శివతాండవము/నంది నాంది

వికీసోర్స్ నుండి

నంది నాంది


అర్థేందూత్ఫుల్ల కేశం స్మితరుచిపటలీదంశితం[1] గౌరవర్ణం
తార్తీయీకం[2] వహంతం నయన, మహికుల ప్రత్నభూషావితానం
వృత్తా[3] రంభాఽట్టహాస ప్రవిచలితకకుప్చక్ర, మానందకందం
తం వందే నీలకంఠం త్రిదశపతి శిరశ్చుంబిపాదాఽబ్జపీఠం.

వ్యాఖ్యానానాం స్వయంభుప్రముఖపరిషదాం దూరతోవర్తమానై
ర్లోకాఽఽలోకోత్సవైస్తై రవిదితగతిభిర్విభ్రమైస్తారతారైః
కుర్వంతం దేవకాంతా హృదయవలభిషున్యాస ముద్రాం స్మరస్య
త్రైలోక్యాఽఽనందదాన ప్రవణ, ముపనిషత్ప్రాణ మీశం భజామః.

పాటలజటాఘటిత జూటరుచికోటిభృశపాటిత తమిస్రవలయం
కూటశబరం పటునిశాటకుల ఝాటసుఖమోటనర సైకనిలయం
కోటిశతకోటి సమకోటి నయనోత్థిత కృపీటభవ దగ్ధమదనం
నాటితభువం ప్రళయనాటక మహారచన పాటవచణం హృదిభజే.

మత్తగజకృత్తియుతము త్తమమహర్షి గణచిత్త వనకోకిలమజం
నిత్యసుఖదం, త్రిదశకృత్యఫలదం, భువనమర్త్య పరిరక్షణచణం

భావపరిముగ్ధ గిరిజావనజతుల్యపదయావకరసాఽక్త శిరసం[4]
పీవరభుజం ప్రమథజీవనమముం సకలపావనతనుం హృదిభజే.

గంగాతరంగకణసంగ వికాసిజూటం
సంధ్యాంతరిక్ష మివ తారకితం[5] దధానః
నృత్యత్పదాఽగ్ర పరికల్పిత వేదజాతః
కుర్యాద్దయాం, త్రిభువనాఽఽలయదీపఏషః.

దధన్నేత్రం గౌరీ ప్రణయముకురం[6] మండనవిధౌ
ప్రసన్న స్మేరాఽస్యం లలితలలితం చాంద్రశకలం
మహాసంవిద్రూపం భుజగపతి భూషం శ్రుతిసతీ
వతంసం శంసామః కిమపి కిమపి బ్రహ్మసరసం.

గౌరీకటాక్ష రేఖా
చంద్రకితం[7] వక్ష ఆదధానాయ
పింగళజటా యనమో
గంగాకమనాయ, వేదవేద్యాయ.

కాష్ఠాఆస్ఫోటయంతం కహకహనినదైర్భీషణై రట్టహాసైః
హస్తవ్యాక్షేపభంగైః, ప్రసభమపద్రుతం వ్యోమ కుర్వంత ముచ్చైః
పాదాఽఽఘాతైరధోగాం సవనగిరి గుహాకోటి ముత్కంపయంతం
ధిం ధిం ధిం శబ్దఘోరం హృదివికటమహాకాల మాలోకయామః

ఛటచ్ఛటనదచ్చిఖాపటలపోషణం భీషణం
బహిర్హుతవహం సృజన్విషమలోచనాఽభ్యంతరాత్‌
ప్రమత్తఇవ నృత్యతిప్రచలితాఽఖిలాంగస్సయ
స్సమాఽఽపతతు మానసే తుహినశైల కూటోచ్ఛ్రితః.

బధ్నన్‌ నృత్తాంఽతరాంతః ప్రగళితమహిపాఽఽకల్పితం పట్టబంధం
సంబాధోద్భిన్నఘోరశ్వసిత హుతవహాఽఽదీప్తదంష్ట్రావిటంకం
ప్రోత్తాలస్వైరధీరైః పదయుగలమహాఽఽస్ఫోటనైః కల్పయంతం
నానాభంగాన్‌ లయాఽబ్ధౌ భ్రుకుటితనిటలం శూలినం సంస్మరామః.

జయ జయ శంకర! శత్రుభయంకర!
జయ జయ ప్రమథ పిశాచవశంకర!
జయ జయ తాండవ సంభ్రమసుందర!
జయ జయ ధైర్యవిచాలితమందర!

జయ జయ శీతలచంద్రాఽఽభరణా!
జయ జయ కరుణా శరణాఽఽచరణా!
జయ గగనాంబర! శాతత్రిశూలా!
జయ శుభంకరా! జయ మహాకాల!

ఢక్కారవములు పిక్కటిల్ల దశ
దిక్కుల మారుత దీర్ఘీకృతములు
ఝణుఝణుఝణుత స్వనములకును బ్రతి
నినదము లీఁనగ వనధి భంగములు

శూలంబున నాభీలత లేవఁగఁ
గీలాచయములు లేలిహానములు[8]
ధగధగితములై నిగుడఁగ నగవులు
గగనతలస్థులు బెగడ దేవతలు

నీ నృత్తములో నిఖిల వాఙ్మయము[9]
తానముగా మఱి గానము గాగను
తాండవింపఁగాఁ దరుణంబై నది
ఖండేందుధరా! గదలుము నెమ్మది.

జయ నాదలయాఽఽసాదితమూర్తీ!
జయ జయ తాండవ సంభృతకీర్తీ!
జయ గగనాంబర! శాతత్రిశూలా!
జయ శుభంకరా! జయ మహాకాల!

  1. కవచితమైన.
  2. మూడవదియైన.
  3. అభినయవర్జితమై, గాత్రవిక్షేపము మాత్రమే కలిగినది నృత్తము.
  4. పార్వతీదేవి పదతామరసమునందలి లత్తుకచే రంజివబడిన శిరస్సు గలవాడు భరతశాస్త్రమందు "నిటాలతిలక" అను స్థానవిశేషము గలదు. ఆ యభినయమునందు బాదముతో దిలకముంచికొనునట్లు దానిని నిటలముపై నిలుపవలెను. పార్వతి యాయభినయమును జూపించుచుండగా నామె కాలు శివుని శిరస్సునకు దగిలినది. ఇద్దానినే "లలాట తిలక" మనియు వ్యవహరింతురు.
  5. నక్షత్రములచేత గూడినది.
  6. శివుని నేత్రములందు నీడ జూచుకొని పార్వతి తన యలంకారమును దిద్దుకొనుటచే, నతని నేత్రమామెకు లీలాదర్పణమైనది.
  7. నెమలి కన్నులవంటి కన్నులుగల.
  8. సర్పములు.
  9. సర్వవాజ్మయమును బరమశివుని వాచికాభినయము (అభినయ దర్పణము)