుట గుర్ని వార్యుం డగురావ బునింగాంచి యతివినయభ క్తులతో నాతనికిం బాద్యంబొసంగి యాస్వా ద్యము లగుఫలములు మూలమఃలు ను సుశీతలము లయినజలములు నిచ్చెను. అవి భుజియించి యాపాపిష్ణుండు తా నాయమసమీపము నకు జని ఓకల్యాణీ నీ వెవ్వతెవు? అని యడిగి పీనోన్న తము లగు పయోధరములును శరత్పంకజమువలె నుత్సవముఁ గల్పించు మొగం బును గలిగి మందహాసము సల్పు సుదతియుసతియు నగునావరారో హం గాంచి కామబాణముల చేఁ బీడితుం డై యాకృపణుం కు మూర్ఛం జెంది తెలిసి యాకన్యకిం గరము వట్టి తిగిచి శృంగార చేష్టలు సేయం గడంగిన నాసతి కోపదృష్టిం గనుంగొని వానికి స్తంభితునిఁ గావించె. ఆరావణుఁడు హస్తములు ను పాదములు ను గదలింప లే యేమి యుం జెప్ప నశక్తుం డయి పడ్డాంశ సంభవ యగునాపద లోచనను మానసమున స్తుతియిం చెను. ఆదేవి యు నాతఁడు సల్పిన స్తవమున సంతుష్ట యయి యాతని స్తబ్ధత్వమును మాన్చి వానింగాంచి యోరీ నీవు నాకతమున బాంధవులతో వినాశము నొందఁబోయెద వని శపి యించి యోరావణా నీవు నన్ను స్పృశియించితివి గాన నీశ రీరమును బరిత్యజిం చెదను కనుంగొనుము అని చెప్పి యోగబలమున నాసుదతి శరీరముం బరిత్యజించినం జూచి రావణుం డామె మేనును గంగయందు వదలి తనగృహమునకుం జనియె. ఆ యసురుండది గాంచి తనమనమున నౌరా యేమి యద్భుతముఁ గంటిని! నే నెట్టి కార్యముఁ గాంచితిని! అని చింతించి చింతించి యది దలంచి పలుమాఱు విలపించుచుండెను. ఆవేదవతి కొంతకాలమునకు జనక రాజునకు దనూజయై జన్మిం సీతా దేవి యని విఖ్యాతిం జెందె, ఆమెకోటి కె రావణుండు నిహతుం డయ్యె. మహాతపస్వినీ యగునాయమ పూర్వజన్మమునం జేసినతివ ము చే హరిస్వరూపుఁడును బరిపూర్ణతమ్ముడు నగు రాము ని భర్తగా బడ సెను. లక్ష్మీ స్వరూపిణి యగునా సుందరి జగత్పతిని దషము చే నారా ధించి యాతని స్వామి గాఁ బడసి మారామునితో చిర కాలము రమి యించెను. ఆమె జాతిస్తర యగుటం జేసి తొలుతం జేసినతపళ్లమ మును గలంచుకొనుచుండినను సుఖు బసుభవించుటం జేసి యవిమాను కొనియె. దుఃఖమునకు సుఖము ఫలంబుగ దా? ఆసతి యు బహు సుకుమారుండు ను నవయౌవనుండును గుణవంతుఁడు ను రసికుండు ను శాంతుండు ను మనోహర వేషము గలవాఁడు ను త్తముఁడు ను స్త్రీల కు మనోహరుఁడు ను తాను గోరిన ప్రకారముగ నుండువాఁడు నగునా రామునితో నానావిధశృంగార సౌఖ్యముల ననుభవించుచుండె. బలవం తంబయిన కాలంబు చేత నారాముఁడు వనవాసము సేయం బోయి సముద్రమునొద్ద సీతతోడ లక్ష్మణునితోడ వసించి యుండి గూహరి విప్ర రూపంబుఁ దాల్చి వచ్చినయగ్ని దేవునిం గాంచెను. ఆబ్రాహణుఁడు ను దుఃఖతుం డయినరామునిం గాంచి తాను ను దుఃఖించుచు నాసత్య పరాయణుండు సత్యములు నిష్టములునగువచనముల నిట్లనియె. ॥వహ్ని॥ ఓభగవంతుఁడా నాహక్యము వినుము. కాలాను సారముగ నీకొకటి సంప్రాప్త మయి యున్న ది. ఇది సీతాహరణ కాలము. ఇది నీకు సము పస్థితం బయి యున్న యది. విధి దుక్ని వార్యము. విధికం టెంబరం అయిన బలము గలది లేదు. ఇప్పుడు నావలసం జనించిన సీతను నాయందు వదలి నీవు నీ సమీపమునం దచ్ఛాయ నుంచుకొని రక్షింపుము. మరల బరీక్షా సమయమునందు సీతాదేవిని నీ కొసం గెదను. నన్ను దేవత లంపిరి. నేను విప్రుండను గాను. హుతాశనుఁడను అని చెప్పఁగా (గా నాతని వచనంబులు విని లక్ష్మణుని కది ప్రకాశింపఁ జేయక య దూయమానం బయినహృదయంబుతో స్వచ్ఛందంబు గఁ గైకొనియెను, వహ్ని యుఁ దనయోగబలంబు చేత సీతవలననుండి మాయాసీతం బుట్టించి యాసీతాదేవికి సమానము లగుగుణంబులు ను సర్వాంశంబులు ను గలయా మాయాసీతను రాముని కొసం గెను. ఇట్లాసంగి యావహ్ని యిది గోప నీయము. దీని నితరులకుఁ దెలియపఱచం గూడ" దనిని షేధించి సీతం దీసికొని పోయెను. ఈ గోప్యంబు లక్ష్మణుఁడు సయిత మెఱుంగఁడట్లుండ నితరుల కె బ్లెఱుంగనగు. ఆ సమయంబున రాముఁడు సువర్ణ మృగంబుం గనుంగొనియె. సీత యాకనకమృగంబును బట్టి తెమ్మని ప్రయత్న పూర్వ కంబు గ నాతనిం బం పె. రాముఁడు జానకిరక్షణంబును లక్ష్మణునియందు వదలి పెట్టి వనంబునందు నామృగంబును వెబడించిచని దానిని సాయ కంబునం జంపె, ఆమాయామృగము లక్ష్మణా! యని కూసి యెదుట శ్రీ హరిం గాంచిస్మరించుచు వైశం బ ప్రాణములు వద లెను. ఆతఁడు మృగ రూపమును పరిత్యజించి దివ్యరూపముఁ దాల్చి రత్న నిర్మితం బయిన విమానమున వైకుంఠమునకుం జనియెను. వైకుంఠమునం బ్రతి ద్వారము నందు ను ద్వారపాలకులకు ఁ గింకరుం డుండు.అందు జయవిజయులకుం గింకరుండు జితుం డనువాఁడు. మిగులబలవంతుండు. వాఁడు సనకాదుల శాపముచేత రాక్ష సతనువుం జెంది యుండి యాతఁడు మరల ద్వార పాల కులకు ముం దయాద్వారమును జే రెను.అంతసీత, లక్ష్మణాయని చెప్పినవిళ్ల బంబయినవచనము విని రాముని సన్ని ధికి లక్ష్మణునిఁ బం పెను లక్ష్మణుండు రామునొద్దకుం. జనఁ గా దుర్ని వారణుం డగురావణుండు చనుంచి లీలమెయి సీత నపహరించుకొని లంకకుం జనియె. అచట వనంబున రాముఁడు లక్ష్మణునింగాంచి మిగుల దుఃఖించి వేగిరం బ స్వాశ్రమము నకుం జను దెంచి సీతాదేవిం గానక విషాదమున సుచిరకాలము మూర్ఛ ఇంది మరల విశేషముగ విలపించెను. ఆగహనమునందు నాసీతను వెద కుచు మరలఁ బరిభ్రమించుచుఁ గొంత కాలమునకు నదీతటమునం బక్షి చే సీతావృత్తాంతం బెఱింగి యాహరి వానరుని సహాయము గాఁ గొని సాగరము బంధించి లంకకుం జని యారఘు శ్రేష్ఠుండు సాయకములచే రావణుని సబాంధవను గఁ జంపి దుఃఖత యగుసీతాదేవిం బడసి సత్వ

త్రిహాయణిచరితము.

రము గ సామెకు వహ్ని పరీక్ష చేయించెను. ఆకాలమున హుతాశ నుండు వాస్తవి యగుజానకి నొసం 7. అప్పుడు ఛాయాసీత వినయా'న్విత యయి వహ్ని దేవుని రామునిఁ గాంచి యే నేమి సేయంగలను. అందు కుపాయము దెల్పుఁడు”అని ప్రార్థింపఁ గా పహ్ని యి ట్లనియె. ఓ దేవి నీవు పుణ్యప్రద మగుపుష్కర క్షేత్రమునకుం జనుము. అచట తపం బొన రించి నీవు స్వర్గ లక్ష్మివి గాఁబోయెదవు. అని చెప్పిన వహ్ని వచనంబు లాలకించి పుష్కరమునం దపంబాచరించి యాఛాయాసీత మూఁడు లక్షలది వ్యవర్ష ములకు స్వర్గమున స్వర్గ లక్ష్మి యయి వెల సెను. ఆయమ కాలక్రమమునం దిపము చేసి యజ్ఞకుండమున జనియించి పాండవులకుం గామిని యగుచౌపది గా ద్రుపదునికిం బుత్రి యయి 'వెల సె' కృతయు గమున వేదవతి యను నామముతోఁ గుశధ్వజునికిం గూఁతురయ్యెను. తేతాయుగమున రామపత్ని యగుసీతా దేవియనం బరఁగుచు జనకు నికిం దనుజాత యయ్యె. ద్వాపరమున నాయమఛాయ ద్రౌపదీ దేవి యను పేరం బరఁగుచు ద్రుపదునికిం జని యించెను. గాన నీయమ యుగ శ్రయమున నుండునది యగుటం జేసి త్రిహాయణి యని చెప్పంబడియె. అని చెప్పిన నారాయణునిం గాంచి నారదుండు నోసం దేహభంజనుఁడా మునిపుంగవుఁడా ఆయమకుం బతు లయిదుగు టైరది యెట్లో యీసంశ యముఁ బాపు మని యడిగిన నారాయణుం డిట్లనియె. ఓనార చా! లంక యందు వాస్తు యగుసీత రామునిం జెందెను. వహ్ని చే సృజియింప బడిన చ్ఛాయాసీత రూపయౌవనసంపన్ను ఆ లయియుండునది యా రామవహ్ను లయాజ్ఞ చేఁ దపముఁ గావించి శంకరుని వరము వేడెను. ఆయమ కామాతుర యగుటం జేసి పతివ్యగ్ర యయి హేత్రిలోచన పతిం దేహి, పతిం దేహి, పతిం దేహి, పతిం దేహి, పతిం దేహి, అని యయిదు మాఱులు మరల మరల ప్రార్థనము గావించెను. శివుండు తతాధ నము విని నవ్వుచు నారసి కేశ్వరుం డోప్రియులా రా నీకు భర్త లయి దుగు పొయ్యెదరు అని వరంబాసు గెను. ఆకారణమున నామె పొండ వులకుఁ బ్రియురా లగుపల్ని యయ్యె. ఓనారదా ప్రస్తావము సర్వముఁ జెప్పితి తిని. ఇంక మొదటికథఁ జెప్పెద వినుము. అంత రాముండు లంక యందు మనోహారిణి యగుసీతం జండియాలంకను విభీషణుని కొసంగి మరల నయోధ్యకుం జని భారతవర్షమున నందుఁ బదునొకండువేల యేండ్లు రాజ్య పాలనము సలిపి సర్వజనములఁ దోడుకొని వైకుంఠము నకుం బోయెను. కమలాంశ యగునా వేదవతి కమలయందుం ప్రవేశించె, ఓనార దాపుణ్యప్రదంబయినయీయాఖ్యానముఁ జెప్పి తిని.దీనివలనఁ బాప ములు నశించును. నాలుగు వేదములు మూర్తివంతము లై యామె జిహ్వా గ్రమున సతతము వర్తించుచుండుం గాన నాయమ వేదవతి యని చెప్పంబడును.కుశ ధ్వజసుత యగు వేదవతియుపాఖ్యానము సంక్షేపము గఁ దెల్పితిని. ఇంక ధర్మధ్వజునికూతును పాఖ్యానముఁ దెల్పెదను. వినుము.

ఇది బ్రహవైవర్తమహాపురాణమునం బ్రకృతిఖండమునందు నారాయణ

నారదసంవాదమునం జతుర్దశాధ్యాయము

ముగిసెను.