శశికళ/వర ప్రదానము

వికీసోర్స్ నుండి

వర ప్రదానము


దివ్యభూలకెటకొ తేల్చుకొనిపోతివే !
దీనజీవినినన్ను దివ్యుణ్ణిచేసితే !

దేహమే శల్యమై
దినదినము కృశియించి

              నీవుదర్శనమీని నిముసమొకయుగముగా
              తోవ తెలియని అంధజీవినై కుందితిని
               
                      దివ్యభూముల కెటకొ తేల్చుకొని పోతివే !
                      దీనజీవిని నన్ను దివ్యుణ్ణిచేసితే !

నీకె గురువును నేను
శ్రీకమల పరిమళా
          
          దేశికుడ ప్రియుడనై ఆశించి భాషించి
          దీక్షలో శిల్పవిన్యాస పులకితుడనై

                    దేవి నీరాకకై తీవ్ర వేదనపడితి !

ఏ ముహూర్తపు బలిమొ
ఏ పూర్వ పుణ్యమో

అమృత వాహినిరీతి అవతరించితివీవు
ఆనందరూపవై అధివసిస్తివి మ్రోల

          దివ్యభూముల కెటకొ తేల్చుకొని పోతివే !
          దీనజీవిని నన్ను దివ్యుణ్ణిచేసితే !

హృదయాన మోముంచి ఒదిగితిని ఒడిలోన
కదియించి కౌగిటను నుదిటపై చుంబించి

          "ఓప్రభూ నీవిద్య
          నా ప్రణయ" మన్నావు
          సౌరభావృత హస్త
          సంస్పర్శ ఓషధై

నూత్న శక్తినిపొంది నూత్న జీవమునంది
యత్న కార్యోన్ముఖుడనై నిలిచితేరాణి!

          దివ్యభూముల కెటకొ తేల్చుకొనిపోతివే !
          దీనజీవిని నన్ను దివ్యుణ్ణిచేసితే !