శృంగారశాకుంతలము/పీఠిక
పీఠిక అ పిల్లలమట్టి పినవీరభద్రకవి పదు నేనవ శతాబ్ది యుత్తరార్ధములోనివాడు- ఈయన రచించిన కావ్యములలో నీనాటికి లభించినవి రెండుమాత్రమే. అందు మొదటిది శృంగార శాకుంతలము. ఈ గ్రంథపీఠికి యందు కవి తన రచింప బూనిన కావ్యము నొకచోట ళాకుంతలం లను ప్రబంధ మనియు, మఱియొక చోట శాకుంతల కావ్య మనియు పేర్కొ నేను. ఆశ్వాసాంత గద్య యందు విశాకుంతల శృంగార కావ్య మని వచించేను. ఎచ్చటను కవి యీ కావ్యమును శకుంతలా పరిణయ మని చెప్పలేదు. పిన వీరననాటి కింకను 'కావ్య', 'ప్రబంధ' పదములు వాడుకయందు పరస్పర వినిమయము నంగీకరించు పదములుగ నే యున్నవి. కొన్ని నిర్దిష్ట లక్షణములవే ప్రబంధపదము కావ్యపదము కంపె భిన్నముగా రూపొందుట పదునాఱవ శతాబ్దిలో జరిగినది. ఆ లక్షణములు : 1. అష్టాదశ వర్ణనాభూయిష్ఠత, 2. శృంగార రస పోషకముగు కథ, 8. అక్లిష్ట మును ఏకైక నాయకా! శ్రితమునగు కథ, 4. అర్థ గాంభీర్యముకంటే శబ్దాలంకార పరిపుష్టత, ప్రౌఢ శయ్యా సౌందర్యము, నవిచార్యము లగుట, 5. నీతి బోధ యో, ధర్మ ప్రతిపాదన యో కాక, కావ్యము ఆనందదాయకమైన చాలు : నెడి లౌకిక దృష్టితో గూడిన కవిత్వాదర్శము . ఈలక్షణములలో మిక్కిలి ప్రముఖములై గ వర్ణనా వై పుల్యమును, శృంగార ప్రాధాన్యమును ఆంధ్ర సాహిత్యము యొక్క 1. త ద్వచన ప్రకారంబున మిశ్రబంధంబుగా బంధుర ప్రీతిం జెప్పఁ బూనితి 2. నా యొనర్పం బ లామంలు. శాకుంతలంబము ప్రబంధంబు శాకుంత. 1. 28. కాకుంతల ౦తల కావ్యక థాలతాలవాలంజగు పురీల శాకుంత. 1. 88. ౯. పిల్లలమఱి పినవీరభద్ర ప్రణీతంబైన శాకుంతలశృంగార కావ్యంబునందుఁ ఈ బ్రధమాశ్వాసము. శాకుంత. 1. 139. 4. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము - ఆచార్య ఖండవల్లి లక్షీ రంజనముగాడు. పుట. 115. 2 ప్రారంభ దశ నుండియు కావ్యములుదః కాన్పించనునే యుండె ననవచ్చును. పదునొకండవ శతాబ్దమున నాంధ్ర సాహిత్యలత మహాభారత మకు తొలిపూవును విడిసింది. ఆనాటినుండియు నెఱ్ఱాప్రగడ కాలము పఱకును అనగా or
- .
1020 నుండి 1875 వఱకురు వచ్చిన తెలుగు సాహిత్యమును 'భాషాంతరీకరణ యుగ సాహిత్యముగా కొందఱును, ఆదిమ యుగమునకు చెందిన సాహిత్యముగా మఱి కొంచఱును తలచిరి. మూడు వందల యేండ్లకు పై బడిన కాలములోని సాహిత్యము నంతటిని ఒకే పేరు క్రింద నిర్దేశింప బూనుకొన్నచో నా నామకరణము అన్వర్థముగా నుండుట కష్ట సాధ్యమే యగును. పురాణ యుగ మను నామము సరిపోవునట్లు చూచుటకై యా దృష్టితో నీ కాలములోని సాహిత్యమును సమీక్షింప బూనుకొంటిమేని యీ సమీక్షకు లొంగని గ్రంథము లెన్ని యోయీ యుగమున స్పష్టముగా గోచరించును. అందు మొదటిది నన్నెచోడుని కుమార సంభవము. అందున్న వర్ణనా వైపుల్యమును, శృంగార రస ప్రధానములుగా నిందు తీర్చబడిన ఘట్టములును భారతరచనకంటే భిన్నములుగా మనకు గోచ వి. చును. ఎఱ్ఱన హరివంశము పురాణమార్గమున కథితము కాగా నాచన సోమన హరివశము ప్రబుధపద్ధతియందు తీర్చిదిద్దబడినది. ఎఱ్ఱన తనకు గల యనన్య కల్పనారామణీయకమును, వర్ణనా నైపుణ్యమును, నాటిన సృసింహ పురాణము పేరునకు పురాణమే యైనను ప్రబంధ లక్షణములను సంతరించుకొని యాయనకు గల ప్రబంధపర మేశ్వర బిరుదము నన్వర్థము చేసినది. అట్లే దీనిని భాషాంతరీ కరణ యుగమునకు చెందినదిగా నిర్దేశించుటయు తగదు. ప్రప్రథమ గ్రంథ మైన భారతము భాషాంతరీ కృతి యైనంత మాత్రమున నీ పేరు నిర్ధారింప బూను కౌంటిమేని యిందలి కావ్యము లెన్ని యో భాషాంతరీకరణములు కాకపోవుటచే నీనామకరణమున కవ్యా ప్తిదోషము పట్టును. నన్నెచోడుని కుమార సంభవము, క్కన నిర్వచనోత్తర రామాయణము, నాచన సోముని హరివంశము, ఎఱ్ఱ నృసింహ పురాణము, మంచన కేయూరబాహు చరిత్రమును భాషాంతరీకరణ ములు, కావు. సంస్కృత భాండారములోని కావ్మ పురాణ నాటక గత కథల ననుసరించి పెంచియో, త్రుంచియో యొక సముచితరమణీయమగు రూపము నిచ్చి స్వతంత్రముగా నిర్మించిన యుత్తమ కావ్యములు. చిత్ర విచిత్ర వర్ణము లతో భాసించు సుగంధీ కుసుమములు ఒకే సూత్రమునకు గ్రఢతములై మనోహర హారముగా భాసించునట్లు, పురాణ పరివర్తనములును (భారత, రామాయణ ములు, హరివంశము) పురాణాంతర్గత క థాబీజము చుట్టుకు నిర్మింపబడిన రమ 1. ఆంధ్ర వాఙ్మయచరిత్ర - ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు. 2. ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - కీ. శే. కాశీనాథుని నాగేశ్వర రావు. హుతులుగారు. 3 ణీయ కావ్యములును (కుమార సంభవము, ఉత్తర హరివంశము, నృసింహ పురాణము, ఉత్తర రామాయణము) అటు పురాణములుకు, ఇటు ప్రబంధ లక్ష ణాంచితములును గాని కథాకావ్యములును (దశకుమార చరిత్ర; కేయూర బాహు చరిత్ర) కలసి మెలసి యుండి ఆదినుండి మూడు వందల యేండ్ల తెలుగు సాహిత్య చరిత్రకు వన్నె గూర్చినవి. ఇచట పురాణ ధోరణితో పాటు సరిసమాన ముగ ప్రాధాన్యము వహించి రూపులు దిద్దుకొన్న ప్రబంధ లక్షణాంచితమైన పద్ధతి, తెలుఁగు సాహిత్యమున ఎఱ్ఱన తరువాత క్రొత్త పోకడలను త్రొక్కినది. క్రీ. శ. 1875 నుండి 1500 వఱకును గల కాలమును సాహిత్య చరిత్రలో శ్రీనాథ యుగముగా పేర్కొనిరి. ఎఱ్ఱన వఱకును గల ప్రబువ లక్షణాంచితము లైన కావ్యములలో కేవలము వర్ణనా వైశద్యమును, అక్కడక్కడ శృంగార రస ప్రాధాన్యమునుమాత్రమే మనము గ్రహింపగలము. కాని శ్రీనాథ యుగము నందలి కావ్యము లన్నిటి యందును ఈ రెండు లక్షణములే కాక శబ్దా డంబరముతో గూడి ప్రౌఢమై, దీర్ఘ సమాస భూయిష్టమైన శ్రీ విన్యాసమును. కవి తాను మోజుపడిన సన్ని వేళమునో, వస్తుప్రపంచమునో, భావ పరంపరనో కథాకథనమున కడ్డు వచ్చుచున్నను అతిమాత్రముగా వర్ణించి తీరవలయు ననెడి యుత్కంఠయు నుండితీరును. ఈ యుగమునకు కర్తయైన శ్రీనాథుడు సంస్కృ తాంధ్ర శబ్దముల మీద తిరుగులేని యధికారము కలవాడు. భేరీ భాంకారము నినుకరించు సంస్కృత సమాసకల్పనతోపాటు వీణా మృదురావు ననుకరించు తియ్యని తెలుగు పదముల కూర్పును నీయన సొమ్ము. కథ చెప్పుచున్నంత సేపును నీకవిడృష్టి యా కథాకథనము పై గా శ గాక యా కథ సాగు సాగు పద్ధతిపై నిష్ఠమై 1 యుండును. ఈయన పురాణకథను తీర్చి దిద్దవలసి వచ్చినను వానిని ప్రబంధ మార్గముననే చెప్పును. అందు కీయన కాశీఖండ భీమఖండములు చక్కని యుదా హరణములు. శ్రీనాథు డీవిధముగా తన కవితామార్గమును సుస్పష్టముగా మలుచుకొనుటకు వానికి ముందు మూడు వందల యేండ్ల నుండి ఆంధ్ర సాహిత్య ముని పాదు గట్టియున్న ప్రాబందిక కవితా బీజములు తోడ్పడినవి. ఈయన సమకాలీనులును, ఆర్వాచీనులు నైన కవులందఱును ఈయన కవితా ప్రభావము నుండి తప్పించుకొని లేకపోయిరి. ఈ యుగమునం దాన్ని కావ్యములును, కథ యెట్టిదైనను ఇంచుమించు ప్రాబందిక పద్దతియందే తీర్పబడినవి. అచట మనకు కాన్పించు వర్ణనాలంకార శబ్దార్థ గౌరవాది వివిధవిషయములు తీర్పబడిన 1. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము - ఆచార్య ఖండవల్లి రంజనముగారు. A - పద్ధతియు, ప్రాత కథ క్రొత్త రీతిగా నలంకరింప బడిన వైనమును - అన్నియు శ్రీనాథ కవితా లక్షణములు. అనగా నాయుగలక్షణములు. ఈ యుగము వాడును శ్రీనాథున కించు మించు సమకాలీనుడు పైన పిల్లలమఱి పినవీరన యీ లక్షణములచే ప్రభావితుడు కాకుండ నుండలేకపోయెను. ఈయన శృంగార శాకుంతలము శ్రీనాథయుగలక్షణములకు నిర్దుష్టమైన యుదాహరణము. ఈ యుగము నందలి కావ్యముల నన్నిటిని మూడు విభాగములు చేయవచ్చును. 1. పురాణములను పరివర్తించుట : 1. వరాహ పురాణము. 2. జై మినీ భారతము. 8. పద్మ పురాణోత్తర ఖండము. 2. పురాణాంతర్గత కథలను 1. శృంగార శాకుంతలము. 2. హరవిలాసము. 3. కాశీఖండము. 4. భాగవత దశమ స్కంధము . 5. వాసిష్ఠ రామాయణము. 6. ప్రబోధ చంద్రోదయము. ప్రబంధములుగా చెప్పుట : 4. భీమఖండము. 5. శృంగార నైషధము. 6. నాచికేతూపాఖ్యానము. 3. వివిధ కథలను గూర్చి యేక కావ్యముగా రచించుట : రెండే 1. విక్రమార్క చరిత్ర. 2. భోజరాజీయము. 8. సింహాసన ద్వాత్రింశిక - 4. పంచతంత్రము. పురాణ కథలను ! ప్రబంధములుగా మలచినవానిలో ప్రసిద్ధములై నవి కాన్పించుచున్నవి. అందు మొదటిది మొదటిది యుగకర్త యైన శ్రీనాథుని శృంగార నైషధమును, రెండవది పినవీరన శృంగార శాకుంతలమును. నైషధము ఆనాటికే శ్రీహర్షునివలన సంస్కృతమున రచింపబడి యుండుట చేతను 1.శ్రీనాథుకు తాను హర్ష నైషధ కావ్యమును తెలుఁగున తీర్చుచున్నాడ నని చెప్పుకొనుటచేతను దీనిని స్వతంత్ర గ్రంథ మనుటకు వీలు లేదు. కాని పినవీరన 1. సంతరించితి నిండు జవ్వనంబున యందు హర్ష నైషధ కావ్య మాంధ్ర భాష కాశీ. 1 5 నైపుణ్యమునకు కాళి శాకుంతలము అనువాదము కాదు. శ్రీనాథునకు హర్ష కృతి యున్నట్లే, సిన వీరన కభిజ్ఞాన శాకుంతల మున్నను ఆయన యభిజ్ఞానమును తెలుగు చేయబూను కొనలేదు. సరిగదా, 'మాలకరి పలురకములైన కుసుమములు నొకే దండయం దమర్చి యెత్తులు గావించినట్లు, చందనచర్చ సుగంధ వస్తువులచే వాసించినట్లు, తేనెటీగలు వివిధ కుసుమములు నుండి యింతలింతలు తేనెలు తెచ్చి సమకూర్చినట్లు, భారతప్రోక్త కథ మనస్సున నుంచుకొని, తన రచనా దాసుని నాటక క్రమమును కొంత చేర్చి శాకుంతలమును వాసింప చేయుట కి కవి యిచ్చగించెను. ఇది యా కాలమునకే యభినవమైన మార్గము. శృంగార నైషధము అప్పటికే పండిత ప్రశంసల నందుకొనగా దానిచే పెల్లుగా ప్రభావితు డైన వీరన శృంగార ప్రధానముగా భారతాంతర్గత గాథను తీర్చుటయే కాక దానికి నామకరణము గూడ వైషధ చ్ఛాయలోనే గావించెను. తాను తీర్చబోవు కావ్యగత రసమునుగూర్చికూడ కవి చర్చించెను. శృంగారమంగియు, మిగిలిన యష్టరసము లింగము అయ్యెనేని ప్రబంధము టంకములంగారము (పచారు వన్నె బంగారము) సామ్యమున ప్రకాశించు ననియు, నందువలన ప్రసిద్ధయు శృంగారవతియునై శ్రీ మహాభారతమున కధితమైన, శకుంతలాఖ్యానమును ప్రబంధముగా జేయుదుననియు దెలిపెను. ఇట్ల భినవమైన మార్గమున, శృంగార నైషధముచే ప్రభావితమై, స్వతంత్రముగా రూపొందిన ప్రబంధము శాకుంతలము. కవి భారత ప్రోక్త కథను గాని, కాళిదాసుని నాటక కథను గాని -ఈ 1. శాకుంతలము. 1, 27. 2. శృంగారము ముఖ్యంబగు సంగెయు సంగములు దలప నష్ట రసములుగా సాంగమగు నేని డంకము బంగారముతోడి యొర ప్రబంధము నొందుఞు. L శాకుంతల. 1. 25. ఈ పద్యము నుదహరించుచు తమ సమగ్రాంధ్ర సాహిత్యమున నారుద్రగా రిట్లు వ్రాసిరి :- "అష్ట రసాల్లో శృంగారం మిన్న అని ఆ ఆ రోజుల్లో భావించే వారు. (కవిత్రయంలో ఒక రైన) ఎఱ్ఱయ్యగారూ, పినవీరయ్యా అష్ట రసాల నే పేర్కొనడం వల్ల క్రీ. శ. 14, 15 శతాబ్దాలలో సోమరాజుపల్లె ప్రాంతాలలో విద్వాంసు లష్టరనవాదు లనుకోవాలె " కాని పై పద్యము వలన పిన వీరయ్య అష్ట రసవాది యను నర్థము తీయవచ్చునా! కృంగార మంగి యైనచో సంగము లుగా భాసించు నవి యష్టరనములు కాగా వెరసి తొమ్మిదె యనియు దానివలన పినవీరయ్య నవరసవాదియే యనియు స్పష్టమగుట లేదా ! 3. శాకుంతల. 1. 26. 6 పూర్ణముగా స్వీకరించక వానిలో తన కిష్టమైన క థాంశములకు స్వకపోల కల్పనను జోశించుటలో పొటించిన యాచిత్య మెట్టిది? అందున సాధించిన ప్రయోజన మేమి? భారతకథయందలి దుష్యంతుడు ధీరోదాత్త నాయకుడుగా నిలుచు టకు తగదు. ఎఱిగి యెఱిగి లోకోపవాద భీతిచే నసత్య దోషమునకు పాలైన వాడు నాయకుడగుట కావ్యనాటక మర్యాదకు విఘాతము కలిగించు సంశము. అందువలన కాళిదాసు తన దుష్యంతుని ధీరోదాత్తునిగా తీర్చుటకే సంకల్పించెను. దుర్వాసశాపమును కల్పించి ముద్రికను శకుంతల జారవిడుచుకొనెడీ ఘట్టమును సృష్టించి రాజునకు మతిమఱపు కల్పించెను. శకుంతలా దుష్యంతుల సమాగ మమును రాజసభయందు గాక మరిచాశ్రమమున సంభవింపజేసెను. రాజచ్ టిక్ వచ్చుటకై దేవదానవ యుద్ధ కల్పసమును, రాజందు దేవతలకు సహాయకుడుగా వేగుటయు కల్పించి, వీరమును నాటకాంతర్గత శృంగారమున కంగముగా పోషించెను. శకుంతలా దుష్యంతుల మధ్య విప్రయోగమును సృష్టించి వియోగ శృంగారమును పోషించెను. అట్లు చిన్నదియు ప్రాసంగికముగా చెప్పబడినదియు, భావ సంఘర్షకు స్పష్టముగా చిత్రీఃపనిదియు నై న భారత కథను రమణీయమైన నాటక కథగా కాశిదాను తీర్చెను. కాళిదాసువలె పినవీరయ్య తన కావ్య నాయకుని ధీరోదాత్తునిగా చిత్రించుటకే సమక సైను. అందువలన దుర్వాసశాప వృత్తాంతమును కాళిదాసునుండి గ్రహించెను. కాని నాటక కథ కనుపుగా తీర్చ బడిన నాయికా నాయకుల మధ్య దీర్ఘ వియోగమును కావ్య కథా సందర్భమున కనగర మైనదిగా నాయన భావింపలేదు. దుష్యంతుని శీలమును నిర్దుష్టముగ చిత్రించుటయే ప్రధానాళయము గాని శృంగార భేదమగు విప్రయోగ శృంగార మును పోషించుట యీయనయభిమతము కాదు. కావుననే కాళిదాసమునుండి ముద్రికా ప్రాధాన్యము కంగీకరించినను, శకుంతల దానిని జారవిడుచుకొన్నట్లు చెప్పలేదు. ముద్రికను చూచిన వెంటనే శాపావసానము కలుగునన్న సత్యము రెంటియందును సమానముగ నున్నను కాళిదాసురుష్యంతుడు ముద్రికను చూచుటకు కొన్ని యేండ్లు పట్టుటయు, పినవీరనదుష్యంతుడు దాని నా సభా భవనము నందే కొన్ని గడియల తరువాత చూచుటయు, నీ రెండు కథల మధ్య గల తారతమ్యమును తెలియజేయును. మొదటిది నాటకోచితముగా నుండగా, రెండవది కావ్యశిల్పమునకు సరిపోయినట్లు తోచును. దీనినిబట్టి పినవీరన a ! శాకుంతలమున నొక్క దుర్వాసశాపకల్పనము తప్ప మిగిలిన కథ యంతయు భారత ప్రోక్తముగనే నడచినదన వలయును. L భారతమున శకుంతలోపాఖ్యానము ప్రాసంగికముగా చెప్పబడినది. 7 యుగ లక్షణములను బట్టి భారత కథ కంటే వర్ణనా వైపులన మీ కథ యంద కాన్పించును. విశ్వామిత్రుని తపోవనవర్ణనము, మేనక పుష్పాపచయ ఘట్టము. మధుమాససౌందర్యవి శేషము వర్ణింపబడిన మేనకా విశ్వామిత్ర శృంగారమున కుద్దీపనములుగా పోషింపబడినవి. అట్లే అంధకార చంద్రోడయాధి వర్ణనము. శకుంతలా సమాగమమునకు ముందొక వైపు రాజును, మఱి యొక వైపు శకుంతలయు విరహపీడితులగుట, శకుంతలా కృత చంద్ర మన్మథా దుపా లంభనము, సఖిజన కృత శిశిరోపచారములు, శకుంతలా దుష్యంతుల నాలంబ నములుగా గలిగిన విప్రయోగ శృంగారమున కుద్దీపనములైనవి. దుష్యంత కృత మృగయా విహారమును, మృగయా సన్నాహమును, మున్యాశ్రమమున తన పరాక్రమ విస్ఫూర్తిచే మించి రాజు దైత్యులను చంపి విడంబించుట, వీరత్వా పాదకములై వీరము నంగముగా పోషించి కావ్యగత శృంగారమునకు మెఱు గులు పెట్టినవి. ఇట్లు వర్ణనలకు ప్రాధాన్య మిచ్చుటయే కాక కథాగమనమున కవనర మనిపించుకొనని. కొన్ని విషయములను విపులముగా చిత్రించుటయు నిందు గాన్పించును. అట్టివి 1. కావ్యాంతమున సాన్పించు నారద కృతోపదేశ ఘట్ట మును, 2. కణ్వుడు శకుంతలకు పతివ్రతా ధర్మముల నుపదేశించు ఘట్టమును. భరతునకు యావ రాజ్య పట్టము గట్టి దుష్యంతుడు నారదుని తనయున కుప దేశ మిమ్మని ప్రార్థించును. అప్పు డా మహర్షి సప్తాంగ పద్ధతిని గూర్చియు, రాజ్య భరణమునందు రాజు లవలంబింపవలసిన ధర్మములను గూర్చియు వీవుల ముగా చెప్పును; శృంగార ప్రబంధముగా చెప్పిన శాకుంతలము . చివఱ నీ యువ న్యాసము చేరికకు గల ప్రయోజన మెట్టిదో యనూహ్యము. అంతియే కాక చిరి కాలానంతరము కలుసుకొన్న నతీసుతుల యెడ ముత్కట ! ప్రేమాదరముల చూపు టతో కావ్యమునకు మంగళము పాడక శకుంతలను తన కగ్రమహిషిగా వెల్ల డించి, తనయుని గ్రుచ్చి కౌగిలించుకొని ప్రకృతి జనులతోడను. మంత్రులతోడను తన యభిప్రాయము నిట్లు వెలిబుచ్చెను. " పెద్దవాఁడనైతి పృథివి భారం బింక॥ బూన వయసు గాదు పుత్తుఁ డెల్ల భరము బూనఁగా | డపస్వినై సుఖలీలు వసమునందు నుండ వయసుగాని.” ఇట్లు ప్రశమిత శృంగారమును, ఆసన్న వైరాగ్యమును శృంగార కావ్యనాయ కుని యందు చూపుటలో కవి వాంఛించిన ప్రయోజన మెట్టిదో తెలియదు. 1. శాకుంతల. 4. 157. 00 లము చివఱ వానిని నారదోపదేశ కీ॥ శే॥ వేటూరి ప్రభాకర 1 పిన వీరన విపుల చాటూ క్తి నిర్నిద్రుడు. శాస్త్రిగారు సంపాదించిన చాటుపద్య మణిమంజరియందు సాళ్వగుండ నరసింహ భూపాలుని పేర జెప్పిన కొన్ని చాటువులు గలవు. "గుండ భూపాలు సరసింహ మండ లేంద్ర" యకు మకుటముతో నున్న వాని నెవరు రచించిరో తెలియదు. రాజు జై మినీ భారత కృతిపతి యగుటచేతను, వీరన చాటూ క్తి నిర్నిద్రుడగుట చేతను విన వీరనయే వీనిని చెప్పి యుండవచ్చునని శ్రీ ప్రభాకర శాస్త్రిగారి యభిప్రాయము. చాటువుల యందును రాజనీతియు, సప్తాంగ పద్ధతియు చెప్పఁబడి నది. ఒక వేళ కా నాకుపుగ చెప్పి భావములను కావ్య బద్ధము చేయగోరి శాకుంత రూపమున చేర్చేనేమో! కానీ జైమినీ భారత రచనా కాలమున పినవీరయ సాళ్వగుండ నరసింహ భూపాలుని ప్రాపు పొందినట్లుకు, శాకుంతల రచనా కాలమున సోమరాజుపల్లె యం దున్నట్లును, గ్రంథస్థాధారములు చెప్పును. అనగా నీ చాటుధార శాకుంతల రచన తరువాతనే వెడి యుండవలయును గదా ? అది శాకుంతలమున నెట్లు చేరియుండునను సందేహము కలు` వచ్చును. శాకుంతల కృతిపతి సోమరాజుపల్లె నివాసి యైనను. శాకుంతల కృతి రచనా కాల మీద మిత్థమని కేల్చుటకు మనకు ప పత్తులు లేవు, జైమినీ భారతము చానీ తరువాతి రచనయే మైనను శాకుంతల రచనా కాలముననే కవి సాళ్వగుండ నరసింహ భూపాలుని యాస్థానమునకు రాకపోకలు చేయుచుండుటలోను, పద్యము తాళువుగా చెప్పుచుండుటలోను ప్రతిబంధ మున్న దని యనుకొనుట కాధారములు లేవు. ఆ పక్షమున శాకుంతలమున కృణోపదేశమునకు స్థానము లభించుటకి యాశుపద్యములే కారణమై యుండ వచ్చును. శాకుంతలమున విపులముగా చిత్రించిన మఱియొక ఘట్టము కణ్వుడు శకుంతల కుపదేశించిన పతివ్రతా ధర్మములతో గూడినది. ఈ ధర్మము లన్నియు శాకుంతలము కాలము నాటికి ప్రచారములో నున్న వని చెప్పుటకు సాక్ష్యములు లేవు. శ్రీనాథుని కాశీ ఖండమున బృహస్పతి లోపాముద్రకు చెప్పిన ధర్మములు I 1. భారతీ తీర్థ యతిసార్వభౌమ గురుకృపాతిశయ ల కవితావిభూతి గలిగి గౌరవము కాంచినాఁడవు కవులచేత విపుల చాటూ క్తి నిర్నిద్ర వీరభద్ర. - 2. చాటుపద్య మణిమంజరి - పీఠిక. 3. శాకుంతల. 4-75 నుండి 82. 4. కాళీ 83. 2-72 నుండి 94 వరకు. శాకుంతల. 1. 22. 9 - పిన వీరన కణ్వమహర్షి చే శకుంతలకు చెప్పించెను. శ్రీనాథ ప్రోక్త ధర్మములు స్కాంద పురాణాంతర్గత కాశీఖండములోని నగుటచే నివియు నెఱవు సొమ్ములే. గానీ యా కాలపు టాచారములు కానేరవు. భారత, కాళిదాసముల కంపె నవ్య రీతిలో పనుసంధానింపబడిన పిన వీరస కావ్యమునందు కవి చేసిన చిన్న చిన్న మార్పు లెన్ని యో కలవు. శకుంతల
- జన్మ వృత్తాంతము భారతమున శకుంతలయు, నాటకమున ననసూయా ప్రియం
వదలును తెలివిడి చేయగా నిచట కణ్వాంతే వాని యొకడు శకుంతలా పరోక్ష .మున రాజునకు చెప్పును. మేనకా విశ్వామిత్ర శృంగారమును పెండ్లి కాని పిల్లలు వసుమతీశునితో చెప్పుట యుచితము కాదని వీరవ యా మార్పు చేసినందుకు. కాని 1 పెండ్లి కాని పిల్లలు 'నీతో భర్తృగృహమునకు వచ్చుట యుచితము కాద'ని కాళిదాసుని కణ్వుడు అసూయా ప్రియంవదలను శకుంతలతో పోనీయక అరి కట్ట గా, వినవీరన వారిని రాజ భవనమునకు గొనిపోవుటయే కాక వారిచే శకుం -తల వేల సున్న ముద్రికను రాజుపై విసరివేయించి శాపావసానమును కలిగిం చెను. ఇచట కవి దృష్టి అనసూయా ప్రియంవదలకు ప్రాధాన్యము నిచ్చు నదిగా కన్పించు చున్నది గాని యౌచిత్య పరిపోషకముగా కన్పించుట లేదు. చివఱకు భారతము నందలి యా క ళ్ల వాళి ప్రబోధము, కాళిదాసము సందలి ముద్రికా సందర్శనమును రెంటిని శకుంతలా వివాహ వృత్తాంతమును, . దుర్వాస శాప వృత్తాంతమును దెలిపెడి సాధనములుగా పిన వీరవ తన కావ్యము నందు గ్రహించియు నంటితో తృప్తినొందక నారదాగమనమును జతపరచెను. నారదుడు వచ్చి దుర్వాస శాపోదంతమును వెలువరించి రాజు చిత్తమున గల -యు తలము ఉంచి యాతనిని సమాక్వసించేను, ఇట్టి వే చిన్న చిన్న మార్పుల నెన్నిటినో వినవీరన కల్పించచు. ఆ . యుగ లక్షణముల ననుసరించి వర్ణ నా ప్రాధాన్యమును, విషయ వై పుల్యమును ప్రదర్శించు నిట్టి మార్పు లన్నియు సముచితములే యని చెప్పుకొన నొప్పును. ణ కథాకథనమునం దిట్టి మార్పులను చేసినను పినవీరక భారత శాకుంత · లము చేత నధికముగా ప్రభావితుడయ్యెనే యని చెప్పవలయును. కాశిదా 1. కాశ్యపః- వళ్సే! ఇమే అప్ ప్రవేయే. సయుక్త మనయో స్తత్ర గంతుమ్- అభిజ్ఞాన శాకుు. 10 సమునుండి యెన్ని యో శ్లోకములను, వాని యందలి రామణీయకముచే నాక ర్షితుడై యనువదించు కొనెను. ఈ క్రింది యను వాద క్రమమును తిలకింపుడు 8 1. గ్రీవాభంగాభిరామం ముహు రమపతతి స్యందనే బద్ద దృష్టి పశ్చాద్ధేన ప్రదిష్ట శ్శరపతసఖియా భూయసా పూర్వకాయమ్ దర్భైరద్ధావలీడై : శ్రమవిషృతముఖభ్రంకిభిః కీర్ణ వర్తా వశ్యోద గ్రపు తత్వా ద్వియతి బహుతర స్త్రోక ముర్వ్యాం ప్రయాతి. అభిజ్ఞాన- 1-7 విలుగొని వెంట వెంట వృథివీపతి రా శరపాతభీతిఁ దా మలఁగి మలంగి కల్గొనుచు మార్గము క్రేవకు నడ్డగించుచున్ L నిలుచుచుఁ గొంత కొంత గమనించుచు సర్ధము మేసి మేసి ద ర్భలు వివృతాస్యపార్శ్వముల రాలగ మింటికి చౌకళించుచున్. శాకుంత. 2- 19 2. అసంశయం ఉత్త పరిగ్రహతమా య దార్య మస్యాభిలాషి మే మనిః సతాం హి సందేహపరేషు వస్తుషు ప్రమాణ మంతఃకరణప్రవృత్తయః అభిజ్ఞాన. 1–20: సందియమేల యీ వికచ సారసలోచన రాజపుత్తి, నా డెందము మౌని కన్యల బడిం జన నేరదు నిక్కునంబ యే చందము నందు సంశయ విచార పదంబగు నట్టి వస్తు సీ ట మందమ చిత్తవృత్తులు ప్రమాణము లు త్తములైన వారికిన్ ॥ 1 8. నీవారాః శుకగర్భ కోటర ముఖ ద్రష్టా స్తరూణా మధు ప్రస్నిగ్ధాః క్వచిదింగుది ఫలభేదః సూచ్యన్త ఏవో పలాః విశ్వాసోపగమాదభిన్న గతయః శబ్దం సహస్తే మృగాః తోయధార పథాశ్చ వల్కలశిఖా నిష్యంద రేఖాంకికా. అభిజ్ఞాన. 1. 11 శుకగర్భ కోటర చ్యుతములై నివ్వరి ప్రాల్కింద జెదరిన పాదపములు దలలకు గారకాయలు నూర నందుల జమురంటి మెఱయు పాషాణ తలము నిబిడ వల్కల శిఖా నిష్యంద రేఖల జాడలు గల జలాశయ పదములు గమ మేను లొరసి కొంచు మనుష్యు అరిగిన భయమున జంచలింపని మృగములు గలిగి యన్మోన్య మైత్రి నక్కడ జరించు పులుల కూనలు జింక పిల్లలు మృగేంద్ర పోతకంబులు నాల! కేపులును కదుపు నట్టి కొని కూడి యాడ నక్కజము చెంది. ఇచట శ్లోక గతార్థము సీసము నాలుగు పాదములలో సరిపోవగా నెత్తు గీతి యందలి భావము పినవీరన సొంతమై వెలసినది. ఇట్టి వెన్నిటినో పద్యము లను శాకుంతలము నుండి యుదాహరణములుగా నీయ వచ్చును. అభిజ్ఞానము నుండియే కాక కాళిదాసుని కుమార సంభవము నుండి కూడ కొన్ని భోశముల ననువదించుకొని నినిన తీరన తనకు కాశీదాసుపై గల గ్రత యముకు వెల్ల ఉంచు కొనెను, కకుంతలా జన్మవృత్తాంతమును చెప్పబోవుచు దంతేవాసి విశ్వా మిశ్రుని తపోవనస్థాన మైన హిమవన్నగ వర్ణనము చేసెను. ఆ వర్ణనము నందు కుమార సంభవ మందలి హిమశైల వర్ణనము యొక్క పోలికలు గోచరించును. గమనింపుడు : 1. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధి రాజ్య పూర్వాపరౌ తోయ నిధీ విగాహ్య స్థితః సృథివ్యా ఇవ మానదండ కుమార. 1, 1, పినవీరన హిమనగ వర్ణనము నొక సీసమున పెంచి పెంచి యెత్తు గీతిలో పై శ్లోకము ననువదించెను. నలరి పెంపొందు। బూర్వాపరాంబునిధుల నడుమ ధరణికి మానదండంబు వోరె దేవతాత్మ ధరాధీశ దిగ్విష పుణు నిలయంబు నీహార భూధరంబు. శాకుంత. 2–101 12 2. పదం తుషార సృతి గౌతరక్తం యస్మి న్న దృష్ట్వాపి హత ద్వీపానామ్ విదంతి మార్గం నఖరంధ్ర ముక్తేః ముక్తా ఫలై : కేసరీణాం కిరాతా L కుమార. 1-6 వారని మంచుపై ఁ బొరివి వచ్చిన పోయిన చొప్పు మాసిన నూరి నఖాగ్ర ము క్తమయి పొల్పగు ముత్తెపు జాలు పెట్ట గా, దారటు లేగి కాంతురు హత ద్విప కేసరివాస సీమలన్ వీర కిరాతులద్రి వన వీథుల సింగపు వేటలాడుచున్. శాకుంత. 2–104 చెంచు కొనెను. 3 భాష వేరు కావున పినవీరన కాళిదాసము నుండి శోకముల ననువ తెలుగు భారతము నుండి పద్యములకు పద్యములే తన శాకుంత లమున పెట్టుకొనుటకు వీలు లేదు కదా! అయినను, అందలి సమాస రచన చేత, అర్థ స్ఫూర్తి చేత నాకర్షితుడై వానినే విపులీకరించి తన కావ్యమున చిత్రింప గలిగెను. ఈ క్రింది యుదాహరణములను పరికింపుడు. L 1. కాఱడవి బeఱచు మృగముల నూఱడకం దిగిచి డస్సీయున్న తనిశ్రమం బాఱ నెడ పరితాపము డిఱగ బై వీచె నన్నదీపనసంబుల్, అన్న పద్యములోని నది పవనములను వివిధ సుగంధ వాసనా భుత ములుగా చేసి మరియింరెను. చూడుడు :- కడగి సంక్రీడించు నడవి యేనుంగుల గండిస్ధలుల దాన గంధములను చెంచుల రాచ కెంజిగురాకు బోడుల శిరసుల జవ్వాది పరిమళముల విచ్చిన నెత్తమ్మి విరులు దుమ్మెదలాడు జారిన పూదేనె సౌరభముల గూల ద్రుమంబుల గాలి తాకున రాలి వచ్చిన యలరు క్రొవ్వాసనలను శబలితంబగు నయ్యేటి సలిలకణము లల్లి నల్ల న గోనుచు మందానిలుండు చల్లగా వీచి వన పథ శ్రాంతి దీర్ప నది కనుంగొను వేడుకం గదలి కదలి. 05050. 2. 24. 13 2. అ ధారుణి తల విభుఁ డొక్కరుండ చని తన్వి వయోజదళాయతాక్షి సంకుల మిళితాళినీలపరికుంచితకో మలకుంతలన్ శకుంతల యను కన్యకం గనియె సనఁగ అన్న భారతమునందలి శకుంతలాకోమలకుంతల సౌందర్యమును వెల్ల డిచేయు పద్యమును చూచి పినవీరన చంచత్పల్ల వకోమలాఁగుళకర స్సంపూర్ణ చందానన న్యంచచ్చందనగంధి గంధగజయానం జక్రవాక స్త నిం గించిన్మధ్య తటిల్ల శావిలసితాంగి అని వర్ణనను పెంచి, యామీదట నన్నయభట్టారకుడు చేసిన వర్ణనకు సరిపోవు. నట్లుగా ....పద్మపత్రాణి వీక్షించిన్ రాజు శకుంతలన్ మధుకర శ్రేణిలసత్కుంతల . అని చెప్పెను. 8. అట్లే శ్రవణసుఖంబుగా సామగానంబులు చదివెను శుకముల చదువును నన్నపార్యుడు చెప్పగా దానిచే ప్రభావితుడై న పినవీరన- "వేదాధ్యాపకులైన రాచిలుకల వేదాంతమీమాంసలక వాదు బిమ్ములఁ జేయు శారికల తత్త్వం బిందుజూటుంచుగా నాదేశించు పురాణముల్ చదువు చక్రాంగంబుల౯ సామముల్' నాదంబొంద పినాకి పాడు సళులక్షా వందారుఁడై చూచుచు" అని యితోధిక కల్పనము చేయుటయే గాక, నందు తన శివభక్తి పారమ్యమును. గూడ ప్రకటించుకొనెను. 4. శకుంతల రాజభవనమున ప్రవేశించి తన్ను గుర్తింపు నిరాకరించిన పతిని జూచి, ఎఱుఁగఁడొకొ నన్ను నెఱిఁగియు నెఱుఁగనియ ట్లుండునొక్కొ యెడ చ వ్వగుటన్ మఱచెనో ముగ్ధు అధిపులు మఱువ రె బహు కార్య భారమగ్నులు గారే 14 యని యనుకొనగా, శాకుంతలమున మయమి శిష్యులు ఏ మెఱుంగని పనియని హృదయవీధి వెఱచెనో కాక మలఱచెనో వెనుక చింత మఱపులే దైన బహుకార్యమగ్న మతులు ధారుణీ నాయకులు గదా దాని కేమి, యనుకొందురు. 1"ప్రతియు, గుణవతియు, ప్రజావతీయు సమవ్రతయు నైన వనితను, అవన్విత కృష్టి జూచు నతిదుర్మతి కిహమును, పరమును గలవా యని భారతమున శకుంతల రాజునకు ధర్మబోధ చేయగా, శాకుంతలమున కణ్వ శిష్యుల 2. గుణవతియుఁ జుత్రవతియును గులవతియును వైన భామను విడుచు సన్యాయకారు కిహపరంబులు లే వని యెడు సమిద్ద ధర్మశాస్త్రంబు లెఱుఁగవా ధరణినాథ లు యని యుద్భోదింతురు. "అట్లే తాను తన నీడను నీళ్ళలో జూచునట్లుగా జనకుడు తనసూకుని చూచి, మహానందము బొఁదునన్న శకుంతల వాక్యమునే ముని. శిష్యులు, అర్ధములోని నీడవలె నాకృతియందొక లేశమాత్రముం బిద్ధము గాక నీకుఁ బ్రతిబింబము వోలె వెలుంగుచున్న నీ పెద్దకుమాకు భూవర యభిన్నమతి న్మొగమెత్తి చూడుమా యని చెప్పునుడు. సభారతమున నాకాశ వాణి, శకుంతల సత్యము పలికెను. వీడు నీకును, శకుంతలకును ప్రియనందనుడు. శకుంతల సాధ్వీ, సద్వినుత, సుహాపతివ్రత, యని సభాకరులు విస్మయముకు పొందుచుండగా రాజును హెచ్చరించెను. దాని నే శాకుంతలమున, అనువాలొన` తత్సభాజనము అత్యాశ్చర్యముం బొంప నో జన నాధ్ త్తమ యీశకుంతల మహాసత్య! వతాన్వీత త త్త యుండు నృవదీయవీర్యజుఁడు సత్యంబే మరి నృత్య మౌ ననుమానింపకు మంచు : మోసె వడి నయ్యా కాళ వాణీధ్వనుల్. 1. ఆంధ్ర మహాభారతము. e8. 4. 82 2. ఆంధ్ర మహాభారతము. 8. ఆంధ్ర మహాభారతము . ఆది. 4. 89 ఆది. 4. 105. 15 ఇట్లు క థాంశము లేక మైన చోట భారతరచనతో, పదవిన్యాసములో, నర్థస్ఫూర్తిలో, శైలియందు నెన్ని యో పోలికలను శాకుంతలమునందు జూపింప వచ్చును. భారత శైలి ననుకరించుట యన్నది పినవీరన తన కావ్యమున నచ్చ టచట చేసెనుగాని, స్వతస్సిద్ధముగా నతనిరి భారతభిన్న శైలి. ఈయన పద్య .ములపోకడ, సమాసరచన, పదముల పొందిక అన్నియు శ్రీనాథుని రచనా పద్ధతిలో నెక్కువ సామ్యమును సంపాదించు కొనుచున్నవి గాని, నన్నపార్యుని -రచనతో కాదు. ఈవిషయమును స్పష్టము చేయగల యీ క్రింది యుదాహరణ ముల పరికింపుడు. కణ్వాశ్రమవర్ణనము చేయుచు నన్నయ చెప్పిన సీస మి ట్లున్నది. శ్రవణసుఖంబుగా సామగానంబులు చదివేడి శుకముల, చదువు దగిలి కదలక వినుచుండు కరులుగు, కరికర శీతలచ్ఛాయఁ దన్ఛీక రాంబు కణముల చల్లని గా డ్పానపడి వాని జెంది సుఖంబున్న సింహములును భూసుర ప్రవరులు భూతబలుల్ దెచ్చి పెట్టు నీవారాన్న పిండతతులు కడఁగి భమింప నొక్కటఁ గలసియాడు చున్న యెలుకలు, బిల్లులు కొండుసహజ వై రివర్గంబులయు సహవాస మపుడు చూచి మునిక శక్తి కెంతయుఁ జోద్య మంది. ఇంచుమించు భావ మిట్టి దే యయ్యు, నీసందర్భమున పినవీరన రచించిన నీనిమూ యొక్క నడక పై దానికి భిన్నముగా నున్న చనకతప్పదు. -చూడుడు : వృద్ధసింహమునకు విహరింప దొండంబు కైదండగా నిన్చు గంధగజము పులి క్రొత్త యీనిన పొదరింటిలోనికి పరిటాలి తగవు గొంపోవు హరిణి శరథంబు కొనగోళ్ల శిరము దువ్వగఁ తొక్కి కనుమోచ్చు సుఖనిద్ర గండకంబు సింహకిశోరంబు చేర వచ్చిన వింత లేక చన్నిచ్చు బాలెంత కరిణి 16 ఎలుకతోడుత చెఱలాడు నెనసి పిల్లి నెమ్మి పురి విచ్చి నిలచి పింఛము నీడ భుజగకన్యక నాడించు పూరినమలి యఃఘ కణ్వమునీంద్రుపుణ్యాశ్రమమున. ఈసీసపునడక శ్రీనాథుని సీసపు నడకతో పోలియున్నది. ఇంచుమిం చిడే భావముతో విరాజిల్లు నొక సీసము కాశీఖండమున గలదు. చూడుడు : కండూయనము సేయు కరటి కుఆ దండ పుష్కరమ్మున సింహపోతకంబు వాలారు నఖముల వదనమించుక యెత్తి ముద్దాడు పులి లేటిముద్ద రాలి నిండు కౌంటఁ జేచ్చ నెమ్సిమై వోవేలు కొడమచింబోతును గుస్తరించుఁ గుంజమంటవకు కోడమధ్యంబున = నాఖుతో చెఱలారు నడవిపిల్లి యెంక దాశక యుంచుని నెత్తిపట్టు పనులు ముందికి భుజగం పడగగొడుగు కోతితో మైత్రి వాటించు కొండగొరియ యార్వశ్రేయుని పుణ్యాశ్రమాంతరమున శైలీవిన్యాసము యొక్క కాశీ ఖం. 2. 48. చక్కగా పరిశీలించినచో శాకుంతలమున ప్రతిపదమునను శ్రీనాథుని ఛాయలు గోచరించుచునే యుండును. శ్రీనాథుని ప్రౌఢసమానరచనయు, వర్ణ నాజేందర్యమును పిన వీరనను మిక్కిలి యా ర్పించినవి. దీనిని నిలువ బెట్టుటకు రాకుంతలమునుండి కోకొల్ల లుగ నుదాహరణ' ములను జూపింపవచ్చును. 1. మదనా రాతిసమాను గాళ్యపమహామౌనీంద్రు సేవింప స మృదమారం జని యాశ్రమంబువనసీమం వంటి వాల్గంటిఁ దో యదనీలాలకఁ గంబుకంఠేఁ గరిణీయానం బయోజననం సరసత్సంకయగోచరోడరి సుధాసంబాధిబింబాధరిన్. 2. మృదురీతిం బ్రతివాసరంబు గమీ కర్మిభూత నానానదీ నదశాంతారవురీశీలోఛ్చయుఁడనై నై కార్భుత శ్రీ జిత 2. 178. 17 త్రిదివంబైన విదర్భదేశమున నారీరత్నముఁ గాంచితి సదసత్సంశయగోచరోదరి శరత్సంపూర్ణ చంద్రానన. శృంగార నైషధ. 2. 20 గల సామ్యము చివటిపాదములో పై రెండు పద్యముల యందును స్పష్టముగా కన్పించు చున్నది. నైషధమున శ్రీనాథుడు షమి కర్మీకృత యను ప్రయోగమును తెలుగుతో నమర్చుటలో పై పద్యమువలన తృప్తుడు కాక మరియొక పద్యమునుగూడ వెంటనే చెప్పెను. ఆపద్యముతో పై పిన వీరనపద్యము మఱియు చక్కగా పోలుచు, నీకవిపై శ్రీనాథుని ప్రభావ మును స్పష్టము చేయుచున్నది. అపద్య మిది : కమలేందీ వరషండమండితల సత్కాసార సేవారతికా గిమికర్మీకృత సై కనీవృతుఁడనై కంటికీ విదర్భంబునకా రమణిం బల్ల వపాణి: బద్మనయనగా రాకేందుబింబాననగా సమపీసస్తని వస్తి నాస్తి నిచికిత్సా హేతుశాతోదరిణ. ళ్ళం. . 2. 21. 7. పినవీరన యిట్లి మహాకవి గద్యముల పోకడచే నాకర్షితు డగుటయే కాక నాయన చిత్రించిన కొన్ని ఘట్ట ములపై గూడ మనసు పడినట్లు కాన్పించును. శ్రీనాథుడు కాశీ ఖండమున కులస్త్రీధర్మములను బృహస్పతిచే లోపా ముద్రకు చెప్పిందగా, వానినే పినవీరన కాణ్వునిచే శకుంతలకు చెప్పించెను. ఈ రెండుఘట్టముల పలుకుబడులయందును, చిక్కని సామ్యము కాన్పించున... పరికింపుడు. 1. జలమాడి మడుగు వస్త్రముఁ గట్టి కైనేసి కొనిగాని కవయఁబోఁ జసదు ప్రియుని కై సేయ కెన్నడు కదియ వధిపు- కాకుంటే, 4, 79. కాళీ బం. 2. 72.. రోలుమీఁద నునికి విభునికిఁ దఱుగు యళము 2. గడపమీఁదను సన్నెకల్లుమీఁద కడపమీదఁను మఱి సన్నెకంటిమీఁద, జక్కిమీదఁను గూర్చుండ జాడ గారు కుంత 4. 79.. కాళీ ఖం. 2. 7518 8. కంచలయం బటీరతిలకంబును బాపట చందిరంలు ఫా లాంచలసీమ లేఁబసువు టచ్చత బొట్టు చెనాకు గాజులుం గొంచెపు వీడ్యము న్విరులు కొప్పున నొప్పు నొనర్ప నెప్పుడుం జంచల నేత్ర యుండదగు సంతతభర్తృఫలాభివృద్ధి కి... కుత 4. 78. పసుపుం గుంకుమ కజ్జలంబు మునుగూర్పాసంబు తాంబూలముం గుసుమంబుల్ కబగీధరంబు చెవి యాకుల్ మంగళాలంకృతుల్ విసు వొక్కింతయు లేక తాల్పవలయున్ వీనిన్ సదాకాలమున్ ససి చక్కంగ ప్రియుండు వర్ధిలుటకై నా లేక పత్తా ఒకిన్. కానీ ఖం. 2. 78. ఇట్లు శ్రీనాథునిక విశ్వము ననుకరించుటచే నాయన రచనా పద్ధతిపై తనకు గల ప్రత్యయమును చాటుకొన్నను పిన వీరస శ్రీనాథుని పూర్వ కవి స్తుతియందు చేర్చి స్తుతింపలేదు. 'సంస్కృత కవుల నుగ్గడించిన వెనుక నన్నయ భట్టోపాధ్యాయుని, తిక్కన సోమయాజిని మాత్రము స్తుతించెను. ఎ అన ప్రసక్తి లేదు, కాని జై మినీ భారతమందు, నన్నయ తిక్కనలతో పాటు ఎఱ్ఱ అ అ 1. ఈ పద్యము నుదహరించుచు నారుద్రగారు తమ సమగాంధసాహిత్యమున "పాపట సిందూరం ఒకనాడు తెలుగువాళ్లు కూడా పెట్టుకునేవా రన్న మాట" అని నిర్ణ యించిరి - తెలుగువారు పెట్టుకొనుట లేదనే, శ్రీనాథుడు తన పద్యమున 'సిందూర' పదము తీసివేయగా, నది గమనించని పినవీరన సంస్కృతానుసారిగా దాని నట్లే యుంచెను. ఇవి స్కాందాంతర్గత ధర్మ ముల కనువాదములుగాని, యాకాలమున వాడుకలో నున్న ధర్మములని చెప్పుటకు నితరములైన యాధారములు లేవుకదా! 2. శాకుంత, 1 - 1, 12. 3. కవులన్ బంకజ గర్భసన్నిభులు వక్కాణింతు వల్మీక సం థవునిని వ్యాసుని కాళిదాసు బిలహున్ బాణున్ మయూరున్ కుకున్ భవభూతిన్ శివభద్రు మల్హణుని ఘంటామాఘునిన్ జోరు భా రవి మా నన్నయభట్టు తిక్కకవి నెఱ్ఱా ప్రగ్గడన్ సోమునిన్. జైమినీ భారతము-పీఠిక -8. "ఈ పద్యములోని 'మా' అను విశేషణమును బట్టి చూడ నన్నయ భట్టును పినవీరనయు నొక్క వంశమువారును, ఒక్కగోత్రము వారునై యుందు దని చెప్ప నొప్పియున్నది” అని గురజాడ రామమూర్తి పంతులుగారు 19 నను, నాచన సోముని తలంచెను. అచట శ్రీనాథ ప్రసక్తి లేదు. పినవీరన పూర్వకవులను తలచుటయందును నొక విశిష్టతను చూపెను. తాను పేర్కొన్న యేకవి యొక్క కవిత్వ సమీళయు నియన చేయలేదు. నన్నయను నన్నయభట్టోపాధ్యాయు డని గౌరవించి, కవితాపట్టాభిషిక్తు డని యెంచి యుగ్గడించెను. తిక్కన నుభయ కవి మిత్రునిగా, ప్రణుతబహుదేశ కవిరాజుగా చెప్పెను గాని యాయన కవిత్వమును గూర్చి చెప్పలేదు. అట్లే జై మినియందు కేవలము నన్నయను, తిక్కనను, ఎఱ్ఱాప్రగడను, సోముని పేరు పేరున స్మరించెను. కాని వారిక విశ్వవి శేషములనుగూర్చి ముచ్చటించుట గాని, యాక విత్వలక్షణములు తనకవిత్వమునందును కలవని, శ్రీశ్రీశ్రీ నాథునివలె. యుగ్గడించుటకాని చేయలేదు. జైమినీభారతశాకుంతలముల కృత్యవతారిక లను చక్కగా పరిశీలింపగా పినవీరన యితరకవుల ఛాయలు తనకవిత్వము నందున్నవని యంగీకరించుటకు సమకట్టని యహంకారి యనియే తోచును. 'లోక మున నీకవిని గూర్చి వాడుకల సున్న కథలన్నియు నీయనకు గల యహం కారగుణమునే చెప్పును. కాలమునుబట్టి చూచినచో, నీయన శ్రీనాథుని వార్ధక్య దశలో పిన్నవాడుగా నుండి తదనంతరము రాజాస్థానములు బ్రవేశించి యుచ్ఛస్థితికి వచ్చినవాడు. ) ఇట్టి పరిస్థితులవలన, శ్రీనాథుడు కవిసార్వభౌముడైనను, ఉద్దండ పండితు డైనను, ఆయనకవితారామణీయక మును మనసార తాను మెచ్చినను. కవిస్తుతిలో నాయన పేరు చేర్చుటకు పినవీరన యిచ్చగించి యుండదు. ఎట్లు వ్రాసినసు సమకాలమువారు మెచ్చరను విషయమును పినవీరన శ్రీశ్రీ నాథుని వివరించిరి. "అంతమాత్రమున శాభైక్యము నది సూచింపదు" అని చాగంటి శేషయ్యగారు తమ ఆంధ్రక వితరంగిణీయందు పై యభిప్రాయమును ఖండించుచు హరవిలాసమున శ్రీనాథుడు తిప్పయపెట్టిని మా తిప్పయ. సెట్టి యని వ్రా సెననియు వారిరువురు నొకకులమువా రందుమా యనియు వాదించిరి. నాఅభిప్రాయమున నిచట 'మా' యను విశేషణము సంస్కృత కవులకంటె వేరుగా, వరుసగా చెప్పబడిన తెలుగుకవులకొఱకు వాడబడినది.. “మానన్నయభట్టుమాత్ర మే మాతిక్కన, మాయెఱ్ఱన, మా సోముడు" నని యస్వయము. 1. రాజాస్థానమునందు వాణి నారాణి యని యెలుగెత్తి చాటెనను కధః. శ్రీనాథుడు నైషథము నభిప్రాయార్ధము. పినవీరనకడకు కొనిపోగా, దాని నాతడు పరిశీలింపకయే మాబోంట్లకు రుచింపకపోయినను సామాన్యులు మెచ్చుకొందురు తెమ్మని యథయ మిచ్చెనని చెప్పుకొను కథ. పట్ల సత్యము చేసె ననవచ్చును. కాని శాకుంతలమునందు 20 1 చిల్లర వెన్నయామాత్యుడు కవియొక్క కవితాప్రాశస్త్యము నుగ్గడించుచు చెప్పిన యొక పద్యము కానవచ్చుచున్నది. 'తగమనంబున నొక్కనా ఓట్లు వితర్కించే యను పచనమునుండి చిల్లి : వెన్న యామాత్యుడు చెప్పినట్లుగా నున్న పద్యములు వరుసగా కొన్ని కలవు. ఆక్రమమును కాగుగా పరికించినచో, నందు వివిధకవిత్వరితులు నాపా రించి పినవీరనను ప్రశంసించిన యీ పద్యము ప్రక్షిప్తమేమో యని యనుమా నము కలుగుచున్నది. అట్లు కలుగుటకు గల కారణము లివి : 1. ఆపద్యము తీసివేసి, కృతిభర్త పినవీరనను కావ్యము చెప్పు మని యాచించిన ఘట్టముకు చదివినచో, నన్వయము చెడకుండుటయే కాక నతికినట్లు సరిపోవుట. 2. ఈపద్యమునడకలో 'సమత' గోచరించక పోగా, నెగుడు దిగుడు . తనము కాన్పించుట. 1. నన్న పార్యుఁడు ప్రబంధ ప్రౌఢవాసనా సంపత్తి, సొలపు పుట్టించి నేర్చు రిక_కయజ్వవాళ్ళక్కి కామోదంబు చెలువు, కర్ణముల వాసింపనేర్చు నాటి రాజుని సోము వాచామహ త్త్వంబు, సౌరభుబుల వెదజల్ల నేర్చు శ్రీనాథభట్టు భాషాని గుఁభంబుల పరిమళంబులు. కూడబఱచ నేర్చు మహితగుణశాలి పిల్ల ల మట్టి వీర నార్యుడాయింట పై తామహంబగుచును వెలయుచున్నది నేడు కవిత్వలక్ష్మి యఖల సత్కవినికరంబు నాదరిం జకుంత. 1-19. "నన్న పార్యుఁడు" కాక "నన్నపార్యుని" యను పాఠము సమంజనమేమో ! అట్లు చేసిననే అపాదమందలి యన్వయము, మిగిలిన పాదము లన్వయించు పద్ధతితో సరిపోవును. కాని యీ పద్యము నుదహరించిన సాహిత్యచరిత్ర కారు లెవ్వరును "నన్న పార్యుని" అని గ్రహింపలేదు. 2. శాకుంత. 1-15 నుండి 27. 21 8. పద్యములోని అర్థ స్ఫూర్తియు నిర్దుష్ట ముగా లేదు. 1. సన్నపా ర్యుని కవిత్వగుణముగా ప్రబంధ ప్రౌఢవారనాసంపత్తిని చెప్పెను. ii. తిక్క నకును నాచన సోమునకును, వాగ్భక్కికామోదము, వాచామహత్త్వమువంటి సరిపడనీ వి శేషణములను వాడెను. iii. శ్రీ నాథవరముగా వాడిన "భాషా నిగుంభంబు" అన్న పదబంధము యొక్క స్పష్టార్థము నిర్ణయించుటకు వీలు లేని దిగా నుండుట. iv. ఇందలి కవితాగుణములు కలిగిన పిన వీరన యొక్క కవిత్య వై భవమును తెలియజేయు విశేషమేదేవి వాడక "మహితగుణశాలి" యని సామాన్యముగా వీరనను చెప్పుట. V. "తిక్కన యజ్వవాగ్భక్కి కామోదము చెలువు కర్ణముల వాసింపనేర్చు" ననుచోట ఆమోదము, వాసించుట యను వద ములు వాడినంతనే స్ఫురించ వలసినది 'నాని' కాని కర్ణములు కావు, ఇ ట్లవక తవకలతో నున్న పద్యమొక్కటైనను వీరనరచన యుదితరత్ర కాన్పిఁపదు. vi. జై మినీ భారతావతారిక పరిశీలించినను, అచట కృతిపతియైన సాళ్వగుండ నరసింహ భూపాలుడు, చిల్లర వెన్న యామాత్యునివలెనే, సప్తసంతానము అలో కృతి యొక్క శాశ్వతత్వము నగ్గడించి, తనకు జైమినీభారతమును విన వలయునని యున్నదని. ఆపురాణంబుఁ గనఁ దెనుఁగ య్యె నేని జెప్ప నేర్చిన కవియుఁ బ్రసిద్ధుఁడేని దెనుఁగు నుడికారమున మెచ్చు గని యెనేని గుందనము కమ్మవలచిన చంద మగును. అని సభాసదుల మొగము జూచెను. వారు వీరన వంశ ప్రతిష్ఠను జెప్పి యాయన తై మినిని తెలుగు చేయుచుండుట చెప్పిరి. అల్ల నవిచ్చు చెంగలువలు వెదచల్లు సౌరభములవంటి భావములు నాతిగూఢముగా పయ్యెదమాటున నున్న యువతీవడ సౌందర్యమువలె తోచునట్లుగా నియన కవిత్వము చెప్పగల డనిరి. కాని యీయనకవితలో ! ప్రాచీనకవుల కవితామార్గము లున్నవని చెప్పలేదు. అందువలన శాకుంతలమునందలి పైకద్యము ప్రక్షిప్త మనుకొన్నచో జై మిని యవతారికతో శాకుంతలావతారిక సరిపోలును. 2 పిల్లలమట్టి వంశము శారదా పీఠకము. *శారదాదేవి విభ్రమ | శ్రవణ కల్లారోదయామోదములు ఈ కవికృతియందెక్కడై నను పరిమళ లోపము కలిగెనేని, పూరించుచుండును. 1. జైమినీ భారతము - పీఠిక - 25. 2. " 3. శాకుంతలము - 22. 1 P 17. 22 1 ఈయనవంళమునందు తాతయు, తండ్రియు, నగ్రభాతయు భువన నాథుడు 'తన హరవిలాసము నందొక భాసురకృతి నిర్మాతలుగా చెప్పబడిరి. పిల్లలమఱి మహాప్రధాని పెద్దనను, కృతిభర్తయైన యవచి తిప్పయకు విద్య అ చెప్పిన గురువుగా జెప్పెను. ఈయన పిన వీరనసోదరు డగుటకు కాల మనుకూలిం చునో ?———తేదేని యాయనవంశమువాడై యుండవలయును. పినవీరన జన్మ స్థల మేడియో తెలియదు. ఇంటి పేరునుబట్టి "పిల్లలమఱి " గ్రామము తెలంగా ణమునం దుండుటచే వీరి పూర్వీకు లచ్చటివా రనవచ్చును. కాని యీ యూహను బలవత్తరముగా నిలువబెట్టుట కాధారములు లేవు. పల్లె యందు శృంగార శాకుంతలమును నెల్లూరు మండలస్థ గ్రామమైన సోమరాజు నివసించు చిల్లరవెన్నయామాత్యున కంకిత మిచ్చుటచే పినవీరన యాకృతిరచ నా కాలము నాటి కాగ్రామవాసియై యుండియుండవచ్చును. కాకుంతలము పీఠికనుండి పినవీరనకుటుంబ విషయము లేవియును విపులముగా తెలియుటలేదు. తల్లి నాగమాంబ యనియు, తండ్రి గాదన యనియు చెప్పు కొనెను. తాను భారతీతీర్ధయతిసార్వభౌమకృపాతిశయలబ్ధకవితావిభూతి కలిగిన వాడ నని చెప్పుకొనెను. కాని కృతిభ ర్తయగు చిల్లర వెన్నయామాత్యుని వంశవృకు మీ ట్లున్నది. 1. తాతయుఁ దండ్రియు నగ తాతయుము దాను భువన థాసురక ర్మాతలు; పిల్లలమఱి వి కృతిని ఖ్యాతునిఁ బినవీరుఁ బోలఁగలరే సుకవుల్. జైమినీ భారతము - పీఠిక - 21. - 2. పిన్నటనాఁడు సత్కరుణఁ బిల్లలమఱి మహాప్రధాని పె ద్దన్న గురూత్తముండు తగ నక్షరశిక్షయు దైవమార్గనం పన్నతయు వి వేక పరిపాటియునుం గృపఁ జేసె యే యన్నకు నట్టి నెట్టి త్రిపురాంతకునిం దగు ప్రస్తుతింపగళా. - హరవిలాసము - పీఠిక - 29. 23 కౌండిన్య మహర్షి మే వెన్నయ (కృతిభర్త మనకు ఎఱ య వెన్నయ నాగయ + పోతమాంబ Į మేడ ఆదెన వీరభద్రుఁడు ఈ వెన్నయామాత్యుని కాలము తెలియుటకు తగినయంశము నీ గ్రంథము నఁడు కానరావు. ఈయన యాఱు వేలని యోగి. ఈయనగాని, యీయన వంశస్థులుగాని యాశ్రయించిన రాజవంశములనుగూర్చిన సమాచారము తెలియదు. -వంశపురుషుడైన మేడనను కవి జంబుద్వీపాననిపాల మంత్రిగా జెప్పెను. వెన్నయామాత్యుని కవి, "శీత శై లాబ్ధి వేలా మధ్య & తి క్షితి పాలమంత్రిమకుటాలంకార హీరాంకురా!" యనియు, హీరాంకురా!" యనియు, "సదా స్వామి కార్య క్రియా చారునీతిక్రియా !" యనియు, "పతిహితకార్యా!" యనియు సంబో ఆపతి యెవ్వరో చెప్పలేదు. రాజు ప్రసిద్ధుడు కాకపోయిన నట్లు జరుగవచ్చును. 'లేదా రాజును రాజ్యమును లేకయే గ్రామ వ్యవహారములను చూచుచు, ప్రభుత నెరపు కారణమున నీవంశస్థు లమాత్య బిరుదాంచితులై యుండ వచ్చును. ఇందు రెండవయూహయే సమంజస మనుకొందును. ధ్వీ చెనేగాని, పినవీరస శాకుంతలరచనమునకు ముందే మఱినాలుగు గ్రంథములను రచించెనని నిశాకుంతలమువలన తెలియవచ్చుచున్నది. అవి (1) అవతార దర్ప ణము, (2) నారదీయము, (8) మాఘమాహాత్మ్యము, (4) మానసోల్లాస సారము. ఇందొక్కటియు నీనాటివఱకు మనకు లభ్యములు కాలేదు. పేర్లను బట్టి యందలి యితివృత్తముల సూహించుటలో నిం దేయొక్కటియు శృంగార రసప్రధానకావ్యముగా పేర్కొనుటకు వీలు లేదు. అవతారదర్పణము గూర్చి చర్చించుచు 'చాగంటి శేషయ్యగారు, కవి దీనియందు విష్ణుదేవుని పది యవతా రములను వర్ణించి యుండునేమో యనిరి - యుండునేమో యనిరి - దానినే ఆరుద్రగారు తమ సమ గ్రాంధ్రసాహిత్యమున బలపఱచిరి. 1. షట్సహస్ర కులోద్భవ సచివులందు నా సుకృతిగాఁ జేయు నా కొక సుకృతిఁ జేసి. 2. శాకుంత - 1 - 90. 3. శాకుంత, 1-22. 4. ఆంధ్రకవి తరంగిణి - 6 వ సంపుటము. శాకుంత. – 1-28. .24 కాని పినవీరభద్రుడు తన కావ్యములలో తానే చెప్పుకొనినట్లు శివభజనాసక్తుడు; "ఆరాధి తామర వీరభద్రుడు; 3వీరభద్ర; పద పద్మ ధ్యాన శుద్ధాంతరంగుడు; 'పరమేశ్వరుని యవతారమే యత ఉంచు జను లెన్న దగిన సౌజన్యశాలి. అట్లే శాకుంతల కృతిపతియగు వెన్నయామాత్యుడును ప్రాసా దపు పంచవర్ణ మున వేదోక్త సంసిద్ధి కాలగ్రీవుం బూజించువాడు. ఆయన సోమ కారవ్రతము చేయగా, అర్ధశశాంకమౌళి, భక్త ముఖంబుల విందారగించి, షడ్రసములచే గళస్థ విషకల్మషమును కడుగుకొనును. ఇట్టి శైవము మధ్య వెలసిన యవతార దర్పణము విష్ణుదేవుని దశావ కారములను వర్ణించియుండదు. శాకుంతలమున కవి చేసిన యిష్ట దేవతాస్తుతి యందు భై రవస్వామిస్తుతి గలదు. అచట "వృథిని కవతంసమణియైన బిట్ర గుంట దానకంబుగ నవతార మైనవాడు" అన్న కవినుడుగు ననుసరించి బిట్ర గుంటయందు వెలసిన యాభై రవమూర్తి యవతార కథనమునే యవతార దర్పణముగా దీర్చెనేమో! అనుశ్రుతముగ నేదేని భైరవావతార గాథ బిట్ర చెప్పుకొనబడుచున్నచో నియూహకు కొంత బలము గుంట పరిసరముల కలుగును. వినవీరన కాలమునుగూర్చి శాకుంతలము నుండి మన కేమియు తెలియ దనీ చెప్పుకొంటిమి. కాని యీయనకాలమును నిర్ణయించుటకు జైమినీభార శమున చారిత్రకాధారములు గలవు. కైమినీభారతము సాళ్వగుండ నరసింహ భూపాలున కంకిత మీయబడెను. సాళ్వ నరసింహుని వంశమువారిలో "సార్వ మంగు" అను నాతడు సంగమరాజును, విజయనగరాధీశుడు నగు మొదటి బుక్క రాయలకడ నై న్యాధిపతిగా నుండెను. ఆయన మధుర నేలు సుల్తాను నజీరుద్దీను నోడించి, తొండై మండలమున సాంబువరాయని ప్రతిష్ఠించి, సాంప రాయస్థాపనాచార్య బిరుదమును వహించెను. ఇది క్రీ॥శ॥ 1845 లో జరిగెనని శాసనాధారము లగ్గడించుచున్నవి. అట్లే యీయన శ్రీ రంగమున విగ్రహ ప్రతిష్ఠ చేసెనన్న వార్తయు కై మినీ భారతమున చెప్పబడెను. "అది క్రీ॥ శ 1871లో జరిగిన దాని శాసనములు చెప్పుచున్నవి. జై మినీభారతము సాథ్వ నృసింహుని తండ్రియగు గుండని విజయములను, వినతండ్రియగు సాళువ తిప్పని విజయములను వర్ణించెను. సాళువాభ్యుదయమువలన గుండడు చంద్రగిరికి చేరువనున్న కళ్యాణ 1. శాకుంతలము 14 1-20; 2. శాకుంత – ఆశ్వాసాంత గద్య: 8. జై మినీ భార-పీఠిక; 4. జై మినీ భార - పీఠిక ; 5. శాకుంత-1-60; 6. శాకుంత- 1-81; 7. శాకుంతల - 1-5; 8. Madras Epigraphical Report- i . (M.E.R.) 250/901 Epi. Ind. Vol. vi. No. 33. పురమునకు పాలకుడని 25 తెలియుచున్నది. సంగమ వంశస్థులను సేవించి, యనేక విజయములకు కారణభూతుడై న యీయన శక్తిని గుర్తించియే యంతకుముందు సైన్యాధికారిగా నున్న దీనికి వీనికి రాజ్యాధికారము నొసంగి -యుండవచ్చును. శాసనాధారముల వలన, సాళువ తిప్ప గోపడను నామాంత రము కలిగిన సాళువ తిప్పరాజు విద్యానగరాధిపతియైన రెండవ దేవరాయల చెల్లెలిని హరియమ్మను పెండ్లాడెనని తెలియుచున్నది. ఈ సంబంధము వలన గూడ సాళువవంశస్థుల రాజ్యాధికారము స్థిరపడి యుండవచ్చును. అట్లు -కళ్యాణపురమున నుఁడియే, పరిసరస్థములైన చంద్రగిరి మొదలగు ప్రదేశముతా యందు పర్యవేక్షణాధికారమును సాళ్వగుండని కుమారుడగు నరసింహ రాజు నెఱవుచుండెడివాడు. కొన్నాళ్ళకు కల్యాణపురము నుండి రాజధానిని చంద్ర గిరికి మార్చుకొనే నని సాళువాభ్యుదయము చెప్పును. చంద్రగిరి రాజ్యములోని . తిరుపతి నుండి వెలువడిన సాళ్వనృసింహుని 2 మొదటి శాసన కాలము 12-9-1458. ఇప్పటినుండి క్రీ॥శ॥ 1489-80 వఱకును సాళ్వనృసింహుని శాసనములు, చిత్తూరు, ఉత్తరార్కాడు, చెంగల్పట్, మైసూరు, కడప, కర్నూలు, నేలమ్, పెనుగొండ, నెల్లూరు జిల్లాలలో, వివిధ ప్రదేశములలో కాన్పించుచున్నవి. ఈయన కుమారుడు ఇమ్మడి నరసింహరాయలి పేర 1491 నుండి శాసన .ములు కాన్పించుటచే, శిసాళ్వనృసింహుడు క్రీ॥శ॥ 1481 వఱకును జీవించి యున్నట్లు చరిత్రకారులు భావించుచున్నారు. విజయనగరాధీశులైన మల్లి కార్జున -రాయల క్రిందను (క్రీ॥శ॥ 1450-87), విరూపాక్ష రాయల క్రిందను ( క్రీ॥శ॥ 1488-86) నుండి, సాళ్వనృసింహుడు అధికారము నెలఱుపుచుండెను. జైమినీ భారతము నందు సాళ్వనృసింహుని విజయములు కొన్ని చెప్పబడినవి. అతడు -తమిళ దేశము నాక్రమించిన చోళులను పారద్రోలె ననియు, ఒడ్డెరాజును
- జయించె ననియు, పాలదుర్గము పెనుగొండల యందలి ప్రతిపక్షులను నిర్జించె
ననియు పినవీరన చెప్పెను. మల్లికార్జున రాయల పరిపాలనా కాలమున గజపతుల దండయాత్ర 4 క్రీ॥శ॥ 1454-55 లోను, క్రీ॥శ॥ 1484 లోనూ జరిగినట్లుగా చరిత్రకారులు 1. Epigraphia Carnatica—(Epi. Car.) Vol. xi, ed, 14. 2. Tirumalai Tirupati Devasthanam inscriptions (T. T. D. I.) Vol. V. No. 4. 3. Historical Inscriptions of Southern India (His. Ins.) By Sewell. pp. 230 to 31. 4. M. E. R. 70/1917; 386/1915. 5. M. E. R. 51/1919; The Suryavamsi Gajapathis' of Orissa; By Dr. R. Subrahmanyam. PP. 44-45. M. E. R. 84/1919; 93/906 26 శాసనాధారమును బట్టి చెప్పుచున్నారు. విరూపాక్ష రాయల కాలమున గూడ ( క్రీ॥ శం 1474-76) గజపతుల దండయాత్ర జరిగినట్లు శాసనాధారము లున్నవి. గజపతుల నూచముట్టుగ సాళ్వనృసింహరాయలు ఓడించి యవమానము పాలు చేసినది 147478 లో జరిగిన యుద్దము నందే ! దండయాత్రనే పినవీరన జైమిని యందు పేర్కొన్నచో, జైమినీ భారత రచనము 1474 తరువాత నే యగును. సంగమ వంశమున నాఖరు రాజైన ప్రౌఢ దేవరాయలు ( వీనినే న్యూనిజ్ 'పడేరావ్' అని చెప్పెను.) రాజకీయ సంక్షోభమునకు భయపడి పారి పోగా సాళ్వనృసింహుడు విజయనగర రాజ్యమునకు మకుటాధిపతి యయ్యెనని చారిత్రకులు చెప్పుచున్నారు. సాళ్వనృసింహుడు క్రీ॥శ॥ 1-11-1488 లో విద్యానగర సామ్రాజ్యాధినేత యయ్యెనని "శాసనాధారము లున్నవి. తై మినీ భారతము సాళ్వనృసింహుని విజయనగర సామ్రాజ్యాధినేతగా చెప్పక పోవుటచే, నిది క్రీ॥శ॥ 1488 లోపుననే వ్రాయబడి సాళ్వనృసింహునకు కృతి యీయబడి యుండవలయును. ఈవిధముగా జైమినీభారత రచనాకాలమును 1474-88. మధ్యకాలముగా గుర్తించినచో, శాకుంతల రచనాకాలమును క్రీ॥శ॥ 1474 కి ముందుగా నిర్ణయింపవలసి యుండును. 公司 4 | లోకోక్తిగా ప్రచారములో నున్న కథలలో పినవీరన వీధిలో గోలి. కాయల వాడుకొనుచుండగా, శ్రీనాథుడు నై షధమును తెచ్చి యాయనకు జూపించె నని కలదు. శ్రీనాథుని వృద్ధాప్యమున నీయన పూపవయస్సు వాడై యుండును. శ్రీనాథుని కాలము ' క్రీ॥శ॥ 1880-1445 మధ్యకాల మగుటచే 1445 నాటికి పినవీరన పదియేండ్ల ప్రాయము వాడైనను, మఱియొక పదునే నేండ్ల తరువాత, అనగా 1480 ప్రాంతమున గాని కావ్యరచనకు నర్హవయ. స్కుడై యుండడు. అనగా క్రీ॥శ॥ 1480-1474ల మధ్య నెప్పుడేని యీయన శృంగార శాకుంతలమును రచించి సోమరాజుపల్లె యందు ప్రభుత్వము నెఱపు చున్న చిల్లర వెన్నయామాత్యున కంకితమిచ్చి యుండును. స్వయముగా నవ్యపథ ప్రవర్తకుడును, ప్రవక్తయు కాకపోయినను విడవీరన ప్రతిభావంతుడైన కవి. ఇంచుమించు నమకాలికు డనిపించుకొను కొఱవి గోపరా జేయనను 'మహామతి యనీ స్తుతించెను. సంస్కృతాంధ్రములు 1. The Suryavamsi Gajapathis' of Orissa—pp. 78-79. By Dr. R. Subrahmanyam. 2. Epi. Car. Vol. XII. Ims 54. 8. ఆంధ్రకవుల చరిత్ర - శ్రీ గురజాడ రామమూర్తి పంతులుగారు. 4. ఆంధ్రకవి తరంగిణి అయిదవ సంపుటము - శ్రీ చాగంటి శేషయ్యగారు- బీ. సింహాసన ద్వాత్రింశిక – అవగారిక. 27 రెండును నీయనకు వశ్యములై వర్తిల్లినవి. సంస్కృత సమాస భూయిష్ఠ మైనా ప్రౌఢ రచన నీయన యెట్లు పొంకముగా తీర్చగలడో, యలశీయంతి పలుకులతో గూడిన తెనుగు తీయదనమును అంత అందముగా జతచేయ గలడు. ఉదాహరణ మున కీ క్రింది రెండు పద్యములను గమనింపుడు. శకుంతలా దర్శనోత్సాహియై మున్యాశ్రమమున కేగనున్న దుష్యంతున 'కెదురుగా నగరి వేటపులి వచ్చెను. దానిని వర్ణించు సందర్భమున ప్రౌఢసఁస్కృత భూయిష్ట రచనను కావించినాడు పినవీరన. అని చింతించుచు సంతసించుచు రయంచారంగ సారంగలాం ఛనవంశాగ్రణి యేగుచో జటుల వర్షాకాల కాలాంబుద స్తనితధ్వాన పథాధ్వనీన గళగర్త క్రోడ నిష్ఠ్యూతని స్స్వన నిర్భగ్న నితాంత శాంత బహుస త్వ స్వాంత కాంతారమై. కం ॥ శైలద్రుమచరదేణి జాలోదర దళన కేళిసమయాతి గళ త్కీలాలసి క్త దంష్ట్రా భీలనఖంబగుచు నొక్క బెబ్బులివచ్చెం.” అట్లే, తెలుగు పలుకుబడి కీ క్రింది యుదాహరణము పరికింపుడు : మఱల, దుష్యంతుడు శకుంతలను జూచి, మునిక న్య యేమోనని సంశయించి కం॥ "కానీ సంశయ మెల్లను మానుం బరిపాటి వీరిమాటల వలనకా లోనున్న రాగివెలుపల గానంగావచ్చు పూతకడియము భంగి. నులకుఁ బండువులుగాగ వీరిమాట లాలకించెద గాకని యధిపుఁడుండె సంతనొక తేఁటి పచ్చి శకుంతలా ము ఖాంబుజమునందు ముసరిన నలతనొంది. కం॥ కరమున బలుమలఱు వామధు కరము నదల్ప నది నెమ్మొగము విడువమికిం గరము వడంకుచు రజనీ కరముఖ యనసూయఁ జూచి కడు దీనతతో. సులభమును, ప్రసన్న మధుర ఈ విధముగా నీ కాన్యము నందు మును, అర్థవంతము నగు నిట్టి శైలియే యంతటను కాన్పించును. తీయని తెలుగు పలుకు బడిని 28 3 తమతమ కావ్యములందు విరియింపజేయవలయు నన్న ప్రతిజ్ఞ యీ యుగమునందలి యందఱుకప్పులును నించుమించు గె కొనినట్లే తోచును. అనంతామాత్యుడు, జక్కన, కొఱవి గోపరాజు తమతమ కావ్యము లలో" తెలుగు తీయదనమును వెలార్చిరి. శాకుంతలము నందు, పదబంధములు, నుడికారములు, సామెతలు, నేడు వెలుగులో లేని యెన్ని యో మారుమూల పదములు, కుప్పలు తెప్పలుగా లభింపగలవు. ఇచట లభించు భాషాప్రయోగ విశేషములు, భాషాశాస్త్ర పరిచితు· లకు మోదమును కలిగించునవి గానున్నవి. 1. వెచ్చము పెట్టుమన్న పదివేలకు "సుద్దగు" లొల్లరు. ఉద్దరి యను పదము నేడు 'అరువు' అను సర్థమున వాడబడుచున్నది.. కన్నడ, మరాఠి భాషలయందును నేడా పదమున నాయర్థమే కలదు. శబ్దరత్నా కరమున ఉద్దరి యమపదము నీయక పోయినను, ఉద్దరువు అను పదమునకు "నేల మొదలగు వాని నుండి తీసుకొనెడి వడ్డీ లేని యప్పు" అని వివరణ మీయబడెను. కాని పిన వీరన దీనిని 'అప్పు' అనుకరమున కాక 'తాకట్టు' అను సర్థమున వాడెను. హ స్తిన యందలి వైశ్యుల నెవ్వనినేని చిల్లర సరుకుల (వెచ్చముల) నీయ మన్నచో, వేల విలువ గల సరుకుల నైనను కుదువ లేకుండనే యిచ్చుటకు. వారు వెనుదీయరు. 2. ఓమనఁ బాపఁ గోలెఁ గృపనోమితి నీ మృగరాజ ఉంథముకా---- ఓమనఁ బాప యను పదబంధము సవ్యమైనది. ఓపు–సాకు, కాపాడు, రక్షించు అను నర్థములు గల క్రియకు వాడుక గలదు. ఓమన యను రూపమును. శబ్దరత్నాకరము గ్రహింపలేదు. ఓమన గాయలు అను పదమునకు "ఓమనగుంట లాడు గింజలు" అను వర్ణము చెప్పెను. కాని వాడుకలో ఓమనగాయలు, వామన గాయలు అను పదమున్నది. అప్పుడే చెట్టుకు దిగెడి, పూవపిందెల వంటి కనటు వోని చింతకాయలను ఓమనగాయ లనుట కలదు. ఈ యర్థమును శబ్దరత్నాకర కారుడు గ్రహింపలేదు. ఇతర ద్రావిడ భాషలలో, ఓము అను తెలుగు ధాతువు. నకు సరిగా, కన్నడమున 'ఓవు' రక్షించు అను ఖాతురూపమును, తుళు భాష- యందు ఓమన-ప్రియము (Dear), పసి (Tender) అను నర్థముల యందు ధాతురూపమును, తమిళమున ఓమ్పు-రక్షించు, పెంచు అను నర్థమున ధాతు రూపమును వాడబడుచున్నవి. ఈ యర్థములను సమన్వయము చేయగా, ఓమన పాప యనగా మిక్కిలి పసిపాప, కన్ను తెఱువని నెత్తురు గుడ్డు, అని యర్థ మగును. అట్టి దశ నుండి యా జింక పిల్లను నేనే కాపాడితి నని యర్థము. టె 1. Dravidam Etymological Dictionary Burrow & Emeneau... 29 లి. పురటాలి "తగవు" గొంపోవు హరిణి — 'తగవు" నకు నేడు వాడుకలో నున్న యర్థము 'కలహమైనను సాంప్ర -దాయక మైన యర్థము 'ధర్మము; ఉచితము' అని గదా! కాని తమిళమున 'తగవు' అనగా సంప్రదాయము సమసరించి వారు వారు తీర్చవలసిన కానుకలు అను సిద్థము కలదు. అనగా కవులు రాజునుండి గ్రహించు కానుకలను "తగపరిందవరిసె” -అందురు. దీనికితోడు శబ్దరత్నాకరకారుడు, 'పెండ్లికుమారునకు తలిదండ్రు లిచ్చు. కానుక' అను నర్థము నిచ్చెను. అదియు సంప్రదాయము ననుసరించి యొక మర్యాదకు కట్టుబడి యిచ్చు కానుకయే. అయర్థముననే పినవీరన 'తగవు' నిక్కడ వాడెను. కాని యిచట కావింపబడిన చిన్న మార్పు ప్రసవించిన స్త్రీకి చూడబోవువారు కొనిపోవు కానుక యని — పులి యీనియుండగా, లేడి ప్రసవిం — చిన వారికి కొనిపోవలసిన కానుకలను గొనిపోవును అని యర్థము. 4. టంకము బంగారము తోడి యొర ప్రబంధము వొందుకా.. ఇచట టంకము అను పదము మేలిమి యను నర్థమున వాడబడినది. సాధారణముగా నీనాడు వాడుకలో నున్న యర్థము. బంగారపు నగలకు వాడు "నత్తుకు' అని; కాని టంక మనగా సదాఱువన్నె బంగార మని శబ్దరత్నాకర కారుడు వివరించెను. తెలంగాణమున "టంక మెత్తు బంగారము" అను వాడుక కలదు. ఇక్కడ నిది మానార్థమున వాడబడుచున్నది. తమిళమున, మళయాళ -మున “తంగమ్" అనగా మేలిమి బంగారము అని యర్ధము. పినవీరన యిచట 'టఁక'మను పదమును మేలిమి యను నర్థముననే వాడెను. శృంగార మంగియై యంగరసములతో కూడుకొన్న ప్రబంధము టంకము బంగారము, అనగా మేలిమి బంగారముతో సామ్యమును బొందుచున్నదని దీని యర్థము. ఇట్టి వెన్నింటినో ప్రయోగవిశేషములను ఈ కావ్యమం దంతటను చూపింపవచ్చును. గ్రంథవిస్తరథీతిచే మానుచున్నాను. ప్రయోగ విశేషములతో బాటు చక్కని జాతీయములకు గూడ నీ గ్రంథ మొక 'బండరువు' అని చెప్పనొప్పును. 1. దుష్ట మృగ శిక్షణంబువలన సుకృతంబుగా మృగయాసౌఖ్యంబును సిద్ధించె. దేవర ప్రసాదంలు, జాదులుం బలెనయ్యె నని యమాత్యుల యనుమతం బున కొలువు లిచ్చి, ఒకే కార్యమున రెండర్థంబులు సిద్ధించిన వనుదానిని చెప్పుచు వాడ బడిన జాతీయ మిది. దైవప్రసాదముగా గన్నేరుపువ్వు లిచ్చినను శిరోధార్య ములే. అట్టి యెడ దైవప్రసాదముగా జాజీపూవు లిచ్చినచో ప్రసాద మను ప్రత్య 30 యమే కాక, సువాసనాభరితములైన కుసుమ శ్రేష్ఠము లని యింకను సంతో షము కలుగును. అట్లే వేటవలన దుష్టమృగ శిక్షణ యొక్కటియే గాక మృగయా సౌఖ్యమును గలిగెనని చెప్పెను. 2. సరవి యెఱుంగ లేకకట జూదులు వేచర మంగలంబునన్ కణ్వమహర్షి శకుంతలను తరు సేచన మాచరింపగా నియమించెను. దీరి నేన పువ్వుకంటె కడు మెత్తన యామె మేను. ఏమని చెప్పవలయును? పద్దతి యెఱు గని వారు మంగలమున జాజిపూవులను వేయించినట్లుగా, కణ్వు డాసుకుమార గాత్రయైన శకుంతలను వృక్ష సేచన మాచరింప నియమించెను. లేవనెత్తె - 8. అడయుఁడై విధి కంచముమొదలివాని లేశమంతయుఁ గృప లేక ళకుంతలాదర్శనాకాంతి యై పోవుచున్న భూ వరునకు వెబ్బులి యడ్డమై దానిగమనమున కొంత రాయము గలిగించినది. అందుమూలమున కలిగిన నిస్పృ హనే రా జిట్లు జిట్లు పలి కెను. కడుపు నిండుగా భుజింపవలయునని కంచములో పెట్టిన పదార్థము లను తినుటకు మొదలు పెట్టకమునుపే విధి లేక మేనియు కృపలేక కంచము. ముందు నుండి లేవనెత్తెను - అని దీని యర్థము. "నోటిదగ్గర కూడు పడగొట్టుట' యను జాతీయమున కిది యన్యరూపము. 19. అటులే ‘నాలుక వెచ్చన' 4-85; లోన నీతలు బోతలు నైన యట్టి- తలపోతలు 8-58; మూసిన ముత్తియంబు 3-77; వంటి వెన్ని యేని మనోహరము లై న ప్రయోగములను చూపింపవచ్చును. సామెతలనుగూడ నీకవి సమయోచితముగా వాడును. అందును తీయని తెలుగు పలుకుబడితో గూడి యర్థ స్ఫూర్తి కలిగి యతికినట్లు సరిపోవు. లోకోక్తులను వాడుటలో నీయన మెలకువ చూపింపగలడు. మచ్చునకు : 1. తోటకూరకు చంద్రహాసము దెత్తు 58! 2. తెఱవ యేనుంగు నె క్కేల దిడ్డి చొఱగ 3. అనఁటిపం డొల్వ నేఁటికి నినుపగోరు 4-48 8-248 4-47 4. తల్లి విషము పెట్టి,తండ్రి యమ్మగ, మాన్పఁగలరె యొరులు 4 - 49 5. అరయంగా మెడ బెట్టుకొంచు దిరుగక హారంబులే భామినుల్ 9-242 31 ఈ కావ్యమునుండి యెక్కువగా నాకాలమునాటి సాంఘికాచార ములు తెలియుట లేదు. కాని యున్నంతలో నీక్రిందివి గమనార్హములు. 1. శకుంతల విరహవేదనావళమై యుండగా చెలులు పొగడలను, బొడ్డుమల్లెలను, పొన్న విరులను నాలుగు దిక్కుల బడిసిపై చిరి 3-41. దీని వలన తీయు నాచార మాకాలమున నుండెడి దనవచ్చును. 2. ప్రసవించిన స్త్రీలకు, చూడబోవువారు కానుకలు కొనిపోవు నాచార ముండెడిది. 2-45; 4-62, 3. అత్తవారిపై నేరము లెన్ను నల్లుండ్రు కలరు. కన్నె నిచ్చిన వారు వరుని దృష్టిలో గౌరవహీనులుగ కాన్పించుటయు నానా డుండియుండవచ్చును. 4-73. 4. స్త్రీకి పతియే ప్రత్యక్షదైవ మను ప్రచారము చేయుటలో పురుషుల కెక్కడలేని శ్రద్ధయున్నట్లు కానబడును, 4-74 నుండి 82 వరకు. 5. ఆటకాడు తెఱబొమ్మలచే గొండ్లి యాడించు వినోద మానాడు న్నట్లు తెల్ల మగుచున్నది. 8-125. ఇట్టి వే మఱికొన్ని యాచారముల నెత్తి చూపింపవచ్చును. పినవీరన దుష్యంతుడు మృగయావినోదియై వెడలెనని చెప్పిన ఘట్టమున వేటను మిక్కిలి వివులముగా వర్ణించెను. ఈయన అప్పుడు వాడిన వలలు. వేటాడుట యందలి భేదములు, పద్ధతులు, వేటకాండ్రు సమమార్చుకొ "నెడి వివిధ సాధన సామగ్రి, వారివెంట బయలు దేరిన చిత్రవిచిత్ర నామాంచితములైన జాగిల ములు, సాకునములు, మచ్చిక జంతువులు- వీని నన్నిటిని విపులముగను, సహ జముగను వర్ణించెను. అల్ల సాని పెద్దక, స్వరోచి వేటసందర్భమునను. ధూర్జటి తిన్నని వేటసందర్భమునను వర్ణించ చిన వర్ణన పిన వీరనవర్ణన వలన ప్రభావిత మైనదై యుండవచ్చును, 學 పిల్ల లమఱి పినవీరభద్రకవి కవిత్వమునకు వలసిన యన్ని ముఖ్యాంశ ములలోను నేవిధముగను ప్రశిస్తులై న యాయుగపు కవులకు తీసిపోని వత్తా శాలి. తనకు గల యమేయపాండిత్యముచేతను, మృదుమధుర కవితాశక్తి చేతను, ఆంధ్రసాహితీలతను అసమాన సౌరభములను వెదచల్లు జంట పూవులను పూయించెను. ఆజంట పూవుల యమృతసౌరభ నాటికిని మనలను -తన్మయులను చేయుచునే యున్నది. ఈ పీఠిక ! వాయుటలో నా కనేక గ్రంథములును, శాసనములును