వ్యాసావళి/రాజరాజుకాలమందున్న తెనుగుభాష
౨
రాజరాజు కాలమందున్న తెనుగుభాష
రాజరాజనరేంద్రునికాలమందు తెలుగుభాష ఎట్లుండెను? ఈ ప్రశ్న తక్కినవాటితోపాటు ఐతిహాసిక మండలివారి విచారణకు విషయము కాదగినదే. ఆరోజు రాజధాని " రాజమహేంద్రపురమే ” నేటి మన రాజమహేంద్రవరమన్నట్లు ఆనాటి తెనుగుభాషే ఈనాటి తెలుగున్ను అని అంటే సూక్ష్మదృష్టిలేని లోకులు అంగీకరించినా ఐతిహాసికమండలివారు తృప్తిపొంది ఊరుకోరు. కొంచెము ఆలోచించి చూస్తే ఎవరికైనా తోచకపోదు. రాజరాజు గూఢచారులకైనా పోల్చుకొనుటకు శక్యము కాకుండా అతని రాజధాని మారిపోయి నేటినగరమయి ఉన్నది. అతనికాలమందు నగరము సరిహద్దులు, వైశాల్యము, వీధులు, ఇండ్లు, కొలువుకూటము, రచ్చసావళ్లు, సత్తరువులు, అంగళ్ళు, పానశాలలు, కార్యస్థానములు, జనులు, వారి ఆచారవ్యవహారములు, వారి వృత్తులు, పురపరిపాలనము, విద్యలు, శాస్త్రములు, కళలు, పాఠశాలలు—ఇటువంటివిషయములు వేనవేలు విమర్శించి నేటిస్థితి కెన్ని నాటిస్థితికిన్ని గల సామ్యము వైషమ్యము తెలుసుకొంటేనేకాని వాస్తవముగా భూతార్థము నిశ్చయించలేము. రాజరాజునాటి నగరపటము నగరవర్ణనము, వ్యవహార ప్రదర్శని, వార్తాపత్రికలు, నవలలు మొదలయిన సామగ్రి దొరికితే విషయవిచారణ సుకరమవును గాని అట్టిసాధనములు లేవు. ఏదిఉంటే అది ఆధారము చేసికొని ఆకాలపుస్థితి తెలుసుకోవలెననే అభిలాష మనుష్యుల కందరికిన్ని సామాన్యమే, ఐతిహాసికులు సవిమర్శముగా విచారించి తెలిసికొనుటకు యత్నిస్తారు; సామాన్యులు వట్టిఊహలతో తృప్తిపొందుతారు. ఎవరికైనా ఇప్పటివారి వ్యవహారమునకు ఆధారముగా పూర్వకాలపు నగరస్థితి ఉండవలెననే ఉద్దేశము ఎంతమాత్రమున్ను లేదు. ________________
రాజరాజు కొలమందున్న తెనుగుభాష89 రాజరాజు నాటి తెలుగుభాష రానురాను మారి నన్నయభట్టు కెనా బోధపడనట్టిది నేటి వ్యవహారమందున్న ది. ఆకాలపు లిపికూడా భాష వలే నే క్రమేణ మారిపోయినది. ఎవరికో మిక్కిలిశ్రమపడి నేర్చుకొన్న వారికితప్ప నేటిపండితుల కై నా నోటిలిపి తెలియదు. ప్రొసినఅక్షరము వాడుక లో కంటికి కనబడుతూ ఉన్నట్టుఉండక ఏమాత్రము వ్యత్య సమైనా పోల్చుకొనుటకు సాధ్యము కాదు. అట్లే భాషలోని శబ్దములలో ఒక వర్ణము లోపించినా ఒక వర్ణము అధికమయినా ఒక వర్ణము (అచ్చు గాని హల్లుగాన్ని మారిపోయినా ఆ శబ్దములు నిరర్ధక ములవుతవి, చూడగానే తెలిసేటట్టు వ్రాసిన అక్షరములున్ను, వినగానే తెలిసేటట్టు ఆడిన మాట లున్ను, మనుష్యులు తమ మమోభావవరులు ఒకరికొకరు తెలియబర్చుటకు సాధనముగా లోకములో పోడుకొంటారు. దేశ భాష అనేది అట్టసాధ నమే. అనేక కారణముల చేత ఈ సాధనము మారడము సౌజమే. రాజు రాజు కాలమందు వాడుకలో ఉండిన ఈ భాషారూపమైన సాధనము ఎటు వంటిదో నిరూపించుటకు అప్పుడు వ్రాసిన వ్రాతలతప్ప వేరేఆధారము లేదు. తెలుగుభాషనుగురించి ఆనుషంగిక మైన విషయము ఒకటి విచా రించవలసినది ఉన్నది. నేటి తెనుగుపండితులు లౌకిక వ్యవహారమందు లోక ముతోపాటు వ్యావహారిక భాష వ్రాసినా ప్రబంధములు మరిఒక విధ మైనభాషలో రచిస్తారు. ఈ కావ్య భాషలో కొంతభాగము వ్యావహారిక భాషలని.. మిగిలినది విశిష్టమైన ప్రాచీన భాష. అన్యభాషవలే నే నేర్చుకొంటే నేకాని తెనుగువారికి తెలియదు. రాజరాజనరేంద్రుని కాల మందుకూడా పండితులు తెలుగుభాష ద్వివిధముగా వ్రాసేవారా? ఏలాగున ఈవిషయము నిశ్చయించడము? కేవల లోక వ్యవహారముతో సంబంధముగల వ్రాత ఆకాలపుది దొరికితే అది ఈవిచారణకు తగిన ఆధారమవుతుంది. ________________
40 వ్యాసావళి రాజరాజు కాలమందున్న దిలంగుపండితుడు నన్నయభట్టు స్వయముగా రచించినవి ఈ రెండువిధములయిన వ్రాతలున్ను ఉన్నవి. భారతము కావ్యభాషను వ్రాసినది, నందంపూడి శాసనములోని గామము సరిహద్దుల వివరణము వ్యావహారిక భాషను వ్రాసినది అని ఊహించవలెను. రెండవ దానిలో ఉన్న ఎనిమిదివాక్యములనుబట్టి ఆకాలమందుకూడా ఈకాలమం దున్నట్టి భాషలో వైవిధ్య చున్నట్టు నిశ్చయించ లేము: ఎందుచేతనంటే శాసనసులోని భాష భారతములోని తెలంగువ లేనే ఉన్నది. నన్నయభట్టు రచించిన భారతములోని భాష నన్న యవ్రాసిన ట్లుగా నేడు మనము చదువుకొనే పుస్తకములలో ఉన్న దా! నన్న యవాసి నది గానీ ఆ కాలమందు వ్రాసినది గానీ ఒక ప్రతి ఆయినా నేడు మనకు దొర కదు. బుద్ధి వూర్వకముగా పండితులున్ను అబుద్ధిపూర్వకముగా మత్తు లయిన లేఖకులున్ను భాష మార్చి వేసినారని మన మందరమున్ను ఎరుగుదుమా. అప్పకవికాలమందే యిట్లు జరిగినది. వ్రాతప్రతులు చూచి పొఠమును «« పరిష్కరించి) పండితులు అచ్చు వేయిస్తు న్నారు. ఈఅచ్చుపుస్తక ముల లోని పొఠములు ఒక్కొక్కకూర్పులో ఒక్కొక్కవిధము గా మారుతున్న వి. ఆనంద ముద్రాక్షరశాలలో 1907 వ సం. నందు ముద్రితమైన గ్రంథము పీఠికలో పరిష్కర్తలు ఏమని వ్రాసినారో చూడండి. పండితులు దమకు సందిగ్గ ములుగాను మలమునకు విరుద్దములు గాను లేక న్యూనములంగాను నున్నట్టి పట్టులందుఁ దన కవనముతోఁ బాఠములను దోఁచినట్లు మార్చియుఁ గూర్చియన్నారు. కావున నీ తప్పులు ప్రథమ ముద్రణమునందలి కష్ట బాహుళ్యమునుబట్టియు గ్రంథ వైఫల్యమునుబట్టియం బెక్కులై యుండుటతోఁగూడఁ బండితుల సొంతక వనపరుంబట్టి సవరింపరానంత చిక్కులునైనవి. దీనిని వ్రాఁతప్రతులనుగొని మఱల శుద్ధముగా సవరణ సేయఁజాలిన పండితులందులకుఁ బూనకుండుటచేతనో, పూనియు దానికి వలయునంత ________________
రాజరాజు కాలమందున్న తెనుగుభాష 4f వ్యయ ప్రయాసముల గోపమిచేతనో, యోషీయుఁ దగిన వాఁతప్రతులు దొర కమిచేతనో, తరువాతి ముద్రణములన్ని యు మొదటి ముద్రణము ననుసరించి గతానుగతికముగాఁ దప్పులకుప్పలై నవి. ఇటీవల 'రెండొక ముద్రణములు వ్రాఁతపతుల తోడ్పాటుతోఁ దప్పులు లేకుండునట్లు చేయబడినవనుటే కొని చాలవణికందును దప్పులు చూపట్టుచున్నవి. కనుక నీ గ్రంథమును మజల వ్రాతప్రతులతోఁబోల్చి సవరించుట యావశ్యకమయ్యెను.” ఇట్టివారు పరిష్కరించిన గ్రంథములోకూడా అపరిమితముగా అపపొఠములున్నవి. ఈ అపపాఠములలోని శబ్దవులు కోశములలో చేరి నవి. అవి సప్రమాణము గాఁ గ్రహించి గ్రంథకర్తలు తవ గ్రంథములలో వాడుతున్నారు. ఆ విషయము అట్లుండనీయండి. తాటాకు పుస్తకములలోని పాఠములయినా విశ్వాసాము. కావని అప్పకవి నాటినుండిని లాక్షణికులు చెప్పుతున్నారు. బ్ర. శ్రీ వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రలవారు హరిశ్చంద్ర నలోపొఖ్యాన విమర్శనములో (చూ. ఫుటలం 85-87). "యధాస్థితిగా గ్రహింపఁదగిన నిర్దుష్టమగు మాతృక యొకటియైన గలదని యెవ్వరును జెప్పజాలరుగదా ఇంతియ కాక యాయా 'కాలములందుఁ బ్రసిద్దములయి పోడుక లోనికివచ్చి, యుండు వ్యాకరణముల యొక్యమునుబట్టియు, సొయా కాలముల వ్యావ హారికాంథముయొక్క మైక్యమునుబట్టియు సవరణములలో నట్టి సంవాద ములు లభించినను లభించవచ్చును. అంతమాత్రమున నట్టి సంవాదముకవి ప్రయుక్త తను దృఢముగా స్థాపింపఁజాలదుగదా, మణియు మనకుదొరకు మాతృక లెల్ల సుమారు రెండుమూడువందల సంవత్సరములలోపలివే గదా. తఱచుగా పొనిలోని సవరణము లాంధ్రశబ్దచింతామణ్యప్పకవీ యాదుల నను సరించియే యుండును ...... ఇట్టి కారణములచేఁ గల్గు సంవా దములు ప్రమాణములని గ్రహించుట సరియా” అని వాతపతుల దోష ________________
-42 . వ్యాసావళి ములు చూపించి, “ ఛందోయతిప్రాస శ్లేషయము కాదులచే నిబద్దములయి సామాన్యముగా మార్పరాని స్థలములే సందిగ్గ విషయ నిర్ణాయక ములగునని” లాక్షణికులం సిద్ధాంతము చేసినట్లు తెలియజేసినారు. కొందరు మహాను భావులం ఇట్టి స్థలమందున్న శబ్దములుకూడా తమకు అనిష్టమైతే దిద్ది గ్రంథ ములు పరిష్కరించినారు. సన్న యభారతములోని తెనుగు కొంత నేటివ్యవహారములో నిల్చి ఉన్నా చాలా భాగము మారినందున, పండితులని పేరుగలవారు, ప్రబంథ ములు నోచించిన కవులు, లాక్షణికులు, ప్రాచీనభాషాశబ్దములను గురించి తబ్బిబ్బులు పడుతు న్నారు. రెండుమూడు విషయములు ఉదాహరిస్తాను. (1) " నమ్మ నేర నయ్యెదను » మొదలయిన క్రియలు నన్న యభ కాదు; తర్వాతికవులు తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాధుడు వాడిఉ న్నారు. ఆంధ్రశబ్ద చింతామణిలోని బాలవ్యాకరణములోగాని ఇట్టి శబ్దములకు అనుశాస నము ఏర్పడలేదు. కీర్తి శేషులయిన కొక్కొండ వేంకటరత్నము పంతులవారు ఇట్టి శబ్దము ప్రయోగిస్తే బ. శ్రీ. వేదం వేంకటరాయశాసలవారు వారిని పడతిట్టినారు. శ్రీనాధుని నైషధము ఈ శాస్త్రాలవారు పరిష్క రించి అచ్చు వేయించినపుడు ఆప్రబంధములో ఇట్టి ప్రయోగములు రెండు కన బడితే తప్పులని దిద్దుటకుకూడా సాహసించినారు. ఇట్లే నన్న యాది ప్రాచీనకవులు పొడినవి, ఇచ్చి పుచ్చు మొదలయినవి, ఈశాన్డూలవారే తప్పులనుకొన్నారు. (2) తెంచు అమబంధముగా 66 ఏఁగ దెంచు, చనుదెంచు, తాఁకుదెంచు, అగుదెంచు మొదలయినక్రియ ఆ మేక ముగా నన్నయ భారతములో నున్నవి. శబ్దరత్నాకరమందు ఈ తెంచు” స్వార్ధమందు వస్తుందని చెప్పిఉన్నది గాని తప్పు. “ఏగెను” అంటే “పోయెను” ఏగుదెంచెను” అంటే “వచ్చెను”. ఇట్టి శబ్దములు సుపరిచితమయినవి కాకపోవుటచేత వ్యతిరేకార్థమందు పాఠశార్దమందు తుమర్ధమందు వీటికి ________________
రాజరాజు కాలనుందున్న తెనుగుభాష48 ఎట్టీ రూపములుండునో తెలియక తప్పులు వాస్తు న్నారు. . శ్రీ. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రలవారు తమ కొత్త తెనుగు భారతము (సభా పర్వము రెండవ ఆశ్వాసము 307 వ పద్యము)లో 66 శాఁకు దించఁగః” అని ప్రయోగించినారు. మ. రా. కూచి నరసింహంపంతులవారు తమ గౌరాంగచరిత్రమందు (చూ. రెండవ భాగము XI. 1.44) “ఏ తెంచుము” అని వ్రాసినారు. (3) బ, శ్రీ, మల్లాది సూర్య నారాయణ శాస్తలవారు భౌసనాటక కథలలో (దశరధుని శరణుజొచ్చుము” అని శబ్దపరిచయము లేక, తెనుగురానివాడు " నీవువచ్చుము” “ నీవువచ్చన లెను,” “ వాడు వచ్చడు” అన్నట్లుగా ప్రాచీనాంధ్రక్రియ వాడినారు. బాలవ్యాకరణ ములో వీటికి అనుశాసనకు న్నా తెనుగుపండితులే మత్తులవుట సంభవిస్తు న ది. పండితులు కాని తెలుగువారు ఇట్టివాతలు చదివేటప్పుడు, గాంథి కాంధ్రభాషలో తప్పొప్పులు తెలుసుకోలేక, “ ఏ తెంచుము.” (ఏ తెం పుము,” : ఏ తెంపవలెను,” ఈఏ తెంచఁడు” (అరసున్న తప్పకుండా ఉండ వలెను.) ఈ ఏతెంపఁడు” “ వచ్చుము”) rళ వచ్చవ లేను” “ వచ్చఁడు” చొచ్చుము, చొచ్చవ లేను, చొచ్చఁడు, చోరి, చొరెను, చోటి, చోటను, చోరిన మొదలయినవి ఎవరు ఏలాగున వ్రాసినా, వ్యావహారిక భాషకు ఎంతవిరుద్దము గాఉన్నా, గాంథిక భాషలో అట్టి రూపములు సాధువులు కాబోలు, కాకుంటే గ్రంధకర్త ఎందుకు ఆలాగున వాస్తాడు అని సమాధానము చేసుకొంటారు. పాపము! భ్రమపడ్డవారు మరేమి చేయగలరు? వేదం వేంకటరాయ శాస్త్రాలవారే అలంకారసార సంగ్రహము నండు + అరయనద్భుత మిధ్యాశూరత్వౌదార్యరచన చోజునత్యుక్తిన్) అని<< చొజుకో ప్రయోగించి వ్రాసినారు, ఎవరు తప్పనగలరు? శ్రీపాద కృష్ణమూర్తి శాస్తలవారు తమ భారతములో చోరినన్(ఆది X. 251). ఈ చోరిన” (X. 244) * చోరితిని” (Vll. 72) చోరి (1X. 272) అనే ________________
44 వ్యాసావళి శబ్దములు ప్రయోగించినపుడు నన్న యాది ప్రాచీనక వులెవరైనా ఎక్కడైనా ఈశబ్దములు వాడినారు గాబోలును, ఏవ్యాకరణములో నైనా వీటికి అను శాసనమున్నది గాబోలును అని చదువరులు అనుకొంటారుగాని తప్పనుటకు సాహసిస్తారా? నావంటివాళ్ళుమాత్రము వీటిసాధుత్వము అంగీకరించుటకు పూర్వము మాణము చూపించవలెనని ప్రయోగించిన కవులను కోరుతారు. వ్యావహారిక భాషలోని శబ్దములకు వ్యవహార మే ప్రమాణము. దానికీవిర:ద్ధ మైన శబ్దములకు ప్రాచీన గ్రంధములలోని ప్రయోగము లే ప్రమాణము. ఆ ప్రయోగములను అనుసరించి చేసిన అనుశాసనము చెల్లుతుంది. అపశబ్దములు (అనగా ఇప్పటి వ్యవహారములోని ప్రాచీనుల గ్రంధములలో గాని లేనివి) అనుశాసించుటకు ఏలాక్షణికునికీన్ని అధికారము లేదు. నన్నయభారతములో కనబడే భాషానియమములు తెలుసుకో కుండా పాఠములమార్చి అపశబ్దములున్ను అర్వాచీనాంధ్ర భాషాశబ్దము లున్న నన్నయ భాషలో చేర్చి ఊరూ పేరూ తెలియని పరిష్కర్తలు ప్రాచీ సాంధ్రభాష పాడు చేసినారు. తత్త్వా న్వేషణపరులు శ్రమపడి ప్రాచీన ప్రతులు సంప్రతించి శుద్దమయిన పొఠ ములతో భారతము తీరిగీ అచ్చు వేయి స్తే నేకాని, రాజరాజు కాలమందున్న గాంధి కాంధ్ర భాషాలకణము నిరూ పించుటకు ఎవరున్ను పూనుకో లేరు. అంతవరకున్ను చేసే ప్రయత్నములు సఫలము కావు. అసత్యము సిద్ధాంతము చేసుకొని దుష్టలక్షణము ప్రమాణము గా గ్రహించి, దురభిమానము, దురాగ్రహము గలిగి, భాషాతత్త్వ మేకాదు, దేనితత్త్వమైనా తెలిసికొ"నుటకు ప్రయత్నించుట అనర్థకము. అట్టి ప్రయ త్నము చే నేవారికీ దురుద్దేశమున్నదని వారిమీద ఆనింద ఆరోపించ కూడదు. సదుద్దేశముతోనే ఇట్టివారు (ఇతరవిషయములలో అత్యుత్త ములు కావచ్చును). చేసేపనివల్ల తత్త్వము ఆడుగంటి లోక మునక కీడు ________________
రాజరాజు కాలమందున్న తెనుగుభాష 45 కలుగవచ్చును; కనుక వారితప్పులు ప్రకటించడము తత్త్వప్రియులకు విహితధర్మము. నన్నయ భారతభాష పరిష్కర్తల దోషము చేత నిరూపించుట కసాధ్యమయి నా, నన్న యవాడిన వ్యావహారిక భాష విమర్శించి వల్లనయి నంతమట్టుకు దానిలకణము తెలుసుకోవచ్చును. భాషావిమర్శకులు శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటునిర్మాతలు, కవులు, ఆంధ్రపండితులు అని లోక మందు ప్రసిద్ధిపొందిన మ. జయంతి రామయ్య పంతులవారు స్వయముగా నందంపూడి శాసనము ఆంధ్ర సాహిత్య పరిషత్పతిక లో (చూ. 1.1) ప్రతి బింబసహితముగా ప్రకటించినారు. నన్నయ కాలపు లిపి పంతులవారివంటి వారేకాని సామాన్యులు పోల్చుకోలేరు. నన్నయ కాలపు వ్యావహారిక భాషకూడా వారివంటి పండితుల కేకాని ఇతరులకు బోధపడదు. ఇప్పటి అక్షరములతో శాసనముపొసి ముద్రించినారు. మనకు కావలసిన భాగము తెలుగువాక్యములు గలది ఎత్తి ఇక్కడ ప్రొసి చూపిస్తున్నాను. దానిలో వాకు తప్పులుగా తోచినవి తెలియజేసి పంతుల వారి " ఆంధ్రశబ్ద విమర్శ నమ” లోని గుణదోషములు విచారిస్తాను.. నందంవూడి శాసనములోని తెలుగు భాగము: 1. పూవ్వతః ఇయ్యూరియంబిల్లెమ పెద్దపూణ్ణియుం బొలగరుసున పల్లవున కొండీ1యగుంట నడుమసీమా! 2. ఆగ్నేయతః ఇయ్యూరియం బిల్లెమ పెద్దపూఱ్ఱయు నెరపులయం బొలగరుసున ముయ్యలి కుటు: సీమా! 3. దక్షిణతః ఇయ్యూరియు నెరపులయం బోలగరుసున తాడ్ల జీవ సీమా! 4. నైరిృత్యః తః ఇయ్యూరియు నెరపులయు ముందరమునయం బొలగరుసున ముయ్యలి కుటు2 సీమా! 1 కొడ్డి, 2 కుట్ర, 3 రృ, ________________
46 వ్యాసావళి 5. పశ్చిమతః ఇయ్యూరియు మందరమునయు మడకుజీతియుం బొట గరుసున ముయ్యలికటు: సీమా! 6. వాయవ్యతః ఇయ్యూరియు మడుజీతియుం బిల్లెమ పెద్దపూణ్ణి యుం బొలగరుసునముయ్యలికుటున గొల్ల వసీ నూ! 7. ఉత్తరతః ఇయ్యూరియుం బిల్లెమ పెద్ద పూణ్ణియం బొలగరుసున (యేలువ గడ్డయసీమా! 8. ఐశాన్యత? ఇయ్యూరియు 2 బిల్లెమ పెద్దపూణ్ణియుం బొలగరుసున మట్టికోడితాయోద్ద చింతయసీమా | ఈ శాసనమునకు పంతులవారు వ్రాసిన అవ తారిక లో నే శాసన మందున్న ఆంధ్రశబ్దములు విమర్శించి కొన్ని వి శేషము లుదాహరించినారు (1) నన్నయ కాలమందు వాడుక లోనుండే శబ్దములుకొన్ని (నందమపూణ్ణి తాడ్ల, కుజితి) మారి (నందంపూడి, తాళ్ళ, కుర్తి అని నేటివ్యవహారమం దున్నవి; (2) గొల్ల కేవ, ఏఱువగడ్డయవంటి కొన్ని శబ్దముల అర్థము విచా ర్య ము; అనగా తెలియదన్న మాట. (8) “సొలగరుసులోని ఓ పొట” శబ్దము లేఖక దోషముల (పొలిమేరి లో ఉన్నట్టు పొలిగ రుసు” అని ఉండవలె నేమోనట! ఈ నడుమ” ప్రథమైక వచన రూపమట! (5) “గడ్డయ చింతయ” శబ్దములు (గడ్డ” “ చింత' శబ్దముల వి శేషరూపములట! (6) “తాడ్ల సేవ” అనగా (తాటి చెట్ల సమూహ” మట! నన్నయ మాటలలో కొన్ని నేటి వ్యవహారములో లేకపోవ డము, కొన్ని మారడము, కొన్ని టీకి అర్థము పండితులకై నా తెలియకపోవ డము నావంటివారికి వింత కాదు! నన్ను యనాటిభాష నేటివరకున్ను . మారలే దన్న విశ్వాసము గలవారికి (పంతులవారు మొదలుగాగలవారికి ఆశ్చర్యకర ము గా ఉంటుంది. దాని కేమి గాని అవిచారపూర్వమయిన తప్పు సిద్ధాంత 1. కుట్ర ,సందిగ్ధము, 2. యుంబి యొఇట్లు శాసన ప్రతిబింబములోని వర్ణములు నాకంటికి కవబడుతున్న వి. ________________
రాజరాజు కాలమందున్న తెనుగుభాష47 ముల, తప్ప లక్షణములు, తప్పు వ్యుత్పత్తులు పరమ ప్రమాణముగా మూడ విశ్వాసముతో అంగీకరించేవారు ఎట్టిచిక్కులు పడుదురో పంతులవారు పడ్డ పాట్లనుపట్టి తెలుసుకోవచ్చును. * నడుమ” అకారాంత శబ్దమనుకొని థమైక వచనరూపమని నిశ్చయించుట, తాళ్ల వ” లోని ఈ కేవ” అకారాంత శబ్దమనుకొని దానికి ప్రయోగాంతరము స్ఫురింపకున్న దని జంకు తూ, సందర్భమునుబట్టి దానికి సమూహముఅని యర్ధము చెప్పికొనవచ్చా” నని గప్పా కొట్టుట << గొల్ల కేవ’కు ఈ అర్థ మువిచార్య” మని మెలకువతో ఊరుకుండుట “గడ్డ”కు “గడ్డయ” అనిన్ని, 'చింత'కు • చింతయ” అనిన్ని “వి శేషరూపము” లని జంకకుండా అనుశాసించుట—ఈతబ్బిబ్బు అంతా ప్రాచీనాంధ్రభాషాసంప్రదాయము పట్టుపడక పోవుటవల్లను ఈశబ్ద ముల చివరనున్న ఆకారము ఏపొర్ధకమని తెలుసుకోలేక పోయినందున సంభవించినది. నన్న యవాసిన ఎనిమిది వాక్యములలోను ఎనిమిది దిక్కుల సీమలున్ను వివరముగా ఉన్నవి. ప్రతివాక్యములోను చివరనున్న తెలుగు - మాటకు ఏవార్థకమయిన ఆకారము చేర్చి “అదేసీమ” అనే అర్థము ఇచ్చునట్లుగా నానీనాడు. నన్నయ కాలమందు ఏవాగ్ధకము గా అకారమువాడుక లో ఉన్న దిగాని, మన కాలమందున్నట్టి ఏకారము లేదు. ఏవార్ద కాకాగసహిత మైన ఇట్టిశబ్దములు 1 నడుమ (నడుము + 2 ముయ్యలి కుట్ర (-కుటు +అ) 3 తాడ్ల జీవ (- జీవు+ఆ) 4 ముయ్యలికుట్ర 5 ముయ్యలికుట్ర 6 గొల్ల కేవ ( లేవు + అ) 7 (ఏ)లువగడ్డయ (గడ్డ+అ) 8 చింతయ (చింత-+ అ) వీటిలో 6 గడ్డయ” “( చింతయ” శబ్దముల చివరనున్న “య” కారము ప్రమత్తులయిన చదువరులకు ఏవార్ధక ము గా తోచు నేమో అని “య కార మవథారణార్ధకమనుట సమంజసముగాఁగఁ నబడదు.” అని, స్పష్టముగా పంతులపోరు తమ నిశ్చితాభిప్రాయము తెలియ జేసినారు! ________________
-48 వ్యాసావళి పంతులవారి యభిప్రాయము తప్పు అని చెప్పుటకు తగిన హేతువు లున్న వి. మొట్ట మొదట భూదానశాసనములలో సరిహద్దులు వివరించి వ్రాసిని వాక్యములందు ఏవార్ధకము (పయోగించుట సంప్రదాయవిరుద్ధము కాదని చెప్పుటకు ప్రమాణముచూపిస్తాను. పిఠాపురమందున్న మల్లి దేవుని శాసనములో (చూ. ఎపి. ఇండి. IV. పుట 92) నందంపూడి శాసనములో నన్నయవ్రాసినట్లే ఏనిమిది దిక్కుల సరిహద్దులు చెప్పిన వాక్యములలో కొసను వరుసగా ! ఎగుంటయసీమా, 2 కాలియసీమా 3 గుఱ్ఱయసీమా, 4 గుంట యసీమా 5 గంటలసీమా, 6 గట్టయసీమా, 7 గట్టయసీమా, 8 వంక యసీమా అని ఏవార్ద కాకార సహితము గా నే శబ్దములున్నవి. అకారాంతేకారాంత శబ్ద ములకు పరమందు ఆకారమున్న చోట యడాగమమువచ్చి నదీ. అయిదవ వాక్యములోని గుంటల”అనేది బహువచనరూపమయిన “గుంటలు)కు పర ముగా అకారమువచ్చినందున సంధిఅయి ఏర్పడ్డది. ఇట్లు పూర్వకాల మందు దానశాసననిబంధనము లుండేవని తెలియక పోయినా ప్రాచీనాంధ్ర భాషా సంప్రదాయములయినా తెలిసిఉంటే నన్న శాసనములోనున్న ఏవార్త కాకార సహిత శబ్దములను గురించి పంతులవారికి కలిగిన చిక్కులు విడదీయుట -కష్టముగా ఉండదు. * నడుమ” లోని అంత్యవర్ణము ఏవార్ధక నుయిన - అకారము కాదని తప్పుసిద్దాంతము తలకెక్కి గట్టిగా పట్టుకోగాబట్టిక దా 'నన్నయ "కాలము మొదలుకొని నేటివరకున్న ఉకారాంతముగా లోక వ్యవహారమందే కాక గ్రంథములందున్ను వాడుక లోఉన్న ఈ నడుము” శబ్దము (నడుమ అని అకారాంతముగా పంతులవారివంటి పండితులు కూడా అనుశాసనము చేయుట సంభవించినది. నందంపూడి శాసనములోనే 66వ పంకిలో నన్నయ << రెండేజులనడిమివిషయ” అని వ్రాసినాడు. గాంథిక భాషలో ( నడుము” ఈ నడిమికి” “ వడుమన్' ప్రచురముగా నన్న యాదుల కావ్యములలో కన : బడుచున్నవి. శబ్దరత్నాకరమం దుదాహృతమై ఉన్న వి. ఈ నడుమ ________________
రాజ రాజు కాలమందున్న తెనుగుభాష 49 (రి అని పంతుల వారు అనుశాసించినట్లు ఈశబ్దము అకారాంతముగా రూపొంతర మేమో అనుకొనుటకు ప్రయాణము లోక ములోగానీ గ్రంధములలో గానీ కానరాదు. ( నడుచు”” శబ్దముంటే ( నడుచుకు: 66 నడునుయందు) 'కళ నడుచులు' మొదలయినరూపము లుండవ లేనుగదా! అవి పంతులవారికి కనబడిన నా లేకుంటే, నడుమశబ్దము అపశబ్దము: వ్యావహారిక ము కాదు; గ్రాంథిక ము కాదు; అర్వాచీనము కాదు; ప్రాచీనము కాదు, పండితమ్మ న్యులు కల్పిస్తూఉన్న కృతక (గాంధికాంధ్రశబ్దములవంటిది గనుక కృతక గాంధి కాంధభాసా లక్షణశి:మణిలో లక్ష్యము గా ఉదాహరించదగిన శబ్దము కావచ్చును. ఇట్టి వే ( మేవ' 6 గడ్డయ” ( చింతయ”లు; ఇవి భాషలో వాస్తవము ఉంటే, " కేవలు” గడ్డయలు • 46 చింతయలు' ( సేవకు << షేవలకు ఈ గడ్డయ 1997 (6xజ్ఞయలు) (( చింతయకు” ((చింతయలకు'? అనే రూపములుకూడా ఉండవలెను. పం:ులవారు ఎక్కడనయినా ఇవి చూచినా రేమో కాని నాకు కానరాలేదు; ప్రమాణము చూపించకుండా వీటికి -అనుశాసనము చేస్తే చెల్లుతుందా? వారిచి త్తం! అవినుగ్మపూర్వక చుయిన సిద్దాం: ముగు పరగుప్రమాణముగా విశ్వసించేవారి గునోవృత్తులతోపాటు ఇంద్రియ వ్యాపొర ములుకూడా విప గ్య సము కాక తప్పదంటారు. అందుకు తార్కాణముగా పంతులవారి వియుక్శన ములోని విషయము ఒకటీ చూపిస్తాను. కొండవ .నాలుగవ అయిదవ వాక్యముల చివరను «« కుట” అని మూలనుందున్న ది. శాసన ప్రతిబింబ ములో సుషి ప్రాచీనలిపి పోల్చి తెలుసుకోగలవారు కుట” లోనున్న రెండవ అక్షరము (6 టు ఆని చదునరు. చాలా సంవత్సరముల క్రిందట పసిద్దపండితుడయిన ఓల్ హ5 న్ గారు ఈ శాసనము ఎపీ. ఇండి, 4 వ బాల్యములో ప్రకటించినప్పుడు ఆయన ఈవగ్లము (ట) అనే మూడు చోట్లను పఠించినాను గాని "టు” అనుకోలేదు. “బ్ర” కున్ను (ట్రు”
| 4 వ్యాసావళి
కున్న నన్నయలిపిలో భేదము స్పస్టముగా కనబడుచున్నది. ఆరవ వాక్యములో "కుట్రున" అని పంతులవారు పఠించినట్లే కీల్ హర్ న్ గారు కూడ పఠించినారు. ప్రతిబింబములో ఈభేదము ప్రాచీనలిపి తెలియనివారికయిన కనబడుతుంది. ఇంత స్పష్టమయిన అక్షరమును సరిగాపోల్చుకోకుండా కొమ్ములేనిచోటకొమ్ముకనబడేటట్లుగా దృష్టిదోషము కలుగజేసి పంతులుగారివంటివారిచేత కూటకరణము చేయించినదేమిటి? లోకమందు సుప్రసిద్ధముగా ఆబాలగోపాలము అందరికీతెలిసిఉన్న "ఱేపు" శబ్దము ఱేపశ్యమని తోచునట్లు భ్రమపుట్టించి దానికి "సమూహ" మని అపార్దముకల్పించేటట్టుచేసిన అవిమర్శపూర్వకసిద్ధాంతమే-అవధారణార్దకమయిన ఆకారము ఈశబ్దములకు పరమందుండుట సమంజసముకాదనుకోవడమే'
పంతులవారి విమర్శనములో మరియొక చిత్రమైన విశేషమున్నది. అర్వాచీనుల భాషలొని శబ్దముయొక్క రూపమునుపట్టి వ్యుత్పత్తి కల్పించి, ఆవ్యుత్పత్తి ప్రమాణముగా గ్రహించి, ప్రాచీనుల భాషలోని శబ్దముయొక్క రూపము తద్భిన్నముగా నున్నదని తప్పుపట్టి దిద్దుటకు సాహసించినారు. భాషాతత్వజిజ్ఞాసకు దురబిమానముగాని పక్షపాతముగాని ప్రతికూలముగా ఉంటుంది. మన వ్యవహారములో ఇప్పుడు "పొలిమేర" అనే శబ్దమున్నది; కాని "పొలమేర" లేదు. శబ్దరత్నాకర మందు మొదటిదిమాత్రమే కనబడుతున్నది; అందు "గ్రామద్వయమధ్యసీమ" 'ఎల్లా అని అర్దములున్నవి; కాని ప్రయోగములు లేవు. కాశీఖండమందు (వావిళ్ళవారి అచ్చుపుస్తకము 111, 116) సీసగీతిలొ ప్రయోగము "పోలిమేరసీమ" అనిఉన్నదని నేను జ్ఞాపకము పెట్టుకొనిఉన్నాను. అయితే, లాక్షణికులు అంగీకరించదగిన స్దలములొ అనగా యతిస్దానమందు "లి" వర్ణములేదు. శ్రీనాధుడు "పొలమేర" అని వ్రాసినాడో దీనిని బట్టి తేలదు. ప్రాచీనప్రతులలో "పొలమేర" అనిఉన్నా అర్వాచీన 51
రాజరాజు కాలమందున్న తెనుగుభాష
లేఖరులు తమవాడుకచొప్పున "అ" వర్ణము తప్పని దిద్దిఉంటారు. అచ్చువేయించుటకు పరిష్కరించే పండితులయినా మార్చిఉంటారు. ఇట్టిమార్పులు అనేకశబ్దములలో కలిగినవి. నేటి లోకవ్యవహారమో, శబ్దరత్నాకరమో ప్రమాణముగాచేసికొని, నన్నయ వాడిన "పొలగరుసు" శబ్దమందున్న "పొల" లోని "ల" వర్ణము లేఖకదోషమయిఉండునేమో అనిఊహించి పంతులవారు "పొలిగరుసు" దిద్దవలె నంటారు! "పొలి" శబ్దము "బలి" బలిశబ్దమట! కనుక "లి" వర్ణము సాధువు, "ల" వర్ణము అసాధువు అని వారి అనుశాసనము. అయితే నన్నయవ్రాసిన ఎనిమిది కావ్యాలలో నున్ను (ఒక్కొక్కదానిలో ఒక్కొక్కమారు) ఎనిమిదిమార్లు ఈశబ్దము ఏకరూపమున "పొలగరుసు" అనిప్రయుక్తమయి ఉన్నదే. ఎనిమిచోట్ల శాసనము చెక్కిన గండాచార్యుడు ప్రమత్తుడై "లి" వర్ణము "ల" వర్ణముగా మార్చిఉండడము సంభావ్యమా? "పొలమేర" అనిమూలమందు కాశీఖండములో
శ్రీనాధుడువ్రాసినా అర్వాచీనలేఖకులు తమవాడుకలో "పొలిమేర" అనిఉండుటవల్ల ఉద్దేశపూర్వకముగా గానీ ప్రమాదముచేతగానీ ల వర్ణము లి వర్ణముగా మార్చినారనుట అసంభావ్యముకాదు. "పొలిగరుసు" అని నన్నయవ్రాస్తే గండాచార్యులు "పొలగరుసు" అని ఎనిమిదిచోట్ల మార్చుటకు కారణము నాకు కానరాదు. "పొలగరుసు" ఈ వొక్కశాసనములోనే కాదు. కలుచుంబట్టు శాసనములోకూడాఉన్నదని పంతులుగారెరుగుదురు. "పొలమేర" అని ల కారయుక్తముగానే అనేక శాసనములలోఉన్నది. క్రీ.శ.1338సం. నందుపుట్టిన దోనెంపూడి శాసనమందు (చూ.ఎపి. ఇండి.IV పు.359) "పొలమేరలు" కనబడుచున్నది. అల్లాడ వేమారెడ్డి శాసనమందు (చూ.ఎపి.ఇండి.XIII.248-250) ఆరు చోట్ల "పొలమేర" అనే రూపమున్నది. కాటయవేమని తొత్తరమూడి శాసనమందు (పంతులవారు పరిష్కరించిన పాఠములోనే) నాలుగుచోట్ల వ్యాసావళి
"పొలమేర" అనే ఉన్నది. (చూ.ఎపి.ఇండి. IV. 834) నేనెరిగినంతమట్టుకు ప్రాచీనులవ్రాతలలో ఎక్కడా "పొలిమేర" కానరాదు. కన్నడ భాషనున్న ప్రాచీన శాసనములలోకూడా "పొలసీమే అకారాకారా యుక్తముగానే పొలశబ్దము కనబడుచున్నది. (చూ.ఎపి.ఇండి.X 66) కిటిల్ రచించిన కన్నడ నిఘంటువులో పొలశబ్దమునకు, దిక్కు అనేఅర్దము కూడా ఉన్నది. కన్నడశబ్దము ప్రధానప్రమాణమని చెప్పలేదుసుమండీ.
శాసనములు రాగిపట్టాలమీదను రాతిపలకల మీదను ఏలాగున మొదటచెక్కినారో అలాగుననే ఉన్నవి. తాటాకుపుస్తకములు అట్టివి కావు. మొదట వ్రాస్దినవి నశించినవి. ఇప్పుడు మనకుదొరికేవాటిలో అనెకము మన తండ్రితాతల తరమున వ్రాసినవి. ప్రతినిచూచిప్రతివ్రాస్తూ లేకనలు గ్రంధమునశించకుండా కాపాడేవారు. అయితే గ్రంధము నిలుచుటకు ఇది అనుకూలించినా గ్రంధములో అల్పముగానో అధికముగానో మార్పులు గలుగుటకు కారణమయినది. శాసనములలోని భాష యధాస్దితిగా ఉండుటబట్టి విచక్షణులయినవారు శబ్దములరూపములు అర్దములు ఏకాలమం దెట్లున్నదో తెలిసికొనుటకున్న గ్రంధకర్తల భాషయొక్క సాధుత్వాసాధుత్వములు విమర్శించుటకున్న లేఖకులభ్రమప్రమాదములవల్ల కలిగిన మార్పులు కనుగొనుటయన్న తాటాకుపుస్తములకన్నశాసన ములు ఎక్కువ అనుకూలముగా ఉంటవి. తాటాకు పుస్తకములయినా, మెలకువతో పండితులు మాతృక లోఉన్నట్టు వ్రాసినవైతే ఇంచుమించుగా నిర్దుష్టమని నమ్మదగిఉంటవి. అట్టివి రెండుమూడు చూచినాను. అటువంటి ప్రతులు ప్రాచీనగ్రంధములకు దొరికితే, అమూల్యములని భావించవలసినవి. దొరకనప్పుడు ఎవరేమి చేయగలరు? శాసనములున్ను తాటాకు పుస్తకములున్న సంప్రతించి వివేకముతో విమర్శనముచేసి, భాషాతత్త్వజిజ్ఞాసువులు అవలంబించిన అన్వేషణక్రమానుసారముగా కంటికి కనబడుతూఉన్న సిద్ధశబ్దములు 53
రాజరాజ కాలమందున్న తెనుగుభాష.
వ్యాసావళి
మునకు పూనుకోవలెను. ఆపనికి తాటాకుపుస్తకము లున్నుశాసనములున్ను అవశ్యకమయిన సామగ్రి- పరమాధారము. అవి మార్చివేస్తే ఇంతంతని చెప్పరాని కీడుకలుగుతుంది. మార్చేవారికిదురుద్దేశములేకపోవ చ్చును. మార్పులవల్ల సత్యము మరుగుపడుట సంభవించవచ్చునుగనుక, ఉద్దేశము మంచిదే అయినా ఆపని అనర్దకము.
"పూర్వలిపిని బాగుగ జదువలేకపోవుటచేత గాని శాసనముల గ్రమముగ సమన్యయించుకొనలేక పోవుటచేతగాని కొందఱపార్దములు చేసికొని వానిని సిద్ధాంతములుగా బ్రకటించురనుటకిదియొక దృష్టాంత ముగా గ్రహింపవచ్చును." అవిమనపంతులవారు తమకు పుల్లరిబోడు మీదనున్న శాసనమును కనపర్చిన చిలకా వేంకటకృష్ణముయ్యగా రన్నమాటను పట్టి హితోపదేశముచేసినారు. వేంకటకృష్ణయ్యగారు ప్రాచీనలిపి తెలియక, "దల్లి సూరాంబచే" అనిశాసనములో ఉంటె "డిల్లిసూరంబాధా" అనిచదువుకొని శాసనములో డిల్లీ సూరంభాకున్ను కొండవీటి రెడ్లకున్ను జరిగిన యుద్ధము వర్ణించబడినదని చెప్పినారట! (ఆం.సా. పత్ర్రిక.204) ఇట్లే "మల్లియరేచ" అనేశబ్దము బ్రౌన్ దొరగారిపండితులు సంప్రదాయమెఱుగక "మల్లయరేచ" అని దిద్దినారని పంతులవారే ఆక్షేపించినారు (చూ.ఆం.సా.పత్రిక. V.ఉ) ఇట్లు ఇతరుల అవివేకమును ఉద్ఘోషించి గ్రంధకర్తపరిష్కర్తల కుచితధర్మముపదేశించిన పంతులవారు స్ఫయముగా పరిష్కరించిన శాసనములలోని మూల గ్రంధమందు చేసిన మార్పులుచూస్తే , "శాసనాత్ కరణంశ్రేయ:," అన్ననీతి జ్ఞప్తికివచ్చినది.పంతులవారు ప్రకటించిన ప్రాచీనశాసనములలోని గ్రంధము మూలమునకు విరుద్ధముగా పరిష్కరించుట మిక్కిలి శోచనీయముగా ఉన్నది. యుద్దమల్లుని శాసనము, ఓపిలిసిద్దిరాజు కొణిదెన శాసనము, శ్రీనాధుని కృతులయిఅ కొండవీటి రెడ్డినాటి శాసనములు ప్రాచీనాంధ్రభాషాస్వరూప
55
రాజ రాజ కాలమందున్న తెనుగుభాష
నిరూపణమునకు ఆధారమయిన సామగ్రిగా ఎన్నదగినవి. వీటినిబట్టి వాస్తవమైన భాషానియమ ములు తెలిసికొని, అచ్చుపడ్డ భారతాది ప్రాచీనగ్రంధము లందున్న కోశములందున్న వ్యాకరణములందున్న గలదోషములు తొలగించవలసిఉండగా, ఆదొషములు సాధువులుగా గ్రహించి, వాటికి అనురోధముగా శాసనములలోని భాషదిద్దటడము పంతులవారికి అవశ్యకమని, ఉచితమని తోచడము ఆంధ్రభాషా పాండిత్యముయొక్క దౌర్భాగ్యమని నాపరితాపము తెలియజేస్తున్నాను. తాటాకులమీద వ్రాసిఉన్న చంద్రభానుచరిత్రము*మూలమునకు విరుద్ధముగా కొన్నిశబ్దములరూపము దుష్టలక్షణము ప్రకారము మార్చి పరిష్కరించి ఆంధ్రసాహిత్యపరిషత్తువారు అచ్చు వేయించినట్లె రామయ్య పంతులవారు పరిష్కరించిన పాఠములుగల గ్రంధమే శాసనముల గ్రంధముగా అచ్చువేయించి ప్రకటించి ఉంటే, పరిష్కర్తలు చేసిన మార్పులేవో తెలియక కృతికర్తలువ్రాసినవే అని లోకము మోసపోవుటకు కారణమవును. అయితే మూలమునుబట్టి వీరు చేసిన తప్పులు దిద్దుకొనుట విమర్శకులకు కష్టమయినా అసాధ్యముకాదు. ప్రాచీనాంధ్రభాషా విశేషములలో ఆదేశములు, ఆగమనములు, అరసున్నలు మొదలయినవికొన్ని స్పష్టముగా నిరూపించలేక లాక్షణికులు తప్పులుజేసినారు. అటువంటివి సవరించుటకు ఈ శాసనములలో సాధక మయిన ప్రయోగములున్నవి. అవి పంతులువారి పరిష్కరణములో చెడిపోయినవి. రెండుమూడు అంశములు మాత్రమే ఉదాహరిస్తాను. "పరగు" శబ్దములో అంత్యవర్ణము బిందుపూర్వకముగా శబ్దరత్నాకరమందున్నది. అందుకు ప్రమాణముగా ఇచ్చిన మార్కండేయ పురాణములోని ప్రయోగము అచ్చుపెద్దగ్రంధములో కానరాదు. చక్కగావ్రాసిన తాటాకుపుస్తకములలో కూడా(భారతాది ప్రాచీన గ్రంధములందు) పరగు శబ్దములో అరసున్న _________________________________
- నేను స్వయముగా తైఫారువేసి చూచినాను. వ్రాత ప్రతిలోనున్న శబ్దములు అచ్చులో కనబడవు. 56
వ్యాసావళి
కనబడదు. ప్రాచీనశాసనములలో అరసున్నకురు గురుతుగా నిండుసున్ననే ఉంటుంది; కొన్నిటిలో అను నాసికవర్ణమే ఉంటుంది (మల్లుణ్ణు అని) మీదచెప్పిన శాసనములలో "పరగు"శబ్దమందు బిందువులేకున్నా, అవిమర్శపూర్వకనియమమును అనుసరించి అంధ పరంపరంసరాగతమై అరసున్న దూర్చి పరిష్కరించి తమపాఠము ప్రకటించినారు.
"పాకనాటి" "కమ్మనాటి" అని కొణిదెన శాసనములో ని సబిందుశబ్దములు పరిష్కరణములో నిర్భిందువు లయినవి.
అచ్చుబారతముతో "ఎందుబోయితివి" అని "ఎందు"కు పరమందు అరసున్న, దానికిపరమందుగ జ డ ద బాదేశములు కనబడుతున్నవి; కాని వ్రాత ప్రతులలో అందు, ఇందు, ఎందు కళలుగాను వాటికి పరమందున్న కచటతపలకు గ స డ ద వాదేశములు రావలసినట్టుగాను పాఠములు కనబదుచున్నవి. ఈశాసనములలోకూడా, తాటాకు పుస్తకములలొ ఉన్నట్టె మూలమందుపాఠములున్నా సంస్కృతపాఠములు అచ్చుపుస్తకములలొని తప్పు పాఠములను అనుసరిస్తున్నవి. యుద్ధమల్లుని శాసనమందు "ఇందుప్రత్యక్షమై" అని మూలమందుంటే "ఇందుబ్రత్యక్షమై", అని పంతుల వారు దిద్దినారు. కొణిదెన శాసనమందు "తమ్ముండు ప్రతాపమున" అని మూలమందున్న "తమ్ముడు ప్రతాపమున" అని పరిష్కృత పాఠమందున్ను ఉన్నవి. అచ్చుభారతములోకూడా అక్కడక్కడ ప్రాచీన సంప్రదాయము కనబడుతున్నది. (చూ.విరాట.III 28. ఆనంద ముద్రణము--ఉర్వీజముల్ వ్రాకి) కొణిదెనశాసనమందు మూలము లో ఆదేశములు యధావిధిగా ఉన్నవి. "ముల్లోకవిభుండు సక్రి" అని కృతికర్త వ్రాసినది తప్పుగానిరాకరించి "ముల్లోకవిభుండు చక్రి" అని పంతులవారు దిద్ది అట్లుదిద్దుటకు కారణము ఏమని చెప్పినారో చూడండి; "విభుడు చక్రియను నవి రెండును సంస్కృతశబ్దములేయగుటచే జవర్ణమునకు సవర్ణమురావచ్చునని వైయాకరణుల మత
57
రాజరాజ కాలమందున్న తెనుగుభాష
మయినను నిచ్చట సవర్ణము శ్రుతి కటువుగానున్నది. మఱియు జవర్ణము తాలవ్యము. సవర్ణము ద్మత్యోచ్చారణము గలది.” ఇట్లు తమ యిష్టానిష్ట ములే సాధుత్వాసాధుత్వములకు ప్రమాణముగా విధించి ప్రాచీనుల కృతుల లోని భాష దిద్దుటకు సాహసించేవారు ప్రాచీనాంధ్రభాషానుశాసకులుగా నుండుట ఆంధ్రభాషాపాండిత్యము నోచిననోముల ఫలముకాక మరేమిటి? తిక్కన విరాటపర్వమందు “ఎలుంగుసలింప” (చూ.11.139)అనివ్రాసి నాడయ్యా అంటే పంతులవారు “మాచెవికి ఇంపుగాలేదు గనుక తప్పే; తుడిచిపారేయవలెను“ అనిశాసిస్తారు; లోకము నోరుమూసుకొనవలసినదేనా? శ్రీనాదుమహాకవి క్రీ.శ.1416 వ సం. జనవరి తే 14 దీని స్వయముగ రచించి వ్రాసి సంతకముచేసి రాతిమీద చెక్కించిన శాసనములోని భాష “శిలాక్షరములు“ నేటికిన్ని ఉన్నది. దానిలో “అరిరాయబనువంశంకరుండు” అని రాజుయొక్క బిరుదు పేర్కొన్నాడు. అందులో ఉన్న “బనువ” శబ్దము తప్పని “బసవ అని చదువుడు“ అనిపరిష్కర్తలు అనుశాసించినారు. అనితల్లికలువచేరు శాసనములోకూడా (చూ.98 వ పంక్తి) “బసువశంకర:” అనివున్నది. అది తప్పని ఈపరిష్కర్తలు చెప్పక ఊరకున్నారు. అప్పుడు అది ఒప్పుగా కనబడ్డదికాబోలు, వారిచిత్తం, ఆంధ్రభాషభాగ్యం! శ్రీనాదుడు నైషధమునందు (చూ.IV.145)”అరివీరబసువశంకర” అనివ్రాసినట్లు అనేక వ్రాతప్రరులలో కనబడుతున్నది. కాని, వేదము వేంకటరాయశాస్త్రుల వారు పరిష్కరించి అచ్చువేయించిన పుస్తకములో “బసవ” అని ఉన్నది. శబ్దరత్నాకరమందు “బసవడు” “బసవన” ఉన్నవి; గాని “బసవలేదు. పంతులవారలు శాస్త్రులవారలు ఏప్రమాణమునుబట్టి “బసవ” తప్పన్నారో చెప్పరు.
పైనివివరించి చెప్పినదానినిపట్టి ప్రాచీనాంధ్రభాషాస్వరూపము నిష్కృష్టముగా నిశ్చయించి నిరూపించుటకు తగిన సాదనాసామగ్రి సంపన్నముకాలేదని చదువరులు తెలుసుకోవచ్చును. అందుకు ఆధారముగా ఉన్న వ్యాసావళి
59
రాజ రాజ కాలమందున్న తెనుగుభాష.
రాజరాజనరేంద్రుడు కీర్తికి సమాధానముగా నన్నయ రచించిన భారతమున్నది. ఇది రాజమహేంద్రవర మందు వెలసినదవుటచేత దీనియందు అక్కడివారికి అత్యంతగౌరవముండుట ఉచితమే. వారితోపాటు తెలుగువారందరున్ను దానిని ఆదరిస్తున్నారు. అయితే తెలుగుపాండిత్యముయొక్క దురదృష్టముచేత, నన్నయభారతము పుట్టి తొమ్మిది శరాబ్దములయినా, నిర్దుష్టమై విశ్వసనీయమైన పాఠములుగల గ్రంధము దొరకదుగదా. ఇంతవరకున్న తగిన ఉద్యమముచేసి ఈ పవిత్రగ్రంధము యధాస్దితిలోనికి ఉద్దరించక ఉపేక్షించి బాషాభిమానులు మిధ్య అని తెలుగువారికి అపకీర్తి కలుగుతుంది. మహానుభావులు, కార్యదక్షులు పట్టుదలతో పనిచేస్తే శీఘ్రముగానే ఉద్దేశమునెరవేరు తుంది. ఇప్పుడువిజృంభించిన దేశాభిమానమున్ను భాషాభిమానమున్ను వాస్తవమయితే ఈకార్యము చేంబూని కొన్నివారికి కావలసిన సాయము దొరకకపోదని నమ్ముచున్నాను.
{{{1}}}