వేమన/ ఐదవ యుపన్యాసము

వికీసోర్స్ నుండి


శ్రీః

ఐదవ యపన్యాసము

వేమన యోగసిద్ధి-మత ప్రచారము

వేమనకు లంబికాశివయోగివలన యోగమార్గోపదేశము లభించెనని చెప్పితిని. ఆ యోగ సాహాయ్యముచే వేమన యేమి సాధించెనని యూహించుటకు ముందు యోగ సామాన్యస్వరూపమును గొంతవఱకు నెఱుఁగవలసి యున్నది. సాధకు నకుఁ దప్ప తక్కినవారికి దీనినిగురించి చర్చించు నధికారమే లేదు గావుస నీ విషయమును దడవుటకే భయపడుచున్నాను." కాని విధిలేదు. బహిరంగమైస బుద్ధితో ఎంత నాకు గ్రహించుటకు సాధ్యమో యంత మనవి చేయుచున్నాను

సకల జగత్కారణమైన మూలవస్తువొకటి కలదని మన ప్రాచీనులు వేలకొలఁది యేండ్ల క్రిందనే గ్రహించిరి. దాని తత్త్వము నెఱి(గిస పక్షమున, నృష్టియందలి సందేహములకెల్ల నందు ప్రత్యుత్తరములు లభించుననియు, బంధములన్నియు నుడుగుననియుఁ దల(చిరి

               “భిద్యతే హృదయగ్రస్ట్ శ్చిద్యనే సర్వసంశయా?
                 క్షీయన్తే సర్వకర్మాణి తస్మిస్ దృష్టి పరావరే "*[1]

అది సగుణమయినను నిర్గుణమైసను సూన్యమైనసు దాని స్వరూపము ననుభవ పూర్వకముగ నెఱుఁగక తీఱదని తేలినది. కాని చాని నెఱుఁగుట యెట్లు ? మితమైన గల కన్ను ముక్కు మొదలగు బహిరింద్రియములచే సాధ్యముగాదు. సాధ్య మైనచో అమితమైన ప్రభావముగల మనస్సును అంతరింద్రియముచేతనే కావలయును. యీ మనస్సు చంచలమైనది. నిమేష కాలమైనను ఒకవిషయమును ధ్యానించు స్థ్యములేనిది. డానికితోడు శరీరమందును సంసారమందును గలుగు వివిధావస్థలు నిని ఒకచోట నిలుపనీయవు. కావున మనస్సు ఈ దేహమునకును బహిస్సంసారము కును లోబడక తనంతట అఖండముగా నిలిచి కార్యమును నిర్వహించు మార్గ మొకటి వెదకవలిసివచ్చెను. ఆదేయోగము

               యదా ప్రజ్ఞావరిష్టన్తే జ్ఞానాని మససాసహ
               బుద్ధిశ్చన విచేష్టతి తామాహుః పరమాంగతిమ్
               తాంయోగమితి మన్యన్తే స్థిరామిన్షియాధారణామ్"
                                                                                 —కఠోపనిషత్తు 210

(ఎప్పడు పంచేంద్రియములు మనసుతోఁజేరి నిలుచునో, బుద్ధియల్లాడదో, అదియే పరమగతి ; అట్టి యింద్రియథారణమే యోగమందురు.) బ్రహ్మధ్యాన మావశ్యకమనియు, దానికి మనోనిగ్రహము దేహదండనమును చేయక తీఱదనియు నన్ని దేశములవారు సంగీకరించిరి. కాని, ఆ దేహమనోనిగ్రహ మార్గమును ఉపక్రమోపసంహారములతో సక్రమమైన శాస్త్రముగా నేర్పఱచిన గౌరవము, నే నెఱింగినంతవరకు, హిందువులకే చెల్లవలసియున్నది. దేహమును స్వాధీనపఱకొసవలయునని నానావిధముల దండించి, మనసును బిగఁబట్టి బహిరంగములనుండి విడఁదీసి, లోపలధ్యానమునకుఁ బూనుకొన్నప్పడు, పై రెంటికిని కలుగు అనేక పరిణామములను, అనుభవములును చక్కఁగా గమనించి, అందుఁగలుగు అనిష్టఫలములు నివారించి, ప్రధానోద్దేశమగు పరబ్రహ్మానుభవమును సాధించుట కెన్ని పద్ధతులు గావలయునో, యవన్నియు ననుభవపూర్వకముగా యోగ శాస్త్రకారులు వ్రాసిరి.

యోగాభ్యాసుల మొదటి ధర్మము తమ యందలి దుర్గుణములను వదలుట. యోగ్యత సంపాదించుటకు మొదలు అయోగ్యతను పోఁగొట్టుకొనపలయును గదా?" దేహబలమును సంపాదించుటకు మొదలు రోగములకు మందుదిన్నట్లు. ఒకరిని. హింసింపక, అసత్యమాడక, ఒకరిసొమ్ము దొంగిలింపక, ఇంద్రియలోలుఁడుగాక, తనకెంత ముఖ్యముగా కావలయునో యంతకన్న నెక్కువ దానమిచ్చినను గ్రహింపక యుండుట మొదటిమెట్టు. ఇదే యమ మందురు.

తరువాత పరిశుద్ధముగా నుండుట, సంతోషము, తపస్సు, వేదశాస్త్రములు చదువట, భగవద్భక్తి-వీనిని సాధింతురు. ఇవి నియమ మనఁబడును.

ఇట్లు దేహమనస్సులు కొంతవఱకు పరిశుద్ధములైన తరువాత దేహమం దిది వఱకున్న రోగములు నశించుటకును, క్రొత్తవి రాకుండుటకును శ్రమము, సహించు శక్తి గలుగుటకును కొంత వ్యాయామము చేయుదురు. వ్యాయామ మసఁగా 'గారిడీ" లోఁగాని, ఇప్పటి స్కూళ్ళలోఁగాని చేయునట్టిదిగాదు. చేతులు, కాళ్ళు మొదలగు నవయవములు ప్రత్యేకముగాఁగాని, మొత్తముగా దేహమునుగాని, యేదైన నొకగతిలో పలుమాఱు ఆడించుట యిప్పటి పద్ధతి. ఇందువలన కండలు మాంసము బలసి దేహమున కొవ్వుపట్టును. ఒక విధమైన నిలుకడలేని చురుకుcదనము గలుగును. యోగులయుద్దేశమదికాదు. శ్రమమును సహించుట, దేహమందు జిడ్డుపెరుగనీక లఘువుగా చేసికొని నెమ్మదిని సంపాదించుట-ఇవి వారు కోరునది. కావున ఏదో యొక కష్టమైన తీఱులో చాల ప్రాద్దు నిలుచుకొని యుండుట, కూర్చుండుట, పరుండుట, వారు సాధింతురు. వీని వాసవము లందురు.

ఇంతై నను దేహమున కెప్పడును చలనమునిచ్చి తన్మూలమున మనస్సును చలింపఁజేయు వస్తువొకటి గలదు. ఆది వాయువు. దానిని స్థిరముగా నిలుపనిది మనస్సు నిశ్చలము గానేరదు.

               "చలేవాతే చలంచిత్తం నిశ్చలే నిశ్చలంభవేత్"
                (గాలిగదలిన మనసుకదలును ; ఆది నిలిచిన నిదినిలుచును.)
                                                                   (హఠయోగ ప్రదీపిక, ఉపదేశము 2, ప. 2)

కావున లోని యూపిరి బైటికిఁ బోనీయక, బైటియూపిరి లోనికి రానీక లోపలనే పట్టి నిలుపుట యావశ్యకము. దీనినే ప్రాణాయామమందురు. దీనిచే" మనస్సు నావరించియున్న మాలిన్యములన్నియు నశించు నందురు. తరువాత కన్ను, ముక్కు మొదలగు పంచేంద్రియములు తమకు విషయము. లైన, రూపము, వాసన, మొదలగు వానియెడఁ బోనీయక మనస్సేప్రక్కఁబోయిన నా ప్రక్క పరాధీనములై యుండునట్లు సాధింపవలయును. ఇదే ప్రత్యాహారము. ఇవి యైదును బైటి సాధనలు.

ఇట్లు శరీరము స్వాధీనమై మనన్సునకు చాంచల్యము తగ్గినపుడు తమకిష్ట మైన యే వస్తువునందైన మనసు నిలుపవలయును. ఇది ధారణ, అది తప్ప తక్కిన వృత్తులందు మనసును పోనీయక నిలుపుట ధ్యానము. ఈ రెంటియందును " నేను, దీనిని, ధ్యానించుచున్నాను" అను ధ్యాత, ధ్యేయము, ధ్యానము అను మూఁడు పదార్ధములు గలవు. ఈ ధ్యానము ఇల్లే సాఁగనిచ్చినయెడల మనము ధ్యానముచేయు వస్తువు మాత్రము నిలిచి, నేననుకర్త, ధ్యాన మనుక్రియ ఈ రెండును అంతరించును. దీనినే సమాధి యందురు. ఇదే అష్టాంగ యోగము.

ఈ సమాధి రెండువిధములు : సంప్రజ్ఞాతమని ; అసంప్రజ్ఞాతమని, మొదటి దానిలోఁ గూర్చున్న యోగికి మొదలు ధ్యేయవస్తువుయొక్క స్థూలరూపము గోచరించి క్రమముగా దాని నూక్ష్మరూపముగూడ స్పష్టమగును. ఆ మూలప్రకృతి గోచరించినపుడు 'బుతంబర' యను నొకవిధమైన ప్రఙ కలుగును. దానిచే యదార్థ జ్ఞానము గలిగి సందేహములన్నియు నివర్తించును. శ్రుతిప్రమాణముచేతను, అనుమాన ప్రమాణముచేతను గలుగు తెలివికన్న ఈ 'ఋతంబర' యను తెలివి గొప్పది. ప్రత్యక్షము, పరోక్షము, భూతము, వర్తమానము, భవిష్యత్తు అను భేదము లేక యన్ని విషయములును సాక్షాత్తుగా నిందుగోచరించును. ఈ సంప్రజ్ఞాత నమాధిగూడ అభ్యాన బలముచే క్రమముగా నశించి అసంప్రజ్ఞాతసమాధిగా మాఱును. ఆ యవస్థలో ఆ మిగిలిన ధ్యేయవస్తువు స్పూర్తియగుటగూడ నశించి కేవల నిర్మలజ్ఞానముగా మాత్రము శేషించియుండును. ఇదే కైవల్యావస్థ. ఇవి పాతంజలియోగశాస్త్రముచే గ్రహింపఁగల ముఖ్యవిషయములు.

కాని యీ యభ్యాసప్రవాహములో ముఖ్యమైన యీశ్వరవ్యక్తి యొక్కడనో మునిఁగి పోయినాఁడు ! ఈ మతము ప్రకారము ఈశ్వరుఁ డక్కరయే లేదు. ఉన్న, యోగసాధనమునకు మేలు. అంతే. నామరూప మయమైన యీ ప్రపంచ మందలి పరిణామములు, తాపములు, సంస్కారములు, పరస్పరవిరుద్ధములగు సత్త్వరజస్తమో గుణములు—వీనిచేత పుణ్యమైనను పాపమైనను, సుఖమైనను దుఃఖమైనను అంతయును వివేకముగల వానికి దుఃఖముగానే తోఁచును గావున*[2] ఇన్ని వ్యవహారములకు హేతువైన చిత్తమును స్వాధీనము చేసికొనుట, దాని కల్ప నలు తన్ను ఆవరింపకయుండునట్లు అడ్డగించుట, ఇవే పరమార్థమని వీరిమతము. అదే మోక్షము. ఇట్లగుటచే, మూలకారణమును వెదకc బ్రయత్నించి, తుదకది దొరకక యీ కష్టములనుండి తప్పించుకొను మార్గమును వెదకుకొని వీరు కృతార్డుల మనుకొనిరా యని సందేహము గలుగుచున్నది. కాని, సంప్రజ్ఞాత సమాధిలో నున్నపుడు అతీతానాగతజ్ఞానము, అపరోక్షజ్ఞానము, విచిత్రమగుప్రతిభయుఁ గలుగు నని చెప్పదురు గాన, ఆదియే సత్యమగునేని మనకు సామాస్యముగఁ గలుగు ప్రశ్నలకన్నిటికిని అందు ప్రత్యుత్తరము దొరకవలసి యుండును. ఐనను యోగు లెవరును ఆ ప్రత్యుత్తరములు నిస్సందేహముగాఁ జెప్పి మనల నుద్ధరించి యుండ లేదు. కావున నీ యోగశాస్త్ర కైవల్యము, అప్పులవారి భాధలు పడలేక యింటి మూలలో దాఁగుకొని తలుపువేనుకొనుట వంటిది తప్ప, నిజమైన జ్ఞానమోక్షమగునా యని శంకింపవలసియున్నది. ఇట్లు సందేహించిన వారికిట్లు ప్రత్యుత్తరము గలదు:

               “సోయమేవాస్తు మోక్షాభ్యోమాస్తుతావా ఒపిమతాస్తరే,
                మనఃప్రాణలయే కశ్చిదానన్ద స్సంప్రవర్తతే"
(మతాంతరు లిది మోక్ష మననిండు, కాదన నిండు. మనన్సు ప్రాణమును లయించె నేని యొకవర్ణింపరాని యానందము మాత్రమున్నది)
                                                                                      (హఠయో, ఉప. 4, ప. 30)

కాని మన ప్రశ్న కిది ప్రత్యుత్తరముగాదు. మఱియు, యోగశాస్త్ర ప్రవర్తకుడగు పతంజలి యిూ 'ఆనంద’ మను పేరే యెత్తలేదు. "దుఃఖమేన సర్వం వివేకినః" అని చెప్పిన యతఁడు సుఖదుఃఖరూపమగు చిత్తధర్మ నాశమే మోక్షమనియెను. ఆ ముక్తావస్థలో ఆనందమును గీనందమును ఒకటియ లేదని భోజరాజు స్పష్ట ముగా వ్రాసెను.*[3] ఆద్వైతులు ముక్తావస్థయందు సచ్చిదానందమయమగు బ్రహ్మ సాక్షాత్కారము-అనఁగా, తానే బ్రహ్మగానుండుట-కలుగుననిరి. శైవలగు వద్వైతులును ఇట్లే తలంచిరి.

               క.ఆమనస్క సౌఖ్యమద్భుత
                  మమలం బసదృశ మఖండ మక్షయ మవిత
                  ర్క్య మచంచల మమృతమయం
                  బమితంబది యెఱుఁగుదురు మహాసిద్ధవరుల్"
                                                                             (శివయోగ సారము, 4 ఆశ్వాసము)

ఇట్లు కేవల యోగులకును అద్వైత యోగులకును అసంప్రజ్ఞాత నమాధి ఆనంద రూపమా శూన్యరూపమా యను విషయమున భేదముకలదు గాని యద్వైత విషయమున-అనఁగా, రెండుగాక యొకటిగా మిగులుటలో భేదములేదు. ఈశ్వరుని కేవల మొకసాధనముగా మాత్రము గొని సుఖదుఃఖములు రెంటినుండియు విడుదల పొందఁ గోరిన కేవలయోగులను వదలితిమేని, ఈశ్వరసాక్షాత్కారమే ప్రధాన ఫలముగాఁ గొని సాధించు నితర యోగులందును ఆ కడపటి సాధనావస్థలో అనందమున్నదనియే చెప్పెదరు. అది యట్లుండె,

ఆట్టి కైవల్యమును శాంతమార్గమున సాధించుటకు చాల దినములు పట్టును. అనేకుల కాయువు చాలదేమో యను భయము గలుగును. కావున సాధ్యమైనంత త్వరలో దానిని సాధించి ము_క్తి పొందఁగోరువారు దేహమనస్సుల నెక్కువ బలవంత పెట్టి లొంగఁదీయుదురు, ఈ మార్గమునకే హఠయోగమని పేరు. "హ"కార మునకు ఊర్ధ్వగతియగు ప్రాయివాయువును"ఠ'కారమునకు అధోగతిగల అపాన వాయు వను అర్థమcట. ఈ రెంటికిని ఐక్యము సంపాదించి సాధించుట హఠయోగము. కావున వీరికి దేహ మనస్సులను దండించు ఆసనప్రాణాయామములు ముఖ్య ములు. ఇది గాక దేహమందలి రోగములను నశింపజేయుటకును, శ్వాసకోశములు, కడుపు, నాసారంధ్రములు మొదలగు వానియందలి కఫాదిదోషములను బోఁగొట్టు కొనుటకును, ధౌ తి, నౌళి మొదలగు కర్మములను, బ్రహ్మచర్యమును సాధించు టకు వజ్రోళిమొదలగు యోగములును వీరు సాధింతురు. ఈ మార్గములచే సాధింపగా కడుపుక్రింది మూలాధార మందుండెడు కుండలిని యనుశక్తి, నిద్రించు చుండెడిది, పైకిలేచును. అప్పడు కుడియెడమ ముక్కులందలి ఇడ, పెంగళ అను నాడులలో సహజముగా సంచరించు వాయువు, ఈ రెంటి నడుమనున్న సుషుమ్న యను నాడిమూలముగా ప్రవహింపఁగల్గును. దేహమందు మూలాధారము మొదలు బ్రహ్మరంధ్రమువఱకును ఆరు చక్రములు గలవు. కుండలినీశక్తి చలించి సాధనబలముచే పై చక్రముల నన్నిటిని క్రమక్రమముగా భేదించి కట్టకడపటిదగు నహస్రారచక్రమును జేరఁగా, అందు బ్రహ్మ సాక్షాత్కారమై యసంప్రజ్ఞాత సమాధి కలుగును. అదే జీవన్ముక్తి. ఈ కుండలినీ యుద్బోధముగానిది బ్రహ్మాస్థానమును బొందవీలులేదు.

               “యేన మారేణ గస్తవ్యం బ్రహ్మస్థానం నిరామయమ్
                ముఖేనాచ్బాద్య తద్ద్వారం ప్రసుప్తా పరమేశ్వరీ”
(బ్రహ్మస్థానము నేమార్గముతోఁ జేరవలయునో యామార్గపు ద్వారమును ముఖముతో నడ్డగించి మూసి, ఆ పరమేశ్వరీశ క్తి (కుండలిని) పరుండి యుండును.)
                                                                                (హఠయోగ, ఉప. 3, ప.6)

కావున దానిని లేపుట ముఖ్యము. ఇట్లు హఠయోగము సాధనము ; అసంప్ర జ్ఞాత సమాధి సాధ్యము. దానినే రాజయోగ మందురు.

కాని హఠయోగపద్ధతియందు రాజయోగసిద్ధికి విఘ్నముగలిగించు సన్నివేశ ములనేకములు గలవఁట. హఠయోగము కొన్ని సిద్ధులనిచ్చును. దాని సభ్యసించు వారికి చావుండదఁట. ఆధునిక శారీరశాస్త్రజ్ఞలు చావనఁగా నేమిగా నిర్ణయించిరో యొఱుఁగనుగాని యోగుల వాదము సులభమైనది. వాయువ గలుగుట బ్రతుకు : అది పోవుట చావు; కావున దానిని పోనీక బిగఁబట్టితి మేని చావెక్కడిది

             "యావద్బవ్లో మరుద్దే హే యూవచ్చిత్తం నిరాకులమ్.
              యావత్తృప్తిత్ర్చు తాపత్కాల భయంకుతః ?"
                                                                                     (హఠ, ఉప. 2, ప. 40)
        "తే. కట్టుపడియుండు నెంచాఁక గాలిమేన,
              చిత్తమొందాఁక నెందును జెందకుండు,
              కదలదెండాఁక భూమధ్య కలితదృష్టి,
              యసయసంచాcక ప్రాణభయంబులేదు"
                                                                                      (శివయో, 3 ఆశ్వా)

ఇదిగాక ఆకాశసంచారము, కామరూపము, పరకాయప్రవేశము మొదలగు విచిత్ర సిద్ధులు హఠయోగ సాధనచే లభించునఁట. కావున సాధకులు ముఖ్యఫలమగు సమాధిని విడిచి వీనితోనే తృప్తిపడియుండుట స్వాభావికము, అట్లగుటచే హఠ యోగమును బోధించువారందఱు దీనికి ఫలము రాజయోగమే యని తల(చి సాధింపవలయుసని హెచ్చరిక చేయుచున్నారు. ఆంధ్రయోగినులలో అగ్రగణ్యురా లగు తరిగొండ వెంకమ్మ యిట్లు చెప్పినది

           "మఱికొందరీ మహామహిమ గానకయ
            గురు నెఱుంగక కర్మగురు చెంతఁజేరి,
            గాధకుఁజిక్కి దుష్కర్మ మార్గమున
            సాధనంబుగ యోగ సరణులఁ దెలిసి,
            యలమట నాసనాభ్యాసముల్ చేసి,
            చలమున బాహ్యలక్ష్యములు చూపచును,
            కూలంకషము లోని గురిగానలేక,
            లాలితంబుగ్స్ మంత్రులయహర యోగ
            ఫలములం గోరుచుఁ బామరులగుచు,

 
            జలబుద్భుదమువంటి జన్మంబులకును
            సిద్ధులంగోరి ప్రసిద్ధమై యోగ
            సిద్ధాంతమందు సుస్థిరమతిలేక,
            అగణిత విషయసుఖాసక్తిమీఱ,
            తగమణిమంత్ర సిద్ధ క్రియల్ నేర్చి,
            మణి పామరులకెల్ల మహిమలంజూపి,
            తిరిగెడు వారలీదేహవాసనలు,
            వీడఁగ నేరరు, వేదాంత మందుఁ,
            గూడనేనరు వట్టికుంభన గాని..."
                                           (రాజయోగసారము, ద్వితీ, ప్రక)

           కాని హఠయోగ సాధనము లేనిది రాజయోగము ఫలింపదఁట !

          “మ.హఠశూన్యంబయినకా ఫలింపదమలంబౌ రాజయోగంబొగిన్ ;
               హఠయోగంబును రాజయోగరహితం బౌనేని సిద్ధింప ; దీ
              హఠరాజంబులు రెండు(గూడ సతతాభ్యాసంబుఁ గావించు ని
              శ్శరనిస్సంశయభవ్యమానసునకున్ సాధ్యంబగున్ సర్వమున్."
                                                          (శివయోగసారము, 2 ఆశ్వా)

ఈ హఠవిద్యకే సంబంధించిన ' ఉప యోగములు రెండు గలవు. మంత్ర యోగము ; లయయోగము. మంత్రముల జపించుచు తన్మయుఁడగుట మొదటిది : ప్రాణాయామథ్యానముల దేహము శుద్ధమైనప్పడు లోపల నొకవిధమైన నాదము అఖండముగా వినఁబడునఁట. బైట మనము విను శబ్దము ఆహతము. అనఁగా, దెబ్బ గొట్టుటచేఁ గలిగినది. ఇది యనాహతము. అనఁగా, మన మెఱిఁగినట్లు ఏరెండు పదార్ధముల ఒరయికయును లేకయే కలుగునది.

     "మత్త, ఆ యనాహతనాద మెంతయు నుద్భుతంబయి యాత్మలో
              మ్రోయుచుండు నిరంతరంబు సముద్ర ఘోషముభంగి, భృం
              గాయతధ్వని రీతి, వేణుసమంచిత స్వరలీల, వీ
              ణాయతంబగు మ్రోత చందమునకా మనోలయ హేతువై"
                                                              (శివయోగ., 3 ఆ.)

ఆ నాదమునే వినుచు ఆందు మనఃప్రాణములను లయింపఁజేయుటయే లయయోగ మందురు. హఠయోగప్రవర్తకుఁడగు " శ్రీఆదినాథుఁడు" సప్పాదకోటి లయ ప్రకారములను జెప్పినాఁడఁట ! అందులో నాదలయమే ముఖ్యమని తలఁచి హఠయోగులు సద్య మనలను బ్రదికించిరి! (హఠ, 4, ఉపదే, ప. 66)

వేమన్నకు గురువైన 'లంబికాశివయోగి' యిూ హఠయోగుల గుంపునకుఁ జేరినవాఁడు. 'లంబిక' యనునది లంబికాశబ్దభవము. దవడలని యర్ధము. వానిపైఁ గల శిరోరంధ్రములో నాలుకను జోనుపవలెను. భ్రూమధ్యమందలి యెడమప్రక్క చంద్రస్థానము గలదు. నాలుకను ఆ చంద్రస్థానము నంటునట్లు చేయవలెను. అప్పడొక యగ్ని జనించును. దానిచే ఆ చంద్రస్థానమునుండి కరిఁగి అమృతము స్రవించును. దానిని త్రాగిన యోగికి రోగము, చావు, ఆకలి, దప్పి, ఆలస్యము, నిద్ర మొదలగున వేవియు నుండవు, కాని నాలుక యంతపొడవుగా సా(గుట యెట్లు ? మూcడు సాధనములు : నాలుకక్రింది నరమును క్రమముగా కోసివేయుట; వ్రేళ్ళతోఁబట్టి ప్రక్కలకల్లాడించుట ! ఆవు చన్ను పిండినట్లుగా లాఁగుట ! ఇట్లు కృత్రిమముగా నాలుకను పొడిగించుకొని, పైఁ జెప్పిన లంబికావివరములోఁ జొనిపి క్షణార్ధముండినను యోగి విషవ్యాధిమృత్యువులను దప్పించుకొనునఁట!*[4] దీనినే లంబికాయోగమనియు, ఖేచరిముద్రయనియఁ జెప్పదురు. కాని యిది బాహ్యఖేచరి. అంతఃఖేచరి వేఱట. కన్నులు సగము మూసి దృష్టిని నాసాగ్రమందు నిలిపి చూచిన మండలాకారమైన తేజోదర్శనమగును : ఇందు మనఃప్రాణములు లీనముచేసి రెప్పలల్లార్పక చూచునతండు జగద్గురుండగు" ననియు, నదియే నిజమైన ఖేచరియనియుఁ జెప్పదురు ; మరియు

      "మ. ధరణిం గొందఱు నధురూ క్తగతి నంతఃఖేచరీ ముద్రికా
             వరభావం బెఱుఁగంగ నేరకకదా వాలాయమున్ బాహ్య ఖే
             చరియున్ బట్టి నిరూఢసాహస మహాసంరంభ విస్రంభ ని
             ష్టురులై జిహ్వల(గోసి కొం డ్రది ముముక్షుల్ మొత్తురే యిత్తఱిన్!"
                                                                     (శివయో, 4 ఆశ్వా)

లంబికా శివయోగి యొకవేళ నీ యాంతరఖేచరిని తరువాత నెఱిఁగి యాచరించి యుండిన నుండవచ్చును గాని, మొదలితఁడు నాల్కను గోసికొన్న వాఁడే యని యతని పేరే తెల్పుచున్నది. అనఁగా నితనికదే పేరని కాని, అసలా పేరుగల వ్యక్తి యొకఁడుండి వేమన్నకు గురువైనాఁడని కాని కచ్చితముగాఁ జెప్పలేము. మఱి యిటువంటి యోగి యెవనికో యతఁడు శిష్యుఁడైయుండక తప్పదు. కావున వాడుకలో నున్న యతనినే గురువుగా నంగీకరింతము. ఆ గురువవద్ద శిష్యునికిని ప్రప్రథమమందు పై హఠయోగవిద్యలో నుపదేశము జరిగినది. ఇతఁడును నాలుకను గోసికొన్నాఁడు. ఎవఁడో నావంటివాఁడిదంతయు వట్టి బ్రాంతియని తిరస్కరించెను గా(బోలు. వాని నొప్పింపలేక, గురువుగారి యందలి నమ్మకముచేతనో, తన యనుభవముచేతనో దానియందు సందేహములేక యిట్లు ఆక్రోశించినాఁడు :

           "ఖేచరీ ముద్రకు కీలెఱుఁగగ లేక
             వాదులాడునట్టి వారినెల్ల
             త్రొక్కి నాల్కcబట్టి తుదఁ గోయవలయురా !
                       (ఓ. లై., 13-4-16 ; మఱియు, పెక్కు వ్రాఁతప్రతులు)

ఇట్లే పంచాక్షరీ మంత్రము, ద్వాదశాక్షరీ మంత్రము మొదలగు వానిని గూడ నితఁడు కొన్నాళ్ళు జపించినట్లున్నది. 'ముక్తికి(దాఁ దల్లి సుమీ పంచాక్షరీ" యని (వే. సి., 120) యితఁ డన్నాఁడు. తరువాత ప్రాణాయామసాధనకు మొదలిడి నాఁడు. 'ఊఁగి లాగిలాగి యొనరఁగ బిగఁబట్టి పూని గాలి విడిచి" (558) దానిని సాధించినాఁడు. ఆ సందర్పమున నితనికి

        "క, భువి పొందుటుడిగి దూర
             శ్రవణంబును దూరగమన జవమును, నమృత
             స్రవమును, సుదూరదృష్టియు,
             సవిరళ నాదశ్రవణము నగు మోదమునన్"
                                                    (శివయో., 3 ఆశ్వా.)

అని చెప్పిన సిద్దులలో తక్కిన వెట్లుండినను, నాదశ్రవణము మాత్రము కలిగినది ఆ లయయోగమును దా ననుభవించినాఁడు

       "ఆ. నాదమలరఁ జేసి నాదంబుఁ జొంగించి
            భేదమింతలేక పెనఁగినపుడు
            పాఱు కాల్వవలెను పాఱురా యీనాడు..." (2186)

ఇట్లే షట్చక్రభేదనమగు కుండలీయోగమును గూడ సాధించినాఁడు (3152-56) ఆందులో కడపటి సహస్రారచక్రమును జేరు సాధనలో'

       "ఆ. నిటలదుర్గ మెక్కి నిక్కి చూడంగనె
             కుటిలరూప కళలఁ గూరుఁ నెఱుక." (2222)

అట్లగుటచేత, ఇంకను పూర్తిగా ఆద్వైతానుభవములేక మనసు చలాచలముగా నున్నది గావున, ఆత్మ పరమాత్మల స్వరూపము వేఱు వేఱుగాఁ దెలియఁగోరియు. నది యింకను సాధ్యముగాక.

       "ఆ. నినుఁ జూచెనేని తన్ను తామఱచును
             తన్నుఁ జూచెనేని నిన్ను మఱచు ;
             ఏవిధ్ధమున మనుజుఁ డెఱుఁగు నిన్నును దన్ను?..." (2240)

అని కష్టపడినాఁడు. ఈ సంప్రజ్ఞాత సమాధియందే స్వగుణ స్వరూపము క్రమముగా నట్లు అనుభవమునకు వచ్చునఁట.

       "క. శ్రీ వెలయఁగ సాకారము,
            నావల దీపాకృతియును, నాశిఖలాగున్
            నివార శుకరూపము
            భావన వణువిధము, సగుణభావములై దున్?
                                                     (శివయోగి., 1 అ.)
ఇట్టి తేజోదర్శనము చేమన్నకును గలిగినది.

     "ఆ. కనులు రెంటి నడుమ కాసంత నిలిపిన
           బొమలు మీఱి చూడ్కిఁ బొందఁజేయు,
           క్రమమెఱిఁగి లోన కాంతిని బట్టరా..." (913)

కాని యింతటితో నుండక----

     "ఆ. కనుల చూపు నిలిపి కాంతిని గమనించి
           కాంచవలెను చిత్రకళల దాఁటి..." (910)

ఆనుకొని సాధింపఁగా, భావరూపమైన పైఁజెప్పిన యుపాస్యవస్తువు అభావ స్వరూపముగా మాఱి తుదకు సోహంభావసాధనచే "భావాభావాతీతం' బైన నిర్గుణము అనుభవమునకు వచ్చినది. అది 'వియత్సదృశంబై-అనఁ గా, ఆకాశమువలె బయలై-యుండునఁట. *[5]ఆ బయలంచే బ్రహ్మమున్నదంట

       "ఆ. తెలివి నిలిపిచూడు దీపించు నాకళల్,
             కళలుడుపకచూడు కలుగు బయలు ;
             బయలు నంటిచూడు బ్రహ్మంబు గాంచెదు..." (1963)

కాని యా బయలే బ్రహ్మ యని వేఱొక్కచోట వేమన చెప్పెను—

             "క, బయలన సర్వముఁ బుట్టును,
                  బయలందే లీనమగును, బ్రహ్మంటనఁగా
                  బయలని మదిలోఁ దెలిసిన
                  బయలందే ముక్తి బట్టబయలగు వేమా" (2696)

మఱియు నాబ్రహ్మము తానే తప్ప వేఱుగాదని తేల్చుకొనెను. *తన్నుఁదా నెఱిగిన(దానెపో బ్రహ్మంబు' (2788) కావున "ఏవిధమున మనుజుఁ డెఱుఁగు నిన్నును దన్ను?' అని వెనుక వేసిన ప్రశ్నకిప్పడు ప్రత్యుత్తరము లభించినది

            "ఆ. నిన్నుఁ జూచుచుండ నిండును తత్త్వంబు,
                  తన్నుఁ జూచుచుండఁ దగులు మాయ ;
                  నిన్ను నెఱి(గినపుడె తన్ను తానెఱుఁగును..." (2239)

తాను బ్రహ్మమైనపుడు తక్కినవన్నియు నేమి తప్పుచేసినవి ? కావున సమస్తమును బ్రహ్మమే. "బ్రహ్మమన్నిటఁ దగుఁ బరిపూర్ణమైయెప్పు' (2796) 

ఇట్లు రాజయోగపరమావధియైన యద్వైతానుభవమును సాధించిన వెంటనే, ఆసనములు, ప్రాణాయామము మొదలగు హఠవిద్యల నితఁడు తిరస్కరించెను.

           "ఆ. ఏఱుదాఁటి మెట్టకేఁగిన పురుషుడు
                 పుట్టి నరకుఁ గొనక పోయినట్లు..." (760)

అని యితఁడే వేరొక విషయమై చెప్పిన న్యాయమువంటిదే కదా ! చూడుఁడు :

           "ఆ. ఆసనములు పన్ని అంగంబు బిగియించి
                 యొడలు విఱుచుకొనెడు యోగ మెల్ల
                 జెట్టిసాముకన్న చింతాకు తక్కువ." (337)
           "ఆ. కల్లగురుఁడు గట్టు నెల్లకర్మంబులు
                 మధ్యగురుఁడు గట్టు మంత్రచయము
                 ఉత్తముండు గట్టు యోగసామ్రాజ్యంబు..." (963)

కాని నాకొకటి తోచుచున్నది హఠమార్గము చాలకష్టమైనది. దానిని సాధింపఁగల యోర్పును సామర్థ్యమును గలవారరుదు. అనేకులిందలి సిద్ధుల కాసపడి యంతటితో చాలించుకొనుట సత్యము. అట్లు గాక రాజయోగమును సాధించి ఆత్మజ్ఞానమును సంపాదించుటకే దృఢచిత్తముతో హఠమును సాధించుచు కష్టపడువానిని జూచి కరుణదించి సమర్థ(డగు గురువు, స్వశక్తితో నొకనిమిషమందు శిష్యునికి అసంప్రజ్ఞాతసమాధినిగల్గించి బ్రహ్మసాక్షాత్కారముఁ జేయింపఁగలఁడఁట ! *సద్గురునాథ ప్రసాదంబున క్షణమున రాజయోగమున మనసు నాశమౌ తోడనె నాశమౌ గాలియు) (శివ. 4. ఆ.) దీనినే తాంత్రికులు *వేధదీక్ష' యందురు. శిష్యుని దేహమందలి షట్చక్రస్థానములనెఱిఁగి, మంత్రబీజాక్షరన్యాసముచేసి, మోకాళ్ళు మొదలు నాభి, హృదయము, కంఠము, దవడవఱకును గురువు' వేధింప' వలయునఁట. తోడనే శిష్యుడు పాపములన్నియు నశించి, బహిరంగ వ్యాపారము లన్నియు నిలిచి క్రిందఁబడునఁట. ఆతనికప్పడు దివ్యత్వముగలిగి సర్వము నెఱుఁగఁగలఁడఁట, కాని యట్టి సామర్థ్యముగల గురుశిష్యులిరువరును దొరకుట దుర్లభమఁట !*[6] వేమనకుఁగూడ హఠయోగమవలస వేసరియుండిన వేళలో గురువు ఈ వేదదీక్ష నిచ్చెను గా(బోలు. వివేకానందుఁడు మొదలగు శిష్యులకు రామకృష్ణపరమహంసుఁ డిట్టి దీక్షనే యిచ్చినట్లున్నది. *[7]

 
             "ఆ. గతముచేసిసట్టి కర్మబంధములెల్ల
                   పరిసి పోవు సత్యగురుని పలన
                   కుమ్మరి కొకయేడు గుదియకు నొకనాఁడు..." (1249)
                                  (గుదియకునొకయేటు' అని వ్రాఁతప్రతులు)

ఇదియే నిజమగునేని ఆసనాదులు నిరర్ధకములని యితఁడు తిరస్కరించుట సహజము. కాని యితఁడు తనయనుభవము నితరులకు బోధించినపుడు అట్టి గురువు నాశ్రయింపఁడనిచెప్పలేదు; మిరే సాధింపుడన్నాడు.

            "ఆ. ధాత్రి జనులకెల్లఁ దగ నెఱిఁగించెద
                  నొసర హరుని జూచు నుపమయొకటి ;
                  మససు చెదరనిక మహిమతోఁజూడుఁడ్..." (2137)

            "ఆ. తారకంబుఁ జూచు దారివేఱే కద్దు,
                  సమముగాను జూడC జక్కCబడును;
                  వెఱ్ఱిగాను జూడ వెలుఁగెల్లఁ బాఱురా.." (1922)

అనఁగా నిది స్వప్రయత్నముచేతనే సాధింపవచ్చునన్నమాట. ఏమో ! ఎవ రెఱుగుదురు ?

 
           "ఆ. రాజయోగి మహిమ రాజయోగికిఁ గాక
                 యితరజనులకెల్ల నేమి తెలియు...? (3293)

ఇట్లు అసంప్రజ్ఞాతసమాధిమహిమచే తానే దైవమని యెఱిగిన వెంటనే, యదివఱకే యుందుమా పోదుమాయని యూఁగులాడుచుండిన హరిహరులు ఇతని ప్రపంచమునుండి యంతర్ధానమైపోయిరి. “తాను దేవుఁడైన దైవమే కొలుచురా (3293) యను వానిపద్ద నేదేపతలకుప్పు పుట్టును ? ఇతఁడు—

 
           "ఆ. బ్రహ్మఁ జంపి విష్ణుభాగంబులోఁ గల్పి .
                 విష్ణుఁ జంపి శివుని నీటగలిపి
                 శివునిజంపి తాను శివయోగి గావలె...." (2783)

అని సంకల్పముచేసి గెలిచినవాఁడు ! కావుననే వెనుకఁజెప్పినట్లు,

 
           "ఆ. బ్రహ్మవ్రాఁత కెదురు పల్కినవాడుఁను
                 ఆది విష్ణు సూత్ర మడఁచువాడు
                 మూఁడుకనులవాని మొనసి నిల్చినవాఁడు
                  కానఁబడరు నీవుకాని వేమ" (ఓ. లై., 12-1-30)

ఆని చెప్పకొని త్రిమూర్తలపై కసి దీర్చుకొనెను. కాని శైవఁడై పుట్టినందుకు అందఱిని అగువఱకు శిపునకు శిక్షనీయలేదు : అంతే గౌరవముగా పరమేశ్వరుఁడు సంతోషింపవలసియున్నది. పై రాజయోగసాధనవలస వేమన నిజముగా తత్త్వజ్ఞానమును సంపాదించెనా ? అతఁడు బోధించిన యద్వైతమే పరమతత్వమా అనుప్రశ్నలకు బదులుచెప్పట నాశక్తికి మీఱినపని, బ్రౌను దొర ఇతని సిద్ధాంతము అర్థము కానిదనియు నిష్పల మైనదనియుఁ జెప్పెను.* [8]నా కాధైర్యము లేదు. నాకింతమాత్రము నమ్మికగలదు : వేమన్న తాను తత్త్వజ్ఞఁడైతినని ధృడముగా నమ్మెననుటలో నందేహములేదు.

ఇట్లు ఇతఁడు ఈ సంసారుల ప్రపంచమునందలి దంభవంచనాదులకు రోసి, అందేమో శ్వేతద్వీపము గలదనుకొని బైరాగుల ప్రపంచమునఁ బ్రవేశించెను. కాని, పాపము, మనుష్యులయోగ్యత యెందుస్నను ఒకటే యనుతత్త్వమును అతఁడచ్చట నేర్చుకొనవలసి వచ్చెను. ఎందఱో యోగిబ్రువులు తాము సిద్దులమని, మాంత్రికుల మని, విరక్తులమని, తత్త్వజ్ఞులమని, వేషములు వేసి ప్రపంచమును ప్రతారణ చేయుచుండిరి, 'సర్వోపాయ పరిభ్రష్టావేశ్యాభవతి తాపసీ' †[9]యనునట్లు ఇంకెందును జీవనము జరుగనివారి కీ యోగివేషము కల్పవృక్షమువంటి దాయెను. తక్కిన విద్యల లోగుట్టును ఇతరులు చాలవరకు నెఱుఁగఁగలరు. కాని ఈ *యోగుల' కసరత్తులు, బహిరంగోపాసనములు, సమాధులు మొదలగు వానికి మోసపోనివా రరుదు. ఇట్టి వారిప్పటికిని మన సంఘమం దందు సంచరించి, చదువుకొన్నవారినే లోపఱిచికొని, సంసారములు ధ్వంసముచేయుచున్నారనుట మీరెఱుఁగుదురు'

 
               "ఆ. బ్రతుకుదెరువు లేని బడుగులందఱు పెద్ద
                     యోగివరులమనుచు సాcగిరాcగ
                     బండవాండ్రు ముందు దండంబు లిడుదురు..." (2773)

కడపటికిన్నాళ్ళు భోగమునందును యోగమునందును కష్టపడి యతఁడు నేర్చుకొన్న ముఖ్యవిషయములివి :

సంసారము సారములేనిది. దుఃఖమయము ; మాయారూపము; (ఈ 'మాయ' శబ్దమున కితనికి నిజమైన యర్థమేమో తెలిసికొను మార్గములేదు). ఈమాయ సంసారము మనసులోనే పట్టినది. దీనిని దప్పించుకొనుట ప్రధానపురుషార్థము దానికి కర్మములు పనికిరావు. ఉపవాసములు, విగ్రహారాధనలు మొదలగువానిచే ఆ మాయ తెగదు. కాcబట్టి 'కర్మగుణములెల్ల కడఁబెట్టి నడవమి, తత్త్వమెట్లు తన్నుదగులుకొనును?" (944) అని యితని ప్రశ్న. ఆ తత్త్వము నెఱుఁగుటకు మమతలు విడిచి మనస్సునిలిపి ధ్యానించుట చాలును. తక్కిన సాధనములక్కర లేదు. దీనికై యడవులకు కొండలకు పోఁబనిలేదు. పల్లెలలో ఇండ్లలోనుండియే చేయవచ్చును. కాని పట్టణములందుండకపోవుట మేలు. ఎందుకనఁగా :

 
              "ఆ. పట్టణంబులందు పతులకు సతులకు
                    మోహమెచ్చు దానియూహలెచ్చు
                    ముక్తిమార్గమునకు యుక్తియే తెలియదు..." (2384)

కనుక ఆ మోహమును వదలించు బ్రహ్మచర్యము ముఖ్యముగా సాధింప వలయును. కామాతురత్వము నిలుపుటకు అందలిరోఁత, దానివలని దుష్పలములును ఎఱింగి క్రమముగా స్వాధీనపఱుచుకొనవలసినదే కాని కృత్రిమములగు హఠవిద్యల చేతఁగాదు. ‘పేని గడ్డిగట్ట నేనుఁగు నిలుచునా? (943) యని యితఁడడుగు చున్నాఁడు. ఇది స్వాధీనమైనచో తక్కిన సాంసారికదుఃఖ హేతువులైన క్రోధ లోభాదులు వెంటనే నశించును. పంచేంద్రియములు పంచభూతములందు సంచ రించుచున్నన్ని నాళ్ళను ఈ జగత్తు ఉన్నట్లు కానవచ్చును (2335). కావున నా యింద్రియముల నంతర్ముఖముగాఁజేసి మనస్సులోఁ గలిపి చూచిన, ఇన్నిటికిని కారణమయిన జీవుఁడొక్కఁడే నిత్యమనియు తక్కినవన్నియు అనిత్యమనియుఁ దెలియును. ఆ జ్ఞానము గలిగిన తరువాత కన్నులు విచ్చి చూచినను ఆ జీవుఁడొక్కఁడే ఈ ప్రపంచమందలి చరాచర వస్తువులందెల్ల నంతర్యామిగా నున్నాఁడని తెలియును. అతఁడు లేనిదేదియు నిలువదు. కావున నదియే బ్రహ్మము. అనఁగా, తానే బ్రహ్మము. కావున నీ బహిః ప్రపంచమందొకరి యొక్కువయు నింకొక్కరి తక్కువయు లేదు. జాత్యాది భేదమున కర్థములేదు. వ్యావహారికమైన గౌరవము నకు కారణ మీజ్ఞానము. ఇది లేని వారందఅు నొక్కటే. కావుననే మైల, యెంగిలి మొదలగునవి యెల్ల వట్టి భ్రాంతులు.

ఎప్పడీ విషయములు ఇతని మనస్సుకు తట్టెనో, వాని నప్పడే తానాచరించి, మీరుసు అట్లుచేయుఁడని యితరులకు బోధింప మొదలు పెట్టెను. ఇదివఱకును నే నుదాహరించిన పద్యములవలన వేమన యందలి సృష్టిసిద్ధమైన స్వభావ మొకటి మీకు స్పష్టమై యుండును. అదేదనఁగా, ఉద్రేకము. ఇతఁడు చెడిన చేట్లకును, పడినపాట్లకును, సాధించిన సాధనలకును, అదేమూలము. మనసులోఁ దోcచినది నోటఁజెప్పటకును చేతఁజేయుటకును భేదమట్లుండఁగా, అసలంతరమే యుండదు. యమ నియమాది యోగసాధనలచే ఇతని కన్నియు సిద్ధించి యుండును గాని, శాంతి మాత్ర మొక్కువ సిద్ధింప లేదని చెప్పవలసియున్నది. తన కిష్టము కాని పనులు చేయు వారిని, తన మాటలను విననివారిని జూచి, వారి యజ్ఞానమున *కయ్యోపాప' మనుటకు బదులు ఇతని కసహ్యము జనించును. ఆ యసహ్యము మనసులో నుండక నోటినుండియు నసహ్యముగానే పలుమాఱు వెడలును! అట్టి సందర్భములలో తా నాడు మాటలలో యుక్తియున్నదా,లేదా యనికూడ విచారింపఁడు. చూడుఁడు.

ఎప్పడును యోగానందమందుండ నేర్చినవారికి బహిరంగములగు వేషము మొదలగువానిపై నంత యక్కరయుండదు. వస్త్రములు శుభ్రముగా నుంచుకొనుట, అందుకై చాకలివానితో కలహించుట మొదలగు పనులకు కాలమును ఉండదు. కావున సట్టివారు చినిఁగిన ముఱికిబట్టలతోనే కాలముఁ గడపవచ్చును. కొందరదియు వలదని 'కౌపీనపంతః ఖలు భాగ్యవంతః" అని యనుకొని యట్లందురు. వేమన గూడ తొలుత కొన్నా ళ్ళు *గోచిపాతకంటె కొంచెంబు మఱిలేదు” (450) అని యనుకొన్నను, తరువాత ఇంకను దూరముపోయి సాక్షాత్పరమశివ సారూప్యమును బొందినాఁడు. ఇట్టి సుదర్భమున ఇతని నెవరో 'కోత్యాటలాడించి వెఱ్ఱియనుచు నూరు వెడలగొట్టిరి" (1335). ఆప్పడు దానికతఁడిచ్చిన అసహ్య ప్రత్యుత్తర మట్లుండనిండు. ఈ తర్క యుక్తి వినుఁడు

 
               "ఆ. తల్లిగర్భమందు తాఁ బుట్టినప్పడు
                     మొదలు బట్టలేదు తుదను లేదు,
                     నడుమ బట్టఁగట్ట నగుఁబాటుగాదొకో.." (1845)

కాని, యీ యోగవిద్య, ఈ కవిత్వము-తల్లిగర్భమునఁ బుట్టినపడే వేమన్నకు వచ్చినవా ? ఏమియుక్తి ! కాని యీ వైరాగ్యము ముదురుటకు ముందు వేమన ఈ బహిరంగ శుద్ధిగూడ మంచిదనియే తల(చెను.

 
               "ఆ. మాసిన తలతోడ, మలినవస్త్రముతోడ
                     ఒడలి జిడ్డుతోడ నుండెనేని,
                     అగ్రజనమునైన నట్టె పొమ్మందురు.” (3081)

ఇట్లే యెంగిలిని గూర్చిన యితని వాదమును విచిత్రమైనది. సామాన్యముగ నోటిలోనిజొల్లు ఆహారాదుల దోషముచేతను, రోగక్రిములచేతను దుష్టముగా నుండును గావున, మనుష్యునిదేహమందు వెడలు మలములలో నదియు నొకటిగా భావించి, దాని సంపర్కముచే ఇతరులకు రోగముల సంక్రమణములును, అసహ్యమును కలుగకుండ వలెనని, యెంగిలి చేయరాదని, యెంగిలి యన్నము తినరాదని, మనుష్యులు నియమము లేర్పఱచుకొన్నారు. ఎంగిలి యన్నము నితరులకు పెట్ట రాదని వేమనయు నొకమాఱు తలఁచినవాఁడే (639). కాని దానినతిచేసి వీధులలో నడుచునప్పడును ఎంగిలి మంగలములు తొక్కుదుమేమో యని పేడనీళ్ళు చల్లుకొని యడుగులు పెట్టువారును, ఎంగిలి పాత్రములు దర్బవేసి కాల్చువఱకును పనికిరావనువారును మనలో నున్నారు. ఇది యసహ్యమని యందరంగీకరింప వలసినదే; కాని విరక్తుఁడైన తరువాత వేమన్న యేమన్నాఁడో వినుఁడు -

         "ఆ. ఎంగిలెంగిలనుచు నీనోటితోడనే
               వేదములను జదువు వెఱ్ఱులార !
               ఎంచిచూడ నదియు నెంగిలి గాదొకో ..." (596)

వారి దొక మూలయైన నితని దింకొక మూల ! వేదము శబ్దమే! అదియు ఎంగిలి యన్నమాట కర్థమేమి ? శబ్దమునకుఁగూడ సాంక్రామిక రోగములు వ్యాపించునా? అను నీ మాత్రపు ప్రశ్నలు వేమన్నకు తోcపలేవని కాదు. తోఁచినను ఆ యుద్రేకప టుడుకులో గమనింపలేcడంతే.

ఇట్లే ఏకాదశి మొదలగు దిసములలో నుపవాసముండిస పాపములు నశించి పుణ్యము గలుగును; తపస్సుచేసిన నష్టైశ్వర్యములు లభించును; తిరుపతికో, శ్రీశైలమునకోపోయి, యందలి దేవుసకు సేవచేసిన మోక్షము నిచ్చును—అని సామాన్యముగా నందఱును నమ్ముదురు. నెలలకొలఁది యుపవాసములుండి లేని రోగములు తెచ్చుకొన్నవారున్నారు. తపస్సు చేయఁబోయి నష్టైశ్వర్యులైసవారు గలరు. దేవళములలో మూలవిగ్రహములకేకాక, యందలి కంబాలకు దూలాలకును మొక్కువారును లేకపోలేదు. కావున ఈ యుపవాసము, తపస్సు విగ్రహపూజ మొదలగువాని యందలి దోషములను గమనించి ఖండించువారున్నారే కాని యివి శుద్ధముగా నిష్ఫలములని యేతెలివిగలవాఁడును ఇదివఱకుఁ జెప్పలేదు. కాని ఈ పాపకార్యములకు వేమన్న ధర్మసూత్రములలో శిక్ష యేమనుకొన్నారు?

        "ఆ. ఒక్క ప్రొద్దులున్న నూరి పందై పుట్టు,
              పృథివిదపము సేయఁ బేదయగును ;
              నిగిడి శిలకు మొక్కు నిర్జీపులౌదురు..." (794)

ఇవన్నిటికన్న పైయుద్రేకము ఒక్క విషయమందు వేమన్నను చాలచెఱచినది ; అదేదనఁగా సృష్టియందలి స్త్రీవ్యక్తి, మొదటినుండియు మనుష్యజాతిలో మగవాఁడు తన సులోచనములతోనే చూచి ప్రపంచస్వరూపమును నిశ్చయించెను. సహజముగా గర్భధారణము, ప్రసవము మొదలగు ప్రకృతి సిద్ధములైన భారములు, మోయవలసి యుండుటచే తనకన్న దుర్బలురాలైన యాఁడుది తనకు తప్పక కావలసిన వస్తు వగుటచే, తనచేతిక్రింద నుండవలయుననియు, తను చెప్పినట్లు వినవలెననియు పురుషుఁడు నిర్ణయించెను. అది తనకెంత యావశ్యకమో తాను దాని కంతేగదా యని యాలోచింపవలసిన యక్కర యతనికి తోఁపలేదు. స్వార్థము ప్రకృతి స్వభావ ధర్మము. దాని కితరులు విఘ్నము గల్లించుపఱకును ఇతరుల కష్టసుఖముల నెవ్వరును సామాన్యముగ గమనింపరు. కావున స్త్రీ, పురుషుని యిల్లు, వాకిలి మొదలగు వానివలె ఆస్తిలో చేరిపోయెను. వానిని సంరక్షించుట, కాచుకొనుట, తనకు పనికిరాకున్న పడఁగొట్టుట మొదలగు నధికారములు మగవానికి వచ్చి యతఁడు భర్త” యాయెను. తక్కినవానివలె నాcడుదియు *భార్య యాయెను. కాని యిల్లు వాకిండ్లకు లేని తెలివి, స్త్రీలకు, పురుషులకువలెనే, కలదు గావున, స్వాతంత్ర్యకాంక్ష వారివలె వీరికిని గలిగెను. దేహబలమే యుండియుండిన, వీరేశ లింగము పంతులుగారి 'ఆఁడు మళయాళము" ఎన్నఁడో నిజమైయుండును. అది లేకపోవుటచే ఇతరవిధముల మగవారిని వశపబచుకొని వారిపై దొరతనము చేసి కసి దీర్చుకొనవలెనను ప్రయత్నము జరిగినది. స్త్రీపురుషు లొకరిని జూచి యొకరు మోహించి లోపడుట సమానమైనను, స్వాతంత్ర్యము గలవాఁడగుటచేత మగవానికి తన మనసును నిల్చుకొను శక్తిపోయినది ; స్త్రీకి పారతంత్ర్యముచేత నది హెచ్చినది. కావుననే యేయే మార్గములచేత పురుషుని ముగ్రునిగాఁ చేయవలయునని యవన్నియు నేర్చుకొనపలసి వచ్చెను. తుది మొదలులేని యలంకారములు, వేషములు, మఱుగులు, మౌనములు స్త్రీధర్మములైనవి. నేఁటికిని స్త్రీ మనసు నీడ్చుటకు పరుషుఁ డెన్ని విద్యలు నేర్చినాఁడో, యన్నిటికన్న నెక్కుప పురుషుని మనసు నీడ్చుటకు స్త్రీలు నేర్చినారనుట సహ్యము గాకపోయినను సత్యమైన విషయము. మగనిపైని స్వాతంత్ర్యమును సంపాదించిన యావిద్యలు క్రమముగా మగజాతిపై ప్రయోగింపఁబడినవి. కావుననే పురుషుని చెఱచుటకే స్త్రీ పుట్టినదను దుర్బావ మొకటి మగవారిలో ప్రబలించెను. మసువు ఇట్లు చెప్పినాcడు—

 
             “స్వభావ ఏషనారీణాం సరాణామిహదూషణమ్.
              ఆవిద్వాంసమలం లోకే విద్వాంససుపివా పునః
              ప్రమదాహ్యుత్పథం నేతుం కామక్రోధవశానుగమ్" (మను, 2 అధ్యా.)

(మగవారిని జెఱచుట స్త్రీల స్వభావము, చదివినవానినిగాని, చదువని వానిని గాని కామక్రోధవశుఁడైన వానిని తప్పుదాని కీడ్చశక్తి స్త్రీకి కలదు.)

కావున మగవాఁడెట్లూరకుండఁగలడు? తాను జేసిన తప్పెఱుఁగక, వారి నణcచుట తన స్వభాపముగాఁ జేసికొని, అందుకుఁ గావలసిన బందుకట్లు, సంకిళ్లు, తలుపులు, తాళములు, ఎన్నియో కనిపెట్టినాఁడు. ఇల్లే చెఱసాలగా మార్చు కొన్నాఁడు. ఎప్పడును వారిపై 'నిగా యుండుటయే యతని ధర్మమైనది.

కాని హిందూ సంఘమందలి స్త్రీలెల్ల నిట్లే యుండిరనియు, మగవారెల్ల వారిని గూర్చి యిట్టి భావములే కలిగియుండిరనియు చెప్పలేము. పరస్పర విరుద్ధములైన విషయములకు హిందూ సంఘమందున్నంత విశాలావకాశము మఱెక్కడను లేదు గాఁబోలు. అదే మనుస్మృతిలో వేఱొకచోట

           "యత్ర నార్వస్తు పూజ్యనే రమనే తత్రవేవతా !
             యత్రేతాస్తు సపూజ్యస్తే సర్వాన త్రాఫలా: క్రియా:" (మను, 3-56)

(స్త్రీల నేచోట పూజింతురో " యాచోట దేవతలు సంతోషింతురు. వారు పూజింపఁబడని స్థలములో నెన్ని సత్కర్మములు చేసినను నిష్ఫలములగును.) అని చెప్పఁబడినది ! ఇదిగాక స్త్రీ వ్యక్తి సృష్టిచేయు బ్రహ్మయొక్క శక్తి యని నిర్ణయించిన తాంత్రికులు, జగన్మాతృరూపిణియగు శక్తి నుపాస్య దేవతగాఁ జేసికొన్న తరువాత, స్త్రీ విషయమందిట్టి యపచారములు తప్పని గమనించినారు.

 
           "శతాపరాధైర్వనితాం పప్పేణాపి నతాడయే
             దోషాన్న గణయేత్ స్త్రీణాం గుణానేవ ప్రకాశయేత్"
                                                   (కులార్థవతంత్రము, 11 ఉల్లాసము)

(నూరుతప్పలు చేసినను స్త్రీని పూవుతోనైనను గొట్టరాదు. వారి దోషములు బైలు పెట్టరాదు. గుణములనే వెల్లడిచేయవలెను.)

వైష్ణవులింకను దూరముపోయిరి. స్త్రీయందు పాపమను పదార్ధమే యుండ దనిరి !

           “వనితాయాం తథాశకదురితం నైవవిద్యతే" (లక్ష్మితంత్రము, 43 అధ్యా)

ఇది మరొక ధ్రువము గదా, ఐనను సామాన్యముగ స్త్రీ భోగ్యవస్తువనియు, మగవానిని జెఱుచుటకే సృజింపఁబడినదనియు రూఢమూలమైయున్న భావము మనలో నింకను నశింపలేదు.

వేమన యిట్టిసంఘమందు పెరిగినవాఁడు. స్త్రీలచే చాలకష్టము లనుభవించిన వాఁడు. తాను సాధించు మనోనిగ్రహమునకు వారు పలుమాఱు విఘ్నములుగా దా(పురించి యుండవచ్చును. కావున నట్టియవస్థలో తన దౌర్బల్యమును నిందించి కొనక, స్త్రీజాతినే బూతులు దిట్టినాఁడు.

 
             "గతులు సతులవలనఁ గానంగలేరయా" (3832)
             "ఆఁడు దనఁగ రోత- ... " (230)
             ఇత్యాదులనేకములు. మఱియు, ప్రభువు, ప్రజలు వీరినిగూర్చిన. -
            "ఆ. ప్రజయొనర్చు చెడుగు ప్రభువునకు వచ్చును,
              ప్రభువు మంచియందు ప్రజకు సగము,
              ప్రభువొనర్పుచెడుగు ప్రజలకు రాదురా..? (2622)

ఈ న్యాయమే భార్యాభర్తల విషయమందును వర్తించునని ధర్మశాస్త్రములు చెప్పచున్నవి. కాని వేమన్నకివి న్యాయమని తోఁపలేదు,
       "ఆ. సతియొనర్చు చెడుగు పతికవశ్యమువచ్చు
             పతియొనర్చు మంచి సతికి సగము ;
             పతియొనర్చు చెడుగు సతికేల రాదొకో " (3826)

ఒకటే విధమైన రెండుసందర్భములలో నొకటి నిస్సందేహముగా నంగీకరించి, రెండవదానిని మాత్ర మన్యాయమని తలఁచుటకు అసహ్యమా అజ్ఞానమా కారణము? ఈ పద్యములన్నియు అతఁడు బ్రహ్మజ్ఞానము సంపాదింపక మున్ను వ్రాసినవనుకొని తృప్తిపడుదమనుటకు వీలులేదు. దానిని సంపాదించిన తరువాత నేమైన తన యభి ప్రాయమును మార్చుకొని ఆడువారిని గూర్చి 'అయ్యో పాప" మనెనా ? వారి నడతను దిద్ది తత్త్వజ్ఞానము నుపదేశించెనా ? దేశదేశములుఁ దిరిగి యిందఱి కిన్ని బోధనలు చేసినవాఁడు, ప్రపంచమంతయు మగవారిమయమనియే తలఁచినట్లు కానవచ్చుచున్నదే కాని, ఆఁడువారున్నారే, వారు చదువుసంధ్యలు లేక మగవారి కన్న నన్యాయమై పోవుచున్నారే' యని యెవరినైనా దగ్గఱకుఁ బిలిచి శిష్యురాండ్రుగా జేసుకొనెనా ? ఇతని పద్యములన్ని వెదకినను అట్టి మనఃపరిణామ మున్నట్లే కానరాదు. ఒకవేళ వారి సహవాసముచే మరల తాను బతితుఁడైపోవునేమో యని భయపడెననుకొందమా? త్రిమూర్తుల నిల్చితినని చెప్పకొన్నవానికి స్త్రీవ్యక్తి యంతకన్న బలవంతమయ్యెనా? అట్లేని యతని రాజయోగసిద్ధి విలువ యేమి? ఆ 'ఋతంభర' యను ప్రజ్ఞ మహత్వమంతయు వట్టిమాటలేనా? తరిగొండ వెంకమ్మవంటి యోగినిని మనకు ప్రసాదించిన 'సు బ్రహ్మణ్యయోగి యీ విషయ మున నితనికంటె ప్రపంచమున కెక్కువ యుపకరించినాఁడని తలఁచినఁ దప్పేమి? అది యట్లుండనిండు.

వేమన్న యిట్లు వీరశైవమతమందుఁ బుట్టి, సంసార సుఖదుఃఖములన్నియు ననుభవించి, రసవాద సంబంధమున శివయోగుల సహవాసమునఁబడి విరక్తుడై హఠయోగమును సాధించి, యాపిమ్మట రాజయోగియై, హరిహరాది సగుణోపాసన మీఱి బ్రహ్మసాయుజ్యరూపమగు అద్వైతానంద మనుభవించి జీవన్ముక్తుఁడైనాడని మన మూహించితిమి,

ఈ సందర్భమున వేమన మతమును గూర్చిన వేరొక్క సిద్ధాంతమును కొంత చర్చింపవలసి యున్నది. వేమన్న తాంత్రికుఁడని కొందఱందురు.*[10] అగుననియు చెప్పవచ్చును; కాఁడనియుఁ జెప్పవచ్చును. తాంత్రికశబ్దమునకు చాలవిశాలమైన యర్థము గలదు. తంత్రమనఁగా పరబ్రహ్మసాక్షాత్కారమును సంపాదించుటకు పనికి వచ్చు సాధన. మంత్రములు, బీజాక్షరములు, యంత్రములు, ముద్రలు, పూజలు మొదలగు బహిరంగములు, షట్చక్రభేదము, కుండలియోగము మొదలగు నంతరంగములును, తంత్రమని పేర్కొనఁబడుచున్నవి. దీని నాశ్రయించినవారు తాంత్రికులు. అనఁగా హిందూదేశమందన్ని మతముల వారును తాంత్రికులే. వారివారి మతసిద్ధాంతములను సత్యావనముచేసి యనుభవింపగోరు వారందరును తంత్రమార్గమునే యవలంబించిరి. కాని కొందఱు ఆ మార్గమందు మద్యమాంసాది పంచమకారములకు ప్రాముఖ్యము నిచ్చి యందుచే తమ పూజాదిసాధసలు బహిరంగముగా జరుపుకొనలేక రహస్యముగా నుంచుకొనుటవలన, తక్కినవారికన్న భిన్నులై 'తాంత్రికు' లనఁబడుచున్నారు. స్మృతి ప్రమాణము నంగీకరించిన వారందఱును స్మార్తులైనను శాంకరాద్వైత బ్రాహ్మణులు మాత్రమా పేరున పిలువఁ బడినట్లే, వీరికిని వ్యవహారముచే నా పేరువచ్చినది. ఈ తాంత్రికులును అద్వైతులే, కాని వీరు శివతత్త్వమును పూజించుటకు ముందు శక్తిని పూజింతురు కావున *శా క్షేయు' లనఁబడిరి. ఉత్తరదేశమందు వీరి గుంపు బలము. మద్యమాంసాది సేవనచేతను, శ్మశానపూజాదుల చేతను వీరిని వామాచారులనియు నందురు. వానిని వర్ణించిన దక్షిణదేశమువారు దక్షిణాచారులనఁబడిరి. వేమన వామాచారుల గుంపుతో సంబంధమే లేనివాఁడు. వారి యాచారము లొకటియు గిట్టవు. వామాచారము లట్లుండనిండు. జాతిభేదము వారికిఁగలదు. చక్రపూజాసమయములందు మాత్రము జాతిభేదమును గమనింపఁగూడదు కాని దానికి బైట మనకు నాలుగుజాతులై స వారి కైదు జాతులు (మహానిర్వాణతంత్రముఉల్లా,8,ప, 5)వేఱువేఱు జాతులకు వేఱువేఱు సంస్కారములు (అచే, 13). బ్రాహ్మణాదులు ముగ్గురికిని ఉపవీత ములు కలవు. (ఆదే. 5-5) తమకస్న తక్కుపజాతివారి యన్నము తిన్నవారికి ప్రాయశ్చిత్తము గలదు (అదే. 11-1-29). కాని మొదలగు తీర్ధక్షేత్రములు పావనములని వారి నమ్మిక (యోగినీతంత్రము, 19 పటలము). బ్రాహ్మణులకు మర్యాద చేయవలయును (అదే. 13) విగ్రహపూజ యున్నది. ప్రతిమలశిలలను కొన్నవారికి నరకము వచ్చునని వారందురు (కులార్ణవ తంత్రము. 12 ఉల్లా). ముఖ్యమైన యుపాస్యమూర్తి స్త్రీరూపము గావున స్త్రీలయెడ వారికి మర్యాద యొక్కువ. ఇవన్నియు వేమన్నకు గిట్టవని వేఱుగా చెప్పఁబనిలేదు.

ఇఁక దాక్షిణాత్ములగు తాంత్రికుల గుంపులో చేరినవాఁడన్నను ఇదే కష్టము వచ్చును. దాక్షిణాత్యులలో మాత్రము తాంత్రికులు కానివారెవరు ? వైష్ణవులు, శైవులు, శంకరాద్వైతులు- అందఱును తాంత్రికులే. వారితంత్రములలో మంత్రములు, బీజములు మొదలగువాని స్వరూపములందు భేదమున్నదిగాని, సామాన్యతంత్ర స్వభావమునందు భేదములేదు. కుండలినీయోగము మొదలగు హఠసాధనలన్నియు వారును అంగీకరించినవారే. పై వామాచారు లందుఁగల భేద జాతులన్నియు మనలోను గలవు. ఇవిలేక, శక్తిపూజచేయక, వామాచారమును వదలిన తాంత్రికులు మనదేశమందున్నారా? నేనెఱుగను.

ఇఁక వామాచార తాంత్రికులకు ప్రమాణగ్రంథములగు 'కులార్ణవ తంత్రము” * మహానిర్వాణ తంత్రము” మొదలగు గ్రంథములందలి తత్త్వములకును వేమన తత్వములకును సామ్యమున్నది. కారణము స్పష్టమే. ఇరువురి మతమును అద్వైతమే. కొన్ని సమానములైన సిద్ధాంతము లనేక భిన్న మతగ్రంథములందుఁ గానవచ్చును. ఒకటి యదాహరింతును. 'కులాచారమును రహస్యముగా నుంచ వలయునను సందర్భమున కులార్గవతంత్రమున ఈ క్రింది పద్యము

            "వేదశాస్త్రపురాణాని సామాన్యగణికా ఇప
             జయంతు శాంభవీ విద్యాగుప్తా కులవధూరిప" (11 ఉల్లాస.)

ఇదే పద్యము హఠయోగ ప్రదీపిక" యందు “విద్యా యనుటకు బదులుగా, *ముద్రా" యనుమార్చుతో, 'శాంభదిముద్ర"ను గూర్చి కలదు (హఠ, ఉప 1 ప. 25). మఱియు, శిపయోగసారము నందు ఇదే శ్లోకమే యిట్లాంధ్రీకరింపఁబడిసది :

            "తే, వేదశాస్త్రములును బహువిధపురాణ
                ములును సామాన్యగణికల పోలెనుండు ;
                శాంకరీ విద్యయొకటి యీజగతిలోస
                గుప్తయై కుల స్త్రీవోలెఁ గొమరుమిగులు" (శివ - 4- ఆ)

ఈ కారణముచేత పైరెండు గ్రంథములు వ్రాసినారు కౌలతాంత్రికులన వీలులేదుగదా ! ఇదే పద్యమునే వేమన్నయు తెనిఁగించెను. కాని భాపమును మార్చెను. యిట్లాంధ్రీకరింపఁబడిసది :

             "ఆ. వేద విద్యలెల్ల వేశ్యల పంటివి
                 భ్రమల బెట్టి లేట పడఁగ నీప
                 గుప్తవిద్య యొకటె కుల కాంత పంటిది......." (3631)

అందఱికిని దొరకునది కావున వేశ్యలవంటివని వారు చెప్పఁగా ఇతఁడు 'భ్రమలఁబెట్టి తేఁటపడఁగనీవు ' కాబట్టి వేశ్యలపంటి వన్నాఁడు. కుల కాంతవలె గోపనీయమని వారు చెప్పఁగా నితఁడు గుప్తవిద్య కుల కాంతవలె మనకు సులభ ముగా ననుకూలించునను చున్నాఁడు ! ఇట్లే -యిట్లాంధ్రీకరింపఁబడిసది :

               "పుట్టమీఁదఁగొట్ట భుజంగము చచ్చునా ?"
               "ఓటికుండ నీర మొప్పగ నిలుచునా ?"
               "వంకఁదీర్ప నెవ్వరి తరమయూ?"

ఇత్యాద్యుపమానములు కులార్ణవము మొదలగు తంత్రములందుఁ గలవు. వేమన వీనిని వానినుండియే గ్రహించి యుండవచ్చును. హఠయోగమును వామాచార తాంత్రికులు తక్కిన వారికంటె నెక్కువ యుపయోగించుకొన్నవారు కావున వారి గ్రంథములు కొన్ని యితఁడు చూచియుండిన నుండవచ్చును. అంతే కాని యితఁడె తంత్రమార్గమునుగాని నేరుగా నవలంబించి యుండెనని నేను నమ్మఁ జాలకున్నాను. ఇతని సిద్ధాంత మద్వైతము ; సాధనకు హఠయోగమూలమగు రాజయోగము. హఠసాధనవేళలో కొన్ని తాంత్రిక మార్గముల నాశ్రయించిన నుండవచ్చును. అందును 'వజ్రోళి' మొదలగు అసహ్యసాధన లితఁడు చేసి నాఁడని నేనమ్మను.

ఇట్లు జీవన్ముక్తిమార్గమును తానెఱిఁగి యది ప్రజలకు బోధించుటకై యితఁ డనేకదేశములు తిరిగినట్లు తోఁచెడిని. కాని యేయేచోట్ల సంచరించెనో స్పష్టముగాc జెప్పలేను. తంజాపూరిరాజు లా కాలములో వేమన్నను తమవద్ద నుంచుకొని బంగారు చేయు విద్య నేర్వవలయు ననునాశతో పూజించుచున్నట్లు వాడుక కల చని శ్రీ వంగూరి సుబ్బారావుగారు వ్రాసిరి. (వం.సు. వేమన, ప. 198). ఇప్పటి కిని ఆక్కడ వేమన్న పటము కలదను విషయము మొదలే విన్నవించితిఁగదా. ఇట్లు పోయినచోట నెల్ల మత విషయములు, సాంఘిక దురాచారములు, సామాన్య నీతులు ఇత్యావ విషయములనుగూర్చి పద్యములుచెప్పి బోధించుచు, ఎక్కడ నేది దొరికిన నది భుజించి యవకాశము దొరికసప్పడెల్ల పరమాత్మ చింతచేయుచు, ఇల్లు, వాకిలి, సంసారము అన్నియు వదిలి తిరుగుచు కాలక్షేపముఁ జేసినవాఁడు.

           "క, పరమాత్ముని చింతనలోఁ
                దఱచుగ నుండుటయె తగును ధన నాఁకటికిన్
                దిరిపెము నెత్తి భుజించుచు
                దొరవలె గృహవేదికందుఁ దొంగుము వేమా" (2445)

ఇతని బోధసల నెందరో వినక తిరస్కరించిరనుటలో నాశ్చర్యము లేదు. అసలతని మతసిద్ధాంతములు చదువుకొన్నవారికే యర్ధము గానివి. వానియం దేమేని సత్యముగలదేని యది యితనిపలెనే కష్టపడి దేహమును మనస్సును దండించిస వానికి తప్ప ఇతరుల కనుభవమునకు రాదు. కంటికి కానవచ్చు నదంతయు మాయ యనియు సత్యము వేఱే కలదనియుఁ జెప్పిన నెందఱికి నమ్మిక కలుగును? దేవుఁడనఁగా అందఱి కంటె గొప్పవాఁడని, సర్వశక్తిగల వాఁడని, కోరిన దిచ్చువాఁడని, నమ్మినవారికి-తమకు సర్వ విషములందునుగల యశక్తి నెఁఱిగిన వారికి-నేనే దేవుడను భావము ఎట్లుగలుగును? మఱియు నితని యందలి గొప్ప కష్టము మత సంబంధములగు బహిరంగములైన రూపములును క్రియలును పూర్తిగా ఖండించుట. దానిని వదలుట మనుష్య స్వభాపమునకే విరుద్ధము. ఉద్దేశమెంత మంచిదైనను, గొప్పదైనను దానికి తగిన బహిరంగ స్వరూపము లేనిది మనుష్యులలో మర్యాద గలుగదు. దేవుఁడు లేఁడని యూరకయైన నుండ గలరే కాని ఉన్నాఁడని నమ్మినప్పడు తమ బహిరిందియములకు తృప్తిగా పూజోత్స వాదులు నడుపకుండుట యెవరికిని సాధ్యముగాదు. ఆధ్యాత్మిక ప్రపంచమున వీనికి వెలయుస్నను లేకున్నను ఆధిభౌతిక ప్రపంచమున ఇవి లేనిది బ్రదుకుట కష్టము ఇది గాక, ఈ బహిరంగములందే మనుష్యునికి సహజమైన కళా ప్రియత్వమునకు తృప్తి కలుగును. కావుననే వేషములను కర్మములను నిందించిన వారెవ్వరుగాని సఫల మనోరథులు గాలేదు. అట్లుండ, అవన్నియు వదలి ముక్కుమీఁద దృష్టి నిలిపి కూర్చుండుఁ డని వేమన యెంత తిట్టి చెప్పినను అతనినోరు నొచ్చుట తప్ప వేఱు ఫలమెట్లు కలుగును? ఇఁక నితని నంఘ సంస్కారపు నీతులంటిమా, అవి నిండిన చెఱువుకట్ట నొకటే మాఱు తెంపఁజూచినట్లు, ఇదివఱ కున్న సాంఘిక వర్తనముల కన్నిటికిని మూలచ్చేదము చేయC బ్రయత్నించు చున్నవి. ఉన్న దున్నట్లుగా ఒక యూరికిఁ బోయి -

        "ఆ. ఉర్వివారికెల్ల నొక్క కంచముఁ బెట్టి
              పొత్తు గుడిపి కులము పొలియ(బేసి
              తలనుజేయి పెట్టి తగనమ్మఁ జెప్పరా.." (545)

యని యెంత పెద్ద గొంతుకతో నఱచినను, జనసామాన్యమున కట్లు చేయుట సాధ్యమా ? సంఘ సంస్కారికుండవలసిన ప్రధానగుణము ఏ సంఘమును తాను సంస్కరింప దలంచునో, దానిలోనే తానును జేరి, వారి సుఖదు:ఖములను తాను ననుభవించి, వారి జ్ఞానాజ్ఞానములతో సహానుభూతి గలిగియుండుట. అప్పడు జనులు క్రమముగా అతని నర్ధము చేసికొందురు ; అతని మనసుతో నేకీభవింతురు ; అతని శ్రద్దకు లోనగుదురు. అట్లుగాక బైటనుండి యెన్ని యుపన్యాసము లిచ్చినను లాభము లేదు. వేమన్న తానన్నివిధముల ప్రపంచవ్యవహారమునకు విరోధముగానే నడుచుచున్నాఁడు. కావున నితని సిద్ధాంతము లనేకుల కంటలేదు. సహజముగా నుద్రిక్త స్వభావము గలవాఁడు గావున ' ఇతరుల తప్పులను గని యసహ్యపడఁ గలఁడే కాని వారియందలి గుణములను గమనింపలేఁడు. గుణమే లేని పదార్థ మేదియు భూలోకమందు లేదు. మఱియు నిదానముగా జనులను దగ్గఱకు పిలిచి పదిమాఱులు వారికిఁ జెప్పి బోధించు నోర్పుగాని పాండిత్యముగాని కలవాఁడు కాcడు. తన మాటలను తిరస్కరించిన వారిని గూర్చి యితఁ డేమనుచున్నాఁడు వినుఁడు :

          "ఆ, ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన
                మాట దెలిసి నడుచు మర్మమెఱిగి
                మొప్పె తెలియలేఁడు ముప్పదేండ్లకునైన.." (వే.జ్ఞా. 356)

ఇట్లైనను వేమనయందు బలవత్తరమైన గొప్పగుణమున్నది. అవేదనఁగా శ్రద్ద, తాను గొప్పతత్త్వము నెఱిఁగితినను దృఢమైన నమ్మికకు తోడు, బ్రదికి యుండు లోపల దానినంద ఱెఱుఁగునట్లు చేయవలయునను పట్టుదలయుఁ గల వాఁడు కావున, ఎవరు విననీ, వినకపోని, తనపని తాను వదలలేదు. ఆ శ్రద్ధాగుణము చేత, ఇతనివలెనే యప్పటి సాంఘిక మతస్థితులతో తృప్తిలేనివారు అనేకులు ఇతనియం దేమోయున్నదని నమ్మి యాశ్రయించి యుందురు. అట్టివారి నితఁడు తాను నిరర్ధకములని తేల్చుకొన్న హఠయోగము మొదలగు మార్గములలో దింపక, కేవల చిత్తశుద్ధి గలిగి శాంతిని సంపాదించు మార్గమును మాత్రము వారికి బోధిం చెను. శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారు ఇట్లు వ్రాసిరి :

"ఇట్లు కేవల శివాద్వైతియు, జాతి కులాభిమాసమునకు నతీతుడును, పరోపకారమే పరమధర్మముగాc గల యీకవి చరమావస్థయందొక మతమును స్థాపించెనఁట. ఆ మతమును అంగీకరించువారు ఈ క్రింది యేడు సిద్ధాంతములను అంగీకరింపవలయును : (1) దొంగతనము చేయరాదు. (2) ఎల్లప్పడును భూత దయ గలిగి యుండవలెను. (3) ఇతరుల మనస్సు నొప్పింపరాదు. (4) ఉన్న దానితో తృప్తిఁజెంది యుండవలయును. (5) ఇతరులను మత్సరింపరాదు. (6) కోపము విడువవలెను. (7) ఈశ్వరారాధన మెల్లప్పడును జేయుచుండవలెను. క్రైస్తవులకు 10 ఆజ్ఞ లెట్టివో యీ సంప్రదాయమువారి కీ సప్తాజ్ఞ లట్టివి."*[11]

వేమనయొక్క పై మతము నాశ్రయించిన వారి నెవరిని గాని నేనుజూడ వీలుకలుగలేదు. ఇదే సత్యమైన యెడల, వేమన, సామాన్యజనులకు తత్వ విచారణ యందరాని పండని గుర్తించి, ఈశ్వరుఁడొక్కఁడు కలఁడని మాత్రము తెలిపి, ఆతని నెఱుఁగుటకును, పరోపకారమునకును, తమ మనసు నెమ్మదికిని పనికివచ్చు పై నియమములను మాత్రము నిత్యముగా నాచరింపఁడని సర్వమత సారమును శిష్యుల కుపదేశించినట్లు కానవచ్చుచున్నది. ఇతని శిష్యపరంపరవారు, ఈ మతము నెంతవఱకు ఆచరణలో నిలుపుకొన్నారో యెఱుఁగను, కటార్లపల్లె తుంగ వేమన్న మతమును ఇదియే యైనను, అతని పరంపరవారతనికి ఉత్సవములు పూజలు చేయువేళ గొఱ్ఱెల యెనుబోతుల రక్తప్రవాహములతో అర్ఘ్యపాద్యము లిచ్చుచున్నారు ! శిష్యులు గురువునకు విరోధముగానే వర్తించుట సృష్టియందలి రహస్యములలో నొకటి. అట్లు గాకుండుట సంభవించునేని, ప్రపంచమునకెల్ల, ఎల్లకాలమునకు, ఒక్కగురువు చాలునుగదా. కావున ఇతర మహాపురుషుల మతము లన్నియు శిష్యులలో నేయవస్థకు వచ్చినవో యంతకన్న ముచిస్థితిలో వేమన్న మతమువారు నేఁడుండిరేని యది వరమాశ్చర్యమగు విషయమే యగును.

వేమన్న తన యవసానకాలము నెక్కఁడగడపెనను విషయము యథాప్రకా రము సందిగ్ధమే. పామూరివద్ద కొండగుహలో ప్రవేశించి మరల బైటికి రాలేదను వాడుకను మొదలే చెప్పితిని గదా? అంతకంటె బలవంతమైన సాక్ష్యము లభించు వఱకు నదియే నమ్మదము. శ్రీ శంకరాచార్యులు ఇట్లే కడపట గుహాప్రవేశము చేసిరని వాడుక, ప్రపంచవ్యవహారమును చేతనైనంత నడిపి యఖండ బ్రహ్మాను భవానందమును జెందుటకై యోగులిట్లు చేయుదురు. కొందఅు శిష్యానుగ్రహార్థము ఎదో యొకచోట సజీవ సమాధిలో 'గోరీ" చేసికొందురు. తుంగవేమన్నది యిట్టి సమాధియే యని వెనుకఁ జెప్పతిని. ఇప్పటికిని వారు సజీపులై ముక్తిసుఖము ననుభవించుచున్నారనియే జనులు నమ్ముదురు.

వేమన్నయు నట్లే సుఖముగా నెందైన శాశ్వతముగా నుండనిండు ! ప్రపం చము వలన ప్రంచమునకై యతఁడు పడిన కష్టములకు అంతమాత్రము నెమ్మది యైనను అతనికి గోరుట మనధర్మము !

  1. * ఆ పరావరమూర్తిని జూచే వెంటపడే హృదయపు ముడి వదలును ; అన్ని సందేహములు దీరును. అన్నికర్మములును క్షయించును. ముండకోపనిషత్తు, 2-2-8
  2. * చూ, పాతం, యోగ, సూ. 2, పా, సూ. 15.
  3. * చూ, పా, యో, సూ, భోజరాజ్యవాఖ్య, కడపటి సూత్రమునకు.
  4. * చూ. హఠయో. 3, ఉప, ప. 32 నుండి 50 వరకు.
  5. * శివయో., 1 ఆ
  6. * చూ. కులార్ణవతంత్రము, 14 వ ఉల్లాసము.
  7. * See “The Life of Srce Ramakrishna”.
  8. * See Brown’s Vemana, Preface, p. II.
  9. † అన్నియుపాయములును పనికిరాకపోయివ వేశ్య తాపసియగును ఆని తాత్పర్యము.
  10. * ఈ మతము శ్రీవేమూరు విశ్వనాథశర్మ గారిది. దీని విషయమై వివరించుచు వారు దయయుంచి నాకొక దీర్ఘ లేఖ వ్రాసిరి.
  11. * పై లష్మిణరాపుగారి వ్యాస మముద్రితము. దానిని నేను పూర్తిగా చూడఁగల్లి యుండిన నెంతో లాభపడియుందును. కాని సాధ్యముగాలేదు. పై వ్యాసభాగము నం. సు, గారి వేమనలో నుదాహృతము (మా, పు 181)