శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 26

వికీసోర్స్ నుండి

కయే, 'పలుగొప్పపాపములను చేసితినే' అవకాశము లేకుండగనే మరణమువచ్చినదే', అని ఇట్లు దుఃఖపడనక్కరలేదు. ప్రాణమునువిడుచు సమయమందైనను భగవంతునియందు మనఃపూర్వకముగ భక్తిచూపినయెడల అదియేసద్గతినిచ్చును. ధైర్యముతోను భక్తితోను మరణము నెదురుకొనవలెను.


(2) మరణకాలమునగూడ పలుసంగములను మనస్సున నుంచుకొని ప్రాణమును విడువ నిష్టములేక దుఃఖపడుట, ప్రాణమును విడుచుటకు మార్గముకాదు. భగవంతుని ధ్యానముచేసికొని ప్రాణమును విడుచుటే మంచిదనునది రెండవది.


(3) మరణమెప్పుడువచ్చునో చెప్పవీలులేదు. ఏతరుణమందైనను మరణము రావచ్చును. కాబట్టి మరణకాలమున ఈవిధముగ మనస్సును నిరోధించి, భగవంతుని ధ్యానింపవలయుననియు, ఎల్లకాలమును ఇట్లుండవలయుననియు అనునది మూడవది.


(26)

అద్వైతము, కర్మ యోగము.


ఈసందర్భమున నొకప్రశ్న పుట్టును. అద్వైతమును గూర్చి గురువుమూలముగా నుపదేశమునొందక యాసిద్ధాం తమున కొన్ని భాగములనుమాత్రము విని తృప్తినొందువారి కొక సందేహము తోచవచ్చును. జీవాత్మయు, పరమాత్మయు వేరుకావు. రెండును ఒకటేఅను మతము సత్యమైనదయిన యెడల నింద్రియముల నడచుట మొదలయిన యీశ్రమతో గూడిన పద్ధతులెందుకు? తానే బ్రహ్మమని తెలిసినతోడనే చింతలేకయుండవచ్చునుగదా !

ఇది సత్యమేకాని, ఇది దృష్టిని పొరబెట్టునట్టి అసత్య భావము. దీనిని విడువవలెను. అద్వైతవేదాంతమున చెప్ప బడిన అవిద్య యట్టిసామాన్యమైన 'టాకీ' దృశ్యము కాదు. కన్ను, చెవి, ముక్కు, ఎల్లయింద్రియములు, అంతరంగమగు మనస్సు, బుద్ధి, - అన్నిటినావరించియున్న ఈ యవిద్యఅను నది, దేహమును, బుద్ధిని, ఆత్మను, ఆవరించి యన్నిటియందును కలిసినిలిచియున్నది.


ఇది యొకపక్షమునకుచెందిన భావనయని చెప్పిన మాత్రమున ముగిసిపోదు; శరీరము, మనస్సులోనున్న, యొక్కొక్క సూక్ష్మాణువును తాకి, మేల్కొల్పి మలినమును తొలగింపవలసినదిగానున్నది. దానికి నిష్ఠ, ఇంద్రియనిగ్రహము, నిస్సంగత్త్వము అన్నియు కావలెను. మాయనుండి దృష్టిని విడిపింపవలెనని సత్యమును తెలిసినంతమాత్రము, సరిపోదు. మాయనుండి తప్పుకొనవలెనని తెలియుట ఒకటి. తెలిసినపిదప తప్పుకొనుట మరియొకటి. నేను తెల్లవారు జామున నాలుగుగంటలకు లేవవలెనని యనుకొనుట యొకటి అట్లు లేచియుండుట మరియొకటి. అవిద్యను సత్యముచే దూరముచేయుటయే మోక్షము. దానికి మార్గము యోగము. అద్వైతమార్గమున జీవుని అవిద్యనుండి విడిపించుటకును, ద్వైతమార్గమున జీవుని కర్మబంధమునుండి తప్పించుటకును, రెంటికిని మార్గమొకటే. అద్వైతమార్గము విని 'అవు' నని చెప్పిన తోడనే అవిద్య తొలగిపోదు. సత్యముగ నది తొలగవలసిన యెడల కర్మబంధమునుండి తొలగుటకు ద్వైతవాదు లేమేమి చేయవలెనని చెప్పియున్నారో, వాటినన్నిటిని అద్వైతవాదియు చేయవలసియున్నది. ఇట్లు చేసినయెడల మోహమనునది తొలగును. అనగా కర్మబంధమును దానిని తొలగించు కొనుమార్గములు ద్వైతపద్ధతినిగాని, అద్వైతపద్దతినిగాని, వ్యత్యాసములు కలిగియుండవు. ఇదియే ఆచార్యులవారి ఉపదేశము.


ఎల్లప్రాణుల విషయమందును జీవకారుణ్య భావము కూడ మనస్సున లేకుండినయెడల, జీవుడును, పరమాత్మయు నొకటియను యద్వైతజ్ఞానము చాలదూరమగును. ఆచార్యులువారు వ్రాసిన గ్రంథములనుండి జీవుడను బ్రహ్మమును సత్యముగ నొకటేయని మతసంప్రదాయమునుబట్టి తెలిసికొనుట వేరు, సత్యమైన జ్ఞానప్రకాశము వేరు. జ్ఞానప్రకాశము

నొందుటకు తెలివికావలెను. కాని తెలివిమాత్రమే సరిపోదు.


నావిరతో దుశ్చరితా న్నా శాన్తోనానాసమహితః
నాశా న్తమనసో వా౽పి ప్రజ్ఙానే నైన మాప్నుయాత్.


చెడునడతను విడువనివాడును, మనస్సున శాంతము పొందనివాడును, ఇంద్రియములను నణపనివాడును, ఆశతో గూడిన కోరికలను విడువనివాడును, జ్ఞానమునొందినను ఆత్మను కానచాలడు.


నియమము, ఇంద్రియముల నణచి యేలుట, ఇంద్రియములను విషయములందు చరింపకుండ నిరోధించుట, పనులను స్వలాభాపేక్షయు, సంగమునువిడిచి, భగవంతుని కర్పణముగ చేసి ముగించుట, నభ్యసించుట, సుఖదుఃఖములను, నింపుకంపులను, ఒకటేమాదిరిగ నెదురుకొనుట; ఈ అభ్యాసములెల్ల అవిద్యను తొలగించుకొని యద్వైతమనో భావములను పొందుటకు సాధనములు; మోహమునకును, భేదబుద్ధికిని, చికిత్సాక్రమములు. వీనిని గైకొనక విషయముల ననుభవించుటయం దాశగలిగి ఉన్నచో, బ్రహ్మమును, జీవుడును ఒకటను సత్యజ్ఞాన మొకనాడును ఉండజాలదు. పథ్యములేకుండుటచేత వ్యాధి యధికమగునట్లు, రానురాను మైకమును, భేదబుద్ధియు అధికమగును. గ్రంథములనుండి తెలిసికొనినమందు పథ్యములేక గుణమునివ్వజాలదు. చిత్తరువునకును, జీవమనుష్యునికిని నుండు వ్యత్యాసమును పోలి యుండును.అప్పుడే యుపయోగములేని జ్ఞానమునకును, సత్యమైన జ్ఞానప్రకాశమునకును ఉన్న భేదము సత్యమైన యద్వైతజ్ఞాన ముదయించినయెడల జీవితము తనంతటనే శుద్ధమైపోవును. విషయలంపటములు తొలగిపోవును. విషయ సంగములు తొలగగా తొలగగా జ్ఞానము మరింత యెక్కువగా ప్రకాశించుచుండును.


దీనిచేతనే భగవద్గీత యనునది, ద్వైత, అద్వైత, విశిష్టా ద్వైతమతములలో చేరినవారికందరకును శాస్త్రముగ నుండి వచ్చుచున్నది. బ్రహ్మమును, జీవుడు నొక్కడా, వేరా యను ప్రశ్న భగవద్గీతలో నుపదేశింపబడిన యనాసక్త యోగమును, జ్ఞానయోగమును, ప్రపత్తిమార్గములను నేవిధమునను బాధింపవు.


(27)

విశ్వరూపదర్శనము


భగవద్గీత పదకొండవ అధ్యాయములో భగవంతు డర్జనునకు, విశ్వరూపము చూపించుట చెప్పబడినది. మేలు, కీడు, సుఖము, దుఃఖము, చీకటి, తేజస్సు, అను ద్వైతములను గడచి నిలుచు భగవంతుడు తన సర్వవ్యాపకమై విశ్వరూపము నర్జనుడు చూచున ట్లతనికి జ్ఞానదృష్టిని అనుగ్రహించి దర్శనము నిచ్చెనని చెప్పబడినది.