శశికళ/సూర్యసుత
Appearance
< శశికళ
సూర్యసుత
సూర్య సుతవే శశికళా
చంద్ర బాలవు శశికళా
కుసుమమాలల
కోమలాంగీ
మిసిమి వన్నెల
మించు బాలా !
సూర్యసుత వీవే
శశికళ
సోమ సుత వీవే !
అమృత విలసిత
విమల గాత్రీ
కొమరు ప్రాయవు
కొమ్మ ముద్దులగుమ్మ వీవే
సూర్య సుత వీవే
శశికళ
సోమ సుత వీవే !
నిత్య వికసిత
నృత్య మూర్తీ
ముత్యముల డాల్
మోహమూర్తీ
సూర్య సుత వీవే
శశికళ
సోమ సుత వీవే !
నీవటే నా
ప్రణయ నిధివీ
నీవటే నా
తపస్సిద్ధివి
సూర్య సుత వీవే
శశికళ
సోమ సుత వీవే !