శతావధానసారము/పిఠాపురము

వికీసోర్స్ నుండి


వాడకట్టు బుల్లి రాజు జాతక మును గూర్చి


మ॥ శనిమూటన్ శశి రెంటభార్గ సబుధుల్ షష్ణంబునన్ సప్త నుం
బున రాహూష్ణకరుల్ పదింటగురుఁడున్ భూపు త్రుఁగు ద్వాదశ
మ్మున మెప్పారఁగ వృశ్చికంబునను దాఁ బుట్టెన్ దగన్ వాడక
ట్టనువంశమున బుల్లి రాజు తనయుం డై కామమాం బాఖ్యకున్ .

శ్రీ శ్రీ శ్రీ


దుర్ము ఖనం|| మార్గశీర్ష ములో పిఠాపురము లో వాడ్రేవు వారి లో
గిటిలో జరగినయవధానములో జెప్పిన 70 పద్యములలో కొన్ని పద్యములు

పార్థసారధి, పృద్వీవృత్తమ్.


కశాంకకరతలే వహ న్న పిచ చోదయణ సత్వరం
తురంగ మచయం జయం సహకిరీటినా ప్రస్తు నన్
రణే ఽ తనుత సారథిత్వకృతి మాదరా ద్యః పుమాన్
సమా మవతు దేవకీర చితపూర్వపుణ్యోదయః1

చర్ల బ్రహయశాస్త్రులుగారు

.

సీ!| బాల్యములో సన పండితుల్ మెచ్చంగసఖలవిద్యలు కాశి నభ్యసించెఁ
దరువాత దేశాన కరు దేంచి థనళేశ్వకమ్మున సన్న సతమ్ము వెట్టె
నీదిగాక విద్యార్థు లెందఱినో పండితులఁ జేసి దాన సంస్తుతులు
గనియె! నదియట్టులుండ ద్రవ్యము లేని తన శిష్యు లేండటి కేనిఁ బెండ్లిండ్లు చేసె
తేః గీ! పొట్ట పోషించి కొనియెడిబుధులు పెక్కు
కలకు గాని జగమునఁ గల రెయిట్టి
పండితు; లటంచు నుతియింపఁ బ్రబలె నౌర!
చర్ల వంశ్యుండు బాహయశాస్త్రి ఘనుఁడు2

రామపట్టాభి షేకము ప్రహర్షి ణీవృత్తమ్,


సోదర్యైర్డు నిఖింపి ప్రహృష్టచిత్తెస్సుగీ న ప్రభృతిభి రుత్త మైః కపీ వైః
యుక్త శ్రీ రఘుకుల నాయక స్సభాగ్యో రాజ్య శ్రీవిలసితపీఠ మారురోహ

తిరుపతి వేంకటేశ్వరుడు


<poem>సీ|| కాచినాఁడవుక దాకరిరాజు ప్రాణమ్ముకఠినక్రమును జక్రము సం! ద్రుంచి
(ప్రోచినాఁడవుక దాపూర్వ దైతేయ డింభకునివేవేగఁగంబమునఁ బొడమి
దాచినాఁడ వుక దానా ద్రౌపదీ మానము సభలోసం బెక్కువ స్త్రమ్ములొసగి
చూచినాఁడవుకదాసోదరున్ విడనాడి శరణుజొచ్చినవిభీషణుని బ్రీతి

తే.గీ|| ననుచు నిను, జేరినార మత్యాశ చేత
మమ్మురక్షించుచెంతయమ్మక్క నీకు
సరనతిరుపతి వేంక టేశ్వరకవీంద్ర
శరణ తిరుపతి వేంక టేశ్వర! నమోస్తు4

కుంతీమాధవుఁడు.


మ|| స్థిరభక్తిన్నుతియింతు నెమ్మ దిని గుంతీమాధవ శ్రీధవున్
జరణద్వంద్వమునన్ శిరంబునిచి వేసారుల్ నతు ల్ సల్పుచున్
గరుణాసాగర కావవే! సమజగత్కళ్యాణ రక్షింపవే
పరమోదార యనుగ్ర హింపు మనుచున్ బల్మారువా క్రుచ్చుదున్ 5. .

అమర, భ్రమర, సమర, కొమర, అను పదములు వచ్చునట్లు చెప్పుట
మధు కైటభయుద్ధము


చ|| కొమ రలరంగ నెంతయును గోర్కె దలిర్ప మనోజసంగ ర
భ్రమ రహిమీఱ రక్కసులు పద్మ దళా కణునితోడఁ జేయు నా
సమరము మాని దేవిని వెసన్ గొన నెంచి పరాంబమోము పై
నమర నిగుడ్ప సాగిరి కటాక్షములన్ జెల రేగి మంటికి? 6

యౌవన ప్రారుర్భావము శార్దూలవిక్రీడితమ్


వక్షోజౌ లికుచోపమా ప్రతిపదం వృద్ధ్య న్ముభౌదృష్టయ
స్సొరంసార మధీయతే ప్రతికలం చారుత్వ వక్రత్వయోః
మధ్యం కార్శ్య ము పై తి గచ్ఛతి గతి ర్మాంద్యం విలాసోదయా
నావిందంతి వచాంసి నీరజదృశ స్తారుణ్య బాల్యాంతరే,7


విప్రలంభము మందాక్రాంతావృత్తమ్.


తౌ వక్షోజౌతదపి వదనం తాదృశా దృష్టి పాతా
స్త ద్వై యానం, సచ కచభర స్తాదృశ శ్రోణి భారః
ఇత్యంగా నా మసుకల మపిస్ఫూర్తిమాలోకమానః
కాలం నిన్యే ప్రియ సహచరీవిప్రయో గేణ కశ్చిత్8

రంభారావణసం వాదము.


చ|| పలికితి వీవు నొడలను బట్టకు నన్నని, వార కాంతకున్
గలుగునె యిట్టి భేదములు గంగొను తండ్రియుఁ బుత్రుఁడు గ్రమ
మ్మలరఁగఁ గూడి యొక్క నదియందునఁ గ్రుంకుట లేదా? యేలయీ
చల, మధరామృతం బి ఫుడొసంగి ననున్ దయఁ జూడు కోమలీ.9

కుమా గలింగేశ్వరుఁడు ప్రహర్షి ణీవృత్తమ్

.

భక్తానా మభిమత దాయినం మహాంతం
ధ్యాయామో మనసి సదా కుమారలింగం
నీరేజాసన ముఖ దేవతా వతంసా
యన్నామ ప్రతికల మాదరాజ్జపంతి. 10

పరకీయావిషయిక యోజన.


మ||మితికాలం - బరు దెంచునే చెలియు నా మేలెంచి కీలెంచునే
ధృతి పూసన్, సమకట్టునే యితరసం దేహంబు పోకార్చునే
పతి గ్రామంతర మేగునే. యితర నిర్భంధమ్ము లేకుండునే
కుతుక మ్ముల్ నెఱువేఱునే? ప్రియసఖా! కోర్కుల్ తుదల్ ముట్టునే11

ప్రసంగవశమునఁ జెప్పినది.


చ|| ఇతరకవుల్ ప్రయాసపడి యెంచి రచించిననూటి కెన్ని పె
ద్దతనము గాంచి చిత్తమునుదంపును నో మవధానసంగత
స్థితిగని యాశుగా రచన చేసినపద్య ములందుఁ జూచినన్
శతమునకన్ని పద్యములు చక్కఁగ నుండు నసంశయముగన్.12
హేమలంబి సం||చైత్రమాసములో గుంటూరులో జరగిన య
వధానము లోని 30 పద్యములలోఁ గొన్ని పద్యములు.