Jump to content

శాసనపద్యమంజరి/మొదటిభాగము

వికీసోర్స్ నుండి

శాసనప్రతిబింబము

పండరంగుని అద్దంకిశాసనము

శాసనపద్యమంజరి

1. అద్దంకి

శ. స. 770 ప్రాంతము.

(ఈశాసనము గుంటూరు మండలమునందు అద్దంకి గ్రామమున నొకపొలములో నున్నఱాతిమీఁద చెక్కబడియున్నది. శాసనము పైభాగము కొంతయు నడుగుభాగము కొంతయు శిథిల మైపోయినది. Epigraphia Indica Vol. XIX)

తరువోజ.

పట్టంబుగట్టిన ప్రథమంబు నేణ్డు
            బలగర్వం బొప్పంగ బైలేచి[1] సేన
పట్టంబు గటిఞ్చి[2] ప్రభుబణ్డరంగు[3]
            బఞ్చిన సమత్త[4] పడువతో బోయ
కొట్టంబు ల్వణ్ఱెంణ్ణు గొణి[5] వేంగి నాణ్టిం
            గొళల్చి[6] యాత్రి భువనాంకుశ బణ[7] నిల్పి
కట్టెపుదుర్గ్గంబు గడు బయల్సేసి
            కణ్డుకూ ర్బెజవాడ[8] గావిఞ్చె మెచ్చి.
పణ్డరంగు పరమమహేశ్వరుణ్డు ఆదిత్యభటారనికి[9] ఇచ్చిన భూమి
యెనుబొదివుడ్ల ఆడ్లపట్టు[10] నేల దమ్మవురంబున దమ్మువులు వీని రక్షిఞ్చినవారికి
అస్వమేధంబున పలంబు[11] అగు.

2. బెజవాడ

శ. స. 820 ప్రాంతము.

(ఈశాసనము బెజవాడ గ్రామమందు మల్లేశ్వరస్వామి యాలయములో నొకఱాతిమీఁద మూఁడుప్రక్కలను చెక్కఁబడియున్నది. Epigraphia Indica Vol. XV)

మధ్యాక్కర.

స్వస్తి నృపాంకుశాత్యన్తవత్సల సత్యత్రిణేత్ర
విస్తరశ్రీయుద్ధమల్లు ణ్డనవద్యవిఖ్యాతకీర్త్తి
ప్రస్తుత రాజాశ్రయుణ్డు ద్రిభువనాభరనుణ్డు సకల
వస్తుసమేతుణ్డు రాజసల్కి భూవల్లభుణ్డర్ర్త్తి[12]

1


పరగంగ బెజవాడ గొమరస్వామికి[13] భక్తుణ్డై గుడియు
నిరుపమమతి నృపధాము ణ్ణెత్తించ్చె నెగి దీర్చ్చె మఠంబు[14]
గొరగల్గా కొరు[15] లిన్దు విడిసి బృన్దంబు గొని యుణ్డువారు
... రిగాక యబ్బారణాసి వ్రచ్చిన పాపంబు గొణ్ఱు...

2


నెలయంగ నియ్యొట్టు ...స్సి మలినురై విడిసిన వ్రోల[16]
గలతానపతులును రాజు పట్టంబు గట్టినపతియు
నలియం బయ్వారల[17] వెల్వఱించిన నశ్వమేధంబు
ఫలం బు[18]పేక్షించిన లింగం బఱిసిన[19] పాపంబు దమకు

3

జననుత చేబ్ఱోలనుణ్డి బెజవాడ జాత్రకు[20] వచ్చి
త్రిణయనుసుతు ణ్డొణ్డుసోటు మెచ్చక తివిరి యిన్నెలవ
యనఘుణ్డు సేకొని యిన్దు ప్రత్యక్ష బయన్న నిచ్చ[21]
గని మల్లణ్డెత్తించె గుడియు మఠంబునుం[22] గార్త్తికేయునకు.

4


దీనిం జేబ్రోలు యేలెడు (వా) రతిరం బేలు (వా) రోణ్డుసోటి ... రగ(లు)ను బెట్టు
వేరుగను జ(ను)యీస్థితి సేకొణి కాచు (వా)ర....న్దారు నిల్పినవారు (స్థి)తిడప్పి యఱిపుట
వా(పం)బుగాన.

5


మధ్యాక్కర.

రమనతో[23] బెజవాడకెల్ల బెడంగును రశ్రీయుంగాను
న్దమతాత మల్లపరాజు వేరెయు దానుం గట్టించెం
గ్రమమున[24] దానిక కలశ బిడ్డటు[25] గా మొగమాడు
నమరంగ శ్రీయుద్ధమల్లు ణ్డెత్తించె నమితతేజుండు
తనధర్మ్ము వొడంబడి కాచునృపులకంన్ద —

6

(అసంపూర్తి)

శాసనప్రతిబింబము

యుద్ధమల్లుని బెజవాడ శాసనము

3. ద్రాక్షారామం

శ. స. 987

(ఈశాసనము గోదావరిమండలములో ద్రాక్షారామం గ్రామమందుభీమేశ్వరాలయమున నొకఱాతిపలకమీఁద చెక్కఁబడియున్నది. Epigraphia Indica Vol. IV. NO. 1007)

శ్లో။

శాకే సంవత్సరేషుమున్ని (వ)సునిధిగే రాజమార్త్తణ్డభూXX
త్పు(త్రీ)సా...నేత్రీకనకరచితం కల్పభూజాతపుష్పం
ప్రాదాద్భీమేశ్వరాయ వ్యదిశ దథ సదా దీప్యదాచంద్రతారంxx
దీపం రౌప్యం చ పాత్రం బిససదృశ భుజా రేవి దేవీతనూజXX


సీ.

శ్రీవిష్ణువర్ధనభూవిభుదయ భూమి
            దేవిం బోల్ రేవల దేవి కనిన
సోమలదేవి గుణారామ[26] జగదేక
            సున్దరి మత్తేభ మందగమన
దొల్లి భీమేశ్వరవల్లభునకు సిత
            మణిబనధ మిచ్చె సన్మణియుతముగ
నురువిచ్చె గంగనా బరువడి వినివారిం[27]
            బురుడించునట్ల[28] సరసిజాస్య
గనకరచితరుచికరకల్పావనీరుహ
కుసుమ మిచ్చెం దనకు నసము వెరుగ
వెణ్డిమణ్డతో నఖణ్డితద్యుతి దీప
మమరనిచ్చె విమలకమలనేత్రి.

ఆ.

సకలవసుమతీశమకుటలసద్రత్న
కిరణరుచివిరాజితచరను ణ్డయిన
నిజభుజప్రధాని బెజయిత దేవని
కూంతుసరియ[29] పోల్పం గాంత లెందు

—లిఖితం పెద్దనాచార్య్యః

4. దీర్ఘాసి

శ. స. 997

(ఈపద్యములు గంజాముమండలములో దీర్ఘాసి యను గ్రామమున “దుర్గమెట్ట”మీఁద నొకఱాతిపలకమీఁద చెక్కఁబడియున్న శాసనము చివర నున్నవి. శాసనపూర్వభాగ మంతయు సంస్కృతమున నున్నది. Epigraphia Indica Vol. IV)

సీ.

శ్రీశకునేణ్లు[30] భూపతిపై శైల
            నన్దాబ్జ భవసంఖ్య నొంది వేంగి
దేశంబు గిమిడియ గోసల గిడ్రిసింగి
            దేశంబు మఱియొడ్డ దేశ మనంగ
జనిన హూపాలుర ననినొచ్చె[31] చలమర్త్తి
            గణ్డణ్డై నెగడిన మణ్డలికుణ్డు
భూసుర వంశుణ్డు వాసవనిభభోగి
            బణపతి సౌజన్యగుణయుతుణ్డు
దీర్ఘాసి భగవతిదేవి దేవాలయ
            మున ముందటం గడుఘనతరముగ
మణ్డప మెత్తించె భణ్డనవిజయుణ్డు
            గణ్డగోపాలు డఖణ్డకీర్త్తిన్
దీనియ వెట్టె నద్దేవికి నవ్వేలం
            దనమనోవల్లభి వనజనేత్రి
దీవియ వెట్టెం బద్మావతియును క్షోణి
            నశశులు[32] గలయంతకును ముదమున

గగనభూమిచంద్రఖరకరోదశిఖ
మారుతాత్మమూర్త్తి మహిషమధన
యిష్టపూర్త్త[33] ఫలము లెల్లకాలంబును
మెచ్చుతోడం దమకు నిచ్చుచుణ్డ.

5. అమరావతి

శ. స. 1030

(ఈ శాసనము గుంటూరుమండలములో అమరావతీ గ్రామమందు అమరేశ్వరస్వామియాలయమునందు పెద్దమండపము దక్షిణపుగోడలోఁ గట్టఁబడియున్న యొకఱాతిమీఁద చెక్కబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 240.)

ఉ.

శ్రీరమణియ్యు ణ్డర్ద్ధిజన సేవ్యుణ్డు భవ్యుణ్ణు దివ్యమూర్త్తి శౌ
ర్య్యారభ(టీధుతా?)తినిశితాశివిదారితశత్రువర్గ్గుణ్డా
ధారిత బన్ధుమిత్ర (జ)న తామణి గొంక్కనరేంద్రమంత్రి(వ్రో)
త్సారితలోభ మోహ వ్రితసత్వుణ్డు (వ్రోలణ్డు) ధన్యు ణ్డున్నతిని.

1


క.

శ్రీరాజవ్రోలిశాసను
ణ్డా రాధితనీలకణ్ఠు ణ్డ(భి)నవమదనా
కారుణ్డు వ్రోలణ్డు విబుధా
ధారుణ్డనం బొన్నరాంబతనయుణ్డు నెగడెను.

2


క.

ఆతనివల్లభి గొమ్మమ
మాతంగ్గమరాలయాన మనసిజురతివి
ఖ్యాతయశోనిధి గొంక్కమ
హీతలపతి కరుణ లక్ష్మి నెంత్తయు వెలసెను.

3


ఉ.

చారువిశుద్ధవంశదధిసాగ(ర)సంభవి తేంద్దులేఖ ల
క్ష్మీరుచితాంగ్గ(భాతి) నుపమింప్ప సతీత్వగుణ ప్రసిద్ధిమెయి[34]
నారయ సెజ్జప్రోలనికులాంగన గొమ్మమ మేలు సీతకును
వారిజబన్ధుకాంత్తకును వాసవుకాంత్తకు లక్ష్మిదేవికిని.

4

ఉ.

అంబరమూర్త్త్విఖేందుమితమై సక[35]వత్సరములు సనంగ్గ భూ
మ్యంబుదివాకరాత్మ కల యంత్తకు భక్తి నఖణ్డమైన దీ
పం బమరేశ్వరార్ద్ధముగ బాలకి లోలవిశాలనేత్రి గొ
మ్మాంబిక నిల్పె భక్తిమతియై యెఱియాంబతనూజ ప్రీతితోను.

5


స్వస్తి సమస్త ప్రశస్తిసహితం శ్రీమన్మహామణ్డలేశ్వర కులోత్తుంగ చోడగొంక్క
రాజుల దివ్యశ్రీపాదపద్మోపజీవియైన సెజ్జప్రోలెనాయకుని పెణ్డ్లము విణ్ఠల కొమ్మాసాని
శ్రీమదమరేశ్వరమహాదేవర కాచంద్రార్క్కతార మఖణ్డవర్త్తి దీపంబున కిచ్చిన
గొఱియలు 55.

(ఇత్యాది)

6. చేబ్రోలు

శ. స 1040.

(ఈశాసనము గుంటూరుమండలములో చేబ్రోలుగ్రామమందు తురకవీథిలోఁ బడియున్న రాతిమీఁద చెక్కబడి యున్నది. South Indian Inscriptions Vol. VI. No. 117.)

సీ.

శకమహీపాలక సంవ(త్సరంబులు
            గ)గనాబ్ధివి(య)దిందు(గణ)నం దనర
వడి ... ... ... స్వరంబున మహా
            ద్వాద(శి)తిథి నుదితోదయుణ్డు
... ... ... సూద్ర కప్రభృతులతోడి
            కులమువాడను కలితనమువాడు
మ(ణ్డ)భూపాలకు మహనీయ్య[36]సాంబ్రాజ్య[37]
            రాజ్యాభివృద్ధిపరా(య)నుండు సూరం
డ(తులశౌర్య్య) సారుణ్డు సేంబ్రోల
బర్హివాహనునకు భక్తి వెల(య)
... ... ... నఖణ్డదీపంబు నిల్పె నా
చంద్రతారకముగ రుంద్రయశుణ్డు.

1

పుట:శాసనపద్యమంజరి.pdf/38 పుట:శాసనపద్యమంజరి.pdf/39 పుట:శాసనపద్యమంజరి.pdf/40 పుట:శాసనపద్యమంజరి.pdf/41 పుట:శాసనపద్యమంజరి.pdf/42 పుట:శాసనపద్యమంజరి.pdf/43 పుట:శాసనపద్యమంజరి.pdf/44 పుట:శాసనపద్యమంజరి.pdf/45 పుట:శాసనపద్యమంజరి.pdf/46 పుట:శాసనపద్యమంజరి.pdf/47 పుట:శాసనపద్యమంజరి.pdf/48 పుట:శాసనపద్యమంజరి.pdf/49 పుట:శాసనపద్యమంజరి.pdf/50 పుట:శాసనపద్యమంజరి.pdf/51 పుట:శాసనపద్యమంజరి.pdf/52 పుట:శాసనపద్యమంజరి.pdf/53 పుట:శాసనపద్యమంజరి.pdf/54 పుట:శాసనపద్యమంజరి.pdf/55 పుట:శాసనపద్యమంజరి.pdf/56 పుట:శాసనపద్యమంజరి.pdf/57 పుట:శాసనపద్యమంజరి.pdf/58 పుట:శాసనపద్యమంజరి.pdf/59 పుట:శాసనపద్యమంజరి.pdf/60 పుట:శాసనపద్యమంజరి.pdf/61 పుట:శాసనపద్యమంజరి.pdf/62 పుట:శాసనపద్యమంజరి.pdf/63 పుట:శాసనపద్యమంజరి.pdf/64 పుట:శాసనపద్యమంజరి.pdf/65 పుట:శాసనపద్యమంజరి.pdf/66 పుట:శాసనపద్యమంజరి.pdf/67 పుట:శాసనపద్యమంజరి.pdf/68 పుట:శాసనపద్యమంజరి.pdf/69 పుట:శాసనపద్యమంజరి.pdf/70 పుట:శాసనపద్యమంజరి.pdf/71 పుట:శాసనపద్యమంజరి.pdf/72 పుట:శాసనపద్యమంజరి.pdf/73 పుట:శాసనపద్యమంజరి.pdf/74 పుట:శాసనపద్యమంజరి.pdf/75 పుట:శాసనపద్యమంజరి.pdf/76 పుట:శాసనపద్యమంజరి.pdf/77 పుట:శాసనపద్యమంజరి.pdf/78 పుట:శాసనపద్యమంజరి.pdf/79 పుట:శాసనపద్యమంజరి.pdf/80 పుట:శాసనపద్యమంజరి.pdf/81 పుట:శాసనపద్యమంజరి.pdf/82 పుట:శాసనపద్యమంజరి.pdf/83 పుట:శాసనపద్యమంజరి.pdf/84 పుట:శాసనపద్యమంజరి.pdf/85 పుట:శాసనపద్యమంజరి.pdf/86 పుట:శాసనపద్యమంజరి.pdf/87 పుట:శాసనపద్యమంజరి.pdf/88 పుట:శాసనపద్యమంజరి.pdf/89 పుట:శాసనపద్యమంజరి.pdf/90 పుట:శాసనపద్యమంజరి.pdf/91 పుట:శాసనపద్యమంజరి.pdf/92 పుట:శాసనపద్యమంజరి.pdf/93 పుట:శాసనపద్యమంజరి.pdf/94 పుట:శాసనపద్యమంజరి.pdf/95 పుట:శాసనపద్యమంజరి.pdf/96 పుట:శాసనపద్యమంజరి.pdf/97 పుట:శాసనపద్యమంజరి.pdf/98 పుట:శాసనపద్యమంజరి.pdf/99 పుట:శాసనపద్యమంజరి.pdf/100 పుట:శాసనపద్యమంజరి.pdf/101 పుట:శాసనపద్యమంజరి.pdf/102 పుట:శాసనపద్యమంజరి.pdf/103 పుట:శాసనపద్యమంజరి.pdf/104 పుట:శాసనపద్యమంజరి.pdf/105 పుట:శాసనపద్యమంజరి.pdf/106 పుట:శాసనపద్యమంజరి.pdf/107 పుట:శాసనపద్యమంజరి.pdf/108 పుట:శాసనపద్యమంజరి.pdf/109 పుట:శాసనపద్యమంజరి.pdf/110 పుట:శాసనపద్యమంజరి.pdf/111 పుట:శాసనపద్యమంజరి.pdf/112 పుట:శాసనపద్యమంజరి.pdf/113 పుట:శాసనపద్యమంజరి.pdf/114 పుట:శాసనపద్యమంజరి.pdf/115 పుట:శాసనపద్యమంజరి.pdf/116 పుట:శాసనపద్యమంజరి.pdf/117 పుట:శాసనపద్యమంజరి.pdf/118 పుట:శాసనపద్యమంజరి.pdf/119 పుట:శాసనపద్యమంజరి.pdf/120 పుట:శాసనపద్యమంజరి.pdf/121 పుట:శాసనపద్యమంజరి.pdf/122 పుట:శాసనపద్యమంజరి.pdf/123 పుట:శాసనపద్యమంజరి.pdf/124 పుట:శాసనపద్యమంజరి.pdf/125 పుట:శాసనపద్యమంజరి.pdf/126 పుట:శాసనపద్యమంజరి.pdf/127 పుట:శాసనపద్యమంజరి.pdf/128 పుట:శాసనపద్యమంజరి.pdf/129 పుట:శాసనపద్యమంజరి.pdf/130

నంబికకు మూలంగూరమ కఖిలజనని.
కర్థిం గట్టించ్చె భువనమోహనముగాంగ
సమధికోన్నతానభం[38]కషంబు లైన
గుడియుం బ్రాకారవలయంబు గోపురములు.

1

—————

69

శ. స. 1300

(ఇది కడపమండలమునందలి తాళ్ళప్రొద్దుటూరుగ్రామమందు ఆంజనేయస్వామి యాలయమునకుఁ దూర్పుగా నున్నఱాతిమీఁది శాసనము. శాసనకాలము చెప్పఁబడలేదు. లిపినిబట్టి శ.స. 1300 ప్రాంతముదని చెప్పవచ్చును)

చ.

ఇల జగతాపిఖడ్గమున నీల్గినవీరు(ణి)[39] రంభ వుచ్చుకోం
దలంచినం దూర్ప్పుదిక్కున ఘ్రితాచి గిసుక్కునం దుమ్మె నంతలో
పలం జనుదెంచ్చె వా(ని)కులభామిని (ని)౦గిపథంబునందు ని
ష్ఫలతకు రంభయు న్వెలఱువాఱిన నవ్వి(రి) దోడికామినులు.

1


చ.

గురుమరణోచితం బయినకోపమునం జమదజ్ఞిజుండు[40] ము
న్నిరువదియొక్కమాంటు ధరణీశునెల్లను జంపి యమ్మహా
పురుషుండు మర్త్యలోకమునం బుట్టి వధింపంగం బాపమంచు వి
స్తరముగం దాలె[41] గాక జగతాపి దలంచిన నాండ చంపడే.

2


సీ.

తురగచ(ర్)మంబునం గరమొప్ప నెఱికింగాం
            బసరించి దానన ముసుంగువెట్టి
తెలుపెక్కం గఱివోవ బుళగినవునుక మిం
            చిన వెండికోరంగాం జేతంబట్టి
ఏనుక[42]తలలలో నెసగిన ముత్తియం
            బులు గుంకుమాక్షతంబులుగం బోసి
వేతాళఢాకినీభూతంబులార మీ
            కును ముంజికం బని కుడువంజెప్పి

పుట:శాసనపద్యమంజరి.pdf/133 పుట:శాసనపద్యమంజరి.pdf/134 పుట:శాసనపద్యమంజరి.pdf/135 పుట:శాసనపద్యమంజరి.pdf/136 పుట:శాసనపద్యమంజరి.pdf/137 పుట:శాసనపద్యమంజరి.pdf/138 పుట:శాసనపద్యమంజరి.pdf/139 పుట:శాసనపద్యమంజరి.pdf/140 పుట:శాసనపద్యమంజరి.pdf/141 పుట:శాసనపద్యమంజరి.pdf/142 పుట:శాసనపద్యమంజరి.pdf/143 పుట:శాసనపద్యమంజరి.pdf/144 పుట:శాసనపద్యమంజరి.pdf/145 పుట:శాసనపద్యమంజరి.pdf/146 పుట:శాసనపద్యమంజరి.pdf/147 పుట:శాసనపద్యమంజరి.pdf/148 పుట:శాసనపద్యమంజరి.pdf/149 పుట:శాసనపద్యమంజరి.pdf/150 పుట:శాసనపద్యమంజరి.pdf/151 పుట:శాసనపద్యమంజరి.pdf/152 పుట:శాసనపద్యమంజరి.pdf/153 పుట:శాసనపద్యమంజరి.pdf/154 పుట:శాసనపద్యమంజరి.pdf/155 పుట:శాసనపద్యమంజరి.pdf/156 పుట:శాసనపద్యమంజరి.pdf/157 పుట:శాసనపద్యమంజరి.pdf/158 పుట:శాసనపద్యమంజరి.pdf/159

  1. బొప్పంగం బై లేచి
  2. గట్టిఞ్చి
  3. ప్రభుం బణ్డరంగుం
  4. సామంత
  5. కొట్టము ల్పణ్ఱెణ్డు గొని
  6. గోళచి
  7. త్రిభువనాంకుశమున
  8. కందుకూ ర్బెజవాడ
  9. భట్టారకునకు
  10. వుట్లుళ్లపట్టు
  11. అశ్వమేధంబున ఫలంబు
  12. వల్లభుణ్డర్థి
  13. గోమరసామికి
  14. మఠము
  15. ఇక్కడ “గొరగల్గాక” అనుచో లకారము తేల్చి పలుకవలయును.
  16. విడిసినం బ్రోలం
  17. నలియంబై వారల
  18. ఫలము
  19. మఱిసిన
  20. జాతరకు - అనునది సాధురూపము
  21. ఇందుం బ్రత్యక్షమై యున్ననిచ్చం
  22. మఠమును
  23. రమణతో
  24. గ్రమమున
  25. మిడ్డట్లు
  26. ఇచట యతి తప్పినది. శ్యామలదేవి అనిన సరిపోవును గాని, సీసమందెల్లడఁ బ్రాసయతియే కనఁబడుచుండుటచే నాపాఠము కవిసమ్మతము కాదేమో యను సందేహము కల్గుచున్నది.
  27. వినువారిం-అని యుండనోపు.
  28. నట్టుల
  29. సరియగునా-అని అర్ధము.
  30. నేణ్డులు
  31. నోచ్చెన్
  32. క్షోణి యినశశుల్
  33. యిష్టాపూర్త్త ఫలములు అనునది సాధురూపము.
  34. మై
  35. శక
  36. మహానీయ
  37. సామ్రాజ్య
  38. సమధికోన్నతి నభ్రం
  39. వీరుని
  40. గురుమరణోదితం బయిన కోపమునం జమదగ్నిజుండు
  41. దాళెం
  42. ఏనిక