శ్రాద్ధసంశయ విఛ్చేది

వికీసోర్స్ నుండి


మహాకవి దాసు శ్రీరామవిరచిత


శ్రాద్ధసంశయ విఛ్చేది

పీఠిక

ఓ సత్పురుషులారా!

ప్రకృతమునందు వైశ్యకులమువారు మృతాహస్సులయందన్న శ్రాద్ధము సేయరాదనియు, ఆమ శ్రాద్ధము జరిగించ వలసిన దనియు, వైశ్యులలో వైశ్యులు భోక్తలుగా నుండవలసివచ్చును గాన నట్లు భోక్తలుగా వైశ్యులుండుట పనికి రాదనియు, భోక్తలు ప్రతిగ్రహీతలు కావలసివచ్చును గాన ప్రతి గ్రహణము సుతరాం వైశ్యులకుఁ గూడదనియు, పరిషత్కాల మంత్రములు మొదలగు వానిలో బ్రాహ్మణులే కొనియాడ బడినారుగాన అట్టి బ్రాహ్మణత్వము వైశ్యులకు అసంభవమనియు బందరు మొదలగు స్థలములయందు అనేకులగు బ్రాహ్మణులు దుర్వాదములు సేయుచున్న సంగతి యందరికి విశదమే. ఈ యంశములలో శాస్త్రజ్ఞానము లేనివారికి బ్రాహ్మణులు సేయు దుర్వాదము సత్యమే యని తోచవచ్చును. కాని అది భ్రాంతి. కొంచము ఓపికతో ఈ చిన్న పుస్తకమును చదువుడు. ఇందులో సుదాహరింప బడిన ధర్మశాస్త్రములను తెప్పించి చూచి అర్ధ జ్ఞానముకలవారివలన వాని యర్ధమును వినుండు. మీకు సంశయము విడుచును. తరు వాత శ్రాద్ధ విషయములో వైశ్యులకును బ్రాహ్మణులకును లేశము భేదము లేదని తెలియును. ఈ యంశమును ఇదివరకు నేనురచించి ప్రకటించియున్న "వైశ్య ధర్మదీపిక" యందలి మూడవ సూత్రము, “సర్వేద్విజ సామాన్య ధర్మావైశ్యరమష్ఠేయాఏవ వలననే స్పష్ఠమగుచున్నది. కాని వివరముగా తెలియుటకు "శ్రాద్ధసంశయ విచ్చేది యను ఈ యుపన్యాసమును జయసంవత్సర వైశాఖ మాసములో బందరు గూడూరు మొదలగు ప్రదేశములందు నా వలన ప్రసం గింప బడినది.

తప్పులు క్షమింపుడు, ఒప్పులు గ్రహించుడు.

మీ విధేయుడు.
దాసు శ్రీ రాములు
ఏలూరు

శ్రీ రస్తు

శ్రాద్ధ సంశయ విచ్ఛేది

శ్లో. బ్రాహ్మైవాహంసధై కోహ మఖండః పరమార్థతః వ్యవహార విచారాయ నమామి పరమేశ్వరమ్ శ్రూయతా మవధానేవ ధీరా ధీరామణీయకం శ్రద్ధసంశయవిచ్ఛేద సాధనం పచనంమమ

1. శ్రాద్ధభేద విచారము - మొదటి ఘట్టము.

స్వసిద్ధాంతములు - శ్రాద్ధము అనునది మూడు విధములుగా నున్నట్లు ధర్మశాస్త్రముల వలన గానవచ్చుచున్నది. ఆ విధములు

అన్న శ్రాద్ధము - పక్వాన్నముతో చేయునది.
అమశ్రాద్ధము - వండని పదార్ధములతో చేయునది.
హిరణ్య శ్రాద్ధము - బంగారు, వెండి, రాగి, మొదలగు వానితో జరిగించునది.

2. పితృదేవతల నుద్దేశించి శ్రద్ధతోవిచ్చునన్నము మొదలగువాని పేరే శ్రాద్ధము.

శ్రాద్ధము మూడువిధములై నందునకు బ్రమాణములు.

2

లోకాక్షిపరాశరస్మృతి ఆచారకాండము

పుష్పవత్స్వపిదారేము | విదేశసోప్యనగ్ని కః
అన్నే నైవాబ్దికం బర్యాత్ | హేమ్నా వామేనవాక్వచిత్
అన్న హేమ, ఆమ శ్రాద్ధములీ శ్లోకమున సూచింపబడినవి.

యల్లాజీయము పుట 226గౌతముడు

ప్రత్యాబ్దికి మాసికేచపక్వాన్నం నై వలభ్యతే
ఆమశ్రాద్ధం ద్విజః కుర్యాత్ హేమ్నాహితదసంభవే ॥

అన్న, ఆమ, హేమ శ్రాద్ధములు వరుసగా ఈ శ్లోకము నందు గానవచ్చుచున్నవి.

3. ద్విజులనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అన్న శ్రాద్ధములే జరిగించవలయును. శూద్రులు ఆమ శ్రాద్ధములే జరి గించవలయును. ఆవత్తున ద్విజులామము సేయవచ్చును. ఇందు నకు బ్రమాణములు.

ఔశననస్మృతి ౫ అధ్యాయమ౯ ౬ు శ్లోకము

ఆమానివర్తయేన్నిత్యం ఉదాసీనోనతత్వతః
అనగ్ని రథ్వగోవాపి | తదై నవ్యసనాన్విఈ
అమశ్రాద్ధం ద్విజఃకుర్యాత్ | వృషలస్తు సదై వహి

అర్ధము:- ఎల్లప్పుడును ద్విజుడు అన్న శ్రద్ధమే జరిగించవలెను.

3

భార్యాహీనుడు, ప్రవాసి, వ్యసనముతో గూడినవాడు మాత్రమామము జరిగించవచ్చును. శూద్రుడు మాత్రమెల్లప్పుడును, ఆమమే జరిగించవలసినది. ఆమము చెప్పినచోట హిరణ్యముకూడ గ్రహించదగినది.

పరాశరమాధవీయము ఆచారకాండము శ్రాద్ధ ప్రకరణము
కాత్యాయనుడు వ్యాఘ్రపాదుడు

ఆపద్యనగ్నౌతీర్ధేచ ప్రవా సేపుత్ర జన్మని
అమశ్రాద్ధం ప్రకుర్వీతయస్యభార్యారజస్వలా,
ఆర్తవే దేశకాలాది విప్ల వేసమువస్థితే
ఆమశ్రాద్ధంద్విజః కుర్యాత్ శూద్రః కుర్యాత్సదై'వహి.

భార్యలేనప్పుడ,ు ప్రయాణములో పుత్ర జన్మమందు ఆమశ్రాద్ధము జరిగంచవలసినది. భార్యవాకిటనున్నప్పుడు దేశకాలోపద్రవములయందు ఆమ శ్రాద్ధము కూడును. ఇది ద్విజుల విషయము. శూద్రులెల్లప్పుడును ఆమమేచేయవలసినది. ద్విజులు ఆపత్తు లేనప్పుడు అన్నమే చేయవలసినదని యర్ధము.

కూర్మపురాణము బ్రాహ్మణకసహిత వ్యాసగీతలు ౨౧వ
అధ్యాయం 77 శ్లోకము మొదలు

ఆమేనవ ర్తయేన్నిత్యముదా సీనోవతత్వతః
అనగ్ని రధ్వగో వాపి తదై నవ్యసనాన్వితః|

అమశ్రాద్ధం ద్విజః కుర్యాద్ వృషలమనదై వహి

4

మొదటి మూడు వర్ణములవారు అన్న శ్రాద్ధమే చేయవలసినది. భార్యలేనివాడు, ప్రవాసి, వ్యసనము కలవాడు ఆమ శ్రాద్ధము చేయవచ్చును. నాల్గవవర్ణమువారు మాత్రము సర్వదా ఆమము చేయవలెను,

4. ద్విజులలో అపత్తులయందై నను తద్దినము, సపిండము గయా శ్రాద్ధము, మహాలయము ఇవి ఆమము చేత జరిగించకూడదు.

ఇందునకుబ్రమాణములు,

నిర్ణయసింధువు తృతీయ పరిచ్ఛేదము - శ్రాద్ధనిర్ణయము
స్మృతిదర్పణము

మృతాహంచ సపిండంచ గయాశ్రాద్ధంమహాలయం
ఆపన్నో పిన కుర్వీతశ్రాద్ధమామేనకర్హి చిత్

తద్దినము, సపిండము, గయాశ్రాద్ధము, మహాలయము, ఇవి ఆపత్తునందైనను ఆమముచేత పెట్టరాదు. అని యిందు చెప్పబడింది. తద్దినములనుటచే మాసికములు కూడ గ్రహించదగినది, పరాశర మాధవీయమును చూడుము. ౧2 ౫పుట

శ్రాద్ధవిఘ్నే ద్విజాతీనా | ఆమ శ్రాద్ధం ప్రకీర్తితం!
అమావాస్యాదినియతం మాససాంవత్సరాదృతే |

5. ద్విజులలో తద్దినము, మాసికములు, సపిండము, గయశ్రాద్ధము మహాలయము ఇవి అన్నముతోనే జరిగించవలసినది.

అందువకు బ్రమాణములు .

5

పరాశిరమాధవీయము - ఆచారకాండము

తదామశ్రాద్ధంమృతేహనినకుర్యాత్|
కింతుపక్వాన్నేన కుర్యాదిత్యర్థ:

అర్థము స్పష్టము.

లోకాక్షి

పుష్పవత్స్వపిదారేషు విదేశస్థోవ్యవగ్నికః
ఆన్నేనై వాబ్దికం కుర్యాత్ హేమ్నా వామేనవాక్వచిత్!|

ఇందు ఆపత్తులయంధైనను అబ్దికములు మాత్రమన్నము చేతనే జరిగించవలయునని చెప్పబడియున్నది.

6.తద్దినము మాసికము మొదలయిప వానియందైనను స్వజులకు అన్నమే సంభవించనప్పుడు ఆమముగాని హిరణ్యము కాని చేయవచ్చును.

ఇందునకు బ్రమాణములు

యల్లాజీయము పుట్ట ౬గౌతముడు

ప్ర్రత్యాబ్దికే మాసికేచ పక్వాన్నం నైవలభ్యతే
ఆమశ్రాద్ధం ద్విజః కుర్యాత్ హేమ్నావా తదసంభవే

7. ద్విజుడు ప్రత్యాబ్దికాదుల యందన్నమే దొరకనియెడల ఆమముగాని హిరణ్యముగాని జరిగించవచ్చును.

ఈ పైన వ్రాయబడిన ఆరు సిద్ధాంతముల వలనను తేలిన పర్యవసితార్ధ మేమనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అన్నము దొరికినప్పుడు ఎట్టియావత్తు వందైనను తద్దినములు, మాసికములు, సపిండము, మహాలయము, గయాశ్రాద్దము, అన్నము

6

చేతనే జరిగించవలసినది గాని ఆమముచేత జరిగించరాదు. శూద్రుణామము చేతినే సర్వదాశ్రాద్ధము జరిగించవలసినది.

శ్రాద్ధభేదవిచారోయం సర్వశాస్త్రార్థ సమ్మతః ।
దాసు వంశాబ్దివంద్రేణ కృత శ్రీరామశర్మణా|

శ్రాద్ధభేదవిచారము-సమాప్తము.

శ్లో॥ ఏకఏవా ద్వితీయోహం నానాత్వం నాస్తికించవ|
తధాపి వ్యవహారార్ధం నమామి హిరిమచ్యుతమ్ ||

1.శ్రార్ధభోక్తృవిచారము_రెండవఘట్టము.

-: స్వసిద్ధాంతములు :-

1. శ్రాద్ధభోక్తలు ముఖ్యకల్పభోక్తలు, అనుకల్పభోక్తనని రెండువిధములుగ నుందురు.

ఇందునకు బ్రమాణములు ముందువ్రాయబోవు శ్లోకార్ధముల యందే కానవచ్చును.

2. ముఖ్యకల్ప భోక్తలలో మూడు తరగతులు కలవు.

మొదటి తరగతివారు - యతులు.
రెండవ తరగతివారు - వేదవేత్తలు, బ్రహ్మచారులు,
మూడవ తరగతివారు - శోత్రియ బ్రాహ్మణులు.

ఇందునకుమ బ్రమాణములు దిగువ వ్రాయబడు శ్లోకార్థముల వలననే తెలియబడును.

3. అనుకల్పభోక్తలు మేనమామ మొదలగు బంధువులు. దీనికిని బ్రమాణములు క్రింద వ్రాయబడును.

7

4. ముఖ్యకల్ప భోక్తలలో నేతరగతివారును దొరకనప్పుడు అనుకల్పభోక్తలకు శ్రాద్ధము పెట్టవలయును.

ఈ పయి నాలుగు విధులకును బ్రమాణములు.

మనుస్మృతి 3 అధ్యాయము 134- 135- 138- 142 శ్లోకములు

ఙాననిష్ఠా ద్విజాః కేచిత్ తపోనిష్ఠా స్తధావరే
తపస్స్వాధ్యాయనిష్ఠాశ్చ కర్మనిష్ఠా స్తథాపరే

జ్ఞానానిష్టేషుకవ్యాని ప్రతిష్ఠాప్యాని యత్నతః॥
హవ్యానితు యధాన్యాయం సర్వేష్వేవ చతుర్ష్వపి
శ్రోత్రియాయైవదేయాని హువ్యకవ్యాని దాతృభిః

అర్హ త్తమాయవి ప్రాయిత స్మైదత్తం మహాఫలం
ఎషవై ప్రధమః కల్పః ప్రధానోహవ్యకవ్యయోః ॥

ఇందు ముఖ్యకల్పభోక్తలు చెప్పబడినారు.

అనుకల్పస్స్వయంజ్ఞేయః సదాపద్భిరనుష్ఠితః
మాతామహం మాతులంచ స్వస్రీయం శ్వశురం గురుం
దౌహిత్రం విట్పతిం బంధుం ఋత్విగ్యాజ్వోచ భోజయేత్

ఇందు అనుకల్ప భోక్తలు చెప్పబడినారు.

గౌతమస్మృతి 10 వ అధ్యాయము 17 శ్లోకము

శ్రాద్ధకాలే యతింప్రాప్తం పితృస్థానేతు భోజయేత్ ॥

8

ఇందు ముఖ్యకల్పములో మొదటి తరగతిభోక్త యని చెప్పబడినాడు.

పైస్మృతి 22వ శ్లోకము

సన్నికృష్టం ద్విజంయస్తు యుక్తజాతిం ప్రియంవదం
మూర్ఘంవా పండితెంవాపితృప్తి హీన మథాపివా
నాతి కమేన్నరో విద్వాన్ దారిద్ర్యాభి హతం తధా॥

పయిస్మృతి పయిఅధ్యాయం 24 25 శ్లోకములు

సంబంధిన స్తధా పర్వాన్ దౌహిత్రం విట్పతిం తధా
భాగినేయం విశేషేణ తధాబంధూశ్చ నారద
అతిక్రమ్య హఠాత్కామాత్ రౌరవం నరకం ప్రజేత్

ఇందు అనుకల్ప భోక్తలు చెప్పబడిరి.

15 శోకము

మాతులో భాగినేయశ్చ జామాతా స్వసృజోపివా
అనుకల్పా ఇమే ప్రోక్తా బాంధవాశోపకారిణః|

ఔశనసస్మృతి 4వ ఆధ్యాయము 17 19 శ్లోకములు

తస్మా ద్యత్నేన యోగింద్రాన్ ఈశ్వరజ్ఞానతత్పరాన్
భోజయేద్ధవ్య కవ్యేషు ఆలాభే చేతరాన్ ద్విజాన్

ఇందు ముఖ్యకల్పము మూడు తరగతుల భోక్తలు జెప్పబడిరి.

మాతామహం మాతులంచ సప్రీయంశ్వశురం గురుం

దౌహిత్రం విట్పతింబంథుం ఋత్యిగ్వాజ్వౌచ భోజయేత్!

9

ఇందు అనుకల్ప భోక్తలు చెప్పబడిరి.

లిఖితస్మృతి 35 శ్లోకము

బ్రాహ్మణానా మభావేతు భ్రాతరం పుత్రమేవహి
ఆత్మానంవా నియుఁజీతన విప్రం వేదవర్జితం

25 వ శ్లోకము

మాతామహం మాతులంచ స్వస్రీయం శ్వశురం గురుం
దౌహిత్రం విట్పతించైవ ఋత్విగా దీంశ్ప భోజయేత్:

ఇందు అనుకల్పభోక్తలు చెప్పబడిరి.

యాజ్ఞవల్క్యస్మృతి ఆచారకాండ 216 శ్లోకము మొదలు

అగ్రాస్సర్వేషు వేదేషు శ్రోత్రియో బ్రహవిద్యావేదార్థం
జ్యేష్టసామాత్రి మధుస్త్రీ సుపర్ణికః సస్రీయఋత్విగ్జామాతా
యాజ్యశ్వశురమాతులాః త్రిణాచికేత దౌహిత్రశిష్యసంబంధి బాంధవ్యా

ఇందు ముఖ్యకల్పాను కల్పములు రెండును జెప్పబడినవి.

వరాశరమాధవీయం శ్రాద్ధనిర్ణయఘట్టము శంభుడు

నిత్యయోగపరోవిద్యాస్ సమలోష్టాశ్మ కాంచనః

ధ్యానశీలోయతిర్విద్వాన్ బ్రాహ్మణాః వ జ్తిపావనాః

10

అత్రానుకల్పో యాజ్ఞవల్క్యేన దర్శితః॥ ఆని

స్వ స్రీయ ఋత్విగ్జామాతా యజ్వశ్వశురమాతులాః
త్రిణాతికేత దౌహిత్రశిష్యసంబంధిబాంధవాః

ఇందు ముఖ్యానుకల్పములు రెండును జెప్పబడినవి,

అపస్తంబుడు గుణవదలాచే సోదరోపి భోజయితవ్యః। అని

గుణవంతుడు దొరకనిచో సోదరుడయినా భోక్తకావచ్చును.

విష్ణుపురాణేపి అని

పితవ్య గురుదౌహిత్రాన్ ఋత్విక్స స్రీయమాతులాస్
పూజయేధ్ధవ్యగవ్వేఛ వృద్ధానతిధిబాంధవాస్
అందు అనుకల్పము చెప్పబడినది.

ఈ యనుకల్పమనునది ముఖ్యకల్పభోక్తలు లభించనప్పుడు అని తెలియుచున్నది। అను కల్పభోక్తలు బంధులే కాన క్షత్రియ వైశ్యులకు బ్రాహ్మణ బంధువు లిక్కలియుగంబున సంభవించరు గాన సజాతీయులే అనుకల్పభోక్తలనుట స్పష్టమే. మరియును

కూర్మపురాణము వ్యాసగీత 21వ అధ్యాయము 14శ్లోకము మొదలు 18 వరకు

భోజయేద్యోగినం పూర్వం తత్వజ్ఞానపరం యతిం

ఇదిముఖ్యకల్పము.

11

పరాశరమాధవీయము ఆచారకాండము శ్రాద్ధభోక్తృనిర్ణయ
ఘట్టము వసిష్ఠోపి అని

యతిన్ గృహస్ధాన్ సాధూస్ వా భోజయేదితి శేషః

యతునిగాని, గృహస్తునిగాని సాధువునిగాని భుజింప చేయవచ్చును.

బ్రహ్మాండపురాడేపి అని

శిఖిభ్యోధాతురక్తేభ్యః త్రిదండిభ్యశ్చ దాపయేత్
శిఖినో బ్రహ్మచారిణః ధాతురక్తవస్త్రధారిణో వానప్రస్థాః
ద్రిడండినో మనోవాక్కాయదండై రుపేతాః యతయః
అత్రపరః పరః శ్రేష్ఠః అతఏన నారదః
యోవై యతీన నాదృత్య భోజయేదితరాన్ ద్విజాన్
విజానస్ వసతో, గ్రామేకవ్యంతద్యాతి రాక్షసాస్

బ్రహ్మాండపురాణేపి

ఆలాభే మునిభిక్షూణాం భోజయేత్ బ్రహ్మచారిణం
తదలాఖేప్యుదాసీనం గృహస్థమపి భోజయేత్
ఇందు ముఖ్యకల్పము మూడుతరగతులవారును చెప్పబడిరి.

ఈ పయిన వ్రాయబడిన నాలుగు సిద్ధాంతముల వలనను తేలిన పర్యవసీతార్ధమేమనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అన్న శ్రాద్ధములు పెట్టునప్పుడు భోక్తల విషయమై రెండు కల్పములనియు అవి ముఖ్యకల్పము అనుకల్పము అనియు, మొదటి

12

తరగతివారు యతులు, రెండవ తరగతివారు బ్రహ్మచారులు మూడవతరగతివారు గృస్ధులునగు బ్రాహ్మణులనియు అను కల్పమువారు సజాతీయ బంధువులనగా మేనమామ, అల్లుడు, మేనల్లుడు, మామగారు, తల్లితండ్రి మొదలగువారనియు ముఖ్య భోక్తలలో నెవ్వరును లభించనప్పుడు అనుకల్ప భోక్తలకే శ్రాద్ధము జరిగించవలసినదనియు.

శ్రాద్ధభోక్తృ విచారోయంసర్వశాస్త్రార్ధ సమ్మతః
దాసువంశాబ్ది చంద్రేణ కృతశ్రీరామశర్మణా

శ్రాద్ధభోకృవిచారము సమాప్తము.

శ్లో.నిత్యోహంనిర్మలోహంచ-నిశ్చలో నిరుపాధికః
లోక సంగ్రహ వార్తాయాం నమామి పురుషోత్తమం

3. అన్న, శ్రాద్ధేషు క్షత్రియవైశ్యయోర్ముఖ్యకల్ప భోక్త్రలాభవిచారనుట్టము.

-: స్వసిద్ధాంతములు :-

1. శ్రాద్ధాన్న పాకము స్వగృమునందు స్వబంధువులచే జేయింపవలయును.

ఇందునకు బ్రమాణములు.

పరాశరమాధవీయము ఆచారకాండము నియంత్రప్రకార
ఘట్టము తుదను దేవలోపి అని

తధైవ యంత్రితో దాతా ప్రాతస్స్నాత్వా సహాంబరః

13

ఆరభేత నవైః పాత్రై రన్నారంభం స్వబాంధవైః

దీనవలన స్పష్టముగా శ్రాద్ధాన్నము బంధువులే వండవలసినట్లు కానవచ్చుచున్నది.

2. ఈ యుగంబు సజాతీయులే స్వబంధువులగుదురు. ఎందుచేతననగా విజాతీయ వివాహములు వర్ణింపబడినందున

అందుకు బ్రమాణములు.

వృద్ధపరాశరము

ద్విజానా మసవర్ణాసు కన్యాసూపయమ స్తధా
అసవర్ణవివాహములు కలియుగమున వర్ణింపబడినవి.

3. శుచివ్రతులైన క్షత్రియ వైశ్యుల యన్నమును బ్రాహ్మణులు భుజించుట శాస్త్రమువలన నిషేధింపక పోయినను ఇప్పటి బాహ్మణులు కొన్ని కారణములచేత భుజింపనొల్లకున్నారు. గాని బ్రాహ్మణభోక్త క్షత్రియ వైశ్యులకు లభించడు ఇందునకు

పరాశరస్మృతి ప్రాయశ్చిత్త కాండము 11వ అధ్యాయము
1. వ శోకము

క్షత్రీయశ్చాపి వైశ్యశ్చ క్రియావంతౌశుచివతౌ
తద్గృహేషు ద్విజై ర్భోజ్యో హవ్యక వ్యేషు నిత్యశః

హవ్యకవ్యములయందు శుచిప్రతులైన క్షత్రియ వైశ్యుల యిండ్లలో బ్రాహ్మణులు భోజనము చేయదగినది. యిట్ల నేక ప్రమాణములుకలవు. కాని దురాచారములను ఆచారములను కొని

14

యెంతకాలము మనదేశమువారు ప్రవర్తింతురో అంతవరకు బ్రాహ్మణులు క్షత్రియవైశ్యుల యిండ్లవారుచేసిన పాకమును భుజించరనుట విదితమే. బ్రాహ్మణుడే ముఖ్యకల్పభోక్తగావునను క్షత్రియవైశ్యులకు బ్రాహ్మణభోక్త దొరకడు గావునను అనుకల్పభోక్తలగు స్వబంధువులే భోక్తలు కావలసి వచ్చినది.

పక్వాన్నే రాడ్విశోర్ముఖ్య-కల్పాలాభస్తు సాంప్రతం |
వివృతో దాసుపంబ్ధిశశినా రామశర్మణా॥

ముఖ్యకల్పాలాభవిచారము - సమాప్తము

శ్లో.ఓమ్ సర్వం ఖల్విదం బ్రహ్మ-తద్భిన్నింతునవిద్యతే!
ఆత్మజ్ఞానేనలోకార్థం- నారాయణము పాస్మహే ||

4. శ్రాద్ధేషుక్షత్రియవైశ్యోరనుకల్పభోస్తుణాం మంత్రానుకూలతా విచారఘట్టము

-: స్వసిద్ధాంతములు :-

  • పునంతుమాం బ్రాహ్మణ పాద పాంసపః" అనునదియు *రక్షంతుమాం బ్రాహ్మణ పాద పాంసపః" అనునదియు "వివ్రశ్రీపాద పంకజః" అనునదియు విప్రౌఘదర్శనాస్సద్యః అనునదియు “యావతీర్వై దేవతాస్తాస్సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాద్బాహ్మణేభ్యో వేదవిద్భ్యోది వేది వేనమస్కుర్యాత్" అనునదియు, భోక్తృవిషయములు కావు. పరిషద్వందనముతో సంబంధించినవి పరిషత్తు అనగా నొకనికి ప్రాయశ్చిత్తము జరిగించుట కేర్పడిన బ్రాహ్మణసభ.

15

"కాలే అధికార సిధ్యర్థం యధాశక్తి సంభవ ప్రాయశ్చిత్తం కరిష్యే" అని ప్రారంభించి శ్రార్ధమునకు బూర్వమే అధికారసిద్ధి కొరకు బ్రాహ్మణసభకు నమస్కారముచేయుట యావశ్యకము,

అది భోక్తలకు చేయు నమస్కారము కాదు గావున వాని యందు బ్రాహ్మణ విప్ర పదములున్న మాత్రమున క్షత్రియ, వైశ్యభోక్తలకు యెంతమాత్రమును సంబంధించదు. ఈ మంత్రములు ఎల్ల ప్రాయశ్చిత్తముల౦దు౦డ వచ్చును. శ్రాద్ధపూర్వాంగ ప్రాయశ్చిత్తమును తక్కిన ప్రాయశ్చిత్తముల వంటిదే. ఆ ప్రాయశ్చిత్తకాలమునందు భోక్తల పని యేమియులేదు. యాజక బ్రాహ్మణుడు కూడ వచ్చును.

2. "యదీచ్ఛసి మహారాజన్ ౼ సర్వతీర్ధావగాహనం
విప్రపాదవినిర్ముక్తంతోయం వెరసిధారయేత్"

ఈ శ్లోకమును భోక్తలకు పాద్యమిచ్చి యాజలమును శిరస్సున నుంచు కొనునప్పుడు పఠించుచున్నారు. ఇది ఆగ్నేయ పురాణములోని శ్లోకము. దీని యర్థము. ఓ రాజా నీవు సర్వతీర్ధములయందు స్నానముచేయ నిశ్చయించితివా విప్రపాదముల నుండి జారిన నీటిని శిరస్సున నుంచుకొనుము అని యున్నది. ఈ శ్లోకము భోక్తలపాడ్యకాలమున చదుపుటకంటె వెర్రి వేరేలేదు. భోక్తను ఎదుటనుంచుకొని, ఓ రాజాయని పిలుచుటయు మీకు సర్వతీర్ధావగాహనమందు ఇచ్ఛగలిగియున్నట్లైన, యనుటయు విప్రపాదతీర్ధమును శిరస్సున ధరించుకొమ్ము అనుటయు ఎంత ఆసందర్భముగానైన నున్నది కావున ఈ శ్లోకము అబ్దికమంత్రములో చేర్చరాదు.

16

ఒకవేళ ఈ శ్లోకము పఠించినను బ్రాహ్మణకర్త బ్రాహ్మణ భోక్త ఏర్పనప్పుడు విపతీర్ధ మహిమను గొనియాడుకొనుట కుదాహరణముగా జెప్పుకౌసిన తప్పులేదు.

3. "ఓషధయ:సంవదంతే సోమేనసహరాజ్ఞాయస్మై
కరోతిబ్రాహ్మణఃతగ్ం-రాజన్ పారయామసి|

ఈ మంత్రము ఆవాహనానంతరము అక్షతలు భోక్తలమీద జల్లునప్పుడు వచ్చును. ఇందులోని బ్రాహ్మణపదము కర్తకర్థము గాని భోక్తకు సంబంధించదు.

దీనియర్ధ మేమనగా

సోముడనేరాజుతో ఓషధులు జెప్పుచున్నవి.

ఓరాజా ఏ ఫలము కొరకు బ్రాహ్మణుడు కర్మను చేయుచున్నాడో దానిని మేము తుదముట్టించుచున్నారము.

ఈ మంత్రము వలన భోక్తలు క్షత్రియ వైశ్యులుగా నున్నపు డేయసందర్భమును లేదు.

4. ఇయంభూర్గయా ఏతేబ్రాహ్మణాగదాధరాః అనుచోటను"దేవతేదమన్నం కవ్యం బ్రాహ్మణ స్త్వాహవనీయార్ధే దత్తం అను చోటను దక్షిణేన బ్రాహ్మణంస్మృశస్ అనుచోటను ఉదాహరణములుగా బ్రాహ్మణ పదములు చెప్పబడినవి.

శ్రీనివాసశర్మా అనియు శ్రీనివాసశర్మణం ఆనియు ఉదాహరణములుగా జెప్పినంత మాత్రముచేత అవే మంత్రములు కావు. గోవిందశర్మా అనవచ్చును రామవర్మా అనవచ్చును.అప్పుడు భోక్తలుగా గూర్చుండువారెవ్వరో అదిచూచి మార్చుకొనవచ్చును.

17

యజమానస్య పితుః అని ప్రయోగములో వ్రాసినంత మాత్రముచేత తన భ్రాతకు తద్దినము పెట్టువాడు కూడను యజమానస్య పీతుః అనరాదు. ఆస్మద్భ్రాతుః ఆనవలెను. అలాగుననే దక్షిణేన బ్రాహ్మణం స్మృశన్ అనిన దానిచేత వైశ్యభోక్త ఉపవిష్ణుడైనప్పుడు మరియొక చోటనున్న బ్రాహ్మణుని ముట్టు కొనుమని అర్థముకాదు. భోక్తయగువాని దాకుమని యర్థము చేసికొనవలయును.

నాందీ శ్రాద్ధమునందు ఆభ్యుదయిక బ్రాహ్మణ భోజనాచ్ఛాదన ప్రత్యామ్నాయ యథాశక్తి హిరణ్యం తుభ్యమహం సంప్రదదేనమమ అనియున్నది. క్షత్రియవైశ్యో పనయనముల యందు బ్రాహ్మణులెట్లుగా సంభవింతురు. బ్రాహ్మణశబ్దము చెప్పుటచేత ఆయా వర్ణములవారికి ఎవ్వరాభ్యుదయికులగుదురో వారేయని అర్ధము చేయకతప్పదు.

ఈ పైన వ్రాయబడిన నాలుగు సిద్ధాంతముల వలన తేలిన పర్యవసితార్ధ మేమనగా

ఆబ్దికమంత్రములలో గొన్ని పరిషద్వందనాలతో సంబంధించి భోక్తలతో సంబంధించనందునను కొన్ని అనావశ్యకములు, అసందర్భములునగు శ్లోకములు జేర్చబడినందునను కొన్ని యుదాహరణ రూపకముగా ప్రయోగకారులు వ్రాసిన మాటలై నందునను బ్రాహ్మణ విప్రపదములు మాత్రము కానవచ్చునంత మాత్రముచేత క్షత్రియవైశ్యులు భోక్తలుగా నుండకూడదని చెప్పరాదు.

18

రాడ్విశోరనుకల్పేతు - క్రియామంత్రానుకూలతా !
దాసువంశాబ్దిచంద్రేణ - వివృతారామశర్మణా ॥

క్షత్రియ వైశ్యానుకల్ప భోక్తృమంతానుకూలతా ఘట్టము సమాప్తము.

శ్లో. సదహం చిదహం సోహం - అనందోహం నిరాకులః
మాయాప్రపంచ సమ్మర్శే - భజామిశివమీశ్వరం॥

5. శ్రాద్ధేషు క్షత్రియ వైశ్యయో ర్బ్రాహ్మణయాజకస్యైవ ముఖ్యత్వవిచారఘట్ట8

:- స్వసిద్ధాంతములు :-

1. క్షత్రియవైశ్యులకు యాజనాధ్యాపన ప్రతి గ్రహములు విహితములుకావు, యజనాధ్యయన దానములు మాత్రమే విహితములు.

ఇందునకు బ్రమాణములు "వైశ్యధర్మదీపిక” యందు సవిస్తరముగా వ్రాయబడినవి ఇచ్చట తిరిగి వివరించవలసినదిలేదు.

విజ్ఞానేశ్వరీయం

ఇజ్యాధ్యయనదానాని ‘వైశ్యస్యక్షత్రియస్యచ
ప్రతిగ్రహోధికో విప్రేయాజనాధ్యా పనేతధా ॥

2. క్షత్రియవైశ్యులు, యాజకత్వమునకు బ్రాహ్మణులు దొరకని మహాపత్తునందు దమలోతాము యాజకత్వమవలంబించ వచ్చును.

19

ఇందునకు బ్రమాణములు-

"వైశ్యధర్మదీపిక" యందు 5వ సూత్రము [ఆపదీతరేపి)వివరించుటతో వ్రాయబడినవి. గౌతమసంహిత [యాజనాధ్యాపన ప్రతి గ్రహా సర్వేషాం.]

శ్రాద్ధేషురాడ్విశోర్విప్ర - యాజకత్వస్యముఖ్యతా :
వివృతా దాసువంశాబ్ది - శశినా రామశర్మణా ॥
విప్రయాజకత్వముఖ్యతా విచారట్టము సమాప్తము.

శ్లో. నిర్లేపోనిరహంకారో నిరాలంబో నిరుత్తమః|
శివోహం లోకదీక్షాయాం - భావయే పార్వతీపతిం ॥

6. క్షత్రియ వైశ్యభోక్తృణాం ప్రతిగ్రహణ విచారఘట్ట :

:- స్వసిద్దాంతములు :-

యాజకుడు వేరు, భోక్తవేరు.

యాజకుడు కర్మచేయించువాడు. కర్మచేయువాడు యజమానుడు లేక కర్త, అన్నమును భుజించువాడు భోక్త. | 2. భోక్తకు ప్రతిగ్రహణముతో బనిలేదు కాని యువచారములయందును సాద్గుణ్యార్ధమగు దవీణయందును ప్రతిగ్రహణయోగ్యత గలదు ఏలననగా

బ్రహ్మచర్య భిక్షాపతిగ్రహణము, ఔపచారికద్రవ్య ప్రతిగ్రహణము, కన్యాప్రతిగ్రహణము, సాద్గుణ్యార్థ దక్షిణా ప్రతి గ్రహణము ఇవి క్షత్రియవైశ్యులకును అధవా శూద్రులకును విహితములే.

20

3. క్షత్రియ వైశ్యుల కిక్కాలంబున ననుకల్పభోక్తలే సిద్దించుటవలనను, అనుకల్పభోక్తలు బంధువులై నందునను, బంధువులకిచ్చు దానము తక్కిన దానములకంటే కోటి గుణితమైనందునను, క్షత్రియవైశ్య భోక్తలు ముఖ్యముగా బ్రతి గ్రహణమున కర్హులే.

ఇందులకు బమాణములు

బృహత్పారాశరీయము 4వ అధ్యాయము

బ్రాహ్మణోవి ప్రగేహేషు - నృపస్తేషూత్తమేషుచ
వై శ్యోవిప్రనృప స్వేషుకుర్యాద్భిక్షాంస్వవృత్తయే
ఏకాన్నంచ దిజోశ్నీయాత్ బ్రహ్మచారి ప్రతేస్థితః
భిక్షావ్రతం ద్విజాతీనాం ఉపవాసమం స్మృతం
ప్రగ్రహోనభిక్షాస్యాత్ - నతస్యాఃపరపాఃతా ౹౹

క్షత్రియవైశ్యులు భిక్షాప్రతిగ్రహణము చేయవచుననియు అది ప్రతిగ్రహణమే అనరాదనియు దీనివలన దేటబడును.

యాజ్ఞవల్క్య స్మృతి ఆచారకాండము ప్రధమాధ్యాయము

-- పాణింగ్రాహ్యసవర్ణాంసం - గృహీణయాత్
క్షతియాశరం నైశ్యాసతోదమాదద్యాత్

ఇందు గన్యాప్రతి గ్రహణము చెప్పబడినది, ౼ కన్యా ప్రతిగ్రహణము కూడదనువారు లేనేలేరు గాన ఈ అంశము విస్తరించబనిలేదు.

21

వివాహ ప్రయోగము ౼ కన్యాదానము

ఉత్తానసాగ్వీంరసఃప్రతిగృహాణతు కన్యాదాన సాద్గుణ్యార్ధం
దక్షిణాం తుభ్యమహం సంప్రదదేనమమ - సాల గ్రామదానం

కన్యా ప్రతి గ్రహణము ధర్మమైనప్పుడు తదంగమైన సాద్గుణ్యార్ధ దక్షిణయునెట్లు ప్రతిగ్రహించవచ్చునో అట్లే శాద్ధభోక్తృత్వము ధర్మమైనపుడు తదంగములైన యుపచారకములను సాద్గుణ్యార్థ దక్షిణయు బ్రతి గ్రహించవచ్చును.

ఇదియుగాక

క్షత్రియుల ఇంటికి క్షత్రియులును వైశ్యుల యింటికి వైశ్యులును అతిధి కాకూడదా? వాళ్ళకు ఆతిధ్యమిచ్చి ఆర్షపావ్యాదుల బూజించి వసనాది సత్కారములు చేసిపంపకూడదా ?అంతమాత్రము చేత క్షత్రియవైశ్యులు ప్రతిగ్రహణము చేసిట్లేనా?

పరాశరస్మృతి చూడుము

సంధ్యాస్నానం జపోహోమో - దేవతానాంచ పూజనం
ఆతిధ్యం వైశ్వదేవంచ షట్కర్మాణి దినే దినే॥

ఇందు ద్విజులు నిత్యమును చేయవలసిన కర్మలు చెప్పబడివి. ఆతిధ్యమొకకర్మ - ఇప్పటి క్షత్రియ వైశ్యులకు బ్రాహ్మణాధ్యమెట్లు సంభవించును. క్షతీయవైశ్యులే సంభవింతురు-'వారికి యధావిధి అన్ని సత్కారములును జరుగవలసినదేకదా-ఆతిధ్యము ధర్మమైనప్పుడు సాద్గుణ్యార్ధ దఱిణయు ధర్మమే.

22

పరాశరమాధవీయము 31వ పుట భవిషోత్తరపురాణమునందు

నకేవలం బ్రాహ్మణానాం-దానం సర్వతశస్యతే
భగినీ భాగినేయానాం మాతులానాం పితృష్వసు:
దరిద్రాణాంచబంధూనాం దానంకోటిగుణంభవేత్

ఈ శ్లోకము పలన సకల సందేహములును నివృత్తియగుచున్నవి.

ఇందులో నిజమైన యర్ధము అన్ని కర్మల యందును బ్రాహ్మణులకే దానము చేయుట ప్రశస్తము కాదు.

తోబుట్టువు- తోబుట్టువు కొడుకు మేనమామ. మేనత్త - దరిద్రులు - ఇంకను ఇటువంటి బంధువులు - వీరికిచేసినదానము కొన్ని యెడల బ్రాహ్మణులకు జేసిన దానమునికంటే కోటిగుణిత మైన ఫలమిచ్చును.

యెల్లకర్మల యందనుటచేత కొన్నింటియందు బ్రాహ్మణులు మాత్రమే ప్రతిగ్రహీతలనుట నిశ్చయమే కాని కొన్ని ట క్షత్రియ వైశ్యులు వారిలో వారి బంధువులే, ప్రతిగ్రహీతలైనచోనుత్తమపక్షమని ఈ శ్లోకము వక్కాణించుచున్నది,

భో క్తలకిచ్చువస్త్ర పాత్రాదుకులౌపచారకములు
క్షత్రియవైశ్యులలో భోక్తలుగా నుండువారు బంధువులే.
భోక్తలకిచ్చు దక్షిణ శ్రాద్ధసాద్గుణ్యార్ధమైనది.

కావుననిందు బ్రతిగ్రహణమేమున్నది. ఒకవేళ అది యున్నను నిపిద్దమేలయగును ?

23

ప్రతిగ్రహణము సుతరాం పనికిరాని యతికి ముఖ్యముగా భోక్తృృత్వ యోగ్యతకఇదేకదా

శ్లో. నృపాల వైశ్యభోక్తౄణాం - ప్రతిగ్రహణయోగ్యతా!
వివృతాదాసువంశాబ్దిశ - శినా రామశర్మణా ॥

క్షత్రియవైశ్య భోక్తృప్రతిగ్రహవిచారము సమాప్తము.

శ్లో. అన్న ప్రాణమనోవిజ్ఞా-నానందాత్మానమచ్యుతం|
ప్రాతిభాషికవృత్తేస్మిన్-పందే నందాత్మజంగురుం॥

7. క్షత్రియవైశ్యయోరామ శ్రాద్ధదురాచార పరిత్యాజ్యతా విచారఘట్టము.

1. క్షత్రియవైశ్యులలో అద్దినాదులయం దామ, శ్రాద్ధములు జరిగించుట నిషిద్ధాచారము గాన ఆది మాని యన్న శ్రాద్ధములే జరిగించవలయును.

2. దురాచారము కొంతకాలమునుండి జరిగివచ్చుచున్నను దానిని మానుట దోషము కాదు.

ఇందునకు బ్రమాణములు.

ఇదివరకే నేను రచియించి ప్రకటించియున్న “వైశ్యధర్మదీపిక యందు 7వ స్తూత్రము - దురాచార పరిత్యాగాత్ సదాచార సంగ్రహాత్పూతాభసంత్యేవ" వివరించుటలో సవిస్తరముగా వ్రాయబడినది. ఇందు మిక్కిలి వ్రాయవలసినది లేదు.

గౌతమస్మృతి 1వ అధాయము 10 వ శ్లోకము

సమయశ్చాపి సాధూనాం ప్రమాణం వేదవత్తరాం!

శ్రుతిస్మృతిపురాణానాం ధర్మస్యాదవిరుద్ధకః

24

మనుస్మృతి 12 వ అధ్యాయము 106, 108 శ్లోకములు

ఆర్షంధర్మోపదేశంచ వేదశాస్త్రావిరోధినా|
య స్తర్కేణాన సంధ త్తై సధర్మో వేడనేతరః
అనామ్నా శేషు ధర్మేషుకఢంస్యాదితి చేర్భవేత్|
యంశిష్టా బ్రాహ్మణాబ్రూయుః సధర్మస్స్యాదశంకితః

వీనివలన౼

శాస్త్రమునకు విరుద్ధముగాని యాచారమును విడువరాదనియు, శాస్త్రమునకు విరుద్ధమైన యాచారమును విడువవలసినదనియు దెలియుచున్నది. ఇట్లుండగా శాస్త్రములయందు నిషేధింబబడిన ఆమ శ్రాద్ధదురాచారమును విడువ కూడదనువాడు కలడని తోచదు.

శ్లో. ఆమ శ్రాద్ధదురాచర పరిత్యాగవిచారణా!
వివృతాదాసువంశాబ్ది - శశినారామశర్మణా ||

ఆమశ్రాద్ధపరిత్యాగివిచారఘుట్టము సమాప్తము.

శ్లో. నాహంద్రవ్యంగుణంసాహం నజాతిర్ని క్రియాత్వహం
అవిద్యాస్మరణాదేవ - ఇష్టకామేశ్వరంభజే ॥

8.ఉపన్యాసోవసంహారకాలే సర్వార్ధసంగ్రహఘట్టః

సూత్రములు:

1.సూ.అన్నామహిరణ్య భేదాఛ్చ్రాద్ధ స్త్రీవిధః

అన్నశ్రాద్ధము
ఆమశ్రాద్ధము
హిరణ్య శ్రాద్ధము

అని శ్రాద్ధములు త్రివిధములు.

25

2.సూ. మృతాహేష్వన్నలాభేక్వన్న శ్రాద్ధఏవ.

తద్దినముల యందన్నము దొరికెనా అన్న శ్రాద్ధమే చేయవలయును.

3.సూ. ముఖ్యకల్పానుకల్ప భేదాభోర్తారో ద్వివిధాః

ముఖ్యకల్పభోక్తలు.
అనుకల్పభోక్తలు.

అని భోక్తలు రెండువిధములవారు.

4.సూ. బ్రాహ్మణాలాభత్వనుకల్ప భోక్తారో మాతులాదయో బాంధవాః

బ్రాహ్మణులు ముఖ్యకల్పభోక్తలు - బ్రాహ్మణులు దొరకనప్పుడు మేనమామ మొదలగు బంధువులను కల్పభోక్తలు.

5.సూ. క్షత్రియవైశ్యయోర్ముఖ్యకల్పభోక్తృలా సద్భశ్యతే తస్మాదనుకల్పభోక్తారఏవ.

క్షత్రియవైశ్యులకు బ్రాహ్మణ భోక్తలు లభించుట గానరాదు. కావున అనుకల్ప భోక్తలకే శ్రాద్ధము జరిగించవలసినది.

6.సూ. క్షత్రియవైశ్యయో రావదివినా బ్రాహ్మణ వివయాజిక

ఆపత్తునందుతప్ప, తక్కిన అన్ని సమయములందునా క్షత్రియవైశ్యులకు బ్రాహ్మణుడే యాజకుడుగా నుండును.

26

7. సూ. క్షత్రియవైశ్య భోక్తౄణాంఁదక్షిణాది ప్రతినదూష్యః

క్షత్రియ వైశ్యభోక్తలు దక్షిణాదులు పుచ్చుకొదూష్యముకాదు.

8. సూ. క్షత్రియవైశ్యేషు మాస సంవత్సరాది శ్రాధ్ధ ఆమశ్రాద్ధదురాచారః పరిత్యజనీయః

తద్దినము. మాసికము మొదలగు శ్రాద్ధము క్షత్రి వైశ్యులు ఆమముచేత జరిగించుచు వచ్చు దురాచారము వదిలైనదగినది.

శ్లో. శ్రాద్ధసంశయవిచ్ఛేది సర్వార్థస్యైవ సంగ్రహః|
ఉపన్యాసోపసంహారే - కృత శ్శీరామశర్మణా ॥

"శ్రాద్ధసంశయవిచ్చేది" యను ఉపన్యాసము సమాప్తము.

శ్రీ శ్రీ శ్రీ