Jump to content

శివతత్త్వసారము/ఇతరములు

వికీసోర్స్ నుండి

పద్య వివరణ

శివతత్త్వసార మాంధ్రశైవవాఙ్మయమున ప్రథమగ్రంథ మగుటయే కాక తెలుఁగున వీరమాహేశ్వరాచారమను ఆరాధ్యసాంప్రదాయమును వివరించు గ్రంథములలో ప్రధానమైయున్నది. ఇందు శైవమతమునకు సంబంధించి శ్రుతిస్మృతిపురాణాగమేతిహాసములనుండి విషయములు సంగ్రహింపబడి ఆ యర్ధము తెలుగుభాషలో తెలుపబడియున్నది. ఇందలిపద్యము లన్నియు కందములే యైనను, అవి సులభశైలిచే రచింపబడియున్నను, విషయ మతిగంభీర మగుటచే పాఠకులకు నీ గ్రంథము సంపూర్ణముగా నవగాహన చేసికొనుటకు వీలుకాక యున్నది. కేవలము సాహిత్యజిజ్ఞాస గల పాఠకులకే కాక శైవులకు నిత్యజీవితముతో సంబంధించిన మతగ్రంథ మగుటచే ప్రతిపద్యార్ధవివరము అత్యావశ్యకమై యున్నది. అంతేకాక కొన్నిపట్టుల మతసాంకేతికపదనిర్వచన మవసరమై యున్నది.

ఈ యుద్దేశ్యముతోడనే మూలమున 115 వ పద్యమువఱకును పద్యార్థవిశేషములు యడుగున నీయబడినవి. తక్కిన పద్యముల విశేషము లీక్రింద చూపుతున్నాను.

121. శివభక్తులను చూచి వా రేజాతివా రని విచారించకూడదు. శైవమతమున జాతిభేదములు లేవు.

ఈవిషయమై పాల్కురికి సోమనాథు డిట్లు చెప్పియున్నాడు.

క.

భువిలో శివదీక్షితులగు
శివభక్తుల పూర్వజాతిఁ జింతించుట రౌ
రవనరకభాజనం బా
శివుఁ బాషాణంబు గాగఁ జింతించుక్రియన్.

అనుభవసారము 183 ప.

ఈ కారణము చేతనే సోమనాథుడు, తాను ఈశ్వరకులజుడనని పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులని చెప్పుకొన్నాడు.

129. శివభక్తులకు జాతాశౌచ మృతాశౌచములు లేవు.

133. కమ్మగవలచిన = మంచి వాసన వేసినట్లుగా

144. భక్తియే ప్రధానముగ నెంచి, గురువు యొక్క ఆజ్ఞాప్రకారము వర్తింపక, అన్యవిధమున గొప్పభక్తుడై, తనభక్తిని గనిపఱచినయెడల, గురు వాశిష్యునిపై గోపింపక తనశిష్యు డంతవా డాయెనని సంతోషించి, పరవశుడై, ఆ భక్తశిష్యుని తప్పు మఱువవలయును.

150. భక్తి కనుదేహభావవ్యక్తుండు. శివుడు భక్తుని యనుదేహము అనగా ప్రతిదేహము అను భావన.

187. వుచ్చినకన్ను అనగా పెఱికిన కన్ను

194. శివభక్తి లేని బ్రాహ్మణుడు శ్వపచునకు గీడు, అనగా అంత్యజాతివానికన్న తక్కువవాడు.

197. శివుని కృపలేని వైభవము క్షణభంగురము. దీనికి రెండుదృష్టాంతములు చెప్పబడినవి.

1. మెఱియలపై [1]పిండకూడు.

మెఱియ యనగా గుండ్రాయి - దినవారములు చేయునపు డొకరాతియందు ప్రేత నారోపించి, దానిమీద నీళ్ళు పోసి, తిలలు దర్భలు మొదలైనవి వేసి దానికే పిండములు పెట్టుదురు. ఆ రాతివైభవ మాదినవారములు పదిరోజులే. ఆవెనుక ఆరాయి విసర్జింపబడును.

2. మీస మెదుకుల మెఱపులు. భోజనము చేయునవుడు కొంచెముకాలము మెదుకులు మీసములపై నుండి, భోజనానంతరము ముఖము కడుగగానే అవి జారిపోవును. క్షణకాలమే వానివైభవము.
199. ప్రువ్వులు అనగా పురుగులకు బ్రదికియున్నప్పుడు తమ కొకప్పుడైన చావు కలదు అనుజ్ఞాన ముండదు. చచ్చినప్పుడు పునర్జన్మ యుండు ననుజ్ఞానము కలుగదు. ఇట్లు జ్ఞానమేమియు లేక మరల మరల పుట్టుచు పురుగులు చచ్చుచుండును. అట్లే మానవులకు శివభక్తి లేనియెడల పుట్టుచు, చచ్చుచు, ముక్తికి దూరమై పురుగులవలె నశింతురు.

225. పరార్థశివార్చనయనగా ధనము దీసికొని గుళ్ళలో పూజారులు చేయు పూజ.

222. ఈ పద్యమున స్త్రీపురుషులకు సమానత్వము నిరూపితమైనది. పురుషునకు శివభక్తి లేకపోయినప్పుడు, స్త్రీ అతని కనుకూలముగ నడవనక్కరలేదు. ఆతని విడిచి యథేచ్ఛగా శివశక్తిపరురాలు గావచ్చును.

270. అష్టాంగయోగవిధి ప్రసిద్ధమే. షడంగయోగము పాశుపతులకు మాత్రమే. పాశుపతసూత్రములు చెప్పబడినది—

"హసిత, గీత, నృత్య, హుడుక్కార, నమస్కార, దివ్యపదంగోపహారేణ ఉపతిష్ఠతీతి" అని సర్వదర్శనసంగ్రహము. (న..తీశదర్శనము)

282–284. శైవులకు పరలోకవిధులు లేవు.

285. శైవగురువులసొత్తు వారిప్రతులలో శైవులైనవారికి చెందవలయునే కాని శైవులు కాని కుమాళ్ళకు జెందకూడదు.

322. ‘నమసుప్తినాథ’ — కల్పాంతమం దందఱును బోయెడి నిద్ర నమసుప్తి. దాని కధిపతి శివుడు.

322–385. ప్రమథగణవర్ణనము, వారియాటలు, వారిమహిమలు. దీనికే "గణాడంబరము" అని పేరు. ఈ గణాడంబరమును భక్తులు పఠించుచున్నట్లు పండితారాధ్యచరిత్ర పర్వతప్రకరణమున గలదు.

386-388. కవి నామాంకిత పద్యము. ఫలశ్రుతి.

389. శివభక్తులచరిత్రలు తెలియుటకు బ్రహ్మవిష్ణ్వాదులకు సాధ్యము కాదు.

399-489. ఇందు భక్తుల చరిత్రలు, భక్తమహిమలు సూక్ష్మముగా నొక్కొక్క పద్యమున సూచింపబడినవి. భక్తమహిమలశీర్షికలో గూడ భక్తచరిత్రలే గలవు. వీని వివరములను పీఠికయందు జూడనగును.

మతసాంకేతికవివరణము

11. దురితహరమనియు శుభములు
    దొరకొనుననియును దలంచి దురితారి! భవ
    చ్చరణాబ్జ భ క్తి లలనా
    పరవశభావమున నిన్నుఁ బ్రణుతితు శివా.

ఈపద్యమున షట్స్థలములలో నొకటియగు శరణస్థలము నిరూపితమైనది.

సతిపతినివలె యనన్యబుద్ధితో శివుడే శరణమని దృఢనిశ్చయముతో కొల్చు భక్తిభావన చెప్పబడినది . శైవమునందలి యీభావమే తరువాత వైష్ణవమున మధురభక్తి భావనగా సంగృహీతమైనది.

21. జ్ఞానము పశుపాశుపతి
    జ్ఞానమయని యెఱుంగజాలని జడుల
    జ్ఞానులు వారల తత్త్వ
    జ్ఞానము లజ్ఞానములు విచారింప శివా.

ఇందారాధ్యసంప్రదాయమునకు ముఖ్యమగు పశుపాశుపతిజ్ఞానము వివరింపబడినది.

పశువులు-జీవులు.
పాశము-భవము. ఇది అణవిక, కార్మిక, మాయామలరూపముగ జీవుల నంటి యుండునది.

పతి - శివుడు

80. త్రిమలములు - ఆణవిక, కార్మిక, మాయామలములు అను మూడు

81. భవుడు - రజోగుణమూ ర్తియైన శివుడు.

82. హరుడు - తమోగుణమూర్తియైన శివుడు.

83. మృడుడు - సత్త్వగుణమూర్తియైన శివుడు.

84. శివుడు -నిస్త్రైగుణ్యమహత్తరరూపము.

88. పరమాత్మ - పరబ్రహ్మ - పరమేశ్వరుడు, ఇవి శివునికి తత్త్వాంతరవాచకములు.

131. నీ నిజభక్తుం డంత్యజుఁ
    డైనఁ బవిత్రుండు పూజ కర్హుడు జగతిన్
    "తేన సహసంవసే"త్తని
    గానప్రియశ్రుతులు మ్రోయుగాన కపర్దీ.

“మద్భక్తశ్చశుచీ" "శ్వవచో౽పి మునిశ్రేష్ఠయస్తు లింగార్చనేరత" అని శ్రుతులు.

లింగార్చనము నందాసక్తుడైనవాడు చండాలుడైనను మునిశ్రేష్ఠుడే.

132. క. శ్వపచుండై నను శివభ
    క్తిపరుం డగునేని నతఁడ ద్విజవర్యుం డా
    శ్వపచునకుఁ గీడు శివభ
    క్తిపరాఙ్ము ఖుఁడైన యట్టిద్విజుఁడు మహేశా! 194ప.

133. గురుఁడాది తనకుఁ గఱపిన
    వెరవున జని మీద భక్తి వేదించిన య
    గ్గురువు తము గడచి చేసిన
    పరవశుఁడై మఱవవలయు భక్తులఁ దన్నున్.

గురువు దీక్షాగురువు-

ఇచట గురుస్థలము సూచితమైనది
గురువు - అనగా దీక్షాగురువు
గురువు హస్తమస్తకసంయోగ మొనరించి చిత్కళాన్యాస మొనరించినంతనే భౌతికశరీరము లింగశరీరముగ మాఱుటచే మంత్రవిశిష్టమగు మఱియొకజన్మ శిష్యునకు గలుగును – దీని ననుసరించియే శైవసంప్రదాయమున శిష్యులు- గురుహస్తజాతులమని వ్యవహరింపబడుచున్నారు.

153. జంగమలింగంబగు భ
    క్తుఁ గనిఁ బూజింపఁడేని గోటివిధమునన్
    లింగార్చన చేసిన వృథ
    జంగమ ముత్తమము గాగ స్థావరమునకున్.

జంగమలింగమనగా చరలింగము; జీవిరూపమున చరించు శివుడు - శివభక్తుడు.

220. గురుకృతశివదీక్ష మెయిన్
    విరహితమలదేహులగు పవిత్రులు భక్తుల్
    హరనిర్మాల్యము గుడుతురు
    శివశాస్త్రపురాణవచనసిద్ధాంతగతిన్.

ఇచట ప్రసాదస్థల వివరణ గలదు.

నాల్గవ పాదమున శివశాస్త్రపురాణవచనము లివి.

సీ. ఆది "రుద్రేణాత్మ మశ్నంతి రుద్రేణ
                పీతఁపిబంతి" "ప్రఖ్యాతి శ్రుతుల
    నన్నిగమాంతర" మతికిల్బిషంస్యా 'ద
                నర్పితం' బనెడు సిద్ధాంతములును
    నవికలసిద్ధాంతనివహోక్తి" లోభాన్న
                ధారయేత్త'ను శివధర్మములను
    శివధర్మశాస్త్రదృష్టిఁ బ్రసాద మేవ భో
                క్తవ్య"మను పురాణకాండములను
ఆ. సిద్ధమనుచు వేదసిద్ధాంతశాస్త్రపు
    రాణతతుల మలహరప్రసాద
    మహిమఁ దెలిపినట్టి మల్లికార్జున పండి
    తయ్యగారిఁ దలఁతు ననుదినెబు.

అనుభవసారము—9 పద్యము.

254. అంగాభ్యంతరవిధమున
నంగజహర గొలిచి ముఖ్యమగు బాహ్యవిధిన్
లింగాకృతి శివు గాంచని
వెంగలిమానవులకంటె వెడఁగులు గలదే.

శివుడు లింగస్వరూపుడు లింగార్చనామహిమ యనుభవసారమున నిట్లు వర్ణితమైనది.

చ. అనయముఁ బంచవింశతి మహావరమూర్తుల నీశ్వరాదులన్
దనరి నఘూర్తి మూర్తి ఘనతత్త్వసదాశివపంచకంబులన్
జననుత నూఱుకోట్లయుగసంఖ్యలఁ గొల్చిన నొందు తత్ఫలం
బనుపమలింగమూర్తి నిమిషార్థము గొల్చినఁ బొందు సమ్మతిన్.

పదములు - అర్థములు

అ హోమతి - (278) పాపబుద్ధి జతకడచు - (801) (215) అతగుడు 1 అను కీర్తించు (174) . అను దేహము - (150) - అన్నడు - (267) జఱి మెలువడు - (402) ఆలాపు ఉమ్ములు - -

... అవగా హనచేయు (.99) ఆదికర్త - (171) మొదటి సృష్టికర్త. ఆలరి ఎనకొను - దాఁటు; నిరాకరించు; నిర్లవ్యము చేయు దుర్మలుడు- ఈ పదమున కదియే తొలి ప్ర గము మిక్కిలి పొగడు – మాఱుదేహము అట్టివాడు, చూ, పీఠిక - మెడమీదినుండి క్రిందపడు- ఎటిమేళంగా మెడపై నుండు మాండపు పొర స్నానముచేయు. (264) దుశీలుడు. (290) (828) (446) పానపాత్ర; ఊష్మశబ్దభవము-ఉమ్ము- వేడి కెర నాతి సమీప నాతి కూర ప్రదేశము. సమానమగు. పుట:శివతత్వసారము.pdf/197 పుట:శివతత్వసారము.pdf/198 పుట:శివతత్వసారము.pdf/199 పుట:శివతత్వసారము.pdf/200 పుట:శివతత్వసారము.pdf/201 పుట:శివతత్వసారము.pdf/202 పుట:శివతత్వసారము.pdf/203 పుట:శివతత్వసారము.pdf/204 పుట:శివతత్వసారము.pdf/205

విలసద్భక్తిరసామృత
కవితాంగులదేహమెల్ల కాంత్యుజ్జ్వలమై
చెలువొందుచుండు రజతా
చలశంకరదివ్యమూర్తి సరణిని నభవా!

736


విమలతరభక్తిభావన
క్రమయుక్తిని బెరిగి హృదయకంజాతముకన్
అమరిన యన్నడు నెన్నడు
యమునికి వెఱవండు శేషహారాభరణా.

737


అవనిం దుర్లభమగు మా
నవజన్మం బెత్తి భక్తినయగతి సతమున్
శివు పూజంపని మనుజుని
భవమది వృథయగును భావభవసంహారా.

738


విదితశుభాశుభబోధా
స్పదుడగు మానవుడు హరుని పదభక్తిమెయిన్
ముదమునఁ జరింపకుండిన
గుదిగట్టిన పశువుసమము గోపతిగమనా.

739


శిష్టాచారాది మహా
వష్టంభుఁడైన తాను వారకగర్వా
విష్ణుడగునేని యాతడు
నిష్టపుశివభక్తి గాననేరడు రుద్రా.

740

కన్నడభాషలో ప్రాసనియమమేగాని యతినియమము లేదు. ఆభాషాసంప్రదాయము ననుసరించి, ఆప్రాసనియమముతో, తెలుగున యతినియమమును పాటించి పై యనువాదము నాంధ్రలోకమున కందించితిని - ప్రాజ్ఞులు పరిశీలింతురు గాక.

నిడుదవోలు వెంకటరావు

  1. దీనినే వ్యవహారములో 'పిండాకూడు' అని యందుము.