శివతత్త్వసారము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

శివతత్త్వసారము ప్రాచీనాంధ్రవాఙ్మయమునకు సంబంధించిన కృతి. ఈ నా డాంధ్రవాఙ్మయచరిత్రకారులు ప్రాచీన కాలమును క్రిందియుగములుగా విభాగించిరి.

1. ప్రాఙ్నన్నయ యుగము౼I క్రీ.శ. 1 వ శతాబ్దినుండి-850 (వచనము)
                                  II క్రీ.శ. 850-1000 (పద్యము)
2. నన్నయ యుగము౼ క్రీ.శ. 1000-1100
3. శివకవి యుగము౼ క్రీ.శ. 1100-1250
4. తిక్కన యుగము౼ క్రీ.శ. 1250-1350

పై యుగములలో శివకవి యుగమునకు చెందినది శివతత్త్వసారము. ఆ యుగమునందలి కవులు ముగ్గురు[1]. మల్లికార్జున పండితుడు, నన్నిచోడుడు, పాల్కురికి సోమనాథుడు - ఈ మువ్వురలో మొదటివాడైన మల్లికార్జునపండితుడే ఈ శివతత్త్వసారమును ధరించిన మహాకవి. ఆంధ్రవాఙ్మయమున శైవసాహిత్యము మల్లికార్జున పండితునితో ప్రారంభము. ఆశైవవాఙ్మయమునకు శ్రీకారము చుట్టనది శివతత్త్వసారము.

తాళపత్ర ప్రతి

ఈ గ్రంథమున కొక్కటే తాళపత్ర ప్రతి లభించినది. అది చదువుల రామలింగయ్యగారను జంగమదేవర సంగ్రహములోనిది. ఆ తాళపత్ర ప్రతిలో నాలుగు గ్రంథములున్నవి. నూటడెబ్బదినాలుగు కమ్మలున్న యాప్రతిలో 20వ తాటాకు మొదలు 67 వఱకు నీ శివతత్త్వసార మున్నది. 67 వ తాటాకుచివర వ్రాయసకాని పేరును, వ్రాసిన కాలమును నిట్లు చెప్పబడినవి.

"స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు........................

పింగళ నామసంవత్సర కార్తీక బ॥ 13 గురు॥సర్కి........శివ సారాయమున్నూ అద్దాల వీరన్న స్వహస్తలిఖితం॥ ఈ పుస్తకం త్సదువుల రామలింగయ్యగారికి శివార్పితంగా యిచ్చి శరణు చేస్తిమి."

శాలివాహన శకవర్షముల సంఖ్య యియకపోయినను పింగళ సంవత్సరమున తిథి వారము లీయబడినవిగాన నీ గ్రంథము లిఖంచబడిన తేదీ కనుగొనుట సులభము. అది క్రీ.శ. 2-11-1797 వ తేదీకి సరిపోవుచున్నది. కాబట్టి యీప్రతి యిప్పటికి 169 యేండ్ల క్రిందట వ్రాయబడినదని నిశ్చయించవచ్చును.

వ్రాతప్రతి

పై తాళపత్రప్రతి ననుసరించి వ్రాయబడిన కాగితపుప్రతి యొకటి మదరాసుప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమున నున్నది[2]. క్రీ.శ. 1917-18 లో మదరాసు ప్రభుత్వము వారు సేకరించిన విలువగల గ్రంథములలో నిది యొకటి యని యానివేదికయందు తెలుపబడినది[3].

ఈ గ్రంథము యొక్క యునికిని ప్రశస్తిని మొదట గుర్తించినవారు కీర్తిశేషులు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు.

ముద్రితప్రతి

ఈ గ్రంథమును మొదట గుర్తించిన కీర్తి ప్రభాకరశాస్త్రులుగారికైనట్లుగా, దీనిని మొదట ప్రకాశింపజేసిన కీర్తి సుగృహీతనాములకు కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు గారికి, ముద్రించిన యశస్సు ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారిది. లక్ష్మణరావుగారి పీఠికతో నిది క్రీ.శ. 1922వ సంవత్సరమున నచ్చయినది[4].

ప్రస్తుత ముద్రణము

నలభై నాల్గేండ్ల క్రిందట ముద్రితమైన యీ గ్రంథ మచ్చయిననాటినుండి, సాహిత్య ప్రపంచమున నత్యధిక ప్రచారము గాంచినది. నన్నయనతిక్కనల నడిమికాలమున నిర్వివాదముగ బుట్టిన కావ్యము శివతత్త్వసార మగుటచేత, వాఙ్మయ చరిత్రకారులు, విమర్శకులు దీనిని ప్రామాణికముగ దీసికొనిరి. ఇది ప్రకటితమైన రెండేండ్లకే శతక కవుల చరిత్రకెక్కినది[5]. నన్నెచోడకవి కాలనిర్ణయచర్చలలో ప్రాముఖ్యము వహించినది - క్రీ.శ. 2004 నుండియు, విశ్వవిద్యాలయములలో ఆంధ్రవాఙ్మయచరిత్ర కెక్కి- విద్యార్థిలోకమునకు విద్వల్లోకమునకు సుపరిచితమైనదు.

ఇట్లున్నను, నీ గ్రంథమును ఆంధ్రసాహిత్యపరిషత్తునారు పునర్ముద్రణము కావించ లేరు. క్రీ.శ. 1940 లో కీర్తిశేమకు ప్రభాకరశాస్త్రిగారు-

కన్నడ శివతత్త్వసారము

[6]కనుగొన్ననాటినుండియు, నీ తెలుగుగ్రంథముయొక్క విశిష్టత హెచ్చినది. ఒక్కసాహిత్యవిషయముగనేకాక, భాషావిషయమున నీ గ్రంథము ప్రామాణికమైనది. సుప్రసిద్ధమైన శ్రీ సూర్యరాయాంధ్రభాషానిభుంటువున నిది గ్రహింపబడినది.

క్రీ.శ. 1927 లో పాల్కురికి సోమనాథుని బసవపురాణమును, క్రీ.శ.1939లో పండితారాధ్య చరిత్రమును సుపరిష్కృతములై ప్రకటితములైనవి[7]. వానిమూలముగా శివతత్త్వసారమునందలి భాషావిశేషములేగాక గ్రంథమునందలి శైవమత సంప్రదాయవిషయములెన్నో క్రొత్తవి తెలియవచ్చినవి. ఇవియన్నియు, శివతత్త్వసారమున చేరవలసిన యావశ్యకత కాన్పించినది. భాషాసాహిత్య చరిత్రకారులు తెలుసుకొనదగిన విశేషములు బయలుపఱుపవలసిన యావశ్యకత యంతకంటెను ప్రధానమగుటచే నీ ముద్రణము ప్రారంభమైనది.

గ్రంథ పరిష్కరణ విధానము

పూర్వముద్రణమున నప్పటికిగల సాధనసామగ్రినిబట్టి గ్రంధపరిష్కరణము సాగించిన విధానము నిరూపితమైనది. ఒక్క బ్రతియే లభించునపు డెట్లు పరిష్కరింపవలెనో, ఆవిషయమేగాక-పాఠము మార్పులవల్ల చరిత్రకెంత యుపయోగపడునో యదియు తెలుపబడినది[8]. మూలప్రతిలో నచ్చటచ్చట క్రిమిదష్టము లుండుటచేత, నా భాగము చుక్కలతో చూపబడినది- గ్రంథమున నక్షరములు కొన్ని లోపించుటచేత-అవి పూరింపబడి కుండలీకరణము చేయబడినవి-ఇట్లెంతో జాగరూకతతో పూర్వముద్రణము సాగినది అయినను కొంత సంస్కరణ మావశ్యకమైనది.

పైనిచెప్పిన నూతన విషయములను, కన్నడ శివతత్త్వసారమును నాకళింపుకేసికొని - ప్రస్తుతముద్రణము - పరిష్కృతమై ప్రకాశికమైనది. ఆవిధానము నిట వివరించుచున్నాను.

దీనికి ముందుగా కన్నడ శివతత్త్వసారమును గూర్చిన వివరములు తెలుసుకొనవలెను.

కన్నడ శివతత్త్వసారము

కన్నడ శివతత్త్వసారమంతయు పూర్తిగ లభించలేదు. అందు 281 నుండి 472వఱకు —181 పద్యములు, 728 నుండి 740 వఱకు 12 పద్యములును మొత్తముమీద 193 పద్యములు మాత్రమే లభించినవి. తెలుగున శివతత్త్వసారమున నన్నియు గందములే అట్లే కన్నడమున కూడ కందమొలే. మనయదృష్టవశమున గ్రంథకర్తృత్వమును గూర్చిన పద్యము కన్నడమున నిట్లున్నది.

కన్న.

ధరయొళగె మల్లికార్జున
వరపండిత నెనుసితీహుదఱు నిన్నాజ్ఞా
భరమె సెయిర్ ప్రమథొరొళా
నిరి వెందీక్షితు వె నిమ్మ బయసువె నీశా.

తెలుగు.

ఒండేమి మల్లికార్జున
పండితుడననుండుకంటె ప్రమథులలో నె
న్నండొకొ నీ యాజ్ఞోన్నతి
నుండఁగఁ గాంతునని కోరుచుండురు రుద్రా.

387

పై రెండింటిని పరిశీలించినచో, తెలుగు కృతికే, కన్నడ మనువాద మనియు రెండింటికి కర్త మల్లికార్జున పండితుడే యనియు స్పష్టమగుచున్నది. కన్నడ భాషలో ప్రాస యుండునుగాని యతి యుండదు అందుచేత యతి ప్రాస లున్న తెలుగు కృతియే ముందు రచితమైనరని చెప్పవచ్చును-ఇక దీని మూలమున పరిష్కరించిన ఈ క్రింది విషయములను చూచినచో, కన్నడగ్రంథ విశేషము లెంతగా నుపకరించినవో తెలియగలదు.

పూర్వ ముద్రణము - పూ. ము. అను సంకేతికము. నూత్న ముద్రణము - నూ. ము.

నష్టభాగ పూరణములు

1.పూ.ము. క.

......
గా నించుకలేని నా స్థితి కస్థితి విషయా
ధీనలదురాచారికి యో
గానందము గలుగ నేర్చునయ్య మహేశా!

266

ఇందు మొదటిపాద మీక్రింది కన్నడ పద్యమునుబట్టి పూరింపబడినది.

క.

జ్ఞానం వైరాగ్యమెన
ల్కేనా నొందిరద నాస్తికస్థితి విషయా
ధీవ దురాచారిగ యో
గానందం దొరకలాక్కుమే సర్వేశా.

278

కాబట్టి మొదటిపాద మీ క్రిందిరీతి నుండును.

నూ.ము.క.

(జ్ఞానము వైరాగ్యము నన
గా) నించుకలేని నాస్తిక స్థితి విషయా
ధీన దురాచారికి యో
గానందము గలుగనేర్చునయ్య మహేశా.

267 పుట 51

2. పూ. ము. క.

ఆలరి ధక్షుని నోమున
కేలా చనుదెంచితంచు నీశానదిశా
..........................
............................................

310

లోపించిన రెండు పాదములు కన్నడానువాదము ననుసరించి పూరింపబడినవి.

క.

వీళర్ప దక్షయాగ శె
మేలడియదె బందిరెనుత మీశానదిశా
పాలగరం సురతతియం
కూల దొళిది దిఱుదు కొందన బెన నభవా.

320

పై దానిని బట్టి తెలుగు పద్యము.

నూ.ము.క.

అలరి దక్షుని నోమున
కేలా చనుదెంచి తంచు నీశానదిశా
పాలకులను సురనికరము
శూలముతో పొడిచి చంపఁజొచ్చిరి రుద్రా!

310 పుట 59

పై పద్యములలో ప్రాసస్థానము సమానమై యుండుట గమనింపదగినది. ఇక 170 పద్యమునకు (పుట 35) 352 పద్యమునకు (పుట 67) 49 పద్యమునకు (పుట-) కన్నడానువాదము లభ్యము కానందున యట్లే విడువబడినవి. 275, 276, 277, 278 పద్యములలో చుక్కలున్న పదములు ప్రస్తుత రాజకీయ ముద్రణ శాసనము ననుసరించి లోపింపజేయబడినవి.

అర్ధ సంస్కరణము

పూ.ము.క.

వెలగొనియ దీక్షితుడు దే
వలకుం దనఁ బూజచేసి వర్తించుమెయిన్
మలహరుని దీక్షితుడు దే
వలకుం దెఱుగంగ చేయవలయును దీనిన్.

226

ఈ ముద్రితపాదమున విపరీతార్ధము గలిగినది. శివదీక్ష లేనివాడు వెల గొని అనగా డబ్బు పుచ్చుకొని శివపూజ చేయును అదియును శివపూజయే కానీ వాడు దేవలకుడు. ఇక శివదీక్ష పొందినవాడు ఆ శివపూజయే చేసినను వాడు దేవలకు డెంతమాత్రమును గాడు. అని పై పద్య తాత్పర్యము.

ఇది శివదీక్షాప్రాధాన్యము నిరూపించు పద్యము. శివ దీక్షితుడుకూడ దేవలకుడే యను నర్థ మిచ్చుచున్నది. ఇది శైవమతదీక్షాసంప్రదాయమునకువిరుద్ధము, కన్నడ పద్య మిది.

క.

బెళిగొండ దీక్షితం దే
వలకం శివపూజ గెయి వర్తిపక తదిం
మలహరన దీక్షితందే
వలకను మల్లెందు తిళియ వేర్కిద వెళ్ళర్.

దీనిని బట్టి చివఱిపాదము

మలహరుని దీక్షితుడు దే
వలకుండునుగా డెఱుంగవలయు మహేశా.

అప్పుడు తెలుగు పద్య మిట్లుండును.

క.

వెలగొని యదీక్షితుఁడు దే
వలకుండన బూజచేసి వర్తించు మెయిన్
మలహరుని[9] దీక్షితుడు దే
వలకుండునుగా డెఱుంగవలయు మహేశా.

దేవలకు డనగా ఆలయపూజారి—నంబి—శివాలయముల వీరలను తంబళి యందురు. ఇతడు శివపూజయే చేయును. కానీ అది వృత్తి వెలగొని చేయుది—అతడు శివదీక్ష లేనివాడు—ఇక శివదీక్షయున్న భక్తుడును శివపూజ చేయును—అంతమాత్రముచేత అతని దేవలకుడని యువరాదు— అని సంస్కరణ పద్యమునకు తాత్పర్యము. శైవమున శివపూజకు దీక్ష నియతముగానుండవలెను.

1. క.

నిన్నెఱుగుచుఁ దన్నెఱుఁగని
యన్నఁడు శివయోగమగ్ను డనఁబడుడు [మదిలో]
నిన్నును దన్ను నెఱింగెడి
యన్నడు శివయోగమగ్నుఁ డనబడును శివా.

269

"పూర్వపీఠికలో దీనిని గూర్చి యిట్లు గలదు. (పుట 38)

"'ఆనాఁడు' అనుటకు 'అన్నఁడు' (269) 'మలహరుఁడు' అనుటకు 'మలహు' (415) అను మాఱురూపములు కానవచ్చుచున్నవి." కాని పుట:శివతత్వసారము.pdf/15 పుట:శివతత్వసారము.pdf/16 పుట:శివతత్వసారము.pdf/17 పుట:శివతత్వసారము.pdf/18 పుట:శివతత్వసారము.pdf/19 పుట:శివతత్వసారము.pdf/20 పుట:శివతత్వసారము.pdf/21 పుట:శివతత్వసారము.pdf/22 పుట:శివతత్వసారము.pdf/23 పుట:శివతత్వసారము.pdf/24 పుట:శివతత్వసారము.pdf/25 పుట:శివతత్వసారము.pdf/26 పుట:శివతత్వసారము.pdf/27 పుట:శివతత్వసారము.pdf/28 పుట:శివతత్వసారము.pdf/29 పుట:శివతత్వసారము.pdf/30 పుట:శివతత్వసారము.pdf/31 పుట:శివతత్వసారము.pdf/32 పుట:శివతత్వసారము.pdf/33 పుట:శివతత్వసారము.pdf/34 పుట:శివతత్వసారము.pdf/35 పుట:శివతత్వసారము.pdf/36 పుట:శివతత్వసారము.pdf/37 పుట:శివతత్వసారము.pdf/38 పుట:శివతత్వసారము.pdf/39 పుట:శివతత్వసారము.pdf/40 పుట:శివతత్వసారము.pdf/41 పుట:శివతత్వసారము.pdf/42 పుట:శివతత్వసారము.pdf/43 పుట:శివతత్వసారము.pdf/44 పుట:శివతత్వసారము.pdf/45 పుట:శివతత్వసారము.pdf/46 పుట:శివతత్వసారము.pdf/47 పుట:శివతత్వసారము.pdf/48 పుట:శివతత్వసారము.pdf/49 పుట:శివతత్వసారము.pdf/50 పుట:శివతత్వసారము.pdf/51 పుట:శివతత్వసారము.pdf/52 పుట:శివతత్వసారము.pdf/53 పుట:శివతత్వసారము.pdf/54 పుట:శివతత్వసారము.pdf/55 పుట:శివతత్వసారము.pdf/56 పుట:శివతత్వసారము.pdf/57 పుట:శివతత్వసారము.pdf/58 పుట:శివతత్వసారము.pdf/59 పుట:శివతత్వసారము.pdf/60 పుట:శివతత్వసారము.pdf/61 పుట:శివతత్వసారము.pdf/62 పుట:శివతత్వసారము.pdf/63 పుట:శివతత్వసారము.pdf/64 పుట:శివతత్వసారము.pdf/65 పుట:శివతత్వసారము.pdf/66 పుట:శివతత్వసారము.pdf/67 పుట:శివతత్వసారము.pdf/68 పుట:శివతత్వసారము.pdf/69 పుట:శివతత్వసారము.pdf/70 పుట:శివతత్వసారము.pdf/71 పుట:శివతత్వసారము.pdf/72 పుట:శివతత్వసారము.pdf/73 పుట:శివతత్వసారము.pdf/74 పుట:శివతత్వసారము.pdf/75 పుట:శివతత్వసారము.pdf/76 పుట:శివతత్వసారము.pdf/77 పుట:శివతత్వసారము.pdf/78 పుట:శివతత్వసారము.pdf/79 పుట:శివతత్వసారము.pdf/80 పుట:శివతత్వసారము.pdf/81 పుట:శివతత్వసారము.pdf/82 పుట:శివతత్వసారము.pdf/83 పుట:శివతత్వసారము.pdf/84 పుట:శివతత్వసారము.pdf/85 పుట:శివతత్వసారము.pdf/86 పుట:శివతత్వసారము.pdf/87 పుట:శివతత్వసారము.pdf/88 పుట:శివతత్వసారము.pdf/89 పుట:శివతత్వసారము.pdf/90 పుట:శివతత్వసారము.pdf/91 పుట:శివతత్వసారము.pdf/92 పుట:శివతత్వసారము.pdf/93 పుట:శివతత్వసారము.pdf/94 పుట:శివతత్వసారము.pdf/95 పుట:శివతత్వసారము.pdf/96 సోమనాథుడు లింగధారణ దీక్షాఫలమైన లింగార్చన వివరించి యావిధానము దెలుపు పేరు ప్రకరణమునకు బెట్టియున్నారు.

తెలుగు సాహిత్యములో లింగధారణ దీక్షావిధానమును తూచా తప్పకుండ తెలిపెడి కృతి యొకటి గలదు. అది యుద్భటాచార్యచరిత్ర - మహాకవి తెనాలి రామలింకనికృతి. ఇం దుద్భటుడు ముంజభోజునికి దీక్ష యొసగు సందర్భమున మూడవయాశ్వాసమున లింగధారణావిధానమంతయు వివరించబడియున్నది. మతసంప్రదాయికగ్రంథమైనను ఇందలి కవితాశైలియు రసవంతమైనది.[10]

తెనాలి రామలింగకవి కృతి శైవమతసంప్రదాయమునకు సంబంధించిన కథావస్తువు గలదైనను, నది సాహిత్యలోకమున, సాహిత్యకావ్యముగానే ప్రచారము గాంచినది. దీనివలన మనము, మన సాహిత్యగ్రంధములను విమర్శింపవలసివచ్చినప్పుడు మతసంప్రదాయపరిజ్ఞాన మెంత యావశ్యకమో స్పష్టపడుచున్నది.

తెనాలి రామలింగకవియే తెనాలి రామకృష్ణు డైనాడు. అయినను, నాతని పాండురంగగమహాత్మ్యమే విమర్శకులందఱు పాటింతురు. ఉద్భటారాధ్యచరిత్రను తలపెట్టరు. ఒక కవి కవితాతత్త్వము నిరూపించునప్పు డాతనిగ్రంథములన్నింటి కూలంకషపరిశీలన మావశ్యకము. మన సాహితీవిమర్శల యందవ్యవస్థ కిది యొక నిదర్శనము.

కృతజ్ఞత

ఈ శివతత్త్వసారమును పరిష్కరించి, పీఠిక వ్రాయుమని నన్ను నత్యంతము ప్రోత్సహించిన శివయోగి విద్వాన్ భాషాప్రవీణ ముదిగొండ వీరేశలింగశాస్త్రిగారికిని, శివశ్రీ డాక్టరు శ్రీ ముదిగొండ మల్లికార్జునరావుగారికిని, శివశ్రీ శ్రీ చాగంటి శంకరశాస్త్రిగారికి నామనఃపూర్వకకృతజ్ఞతాంజలుల నర్పించుచున్నాను.

అందఱికన్న మిన్నగ నాదినుండియు, నీ గ్రంథ ప్రకటనకై యభిలషించి, దీని నీనాడు వెలుగులోనికి దెచ్చి యాంధ్రసాహితీలోకమున కర్పించిన మహోదారులు - శ్రీకృష్ణాపత్రికాధితులు శివశ్రీ ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మగారు- వారికి సర్వదా కృతజ్ఞతాబద్ధుడను.

శ్రీ శర్మగారి మూలముగా నాంధ్రశైవవాఙ్మయమునకు నింకను నెంతయో యభ్యుదయము చేకూరనున్నది. ఒకప్పుడు ముద్రితములై నేడు లభ్యముగాకయున్న ఉద్భటారాధ్యచరిత్రము, పండితారాధ్యచరిత్రము మున్నగు నుద్గ్రంథములను, శ్రీ శర్మగా రిట్లే సుసంస్కృతములుగా బ్రకటించి ఆంధ్రసాహిత్యప్రపంచమున శైవవాఙ్మయజ్యోతి యఖండముగా దీపించునట్లు చేయుదురుగాక!

నా యజ్ఞతచేతనేమి, యితరకారణములచేతనేమి, యిందు పెక్కుదోషము లుండవచ్చును. గుణగ్రహణపారీణులైన విద్వాంసులు వానిని దెలిపినచో ద్వితీయముద్రణమున సవరించెదనని విన్నవించుచున్నాను.

ఇతి శివమ్

—నిడుదవోలు వెంకటరావు

  1. వీరి మువ్వురితో బాటు సర్వేశ్వరశతకకర్తయైన యథావాక్కుల అన్నమయ్యకూడ శివకవి యుగములో క్రీ.శ. 1242 లో నున్నాడు. (చూడుడు. తెలుగు కవుల చరిత్ర - శివకవి యుగము యథావాక్కుల అన్నమయ్య- పుటలు -350-379)
  2. A Triennial Catalogue of Manuscripts. Vol. III. Part III. Telugu 1916-1919. No 502. Pages 1288-1290
  3. Introduction to the above page 2
  4. ఆంధ్ర సాహిత్య పరిషత్ప్రకటిత గ్రంథసంఖ్య - 13
  5. వంగూరి సుబ్బారావుగారిది. చూ॥ నూతనావృత్తి, ప్రస్తుత పీఠికాకర్తచే సంస్కరింపబడి పీఠికాదులచే నలంకృతమైనది.

    ప్రథమ ముద్రణము

  6. ఈ కన్నడ శివతత్త్వసారమును ప్రఖ్యాత రచయితలు, పత్రికాసంపాదకులు భాషావేత్తలునైన శ్రీ తిరుమల రామచంద్రగా రెట్లు మొదట గుర్తించిరో ఆ విషయము, "శివతత్త్వసార పాఠాల మార్పుతగునా" అను భారతి వ్యాసమున చూడనగును (సం. 38 సం. 2 పుట 78)
  7. బసవపురాణము-పరిష్కర్త-పీఠికాకర్త- వేటూరి ప్రభాకరశాస్త్రి,

    ద్వితీయ ముద్రణము 1952

    పీఠికాకర్త - ప్రస్తుత గ్రంథపరిష్కర్త. పండితారాధ్య చరిత్ర. కీ.శే. కళాప్రపూర్ణ డాక్టరు చిలుకూరి నారాయణరావు.

  8. చిత్రదారతము - అచ్చుప్రతి - చిత్రాబ్జభానుడు - అర్ధములేదు. వ్రాత ప్రతి - చిత్తాపఖానుడు - విశేషార్థము గలది. ఈ చిత్తాపఖానుడే-షితాబ్ ఖాన్ - తెలుగు వాడైన సీతాపతి-1500 ప్రాంతమున ఒరంగలు నేలినవాడు. ఈతని గూర్చి- శ్రీయుతులు- ఆదిరాజు వీరభద్రరావుగారు వ్రాసిన షితాబ్ ఖాన్ అను గ్రంథము చూడదగును.
  9. ఇచట దీక్షితుడనగా- యజ్ఞదీక్షితుడని కాదు- శివదీక్ష గైకొన్నవాడని శైవసంప్రదాయికార్థము.
  10. ఈకృతి ముదిగొండ వంశీయులగు వారికెల్ల ముఖ్యమైన గ్రంథము. ఆ వంశీయులకు మూలపురుషుడగు ఉద్భటాచార్యునిచరిత్రమును దెలుపు హృద్యమైన పద్యకావ్యము. నలుబదేండ్లకు పైగా ముద్రితమైన యిది నేడు లభ్క్యముకాలేదు. తక్షణమే పునర్ముద్రణము చేయదగినది.