Jump to content

శశికళ/ఈనిశిని

వికీసోర్స్ నుండి

ఈనిశిని

 
బ్రతుకంతా నిరీక్షణము
మతి అంతయు వీక్షణమై

          ఈ నిశిలో గాటపుతమి
          నేను వేచియుంటి నొంట

ఈనిశి ఒక సుముహూర్తము
గానము ఈ నిశ్ఛలతయె

          ఈ కుటీర ప్రాంగణమున
          చీకటి చెలిగా నిలచితి

ఈ నిశిలో రొదలు లేవు
ఈ నిశిలో సొదలు రావు

          వేచియుంటి ఎవరికొరకొ
          కాచియుంటి ఏ ఘటనకొ

ఈ నిశిలో నడికి రేయి
ఎవరో నాతోట తొచ్చి
పూ మొగ్గల విరియచేసి
ముంగిలో అడుగులిడిరి

           తూరుపు మల నెలతోచెను
           తొగ కన్నెలు వగలూరిరి.