Jump to content

శృంగార సావిత్రి/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

ఊ॥ తారసపుష్టిమైఁ బ్రతిపదంబున జూతీయం వార్ణయం జమ త్కారము నగ్ధగౌరవముఁ గల్గ ననేకకృతుల్ ప్రసన్న గం భీగగతినే గచించి మహి మించినచో నిఁక నన్యు లెవ్వగ య్యా!గణునాథభూపరసికాగ్రణికిం జీవిసోఁకఁ జిప్పఁగన్. విజయవిలాసము..

తంజావూరి రఘునాథరాయలు.

క్రీ. 1650 సం॥ ప్రాంతముల దక్షిణ భారతదేశమునకుఁగల్గిన సౌభాగ్యమంతకుఁ బూర్వ మున్నఁడుగాని, తర్వాత నేటి దాకఁ గాని కలుగలేదు. ఇంక ముందుగూడఁ గలుగబోదేమో ! మహాకవి, మహాగాయకుఁడు, మహావిద్వాంనుఁడు, మహాదాత, మహాశూరుడు, మహాభక్తుఁడు, మహానుభావుఁడు, మహామహుడు రఘునాథరాయఁడను నాంధ్ర నాయకరాజాకాలమున 'దేళ మెల్ల నిత్యకల్యాణము, పచ్చఁదోరణమునై చెలువొందఁ దంజావూరు రాజధానిగాఁ తోళరాజ్యమును బరి పాలించెను. ఆకాలమున వందలకొలఁదిగా నిత్యాన్న దాన ధర్మ సత్రములు వెలసెను. వందలకొలఁదిగా నసాధారణ శిల్పసౌందర్యముగల దేవాలయమంటపగోపుర ప్రాకారాదులు వెలసెను. ప్రతిగ్రామమునకును గావేటి కాల్వలు పాఱింపఁబడెను. ఈతిబాధలకు, క్షామమునకు, ప్రజాక్షోభమునకు నా దేశమున నిలువ నీడ లేకుండఁ జేయఁబడెను. సరస సంగీత చాతుర్యములు, నవన వాలినయనై పుణ్యములు, ప్రశస్తశిల్ప చిత్రమాస్తులను నిర్మాణములు, మధురతర సంస్కృతాంధ్ర కవితా కల్పనములు, విద్వద్గోష్ఠులు, సకలశాస్త్రచర్చలు, కనకాభిషేకములు, గ్రామ గజాందోళి కాచ్ఛత్ర సోమరారి బహుమానములు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, ఋతూత్సవాయనోత్సవ వత్సరోత్సవాది దేవోత్సవములు, వివిధయజ్ఞ విప్రోత్తము విహారములు, షోడళ మహాదానములు, భగణాగత రాజరక్షణములు నాఁటి ముచ్చటలు. మెఱపుఁరీగలఁ బోలు వెలుఁతలు, సంస్కృతాంధ్ర భాషలందు సరసకవితలు నేర్చినవారు, సంగీత మందు బిరుదం నెలందినవారు నాఁడు వేలకొలఁగానుండిరి, స్వక్రతువులు సల్పినశ్రోతులు వేలకొలదిగానుండిరి. సత్కావ్యకర్తల్లు, శాస్త్రక ర్తలు, వేలకొలదిగానుండిరి. వీరెవ్వరును రఘునాధరాజును రాజమాతునిఁగాఁ దలఁపకయిరి. తండ్రిని గాను గురునిఁగాను వేల్పును గాను ప్రాణము ప్రాణమునుగాను. భావించిరి. ఆయన చరిత్రమునుఁ గొందఱు కవులు సంస్కత కావ్యములుగా, నాంద్ర ప్రబంధ ములుగా, నాటకముగా, యక్షగానములుగా, ద్విపదలుగా, పాటలుగా, నింక నేన్నేని తీరులుగా వర్ణించియు, వర్ణింపఁ జాల మైతిమని పగచిరి. ఒక మహావిద్వాంసుఁడు తా నాయనశిష్యుఁడనని చెప్పుకొనియెను. ఒక మహావిద్వాంసుఁ డాయన పేర నాఱుప్రబంధములు రచియించెను. ఇతరు లాయన పేరని పై స్నేని కృతులు రచించుట కాదు. ఆయనయు నా నేకకృతులు రచియించెను. రామాయణము, వాల్మీకిచరిత్రము, పారిజాతాపహరణము మొదలైనవి తెల్గునను, రామాయణసంగ్రహము, సంగీతనున మొదలయినవి సంస్కృతమునను నామహాకవి రచించిన కృతులు. ఆయన రచించిన రామాయణమును మధురవాణియను వేశ్య సంస్కృతమునఁ బరిపర్తించెను. రెండుజాములలో పారిజాతాపహరణ ప్రబంధము నామహాకవి రచించినఁట.

సావిత్రీ చరిత్ర

రసవంతమగు నీ ప్రబంధమునుఁ గూడ 'నామహారాజ కవియే రచించియుండు నని మే మనుకొనుచున్నాను. దీని మూలము తంజావూరి సరస్వతీ పుస్తకశాలలో నున్నది. అది ప్రాతపుస్తకము, గ్రంథారంభ మొక యాశ్వాసము లేనట్లున్నది. ఆశ్వాసాద్య పద్యములు, ఆశ్వాసాంత్య పద్యములు లేవు. నడుమఁగూడ నోక చోఁ గొంత గ్రంథపాతమున్నది. ఈ గ్రంథమును ముగియరచింపక పూర్వమే గ్రంథకర్త స్వర్గస్ధుండై యుండునని యూహము. ఆప్రతినిబట్టి తత్కర్తను గుర్తింపఁగుదురడయ్యెను. కాని శ్రీ రఘునాథరాయ మహాకవి రచియించిన రామాయణమందలి పద్యములు (ఋష్యళ్ళఁగ తపో భంగము పట్టుననున్నవి.) ఈ గ్రంగమునందును కుండుటచే తత్కర్తయే యేత్కర్త యగునని మే మూహించితిమి.

రామాయణము, వాల్మీకి చరిత్రము, మొదలగు రఘునాథ రాయల కృతుల రచనములకును, ఏతత్కృతి వచనములకును చాల పోలికగలదు. మహాభారతారణ్య పర్వమున మార్కండే యముని ధర్మరాజునకుఁ జెప్పినట్టుగా ఈ సావిత్రీ చరిత్ర కథయున్నది. ఈ ప్రబంధమునను గూడ న ట్లేగలదు. రఘునాథ రాయఁడు రామాయణమును రచియించినట్లే భారతమును గూడఁ దెలుఁగున వేఱొక పద్యకావ్యముగ రచింపఁబూనె నేమో? ఇది దానిలోని యొక కథపట్టు ఆగునేమో?

కవితా విశేషము.

ఇందు సందర్భితములయిన రాజాస్థానమర్యాదలు, హాస్య ప్రసంగములు, వేశ్యావినోదములు, సంభోగ శృంగారములు రఘునాధరాయలనాఁటి తంజావూరి సౌభాగ్యములను, గవితా సౌకుమార్యములను, ఆస్థానసంప్రదాయములను, వెల్లడించు చున్నవి.

తేట తేట కూర్పులు, భావవైశద్యములు, సరపపద సంధానములు ఈగ్రంధమునకుఁ బ్రశస్తిని గూర్చుచున్నవి. దూరాన్వయముగాని, క్లిష్టపద రచనగాని యిందుఁ గానరాదు. నాఁటి యభిరుచుల కనుగుణముగాఁగాఁబోలును శాంతరసమున కెక్కువగా సంభావనము కల్గవలసిన యేతత్కథా ప్రబంధమునఁగూడ, శృంగారరసమునకే సంభానన చాలగా దొరకెను. హాస్య రచన యిందు మిక్కిలి యానందింపఁ దగినంతవింతగా సంతరింపఁబడినది. రాధా మాధవమువలె నీకృతియు రవికరంజక పై వెలయఁ గలదని నమ్ముచున్నాము. ఇందు లోపించిన యాశ్వాసాద్యాంత్యపద్యములు కథాభాగములు ఇంకా నెక్కడనేని దొరకఁ గల్గుననునాళ మాకులేదు. తంజావూరిలోనే లేకపోగా నిక నెక్కడ దొరకును? అట్లు దొరకు భాగ్యమే కల్గునేని పునర్ముద్రణమున పూరించి సరిపఱుతుము.

దీని మూలప్రతిని తంజావూర్ పుస్తకళాలనుండి బ్రహ్మశ్రీ మానవెల్లి రామకృష్ణకవిగారు స్వహస్తముతో వ్రాసి తెచ్చుకొని యుండిరి. మా ప్రార్థనలమీఁద వారు దానిని, బ్రకటించుటకు దయచేసిరి. వారి తోడ్పాటుచేతనే యనాయాసముగ దీనిని మే మిపుడు ముద్రింపఁగల్గితిమి. ఇట్టి యుత్కృష్ట గ్రంథమునుఁ బ్రకటింపకొసఁగి మాకుపకృతి సల్పిన శ్రీరామకృష్ణ కవి గారికి వందన సహస్రము లర్పించుచున్నాము.

మా శృంగార గ్రంథమాలలో నీ సావిత్రీచరిత్ర పంచమ కుసుమమై విరాజిల్లు చున్నది. ఇంత పలుకు ఆంధ్రభాషాయోషకు ప్రాచీన సరసహృద్య పద్య భానుగములగు ప్రబంధ గ్రంధ కుసుమములు నైదింటినైనను సమర్పింపఁ గలిగినందులకు సంతసించుచున్నాము. ఈప్రాచీన ప్రబంధమునునికిని దెలిపి, శ్రీకవి గారిచే మాకిప్పించి యీ పీఠికావిషయమును మాకు వ్రాసియిచ్చి యుపకరించిన బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారికి మాకృతజ్ఞతాపూర్వక వందన సహస్రము అర్పించుచున్నాము.

విభవ గంటి, సూర్యనారాయణశాస్త్రి, వైశాఖి.