వ్యాసావళి/సంపాదకీయ భూమిక
________________
సంపొదకీయ భూమిక | శ్రీ రామమూర్తిపంతులు గారు వ్యావహారిక భాషను పునఃప్రతిష్ఠితము చేయడానికి సునూరు పాతిక సంవత్సరములనుంచి చేస్తూన్న వాదములో ప్రధానముగా నాలుగు మార్గములు గోచరిస్తున్నవి. భాషాతత్వ ప్రదర్శనపూర్వకముగా ప్రపంచములోని ఇతర భాషా వాజ్మయముల చరిత్రనూలున్ను వాటితోపోల్చి ఆంధ్రభాషా వాజ్మయముల చరిత్రములను బోధించి తక్కిన భాషలవలె నే తెలుగుకూడా నానాటికి మారుగూ వచ్చినదనీ, ఆయా కాలముల కవులు తమనాడు శిష్ట వ్యవహార సిద్దమయిన భాషను కావ్యాలలో ప్రయోగిస్తూవచ్చి నాననీ, నేటి రచయితలు కూడా ఈ శిష్టాపొర మే పాటించి వ్యావహారిక భాషలో గ్రంథములు నా స్తే భాషా ప్రయోజనము చక్కగా నే వేరుతుందనీ, మోటిమాటకూ చేతి వ్రాతకూ సామరస్యము కుదిరి ఒక దాని కొకటి పోషకముగా ఉన్నప్పుడే వాజ్మయములోనీ భాష సహజముగానూ, సళముగానూ, సుబోధక వరు గానూ పరమ ప్రయోజనకారిగానూ ఉంటుందనీ నిరూపించడము ఒక మాగ్గము.
- వ్యావహారిక భాషను బహిష్కరించి గ్రాంథికాంధ్రమును దాని స్థాన ములో నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉన్న వారు ప్రాచీన తాళపత్ర గ్రంథ ములలో ఉన్న లౌకిక భాషను ఎట్లు(గ్రాంథికీకరణము చేనీ కూటకరణ దోష మునకు పాల్పడి భాషను అపొగమయిన అనర్గము కలుగ జేసీ నారీగా ఋజువు చేసి పూర్వులు వ్రాసిన పురాణ (వచన) ములూ, లక్షణ గ్రంథమాలూ, న్యాఖ్యాన సలూ, టీక లూ, వివిధశాస్త్ర గ్రంథములూ, దేశచరిత్రపకులూ, జానపదవృత్తాంతములూ, వార్తాపత్రికలూ, శాసనములూ, కథలూ, బడి పుస్తక ములూ మొదలయిన అన్ని విధముల రచనల లోనూ వచనము వ్యావ హారిక భాషలో నే ఉన్నదని నిదర్శనపూర్వకముగా సిద్ధాంతీకరించి, ఏ భాషలోనయినా ఇదే నిజచుయిన వచనరచనా సంప్రదాయమని నిరూపించ డము రెండోది.
గ్రాంథిక భాష' అని మన పండితులు వ్యవహరించేదాని స్వరూపము ఇదమిద్ధమని నిర్ణయించడానికి వల్ల పడదనీ, మన వ్యాకరణములు పరస్పర విరుద్ద స-లు గానూ, అసమగ్రములు గానూ ఉండడమువల్ల ఏది తప్పో ఏది ________________
ii ఒప్పో నిర్ధారణ చేయడము దుష్కరమనీ, ఒక పండితుడీకి లాహ్య కుయిన ప్రయోగం ఇంకొకరి మతములో అగ్రాహ్యమనీ, ఒక మహామహోపాధ్యా యుల గ్రంథాలలో ఇంట్లో మహామహోపాధ్యాయుల వారికి మేన నేల తప్పుల కోనవస్తూ ఉన్న వనీ, గాంథిక భాషలో నిర్దుష్టము గా వ్రాసిన గ్రంథము మచ్చుకి ఒక టి అయినా లేదనీ, గాంథిక భాష పండిత ప్రకాం డులకయినా సాధ్యపడక ఇంత ఆవ్యవస్థముగా ఉన్నదనీ ప్రాచీన భాషలో శబ్దస్వరూపమూ శబ్దార్థమూ నిర్ణయించడమే బహు కష్టము గా ఉన్నందు వల్ల ఆభాషలో స్వతంత్రరచన సాగించడము ఆసంభవమనీ నిరూపించడ ను మూడో మార్గము. " | ప్రాచీనకవుల కావ్యములన్నీ సమగముగా పరిశీలించకపోవడము వల్ల వ్యాకరణకర్తలూ, కోశకారులూ, పండితులు తప్పులు గా భావించి లక్షణవిరుద్ధములనీ గ్రామ్యములనీ నిందించిన రూపములు వందలకొలదిగా కవుల కావ్యములలో ప్రయు కములై ఉన్న వనీ, వ్యాకరణము ప్రయోగ "మూలము కావడమువల్ల కవి ప్రయోగ ము లక్ష్మణముకంటె బలవ త్తర మైనదనీ, కవులు ప్రయోగించిన రూపములు లక్షణములో చెప్పకపోతే లక్షణమే ఆసమగ్రమూ దుష్టమూ అవుతుంది కాని ప్రయోగములు నింద్యములు' 'కావనీ నిరూపించి, 'అట్టి రూపములకు—ప్రతిపక్షులు ఎదురాడుటకు వీలు లేనట్టుగా కవుల కావ్యములనుంచి వందలకొణే ప్రయోగములు చూపి నిర్దుష్టత్వ మాహి "దించడము నాలగోమార్గము. -. ఈ కాలంగు మార్గములూ వ్యక్తపరిచే గ్రంథము 2 వరుసగా శ్రీ పంతులు గారి సప్తతితమ జన్మదినోత్సవ ప్రచురణములనీ వ్యాసావళి, "గడ్యచింతామణి, ఆంధ్రపండితభిషక్కుల భాషా భేషజము, బాలకవి శరణ్య వున్ను . ప్రకృత గ్రంథములో పంతులు గౌరి వర్తమానాంధ్రభాషాచరిత్ర కోపన్యాసములలో కొన్ని మాత్రమే ముద్రితములైనవి. A Memorandum on Modern Telugu అను శీర్షికతో ఆంగ్ల భాషలో వ్రాసిన చిన్న గ్రం ధము ఇందులో చేరలేదు. అప్పకవీయము, విశ్వాసి, శశి రేఖ మొదలయిన గ్రంథాలకు వ్రాసిన ఉపోద్ఘాతములం కొంతవరకు భాషాచరిత్రమును బోధిం చేపే అయినా విడిగా ప్రకటి స్టే (ప్రకరణభంగంవల్ల సుబోధము గా ఉండ వేమో అని ఇందులో చేర్చలేదు. చేన్న పట్న మలో ఆంధ్ర వాల్మీకి వావిల ________________
iii కొలను సుబ్బేరావు పంతులు గారి గ్రంథములలోని భాషనుగురించిమ్స్ , రోజు మహేంద్రవరములో కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రలుగారి భాషగురించీ, బ్రహ్మశ్రీ డాకరు చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారి భాష గురించిన్నీ , తణుకులో ఆంధ్ర సాహిత్య పరిషద్వారిక సభలోనూ విజయ నగరముల ఉపాధ్యాయ పండిత పరిషద్వారి క సభలోనూ వ్యావహారిక భాషావాదముగురించిన్నీ చేసిన మహోపన్యాసములున్ను , అనంతపురం, చెన్న పట్నం, గుంటూరు, బెజవాడ, బందరు, రాజమహేంద్రవరము, విశాఖ పట్నం, విజయనగరం, బరంపురం మొదలయిన పట్టణాలలో అప్పుడప్పుడు చేసిన ఉపన్యాసాలున్న ఇందులో చేర్చడానికి అవకాశము కలుగ లేదు. పోటీనిగురించి ఆంధ్రపత్రికలో ప్రకటితములయిన రిపోర్టులు అసమగ్రముగా ఉన్న వి. ఆ ఉపన్యాసములకోసము వ్రాసిఉంచుకొన్న నోట్సు ఆధార ముగా చేసుకొని పంతులు గారు కొన్ని వారి పెద్దకుమారులు శ్రీ సీతాపతీ పం తులుగారుకొని వ్యాసములు వ్రాసి అచిరకాలములో ప్రకటిస్తారని భావిస్తు స్నొ ను. ఇప్పటికి సిద్దముగా ఉన్న వ్యాసములుమాత్రమే ఈ సంపు టములో చేర్చి నాను. | క వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము” “భారతి) నుంచిన్ని, కరాజరాజుకాలమందున్న తెలుగుభాష ఆంధేతిహాస పరిశోధక మండలి వారు ప్రచురించిన రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక 29 నుంచిన్ని , ప్రాఁ దెనుఁగుఁగమ్మ, “ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికి నుంచిన్ని తక్కిన వ్యాసములన్నీ శ్రీ పంతులు గారు ప్రకటించిన ఈ తెలుగు పత్రిక నుంచిన్నీ పునర్ముద్రితములయినవి. 'భారతీ పత్రికాధిపతులూ, ఆంధేతిహాస పరిశోధక మండలివారూ వారి సంచికలలోనుంచి పైన పేర్కొన్న వ్యాసములు తిరిగి అచ్చు వేసుకొనడానికి దయతో అనుజ్ఞ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞుడను. జన్మదినోత్సవ నిర్వాహక సంఘమువారికి శ్రీ పంతులు గారు తమ రచనలు ప్రకటహిర్గము ఇచ్చినందుకు వారికి ఈ సంఘముతరఫున కృతజ్ఞతా పూర్వక వందనములు సమర్పిస్తు న్నా ను. " గుంటూరు, "తేలికి చెర్ల వెంకటరత్నం , నవంబరు, 33. సంపాదకుడు.