శశికళ/ఆవెనుక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆవెనుక

చీకటి వెనుకే రాకా జ్యోత్స్నలు
నీ కనురెప్పల నీలిమ వెనుకే

           వికసిత నిర్మల విద్యు ద్రోచుల
           పకపక నవ్వుచు పాపలు వెలుగును

కాంతి గర్భమున కలవు వర్ణములు
కనుపాపలలో కాంతుల లోతులు

           రంగు రంగులై రాగము లీనుచు
           శృంగారించును చిత్రము లెన్నో

వర్ణ గభీరము పదముల లోనే
పూర్ణ రూపమై పొలుచును భావము

           చిత్ర రీతులలో చెన్ను మీరునే
           పత్రరేఖ నీ ప్రణయము దేవీ !